25, అక్టోబర్ 2017, బుధవారం

భగవద్గీతలో (అంతర్గత) సూక్తులు -1(మొదటి అధ్యాయము )


ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:- శ్రీ కృష్ణాయనమ:
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
Muralidhar Krishna (via wallpapersafari.com)







































భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1(మొదటి అధ్యాయము )

1.  గ్రుడ్డివారైన,  వయసు మీదపడిన వారైన వారికి  కన్నప్రేమ ఎప్పటికీ తగ్గదు,  మనవారు పరాయివారు మధ్య సంఘటనలు తెలుసుకోవాలని ఆరాటం తగ్గదు  (గీత 1/1)

2. ఎంతటి బలవంతుడైన సరే గురువుని ప్రార్ధించి ఏపని ఐన  చేస్తే దానికి తగ్గ ఫలితము రాగలదు (గీత 1/2)


3. ఎంతటి వారైనా గురుపుత్రులను తక్కువ చేయకూడదు, శిష్యులను తక్కువ చేయకూడదు,  అందరిలో ఉన్న   గొప్పతనమును గ్రహించాలి (గీత 1/3).

4. ఎంతటి వారైన సరే, ఎదుటి వారి తెలివి, వారి వంశములో ఉన్న తెలివి, వారి నడవడిక ముందు కొంత తెలుసుకుంటే మనకు ఎంత వరకు ఉపయోగ పడునో తెలుసుకొని ఉపయోగించుకోగలరు ( గీత 1/4 to 9)

5. మన స్నేహితులు పరిమితము అని బలహీన పడవద్దు, వారి స్నేహితులు అపరిమితము అని  దిగులు చెందకు,  ధైర్యవంతుడు ఒక్కడున్నా ఆవర్గము విజయము ఖాయము అని నమంకం ఉంచుకోవలెను.   (గీత 1/10)

--((**))--
6. మనకు ఒకని వల్ల ఇబ్బంది అని తెలుసు కున్నప్పుడు తప్పించు కొనుటకు ప్రయత్నించాలి, సింహనాదం చేసిన ముప్పు వచ్చేది రాక మానదు.    (గీత 1/11to 13)

7. ఎన్నో రకాల వాయిద్యాలు మ్రోగించిన భయస్తుల గుండెలు భీతిల్లక మానదు, భయము లేనివారికి ఉత్తేజము పెరుగక మానదు.  (గీత 1/ 14 తో 20)

8. ఎంతటి వారైన తనతో ఉన్న వారిని గొప్పతనం తెలుసు కోవాలి ముందు, గొప్పలకు పోయి నేనే ధైర్యవంతుణ్ణి ఈ పని నేను సాధిస్తా, అందరి ముందుకు తీసుకు వెళ్ళు అని ఆలోచించక గొప్పలు  చెప్ప కూడదు.  (గీత 1/21)

9. మనము ఏ విషయమైన ప్రత్యక్షముగా చూడవలెను, చారులు చెప్పిన విషయాలు గమనించక వారికి మనకు వ్యత్యాసము గమనించి దేశకాల పరిస్థితులను బట్టి ప్రవర్తించ వలెను. (గీత 1/22&23)

10. నడి రోడ్డులో మనిషిని నిలబెట్టి నీవు అన్నీ వైపుల గమనించు ఎం తెలుసు కుంటావో తెలుసుకో అంటే అతని చూపు ఎటు ఉంటుందో ఎవరు చెప్పలేరు, ఆలోచించటం తప్ప.  (గీత -1/24/25). 


11. ఒక పని చేయ దలుచు కున్నప్పుడు బంధు వర్గము చూచి అపారమగు జాలిచే గుండె కరిగి బ్రతకటం  ఎవరికి  అవసరము ? (గీత -1/26&27)


12. ఆత్మబంధువులను చూచి, మనసు తల్లడిల్లి, వణుకు ఏర్పడుట, చేతిలో ఉన్న చేయు పనిని వదులుట, ఎంతవరకు, సమంజసము? ఎవరైన సమయానికి ఆదుకుంటారని అనుకోవటం తప్పు, చేస్తున్న పని ఆపుట తప్పు, అసలు విషయం గమనించాలి.


13.  ధర్మం అని తెలిసినప్పుడు అది అనుకరించుటలో తన మన అని మనసులోకి వచ్చుట అంత మంచిది కాదు, ధర్మాన్ని ఆచరించ గలగటమే ఉత్తమ లక్ష్యం .

14. అనుకోని విధముగా మన శరీరము గగుర్పాటుకు గురి అయిన ఇంద్రియాలను నిగ్రహించుకొన్న వాడే నిజమైన స్త్రీ పురుషులని గమనించాలి.(ఇది కలియుగంలో కష్ట సాధ్యమే ఆయన సాధనమున సాధించలేనిది లేదుకనుక ప్రయత్నిమ్చ గలరు)


15. ఎవరికైనా అనుకోని విధముగా దేహములో కనబడని మంటలు ఆవహించి మనస్సును అల్లకల్లోలము చేసిన మంటలకు కారణమును గ్రహించి తగు మందు వేసుకోనుటే నిజమైన లక్ష్యము అని గ్రహించాలి


16. గ్రహించిన విద్యను మరచిన, పరులకు ఉపయోగించక పోయిన అటువంటి వారు ఎవరైనా ఉన్నా లేనట్లే.

17. శరీర శుభ్రత చాలా అవసరము ఎందుకనగా నిద్రలో కళ్ళకు కనురెప్పలు ఎంత సహకరిస్థాయో, అట్లే మనలో ఉన్న మలినాన్ని తొలగించు కోవటం ప్రతిరోజూ చేయాలి, అది మన మనస్సుకు ఎంతో ప్రశాంతత కల్గిస్తుంది అని గ్రహించాలి

18. ఈరోజు మంచిది కాదు అని తలచి రేపు చేద్దామని అనుకోవటం ఎప్పటికి మంచిది కాదు. మంచి చెడులు చూడటంకన్నా లక్ష్య సాధనకు కృషిలో మంచి కనబడుతుంది అని గ్రహించాలి.

19. అవసర మనుకున్నప్పుడు ఆత్మబంధువులు, కన్నబిడ్డలు, ధర్మము తప్పారని తెలిసినప్పుడు తనవారినైనా సరే యెరులైన సరే భాధ పెట్టక తప్పదు. సక్రమ మార్గమును తెచ్చుటకు చేయాలి కృషి .

20. నిజాయితి బ్రతుకులో ఉన్న తృప్తి మరి ఎక్కడ కనబడదని గ్రహించాలి (గీత  - 28 నుండి 35)  


21.ఎవరైనా సరే, అవసర మైనప్పుడు ధన ప్రాణములపై ఆశలు వదలి, ధైర్యముతో ముందుకు నడచినవారే ఎన్ని కష్టాలనైనా జయించ గలరు.

22. సుఖమనేది, కష్టమనేది,  శాస్వతము మాత్రము కాదు. సంతృప్తిలోనే అసలు విజయమున్నది.

23. ఎదుటి వారు దాడికి సిద్దమైనప్పుడు, మరణమే వీర స్వర్గమని తలచి ఎదురుగా ఎదిరించుటలోనే ఉన్నది నిజమైన ధైర్యము. (గీత 31 నుండి 35  వరకు )


24 నామీద దాడి చేసినా,  నేను మాత్రము దాడి చేయను అని కూర్చుంటే,  చేతకాని వాడిలాగా లెక్క గడతారు, ఉన్న గుర్తింపు కుడా పోతుంది అని గమనించాలి.

25 విషము పెట్టువాడు, కొంపలు కాల్చువాడు, భార్యను ఆవమానించువాడు, నీట ముంచువాడు సర్వస్వము అపహరించువాడు,  ఆయుధము పట్టి నిరాయుధుడిపై దాడి చేసేవాడు, అటువంటి వారిని బ్రతికించుట వలన ఎవరికి ఉపయోగము?  (గీత - 36  నుండి 40 వరకు )

26. మూర్ఖుడు అని తెలిసి నప్పడు వానిని దూరముగా ఉంచుటయేగాని, లేదా మనమే దూరముగా ఉండుటగాని చేయవలెను, అతడు మృగమని తెలిసి నప్పుడు చంపుటయే వేట ధర్మమ్ అని అందరు తెలుసుకోవాలి. 

