మధురిమలు .. వేదం (245.. 253)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పరుల పై నింద పాపం
తలచుతే మహాపాపం
కరుణ పై విశ్వ వేదం
ఆచరణ లేక సూన్యం
కథల పై కొత్త బంధం
కాగితాలకె పరిమితం
కళల పై నిత్య వైనం
మనసు యందు నైవైద్యం
తగదు ఎన్నటికి కోపం
కోపం తొ పెరుగు తాపం
వినుము ఎప్పటికి గానం
గళం మనసు ఉల్లాసం
కనుము ఇప్పటికి చిత్రం
చిత్రాల్లోను విచిత్రం
మనసు మౌనముతొ జీవం
లేక గాంధర్వ రాగం
జీవితాని కది శాపం
మనసు చేఇంచు పాపం
కాలమాయయిది శాపం
ధైర్యముయే పోతె నిజం
మేరుపర్వతపు మార్గం
సందేహాల తో సమయం
దారి చూపునది శాంతం
శాంతమె ఙివిత సౌఖ్యం
తెలియ కుండుటే లోపం
తెలిసినా కాని వైపం
నమ్మకమ్ముగాను మనం
మనసు తెలిపే జీవితం
మనసు వెంబడె మధనం
పలుకు పల్కులొ మైధునం
మనసు మౌనమే విజయం
విజయంతోను అపజయం
మధురిమలు .. మూర్తి (235.. 244)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాతృగర్భ మాతృ మూర్తి
మమకారంతో చూపును
తరగని తలపులతొ మూర్తి
సంతోషమునే పంచును
తరంగాలవలెను మూర్తి
నవ నూతన హేల తోను
పురిటి నొప్పులలో మూర్తి
ప్రసవ వేదన భరించును
బిగువున బంధించి మూర్తి
తన తనువంత నొప్పులను
మనసు తల్లడిల్లె మూర్తి
తన మనస్సులొ నిప్పులను
సర్వం ధారపోసె మూర్తి
కుంపటి పై మూర్చిల్లెను
భాదా సంతోష మూర్తి
ప్రేమ సమ్మిళిత మ్మనెను
సమ్మేళన సమయ మూర్తి
తన చుట్టూ ఏమున్నను
ఎవరున్నా లోక మూర్తి
తెలియని స్థితిలొ ఉండును
హృదయమ్ము పంచే మూర్తి
కదిలిక కన్న పిల్లకును
వ్యధ భరిత చరిత మూర్తి
హీన స్థితిలో ఉండును
తనలోకంలో న మూర్తి,
అనుభూతుల్ని పంచేెను
దుఃఖాతి శయాలమూర్తి
సంతోషానందాల ను
నవ శిశువుకు మాతృ మూర్తి
నూతన ఉషోదయమ్మును
రాగం వినిపిస్తూ మూర్తి
పంచూ వెలుగు లన్నియును
సంధ్యా పొద్దులో మూర్తి
ఉదయభాను సహనమును
వెచ్చని కిరణాల మూర్తి
నవ ఉషోదయ రాగమున
ఈ లోక అందము మూర్తి
పంచే సుఖదుఃఖాలను
సర్వ బంధ జన్మ మూర్తి
ఓర్పు ఓదార్పు పంచేను
--(())--
మధురిమలు . .. బుద్ధి (221--234)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పొయ్యే తెల్వి రావచ్చు
ఉండే తెల్వి పోవచ్చు
మధ్యే తెల్వి నల్గొచ్చు
దైవం తీర్పు అవ్వచ్చు
కాలం నీది కావొచ్చు
ప్రేమా నీవు పొందొచ్చు
సేవా చేసి ఉండొచ్చు
దైవం నీవు అవ్వచ్చు
ఘర్షణ లేక పోవచ్చు
వజేత కాక పోవచ్చు
జయమ్ము లేక పోవచ్చు
దైవం ఆదు కోవచ్చు
శబ్దం నాద మవ్వచ్చు
పుడమియె వికసించ వచ్చు
సంకల్ప బల మవ్వచ్చు
ధైర్యం తోడు ఉండొచ్చు
మనసును మూయ చేరొచ్చు
మూలన నిను పెట్ట వచ్చు
మమతలన్నీ మరవ వచ్చు
మమకారం వదల వచ్చు
మనసులు కలుపుకో వచ్చు
మనసును దోచు కొనవచ్చు
మూటను తీసు కోవచ్చు
మళ్ళి వెనుకకు రావచ్చు
కంటికి విందు కావచ్చు
మనిషిని నమ్మి బతకొచ్చు
మంచిని పంచి బతకొచ్చు
మౌనంగా కూర్చొ వచ్చు
మూగగా నటించ వచ్చు
మాటలు వినకుండ వచ్చు
మత్తులొ తూగ కుండొచ్చు
మాట లన్ని పంచ వచ్చు
కళ్లు కనపడకుండొచ్చు
కన్నీరునే కార్చొచ్చు
కలలను కల్ల లవ్వచ్చు
కరుణను చూపకుండొచ్చు
కలసి ముందుకు సాగచ్చు
పరిచయాన్ని మరవ వచ్చు
ప్రేమే తెంచుకోవచ్చు
పెళ్ళికి ఒప్పు కోవచ్చు
పరితాపం గడప వచ్చు
పరిస్కారం తెలపొచ్చు
సమయం ఇవ్వ మనవచ్చు
సత్యం తెలుసుకోవచ్చు
సంజయషీ వినిన వచ్చు
సమాధానం చెప్పొచ్చు
సంధి చేసు కొనుట మెచ్చు
ఉంటే చాల నియు వచ్చు
ఓటమిని ఒప్పుకో వచ్చు
అనుభవమ్ము పెరగవచ్చు
గెలుపుమాట నిదవ్వచ్చు
బాధ్యత గుర్తు అవ్వచ్చు
--(())--
మధురిమలు . .. ఇదా దేశం (211-220)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మధుర జ్ఞాపకములు యే
చేదుగ అనుభవమ్ము యే
నాలో సైతం.కధ యే
వెంటాడే చీకటియే
మనో విహార కథలు యే
మమతల ఆర్భాటముయే
ఇది నోరుపై పోటుయే
సకలము పొందు బాధయే
తెగిన గాలిపటాలు యే
జీవితం అఘాదం యే
అధర్మ గీతం ఇది యే
భవిష్యత్ సూన్యము యే
ఇది రగిలే కుంపటి యే
హృదయమునకు దెబ్బలు యే
గ్రహసంచార మాగుట యే
సంపదకు ఇక గండి యే
కరకు కత్తులు వేట యే
ఇటు కబళించే ఆట యే
మల్లెల మత్తు బాట యే
దారంతో బంధీ యే
ఇదియు బందిఖానా యే
చీకటి వెలుగు బతుకు యే
స్వేచ్ఛ బతుకు కాఁదు యే
దారంతొ బంధమ్ము యే .
హృదయమ్ము కఠిన శిల యే
మనసు లేని మల్లెలు యే
మాట కరకు యుండుట యే
చేత కాని ఋషు లాయే
ముడిపడిన ఎదగదుల యే
ముప్పెరిగన ఊసులు యే
కలిసినా హృదయాలు యే
కవ్వించగ కాంక్షలు యే
అసామాన్య జ్ఞానము యే
విద్య నిధి అక్షయము యే
ఏమి లేని సంఘము యే
నిర్గు ణా సంపద యే
కలలు నిజము కానిది యే
కళల చెలిమి లేనిది యే
బతుకు బాట బాధలు యే
మాతృ మూర్తి దేశము యే
--(())--
మధురిమలు ..వినయంగా (201-210)
విత్తులు వినయంగా
నిత్యము ఎదగంగా
చెట్టు సంభ్రమంగా
పుడమిన మెలకువగా
మోడే మౌనంగా
ప్రేమను పంచంగా
ఉసురుయు మురిపెంగా,
సకలమ్ము సమంగా
పసరును పరువంగా
కడనే కలశంగా
కళలే పండ0గా
కలపండె నిజంగా
రగడ ఒక నిజంగా
మనుగడయు నిజంగా,
పోకడ అంత కలగా
జీవితము రక్షగా
ఉద్భవ ఉచ్యంగా
ప్రాభవ ప్రాజ్ఞతగా,
ప్రకృతియు ఆకృతిగా
ప్రాణ్ముక్తం భక్తిగా
నిజమయు భ్రమణంగా
జీవం వర్తులంగా
జయం జీవమ్ముగా
సూర్యం ఉదయం గా
ఊరినే కన్నీళ్ళు గా
కాళ్ళ దాకా చేరగా
గుండె మారిన జావగా
మనసు ఘనీభవించగా
జ్ఞాపకాలే కుప్పగా .
మమకారపు తడిగా
పచ్చిగానే వెచ్చగా
ప్రతి రోజూ పండగా
మనసున మిన్నుమెరవగా
నిత్యము జగతి జయముగా
తృప్తిగ మన్ను మిగలగా
వెలుగు లన్నియు వ్యాప్తిగా
పకృతిన పరమావిధిగా
ఓర్పు నేర్పుయు బతుకుగా
కళ ప్రణమామ్యహం గా
నిత్యము పరంజ్యోతిగా
--(())--
మధురిమలు ..ఆకలి (191-200)
నేను అనెడి అహం వదులు
లేకపోతే నాశనము
నీవు అధైర్యము వదులు
ఆకలి నుండి జయించుము
ఆకలి అన్న వాడికే
అన్నము పెట్టుట మంచిది
ఆశ ఉన్నా వాడికే
దాహం తీర్చుట మంచిది
నాన్న సంపాదించినా
అపరాలు దొరుకునే
అమ్మా వంటచేసినా
మనలొ ఆకలి తీరునే
సేవ చేయుటకే ఓర్పు
ఉండాలి మంచి మనసే
మదిని గెలపులకే నేర్పు
అది అసలు అకలి వయసే
నడకను నేర్పేది తండ్రి
సహనము పంచేది తల్లి
వంశాన్ని తెల్పను తండ్రి
ఆకలి తీర్చేది తల్లి
కలహాల కాపుర మోద్దు
అది ఎపుడూ అనర్థమే
సంతస కుటుంబము ముద్దు
ఆకలి యె ఆనందమే
మంచి మాటలు పల్కాలి
తీపి గుర్తులు కావాలి
తేడా మార్పు వెతకాలి
మనసు ఆకలి తెలపాలి
గగనంకు హద్దులు లేవు
కోరికకు లేవు హద్దులు
జీతం కు పద్దులు లేవు
ఆకలి తీర్చు కోరికలు.
అమ్మ అనురాగం తోను
నాన్న ఆత్మీయత తోను
అక్క అభిమానం తోను
అన్న అనకువ కళ తోను
స్నేహం విలువ తెలుసుకొని
మానవత్వం పెంచుకొని
మంచితనమే పంచుకొని
పంచు జీవీతాకలిని
వేదన తో ఓదార్పుంచు
రోధన నీలొనే మార్పు
శోదనతోనె నా నేర్పు
ఆకలి సాధనకు ఓర్పు
--(())--
మధురిమల .. గెలుపు (181-190)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనిషికి ఉండాలి గెలుపు
తెచ్చే మనిషిలో మలుపు
చదువు సంధ్యతోను గెలుపు
ప్రతి ఒక్కరిలోను మలుపు
సమయానికి పనికొచ్చే
మనిషి విలువే గుర్తించు
ఆరోగ్యమునే ఇచ్చే
తల్లి గెలుపు గుర్తించు
కష్టాల్లో అధైర్యము
బాధల్లో బంధుత్వమె
నష్టాల్లొ అప నమ్మకము
లేకపోతె గెలుపు ఖాయమె
సూర్య కాంతి అద్భుతమగు
యోగ చైతన్యము పెరుగు
మనసుయే అభ్యుదయమగు .
మనకు గెలుపే సాధ్యమగు
మనలొ ఉన్న ప్రాణశక్తి
బలమును కూర్చుకొను యుక్తి
ఇరువురి మధ్య గల రక్తి
గెలుపు దిశగ కలిగు ముక్తి
ఊర్ద్వముఖంగా పయనము
కల్గించు దివ్య తేజము
మనిషికి ఇది ఒక మార్గము
మార్గాన గెలుపు సాధ్యము
మన బుద్ధి ప్రచోదనము
గావించుటయే సత్యము .
మనస్సుకు ప్రక్షాళనము
అదియే గెలుపు స్వభావము
కాంతి కిరణ మిస్తరించు
అశుభములన్నియు హరించు
అవి మనిషికి సహకరించు
గెలుపే సాధ్య మనిపించు
హృదయములోన దేవమ్ము
అందరి లోను ధైర్యమ్ము
ఎదురులేని మోహమ్ము
గెలిపించు విశ్వాసమ్ము
నిస్వార్థ పరత లక్ష్యము
మనుషుల్లో నిత్య జపము
తల్లితండ్రులో సహనము
సహకారం గెలుపు మయము
--(())--
మధురిమలు..నా..భావము (171-180)
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
గళం విప్పి చెప్ప లేను
ఆక్రో సంతొ ఉండి నాను
కలం రాతి రాయ లేను
ఆవేశము వదల లేను
పెద్ద లెవరొ చెప్ప లేను
మోద్దు లెవరొ ఎంచ లేను
తప్పు తప్పు గా అనలేను
బాధ తోనె బతుకు తాను
బానిస గాను ఉన్నాను
గ్రహచారమని నమ్మాను
దైవ కృప కొర కున్నా ను
కులం కోసము బతికాను
తెల్ల కాగిత మయ్యాను
మంచి చెడ్డను వ్రాసాను
మంచి మనించమన్నాను
చెడ్డను చింపమన్నాను
ఊహల కదలికల లోను
ఉయ్యాల ఊగు జగాను
నరజన్మ సార్ధ కమ్మును
నిజ మార్గ సంసారమును
ఇలా నువ్వు హృధ్యమ్మును
అలా నేను హింసించను
కాల మాయకు చిక్కాను
ఇల యేల తప్ప దంటిను
కల్తీయను కడలిలోను
బతుకు నావలు సాగేను
వ్యాపారపు గాలివాను
ఆ పడవను నడపగలను
అటు ఉండు అనియున్నాను
ఇటే రమ్మని పిలిచాను
మనమే ఒకటే అంటిను
జీవితంలొ మధురమ్మును
**(())**
మధురిమలు .. వాకిళ్ళు అంగళ్ళు లోగిళ్ళు
ఒకనాటి వేశ్యల స్థితి (161-170)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కష్టమోస్తే కన్నీళ్ళు
దాహమైతే ఎక్కిళ్ళు
తెరచి ఉంచే వాకిళ్ళు
ఆదుకొనేటి అంగళ్ళు
జిలుగు వన్నె రుమాళ్ళు
చెవులు మత్యపు జోళ్ళు
వెగటైన వడదోళ్ళు
ఉండే ఆట గాళ్ళు
వార కాంతల యిళ్ళు
వచ్చు రాచ కొమాళ్ళు
నారీమణుల పెళ్ళు
అబ్బే నారి కేళ్ళు ... క
వాసించు వటివేళ్ళు
వారిజాక్షి నగుళ్ళు
పూజలకు దేవుళ్ళు
నిత్య ము తలచు గుళ్ళు
శృంగార సావళ్ళు
బంగారు మెడసూళ్ళు
నిగ్యైన మద్దెళ్ళు
మోహపు నేర్పు గాళ్ళు
మధ్యన యిద్దరాళ్ళు
విసిరారు సవాళ్ళు
మాట తెలపని వళ్ళు
మనసు దోచే కళ్ళు .... క
వచ్చే నీటుగాళ్ళు
కనికరమైన కళ్ళు
కదిలించేను కాళ్ళు
వంచారు మోకాళ్ళు
వెంటే కేటు గాళ్ళు
చేయు గుల్లగ వొళ్ళు
వరుస లేని వాళ్ళు
గుళ్ళ చేసె వాళ్ళు
అందమైన వాళ్ళు
మనసు దోచు వాళ్ళు
ముత్తు చేయు వాళ్ళు
ముద్దు పెంచు వాళ్ళు
గాలి నిచ్చు వాళ్ళు
చిత్తు చేయు వాళ్ళు
రెక్క చూపు వాళ్ళు
లెక్క చెప్పే వొళ్ళు
కష్టమోస్తే కన్నీళ్ళు
దాహమైతే ఎక్కిళ్ళు
తెరచి ఉంచే వాకిళ్ళు
ఆదుకొనేటి లోగిళ్ళు
--(())--
మధురిమల... చలి....గిలి..చెలి (151--160)
చిలిపి తనంలో చెలి
గిలిగింత పెట్టు చలి
మనసును దోచే చెలి
మత్తులో ఉంచు చలి
తోడుగ ఉండే గిలి
అర్ధాంగి చెప్పు చలి
తనువు స్పర్శకి గిలి
నెత్తురు కరిగే చలి
సొగసరి వలపే గిలి
గడసరి చూపే చలి
మగసిరి కోరే చెలి
ముగ్ద మనోహరి గలి
వంటరిగ ఉంటె గిలి
తోడు కోసమే చలి
హధ్ధల్లో ఉంచె గిలి
తలపు తెరిపించు చలి
నవయవ్వనమ్ము గిలి
సుకుమార మధువు చలి
చేతులు చుట్టే గిలి
మందార మేను చలి
భూమి పైన మనిషి బాధ్యత బతుకుతో
నిత్య యవ్వనమ్ము నీడ ఉంచు
జ్ణాన వాక్కు పంచి జాగృతి కలిగియు
జన్మసార్ధ కమ్ము జగతి యందు
ఉదయ భానుడు వచ్చె ఉజ్వల కాంతి గా ,
సర్వ హృదయ మందు సీమ యం దె,
చంద్రు డొచ్చు రాత్రి చల్లగా మెల్లగా,
హాయి గొలుపు శాంతి హృదయ మందు
--(())_-
మధురిమలు (141-150)
ప్రాంజలి ప్రభ ను ఆదరించే ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు
నమస్సుమాంజలితో
మది అక్షరాంజలీ
ప్రాంజలీ మనసుతో
మమత పుష్పాంజలీ
శబ్దా తరంగాంజలీ
కృష్ణా తరంగాంజలీ
పావన తరంగాంజలీ
మనిషి కి మంత్రాంజలీ....తంధానతాన తానతందాన
లబ్ధీ తరంగాంజలీ
ఉష్ణా తరంగాంజలీ
మధురా తరంగాంజలీ
మమతల మంత్రాంజలీ
శ్రీరామ నామాంజలీ
మరువాం మరువాము మేము
గోవింద నామాంజలీ
గొలుతాం గొలుతాము మేము తంధానతాన తందాన
దేవతలకు ప్రాంజలీ
కోరే కోరుతాం మేము
విష్ణు కధలతొ ప్రాంజలీ
వింటాము వింటాము మేము
ప్రేమతో ప్రేమాంజలీ
సారాం సారాంగమేము
పష్పాం పుష్పాంజలీ
నమ్మాం నమ్మాము మేము తంధాన తాన తంధాన
భక్తియే మౌక్షాంజలీ
మరువము మరువమూ మేము
కాలమే మధురాంజలీ
కలసే ఉంటాము మేము
పుడమికే సేవాంజలీ
మానము మానము మేము
సంతృప్తి తో అంజలీ
ఘటించి ఉందాం మేము ..తందాన తాన తంధాన
**(())**
మధురిమలు ... మనసు (131--140)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సర్వ ఆరోగ్య కరమై
సుఖ సంతోషం కొరకై
ధర్మార్ధ బోధ పరమై
జన్మ పరిపక్య కొరకై
సమిష్టి స్సహ కారమై
అర్ధ అర్ధాంగి కొరకై
ప్రేమ సంతృప్తి పరమై
దేశ లక్ష్యము కొరకై
ప్రేమ తోను పరిచయమై
మేలు చేయు స్నేహముకై
బంద0 తోను భాగ్యమై
ఆరోగ్య కాపురముకై
ఒకరికి కొకరు ఏకమై
హితమైన మాట కొరకై
సహనము చూపి ఏకమై
మేలు చేయు పనికొరకై
నిత్య ప్రోత్సాహ పరమై
నిత్య వృద్ధిగా కళలకై
సత్యపలుకుతో సుఖమై
సమస్య తీర్పుల కొరకై
గతం చేసిన పుణ్యమై
జీవితంలొ సుఖములకై
సుఖాలతొ సంతోషమై
ఙివిత మలుపు కధలకై
ఆడదాని పై మొహమై
మగాడి మచ్చిక కొరకై
మమతల చెక్కిలి మయమై
మనస్సు ఇఛ్ఛా కొరకై
తనని తాను గా పర్వతమై
సకలమ్ము భరించుటకై
పర్వతంపై పచ్చదనమై
నిత్య మాకలి తీర్చుటకై
చీకటి మనసుకు సుఖమై
మెరసే వెన్నెల తళుకై
వలపుల వాన హ్రదయమై
పెదాలపైనను చినుకై
హృదయము రసజ్వలితమై
వికసించె పువ్వు పొందుకై
జ్వలితం మనిషి దాహమై
ఆకలి పొందుట ముద్దుకై
మధురిమలు (121--130)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సరిగమ ల గానమే
సంసారికి సహనము
ఆనంద గీతమే
అందరిలో సహనము
సుందర స్వప్నమే
ఆనందాల మయము
సంతోష గానమే
మాధుర్యమ్ము తత్త్వము
చిరుహాస జీవితము
నిత్యమూ యవ్వనము
యవ్వనాల సహనము
బిడ్డలే సంతసము
అనుక్షణము పాఠము
పాఠము జీవితాశయము
పలుకులో ఉంది వేదము
వేదమే జీవి సమరము
తొలగిం చాలి భయము
శ్రమయే నిరంతరము
చేయకూ అపాయము
చేరకు కల వలయము
నగవు చిద్విలాసము
కన్నుల శృంగారము
మొఖిక సౌందర్యము
మదిలో మాధుర్యము
మంచికి నియంత్రణము
చెడుకు ప్రభంజనము
గ్రహించు ఏది మనము
ఉంచాలి నిగ్రహము
ఆదరణ సద్గుణము
ఆత్మీయత అభయము
మనిషి ఔదార్యము
త్వజించుము దుర్గుణము
మనిషికుండు విజ్ఞానము
మారుచుండు అజ్ఞానము
బోధ అగును అనుక్షణము
మంచి చెడుల వ్యత్యాసము
దేన్నైనా నేర్చుకొనుము
నేర్చుకున్నదే పంచుము
పంచుటలో సంతోషము
సంతోషము సగము బలము
--(())--
మధురిమలు .. భద్రతే (111-- 120)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనసు మంచిదైతే
మనుగడకు భద్రతే
నడక మంచి దైతే
నడవడిక భద్రతే
కలలు నీకు నిజమయితే
కలలకు లేదు భద్రతే
కథలు వ్రాయు బతుకైతే
కలల బతుకుకు భద్రతే
కష్ట ఫలం లేకపోతే
శ్రమఫలము భద్రతే
నిత్య భుక్తి నష్ట మైతే
ఓర్పు ఫలించు భద్రతే
కాల మెపుడూ నీదైతే
చేసే పనికి భద్రతే
కాలమాయకు చిక్కితే
మంచికుండదు భద్రతే
బంగారు కళ నీదైతే
నెల తల్లికి భద్రతే
కనకాభిషేక మయితే
సంక్రాంతికి భద్రతే
ఆనందం సొంతమైతే
అవకాశమ్ము భద్రతే
అన్నదాత నీవైతే
అవని కాంతి భద్రతే
నిరాశ ఆవహించితే
బ్రాంతి తొలగితె భద్రతే
రైతే రాజు అయ్యితే
ఆహారం భద్రతే
సర్దుబాటు నీదైతే
జీవితానికి భద్రతే
అహంకారం నీదైతే
మనసు కుండదు భద్రతే
తండ్రిని గౌరవించితే
జీవితమంత భద్రతే
తల్లిపై ప్రేముంచితే
ఆహారముకి భద్రతే
నమ్మక బతుకు నీదైతే
భార్య పిల్లల భద్రతే
దేవుని పైన భక్తైతే
నిత్య సుఖముకు భద్రతే
--(())--
మధురిమలు .. సంక్రాతి మగువలు (101--110)
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సంక్రాంతికి సంబరాలు
హరిదాసు తో కీర్తనలు
సంక్రాతి పెద్ద ముగ్గులు
రుచులొప్పు పిండివంటలు
అవని కందమిచ్చు తరులు
సహజ మంత తెల్పు కలలు
పరువ మంత పంచు కళలు
పరువు తీయ నట్టి సిరుల
తరుల కంద మిచ్చు విరులు
విషయ వాంఛ పొందు కళలు
సమయ తీర్పు కాల విధులు
తరుణి తీర్చు తరుణ నిధులు
తరుణి కందమిచ్చు కురులు
మగువ కంద మిచ్చు కనులు
తెగువ చూపు చుండు తిధులు
మనసు విప్పి తెల్పు సెగలు
గృహానందమిచ్చు సిరులు
విశ్వాసమ్ము చూపు కళలు
సమ్మోహమ్ము చేయు నగలు
ధర్మార్ధమ్ము తెలుపు పగలు
సర్దుబాటు జీవి తాలు
మోక్ష మిచ్చు జీవితాలు
అహంకార జీవి తాలు
అంధకార జీవి తాలు
కన్నవారి తీర్చు కలలు
మమతలతో కోరు మేలు
అలుసు చూసి నడుచు కతలు
ఇంటి లోనే దేవతలు
నిత్య వంట సంబరాలు
ఆశతొ అలంకారాలు
మసి అయ్యేవి కోపాలు
విధి యాడే నాటకాలు
మసిచేస్తున్నవి ఊహలు
కసిపెంచే తాపసిగలు
మరిపించే మగువ వగలు
కలుపుతున్నవి బంధాలు
చిరకాలం మార్పు తెరలు
కలకాల మమకారాలు
చిరుహాస శృంగారాలు
మహిళ అహంకారాలు
--(())--
మధురిమలు (90-100)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విధ్యే నేర్చు కొననిచో
పనులే తేలిక అందురు
విద్య లేక బతికినచో
ప్రశ్న గానే మిగిలెదరు
మనస్సు తెలిసు కొననిచో
కష్టములు తెచ్చుకొందురు
అర్ధం విలువ తెలియనిచో
కష్టనష్టాలు పాలవదురు
కళలను గుర్తించనిచో
దేశవృధ్ధి లేదందురు
మంచిని గర్తించనచో
చెడువెంటె ఉండి పోదురు
కాలము బట్టి ఉన్నచో
సకాలసుఖము పొందెదరు
తప్పు చేసి నడచినచో
నిద్రసుఖమ్ము లేదందురు
అహం చూపించినచో
దూరమవుదురు అందరు
నీ ప్రేమ పంచినచో
నీ తోడుగా ఉందురు
అనురాగం పొందినచో
శుభశోభకు లోనగుదురు
అనుబంధాలు ఉన్నచో
తగవులు లేక బతికెదరు
సమస్య తీర్చ లేనిచో
మనషికి లొంగి పోవుదురు
సమస్య తీర్చి ఉన్నచో
మనిషిగా కోలు కొందురు
తగాదాలు వచ్చినచో
ధనమ్ము కొరకే అందురు
తీపి జ్ణాపకాలున్నచో
బతుకు సాగించు కొందురు
కళ్ళు కళ్ళు కలిసినచో
ప్రేమే పండిందందురు
నింగి నేల కలసినచో
సృష్టికే మూల మందురు
--(())--
మధురిమలు...సృష్టి (81- 90)
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నీవు నాకు దాహంగా
నేను నీకు లోకంగా
నడుము నియమ బద్ధంగా
జీవితం ఏకాంతముగా
కావ్య సృష్టి కర్తగా
కర్మ కావ్య కృషిగా
క్రియ కావ్య దృతిగా
గాలి శ్వాస భృతిగా
గమనం జగతి స్థితిగా
గమ్యం భవిష్య దిశగా
న్యాయం మేథా కళగా
ధర్మం ఇక దీపంగా .....
రామ ధ్యాన లోకంగా
రాగ యుక్తి భావంగా
నిత్యవెలుగు జ్యోతిగా
ఇది సంక్రాంతి పండుగా .... నీవు
విత్తు విశ్వోదయంగా
చెట్టు సర్వోన్నతంగా
పండు సర్వాధికారాలు గా
ఆకు కాయ ఆహారంగా
పాదం పుణ్య పీఠంగా
హృదయం ధన్య రూపంగా
దీపం జ్యోతిర్మయి గా
దేహం సర్వోన్నత మయంగా
కవిత్వం బావమ్ము గా
న్యాయము నాట్యమ్ముగా
వ్యక్తిత్వమ్ము వినయంగా
బాధ్యత బాహ్యత్వంగా ...... నీవు
అర్ధమ్ము శక్తిత్వం గా
వ్యర్ధము కర్మత్వం గా
మూర్ఖము అజ్ణానం గా
ఆంతర్య మాత్మీయం గా
భోగము కారుణ్యం గా
భాగ్యము ఆనందంగా
శ్రేయ ము శ్రావ్యమ్ముగా
జీవన సౌభాగ్యం గా
ముంగిలి భవిష్యత్తు గా
ముత్తైదు సౌభాగ్యం గా
మగాడి ఔదార్యం గా
తల్లి ప్రేమామృతంగా ... నీవు
--(())--
జాతీయ యువదినోత్సవ సందర్భంగా శ్రీ రామడు తెలీపె హనుమకు ఈశ్వరా
మధురిమలు (71-80)
యువతరం శివమెత్తాలి
యువజన గళం కావాలి
లోకమంతా మారాలి
చీకటంతా పోవాలి
తప్పుడుమాట తొలగాలి
అవసరం తో మారాలి
జాగర్తె బతుకవ్వాలి
విద్యఉపాధి అవ్వాలి
జన నాడుల్లొ కలవాలి
నవ చైతన్య మవ్వాలి
తూర్పు తేజ మవ్వాలి
శ్వాసనే అందించాలి
స్వయం కృషితొ మెలగాలి
విజయ పథంతొ కదలాలి
సొంత లాభం మానాలి
సేవా పథం నడవాలి
యువతకు స్పూర్తి కావాలి
నవతకు నాంది అవ్వాలి
మన భవిష్యత్ మారాలి
బంగరు బాట అవ్వాలి
బాణం లాగ కదలాలి
ఓర్పుతో మనముండాలి
మనసున మనసు కరగాలి
యవతీ యవకులుండాలి
నలుగురి మధ్య నడవాలి
నలుగురితోను బతకాలి
ముందుగ దాత లవ్వాలి
ప్రేమ పంచే బతకాలి
తీరం తళుక్కు మనాలి
వెలుగులే.విరజిమ్మాలి
తోకచుక్కల్ల మెరవాలి
సంక్రాంతి శోభవ్వాలి
బతుకు కధలను రాయాలి
ఇక బానిసలు తొలగాలి
నగవులు వెలుగుతుండాలి
నలుగురు కలుసు కోవాలి
బ్రతుకు కళలే పండాలి
పండుగ లాగ జరగాలి
మనసున మంచిగుండాలి
బతుకుకే తోడవ్వాలి
--(())--
మధురిమల ... తల్లి (61 -70 )
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మురిసిందే కన్న తల్లి
బంధమ్ముతొ మమత లల్లె
కడవరకు చూచే తల్లి
కరుణించే మమతా లల్లె
కాదనేది లేని తల్లి
బిడ్డకొరకు మమత లల్లె
మూర్ఖ మాట విన్న తల్లి
ప్రేమ పంచి మమతా లల్లె
మపసంతా పంచుతల్లి
జ్ణాన మిచ్చి మమత లల్లె
మనోనేత్రమ్ముతొ తల్లి
వాంఛ తీర్చి మమత లల్లె
ఆకలికి అన్నం తల్లి
నిగ్రహంతొ మమత లల్లె
ప్రోత్సాహకాలతొ తల్లి
రూప కర్త మమత లల్లె
బతుకును నేర్పు తల్లి
భాగ్యమిచ్చి మమత లల్లె
భారమ్ము మోసే తల్లి
కళలు నేర్పి మమత లల్లె
మదిలో నున్నాది తల్లి
రవి కాంతితొ మమతలల్లె
చంద్ర బింబమల్లె తల్లి
చల్లని వెన్నెలను అల్లె ..
ముళ్ళ పైన ఉండు తల్లి
పూట బాట మమత లల్లె
సన్మార్గం చూపు తల్లి
చరిత తెల్పి మమత లల్లె
విధి అని తలచియే తల్లి
సత్య మార్గ బోధ లల్లె
ఓర్పు నేర్పు మార్పు తల్లి
తీర్పునిచ్చి మమత లల్లె
సత్యమ్ము పలుకే తల్లి
నిత్య శోభ మమత లల్లె
ధర్మ చరిత తెల్పు తల్లి
సుఖము శాంతి మమత లల్లె
కాలమనే నావ తల్లి
సంద్రముతో కరుణ లల్లె
కుటుంబమనె తెడ్డు తల్లి
గమ్యమంత కష్ట మల్లె
మధురిమలు (051 --- 060 )-
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శీర్షిక .. జీవితమ్ము
అమ్మా దీవించు మమ్ము
తొల గించు మా పాపమ్ము
సకల సౌక ర్యాలిమ్ము
మాకు నీవే దైవమ్ము
సద్వినియోగ సమయమ్ము
అది నిత్య సౌభాగ్యమ్ము
జీవితం శుభకరమ్ము
అదిమనకు కళ్యాణమ్ము
బతుకు నీదిగ ధైర్యమ్ము
బాధ్యతో ఉండే దమ్ము
తెలిసే మాయమర్మమ్ము
తెల్సుకొనేది ధర్మమ్ము
పొందాలి సంతోషమ్ము
అదియు నీకు నిశ్చయమ్ము
మరవాలీ అధైర్యమ్ము
బ్రతుకు మనసుకు ధైర్యమ్ము
తలరాత అను కోకమ్ము
అది జీవతపు మార్గమ్ము
బతుకంతా బాందవ్యమ్ము
సత్కర్మ సేవ మనమ్ము
హృదయంలో వేదనమ్ము
ప్రేమ పంచే వద నమ్ము
పొందు నిత్యా సాయమ్ము
చూపాలి దాతృత్వమ్ము
ఏతల్లి పూజ ఫలమ్ము
ఏర్పడే జపా తపమ్ము
రక్షగ ఇదియె ధైర్యమ్ము
అందాలు కొర గావమ్ము
ఫలముగా భక్తి మార్గమ్ము
సన్నిధి చేర వ్రతమ్ము
మనసు మార్చే దీక్షమ్ము
సకల శోభ దాయకమ్ము
ఆరోగ్యానికి శుభమ్ము
యోగాసనాలు క్షమమ్ము
పతనమే మూర్ఖత్వమ్ము
చెడు వ్యసనాలు మదమ్ము
చూపేను ప్రతాపమ్ము
లేదులే సందేహమ్ము
నాకు ఆశ్చర్యకరమ్ము
నీడలా సహకారమ్ము
--(()౦--
మధురిమల ... స్థితి
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చిరునగవుల శ్రీమతి
చిర్రు బుర్రు శ్రీపతి
సమ్మోహ చలనస్థితి
కలయిక సృష్టి స్తతి
మనసు రమణీయ ప్రకృతి
చీకటి వెలుగుల ప్రగతి
హృదయ ముందున్న జాగృతి
రస రమ్యమైన ఆకృతి
పద్యముకు ప్రాసయతి
గద్యముకు వచన యతి
మోహమునకు భజనయతి
తాపముకు దేహమతి
తప్పులనే తెల్పు రీతి
ఓప్పులను మన్ననే గతి
నొప్పులను భరించు రీతి
ముప్పులు రాకండ గతి
శ్రమ గూర్చి తెలుపు శ్రీమతి ..
ఫలితము కోరని స్థితి ..
కష్ట పడుటే పరిస్థితి ..
విజయం తధ్యమగు రీతి ..
తినుపదార్ధంతయు కలితి
మనిషి మనసుచూడ వెలితి
ధనముకొరకుచెలిమి కలితి
ప్రేమకు లేకుండు వెలితి
--(())--
మధురిమల .... కవిత
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విలువైన మాట వినుము
నిన్ను బతికించు చుండు
మరచియు మారబోకుము
ఆశకు చిక్కక ఉండు
వయసు ఉడుకు తప్పదు
మనసును త్రిప్పు చుండు
చదువు మనకు తప్పదు
దారిని చూపు చుండు
పెళ్లి మనిషికి తప్పదు
బుద్ధిని మారుస్తూ ఉండు
పగటి వెలుగు మారదు
శ్రమించి మనసును చూడు
తేనే లొలుకే ఆకు
తేట తెల్లగా నుండు
లేత చిగురేటి ఆకు
తినగ తీపిగా ఉండు
లేత పెదవి రుచి ఆకు
అతి మధురంగావుండు
మనసు మాయ మరవ బోకు
ఆశకు చిక్కక ఉండు
మంచి మాట తలకెక్కు
అది చేదు తీపి గుండు
కొందరి మాట విని చిక్కు
అది కోపము అగు చుండు
రాత్రి వెన్నెల మారదు
చీకటి దోహద ముండు
తరువుల గాలి మారదు
ప్రాణులతొ కలసివుండు
--((*))--
రాధ మధురిమల పలుకు
మాయను చూప వద్దు
మనసును మరవ వద్దు
చులకన చేయ వద్దు
మాటను మార్చ వద్దు.....మాధవా.... ఓ మాధవా..
మద్దు లొలికే చిలక
మనసు దోచె మోలక
హృదయమున్నా పలక
నన్ను మరువకే ఇక........రాధా.... ఓ రాధా
వేణువు ఊదు మాధవా
నృత్య మాడెద మాధవా
అను రాగంతొ మాధవా
అలక లొద్దు మాధవా.... మాధవా.....మాధవా
ఎఱ్ఱ పెదవికి ముద్దు
తీపి మిఠాయి ముద్దు
పెదవి పెదవికి ముద్దు
ముద్దుతో పొందు ముద్దు... రాధా....రాధా
ఉన్నదున్నది చెప్పనా
లేనిదన్నది చెప్పనా
ఉన్న లేదని చప్పనా
ఉన్నదందుకో నననా.....మాధవా.....మాధవా
కళ్ళలో ఉన్నావే
కధలన్నీ చెప్పవే
కళలన్నీ తెల్పవే
హాయిని అందించవే....రాధా......రాధా
ఎట నుండి వీచెనో
మృధుల సమీరమ్మూ
మధురంగ ఉండెనో
మమతల హృదయమ్మూ...... మాధవా......మాధవా
నడుముపై నర్తించే
నాజూకు జడకుప్పెలు
గుబ్బల ఊపులుంచే
హృదయమే దోచు చూపులు.....రాధా...రాధా.
లోకాలన్ని దాచుకొని
నీబొజ్జలో ఉంచుకొని
ప్రేమయంతా పంచమని
మనసు దోచి ముద్దు అనే ..... మాధవా..మాధవా
--(())--
మధురిమలు (01 ... 04)
ఊహలకు రెక్కలొస్తే
ఆశలే వెల్లు విరిచే
కాలము నిన్ను పిలుస్తే
శీఘ్రమే శుభము తలచే
కల్మషమనే చీకటిలొ
వెలుగులన్ని పంచుటయే
వెన్నెల వంటి రాత్రులలొ
కోరి సుఖము పొందుటయే
మన ఇరువురి పరిచయంలొ
అణువంతైన స్నేహము
కఠినత్వమైన తలుపులొ
అమృతమైనట్టి హృదయము
స్నేహమనే సాంగత్యము
బతుకుతెరువుకు మార్గముయె
ప్రేమనే మానవత్వము
నిత్యనూతన సంఘముయె
--(())--
మధురిమలు (05 ... 10)
రచయత మల్లాప్రగడశ్రీదేవి రామకృష్ణ
బలము నీది బాధ్యత నాది
సంతృప్తి పరిచే యుక్తి
ఆశయ ప్రేమమ్ము నీది
ఆకలిని తీర్చే యుక్తి
మన మధ్య గుర్తింపు
నిత్యమూ బలమైంది
ప్రేమ మనకు పెంపు
సత్యము హృదయమైంది
సదా లోచన మనకు,
సంతృప్తి నిస్తుంది
దురాలోచన మీకు
దు:ఖము నింపుతుంది
చదువుని మరవకు ఎప్పుడు
గురువు మాట ఆచరించు
తెలివితొ నడుచుకోవాలి
తప్పులు చేయకు ఎప్పుడు
సంకల్ప దీక్షతో
న్యాయ మైన ఫలితము
సవ్య వ్యూహముతో
అదృష్టము అద్భుతము
ఏదీ స్వంతమే కాదు
నీ దన్నది నాదియులే
నీ చేతి నున్నది తీపి
ఆశించే ప్రేమమ్ము లే
--(())--
మధురిమలు (11 ... 15)
రచయత మల్లాప్రగడ "ప్రాంజలి ప్రభ "
ఇదీ చిన్నారుల కవిత
అభాగ్యుల బతికే కవిత
దేశ దిమ్మరులతొ కవిత
బతికేటి బిడ్డల కవిత
గతం తెలియని వాల్లము
బాల్యం లో ఉండినాము
నెమరు వేసు కొనుస్థలము
మూగవాళ్ళతొ బతికాము
తల్లియె తెలియని వాల్లము
మధురస్మ్రుతులు గా మేము
అక్రమ జన్మ గలిగాము
ప్రకృతి ప్రేమికులము మేము
చెత్తయేరి బతుకు తాము
తరువులే మా నివాసము
పక్షు ల్లా బతుకు తాము
దైవం నమ్మి యున్నాము
కలసి కలయికలొ స్నేహము
పిల్లలమై కలవగలము
మెలకువగాను ఉన్నాము
కూడు కలసి తినె వాల్లము
--(())--
దేనికోసమొ చూసేను
వేచి యుంటేను ఫలితము
తొలియడుగునూ వేసాను
గమ్యమున వచ్చు ఫలితము .
చిరునగవులే చూపితిని
ఇకదిగులు నీకు దేనికి
మనసును నీకు పంచితిని
మరో మగువ ఇక దేనికి
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి