19, జనవరి 2021, మంగళవారం

ఛందస్సు



నేటి కవిత : " దేవత యే స్త్రీ "

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


గాలిలో గాలినై, గాయానికి మందునై , 

చేతిలో చేతినై, చేయూతగ ఉండునై 

కేళిలో కేళినై, కామ్యాతగ మంచునై 

పాలలో నీటినై, ప్రాముఖ్యత భార్యనై    ...   .... 1 

 

గారాబానికి నీడనై, గాలంగా పనికొచ్చే దాన్ని  

ఆకాశానికి నీడనై,  శబ్దంగా కదిలొచ్చే దాన్ని 

సందేహానికి తీర్పునై, దేహంగా ఉదయించే దాన్ని 

సంకల్పానికి తోడునై, సద్భావం బదులిచ్చే దాన్ని .... 2**

      

మదిలో ప్రేమగా, మౌనవత్వానికి ముందుగా,

కలలో దీపిగా, సోమతత్వానికి ముందుగా 

కధలో వెల్గుగా, ప్రేమతత్వానికి ముందుగా 

వలలో తోడుగా, ఆశతత్వానికి ముందుగా    ... 3


మచ్చికలో చెలిగా, మన్నన కోసం ఉండేదాన్ని 

విచ్ఛికతో మదిగా, విందుగ దేహం పంచేదాన్ని 

రమ్యతతో రమగా, రంజిత రాగం పాడేదాన్ని

కామ్యతతో కధగా, హృద్యత దాహం తీర్చేదాన్ని .... 4 

    

రెపరెప లాడుతున్నా, రేయింబగలు ఆడుతున్నా,

విలవిల లాడుతున్నా, వేదనలకు పాడుతున్నా 

తళతళ టాడుతున్నా, తాపంసెగలు పంచుతున్నా 

కళకళ లాడుతున్నా, కోపంవెతలు పొందుతున్నా .... 5    

       

రేపనేది లేకుండా ఉన్నా, రెప్పలా మాటువేసి ఉండేదాన్ని

కోపమేది రాకుండా ఉన్నా, తెప్పలా దాటు చుండి దాటే దాన్ని 

కోర్క యేది తేకుండా ఉన్నా, కప్పలా దాటి ఆశ తీర్చె దాన్ని 

పట్టుగాను దారంతా ఉన్నా, ఒప్పులా ఓర్పు శక్తి పంచు దాన్ని .... 6   

       

హృదయానికి విలువేదీ,  హృద్రోగం పొయ్యేదారి చూపుదాన్ని 

సమయానికి పనియేదీ, హృద్భావం తెల్పే మంచి చెప్పు దాన్ని 

వినయానికి దరియేదీ, స్త్రీ లక్ష్యం మార్గం తెల్పు చుండె దాన్ని 

అనురాగపు కళచూపే, స్త్రీ ధర్మం సత్యం తత్వ మైన దాన్ని ..... ... 7 

      

హృద్య తాపం తీర్చు దారిగా, హృదయంలో శబ్దంలా ఉండేదాన్ని 

సత్య భావం తెల్పె దానిగా, తరుణంలో సత్యంగా ఉండేదాన్ని 

విశ్వ మొహం ఆపె ఆశగా, వినయంతో మొహాన్నే ఆపే దాన్ని   

సర్వ వైనం తెల్పె దాదిగా, విషయంతో వైనాన్నీ తెల్పె దాన్ని  .... 8  


విరహం విరజాజి పూలులా, విన్నపం విధి కలయికైన దాన్ని 

తపనం మరుమల్లె పూలులా, నమ్మకం నిధి మనసుకైన దాన్ని  

మధనం చిరుహాస పూలులా, సమ్మతం తిధి ఢమరుకైన దాన్ని 

తరుణం మదితెల్పు పూలులా, విస్మయం నది లయలకైన దాన్ని .. 9 


--(())--


నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (2)

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ప్రకృతి ప్రేరణ ప్రేమ తోడైతే, స్త్రీ శక్తిని తెలియపరిచేదాన్ని  

ప్రకృతి ప్రేమకు ప్రేమ తోడైతే, స్త్రీ శక్తితొ పురుషునిసహాయాన్ని    

ప్రకృతి క్రోధపు ప్రేమ తోడైతే, స్త్రీ యుక్తితొ మనసునకుధైర్యాన్ని  

ప్రకృతి బ్రాంతికి ప్రేమ తోడైతే, స్త్రీ భక్తితొ గుణములకు ధర్మాన్ని  ..... 9

 

విజృంభణగా స్త్రీకి ప్రేముంటే, పురుషునివీర్యశక్తికి తోడైనదాన్ని 

ఆలంబనగా స్త్రీకి  ప్రేముంటే, పురుషుని సౌర్య యుక్తికితోడైనదాన్ని 

విశృంఖలమే స్త్రీకి ప్రేముంటే, పురుషుని తూల నాడియు ఉండేదాన్ని  

విశ్వాసముగా స్త్రీకి  ప్రేమంటే, పురుషుని ఆశ వేడికితోడైనదాన్ని ...... 10


కాలమే  సరాగం అయితే  - నీకు  సమానంగా పంచే సహనాన్ని    

సేవయే నినాదం అయితే - నీకు సుసీలం మే సత్యం విషయాన్ని 

ప్రేమయే సకాలం అయితే - నీకు  సుతారమే ప్రేమే విజయాన్ని   

పాపమే వికాసం అయితే - నీకు నిదానమే అయ్యే తారుణాన్ని   .... ... 11


అంద మీ మనమ్మున్ నిత్యమూ  - హరించెన్ పూసి ఆదుకొనేదాన్ని 

చంద మీ హృదిన్ నిత్యమూ సం-చరించెన్ ఆపి ఆశచూపేదాన్ని   

పందెమే మనమ్మున్ నిత్యమూ - కుదించెన్ తత్వ భావమిచ్చే దాన్ని  

ఎందుకో సుఖమ్మున్ నిత్యమూ - ఖరీదున్ అడ్క కుండ మెచ్చు దాన్ని.... 12  


నాలో రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందే హృదయాన్ని  

నాలో కాల మాయ చూపెన్ - మనమ్ముల్  పొందే హృదయాన్ని  

నాలో యోగవేళ వచ్చెన్ -  యుగాదిన్ నాడే  హృదయాన్ని 

నాలో శాంతి దూత చెప్పెన్ -  సుమమ్ముల్ విచ్చే హృదయాన్ని  .... ... 13

****

వల్లవీవిలాసము - ర/య/య/గగ UIU IUU - IUU UU

11 త్రిష్టుప్పు 75


నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (3)

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


కాలమే  సరాగం - సమానం కాదా దేవి   

సేవయే నినాదం - సుసీలం కాదా దేవి

ప్రేమయే సకాలం - సుతారం కదా దేవి

పాపమే వికాసం - నిదానం కాదా  దేవి    .... .... 14  


అంద మీ మనమ్మున్ - హరించెన్ గాదాదేవి

చంద మీ హృదిన్ సం-చరించెన్ గాదా  దేవి

పందెమే మనమ్మున్ - కుదించెన్ గాదా దేవి

ఎందుకో సుఖమ్మున్ - ఖరీదున్ గదా దేవి .... .... 15


రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందన్ గాదాదేవి 

కాల మాయ చూపెన్ - మనమ్ముల్  జిందన్ గాదాదేవి

యోగవేళ వచ్చెన్ -  యుగాదిన్ నాడే గదాదేవి

శాంతి దూత చెప్పెన్ -  సుమమ్ముల్ విచ్చున్ గాదాదేవి .... ... 16


పల్లవ మ్మయెన్గాఁ - బ్రసూనమ్ముల్గా గాదాదేవి

నుల్లమందు నాశల్ - హొయల్ మీఱంగా గాదాదేవి

మల్లియల్ సుమించెన్ - మనమ్మం దెల్లన్ గదాదేవి

వల్లవీ విలాసం - బవంగా రావా దేవి   .... .... 17


విందుగా సుసంధ్యల్ - విభావ మ్మిచ్చున్ గాదాదేవి

సుందరిన్ దలంచన్ - సుమమ్ముల్ విచ్చున్ గాదాదేవి

పల్కులన్ మదించున్ - మనోసమ్మతిన్ గాదాదేవి

చినుకులన్ చలించెన్ - సహాయమ్మునన్ గాదాదేవి  .... ... 18


నింగిలోఁ గనంగా - నిశిన్ జంద్రుండున్ గాదాదేవి

రంగులన్ వెలింగెన్ - స్రజమ్మై తారల్ గదాదేవి

శృంగమందు మంచుల్ - హృదిన్ శోకమ్మే గాదాదేవి

రంగడిందు లేఁడే - రమించన్ రాఁడే గదాదేవి    ... ... 19


నిట్టూర్పులు వెంబడించినా, నిజం నిలకడగా తెలిపా దేవి  

కష్టాలను  తోడితెచ్చినా, సుఖం నిలకడగా మలు పే దేవి  

రోగాలు తర్ముచుండినా, జపం నిలకడగా సలిపే దేవి  

పాపాలు చేయుచుండినా, జయం నిలకడగా నిలిపే  దేవి  ....20

    

నిండు మనస్సు చలించినా, నిగ్రహంతో ఆశతో ఉంన్నా దేవి  

పొందు ఉషస్సు చెలించకా,  నిగ్రహంతో పంచుతూ ఉంటా దేవి 

మంచి యశస్సు కల్పించితీ, నిగ్రహంతో సొంతమే పల్కే దేవి 

వద్దు తపస్సు ఇంకెందుకే, నిగ్రహంతో పొందుమే సత్యా దేవి ....  21    


ముఖ్యంగా స్త్రీలకు తెల్పునది .... తల్లులారా తప్పులు దొర్లినా క్షమించండి 

మీకు నచ్చితే షేర్ చేసి అభిప్రాయాలు తెలపండి ఇది నా ఆలోచనలు మాత్రమే  

--(())--

నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (4)

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ఆసరా నుండి దోపిడీ వరకు
అభిమానంనుండి అక్కసు వరకు
దయనుండి దుర్మార్గం వరకు 
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?  ..... .... 22
 
ప్రేమ నుండి పైత్యం వరకు 
మంచిగా బతకలేక చెడు వరకు 
మంచి నుండి మృగ ప్రవృత్తి వరకు
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?  .... ... 23

వేదఘోషనుండి వ్యర్ధ భాష వరకు  
విలువల వ్యవస్థనుండి, విచ్చలవిడితనం వరకు 
వివాహ వ్యవస్థనుండి విడాకుల అవస్తవరకు
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?  ... .. 24

ఆధ్యాత్మికత నుండి, అరాచకం వరకు
సమిష్టి కుటుంబం, నుండి సహజీవనం వరకు
గురుకుల సంప్రదాయంనుండి, గురువులను ప్రేమ వరకు
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?   ... .. 25

సంప్రదాయ జీవనంనుండి సరదాల జీవితం వరకు
మానవత్వంనుండి, మూర్ఖత్వం వరకు
మతసామరస్యంనుండి, మతఛాందసవాదం వరకు
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?   .... ... 26


వివాహం సంస్కారం అనే స్థితినుండి 
వివాహం ఆస్కారం అనే పరిస్థితి వరకు
చదవుల నుండి బతుకులేంతవరకు 
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?  ... ... 27

సత్యమార్గంనుండి సొల్లుకబుర్ల వరకు
దైవభక్తినుండి  దేహరక్తివరకు
మోక్షమార్గంనుండి మోహద్వారం వరకు
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?  ... ... 28

విశ్వసనీయతనుండి వెన్నుపోటు వరకు
ధర్మపధం నుండి దౌర్జన్యం వరకు
ప్రకృతి ఆరాధననుండి పర్యావరణ విధ్వసం వరకు
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?   ... ... 29

త్రాగుడు తప్పు అనే స్థితినుండిత్రాగుడు గొప్ప అనే పరిస్థితి వరకు
నియమబద్ధ సంఘ జీవనం నుండి నేరపూరిత సమాజం వరకు 
సర్వమానవ సౌభ్రాతృత్వం నుండి స్వార్దభరిత సంఘజీవనం వరకు
స్త్రీ పురుషులకు స్వేశ్చ ఏది ? సుఖము ఏది ?   ... ... 30

==))((==

నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (5)

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మదిర నీకేలరా - మధువు నేనిత్తు - మానసమ్మిత్తు 
కలలు తీర్చేనురా .. కధలు తెల్పేను . గాధలుతెల్పె 
కళలు కోరానురా ...  తనువు నీకిచ్చి .. తాపసినైన 
కాలువ కోరేనురా ... కలకలం వద్దు ... చిక్కులు వద్దు 

వ్యధలు నీకేలరా - వనిత నేనుండ - వలపుతో నిండ
రొదల నవ్వేలరా ..వనజ నేనుండ ... తలపుతో నిండ 
పలుకు నీతోనురా .. వదనమై నుండ ... నలుపుకో నిండ 
అలము పంచెనూరా .. అధరమైనుండ .. అలుపులెవద్దు 
 
తక్కువ చేయనురా - తాపము చూడుమురా - తమకం విడుమురా 
మక్కువ చూపునురా .  ఆకలి తీర్చుమురా .. కధనం వదులురా 
ఎక్కువ చేయకురా .. ఏకము అవ్వుమురా .. ఎదలో తురుమురా 
ఆశలు తిర్చుమురా ... బాధయు వద్దునురా .. విరహం విడుమురా 


--(())---

నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (6)

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


లేదని అనుకోకురా - లోకాన్ని చూడరా -

ఉన్నది పలుకేనురా - అన్నిట్లొ శక్తిరా

అన్నది మనసెనురా -- కాదన్న యుక్తిరా

కాలము మనదేనురా - కాలాన్ని నమ్మురా


ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   


లోకులను గమనించారా -  కోరిక తీరునురా

కాకులను గమనించారా  - ఓపిక వచ్చునురా

చీమలను గమనించారా -- ఓర్పును చూపుమురా

సర్వమును గమనించారా - సాధన కల్గునురా


ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   


కలవరింపు ఎందుకు - కనులముందు ఉండగా

సలపరింపు వద్దులె  - సహజమ్ముగ ఉండెగా

మమత పొందు ఇప్పుడె - వినయమ్ముగ ఉంటినే

మనసు నీకు పంచుట - తపన అంత తగ్గునే


ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   


కనువిందు చేస్తుండగా -  పలకరింపు చూపరా

ఇనసొంపు ఉండేనుగా  - సమయమంత మేలురా

తనువంత నీదేనురా -  కనులచూపు పాందురా

వయసంత మీదేనురా - సుఖముపొందు శోభరా


ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   


పక్కను మరువకురా - పదిలంగా ఉందాంరా

చుక్కను వదలకురా - సుమహాయే నీదేరా

మక్కువ కలుగునురా - విరజాజి పొందాలీ

తక్కువ అనకుమురా - సిరిపెంచి నీకేరా


ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   


ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   

మగువ మాటలు నమ్మురా - కలిసిబతికేదమురా 

--(())--


-
నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (7)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ - 
ఆనందమయ్యెరా '' సమయమ్ము లోన 
కాలమ్ము నీదిరా -- గమనించిచూడు 
వేషము వద్దురా -- సరుకంత పొందు  

ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   

బొదరింటిలోన - నాగవేషణ యెల్ల - 
మకురించు వేళ - వేదఘోషలు ఎల్ల 
చిగురించి ఉంది - అంటుపెట్టుట వల్ల 
సరియైనదంది - మేలుచేయుట  వల్ల   

ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా 

సాన పట్టుమురా - సతతము కలవరా - 
గాలివీచెనురా - నిరతము సమమురా 
నీరుపెట్టుమురా - నయనము తడపరా 
మౌనమేలనురా - మనసున మనసురా 

ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా

సరిగమ అనరా - వేషము వద్దురా - 
పదనిస వినరా - మోసము వద్దురా 
కలనిజ మగురా -  కాలము హద్దురా 
వినిమయ మనురా - వేదము పల్కురా 

ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా

వేగిర రమ్మురా - వెతలు తీరునురా
సాగును నమ్మురా - సమయమీరునురా 
తాపసి చూడురా  - కధలు చెప్పకురా 
ఆకలి తిర్చురా - అలసి పోకుమురా 

ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
మగువ మాటలు నమ్మురా - కలిసిబతికేదమురా 
ఓ మనసున్న మగాడా -  మది తెలుసుకొమ్మురా   
మగువ మాటలు నమ్మురా - కలిసిబతికేదమురా 
--(())--
 
శంభో మహాదేవా ...మానవుల్ని  చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   

రోగంతో ఆసుపత్రికి వెళ్లే అవసరం రాకుండా
దొంగల్లా పోలీసు స్టేషన్ కు వెళ్లే సమస్య లేకుండా
నిజంకోసం కోర్టు మెట్లెక్కవలసిన కేసులు రాకుండా  
గుర్తించని ప్రజానాయకుడు దగ్గరకువెళ్లే పని లేకుండా

శంభో మహాదేవా ... చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   
  
కోరికకోసం మంత్రిగారిని కలవవలసిన ముప్పేమీ రాకుండా
అబద్దాలు చెప్పే  రౌడీతో రాజీ పడవలసిన రోజు రాకుండా
దేవుడికే ముడుపులు కట్టవలసిన కోరిక కలగకుండా
మేము  పూజలు చేయవలసిన పాపాలు చేయకుండా 

శంభో మహాదేవా ... చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   

యజ్ఞాలు, హోమాలు చేయవలసిన ధ్యేయాలు లేకుండా
బాబాల దగ్గర మోసపోవలసినంత అమాయకత్వం లేకుండా 
స్వాముల దగ్గరకు పోవలసినంత అజ్ఞానం లేకుండా 
మొబైల్ మోసాల మాయలో పడి మనసు చెడకుండా

శంభో మహాదేవా ... చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   

సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఆలోచన చెడకుండా 
విద్యుక్తధర్మం నిర్వర్తించే వివేకాన్ని చెడిపోకుండా 
పర్యావరణాన్ని రక్షించే పట్టుదల మారకుండా 
మూగజీవులకు మమత పంచే మానవత్వం ఉండా 

శంభో మహాదేవా ... చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   

వసుదైక కుటుంబం కాంక్షించే విశాలహృదయం ప్రసాదించు!
సమస్యలను ఎదుర్కొనే సంయమనం అనుగ్రహించు!
సంఘజీవిగా మెలిగే సంస్కారాన్ని ప్రసాదించు!
విలువలు వెలిగించే వ్యక్తిత్వాన్ని అనుగ్రహించు!

శంభో మహాదేవా ... చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   

న్యాయాన్ని నిలబెట్టే నిబద్ధత ప్రసాదించు
అన్నార్తులకు అన్నంపెట్టే అవకాశం అనుగ్రహించు
అభాగ్యులను ఆదుకునే సమర్ధత సమకూర్చు
అక్రమాలను అడ్డుకునే సంకల్పం ప్రసాదించు

శంభో మహాదేవా ... చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   

స్త్రీ పురుషులు ఏకము సృష్టి ప్రక్రియ అని తెలియపరుచు 
సత్యం ధర్మం  న్యాయం తో సమయపాలన చేయించు     
ఆఖరిక్షణం వరకు నీ నామ స్మరణ జరిపే వరం ప్రసాదించు
ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఎగిరిపోయే జీవితం అనుగ్రహించు

  
శంభో మహాదేవా ...మానవుల్ని  చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడుమహాదేవా ..... 2   
శంభో మహాదేవా ...మానవుల్ని  చూస్తున్నావా ... 
మాగతి గమ్యాన్ని మరలా చూడు మహాదేవా ..... 2   

--(())--


నేటి కవిత : " దేవత యే స్త్రీ "  (8)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

నమ్మకమే బతుకండి సంసారానికి వేదమండి 
బతుకులో మాయను తెలపండి, తెలుసుకోండి   ....  

ఆశలకు చిక్కి ఖర్చుచేయకండి
అప్పులు అయితే బతకలేరండి 
కృషి తోను సంపాదన చేయండి 
పాపపు సంపాదన తో బతకలేరండి  

ఉచితమని అతిగా తినకండి 
అజీర్తి కాకపొతే బాదే  నండి  
గొప్పకు అతిగా మాట్లాడకండి 
మాటలతో మనస్పర్ధలొచ్చేనండి  

నమ్మకమే బతుకండి సంసారానికి వేదమండి 
బతుకులో మాయను తెలపండి, తెలుసుకోండి 

సమయం మించి నడవకండి 
ఆలస్యమైతే అందరికీ కష్టమండి 
ప్రకృతి బట్టియు  నడుచు కోండి 
ఎప్పుడూ కాలాన్ని నిందించకండి 
 ....  
అర్ధం లేని మాటలు అసలు వద్దండి 
ఏవిషయాన అవమాన పరచకండి 
అర్ధం చేసుకొనుటకు ప్రయత్నించండి 
అర్ధాన్ని, అర్ధాంగిని అర్ధ చేసుకోండి 

నమ్మకమే బతుకండి సంసారానికి వేదమండి 
బతుకులో మాయను తెలపండి, తెలుసుకోండి   ....  

లోకాన్ని బట్టి అందరూ మారాలండి 
నాయిల్లు నాదే లోకం అనుకో కండి  
ద్వేషాన్ని అసలు రానియ్యకండి 
ప్రేమించి ప్రేమను పొందాలండి 

మనమే గొప్పని అసలు అనకండి 
ఇతరులను తక్కువ చేయకండి 
10  మాటల వల్ల ఉపయోగం లేదండి 
ఒక్క మాటతో ప్రేమను గెలవండి  

నమ్మకమే బతుకండి సంసారానికి వేదమండి 
బతుకులో మాయను తెలపండి, తెలుసుకోండి 

వెనక ఎంత ఖ్యాతి ఉందో అనవసరమండి 
బుద్ధి కుశలత బాగుందో చూడాలండి 
ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండండి 
తెలియక పడ్డ తెలివితో లేచి బతకండి 

కోల్పోయినది అదేపనిగా అనుకోకండి 
సాధించిన దానితో తృప్తి పడాలండి  
శత్రువు కాని స్నేహము మేలండి  
ప్ర్మను పంచేది ప్రతిది స్నేహమేనండి  

నమ్మకమే బతుకండి సంసారానికి వేదమండి 
బతుకులో మాయను తెలపండి, తెలుసుకోండి 
--(())--

ఛందస్సు కవిత (11) 

రచయిత :మల్లాప్రగఢ శ్రీదేవి రామకృష్ణ 

UU  U UII IIUU


లోకంలో ప్రాంత కళల వృధ్ధే

సౌఖ్యంగా సేవ సమయ బుధ్ధే

చక్రంలా తిర్గు వినయ శుధ్ధే

శ్రీ కారం తెల్పె మనిషి శక్తే


లోకంలో ప్రేమ పరుగు నిప్పే

సక్యత్వం వల్ల చలువ ఒప్ఫే

వక్కానిచ్చే తరుణము మెప్పే

చుక్కానిచ్చే మలుపుల యుక్తే


లోకంలో ప్రేయసి కళ ఓర్పే

చీకూచింతా కళ నిజ మార్పే

చీకట్లే మార్చు వెలగు నేర్పే

వాకిట్లో కల్సి బతుకు తీర్పే


లోకంలో ప్రీతి యనున దేదీ

లేకుండే కాని మన సనేదే

ఏకంగా ప్రేమ కలలు కాలం 

ఈ కొద్దీ స్నేహ మధుర మయ్యే


సమ్మోహమ్మే సమయతలంపే 

సద్భావమ్మే  మనసున శక్తే   

సందర్భమ్మే కరుణతొ  యుక్తే  

సౌందర్యమ్మే వయసున రక్తే  



 మాలిని  

న   న   మ  య  య   15 /9  

III III UUU IUU  IUU 

వినయసహనమే జీవానికీ రెండు దార్లే  

మనసు గుణములే సామాన్యసమ్మోహ దార్లే 

అనుకరణలు  ఆహ్లాదంగనేసాగి పోవూ

వినుట కనుట చెప్పేవాటిలోసత్య మార్గం 

    

కమలనయన సంయుక్తాభి మార్గం గళమ్మే 
మమత కధలు మోహమ్మేసమారాధనమ్మే 
విమల చరిత సద్భావం సహాయం గుణమ్మే 
సమయ కరుణ సస్యశ్యామలం భావన మ్మే 

  
 

 మాలిని  

న   న   మ  య  య   15 /9  

III III UU     U IUU  IUU 



తరలి ప్రాస 

 భ   స   న  జ  న  ర    18/11

 

నగజతనయ - న/ర/య/న/స/గ III UI UI - UUI IIII UU
16 అష్టి 15960 
హృదయమందు నీవె  - నీతోను పలికితి దేవా 
మధురమైన వాడ - మోహమ్ము విడిచితి దేవా 
కధలు కావు ఆశ  --- నీపైన మమతయు దేవా 
వ్యధతొ తెల్పుచున్న -- విఘ్నాలు విజయపు దేవా 

విజయ మందు నీవె  - విజ్ఞానగుణనిధి దేవా    
నిజము తెల్పు చుండె - నిమ్నా గణపతివి దేవా  
గజముఖాసయుండె  --  గమ్యాలనుతెలుపు దేవా 
సృజన శక్తి నీదె  -  సుజ్ఞానమయముతొ దేవా  

సకల బుద్ధి దాత -- సర్వం తెలిపితివి దేవా 
వికట మైన రూప ---  విశ్వం వరములుగ దేవా 
దఖలు తెల్ప లేను -- ధర్మం నిలుపుటకు దేవా 
మకుట మున్న రాజ -- మోక్షం తెలుపుటకు దేవా 
 

నగజతనయ - న/ర/య/న/స/గ III UI UI - UUI IIII UU
16 అష్టి 15960 
==
ముదము నీయ వేగ - భూమిన్ నగజతనయా రా 
హృదయ మందు నీవె - శ్రీచిత్తజహర కుమారా 
వ్యధలఁ బాపు మయ్య - వాతాపి గణపతి యీశా 
సుధలఁ బంచు మయ్య - శుక్లాంబరధర పరేశా 
==
విరులతోడఁ గొల్తు - విఘ్నేశ సుగుణ సుశీలా
గరికతోడఁ గొల్తుఁ - గారుణ్యమున గనవేలా 
తరుల నాకు లిత్తు - ధ్వాంతమ్ము వలదిఁక దేవా 
వరము లంచుఁ దల్తుఁ - బాదాల నును నుసి నీవా 
==
సుజనబృంద పోష - సుజ్ఞాననిధి గణనాథా 
కుజనబృంద నాశ - కుబ్జా ప్రథమగురునాథా
త్రిజగవందనీయ - దేవా త్రిభువనవిహారీ 
గజముఖా యజేయ - గమ్యమ్మునకు పథమీవే 


నేటి ఛందస్సు 
UI UIII UI  - UI UIII UI  -UI UIII UI  - 

కాల మాయలను చూసి 
కన్నె పిల్లలను  మాయ 
చేయు వారు మనినారొ!   

ఆశ బత్కులకు పేరు 
కాలమే తుడిచి పెట్టు 
వేద మందు మణినారొ !

ప్రేమ పాఠములు తెల్పి 
మోస గించుటయు, తప్పు 
చేయ లేదు మనినారొ !

మానవత్వమును చూపి 
మర్మ మంతయును తెల్పి 
బుద్ధి మార్చు మనినారొ !

దేహ బంధమును తెల్పి 
ప్రేమ చేష్టలను చూపి 
దేశ మందు  మనినారొ !

పిల్ల పాపలను పెంచి 
పెద్దగా నటన తెల్పి 
మంచి తెల్వి మనినారొ !

వీణ వేణువుల సద్దు -    
తేనెయా? పసికందు 
వాణి వారు వినినారొ!  

--(())--

నేటి కవిత 

"నీవు నేర్పిన విద్యయే..."
"నాకు శ్రీరామ రక్షయే .. "
" నీవు పెట్టిన భిక్షయే  ..."
" నాకు జీవిత దారియే .. "

అనంతమ్ము విశ్వముయే 
మరియు నాన్న వీర్యముయే 
అమ్మ కడుపులొ నలుసుయే 
భూమిపై పడె  ప్రేమయే  

స్వస్వరూప దర్శనమే 
విశ్వరూప దర్శనమే 
విశ్వాసముతొ భావమే
విశ్వవ్యాప్తిగ  విదితమే 

ప్రతి ఒక్కరూ సృష్టి కార్యమే 
శ్వాసగా అభి వ్యక్త పరమే 
తలంపుగా తన్మయ పరమే 
ఇది ధర్మ శరీర ఏకమే

మనసు దేహము ఏకమే 
రహస్యాంగనా పరమే
ప్రేమా అంత: కరణమే 
ఇది అనుగ్రహ ఏకమే 

కలలు విడువక ఏకమే 
అహంకార మమకరమే 
హృదయాలింగన పరమే
కాంక్షా ప్రభావ పరమే 

మొనమే అర్ధాంగీకారమే 
ఆదర్శ ఆత్మీయ భావమే 
ఆనంద అంతర్గత మయమే 
జీవనాధారము పుట్టు జీవమే 

 


గణములు- జ,త,జ,గగ 
యతి - 6 

-- I U I  U U I I U I U U 
వినోద భావా విమలా గళత్రామ్
సమాన హోదా సమతా పవిత్రామ్
విశాల సేవా విన తా జపత్రామ్
సకాలం నేతా సరితా కళత్రామ్

 ప్రభాత కాంతే  ప్రగతీ సుమిత్రామ్
ప్రబోధ విధ్యే  ప్రతిభా సునేత్రమ్ 
 అనేక రూపం మమతా నురాగమ్ 
గుణాలరూపం కరుణా లనేకమ్ 

సరోజ నేత్రమ్ సుమతీ సుమి త్రన్ 
మరాళ యానమ్ మధు మం దహాసమ్ 
విరాజ మానమ్ విబుధాది వంద్యామ్  
వరప్రదాం తమ్ ప్రణమామి దేవీమ్ 

అనేక రూపా మనురా గపూర్నమ్  
గణాధిపాలమ్ కరుణాలవాలమ్ 
వనేజ వాసమ్ భవరోగనాశమ్  
ప్రణౌమి భక్త్యా బహుళార్థ దాత్రిమ్ 

విధాతృ పత్నీమ్ విమలైక మూర్తిమ్  
సదా పవిత్రామ్ స్మరణేన తుష్టమ్ 
సుధీ ప్రకాశామ్ సుమనోహరాంగిమ్  
సదావలాంబామ్ స్తవనమ్ కరోమిమ్  

అనాది విద్యా మవిచింత్యమానామ్  
మునీంద్ర స్తుత్యామ్ ముదితాంతరంగామ్ 
సునాదమోదాం సువిశాల దృష్టీమ్  
అనారతం తాం అనుచింతయామ్  
       
--(())--


UI UI  UI  UIU IIUI  
గుళ్ళు కట్టి అన్న మన్నమే అనువాడు  
కాళ్లు పట్టి  చెప్పు లే మోసే మరవోడు 
ఒళ్ళు పట్టి బట్టలే  ఉత్కే పనివాడు 
కళ్ళు పెట్టి బియ్యమే ఏరే టి మగాడు 

ముట్ట కుండ చెప్పు బుధ్ధుడే మనవోడు
కట్ట తెంచినీరు పెట్టుడే నసగాడు
చెట్టు మోల్చినంత పీకుడే పనివాడు
ఇంటి ఆలిచెంత ఎందుకూ కొరగాడు

తోటకము-స/స/స/స IIU IIU IIU IIU (పాదాంత విరామము మాత్రమే).
చిరుహాసపు నవ్వుల వెన్నెల లే 
మరుమల్లెల పువ్వుల వాసన లే 
విరజాజుల తీగలు పందిరి లే 
సిరి మువ్వల కాంతుల మెర్పులు లే 

II UU II UU II UU II UU రసధాటి
సమయానందము సంతృప్తి యె కావ్యమ్ముగ సాగే
సమభావమ్ముయు సంతృప్తి యె సామాణ్యము సాగె
మమ అంటూనె సమానం అను బేధం యుగ ధర్మం
యమబాధల్ని భరించే అను రాగం సమమౌనం


కధ  నిజ మాయనే  బతుకు నేర్పుకు ఆకలి నీరు దేనికిన్ 
విధి ఒక తీర్పులే నిజము తెల్పుట మానస మాయ కాలమున్ 
నిధి ఒక ఆశలే బతుకుమార్పులు  కాలము చేయు గాధయున్ 
మద గజ  యానకుం రవిక మాత్రమె చాలును  చీర యేటికిన్.. 


గురువర్యులకు నమస్కారములు మీరు పంపిన కాగితం పై ఛందస్సు మాత్రమే ఉన్నాయి (1 వలేక ) దానినిబట్టి నా పద్యము వ్రాసాను తప్పులు దిద్దగలరు 

సుగంది 
UIUIUIUIUIUIUIU 15 /11  

ప్రేమ లక్ష్య దేహ భావ మంత పర్వ రాగ మై
అమ్మ మాట పొల్లు పోక నుండె  ఆర్య కార్య మై   
సమ్మ తమ్ము నిత్య సత్య భావ నార్య సంఘ మై 
సామ రస్య భావ రాగ మంత సర్వ వేద మై 
 
మహాపూర 23 /13 
 
III UII UII  UII  UII  UII  III UI   
భరత భూమిన భాగ్యము కల్గునె బానిస బత్కుల  జనుల యందు 
కరుణ సాహస సేవలు ఆశల కోర్కల ఆత్రుత మనుషు లందు 
తరుణ కావ్యము పద్యము గద్యము తర్కము మార్గము కవుల యందు   
బరువు సాధ్యము సోద్యము పాద్యము భారము భావ్యము భవుని యందు 


మోదిని 
నజభజరగ 16 /11 
III IUI UII IUI UIUU 

మనసు సహాయమే సహనమై విశాల తత్త్వం 
వినయ సమర్ధ సేవలు నవీన సామ రస్యం 
తనువు విలాస బుద్ధియు అతీత భావ జాడ్యం 
చనువు వినోద వేదన సుచిత్ర మంత్ర లాస్యం 


శిఖరిణి 
యమనసభవ
IUU UUI III IIU UII UI 
సహాయం సమ్మోహ సమయ చరితానంద మయమ్మె 
మొహమ్మే కారుణ్య జనిత సుమమాదుర్య సమమ్మె 
అహమ్మే  పోరాట భరిత  భవ బంధాల భయ మ్మె
అహల్యే  పంచేను సుఖము మదిశీలమ్ము  తపమ్మె 
 
   
నభరసజజగ 
III UiI UIU IIU IUI IUI U
విలువ చూపియు ఆశపాశములేకయే మనసిచ్చునే
కలువ రెక్కలు విచ్చియే సుమ గంధమై వికసించునేే
తులువ మాటలు గొప్పలై మది బంధమై మురిపించునే
అలక చూపులు కారణమ్ముయు లేకయే తలపించునే

పలుకు వేదము జీవితం మది పల్కులే వినిపించుకునే
చిలక పల్కులు గొప్పవే విధి తెల్పునే కనిపించకునే
గిలక తిర్గుట పద్ధతే జయకేతనం ఎగిరేందుకనే
నలక తీయుట నాలుకే ఉపయోగితం సహకారమునే

భజసన భజసన గగ
UII IUI IIU III UII IUI IIU III UU
సాధనయె శోధనలు నిత్య సమరం 
మనుగడే అణుకువే మమత రాగం
శోకమయె హాసముగ నిత్య చరితం
మనసుయే మమతకై తరుణ రోగం

కాలముయె కల్పనయు నిత్య వినయం
బతుకుయే కళలకై సమయ వైనం
సాహసమె సంభవము నిత్య పయనం
పలుకుయే సహనమై కధల వేదం

మార్పులుయె నేర్పరుల నిత్య ఉదయం
కధలుయే కలలుయే మెరుపు తేజం
ప్రేరణయె సాహసము నిత్య విదితం
ఒకటిగా వదనమై ప్రకృతి లౌక్యం

ఆదరణ ఆచరణ నిత్య సహనం
ప్రకృతి యే గుణము గా కదిలె తత్వం
ధర్మమును సత్యమును నిత్య వివరం
విషయమే విజయమై మెదిలె జాడ్యం

ఆయుధమె ధైర్యముయె నిత్య పరువం
తిరుగుటే పతనమై మొదలు సర్వం
అంతరమె మూలముయె నిత్య విషయం
విజయమే చరితమై కదులు జీవం

అంద రందరు ఆనంద అభినయమ్ము
సంబరములుగా సాగేను సంతసమ్ము 
నిత్య సంతోషము కలిగే నిముషమందు
మురిసె పెండ్లాడి నందరు మెచ్చు చుండె

తెలుగు మాటకు ఊపిరే తేట నీరు
తెలుగు పాటకు ప్రాణమే తేజ మవ్వు
తెలుగు పద్యము చక్కని తధ్య మవ్వు
తెలుగు గద్యము హాయిని గొల్పు చుండు

తేటగీతి

నాతొ నవ్వవా ఇప్పుడే నమ్ము మమ్మ
నన్ను చూసిభయమ్మోద్దు నీవు కూడ
నటన కాదులె ప్రేమయు నీదు నాది 
నవ్య చరితమ్ము మనమధ్య నవ్వ కమ్మ

ఏమి రూపమది మనసు ఎదను తాకె
కురులు అందము హృదయాన్ని కుదిపి వేసె
విశ్వ శాంతి కి కళలేలు జయము చూపె
తగిన మెలకువ కురులతో నావ లేలెె

పాలు ఇచ్చే టి బర్రెకే భారమయ్యె
దున్నపోతు లే పాలించె ధరణి యందు
దుష్ట దుర్మార్గ రాజ్యంలొ దారి ఏది
ప్రజల కోరిక తీర్చేటి పుడమి ఇదియె

వెలుగు నీడ కమ్ము వేదన నలుపుగా
సగటు జీవితాన సొంపు కరిగె
చిత్రమాయ నాకు చిత్రంగ చెమటలే
మెచ్చు వారు లేరు మెతుకు లేల
0

Ii uuii uiui iiu
Uui uuii
మనసంతా మమకారమే నిముషమై
సంతోష సంభావ్యమె
వినయమ్మే చిరుహాసమే తరుణమై
విశ్వాస సమ్మోహమె
పనియందే నిజమైన సేవ లుఇవే
చైతన్య సంభావమె
తనువంతా సహనమ్ముగా విజయమే
సౌజన్య తత్భావమె

నే పట్టిన కుందేటి కి మూడే కాళ్ళు
నే కోరిన పొందేందుకు ఆశే ఒళ్ళు
నే నేర్చిన పాఠానికి కాలం కళ్ళు
నే రాజ్యము ఏలేందుకు సృష్టే గుళ్ళు


తెలుగు భాష నేర్చుకుందాం 
రచయిత : మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ  
న/ర/న/ర IIIUIU - IIIUIU

కలువ రేకులే - వనిత నవ్వులే  
సమయ లొట్టలే - పడఁతి చూపులే 
చురుకు మాటలే - యువతి ఆశలే    
నవత కోర్కలే -  మగువ ఊపులే

మనసు వేటలే - వయసు ఆటలే 
సొగసు చేష్టలే - వలపు ఊటలే   
పరువు మాటలే - అలుపు పల్కులే    
నగల మెర్పులే - నగువు కుల్కులే   

పరుల మాటలే - పగటి దోషమే 
వరుస వాదనే - వలపు చీకటే 
మనసు వేదనే - వయసు కోర్కలే 
వలపు వేడుకా - తలపు దప్పికా 

సిరుల గొప్పలే - మమత పొందులే  
కలల పంటలే - కళల నేర్పులే  
శిలల పూజలే - కధల వేల్పులే 
పగలు ఎండలే - నళిని నీడలే 
       
--((**))--

ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ పత్రిక (4)
నేటి ఛందస్సు 
UIU  IIU IUI IUI UII UIU  
  
స్ఫూర్తిగా కలలన్ని కామ్యపురాణ కారణమే కదా 
ధూర్తిగా  ధరణీ తలాన్ని సకాల సేవలు యే కదా 
కీర్తిగా మనసంత పంచియు మానవత్వము యే కదా 
మూర్తిగా మహిమాన్వితమ్మును తెల్పి తాపసి యే కదా    
                          
దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో  మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం 
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం 

చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే 
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో 
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో 
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో

--(())--


తృప్తి

UI IIIUI - UIU UIU 
UI III - III IIIUI 
UI IIIUI - UIU UIU 
UI IIIUI U 

నేటి కవిత - తృప్తి **
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

బేల  తనువులోన - తాపమే  తృప్తిగా
మాల లతలు కళల వలపు గాను  
కాల మనసు నర్ధ మవ్వుటే జీవితం  
కాల కలలు తీర్చుటే  

వెన్న మనసులోనఁ - బ్రేమయే వెన్నయా 
కన్నె మనసు - కలల కవనమయ్యె 
వన్నె లలరినట్లు - వాంఛలే పూచెఁగా 
నన్ను కనవదేల నీవు 

కష్ట సుఖములోన - ధర్మ ధర్మాలులే 
ఇష్ట వయసు - చెలిమి తలపు గాను 
నష్ట మనునదేది - చేయకే ఉండుటే 
ఇష్ట మనునదే ఇదీ 
   

--(())--


నేటి పద్యాలు
సంపాదన ఎంత ఉన్నా వెలితి
తప్పొప్పులు చేసి ఉన్నా వెలితి
పప్పూ జల మెంత ఉన్నా వెలితి
అప్పూ కళ లెన్ని ఉన్నా వెలితి
గుండె గుప్పెడే అయినా వెలితి
కొండ మల్లెనే అయినా వెలితి
బండ బుధ్ధిగా అయినా వెలితి
దండ యాత్ర గా అయినా వెలితి
దాహార్తిని దాహము తీర్చిన వెలితి
అన్నార్తికి ఆకలి తీర్చిన వెలితి
యోగార్తికి వేదము చెప్పిన వెలితి
ప్రేమార్తికి ప్రేమను చూపిన వెలితి
 మనసు మమతలే స్వర్గాన్ని చూపేటి బతుకు
వినయ వివరమే ఔనత్య భావపు బతుకు
తనువు తపనలే ఆరోగ్య రక్షణ బతుకు
అణువు అణువు యు అర్పణ ఆశల బతుకు
 కళలు కలతలే తీర్చెను కాపురమ్ముననె
అలక మరుపులే బాధ్యత చూపుట కళలె
విలువ విజయము మనసున కధలలో కళలె
పలుకు పదములు ప్రేరణ హాయిగా కళలె
 వైనము కాని బత్కులను వాడిగ అన్నది  చిత్ర మద్దిరే 
గానము తోను గమ్యముయు గాధగ ఉండిన చిత్ర మద్దిరే
మానము మన్షి గోప్యమగు మాటలు వీధిన  చిత్ర మద్దిరే  
ప్రాణము లేని వస్తువులు పర్విడు చున్నవి చిత్ర మద్దిరే
 అన్నము తిన్న వానిగను ఆంద్ర భావ్యము చిత్ర మద్దిరే
సున్నము వక్క ఆకులను సల్పియు కిల్లియు చిత్ర మద్దిరే
మిన్నును నమ్మి వేకువన రైతుగ దున్నియు చిత్ర మద్దిరే    
మన్నును నమ్మి మౌనమును వీడియు బత్కుల చిత్ర మద్దిరే
వాణి నాదం
వాణినినాదమే పలుకు విద్య అనంతము తెల్పి వేడుకన్
ప్రాణము పంచియే పలుకు పల్కియు ఆదరమున్ను చూపియున్
వాణిగ శోభలే సుఖము వేద విధానము పల్కి బోధయున్
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్ర మద్దిరే

నేటి పద్యాలు

సంపాదన ఎంత ఉన్నా వెలితి
తప్పొప్పులు చేసి ఉన్నా వెలితి
పప్పూ జల మెంత ఉన్నా వెలితి
అప్పూ కళ లెన్ని ఉన్నా వెలితి

గుండె గుప్పెడే అయినా వెలితి
కొండ మల్లెనే అయినా వెలితి
బండ బుధ్ధిగా అయినా వెలితి
దండ యాత్ర గా అయినా వెలితి

దాహార్తిని దాహము తీర్చిన వెలితి
అన్నార్తికి ఆకలి తీర్చిన వెలితి
యోగార్తికి వేదము చెప్పిన వెలితి
ప్రేమార్తికి ప్రేమను చూపిన వెలితి

 మనసు మమతలే స్వర్గాన్ని చూపేటి బతుకు
వినయ వివరమే ఔనత్య భావపు బతుకు
తనువు తపనలే ఆరోగ్య రక్షణ బతుకు
అణువు అణువు యు అర్పణ ఆశల బతుకు

 కళలు కలతలే తీర్చెను కాపురమ్ముననె
అలక మరుపులే బాధ్యత చూపుట కళలె
విలువ విజయము మనసున కధలలో కళలె
పలుకు పదములు ప్రేరణ హాయిగా కళలె

 వైనము కాని బత్కులను వాడిగ అన్నది  చిత్ర మద్దిరే 
గానము తోను గమ్యముయు గాధగ ఉండిన చిత్ర మద్దిరే
మానము మన్షి గోప్యమగు మాటలు వీధిన  చిత్ర మద్దిరే  
ప్రాణము లేని వస్తువులు పర్విడు చున్నవి చిత్ర మద్దిరే

 అన్నము తిన్న వానిగను ఆంద్ర భావ్యము చిత్ర మద్దిరే
సున్నము వక్క ఆకులను సల్పియు కిల్లియు చిత్ర మద్దిరే
మిన్నును నమ్మి వేకువన రైతుగ దున్నియు చిత్ర మద్దిరే    
మన్నును నమ్మి మౌనమును వీడియు బత్కుల చిత్ర మద్దిరే

వాణి నాదం
వాణినినాదమే పలుకు విద్య అనంతము తెల్పి వేడుకన్
ప్రాణము పంచియే పలుకు పల్కియు ఆదరమున్ను చూపియున్
వాణిగ శోభలే సుఖము వేద విధానము పల్కి బోధయున్
ప్రాణము లేని వస్తువులు పర్విడుచున్నవి చిత్ర మద్దిరే
0 Com
 
నేటి ఛందస్సు కవిత....18
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ            
గణములు - న,న,మ,య,య
III III  UUU IUU  IUU  యతి 9   

నిరుపమగుణదీప్తీ నిత్యకల్యాణ కారీ
హరిహర సుతకీర్తీ ఆత్మవిద్యాప్రదాత్రీ
చిరునగవుల చిత్తాచిత్త భవ్యా భవానీ
కనక కళలు సద్భక్తా తపస్వీ సుభద్రా 

సవినయ సమదృష్టీ సమంతా సకారీ
మురహర భవబాగ్యాన్ముక్త సౌమ్య ప్రదాత్రీ 
పరశివ హృదిభాసా భక్తిగమ్యా భవానీ
సురుచిర మృదుహాసా శోభితాంగీ సుభద్రా

వినిమయ ఉచితా సవ్యా విధానం సకారీ     
నరహర నవతేజాన్ముక్త రమ్య  ప్రదాత్రీ
మనసు మమత మొహమ్మే ప్రదీప్తి భవానీ
పలుకు అలక వాక్కేభక్త సాద్వీ సుభద్రా

మునివరమన సేసౌమ్యా లయమ్మే సకారీ
సరిగమ పద నాట్యశాస్త్ర దివ్యప్రదా త్రీ
కనుల కనులు కల్సేకాలమాయే భవానీ
వినయ వికసితా తావీ అలేఖ్యా సుభద్రా 

--(())--

నేటి చెందస్సు ... కవిత 
UU UIU UU UIU  .... 17 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ధాన్యం ఎక్కడో పుర్గుల్ అక్కడే  
శాంతీ ఎక్కడో కోపం అక్కడే  
ప్రేమా ఎక్కడో భందం అక్కడే 
అప్పూ ఎక్కడో యుద్ధం అక్కడే 

తప్పు ఎక్కడో ఒప్పు అక్కడే 
రోగం ఎక్కడో మందూ అక్కడే 
విద్యా  ఎక్కడో వ్యాప్తీ అక్కడే 
విత్తూ ఎక్కడో చెట్టూ అక్కడే  

మార్గం ఎక్కడో యానాం అక్కడే 
మద్యం ఎక్కడో మాంద్యం అక్కడే 
మానం ఎక్కడో ధ్యాసా అక్కడే 
మౌనం ఎక్కడో మర్మం అక్కడే
 
మంచీ ఎక్కడో చెడ్డా అక్కడే 
శాస్త్రం ఎక్కడో శ్రావ్యం అక్కడే 
బంధం ఎక్కడో భావం అక్కడే 
ధ్యానం ఎక్కడో జ్ఞానం అక్కడే 

రాగం ఎక్కడో తాళం అక్కడే 
కాలం ఎక్కడో గమ్యం అక్కడే 
ప్రాణం ఎక్కడో ప్రేమా అక్కడే 
కోపం ఎక్కడో తాపం అక్కడే 

గ్రామం ఎక్కడో పంటా అక్కడే 
గ్రాసం ఎక్కడో జీవం అక్కడే 
గాత్రం ఎక్కడో గాళం అక్కడే 
తృప్తీ ఎక్కడో ఖ్యాతీ అక్కడే 

ప్రాప్తీ ఎక్కడో రక్తీ అక్కడే 
ధర్మం ఎక్కడో సృష్టీ అక్కడే 
న్యాయం ఎక్కడో జాతీ అక్కడే 
భార్యా ఎక్కడో భర్తా అక్కడే 

మేఘం ఎక్కడో వర్షం అక్కడే 
ఆశా ఎక్కడో కష్టం అక్కడే 
ఆత్రం ఎక్కడో అర్ధం అక్కడే 
జాప్యం ఎక్కడో తొందర్ అక్కడే 

వేషం ఎక్కడో మాయా అక్కడే 
వ్యాధీ ఎక్కడో వైద్యం అక్కడే 
నాట్యం ఎక్కడో చూపూ అక్కడే 
రామా ఎక్కడో కృష్ణా అక్కడే 
 
--(())--

నేటి ఛందస్సు 
UI UI UI UUI   .... 16
బాల భాను కాంతి పుంజాలు
రామ భాణ కాంతి లోకాలు
రామ నామ కాంతి దేహాలు 
విశ్వ మాయ కాంతి దేశాలు 

మిన్ను దేహ కాంతి వర్ణాలు 
మన్ను మోహ కాంతి భావాలు 
శాంతి దాహ కాంతి ఊహళ్లు 
కాలమే మాయ కాంతి విస్తర్లు  
  
మేని వెల్గు వింత కాంతుళ్లు 
ఆశ పర్గు  కొత్త పొంతళ్లు 
కాల మల్పు  తిప్పె చిందుళ్లు 
చూపు కల్పి ఒప్పు మాటళ్లు 

ప్రేమ మారి మేను నవ్వుళ్ళు 
సేవ కోరి శక్తి ముచ్చట్లు 
ధ్యాన మిచ్చి మోక్ష మార్గాలు 
మాతృ మూర్తి యుక్తి పాఠాలు 
 - 
 నేర్పించు పంతులమ్మ పాఠాలు
 నేర్పూక  ఎందుకమ్మ భేదాలు  
 పెంచూట వద్దులెమ్మ వాదాలు 
  దోషాలు చేయధమ్మ శాపాలు

 దీనంగ మాన్యమమ్మ శబ్దాలు 
చద్వాలి  నిశ్చమమ్మ వేదాలు
పాఠాలు  నేర్పుమమ్మ శాస్త్రాలు 
శోకాలు వద్దులెమ్మ భోగాలు

కాఠిన్యమున్ జూప గానిదమ్మా
పంత మ్మూ వద్దు ఎందుకమ్మా        
శాంతంమ్మూ జూపి ఉండువమ్మా
భాగ్యంమ్మూ  పంచు కోవలమ్మా

అటాడ కష్టమౌ నజినికొమ్మా
పోరాట ఇష్టమో నజినికొమ్మా  
పేరాశ శాపమో నజినికొమ్మా
వేషాలు కోపమౌ నజినికొమ్మా

నామాట లెప్పుడున్ నాణ్యమౌనే
నాశక్తి ఎప్పుడున్ భాగ్యమౌనే
నాదైవమ్ హృదయం లోనమౌనే
నాప్రాణం ప్రేమంత భద్రమౌనే 
           
నీ మీద నిరతమ్ము నెయ్యమేనే
నీ రూపు పదిలమ్ము హృద్యమేనే
నీ మాట మనసమ్ము వుండెనేనే
నీ నవ్వు ఎపుడూను పొందునేనే

ఎన్నెన్నొ నేవింటి నీరీతిగా
చెయ్యాలి సేవాలు నీరీతిగా
పొందాలి సంతోష మీరీతిగా
భాగ్యము వచ్చేలె ఈరీతిగా
              --((*))--


  
ప్రాంజలి ప్రభ ...UII  UUU  UIUU .. ఛందస్సు కవిత 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మానవ ముంగిట్లో వెల్గు లెన్నో 
జీవిత కాలాల్లో కూర్పు లెన్నో  
తామర తూడుల్లో నీళ్లు ఎన్నో  
ఆకలి మంటల్లో  ఆట లెన్నో  

పూసిన పువ్వుల్లో ఊసులెన్నో
వాలిన కన్నుల్లో  కాంతులెన్నో 
కారిన నూనెల్లో  జారులెన్నో 
తేలిన నీళ్లల్లో   పుర్గు లెన్నో 

ఆకుల ఊఫుల్లో శ్వాసలెన్నో  
పక్షుల రెక్కల్లో  తల్పులెన్నో 
తాగిన మైకంల్లో మాటలెన్నో  
వాడిన చూపుల్లో కోర్కలెన్నో 

మొనపు నవ్వుల్లో ఆశలెన్నో 
గాళము  గొల్లాల్లో లింకులెన్నో 
కథలు రాతల్లో మల్పులులెన్నో  
చేదల బావుల్లో బిందలెన్నో  

మానస గీతాల్లో ఒప్పులెన్నో 
నిత్యము పాఠాల్లో తప్పులెన్నో 
సత్యపు మాటల్లో తీర్పులెన్నో 
ధైర్యపు చూపుల్లో మార్పులెన్నో 

నల్లని నీళ్లల్లో నల్క లెన్నో
తెల్లని పాలల్లో పొంగులెన్నో 
బెల్లపు తాండ్రల్లో తీపి లెన్నో   
అల్లము తాండ్రల్లో ఘాటులెన్నో   

--(())--


ప్రాంజలి ప్రభ (ఛందస్సు) తత్వ   భోద  - 
UUI UUI UIUU  ---14
 
పాఠాలు నేర్పించు పంతులయ్యా 
బేదాలు చూపించుఁ టెందుకయ్యా 
వాదాలు మామధ్య  వద్దులే య్యా  
శాపాలు  కోపాలు మానవయ్యా 
కృష్ణయ్య గానున్న గాంచవయ్యా 

మాటాడు దీనంగ మాన్యమయ్యా 
వేదాలు చద్వాలి  నిశ్చమయ్యా 
శాస్త్రాల పాఠాలు  నేర్పుమయ్యా 
భోగాలు శోకాలు వద్దున య్యా 
కృష్ణయ్య నీయందు గాంచవయ్యా 

కాఠిన్యమున్ జూప గానిదయ్యా 
పంతమ్ము నీయందు కూడదయ్యా         
శాంతమ్ము జూపేందు కుండవయ్యా 
భాగ్యమ్ము నేపంచు కోవలయ్యా 
కృష్ణయ్య మాటల్ని గాంచవయ్యా 

అటాడ కష్టమ్ము మాను అయ్యా 
పోరాట ఇష్టమ్ము వద్దునయ్యా  
పేరాశ శాపమ్ము తెల్సునయ్యా 
వేషాలు మోసమ్ము వద్దులెయ్యా 
కృష్ణయ్య వేషాన్ని గాంచవయ్యా 

నామాట లెప్పుడున్ నాణ్యమయ్యా 
నాశక్తి ఎప్పుడున్ భాగ్యమయ్యా 
నాదైవ హృద్యమ్ము శాంతమయ్యా 
నాప్రేమ పేరంత భద్రమయ్యా  
కృష్ణయ్య ప్రేమంత పొందువయ్యా 

ఎన్నెన్నొ నే వింటి తీర్చవయ్యా 
చెయ్యాలి సేవాలు ఇప్పుడయ్యా 
పొందాలి సంతోష తప్పదయ్యా 
భాగ్యము తెచ్చేలె హాయి నయ్యా 
కృష్ణయ్య కాంతుల్ని  గాంచవయ్యా            

నీమాట నన్నూను మార్చెనయ్యా 
నీబాట నాకూను మార్గమయ్యా 
నీతల్లి  నాకూను తల్లి నయ్యా 
నీతండ్రి నాకూను తండ్రినయ్యా 
కృష్ణయ్య హృద్యమ్ము  గాంచవయ్యా 

నామాట నమ్మేటి దేశమయ్యా 
నాఆట చూసేటి ప్రాంతమయ్యా 
నావేట మామూలు అయ్యెనయ్యా 
నేనేను నీమన్సు మారణయ్యా 
కృష్ణయ్య తేజస్సు  గాంచవయ్యా 
              --((*))--
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

సీసా పద్యము
ఉదయాన వేడిగా ఉత్సాహ కాఫీను
భార్యతో ముచ్చట బాధ తీర్చు
కమ్మని మద్దులా కమనీయ పల్కులా
కలిసొచ్చు సహనము కాచి ఉండు
స్నానము చేసియు అల్ప ఆహారము
అందించి సేవతో ఆత్మ తెలిపె
చిరునవ్వు చూపించి చెమ్మగిళ్ళుకనులు
హృదయము కదిలించి హాయి చెప్పె
తేటగీతి
పగటి ప్రేమను చూపియే పాద పూజ
రాత్రి పూటయు మనసును రంగరించు
పనులు అన్నియు చేసియు ప్రేమ చూపి
విద్య బోధ ఉద్యోగిగా వినయ ముంచె
,,,,,,,,,,,,,,,,,,,,,
భోజనం తిన్నను భాధయు తగ్గును
ఆకలి తీర్చును ఆదరమ్ము
పుత్తడి ఉన్నను పుడమిలో సంపదే
ఆశలు తీర్చును అలక మార్చు
ఆనందపు పలుకు ఆట తీర్చు
అహముయే పెరిగిన అరుపు మారు
ఒకరికి తోడుగా ఒకరు ఉండు
కాలమాయబట్టి కాపురం మారేను
ప్రేమ శాంతి నుంచి పెదవి పంచె
ఆదమరచి ఉన్న ఆకలికే తోడుగా
సహనముంచి సేవ చేయు చుండు
,.................
ఆ ఇల్లాలు దైవపూజ చేసి కొలువు చేరె
ధర్మము తెల్పియు దారిద్ర మాపిన
ధన్యోస్మి ధన్యోస్మి  దేవదేవ
దాశ్యము తొలగించి దాతగా మార్చిన
ధన్యొస్మి ధన్యోస్మి దేవదేవ
ధ్యానశీలుడుగాను ద్రవ్యమ్ము ఇచ్చిన
ధన్యోస్మి ధన్యోస్మి దేవదేవ
ధృతరాష్ట్ర కాకుండ దరిగాను ఉండియు
ధన్యోస్మి ధన్యోస్మి దేవరాజ
ऊँ! 
----
"  పరంజ్యోతిస్స్వరూపాయ శ్రీ శ్రీ నివాసమూర్తయే
ధర్మజ్యోతిస్స్వరూపాయ శ్రీ వేంకటేశ్వరా ర్తయే
దివ్య జ్యోతి స్స్వరూపాయ శ్రీ పద్మనాభ మూర్తయే
సత్యజ్యోతి స్స్వరూపాయ శ్రీ నిత్య వైభవార్తయే
నమోనమః.. శ్రీ వేంకటేశాయ నమోనమః

ప్రాంజలి ప్రభ ఐయూ UI UI UI UI  (13)
రచయత; మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
*పుష్పాలు  కావాలి (ఛందస్సు) 

సుఖాలల్లొ సేవ  నీతి పూలు  
నవా భ్యుద యాల వెల్గు పూలు 
సుసం గీత నాట్య  రాగ పూలు  
శశీ వెన్నె లిచ్చె  ఆశ పూలు  

గుబాళించి - జాతి - గుండె పూలు
చమత్కార - చారు -హాస  పూలు 
 సునామీగ - చేటు - చేయ పూలు  
సమారాధ - చేసె  - రమ్య పూలు   

సమాధాన -  పర్చి - శాంతి పూలు
సురక్షా ల  - వల్ల  - శోభ  పూలు  
సుహాసంతొ- సేవ - తత్వ పూలు
దయామూర్తి -రేఖ - శాఖ పూలు      

సమా నంద గాలి తెల్పె పూలు  
సదా వెల్గు పంచె సూర్య పూలు  
జలా లన్ని మంచి నీటి పూలు  
సెగా మంట నవ్వు పంచు పూలు   

--((*))--


న     జ   జ   భా  ర   స  లగ  ప్రభాకలిత -12
III  IUI   IUI   UII III  UIU  IU  
నేటి కవిత్వం - ప్రభాకలిత ..శృంగారం  
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మగువలు చెప్పు చుందురు మగసిరి మాటలే   
మనసుని మెప్పు పొందురు సొగసిరి పల్కులే 
కళలను చూపి పొందుకు తపనలు చూపులే
నగవులు చూపి అందురు  ఒకసరి  పిల్పులే 
   
కధల సహాయ మందురు ఇకపని చిందులే 
వెతల మనస్సు మార్చుము మనపని ఉందిలే 
చురుకు తనంతొ ఉండుము మగసిరి చూపులే 
బెరుకు తనంతొ దేనికి నలుపుట కైపులే 

ప్రతిభ ను చూపి ఆకలి తెలుపుట ముద్దులే 
ప్రగతి ని  తెల్పి వాకిలి తెరువుట పొందులే 
చిగురులు ఆకు తాకియు తపనలు తిర్చులే 
మలుపులు ఎన్ని ఉన్నను మగువకు తుప్తిలే 

--(())_-


III UIII  UUI  U II UIIU     "అక్షరం" 18
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ                        

పరమ పావనుని ఓజస్సు కు ప్రధమా క్షరమై  
మగువ పాలనకు యశస్సుకు ప్రణవా క్షరమై
మనసు స్థితి,లయ, బీజ మ్ముకు ప్రధమా క్షరమై,
కళలు విశ్వ లయ జ్ఞానమ్ముకు ప్రణవా క్షరమై 

నిజము తెల్పు కల సృష్టిస్థితి ,ప్రణవా క్షరమై,
మదిలొ మాయకళ ఆంతర్యము ప్రధమా క్షరమై,
సృజన జాగృతిగ జ్ఞానమ్ముయు ప్రణవా క్షరమై,
చదువు విశ్వ మయ ధర్మమ్ముగ  ప్రధమా క్షరమై,

సహజ జీవ కళ దాక్షిణ్యము ప్రణవా క్షరమై,       
సకల జీవ కల గమ్యమ్ముగ  ప్రధమా క్షరమై,
వివిధ సాహిత్యము మోక్షమ్ముగ  ప్రణవా క్షరమై, 
నిజమె సంఘటిత సాక్షముగ  ప్రధమా క్షరమై, 

--(())--


 UII III IIUUI IIII IIU .... 17 

ఈ చిలక కల వెలుగే రంగుల కథల మలుపే  
హంగుల తెలుపు వగలే పొంగులు కలసి సెగలే  
వేడి వలపు సొగసులే వేకువ పలుకుల వలే  
శోభల తలపు తెలిపే మాటలతొ చిరు నగవే

వేకువ సరయు నదికీపొంగు కడలి ఉరకలే
నంద భవ బగ తలపే స్వర్గ సుఖ కల ఒకటే
ఏకము అగుట కొరకే ప్రేమను తెలుపుటకుయే  
దీప వె లుగుల మమతా నందము శుభము కలిగే

ప్రీతి మనసు కదలికే ప్రీతి గొనుట మధురమే 
నిత్యము గొలుపు గళమే ఒక్క నిముషపు సుఖమే  
పిచ్చి మనసు తనువునే కూర్చియు వలపు తలపే 
వాంఛ ఫలితము తరుణా నంద సుమధుర కథయే

జీవిత మునకు సమ భావాల మగువకు మగడే 
సొంతమగుటకు మదనానంద సుఖముల కొరకే  
ప్రీతి కొరకు నటననే చూపియు నగువులొలికే 
హృధ్యము తపన తెలిపే శృతి పలుకులు చిలికే 

మౌనపు కిరణ వెలుగే పొద్దు తిరుగు లతలకే 
తామర లతల సెలయేరూ పరిమళము కొరకే 
కాలము కలయ వరుసే భావము తెలుపు మనసే
ఏకము అగుట ఒకటే ప్రేమను కలుపు తరుణం
--((**))--

ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో  ఛందస్సు ప్రకారంగా  వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 

III  UUI UUI IIUU UI --16 

మదికి బోధించి సద్భుధ్ధి కలిగించే జన్మ 
వినయ విశ్వాస సద్భావ మనిపించే జన్మ
కరుణ రసాత్మ కారుణ్య తలపించే జన్మ
సహజ సిధ్ధమ్ము సామాన్య మనిపించే జన్మ

వినతి పత్రాలు విద్వేషి వినిపించే జన్మ
అహము పెర్గాక ఆద్యంత కనువిప్పే జన్మ
మలిన మాధుర్య మాద్యంత మనిపించే జన్మ
వికల విశ్వాస ముపేక్ష కలిగించే జన్మ

అనెడి మిత్రుండు ఒక్కండు అనిపించుజన్మ
అది నొసంగాక ఆరోగ్య మనిపించు జన్మ
దినకరుండేను దివ్యంబు మనిపించు జన్మ
దొరకు పుణ్యంబు సత్యమ్ము అనిపించు జన్మ

కళలు మెప్పించు ఉద్యోగ మనిపించే జన్మ
కలలు తీర్చేటి తత్మాయ మనిపించే జన్మ
గుడికి వెల్లాక శాంతమ్ము అనిపించే జన్మ
బడికి పొయ్యాక కాలమ్ము కనిపించే జన్మ

ప్రకృతి నేర్పేటి పాఠాలు మనసిచ్చే జన్మ
మదన మాధుర్య మాంధవ్యమనిపించే జన్మ
సుఖము సంతోష సామర్థ్య మనిపించే జన్మ
కధలు కవ్వింపు కాఠిన్యమనిపించు జన్మ


UU IUI UUU UUU I .. 15  

గమ్యం దొరక్క తంటాల్లో కావ్యం ఉంది 
కాలం నరుక్కు పోతున్నా న్యాయం గుంది   
దేశం దళుక్కు వెల్గుతూ  గోప్యం గుంది
కార్యం దొరక్క భాద్యతే భావ్యం గుంది   

సంతోషమే సగం బలం ధర్మం అంది 
విశ్వాసమే సమం బలం భావ్యం అంది 
సాహిత్యమే కలం బలం భాష్యం అంది
సద్భావమే నిజం బలం ధ్యేయం అంది

స్నేహం ఇదే క్షేమం కోరే కాలం అంది 
కాలం ఇదే క్షామం వచ్చే  రోగం అంది 
భావం ఇదే కావ్యం తెల్పే దేశం అంది 
ఇష్టం ఇదే సాక్ష్యం కోరే  ప్రాంతం అంది  

వాణీ నినాదమ్మే విద్యా ప్రోత్సా హ్మాంది 
నిత్య ప్రభావమ్మే సంసారంమై ఉంది 
సత్యం సహాయమ్మే సంభావ్యంమై ఉంది 
ధర్మం సకాలమ్మే సంచారంమై ఉంది 

 జై భరతమాత ..జై జై భరతమాత
--(())--   


ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో  ఛందస్సు ప్రకారంగా  వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 

UIUUI UU  IIIUU IIU   ,... 14

అక్షర జ్ణాపకంతో పరవశించే హృదయం 
నిత్యమూ ఉత్తెజమ్మే కలిగి ఉండే సమయం 
వెంటనే ఉండు నీడే మమత పంచే తరుణం 
అద్దమే అర్ధ మంతా తెలుపు  నిత్య ప్రణయం 

మౌనమంతా మనోహారమగ ఉండే వినయం 
గుండెలోలాగ లోకం కదులు చుండే భ్రమరం 
ఊహలో స్వప్న లోకం పెదవి తాపం విరహం  
అక్షర జ్ఞాపకాల్లో మనసు భాష్యం   శ్రీ కరం

రమ్య మైనట్టి సోఖ్యం విరహ మంతా ప్రభవం 
శ్రావ్య మైనట్టి లౌక్యం వలపు లంతా గమనం 
స్వేచ్ఛ యైనట్టి బంధం కలలు తీర్చే వయనం 
ఇఛ్ఛ ఉన్నట్టె నిత్యం సుఖము పంచే శ్రవణం  

--(())--

ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో  ఛందస్సు ప్రకారంగా  వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 

 UI UIIU UI UIUUii IU ... 13 


మట్టి ఆటలతో మోట్టికాయలొస్తాయని  భయం
కుమ్మె ఆటలతో కూల్చి బందిచేస్తారని భయం
రెప్ప మాటలతో పిల్చి కౌగిలిస్తారని భయం
వెల్గు ఆటలతో నీడలల్లుకొస్తాయని భయం

వట్టి మాటల తో గట్టి పోరు చేస్తారని భయం
గట్టి చేష్టల తో చెడ్డ మంచి చేస్తారని భయం
వెర్రి వేషము తో తప్పు ఒప్పు చేస్తారని భయం
తిక్క పల్కులతో మార్చ లేక చస్తారని భయం

నమ్మి ఆకలితో ఉండ లేక చూస్తారని భయం
చెప్పు చేతలతో ఉండ లేక మార్తారని భయం
తప్పు లెక్కలతో చూప లేక చస్తారని భయం
ఒప్పు మాటలతో చెప్ప లేక చూస్తారని భయం

తల్లి కోరికనే  తీర్చ గల్గలేమోనని  భయం  
తండ్రి గౌరవమే కాలమంత చూడాలని భయం  
దైవ సంపదయే రక్ష చేయ లేమొనని భయం  
నిత్య సేవికగా జీవితమ్ము మారేనని భయం   

--(())-- 


UU IU UU UI UU. ...12

ఆద్యం విశ్వ తేజం ధర్మ మార్గం

మార్గం జ్ణాన గమ్యం ధర్మ సాధ్యం

సాధ్యం సృష్టి కృత్యం నిత్య సత్యం

సత్యం విశ్వ వ్యాప్తం సర్వ కృత్యం


కృత్యం జాడ్య భావం విశ్వ జాప్యం

జాప్యం వెత్కు లాటే సర్వ గోప్యం

గోప్యం బత్కు లాటే జన్యు లౌక్యం

లౌక్యం జీవు లాటే కర్మ సౌఖ్యం


సౌఖ్యం కాలకృత్యం నిత్య కృత్యం

కృత్యం జీవ లోకం తత్వ నృత్యం

నృత్యం మన్షి మాయే లౌక్య జీవం

జీవం హాయి నిత్యం మాతృమర్మం


మర్మం చెప్ప లేకే చేయు కార్యం

కార్యం దేహ ధర్మం చేయు చోడ్యం

చోడ్యం చూసి తెల్పే మాయ మోడ్యం

మోడ్యం వల్ల వేసే వేష ధైర్యం

--(())--


ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో  ఛందస్సు ప్రకారంగా  వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 

IUU  IUIU  UIUU UUUI (11) 

భవిష్యత్ ప్రణాలికా అంతరార్ధం అర్ధంకాదు
మనస్సు ప్రయాణమే కర్మభావం వ్యర్ధం కాదు
తపస్సూ దయాపరం విశ్వతత్వం అర్ధం కాదు
యశస్సు ప్రయౌజనం సమ్మోహత్వం వ్యర్ధం కాదు

మనో నేత్ర చూపులే కామితార్ధం వ్యర్ధం కాదు
సుధా భావ ధర్మమే స్నేహనీతీ అర్ధం కాదు
 సహాయమ్ము కార్యమే యుధ్ధలక్ష్యం వ్యర్ధం కాదు
కాల మార్పు పాఠమే సృష్టి ధర్మం అర్ధం కాదు

సమాధాన తీర్చినా  హావ భావం వ్యర్థం కాదు 
సకాలమ్ము సేవయూ  లక్ష్య భేదం అర్ధం కాదు
ప్రభోధమ్ము వల్లనే జీవ లక్ష్య౦ సాధ్యం కాదు   
వివాదమ్ము కాలమే తీర్చి ఉన్నా అర్ధం కాదు 

--(())_-
ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో  ఛందస్సు ప్రకారంగా  వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 
UUI  IUUU  IIU III IUIU .... (10) 

ఉద్యోగి పురస్కారం అభినందనల పరంపరం 
సందర్భ సుకార్యమ్మే పరమోన్నతపు సహాయమే  
విశ్వాస వికాసమ్మే సమయాసమయ పరంపరం
పెద్దల్కి నమస్కారం సకలోన్నతకు సహాయమే 

కుర్రాళ్ళ సహాయమ్మే సమతుల్యముతొ పరంపరం 
కుర్రాళ్ళ వినోదమ్మే మనసేమగువ సహాయమే
కుర్రాళ్ళ వికాసమ్మే  విషవాంఛలతొ పరంపరం 
కుర్రాళ్ళ  చరిత్రయే సమలంకృతయు సహాయమే 

విద్యార్థి తరించేదీ చదువే సహనపు సంపదే 
కార్యార్ధి తరించేదీ పనియే సఫలత సంపదే 
శోకార్ధి తరించేది  విషయం విపులత సంపదే 
ధర్మార్ధి తరించేది హృదయ౦ వికసిత సంపదే 


--(())--

ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక తెలుగులో  ఛందస్సు ప్రకారంగా  వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 

న  న  న  న  న  న  న  న  గ  25 /14  .... (9)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


కవత కధల కరుణ మనుసు 

సకల సమత సరళ సుమధురన్  

వినయ విపుల వివరణమును 

కవి కలము కదలిక కరుణయున్ 


తరుణి కిరణముల తలపులు  

పతి హృదయము సరసత మెరయున్ 

విరిసిన కమల కనుగవ వలపు 

నలుపు దొర విదిత విరిసెన్   


కరకమలములను గదలవలి 

కినుకు లయ మురళి మధురమున్    

సరసత  బలుకుచు నమృతమును 

సలిపెడి చెలువపు వలపులన్ 


అణువణువు అణకువ పదిలముగ    

సహనపు పలుకులు సమమున్ 

చిరునగవు చరిత కధలు తలచి 

మది పలకల హొయలు కలుగున్   


మద యువతుల రతి కలహపు  

సుమ లయల హొయల మది విరిసెన్

మదముల జయమును కను గొనిన 

మురహరుడు చిరునగ వెపుడున్ 


వదన సుమ దళముల  పిలుపు 

నవ తలపుల మలుపులు మదిలోన్ 

హృదయము సతతము కరుణయు 

సహనము తెలుపు తరుణమగున్ 


కుసుమ శర శరసమరముల

మకుటములు చలి గిలియు యనుచున్  

బిస రహ నయనముల పడచుల 

బిడియ కులుకుల చిరునగవుల్   


మిసిమిగల చనుల ఎరుపులు 

అమితముగ  కదలిక పిలుపులన్   

పస యురమున గలుగుదొరను 

ఉపకరములు వయసు బిగువుకున్ 

--(())--


ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఈ రోజునుంచి రోజుకొక ఛందస్సు ప్రకారంగా తెలుగు పద్యాన్ని వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా: పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 

UUU-III-UUU-UUI-IIU -- 8

సంసారం సగము సంభందం సమ్మోహ సమ వి 

శ్వాదిత్యా మనసు మాంగల్యం భావాత్మకముగా 

సౌందర్యం వినయ విశ్వాసం తన్మాయ మలుపే

విశ్వాసం విషయ తత్భావం ప్రాధాన్య సుఖమే    


సంధర్బం మనకు నేస్తమై శ్వశ్చత తలపే

సంకోచం వదలి సందేహా ల్లేక సమన్వ

మాధుర్యం ఇచిరు సౌఖ్యాలే కల్పించి మనసే

మందిరం కలల తీర్చుట్లో సంసార సుఖమే


బాల్యంలో మనకు సద్బుద్దే నేర్పించు కరుణా

వేదాంతం తెలిపి బోధించే పాఠాలు తెలిపే

దీ, అమ్మే మనకు విస్వాసం విజ్ఞానమును పం

చే, నాన్నే మనకు బంధంగా సంసార సుఖమే


మంచివాని తలపే ఆనందం మార్గ మెపుడూ

ధర్మాన్నీ తెలిపి సత్యయాన్ని బోధించి నవ భా

వామృతం పలుకుగా ఆధ్యా త్మికంగ గురు భో

దాంమృతం సమము చేసేదే సంసార సుఖమే


--((*))--

UIUI IIUU UUUU UUU  (7)

సామరస్య సమభావం భిన్నత్వంలో ఏకత్వం

కాలమంత శుభ తేజం కన్నాప్రేమే జీవత్వం

సామ్య వాద కళ విద్యా వృత్తీ విద్యే భావత్వం

జాతి అంత ఒక మార్గం దేశం సేవ మిత్రత్వం


సృష్టి కార్య మనుజన్మే సత్యత్వంలో సాఫ్యల్యం

జన్మ సార్ధ కత పొందీ సత్యాన్వేషై ప్రాధాన్యం

మంత్ర శాస్త్ర కధ లన్నీ నిత్యానందం వాత్సల్యం

తాను ఏమి అని ఉన్న ఆత్మానందం సత్కర్మం


వాస్త వాన్ని సహనంతో సాధ్యంగానే ప్రేమత్వం

దివ్య భావ వినయంగా ప్రాధాన్యంగా స్నేహత్వం

ధర్మ పల్కు అనునిత్యం సౌజన్యంగా సౌకర్యం

విశ్వ మాత కరుణత్వం విశ్వాసంగా ఆంతర్యం


దేశనీతి గణతంత్రం సద్భావమ్మే  హృద్యత్వం

సార్వభౌమ అధికారం ధర్మత్వమ్మే సాదృశ్యం

భారతీయు లలొజన్మా త్యాగాన్మిత్రం జన్మార్ధం

శాంతి సౌఖ్య సహజత్వం పూర్ణాపూర్ణం ప్రేమత్వం


మౌనవాక్కు  లోనే ఆశత్వంలో శుధ్ధిత్వం

స్నానమేను మనకాయం ఆరోగ్యత్వం శుధ్ధిత్వం

ధ్యానమంత  మనలోకం బుధ్ధిత్వాన్నీ శుధ్ధిత్వం

ఆత్మశుధ్ధి మనమేకం  కర్తవ్యమ్మే ధర్మార్ధం


UII UUU U UII  UUU  (6)

చల్లని సంసారం లో చక్కని సంతానం

పుత్రిక చూపుల్లో ఓ చిక్కని ఆంతర్యం

హృద్యము చిహ్నంగా ఓ చక్కని అణ్యూణ్యం

జన్మకు సౌఖ్యమ్మూనే పంచిన దాపత్యం


వెచ్చని వయ్యారంతో చిక్కని సంతాపం 
మచ్చిక మందారంతో మన్నన మాధుర్యం 
విచ్చిన పూబంతీ  తో ఆటల ఆంతర్యం 
వచ్చిన స్త్రీమూర్తీ లో చూడకు సౌందర్యం

ధర్మము దాతృత్వమ్మే మంచికి సంభావ్యం 
నిర్మల సౌలభ్య మ్మే జాతికి కైంకర్యం 
చర్మపు సౌందర్యమ్మే ఆశలొ ఆంతర్యం 
కర్మల సాదృశ్యమ్మే భౌతిక  యవ్వారం  

పద్యపు భావంగా ఓ కావ్యము శృంగారం  
గద్యపు మార్గంగా ఓ కావ్యము బంగారం 
ఉద్యమ లక్ష్యంగా ఓ కావ్యము తాత్పర్యం 
విద్యయె కార్యంగా ఓ కావ్యము విద్యార్ధం    

--(())--  

II UU UI III  UU (5) 

పరు గెత్తే వారు అగుట పక్కా

పరు వంతో ఉన్న సుఖము పక్కా

చిరు హాస్యం జీవితమున పక్కా 

సిరి ఉంటే కోపసుఖము పక్కా

కళ లన్నీ ఉండు జగతి పక్కా

సమ ధర్మం కల్గు యుగము పక్కా

వినయమ్మే ప్రేమ నొసగు పక్కా

మణి రత్నం వెల్లు కలుగు పక్కా


మదిలోనే తాప మగుట పక్కా 

అల లాగే పొంగి కదులు పక్కా 

కలి సొస్తే సృష్టి మొదలు పక్కా 

సహవాసం దృష్టి చెదురు పక్కా 




IIU IIIUI --III III UU  (4 )

హృదయం కఠినమైన ... మనసుయె  నవనీతం 

పలుకే గరుకు యైన ----  వలపుల నవరాగం 

చినుకే ఎగసి పడ్డ ---  నదులకు జలపాతం 

హిమమే కరిగి జారి ... కడలికి కమనీయం 

--(())-- 


UI UUUU IIIUI   (3)

 ఆత్మ విశ్వాసం తో అధిక మించు

న్యాయ బధ్ధంగా  నీ కళను పంచు

నిత్య తత్వం గా నీ మనసు పంచు

విశ్వ భావవ్యక్తీ కరణ వుంచు


వాస్త వమ్మే తెల్పీ వినయ ముంచు

సాహ సమ్మే చేసీ విషయ ముంచు

కాల మర్మం తెల్పీ జయము పంచు

భావ మేదైనా సహన మంచు


మార్గదర్శాకత్వం విధిగ గాంచు

ధర్మ తత్వమ్మూ  గా బతుకు గాంచు

వృద్ధి సౌందర్యం మే జీవి గాంచు

స్నేహ సౌభాతృత్వం జన్మ గాంచు

--(())--

IU  UII  UI IUI   (2) 

మనో ఊహలు గాలి పటాలు  

వినో దమ్ముగ  మాట పదాలు 

సహాయమ్ముగ సేవ బలాలు 

సమాధానముగాను  సుఖాలు 


UUU - U - UI  ... IIUU IIUI  (1 )


ఆకాశం నీ హద్దు అవకాశం వదలద్దు  .. 20    

ప్రోత్సాహం నీ వంతు .. మనసంతా గమనించు 

సౌలభ్యం నీ యుక్తి ... మనలక్ష్యం మనమాట 

కారుణ్యం నీ దీక్ష ... ఒక మాటే ఒక భార్య 


ప్రాంజలి ప్రభ సభ్యులకు మనవి ఇరోజునుంచి రోజుకొక ఛందస్సు ప్రకారంగా తెలుగు పద్యాన్ని వ్రాయగలరని కోరుతున్నాను మొదటగా ఉదా పొందు పరిచితిని . మీ ఆలోచనతో వ్రాయగలరు 



13, జనవరి 2021, బుధవారం

సుందరకాండ రెండవ " సర్గ "


మధురిమలు.. సుందరాకాండ

సురసతో సంభాషణ .. హనుమత్ లీల 


దేహ విస్త్రత మోనార్ప - సురస పెంచే దేహమ్ము

హనుమ కాయము మోనర్ప - క్షణమ్ము పెంచె దేహమ్ముు


ఇరువురిలోన  పంతమ్ము - వరబలుండు శాంతముగా

సురస పేంచే కోపమ్ము - హనుమ తెల్పె మోనముగా


దీర్ఘ జిహ్వంబు పెట్టే - సురస వికృత రూపముగా

హనుమ తెలివి చూపెట్టే -  అంగుష్టము రూపముగా


శుభగుణుడు వేగవంతుడు - శుభఘడియలొ  చేరినోడు

సురస ముఖము నుండి లేడు - సురస కోరిక తీర్చాడు


దాక్షాయణి వందనమ్ము - ప్రవేశించిత వక్త్రమ్ము

పోయివచ్చెద సమయమ్ము - అమ్మ నాకు ఆనతిమ్ము


ముఖము వీడిన సూర్యడా - సహజ దేవీ రూపుడా

నాత్మా నంద స్వరుడా - జాడు సంతస భక్తిగా


సౌమ్య వానర సత్తమా - కార్యము సిద్ధి సాగుమా

మాత సీతను చేర్చుమా - సురస మాట వినె హనుమా


అధ్భుతంబు అనె యక్షులు - పనితీరునే దేవతలు

భూతా సాధు వచణములు - సంతసం ప్రోత్సాహములు


 



సుందరకాండ రెండవ " సర్గ " మధురిమలు  (01-09)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ  

లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట చిన్న రూపముతో లంకను ప్రవేశించుట చంద్రోదయశోభా వర్ణణము ..    


త్రికూట పర్వత శిఖరము  

ఎదిరించ లేని శఖ్యము 

హనుమ ప్రస్తుత నిలయము 

రావణ లంక ప్రాంతము 


అక్కడ ఉన్న హనుమ పై 

పుష్ప వర్షము కురిసె  పై 

పుష్పా లన్నీ  హనుమ పై

అభిషేకము తో  పై పై 

 

అలసటనే పొంద లేదు 

నిట్టూర్పునె విడువ లేదు 

పరాక్రమము మార లేదు 

హనుమ శక్తి తగ్గ లేదు 


దాటు శక్తి ఉంది నాకు 

నూరుయోజనాలె అనకు 

కార్య సిద్ధి సఫల కొరకు 

కృషి సలుపు శక్తి మేరకు 


నల్లని పచ్చిక బిళ్ళ యందు 

మధ్య మధ్య పెద్ద శిలలందు 

అందమైన పర్వత ములందు 

ధైర్యశాలి చెలించే నందు 


హనుమ చూచే సరళ వృక్షములు  

పూసిన ఖర్జూ ర వృక్షములు  

మొరటి నిమ్మ కొండా మల్లెలు 

రంగుల గన్నేరు వృక్షములు 


పక్షులతో వ్యాకుల మైనవి 

పుష్పా లన్ని కదులుచున్నవి

వనములు కోనేరులు ఉన్నవి 

జల పక్షులే ఎగురు చున్నవి 


పద్మములు ఉన్న బావులు 

కలువలతొ దిగుడు బావులు 

ఎత్తిన చెట్ల తీరములు 

రమ్య మైనట్టి  వనములు 


పౌరులు విహరించు ప్రదేశాలు 

జన సంచారముండె స్థలాలు 

ఆడు కొనేటి మైదానాలు 

చూసే లంక సౌందర్యాలు 

--(())--

సుందరకాండ రెండవ " సర్గ " సమ్మోహాలు   (11-20)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ  

లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట చిన్న రూపముతో లంకను ప్రవేశించుట చంద్రోదయశోభా వర్ణణము ..    

ప్రయోజనం ఉండదు 

ఉన్న యుద్ద ముండదు 

యుండదు దేవతలున్న గెలవరు ఈశ్వరా 


రాముడు ఏమి చేయు

చేయు యద్ద మేమియు 

మేమియు ఉండబోదు లంకలో ఈశ్వరా  

 

ఇక్కడ సామమ్మే

సామము భేధమ్మే 

భేదము ఇక్కడ వలదు దండము ఈశ్వరా 

 

సుగ్రీవుడు  నీలుడు 

నీలుడూ అంగదుడు

అంగదుడు నేను రాగలములే ఈశ్వరా


సీత యే ఉన్నదో

ఉన్నట్టే ఉందో 

ఉందో లేదో తెలుసు కొనాలి ఈశ్వరా


ఈ రాపము వద్దూ 

వద్దు కోప మొద్దూ 

మొద్దూ రక్కసులను గెలవాలి ఈశ్వరా 

  

ఉగ్రమై తేజస్సు 

తేజస్సు యే ఉషస్సు 

ఉషస్సు కూడ మోసమ్ము గనే ఈశ్వరా


చిన్న రూపము తోను 

నేనే మారు తాను  

నేను లంకలో ప్రవే శిస్తాను ఈశ్వరా 

 

కర్తవ్య నిశ్చయం 

నిశ్చమ్ము గ లక్ష్యం 

లక్ష్యం సాధించాలి ఇప్పుడు ఈశ్వరా 


రాత్రి యందును నేను 

నేనే  లంక లోను

లంకలోను సీతను వెదికెదను ఈశ్వరా 

  

--(())-
సుందరకాండ రెండవ " సర్గ " సమ్మోహనాలు (21-30)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ

ప్రయోజనం ఉండదు
ఉన్న యుద్ద ముండదు
యుండదు దేవతలున్న గెలవరు ఈశ్వరా

రాముడు ఏమి చేయు
చేయు యద్ద మేమియు
మేమియు ఉండబోదు లంకలో ఈశ్వరా

ఇక్కడ సామమ్మే
సామము భేధమ్మే
భేదము ఇక్కడ వలదు దండము ఈశ్వరా

సుగ్రీవుడు నీలుడు
నీలుడూ అంగదుడు
అంగదుడు నేను రాగలములే ఈశ్వరా

సీత యే ఉన్నదో
ఉన్నట్టే ఉందో
ఉందో లేదో తెలుసు కొనాలి ఈశ్వరా

ఈ రాపము వద్దూ
వద్దు కోప మొద్దూ
మొద్దూ రక్కసులను గెలవాలి ఈశ్వరా

ఉగ్రమై తేజస్సు
తేజస్సు యే ఉషస్సు
ఉషస్సు కూడ మోసమ్ము గనే ఈశ్వరా

చిన్న రూపము తోను
నేనే మారు తాను
నేను లంకలో ప్రవే శిస్తాను ఈశ్వరా

కర్తవ్య నిశ్చయం
నిశ్చమ్ము గ లక్ష్యం
లక్ష్యం సాధించాలి ఇప్పుడు ఈశ్వరా

రాత్రి యందును నేను
నేనే లంక లోను
లంకలోను సీతను వెదికెదను ఈశ్వరా

--(())-- 

సుందరకాండ రెండవ " సర్గ " సమ్మోహాలు   (31-40)

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ  


కనబడీ కనబడక  
కనబడక నడవడిక 
నడవడిక చిన్న రూపం తోనె ఈశ్వరా 

దేవత అసుర కాని 
కాని శక్యము కాని 
కాని లంక కర్తవ్య కష్టము ఈశ్వరా   

మాటి మాటికి ఎట్లు 
ఎట్లు జయమే ఎట్లు
ఎట్లు అని ఆలోచించె హనుమ ఈశ్వరా 
  
రావణాసుని ఎదురు 
ఎదురు పడుటే ఎదురు 
ఎదురు గా సీత చూచు కష్టము ఈశ్వరా 
 
సీత యే విధముగాను 
విధము కష్టము యగును 
కష్టమగు ఒంటరిగా వెతుకుట ఈశ్వరా 

ఉదయించాక నళిని 
నళిని మారు స్థితిని
స్థితి స్థిర చిత్తము ఉండాలి ఈశ్వరా

లాభ నష్టపు బుద్ధి 
బుద్ధి సక్రమ బుద్ధి 
బుద్ధి నిశ్చయ మవ్వుట కష్టం ఈశ్వరా 
 
రాక్షసులు చూసినను 
చూసిన కష్ట మగును 
కష్టముతొ రామకార్య౦ చెడును ఈశ్వరా 
 
గాలి కూడ చేరని 
చేరని ప్రాంతమని  
ప్రాంతమెళ్లిన వెతుకుట కష్టము ఈశ్వరా 

రూపము తో ఇక్కడ 
ఇక్కడ వెతుకెక్కడ 
వెతికినను రామకార్యము చెడును ఈశ్వరా 
    
--(())--