27. యద్దము చేసేటప్పుడు మనవారు పరాయి వారు అని చూడకూడదు, పాపము అంటుతుంది అనుకుంటే యుద్ధము గురించి కుడా మాట్లాడ కూడదు.         .   .          

28 దురాశపరులు, యుక్త , యుక్త వీక్షణక్షణ నేరగని వారని తెలిసి వారిపై మనము మూర్ఖులుగా మారుట సమంజసమా ? వారిని మార్చలేనప్పుడు మనమే దూరముగా ఉండుట నేర్చుకోవాలి.  

29 కులము నశించిన, కులధర్మము నశించును. ధర్మము నశించగా అధర్మము పెచ్చు పెరుగును. (Gita- 41 )

30 వర్ణసాంకర్యమువలన కులము వారికిని, కులఘాతకులకు కుడా నరకప్రాప్తి తప్పదు (గీత -42).   .

Image may contain: 1 person, outdoor



భగవద్గీతలో  (అంతర్గత)  సూక్తులు  -1(మొదటి అధ్యాయము )

దృష్టి దోషమున్నను కన్న దృష్టియు ఇది 
సంఘటన లన్ని మన వారు సరయు మధ్య 
వయసు మీరిన యుద్దపు విషయ వాంఛ 
నిత్య ఆరాట ముయె పోరు నీకు నాకు ---- 1

గురువు ని ప్రార్ధించె ఫలము గొప్ప దగును     
తగ్గ ఫలితము పొందుట తగిన రీతి 
తక్కువయు ఎక్కువయు చూపు తప్పు అనకు 
శిష్యు లందరు ఒకటి గా శాంతి చేయు ----- 2

గొప్ప తనమును తెలిసియు గోల అనకు 
మంచి ఎవ్వరు చెప్పినా మనసు పంచు 
గౌరవమ్మును కలిగించు గురువు సేవ   
గురువు లే నేర్పు విద్యయు గళము తెల్పు ---- 3

ఎదుటి వారి తెలివి గాను యదలొ చేరు    
వారి వంశంలొ తెలివిని విషయ వరము  
నడవడిక బట్టి కొంతయు నటన తెలియు 
మనకు ఉపయోగ మెంతయో మరులు గొలుపు ---  4 

స్నేహితులు పరిమితము గా సేవ పెరుగు 
అపరిమితము వున్న చెలిమి  ఆశ కరుగు  
ధైర్యమున్న వాడును ఉన్న  దారి కలుగు  
నమ్మకము బలం పైనను నేర్పు కలుగు  ----- 5

సింహ నాదము అవసరం సిరుల వెంట  
ఒకని వల్లనే ఇబ్బంది వదలి వెడలు 
వచ్చు ముప్పుకు ఎదురేగి వలదు అనకు 
సాధనమున పనులు వచ్చి సహన మయ్యె --- 6 

గుండె దడలు పెరుగు శబ్ద గురక ఉన్న 
భయపు వాయిద్యాల తొ ఘోష బోధ చేయు 
ఉత్తేజము పెర్గి విజయము ఉలికి పడును 
యుద్ధ భేరీ నినాదము యముని పిలుపు  ---- 7

గొప్పలకు పోయి తిప్పలు గొలుసు లయ్యె  
ధైర్యముతొ ఎదు రీతలు దరిని చేర్చు 
సాధనతొ సాధించుట గొప్ప శాంతి కలుగు 
అహము అనుకున్నది తరిమి అవగతముగు --- 8
     
ప్రీతి కల్గించు క్షణము యే పిలుపు లాయె 
ప్రతిది అనుభవమును బట్టి ప్రీతి కలుగు 
దేశ కాలస్థితి గమనం దైవ తీర్పు 
మనలొ వత్యాసం తెలుసుకో మౌనముగను ----9 

అందరిలొ మంచి గమనించి ఆదరణలు       
నీకు ఆలోచనలు మంచి నీడ నిచ్చు 
నిన్ను నీవుగా నమ్మాలి నియమ బుద్ధి 
ఏది అయినను ఎరుకగా యదను పంచు ----- 10

సంకటస్థితి లోనైన శాంతి చూపు  
దిక్కులేనిసమయమునఁ దైవ నీడ 
మనిషి నాలుగు రోడ్లలో మౌన మన్న 
ఏది దారో తెలియక యే ఏమి అనరు ----- 11

జాలి అన్నీవిధముల లో జూప వలదు 
బంధు వర్గపు ప్రేమలు బాధ్యత యగు 
జాలితో బ్రతుకుటఏగ చపల మేళ 
గుండె కరిగేట్లు నటనలు గాలు టేల ----- 12

విద్యయున్న నిరాయుధ విజయ మేళ 
మనసు తల్లడిల్లిన ఫల మేళ కలుగు 
వణకి బేజారు అవుటయు వలదు నీకు 
పిరికి వానివలెనీవు పలుకు లేల      ----- 13
          
సమయముయెదుర్విని యోగ సేవ లేల 
చేతిలోవున్న విద్యను  జాగు నేల 
తప్పు పనులను ఆపుట తొంద రవుట 
తప్పు జోలికి పోకుండ తపన లుంచు ---- 14

ధర్మమార్గము వీడక ధైర్య ముంచు 
దైవచింతన మానక ధైర్య ముంచు
కరుణయన్నది తోడుగా కార్య మయ్యె 
కక్షతో మదినింపకు కరువు వచ్చు   ----- 15
 
పొందగలగేటి సుఖమును పోరు అనకు 
గద్దెకెక్కిన నేమియు గోల అవదు 
జ్ఞానమన్నది లేకయే జాగు అనకు 
పరులసొమ్ములు దోచినా పలుక వద్దు ----- 16

మాటలెన్నోఅనుటయేల మడమ తిప్పు  
మూలమూలలు గమనించి మనసు తెలుపు     
మూలమే మఱచిన నీకు యూత మేళ 
ఆట బొమ్మగా ప్రతి ఒక్క రేను నిజము ----- 17

పనిని విస్మరించుట ఏల పలుకు లేల 
తనమన అనుట ధర్మపు తలపు లేల      
ధర్మముయె నిన్ను రక్షించు ధరణి యందు 
ఉత్తమము లక్ష్య సాధన ఉంచి కదులు ----- 18
  
ఇంద్రియాల నిగ్రహము యే ఇలలొ మేలు 
నిజము తెల్ప గలిగి ఉంటె నీకు మేలు 
తెలుసు కోలేని ఘటనలు తలపు లగును
స్త్రీ పురుషులలో ప్రేమయే స్థిరము యగును   --19   

దేహమున మంట కలుగుట దైవ ఇఛ్ఛ 
మందు లకు తగ్గనిది మంట మౌన మాయె 
ద్రోహముతొ కల్గు మంటలు దాడి చేయు 
దాహముతొ వచ్చు మంటలు దరిలొ కరుగు ---- 20

విద్య నిన్నునిన్నుగను యే వింత మార్పు 
విద్య దానం చేసే కొద్ది వినయ మిచ్చు 
విద్య ఉండి లేదన్నను వింత మృగము 
విద్య ఉన్నశాంతియు పోతె వీధి తెలుపు ---- 21

కళ్లపై రెప్పలు కనులు కాపు కాయు 
నిద్రలో రెప్పలను మూయు నీకు రక్ష 
కథలు వలదులే కనుపాప కరువు ఐన       
నయనమే ప్రధానము నీకు నేస్త ముగను ---22

రాతలను కోసె కోతలు రవ్వ లగును 
చింపు కాగితం జీవితం చెత్త లుగను  
మోయు మొతలుగా జీవితం మారు టగును  
మారకయె ముందు మట్టిలో మనసు యగును ---23 

ఊపిరిని ఇచ్చు రాతలు ఉరక లయ్యె   
రాతి మనుషుల మధ్యన రాయ లయ్యె 
మనసు కరిగిపోవుట సహజ మాయ లయ్యె 
జీవతంలొ జయ అపజయం జీత మయ్యె  ---- 24

మంచి చెడులని వెనకకు మరల వద్దు 
శుబ్రత మనకు శుభముయే శాంతి నిచ్చు 
మనలొ ఉన్నమలినమంత మనసు చెఱచు   
నిత్యమూ మనసున మాట నిన్ను మార్చు ----25

నేడు కాదు రేపుఅనిన నమ్మ వద్దు 
లక్ష్య సాధనకు కృషిలో లాలి జూపు 
భయము తనవారు తోనైన బాధ తెచ్చు 
ఆత్మబంధువు ధర్మము ఆశ పెంచు  ----- 26
  
పగలు రేయి కలవవు లే పట్టు విడుపు 
భగవదాకాంక్ష ఆకాంక్ష భక్తి బట్టి 
కామనా రహితులు ఉంటె కార్య ఫలము 
శాస్త్ర పాండిత్యము ను నమ్మి సేవ చేయు ---27

కర్మచేతను అమరత్వ కార్య మవదు   
సంతతితొ ధనము ను తోడు శాంతి రాదు  
త్యాగమువలన ధర్మము తృప్తి నిచ్చు 
ధర్మమార్గము సూక్ష్మము దారి లేదు ----28
     
కామినీ కాంచనాలను కలువ కుండ 
కాల మంతాను దైవము కోరి ఉన్న 
చీకటిని తరిమే వెలుగు చెంత మిగులు  
కోరికలను త్యజించుట గొప్ప శక్తి     ---29
 
అంతరాత్మకు తృప్తియు అంతము లేదు 
సాధకుణ్ణి వెంబడించును సాక్షి లాగ 
మనసు ఆలోచనల దృష్టి మంత్ర మయ్యె 
అనుభవించ దలచిననే అంత మాయ ---30
   
భక్త జీవితముయు కోర్క బద్ద మగును 
త్యాగమును భక్తి యుక్తము తీపి గుర్తు 
జ్ఞానమనె అగ్ని పట్టుట జపము తీర్చు   
హృదయ పూర్వకంగాకోరు హాయి పొందు ---31

తనయు లందరూ దుష్టులై తాడు తెంచ 
కష్టమైనను కర్మగా కారు చిచ్చు 
నీదు కర్తవ్య మును ఎంచి నటన కాక 
మార్గ మీదైన సంహార మొవ్వ వలెను   --- 32
 
తృప్తి యు నిజాయితీగను తెలపగలగు 
ప్రాణములపైన ఆశల పలుకు వదులు 
ధైర్యముగను మాట్లాడుట ధర్మ మగును 
కష్ట నష్టము క్షణకము కాలమ గును      ---33
    
సంతసమ్ముగా ఉండుట సమ్మతగును 
సుఖము కష్టము స్నేహము స్థిరము కాదు 
తృప్తి సంతృప్తి ఆతృప్తి తారుమారు 
శాస్వితము ఏది లేదులే శాంతి కొరకు ---- 34
 
నిజము తెలిసియు నడచుట నీకు రక్ష 
ఎదుటి వారిని ఊహించి యదను పంచు 
అవసరములైతే ఎదుర్కొను ఆట లాగ 
నిజము ధైర్యగా నీవెంట సిద్ధ మగును ---35

తప్పు కానిచో పోరాటం ఒప్పు అవును  
మరణ మైనను వీరస్వర్గమని కదులు 
శరణమా మరణము కాదు శాంతి రాదు 
కార్య సాధకునికిధైర్య  కార్య మగును ---36
 
నిన్ను నీవుగా రక్షణే -- నీకు మేలు 
దాడి చేయను అంటెను -- తప్పు నీది 
ధర్మమును తెల్పి ఓర్పుతో -- దాడి చేయి 
చేత కాని వాడిల వద్దు -- చేత చూపు ------37 

గుర్తు కొరకుగా గుర్తింపు  -- గలుగునీకు 
గొప్పకాదును అదియును -- గోప్య మొవ్వు 
అక్కరకురాని వాడుగా -- అలుక వద్దు 
ఆటు పోటులు తప్పవు -- ఆకలవ్వు   ----38
 
విషము పెట్టియు బతుకుకు -- వివర నిచ్చె 
కొంపలను కాల్చి ఏడ్చుట -- కాల మెనెను 
భార్య తిట్టికొట్టియు ప్రేమ -- భయము చూపె
నీట ముంచి తెలివనెను  -- నమ్మ కాన ---39

సర్వ మును హరించియు పాడు -- సేయువాడు 
ఆయుధము ఉపాయము తెల్సి -- వాడ నాడు 
భార్య ఉన్నా సుఖము లేక   -- బాధ పెట్టు 
వాడు వారును ఉన్నాను -- వల్ల కాడె ----40
    
మృగము ఆయితేను చంపాలి -- మౌనమోద్దు 
దూరముంచుము మూర్ఖుణ్ణి  -- దురద చేరు 
మనము మారక తెలివిగా  -- మెలగ వలెను 
చచ్చె ముందు ధర్మము లేదు -- చావు తప్ప ---41 

పాప పుణ్యాలు అనుటయు -- ఆపదవ్వు 
యుద్ధ నీతితో పోరాడు -- జయము నిచ్చు    
మనలొ వారు పరాయొరు -- మాట వద్దు 
యుద్ధ కాంక్ష తీర్చుకొనుము -- మలుపు తిప్పు ---42
 
నిత్యమూ దురాశపరులు -- నిన్ను తాకు 
అశ లనుచూపి ఆరాట --  ఆట నేర్పు 
యుక్త వీక్షణక్షణ మేర - యశము అగును 
మారుట సమంజసము అయ్యె -- మఱువ వలదు -43

మార్చలేనప్పుడు మనమే-- మనము మారె 
నేర్చుకోవాలి జగతిలో  -- నిజము మాట  
దూరముంచిన కోపము -- దరిన చేరు 
దరిన చేరిన కౌగిళి -- దారి మార్చు  ---44
 
కులము నశించి పోవుట -- కలల నిజము 
కులము ధర్మము నశించు - కళలు మరు 
ధర్మము తొలగి యు అధర్మ - ధర్మ మగును 
దుష్ట బుద్దులు పెరుగును -- ధరిణి యందు --45 

వర్ణసాంకర్యమువలన-- వరుస మారు
స్త్రీ పురుషులలో భేదమే -- సొమ్ము చేయు 
కులము విలువలు పడిపోవు -- కలత లగును 
పెళ్లి యు కులాంతరముగా - పేరు మారు ---46
   
నరక పు ప్రాప్తి అన్నను -- నటన అనెను 
నమ్మినచొ వెన్ను పాటుయే  -- నాణ్యతవ్వు 
నేడు సుఖముయు ప్రశ్నలే -- నేర్పు గాను 
వయసు పోకడ అనుటయు -- వలపు లిచ్చు ---47
   
 
సమస్య క్లిష్టమైనది కాదని అనుకున్న వెంటనే, 
ఆ సమస్య 99 శాతం నిర్జీవమైపోయినట్లే।

నేటి గీతా భాష్యం 
 కోరుకోవడం వల్ల లభించేవి - శాపాలు। 
వచ్చినవి ఏకీభవిస్తే - వరాలు।

: నువ్వెవరో తెలిపి , ఏం చేయాలో నేర్పి,  చివరివరకు నీ చెయ్యి పట్టుకుని నడిపించేదే  --- ధ్యానం।

ఉత్తముని కోపము -  నీటిపై వ్రాత వలె। (క్షణ కాలము)
మధ్యముని కోపము -  ఇసుక పై వ్రాత వలె।  (కొన్ని గంటలు)
అధముని కోపము - పలకపై వ్రాత వలె। (కొన్ని వారాలు/నెలలు)
అధమాధముని కోపము -  శిలపై వ్రాత వలె।  (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు)

 "గురుఁడవు పరమాత్మ ।।నీవే
నరులకు జ్ఞానమునొసఁగుము పరమాత్మా  !
పరులనణఁచికావుమయా।।
సురుచిరహాసా ।।సురవర సుందర రూపా  !!! "
 ----
" మరుదంశసంభవహనుమ ।।
పరులనణంచుచు భయమునుబాపుమ।।తండ్రీ !
నరవరరాఘవభక్తా !
ఉరుసాగరలంఘనవర ।।యో దనుజారీ !!! "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి