31, డిసెంబర్ 2014, బుధవారం

203 by by 2014 -(Politics story)

ఓం శ్రీ రాం                         ఓం శ్రీ  రాం                             ఓం శ్రీ రాం
                                                                  


by by 2014 - Welcome 2015




ఒక మనిషిని గుర్తించడం ఎంత కష్టమో, గుర్తించిన వాడిని మరీ గుర్తుపెట్టు కోవడం మరీ కష్టం.  ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఆంద్ర ప్రదేశ్  రెండుగా మారిపోయింది.2-6- 2014 న  ప్రత్యేక ప్రభుత్వాలు ఎర్పడి నాయి. తెలంగాణా ముఖ్యమంత్రి గా కే . చెంద్రశేఖరరావుగారు, ఆంద్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా నారా చెంద్రబాబునాయుడు గారికి బాగా కలసి వచ్చింది . కేంద్రంలో భారతీయ జనతాపార్టికి విజయడంకా మోగించింది." నరేంద్ర మొదీ" ప్రచారల వళ్ళ అధికారం చెజిక్కించుకున్నది అధికారంలో ఉన్న కాంగ్రేస్ చుక్కలు చూపించింది కోలుకోలేని విధముగా పార్టి వెనక పడింది.   

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చేసింది తక్కువ,  ప్రపంచ దేశాలలో మనదేశం  ప్రతిష్ట ను పెంచారు. చేసిన వాగ్దానాలు ఎమీ నెరవెర్చలేదు, స్వచ్చ బారత్ అని ప్ర\చారంగా ప్రజలలో నిలబడి పోయారు, కారణం (ప్రధానమంత్రి స్వయముగా చీపురు పట్టి వీధులను సుబ్రం చెయ్యడం ) పెట్రోల్ తగ్గింది, బంగారం తగ్గింది తప్ప ఇంతవరకు ఎమీచెయలేక పోయారు. నల్ల దానం బయటకు తెస్తామని అన్నారు ఇంకా ప్రచారంలా ఉన్నది, గ్రామా గ్రామాలలో  బాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయాలని సంకల్పం విజయ మవు తున్నది
టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జాకు రెండు పర్యాయ్యాలుగా రెండు కోట్లు  ఇవ్వటం జరిగింది, రైతులకు రుణమాఫీ కొంతవరకు జరిగింది. ముఖ్య మంత్రి కలల ప్రపంచంలో హైదరాబాద్ నగరం ఇప్పుడు అగ్రభాగానా ఉంది టవర్లు, అకశహర్యాలు, బహులఫరుసల వంతెనలు, ఒకటేమిటి ఇంకాఎన్నొ ఉన్నాయ్ , కలను కార్యరూపములోకి మార్చి తే ప్రజలలో హీరోగా నిలబడతారు, లేకపోతె జీరోగా నిలబడతారు.  బడ్జెట్ మొత్తం అభివృద్ధి జరిగిన హైదరాబాదుకు మరలా అభివృద్ధి అని పెట్టటం ప్రజలలో కొంత అవిశ్వాసం ఏర్పడినది, తెలంగాణా అంటే కేవలము హైదరాబాదు మాత్రమె కాదు.  అభివృద్ధి చేయాలనేదే నా ఉద్దేశ్యము. మద్యాన్న భోజన  పధకాన్ని 1/1/2015 నుండి మనిషికి 6 కెజీలు బియ్యము ఇవ్వదలచినది, పట్టా కార్డులు రద్దు పరచి కోట కార్డులు ఇవ్వటం జరుగుతున్నది  

ఆంద్రప్రదేశ్  ముఖ్య మంత్రి  సమీక్షలు పేరున క్షనం తీరిక లేకుండా  రాజధాని అనేది లేకుండా ప్రజలకు చేసిన వాగ్దానాలలో  రైతుల రుణ మాఫి  తప్ప కాలక్షేపం చేసారని మాత్రమే తెలుస్తుంది .   ఆంద్రప్రదేశ్లో హుద్ హుద్ తుఫాన్ సందర్బముగా  ముందు జాగర్తలు తీసుకొవటం వల్ల ప్రాణనష్టం జరుగలేదు. జరిగిన నష్టాన్ని వేగంగా నగరాన్ని సుబ్ర పరుచుటకు సహకరించటం వళ్ళ మంచి పేరు వచ్చింది .  

ప్రభుత్వం వారు ప్రారిశ్రామిక వృద్ది మా లక్ష్యం, పరిశ్రమలకు సత్వర అను మతులు, ప్రపంచ స్తాయి  మొలిక వసతులు యువతకు ఉపాది కల్పన మా సంకల్పం అన్నరు కాని  గెలిచిన తర్వాత పాత  విధానాలను స్వస్తి పలికి  కొత్త విధానాలు అమలు చేస్తున్నారు, నిరుద్యోగులకు ఉద్యోగములు కల్పించాలని, ప్రజలకు మేలు చేయాలని తలంపు  ఏకోశాన కని పించుటలేదు. కాని నాయకులకు జీతాలు మాత్రమె పెంచుకున్నారు.

అందుకే తల్లి తండ్రులారా మాతృభాషలో విద్యను భోదిమ్చాలని ప్రభుత్వాన్ని అడగండి. ఎందుకంటే రేపు తెలుగు  భాషలో కంప్యూటర్ అభివృద్ధి చెందే  దిశలో నడుస్తుంది. ప్రభుత్వమువారు కూదా తెలుగు ఉత్తర ప్రచ్చుత్త రములు తెలుగులో నడిపితే పిల్లల తల్లితండ్రులు అందరు తెలుభాషలో చదివిన్చుటకు ముందుకు వస్తారు. ప్రభుత్వమువారె నిద్రపోతున్నారు మన రాష్ట్ర భాషను మరచి పోయే విధముగా ప్రవరిమ్చుతున్నారు,. తెలుగు భాషా సంఘాలు వారు నిద్ర పోతున్నారు దయ్యచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరచి మనభాషను రక్షించండి అని నాయకులకు, మేధావులకు తెలుపుతున్నాను. 

  కోకిల మాతృ భాష  "కుహు కుహు"  సంగీత భాష !
లెగదూడ మాతృ భాష" అంబా " కేరింత అరుపు భాష !
కప్పు మాతృ భాష "బెక బెక" లాడు ముచ్చటిమ్చ్ భాష !
పిల్లల మాతృ భాష "అమ్మా అమ్మా" అని మరువలేని స్వర భాష !
మాతృ భాష మారేది లేదు, మరోభాష వచ్చేది లేదు !
మనుగడకు మాతృభాష, బ్రతుకు తెరువుకు మర భాష !
ఎన్నివేషాలు వేశిన, ఏ విద్య నేర్చు కున్న మారదు తల్లి భాష ! 







సూర్యుని ఒక్క  ధర్మం తాపం, జలము ఒక్క ధర్మం రసం !
అగ్ని ఒక్క ధర్మం దహనం, జీవుని ఒక్క దర్మం ఆత్మజ్ఞానం !
కుటుంబములో  సత్యం,న్యాయం, ధర్మం, మార్గమే సంసారం !
మతములో ఉన్న సమస్త ధర్మాలకు అందరం భద్దులం !
ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ తేజస్సు విస్తారం !
ఎక్కడ  తేజస్సు విస్తారంగా ఉంటుందో, అక్కడ భక్తి మయం !
ఎక్కడ భక్తి ఉంటుందో,  అక్కడ లక్ష్మి దేవి స్థిరనివాసం !
ఎక్కడ సత్సాంగత్యమ్ ఉంటుందో, అక్కడ ఉత్తమ గుణం !
ఎక్కడ ఉత్తమ గుణం ఉంటుందో అక్కడ భగవంతుని సాక్షాత్కారం !
ఎక్కడ భగవంతుని సాక్షాత్కారం ఉంటుందో, అక్కడ బ్రహ్మా జ్ఞానం !
ఎక్కడ బ్రహ్మా జ్ఞానం పంచ బడుతుందో, అక్కడ నిత్య కళ్యాణం !
ఎక్కడ నిత్య కళ్యాణం  ఉంటుందో,  అక్కడ పత్స తోరణం !
                                    by by 2014 - welcome 2015
 The above story are you like, please omit any mystics, and you prepare development of family and state, my opinion is your memory is peaceful. please share and write comments.
once again Than "Q" for all of you.   



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి