మధురిమలు.. సుందరాకాండ
సురసతో సంభాషణ .. హనుమత్ లీల
దేహ విస్త్రత మోనార్ప - సురస పెంచే దేహమ్ము
హనుమ కాయము మోనర్ప - క్షణమ్ము పెంచె దేహమ్ముు
ఇరువురిలోన పంతమ్ము - వరబలుండు శాంతముగా
సురస పేంచే కోపమ్ము - హనుమ తెల్పె మోనముగా
దీర్ఘ జిహ్వంబు పెట్టే - సురస వికృత రూపముగా
హనుమ తెలివి చూపెట్టే - అంగుష్టము రూపముగా
శుభగుణుడు వేగవంతుడు - శుభఘడియలొ చేరినోడు
సురస ముఖము నుండి లేడు - సురస కోరిక తీర్చాడు
దాక్షాయణి వందనమ్ము - ప్రవేశించిత వక్త్రమ్ము
పోయివచ్చెద సమయమ్ము - అమ్మ నాకు ఆనతిమ్ము
ముఖము వీడిన సూర్యడా - సహజ దేవీ రూపుడా
నాత్మా నంద స్వరుడా - జాడు సంతస భక్తిగా
సౌమ్య వానర సత్తమా - కార్యము సిద్ధి సాగుమా
మాత సీతను చేర్చుమా - సురస మాట వినె హనుమా
అధ్భుతంబు అనె యక్షులు - పనితీరునే దేవతలు
భూతా సాధు వచణములు - సంతసం ప్రోత్సాహములు
సుందరకాండ రెండవ " సర్గ " మధురిమలు (01-09)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట చిన్న రూపముతో లంకను ప్రవేశించుట చంద్రోదయశోభా వర్ణణము ..
త్రికూట పర్వత శిఖరము
ఎదిరించ లేని శఖ్యము
హనుమ ప్రస్తుత నిలయము
రావణ లంక ప్రాంతము
అక్కడ ఉన్న హనుమ పై
పుష్ప వర్షము కురిసె పై
పుష్పా లన్నీ హనుమ పై
అభిషేకము తో పై పై
అలసటనే పొంద లేదు
నిట్టూర్పునె విడువ లేదు
పరాక్రమము మార లేదు
హనుమ శక్తి తగ్గ లేదు
దాటు శక్తి ఉంది నాకు
నూరుయోజనాలె అనకు
కార్య సిద్ధి సఫల కొరకు
కృషి సలుపు శక్తి మేరకు
నల్లని పచ్చిక బిళ్ళ యందు
మధ్య మధ్య పెద్ద శిలలందు
అందమైన పర్వత ములందు
ధైర్యశాలి చెలించే నందు
హనుమ చూచే సరళ వృక్షములు
పూసిన ఖర్జూ ర వృక్షములు
మొరటి నిమ్మ కొండా మల్లెలు
రంగుల గన్నేరు వృక్షములు
పక్షులతో వ్యాకుల మైనవి
పుష్పా లన్ని కదులుచున్నవి
వనములు కోనేరులు ఉన్నవి
జల పక్షులే ఎగురు చున్నవి
పద్మములు ఉన్న బావులు
కలువలతొ దిగుడు బావులు
ఎత్తిన చెట్ల తీరములు
రమ్య మైనట్టి వనములు
పౌరులు విహరించు ప్రదేశాలు
జన సంచారముండె స్థలాలు
ఆడు కొనేటి మైదానాలు
చూసే లంక సౌందర్యాలు
సుందరకాండ రెండవ " సర్గ " సమ్మోహాలు (11-20)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
లంకా వర్ణనము, లంకలో ప్రవేశించుటను గూర్చి హనుమంతుడు ఆలోచించుట చిన్న రూపముతో లంకను ప్రవేశించుట చంద్రోదయశోభా వర్ణణము ..
ఉన్న యుద్ద ముండదు
యుండదు దేవతలున్న గెలవరు ఈశ్వరా
రాముడు ఏమి చేయు
చేయు యద్ద మేమియు
మేమియు ఉండబోదు లంకలో ఈశ్వరా
ఇక్కడ సామమ్మే
సామము భేధమ్మే
భేదము ఇక్కడ వలదు దండము ఈశ్వరా
సుగ్రీవుడు నీలుడు
నీలుడూ అంగదుడు
అంగదుడు నేను రాగలములే ఈశ్వరా
సీత యే ఉన్నదో
ఉన్నట్టే ఉందో
ఉందో లేదో తెలుసు కొనాలి ఈశ్వరా
ఈ రాపము వద్దూ
వద్దు కోప మొద్దూ
మొద్దూ రక్కసులను గెలవాలి ఈశ్వరా
ఉగ్రమై తేజస్సు
తేజస్సు యే ఉషస్సు
ఉషస్సు కూడ మోసమ్ము గనే ఈశ్వరా
చిన్న రూపము తోను
నేనే మారు తాను
నేను లంకలో ప్రవే శిస్తాను ఈశ్వరా
కర్తవ్య నిశ్చయం
నిశ్చమ్ము గ లక్ష్యం
లక్ష్యం సాధించాలి ఇప్పుడు ఈశ్వరా
రాత్రి యందును నేను
నేనే లంక లోను
లంకలోను సీతను వెదికెదను ఈశ్వరా
సుందరకాండ రెండవ " సర్గ " సమ్మోహాలు (31-40)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ, ప్రాంజలి ప్రభ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి