8, అక్టోబర్ 2017, ఆదివారం



శివానందలహరి

గురుపూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలతో

98_వ శ్లోకం

(24_7_18)

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":

అవతారిక :

శంకరులు తన కవిత్వాన్ని కన్యగా భావించి, తన కవితా కన్యను, గౌరీ ప్రియుడైన పరమేశ్వరుని కి
అంకితంగా అర్పించారు.

శ్లోకం :

సర్వాలంకార యుక్తాం సరళపద యుతాం సాధు వృత్తాం సువర్ణాం
సద్భిః సంస్తూయమానాం సరసగుణ యుతాం లక్షితాం లక్షణాఢ్యాం
ఉద్యద్భూషా విశేషా ముపగత వినయాం ద్యోత మానార్థ రేఖాం
కల్యాణీం దేవ ! గౌరీప్రియ ! మమ కవితా కన్యకాం త్వం గృహాణ !!

పదవిభాగం:

సర్వాలంకార యుక్తాం _ సరళపదయుతాం _ సాధు వృత్తాం _ సువర్ణాం _ సద్భిః _ సంస్తూయమానాం _ సరసగుణయుతాం _ లక్షితాం _ లక్షణాఢ్యాం _ ఉద్యద్భూషా విశేషామ్ _ ఉపగత వినయామ్ _ ద్యోతమానార్థరేఖామ్ _ కల్యాణీం _ దేవ _ గౌరీప్రియ _ మమ _ కవితాకన్యకాం _ త్వమ్ _ గృహాణ.

తాత్పర్యము :

గౌరీ దేవియందు ప్రేమగల దేవా ! ఈ నా కవితాకన్య కన్యకా లక్షణములు కల్గి, కల్యాణానికి తగియున్నది. లోకమందు కన్యసర్వాభరణములు కల్గి యుంటుంది ఈ కావ్య కన్యక కూడా సర్వాలంకారములతో కూడి యున్నది.కన్యక సర్వ పదములతో(మందగమనంతో) 
ఒప్పుతుంది. నా కావ్యకన్య మృదువయి , సుబోధక ములగు పదములతో సొంపు నింపుతుంది. కన్యక సాధువృత్త(సత్కర్మలయందు ప్రవర్తించేది) అవుతోంది. ఈ కావ్య కన్య కూడా లక్షణ విరుద్ధము గాని వృత్తము లు కలిగి అంది. ఇది సువర్ణ అనగా కన్యకు సురూపం ఉంది. కావ్య కన్యక పరుషములు కాని అక్షరాలు కలిగి యుంది. శరీర లక్షణము తెలిసినవారు ఆ కన్యను మెచ్చు కుంటారు. కావ్య లక్షణ వేత్తలు ఈ కవితా కన్యకను పొగడుతున్నారు. కన్యకు సరస గుణములు ఉంటాయి. కావ్యకన్యకకు, శృంగారాది రసములునూ, మాధుర్యాది గుణములునూ ఉన్నాయి. కన్య వరులచే ఎన్నిక కా బడింది. ఈ కవితా కన్య, ఒక్కొక్క అంశమును గూర్చిన ఎన్నిక కలదిగా ఉంది. సర్వ లక్షణ సంపత్తి ఇద్దరికీ ఉంది. కన్య వినయము గలది. కవితయూ కవి వినయాన్ని
తెలుపగలదిగా ఉంది. కన్యకు సుశీలత్వము ఆభరణ విశేషంగా ప్రకాశిస్తుంది. కన్యయందు అర్థరేఖలు అనగా భాగ్యరేఖలు స్ఫురిస్తూ ఉంటాయి. కవిత యందు పదార్థ పరంపర స్ఫరిస్తుంది. అర్థపుష్ఠి కలిగిన భూషణము సాధారణంగా ఉంది. ఇటువంటి నా కవితా కన్యను నీకు ఇస్తాను. స్వీకరింౘు. 

వివరణ :

శంకర భగవత్పాదులు తన ఈ కృతిని అనగా శివానంద లహరి స్తోత్రాన్ని పరమేశ్వరుని కి
అర్పిస్తున్నారు. " ఈశ్వరా! నా యెుక్క కవితా అనే కన్యను నీకు ఇస్తాను. ఈ కావ్యకన్య అన్ని ఉత్తమ 
లక్షణాలూ కల్గి ఉంది. ఈమెను ప్రేమతో పరిగ్రహింౘు. నీకు సంతోషమూ మంచి ఖ్యాతియూ ఈమె ద్వారాసిద్ధిస్తాయి. నేను ధన్యుణ్ణి అవుతాను. మన ఉభయు ల ఆశయాలూ నెఱవేఱగలవు. అని శంకరులు ఈశ్వరుని తో అన్నారు. శివానంద లహరి కావ్యంలో ఇది 98వ శ్లోకం. అనగా దాదాపు చివరి శ్లోకం. ఈ శివానంద లహరి కావ్యాన్ని శంకరుల పరమేశ్వరుడైన సదాశివుడికి అర్పిస్తున్నారు. సాధారణంగా కవులు తమ కావ్యాలను ఎవరికో ఒకరికి అంకితం ఇస్తారు.
భక్తకవులు తమ కావ్యాన్ని దైవాంకితం చేస్తారు. కావ్య రచన చేసిన కవిని "కృతికర్త" అనీ కావ్యాన్ని
అంకితం తీసుకున్న వారిని "కృతిభర్త" అనీ అంటారు. శివానంద లహరి కృతికర్త "శంకర భగవత్పాదులు" కాగా " కృతి భర్త " ఈశ్వరుడన్నమాట. ఈయన గౌరీశ్వరుడు.ఇప్పటికే"గౌరి" ఆయన భార్య. శంకరులు తన శివానంద లహరి అనే కావ్యకన్యను, ఈశ్వరునికి కన్యాదానం చేస్తానంటున్నారు. తన కవితా కన్యను కూడా ప్రియురాలు గా అంగీకరింౘమని గౌరీశ్వరుణ్ణి
కోరుతున్నారు. 

తన కవితాకన్యకు గల లక్షణాలను గూర్చి ఇక్కడ చెప్పారు. ఈ లక్షణాలు కన్యాపరంగా నూ, కవితాపరంగానూ సరిపోయేలా విశేషణాలతో శంకరులు వర్ణించారు.

--((**))--



100_వ శ్లోకం

(27_7_18)

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":
అవతారిక :
పరమేశ్వరుడైన శివుడు సకల దేవతలచే స్తుతింప దహిన వాడనీ, సకల దేవతలకంటే శివుడు గొప్ప మహాత్మ్యము కలవాడనీ చెపుతూ, శంకరులు శివానంద లహరీ స్తోత్రాన్ని  ముగించారు.

శ్లోకం :

స్తోత్రేణాల మహం ప్రవచ్మి న మృషా దేవా విరించాదయః
స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వా మగ్రగణ్యం విదుః
మాహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే ధానాతుష స్తోమవ
ద్ధూతా స్త్వాం విదు రుత్తమోత్తమ ఫలం శంభో! భవత్సేవకాః !!

పదవిభాగం:

స్తోత్రేణ _ అలమ్ _ అహం _ ప్రవచ్మి _ న _ మృషా _  దేవాః _ విరించాదయః _ స్తుత్యానాం _ గణనాప్రసంగ సమయే _  త్వామ్ _ అగ్రగణ్యం _ విదుః _ మాహాత్మ్యాగ్ర విచారణప్రకరణే _
ధానాతుషస్తోమవత్ _ ధూతాః _ త్వాం _ విదుః _ ఉత్తమోత్తమ ఫలం _ శంభో _ భవత్సేవకాః .

తాత్పర్యము :

దేవా ! బ్రహ్మ మొదలయన ముప్పది మూడు కోట్ల దేవతలునూ, స్తోత్రము చేయుటకు అర్హులయిన వారిని లెక్కపెట్టే సమయంలో, నిన్ను మొదటివానిగా లెక్క పెడుతున్నారు. సృష్టి స్థితి లయ రూపమయిన మాహాత్మ్యము ను గూర్చి చర్చించే టప్పుడు _ ధాన్యమును ఎగుర పోసేటప్పుడు‌ ఊక అంతయూ దూరంగా పోయేటట్లు, ఆ దేవతలంతా దూరమై పోయి, సారమైన ధాన్యము వలె నిన్నే ఉత్తమోత్తమ ఫలముగా తెలుసుకుంటున్నారు. ఇది వట్టి స్తుతి పాఠము కాదు. నేను చెప్పినది అంతా నిజంగా కొంచముకూడా అసత్యము కాదు.
నీ సేవకులయన వారు, మహత్త్వము నందు అగ్రేసరు లె వ్వరని పరిశీలించే సందర్భంలో, ఎగురబోసే సమయంలో ధాన్యపు పొట్టు సమూహములా, ఎగుర గొట్ట బడిన వారై నిన్ను శేషించిన
పరతత్త్వ స్వరూపమైన శ్రేష్ఠమైన ఫలము గా( గట్టి గింజగా ) గుర్తింప గలిగారు. నీవు పరబ్రహ్మవు . మహత్త్వము న నాకన్నా అగ్రగణ్యులు లేరు.

శంకరులు ఈశ్వరుని కి ఇలా విన్నవింౘు కున్నారు. " ಓ శంభూ! నీ పై అనురాగం కొద్దీ ఇన్ని విధాలుగా నిన్ను స్తోత్రము చేశాను. ఇంతటితో ౘాలు . నేను నిజమే చెబుతున్నాను. దివ్య
లక్షణాలు గల దేవతలు బ్రహ్మ మొదలైన వారు స్తుతింపదగిన వారిని లెక్క పెట్టే టప్పుడు నిన్నే మొట్టమొదటి దైవం గా పరిగణిస్తారు . మాహాత్మ్యము లో మొదటి వారెవరు ? అని విచారించే ప్రకరణంలో వారందరూ తూర్పార బట్టి నపుడు ఊక పొట్టులా గాలికి కొట్టుకొని పోతారు. వారంతానీ సేవకులు. ఉత్తమోత్తమ ఫలం నీవే అని వారు తెలిసికొన్నారు. ఇది పరమ సత్యం.". అని చెప్పి శివానందలహరి స్తోత్రాన్ని శంకరులు ముగించారు.

స్తోత్రేణ. "అలమ్" _ అనగా స్తోత్రము పరిపూర్ణమైన దని సూచింపబడింది. ఇందులో " మహాత్మ్యము" అనే మాట వచ్చింది. మాహాత్మ్యము గల వారి లో శివుడే గొప్పవాడని చెప్పారు.
మాహాత్మ్యము అంటే ఏమిటి ? వ్యాఖ్యానం లో ఇలా చెప్పబడింది. " మాహాన్ ఆత్మాబుద్ధిః ఏషాం తేషాం _ భావం _ తత్త్వం " మాహాత్మ్యమ్ అంటే గొప్ప బుద్ధి గల వారి తత్త్వం మాహాత్మ్యము.
అనగా సృష్టి స్థితి లయము లనూ చేయగల సామర్థ్యము. సమస్త ప్రపంచ సృష్ట్యాది కార్యములను చేసేవానిగా ఉన్నా నిర్వికారుని గా ఉండడం, శుభాశుభ కార్యములు చేయింౘువాడిగా ఉన్నా, వైషమ్యము లేకుండా ఉండడం, బంధ మోక్షాది ఫలములను ఇచ్చే వాడుగా ఉన్నా అసంగునిగా ఉండడం, ఉదాసీనుడిగా ఉండడం అన్నదే మాహాత్మ్యము. ఈ మాహాత్మ్యము ఒక్క పరమేశ్వరుని
యందే వర్తిస్తుంది. ఈశ్వరుని యందు ఆశ్రయించి ఉన్న పరమేశ్వరీ శక్తి చేత, అసంభవమైన ఈ మాహాత్మ్యము శంకరుని యందు సుసంభవ మయినది.
వందనార్హులు అయిన దేవతలందఱి లో మున్ముందు వందనార్హుడు పరమశివుడు అని తేలిందట. సారాంశం దేవతలందరూ వందనార్హులే అని. దేవతలందఱి లో ముఖ్యులు ఐదుగురు. వారు
శివ _విష్ణు_రవి_గణేశ_అంబికలు అని. "శివవిష్ణురవిగణేశాంబికాః పంచదేవతాః " అని శాస్త్రము . వీరిలో శివుడు అగ్రగణ్యుడు. అనగా ప్రధాన దేవత. అయితే శివుణ్ణి సేవిస్తే ౘాలు గదా మిగిలిన
దేవతలందఱి నీ పూజింౘడ మెందుకనే ప్రశ్న వస్తుంది. అసలు శివుణ్ణి పూజింౘక పోయినా శివుని కి వచ్చిన నష్టం ఏమీ లేదు. మన మేలు కొఱకే మనం శివుణ్ణి సేవింౘాలి. అలాగే ఆయన
పరివార దేవతలనూ మనం సేవింౘాలి. శంకర భగవత్పాదులు భారత భూమి లో పర్యటించి న సమయంలో ప్రజలంతా పంచాయతన పూజా పరాయణులు గా స్నాన సంధ్యాది అనుష్టానములు చేసే వారుగా వర్ణాశ్రమ ఆచార నిరతులు గా, శుద్ధ అద్వైత పరాయణులుగా మారారని, శ్రీ విద్యారణ్య స్వామి వారు రచించిన శంకర విజయం తెలుపు తోంది మనమందఱమూ జగద్గురువులు అయిన శంకర మతానుయాయులము కాబట్టి భగవత్పాదుల ఆశయాన్ని అనుసరిస్తూ శివకేశవులను సమానంగా పూజిద్దాము. సకల శ్రేయస్సు లనూ పొందుదాము 
మనం చేసే సంధ్యావందనములో ___

శివాయ విష్ణురూపాయ , శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః, ఏవం విణ్ణుమయశ్శివః
యథాంతరం న పశ్యామి, తథా మే స్వస్తిరాయుషి !!

అని చెప్ప బడింది.

తాత్పర్యము:

శివుని రూపంలో విష్ణువు, విష్ణువు రూపంలో శివుడు ఉంటాడు.శివుని హృదయం విష్ణువు, విష్ణుని హృదయం శివుడు. వారిద్దరికీ బేధం ౘూడరాదు అప్పుడే ఆయుర్దాయము, స్వస్తి కలుగుతుంది.
పై విషయాన్ని సదా హృదయంలో నిలిపి, శివకేశవులను సమానంగా పూజించి, మేలు పొందాలి. ఇది శంకర సిద్ధాంతం. మనకు " శివానందలహరి" స్తోత్రాన్ని అందించిన శంకరుల కు
మనసా శిరసా నమస్కరిద్దాము.

" శ్రుతి స్మృతి పురాణానా మాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం "

శ్రుతులు, స్మృతులు పురాణాలు అనే వానికి నిలయమైన వాడునూ దయకు నిలయమైన వాడునూ, లోకమునకు మేలును కల్గించే వాడునూ అయిన భగవంతునితో సమానుడైన శంకరాచార్యుల
వారికి నమస్కరిస్తున్నాను.
శివాయ గురవే నమః
శివానందలహరి సమాప్తి
సర్వేజనాః సుఖినో భవన్తు
సమస్త సన్మంగళాని భవన్తు
శివానందలహరి స్తోత్రము ల నాస్వాదించిన మిత్రులందరికీ
గురు పౌర్ణిమ శుభాకాంక్షలతో
శుభాభినందనలతో
సదా మీయందఱి శ్రేయోభిలాషి


ప్రాఞ్జలి ప్రభ - నేటి కవితలు





ప్రస్థానం ( భగవానుడు)

పట్టు పీతాంబరముల.. చుట్టుకొనువాడు..
పసిడి కట్ల పిల్లoగ్రోవి ధరియించువాడు ..
కాటుక తో అందగించుకనులవాడు
శిఖిని పింఛమమరిన. చిన్నవాడు.




వెలుగు విరజిమ్ము మోమువాడు
నీలి జలదంపు మేని వన్నె వాడు
సాధు జనులను రక్షించు వాడు
ప్రేమతో పిలిస్తే ప్రత్యక్షమయ్యె వాడు

ఆకాశం లో శాంతి నెలకొను వాడు
భూమండలం లో శాంతి నెలకొనువాడు
సముద్రజలం లో శాంతి నెలకొనువాడు
సమస్త ప్రాణులలో శాంతి నెలకొనువాడు

పాడ మంజీరా రవళుల పడుచువాడు
కరుణ సారించు దృక్కుల కన్నయ్యవాడు
వేణు నాదమ్ము జగము లూగించువాడు
సకల జీవుల ఉల్ల మలరించువాడు.

భక్తి, రక్తిని బోధించ అవతారమొందినాడు
భక్త కో టిని బ్రోచిన భాగవతుడు.. వాడు.
ఇహమునకు .పరమునకు ఈప్సితమునకు
ముక్తి.. మార్గమ్ము జూపెడి.గీతాచార్యుడతడు.

ప్రకృతి పరిధిని, మించి రక్షించు వాడు
పరిమితులను దాటి ధర్మాని కాపాడేవాడు
ఏదో దేహంలో మనుష్యు ల్లో దేవుడై ఉంటాడు
లీలలను ప్రదర్శిస్తూ ఆగమ లక్ష్యాన్ని పూర్తి చేస్తాడు
--((*))__



ప్రాంజలి ప్రభ - నేటి కవితలు

తలచితి నిను నయనములతొ
వలచితి నిను తనువు తపనతొ
కలయని తహ తహ తలపుతొ
వలదనిన కనుట చిరు నగవు

మలయ పవనములు సెగ తొ
పలు రకముల పిలుపులతొ
వల వలపులు వగచుట తొ
విల విల మని తలచుట

బలము మదిని తొలచుటతొ
కలిమి మనసును పిలుపులతొ
వలచి వలదనుట కలల తొ
చెలి చెలి అని పిలిచిన తడబడు

తలపుల తడబడు తపనలతొ
కలువలు కలియుట కలవరముతొ
తలుపులు తెరచి తహ తహ కురులతొ
పిలుపులు తలచి మరులు గొలుపు
--((*))--



   ఆలోచించండి

ఒక విదేశీ విధానంలో ఉన్న ధర్మాన్ని గమనించండి
మంచిని గ్రహించి నలుగురికి తెలపండి .
దేశీయ విధానాన్నిసహకరిస్తూ ప్రోత్సహించండి
సమృద్ధిగా దేశాభివృద్ధికి సహకరించండి
 .
ఒక వాణిజ్య విధానంలో నాణ్యత చూపించండి
పోటీయుగంలో నాణ్యతతో నిజాయితిని చూపండి .
విద్యా విధానాన్ని అభివృద్ధికి సహకరించండి
బ్రతికి, బ్రతికించే మార్గం ప్రతి ఒక్కరూ చూడాలండి
.
ఒక ద్రవ్య విధానం ఆలోచించండి
భవిషత్తును గమనించి పిల్లలకు పంచండి .
ఒక కుటుంబం విధానం మరువకండి
ఉన్న మార్గంలో కొత్త దనం నేర్పండి
.
వ్యవసాయ విధానాన్ని ఊహించండి
నేలకు హాని కలుగ కుండా జాగర్త పడండి
ఒక ఆరోగ్య విధానంలో మార్పులు తెలుసుకోండి
హృదయానికి హాని కలగని మాటలు పంచండి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి