20, డిసెంబర్ 2023, బుధవారం

 01..దత్తపది.. కల కల కల కల 


కల నిజమాయే విధిగా

కళలే తీర్చు కలకళలు కాంచిరి జనులే

కలవర పడనీకు మనసు

కలతలు తొలుగుట నిజమగు కాలము నందే


02..దత్తపది.. చెప్పు, చేట, చీపురు, పేడ

ఉత్పలమాల (అన్యార్ధము)


చెప్పు డు మాటలే మనకు చేష్టలు గా కదిలేను యేలగన్ 

ఒప్పెడి చేట చెవ్వులగు వోపిక యేనుగు ఊపు లీలగన్ 

చిప్పల చెత్తయాకులగు చీపురుయూడ్చియు శుభ్రపర్చగన్

కుప్పల పేడ యెర్వగుట యున్నత పోషణ పంటకే యగున్


03.. దత్తపది... కక్ష, పక్ష, రక్ష, శిక్ష


కక్షలు లేనిజీవితము కాలము యేగతి దైవమాయగా

పక్షముదుఃఖ సౌక్యమగు పాలన పద్ధతి నిర్ణయమ్ముగా

రక్షణ భాగ్యమే ప్రకృతి రాసుల పంచుట ప్రేమసాక్షిగా

శిక్షణ సర్వవేళలగు శీఘ్రము నేర్పు ట నిత్యసత్యమే


04..దత్తపది.. దారము.. హారము.. భారము.. కారము.. విషయం.. స్వచ్ఛ


దండ పూలలో దారము, దాగి యుండు

భామ కంఠమ్ము హారము భగ మెరుపులు

కావ్య సంభారముగనుట కాల తలపు

మనసు మమకారము తెలుప మనుగడయగు


05..దత్తపది..చనుము-కనుము-వినుము-కొనుము


తే. గీ. చనుము రాజనీతి కడకు శాంతి తోడ

కనుము కళలు కాలము దివ్య కాంతినంత

వినుము ధర్మబోధలమాట వినయముగను

సాయము తీసుకొనుము నిత్య సాధనయగు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి