12, నవంబర్ 2014, బుధవారం

190. Daily spl. kavitalu -93 (చిరు దివ్వె వెలుగులు -1)


ఓం శ్రీ రామ్                                 ఓం శ్రీ రామ్                      ఓం శ్రీ రామ్
                                                   

చిరు దివ్వె వెలుగులు
 నా మనసుకు తోచినవి ఫోటోలను బట్టి ఒక నెలలో ( 10/2014) వ్రాసిన అంత్యాను ప్రాస కవితలు
1. గులాబీల కవిత
కలసి ఉంటె గులాబీలకు విలువెక్కువ
ఆకులతోఉన్న పూలపై మక్కువేక్కువ
నీలల్లొఉన్నపూలుచూస్తె మరీ మక్కువ
వాడిపొతే  హృదయానికి ఆవేదనేక్కువ



2. పరిణయం ఎప్పుడు
                             
చీకట్లు    తరిమే  సూర్యు     డొస్తున్నాడు
వెన్నెలను   పంచె   చంద్రు   డొస్తున్నాడు
మనసును  దోచే  మన్మదు   డొస్తున్నాడు
కలువపూవు కామితార్ధం తీరుస్తానన్నాడు  



3. వర్షపుచిరుజల్లు
వర్షపుచిరుజల్లుకు నెమలిలా పురివిప్పి ఆడుతున్నాడు
వసంతములో కోయిలలా  గొంతు విప్పి పాడుతున్నాడు
కమలంచుట్టు తుమ్మెదలా శబ్దంచెస్తూ తిరుగుతున్నాడు
ప్రేమనుపంచి,  ప్రేమిస్తూ నీకు నీడల నీ ప్రక్కనే ఉన్నాడు



4. మఘ  దీరుడు
మను  వాడే   మఘ  దీరుడు  ఇక్కడున్నాడు 
మనసును   దోచే మన్మదుడు  ఇక్కడున్నాడు 
కలలో  కవ్వించి,  నవ్వించే   వాడిక్కడున్నాడు
మూడుముళ్ళు వేసి మక్కువ తీరుస్తానన్నాడు



5. పాల కోవా
గారెలు,   బూరెలు,  పాల కోవాలు  ఉంటె ఏమి తినాలి
పేరుగన్నం, పాలన్నం, పప్పన్నం ఉంటె ఏలా  తినాలి
ములక్కాల పులుసు, చల్ల చారు   ఉంటె ఎలా త్రాగాలి
హమేషా నాలుక తిప్పుతూ ఈగలు  రాకుండా చూడాలి

6.మనం భారతీయులం మనమందరం మాట 
తప్పని స్నేహితులం, దేవాలయ ధర్మాలు
అనుకరిస్తూ ఆ దేవా దేవుని ప్రార్దిమ్చేవాల్లము   



ఇంద్రియము ద్వారా బౌతిక  పదార్ధమును
బుద్ధి ద్వారా జీవాత్మల సహచర్యములను
జ్ఞానము ద్వారా  కలియుగ  ధర్మములను 
సాంప్రదాయముద్వార బొట్టు  వస్త్రములను



7. మంచిబాట
ప్రతి ఒక్కరి జీవితములొ ఉంటుంది ఒక  ఆట
అందరి ఆటకు కావాలి మెదడుకు మంచిబాట
మెదడు పనిచేయాలంటే ఆరోగ్యంగా ఉండాలిట
ప్రస్తుతం  యువశక్తి  కావాలి కమ్పూ టరే ఆట   



8. కాంతి
మీరు మీ మనస్సుకాంతి చిన్నదనవచ్చు 
అది  ఇతరులకు  వెలుగు నివ్వవచ్చు
అందరిమనసును ఆనంద పరచవచ్చు
మంచిమాటతో జీవితమ్ మార వచ్చు



9. గోపాలుని  మహిమ
ముద్దులొలికె   గోపాలుని  మహిమ  తెలుస్కోలేని భూపాలురు
మనసులో నిలిచే  గోపాలుని  నవనీత   చోరుడనే  భూపాలురు
భామలను మైమరిపించే గోపాలుని బ్రహ్మచారి అనే భూపాలురు
మన్ను తిన్న గోపాలుని నోరు తెరవమన్నతల్లికి చూపె లోకాలు



10. అర్ధం
మానవులు అర్ధం  కొరకు  ఆరాట   పడుతున్నారు
అర్ధమే  పరమార్ధం  మని   కొందరు భావిస్తున్నారు
అర్ధం కొరకు అశకు పోయి నిర్భాగ్యులవుతున్నారు
సహనం, ఓర్పు, నిజమైన అర్ధంఅని తెలుసుకోలేరు



11. ప్రధాన  కర్త
విశ్వంభర రచన కర్త, జ్ఞాన  పీటం  అవార్దు గ్రహీత
తెలంగాణా పద రచన సి. ఎన్. రెడ్డి   ప్రధాన  కర్త
బహుముఖ ప్రజ్ఞాశాలి సినిమా పాటల  రచయత
వందనం అభివందనం పాదాభి వందనం ఈ దూత



12. రవళి
 సభను నిర్వహించిన బంగారు తల్లి  మా  చిన్నారి కలువ   మల్లి
అందరి మనసును రంజింపచేసే,  హృదయంలో  నిలిచినా   తల్లి
త్యాగరాజు కీర్తలు, ఘంటసాల భక్తి గీతాలు మధురంగా  పాడే వల్లి 
సభలోపలువురి ప్రశంసలు పొందిన  చిన్నారి మధురగాన రవళి



13. ఆత్మాభిమానం
నీవుభయ పెట్టుటవల్ల ఆత్మధ్యెర్యము సన్న గిల్లుతుంది 
పరుషంగా మాట్లాడుటవల్ల మొండి తనం ఏర్పడుతుంది
లోపాలను చూపితె ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది
అవమాన పరుచుటవల్ల ఆత్మాభిమానం దెబ్బ తింటుంది



14. శక్తి
ఆగ్రహం,ఆలోచన,  మానవులను నిలువనీ కుండా చేస్తుంది 
   నిందించుట  వళ్ళ వారిలో నిరాశ, పగ చోటు చేసుకుంటుంది                
కర్తవ్యం విస్మరించక ఓర్పుతో ఓదార్చితే సంతోషం ఉంటుంది
మనిషిగొప్పతనాన్ని తెలిపి సంసారం చేసే స్త్రీలొశక్తి ఉంటుంది



15. గ్రామ సింహం  


జూలులేని  సునకమే ఈ నాటి   గ్రామ సింహం 

తస్కరులు రాకుండా ఇంటిని   కాపాడేసింహం 
తిండి పెడితే   చాలు తోకాడిస్తు    తిరిగేసింహం
జీవితంలో నమ్మిన బంటే అసలు గ్రామసింహం  




16. తప్పు


కాలంచెల్లిన వాహనాలను బయట కొందరు నడపటం తప్పు 

అవి నడుస్తున్న పట్టించుకోని  ప్రస్తుత  ప్రభుత్వానిది తప్పు 
రోడ్డు మీద స్పీడ్ బ్రేకులు వేయించక పోవటం ప్రజల  తప్పు
స్కూలువదిలేటప్పుడు యాజమాన్య చూడక పోవటం తప్పు 




17. పువ్వు


సూర్యుని తొ  సంచరిస్తూ ఉంటుంది పొద్దు తిరుగు పువ్వు 

సూర్యుని కిరణాల తో  విచ్చుకుంటుంది    కలువ  పువ్వు 
చంద్రుని  వెన్నెలలో సువాసనలు  వెదజల్లె  మల్లె పువ్వు 
నిత్యమూ వెలుగును పంచె ఇంటిల్ల పాటి సంతోషాల నవ్వు   

18. మనసు

ప్రశంసా, కీర్తి, ద్రువీ కరించుటకు ఎప్పుడు  ఆశించకు 

ద్వేషించే వారిని అర్ధం చేసుకొనుటకు  ప్రయతించకు 
ఎప్పుడుకాలానికి ఎదురుతిరిగి నడుచుట నేర్చుకోకు 
మనసులు కలవటంలో సుఖం ఉన్నదని మరువకు 




19. స్నేహం




దుర్జనులతో స్నేహం ప్రాత: కాలపు  నీడ    
సజ్జనులతో స్నేహం సాయంకాలపు  నీడ
వణ్యమృగాలతో స్నేహం భయనపు  నీడ 
స్త్రీలతోస్నేహం చేయాలంటె గుండెలో దడ 




20.  యోగం


అందరికి శారీరక మానసిక ఆద్యాత్మిక కక్షలేయోగం 

ప్రజ్ఞతో సంపూర్ణ   ఆరోగ్యంగా   ఉండటమే   యోగం 
మనస్సు  చెదరని   మనిషి కే   స్తిరమైన    యోగం 
చిత్తవృత్తుల నిరోధమంటు పతంజలిచెప్పిన యోగం 




 21. మారుతి


మారుతి  మము  కాపాడగా   రావయ్యా 

మా మనసులో  స్థిరంగా    ఉండవయ్యా 
మాలో  ఉత్తేజం,  ధైర్యం  ఉంచ  వయ్యా       
మమ్ము ధర్మమార్గాన నడిపించుమయ్యా 


22. ఇలవేల్పు

మా ఇంటి ఇలవేల్పు దాసాంజనేయుడు

మా కంటిలో ఉండే మా  ఆరాధ్య దేవుడు 
యజ్ఞవెలుగులో కన్పించే ఆంజనేయుడు 
వెలుగులో రామ దూత ప్రత్యక్ష  మైనాడు   
   

23.  వసంతం
వసంతం వచ్చింది, చల్లని వలపునుపెంచింది
వరుస కలిసింది  వయ్యారంతో   ఉందామంది 
మనసును రంగరించి  ప్రేమను   అందించింది
ముద్దుల్లో ముంచింది, ప్రశాంతత కల్పించింది



24. పొద్దు

 పొద్దు  వాలేను  గోవులు  ఇంటికి   చేరెను
కష్టజీవులు సుఖం  కొరకు  గూటికి చేరను
ప్రేమ పక్షులు పిల్లల కోరకు చెట్టుపై చేరను
సూర్యుడు ఆస్తమించి విశ్రాంతి తీసుకొనెను



25. నిగ్రహశక్తి

 నిగ్రహశక్తి ఉన్న వానికి లోకమంతా తెల్లటి తెల్లన
నిగ్రహశక్తి లేని వానికి లోకమంతా పచ్చటి పచ్చన
సంతృప్తి ఉన్న వానికి లోక మంతా  ఆకు  పచ్చన
దేవుని నమ్మిన వానికి ఉండు మనసు ప్రశాన్తమున

26. సముద్రపు అలలపై తామరాకుపై నీటి  ముత్యం లా తెలుతూ
సముద్రంలో గట్టు కోసం వెతికే  పక్షిలా గలగల  తిరుగుతూ
అక్కరకురాని మేఘాల వర్షానికి నేను సముద్రం లో తడుస్తూ
చుక్కాని లేని నావలా సముద్రంలో నేను తిరుగుతున్నాను

27. ఆగిన  కొద్ది  ఆలోచనలు    పెరుగు
ఆనందానికి అవాంతరాలు  కలుగు 
అనుకోని  విధంగా మనసు నలుగు
ఆరాటంవళ్ళ ఎప్పుడు అనర్ధం జరుగు  

28.  జీవితమ్ వివిధ  సంఘటనల   సమాహారం
జీవితమ్లొ శక్తిని జాగృతం చేస్తే సుధా భరితం
జీవితమ్లొ లక్ష్య సిద్దికోరకు చేయాలి యుద్ధం
జీవతమ్లొ కష్టాలు ఉండేది దేవుని సంకల్పం

29 అందరికి నిగ్రాహన శక్తి  దేవుడు మనకిచ్చాడు
అందరికి ఓర్పు, సహనం,  శక్తి ,  అందించాడు
ఇల్లాలు కంట కన్నీరురాకుండా చూడాలన్నాడు
మానవ ప్రయత్నానికి దేవుడు తోడవుతాడు

30. నేటి బాలలు రేపటి భావి భారత పౌరులు
ఆధునిక విద్య తో పెరిగే  నేటి విద్యార్ధులు
పిల్లలను శిక్షణ  తో  పెంచే తల్లి తండ్రులు
దేశం కోసం  పోరాడే రేపటి యువ నేతలు

31. మీవాక్కు మనస్సుతో ప్రతిష్టితం అవ్వాలి
మనస్సు   వాక్కుతో   ప్రతిష్టితం  కావాలి
భగవంతుడు అంతరాత్మలో ప్రకాశిమ్చాలి
మీరునేర్చు కున్నది,విన్నది వీడకుండాలి 

32. అనురాగం పంచేది అమ్మ, ఆవేశంతో అరిచేది అమ్మ
ఆనందం పంచేది అమ్మ, కంట కన్నీరు తుడిచేది అమ్మ
ప్రేమ పొందాలనేది అమ్మ, ప్రేమను పంచాలనేది అమ్మ      
అమృతం పంచేది అమ్మ, గరళం త్రాగోద్దనేది కుడ అమ్మ

33. శిలగా ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తాం, మనిషిలో ఉన్న దేవుణ్ణి గమనించం
ఉషోదయ కాలాన్ని గమనిస్తాం,  ఆశల వలయంలో  చిక్కి జీవిస్తాం
దీపాల వెలుగులో ఆరాదిస్తాం,  మనిషిలో ఉన్న మంచిని గమనిమ్చలెం
సాధించాలని తపన పడతాం, సాధించిన దానిలో తృప్తి పడం మనం

34. మనిషి లక్ష్యం నిర్దిష్టంగా  ఉంటె  కృషి చేయాలి
కృషి ద్వారా సంకల్ప  సిద్ధికి   ప్రయత్నిమ్చాలి
సంకల్పంతో దీక్షాభద్దుడుగా పనిపూర్తి చేయాలి
పని పూర్తి అయిన మనిషికి ప్రశాంతత ఉండాలి

35. హనుమంతుని జండా ఉండటం వళ్ళ అర్జుని రధం 
ఒక్క అడుగు కుడా వెనక్కు పోలేదు
శ్రీ కృష్ణుడు రధసారధి అగుట వలన భీష్మ, ద్రోణ, 
వేసిన అస్త్రాలు జండా వళ్ళ ఏమి కాలేదు 
యుద్ధం ఆయిన తర్వాత అర్జునా రధం దిగు, 
హనుమా దిగు అని కృష్ణుడు దిగాడు, రధం భగమంది
అర్జునా హనుమంతుడు ఎక్కడ ఉంటె అక్కడ జయము, 
శక్తి, మనస్సాంతి  ఉంటుంది అన్నాడు శ్రీ కృష్ణుడు

36. చిన్నారులు  పకృతిలో పరవశించి  ఆడుతారు
ఉషోదయపు   వెలుగుల్లో   ముత్యాలవుతారు
జలాల్లో ఆడుతూ  ఉత్చాహ  భరితులవుతారు
స్వేచ్చదొరికితేచాలు వానరులను మించుతారు

37. భారత జండాను ఎవరూ త్రొక్కకూడదని తపన
అంగవైకల్యంను లెక్కచేయకుండా నడిరోడ్డులో పట్టుకోనేను పతాకము
స్నేహభావముతో సహకరించిన చిన్నారి తపన
వీడియో తీసినవారికి, ప్రతిఒక్కరికి  నా ధన్యవాదములు
మనస్సులో కలిగే సంకల్పాలు, ప్రచోదనాలు పవిత్రంగా ఉన్నప్పుడు
ఆలోచనలు నిజమైన స్వే చ్ఛా జీవనానికి అర్ధం

38. ముద్దొచ్చే ముద్ద మందార పువ్వు
పరువలో రెపరెప లాడుతున్న కొవ్వు
పదిలంగా దాచుకోవాలి ఎప్పుడు నువ్వు
స్త్రీ అందాన్ని బహిర్గతం చేస్తే అందరు నవ్వు 

39. నాకే  రెక్కలుంటే  పక్షిలా మారి ఆకాశముతో  స్నేహం చేస్తాను
వర్షం లేని ప్రదేశాలను  చూసి  మేఘాలతో  వర్షం  కురిపిస్తాను
నిదిలేక్కడో  ఉన్నాయో  తెలుసుకొనితెచ్చిఅందరికి పంచుతాను
చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొని సంతోషంగా ఉంటాను

40. అంతా మనమంచికే అనుకుంటే  మనస్సుకు కష్టాలు ఉండవు
ఇతరుల వల్ల నేను చెడినాను  అనుకుంటే  సుఖాలు ఉండవు
అద్రుష్టం  పై  ఆధారపడితే మనస్సు  చిక్కుల్లో పడక  తప్పవు   
అవకాశాలన్నీఉపయోగించుకుంటే సంతోషాలు ఉండక మానవు             

  41.   
 త్వమర్క  స్త్వ మిన్దు స్త్వ మగ్ని స్త్వ మాప
స్త్వ మాకాశ  భూ వయవస్త్వం మహత్వం
త్వ ధన్వో న కశ్చి త్ప్రపంచో  స్తి సర్వం
త్వ మానంద సంవి త్స్వరూపామ్ భజే హం



అంబా సూర్య, చంద్ర, అగ్ని, జల, వాయు, భూమి, ఆకాశములు నీవు.
 మహత్తత్వం నీవు.  నీవు కానిదేమున్నది?  సర్వ ప్రపంచము  నీవు. 
ఈ ప్రపంచమునకు తెలివిని, సుఖమును ప్రసాదించు 
ఆనంద సవిద్రూపవగు నిన్ను భజిమ్చేదను   .  (భావాన్ని భుజంగ స్త్రోత్రం)


42. మనసు  పరిమళించెనే  దీపావళి  కోటి  దీపాల   వెలుగు   
       ఆనంద  డోలికల్లో మున్చేనే ఆవు  నూనె  దీపాల  వెలుగు
నవసంత కాలంలో తనువూపరవశించిన  దీపాల  వెలుగు
కొత్తవస్త్రాలతో ప్రేమతో మనసుహత్తుకొనే  దీపావళి  వెలుగు

43. తల్లి  కోర్క తీర్చాలని ఆత్మ లింగం సాదించాడు రావణాసురుడు
కోర్కసఫలం కాకూడదని లింగాన్ని భూమిపై ఉంచాడు గణేషుడు
భూకైలాష్ గా మారి  ప్రజల కోర్కలు తీరుస్తున్న మహానుభావుడు
అరచేయే హరతిగా ఉండి వెలుగు చూపుచున్న పార్వతీ వల్లభుడు 



44.జల్లు 

పన్నీరు  సువాసనలు  గాలిలో  వెదజల్లు
నీటి బుడగలు  గాలిలో  తేలి  కురిసే జల్లు 
సూర్యకిరనాలు  అంత   వెలుతురు  జల్లు
ఆనందముతో పక్షులు  రెక్కల   చప్పట్లు



45.పుట్టినవారు పుట్టగానే ఎవరు ధనవంతులు కాలేరు

వయస్సుతొపాటు పెరిగిన మేధస్సు ఉపయోగించేవారు
అర్ధం ఉపయోగించి ప్రతిఒక్కరికి   సహాయ పడేవారు
డబ్బులేకుండా చనిపోయిన అందరి గుండెలలో ఉండేవారు



46. చిన్నారి రూపమ్ చిద్విలాసుని రూపమ్

చిరుది వ్వె వెలుగు ప్రతి  ఇంటికి దీపమ్
చిత్రం చూసి చిన్నారులు చేసే  విచిత్రమ్
చిన్నారులు  చిరంజీవుల    శ్వరూపమ్ 



47. అనుభంధం

అందరికి స్నేహభంధం  పెంచేది  ఆదివారం  అనుభంధం
బంధువులు  కలుసుకొని ముచ్చట్లు   తెలిపే నిజభంధం
భావాలను   పంచుకొనే ప్రేమ  అనురాగలను భానువారం 
అందరు పిల్లలసందడితో ఆనదంగా జరుపుకొనే ప్రేమవారం



48. నిన్ను

 నేను మరువలేను నిన్ను ఎప్పటికి   
నిన్ను చూడన్దె నిద్రరాదు ఇప్పటికి
అరమరికలు లేనివారం ఈ వూరికి
ఆనందాలే ఇక  మన   ఆరోగ్యానికి



49. సన్మానం    

 దీక్షతులుగారికి సన్మానం చేయటం తెలుగువారికి గర్వకారణం
కృషి, దీక్షతో7650 సన్మానాలు నిర్వహించిన వారికి సన్మానం  
ప్రపంచ జీనియస్ బుక్ అఫ్ రికార్డు వచ్చినందుకు  సన్మానం
త్యాగరాయ గానసభ యందు జరిగే  అభినందనకు  ఆహ్యానం



50. గులాబీ పూలు                                                                                                                                       గులాబీ పూలు వికసించటం, ప్రకృతి పరవసించటం ఒక్కటే

చంద్రుడు వెన్నెల కురిపించటం, తనువు తపించటం ఒక్కటే
వయసున్న తరుణీ ఉడికించటం, పురుషుడుపడటం ఒక్కటే
చీకట్లో తారలు కులకటం, రాత్రిలో స్త్రీ పురుషునితో కలవటం ఒక్కటే



51. ఉషోదయం

 నీలాకాశంలో ఉద్భవవిస్తుంది  ప్రతిరోజూ ఉషోదయం
ప్రేమతో తపిస్తుంది ప్రేమించే  ప్రేమికుల   హృదయం
మనసు పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుంది నవోదయం
ప్రేమికులకు సుఖశాంతులసంతోషాలతో శుభోదయం



52. చిన్నారి

 మా ఇంటి వెలుగు మా ఇంట్లో ఉన్న బంగారం
మా కంటి వెలుగు మా చిన్నారి నవ్వుల హారం
ప్రతి ఒక్కరు పిల్లలను ప్రేమించటం శ్రేయస్కరం
పిల్లల మాటాలు మనసుకు ఆనందాల నిలయం
 
53. స్త్రీ
స్త్రీ తోలి లోగిలి గుడి అయిన తొలివాకిలి అమ్మ అని ఓట్టు
తల్లి హోదా అంత కన్నముందు ఆలిహొద తొలిమెట్టు
తొలిమెట్టు అందుకోవటానికి పెళ్ళికికడతారు తాళిబొట్టు
అదిస్త్రీహృదయానికి మనసులు కలవటానికి పచ్చబొట్టు





54. విద్య

పెద్దలు నేర్పిన విద్యను నలుగురికి పంచటం మన అదృష్టం                                        స్త్రీలు,  యువజనులు  దీపావళికి  చేసే సంబరాలు యుద్దం
దీపాలు వెలిగించి అందరు కలుకొని నిలుకుంటారు  భంధం
కార్తీకమాసములో శివదర్సనం చేసి ప్రర్దిమ్చుతారు మోక్షం



55. ఆటబోమ్మ                                                                                         
 ఆట బోమ్మలను చూసి పిల్లలు కిల కిల నవ్వుతారు

ఇంటికి దిష్టి  దగల కుండా దిష్టి బొమ్మలు పెడతారు
ఆకర్షించాలని కొందరు దిష్టి బొమ్మగా వేషం  వేస్తారు
కొందరు పరువుకోసం కోటువేసుకొని జోకర్ లఉంటారు

56.పొట్ట ఉన్న బొమ్మ ను గురించి వ్రాసిన కవిత
కొందరి  ఉదరం  ఉబ్బితే  గడ్డి   తిన్నారంటారు 
రబ్బరు బెలూన్  ఉబ్బితే గ్యాసు ఉన్నదంటారు
దేవునిహుండీ నిండిందంటే పాపపు సోమ్మంటారు        
నవ్వొచ్చిన, ఏడుపొచ్చిన, పొట్ట ఉబ్బిందంటారు



57.ప్రేమవార్త                                                                                         
    పాత రోజుల్లో   ప్రేమికులను  కలిపినవి   పావురాలంట 

భందువుల సమాచారములను  తెలిపెనవి ఉత్తరాలంట 
దూరదేశం వారు ఇంటర్నెట్ కంపూటర్  చాట్ చేస్తారంట 
1 టి కాక ఎన్నో సెల్ల్స్ వచ్చాయి సంభాషణలు చాలవంట



58. ఫోటో ను చూసి వ్రాసిన కవిత                                         
       అనాధలను ఆత్మీయతతొ   ఆదుకున్న ఆదర్శ మూర్తి

అంగవికలు, అమాయకులు    ఆరాధించే ఆదర్శ మూర్తి 
అహింసను పాటించి, క్రమశిక్షణతో  ఉన్న ఆదర్శ మూర్తి
అభాగ్యులను ప్రేమించటం అలవాటుఉండాలన్న ఆదర్శ మూర్తి 

59.తగ్గి పోతున్న హిందువులగురించి
ఈ రోజు మనది కాని రేపు గురించి మనకేవ్వరికి తెలియదు
రేపటిగురించి అలోచిస్తే ఆరోగ్యంహానికరం అని మీకుతెలియదు 
మనసుంటే  ఇష్టపడే  హృదయానికి  ఏది  అసాధ్యము కాదు
హిందువులందరూ ఇక్కడే ఉంటె జనాభా  పెరుగాక మానదు 



60.అంత్యాను ప్రాస నకార కవిత  
శక్తి ఒక్కటే,  సృష్టి, స్థితి, ప్రళయం, యుగాన
భక్తి ఒక్కటే,  ఆత్మ, బ్రహ్మం, యోగం, జగాన 
ప్రేమ ఒక్కటే,  కుల,  మత,   జాతి,అంతటన      
తల్లి ఒక్కటే, దేవతగా పిల్లల ప్రేమ స్థానమున 




61.మత్తు

                డబ్బుచూస్తెవదులుతుందిమత్తు                                                                             మత్తుకాదుఅదిచేస్తుందిఆరోగ్యంచిత్తు                                                                                                            ఎప్పడునీవుచిత్తుఅనుకుంటేతప్పు                                                                                                                     తప్పుఅనుకుంటేజీవితమ్లొవస్తుందిముప్పు 


వెన్నెలలో విహరించే వన కన్యవు కావు  లే 

కన్నె వలపులు  అందించే మదురిమవు  లే
విరిసిననల్లని కురులే విరహాన్ని పెంచునులే 
వరూధినిలా వలపు అందించే సుకుమారివిలే   



తెలుగు గీతమ్ 


నిన్న ఉన్నది నాకు ఓపిక
నేడు  లేదు  నాకు   తీరిక
రేపు చేప్పలేను నా  ఏలిక
ఎప్పుడు నవ్విస్తాను నవ్విక   

మనసు మాట చెప్పుటకు మాట రాక 
మమతలు పంచుటకు చోటు లేక 
వయసునుచేప్పుటకు వరుసకాక 
ఎడ్పించటం చాత కాదు నవ్విక 

సుందర సుకుమార సున్నిత నేత్ర మాల
మందార మకరంద మధురిమ  లీల
విప్పారు కురులు విందు చేయు వేల
విడమరచి  చెప్పలేను నేను ఈ వేల 

             
                   

1 కామెంట్‌: