18, డిసెంబర్ 2014, గురువారం

200 family story / (ప్రేమ ఎవరిపై ఉండాలి)

Om Sri ram                          Om Sri ram                              Om Sri ram                                                  
    అన్నయ్యగారు మిమ్మల్ని ఎప్పడి నుంచో  అడుగుదామను కున్నాను, మీకు ఎంత మంది పిల్లలు, వారి చదువులు, వివాహములు, విషయాలు మాకు  అబ్యంతరము లేకపోతె చెప్పగలరు అని అడిగింది ప్రకాశరావు భార్య సుభద్రగారు.
దీనిలొ అబ్యంతరము ఏముంది నాకు ముగ్గురు పుత్రికలు వారికి  పెట్టుకున్నాను మొదటి  వారి పేరు  "సమీర " ఈ పేరు పెట్టుటకు కారణం మాతాతగారు, మా నాన్న గారు హనుమంతుని ఉపాసకులు   తలచుకొని ఆ పేరు  పెట్టుట జరిగింది  రెండవ పుత్రిక పేరు  "జాహ్నవి" మూడవ పాప పేరు, ప్రత్యూష , (గాలి, నీరు, వెలుతురు,  అందరికి కావాలి అవే  మా పాపల పర్లు )నా ముగ్గురు కుమార్తెలకు తగిన విద్య నేర్చుకొనుటకు వీలు కల్పించాను, పెద్ద  పాప బీటేక్ (కంప్యూటర్స్ ) ప్రస్తుతము బెంగుళూరులో ఉద్యోగము  చేస్తున్నది, రెండవ పాప   బీటేక్ (ఎలెక్ట్రానిక్ కంప్యూటర్స్ + ఏమ్బైడెడ్ ) ప్రస్తుతము  ఉద్యొగము విరమిమ్చి హౌస్ వైఫ్ గా ఉట్టున్నది, ఇక మూడో పాప M Sc.( ఆర్గాన్ కెమిస్ట్రి ) ప్రస్తుతము టిచర్గా పనిచేస్తుంది. నా ముగ్గురు అమ్మాయలకు వివాహము  జరిగినది, వారికి పిల్లలు కుడా ఉన్నారు.
మీ శ్రీ మతి ఎమన్నా చదువుకున్నదా అని అడిగింది సుభద్రగారు.
మీ ప్రక్కనే ఉన్నదిగా మీరె అడగ వచ్చు కదా, ఎమీలేదు శంఖం  లో నుండి వచ్చేదే తీర్ధమ్  అని ఎవరో అన్నారు అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను     
మీరు చమత్కారులు ఎమీ తెలియదని అన్ని అడుగుతున్నారు .
నా శ్రీమతి B. A (పాలిటిక్స్ & పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) నేను మాత్రం B.Sc (ఫిజిక్స్ మెయిన్ మాధమేటిక్సు & కెమిస్ట్రీ అన్సలరీస్).    
మీ నాన్న గారు, మీ  తాత గారి గురించి, తెలియపరుస్తారా.
మా నాన్న గారు కీర్తి శేషులు  మల్లాప్రగడ లక్ష్మణ రావు గారు , మా తాతగారు కీర్తిశేషులు వేంకటాచల జ్యోష్యులు, నిజాం నవాబు దగ్గర ఆస్థా న జ్యొతీష్యు డుగా ఉండేవారని చెప్పావారు, వారికి జ్యోష్యులు ఆని బిరుదు కూడా  ఉండేది, నల్ల పంతులు గారు  మొఖం చూసి అన్ని విషయాలు చెప్పావారు అనేవారు,  ఇక  మానాన్నగారు ప్రభుత్వ ఉద్యోగిగా (ఫైర్ స్టేషన్లో డ్రైవర్ పనిచేసి రిటైర్ అయినారు, మరియు హనుమాన్ జ్యోతిషాలయం అని గుంటూరు నందు బాలాంజనేయ ప్రశ్నలు (అంజనం ద్వారా ప్రశ్నలకు సమాధానములు తెలియపరుస్తూ జీవితము గడిపినారు) ఇరువురు హనుమంతుని ఉపాసకులు మరియు బాలా ఉపాసకులు,  వృత్తి " బ్రతుకు తెరువుకోసం జ్యోతిషం యంతో కష్ట  జీవితములు గడిపినట్లు తెలిపే వారు".
మా పెద్దల మార్గమునె నేను కూడా  కష్టపడదలిచాను నేను నేర్చుకున్న మాదమేటిక్స్ ను, మా పెద్దలద్వారా వచ్చిన తెలుగు కళను వృద్ది పరచాలని ఈ బ్లాగ్ ద్వారా తెలియ పరుస్తున్నాను నేను మొదట 9 సమ్వస్చరాలు మాధమేతిక్స్ భోధకుడిగా పనిచేసాను, మరియు ఇంగ్లిష్, తెలుగు టైపిస్ట్  గా పనిచేసినాను,  ఆ అనుభవమే,  నాకు తెలుగు భాషా బివృద్ధికి,  లెక్కలు అన్న భయం పోగొట్టాలని నా కృషి ని, మీరందరు  సహకరించగలరని ప్రార్ధించు  తున్నాను, తప్పులు దొర్లిన క్షమించి మన్నిమ్చగలరని వేడుకుంటున్నాను,  అందుకనే నేను " ప్రాంజలి - మల్లాప్రగడాస్ మాధమేటిక్స్ " ద్వారా లెక్కలను విశద పరుస్తున్నాను, నేను మొట్ట మొదట కాశి వేల్లినతర్వాత ఆ పరమేశ్వరుని కృపవల్ల, కులదైవం శ్రీ వేంకటేశ్వరుని దయవల్ల,  నేను కవితలు కధలు వ్రాయుట మొదలు పెట్టినాను, అప్పటిదాకా నేను అకౌంటెంట్ గా, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ గా, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ప్రస్తుతము అసిస్టెంట్ ట్రజరి  ఆఫీసర్ గా పని చేస్తున్నాను.
నా సలహా ఏమిటంటే ప్రతిఒక్కరు " నిన్నటి గురించి విచారించద్దొ , నేటి గురించి చర్చించ వద్దు, రేపటి గురించి ఆలోచించ వద్దు "   ప్రతి విషయాన్ని ప్రకృతి అనుసరించి, ఇంట్లో  ఉన్న వారిని గమనిస్తు, మనము నముకున్న ఆదిదేవతలను కొలుస్తూ, మన ప్రవర్తన ఉండాలి, వెలుగు నిచ్చే అమ్మవారిని, తేజస్సును, ధైర్యమును, ఆరోగ్యమును ఇ చ్చె  హనుమంతున్ని ద్యానిమ్చే మార్గం నాది మీరు కూడా  ప్రార్దిమ్చితే మనసు  ప్రశాంతం, మంచి మాట, ఆరోగ్యము కలుగుతాయని నా నమ్మకము నన్ను,నా బ్లాగ్ను ఆదరిస్తు ఉన్న వారికీ మరియు పెద్దలు మహానుభావులు, కవులు పండితులు పేరు పేరు న ప్రతిఒక్కరికి నా శతకోటి వందనములు, మీ అందరి అశీర్వాద బలముతో నాకు తెలిసినవి, నేను నేర్చుకున్నవి " ధర్మాన్ని రక్షించాలని, న్యాయాని నిలబెట్టాలని సత్యం పలుకు జీవతమ్ గడపాలని ఒక ధ్యేయంతో ముందుకు పోతున్న వాడిని,  మనం భారతీయులమ్ దేశానికి రక్షణగా నిలబడుదాం, నలుగురికి సహాయపడుదాం,  స్నేహానికి విలువ నిచ్చి బ్రతుకుదాం.  ప్రేమిమ్చుదాం,  ప్రేమను పంచుదాం ,ప్రేమకు విలువ నిచ్చి బ్రతుకుదాం.      అందరు సుఖముగా ఉంటె మనము సుఖముగా ఉండ గలుగుతాము స్త్రీ లను గౌరవిమ్చుదాం, పెద్దలని ఆడరించుదాం, పిల్లకు విద్య బుద్ధులు నేర్చుకొనుటకు సహకరించుదాం, వారి భవిషత్తు దేశానికి ఉపయోగ పడే విధముగా తీర్చి దిద్దుదాం
ఇప్పటిదాకా ప్రేమ ఎవరిపై ఉండాలి అన్న దానికి న భావన మాత్రమె మొదట మనల్ని మోస్తున్నా భూమాతపై ప్రేమ ఉండాలి, కన్న బిడ్డలుగా బ్రతకటానికి సహకరిస్తున్న దేశమాత పై ప్రేమ ఉండాలి, మనల్ని ఆదరిస్తూ మనల్ని ప్రోశ్చహిమ్చి, విద్యా బుద్దులు నేర్పిన గురువు గారిపై ప్రేమ ఉండాలి, మనకు సహకరించిన స్నేహితులపై ప్రేమ ఉండాలి, మన కున్న  తల్లి తండ్రుల ఋణము తీర్చుకొనె అవకాము కలగాలి, వారిని ప్రేమతో ఆదరించి, వారి మనస్సు భాధపడ కుండ మన ప్రవర్తనను మార్చు కుంటూ, వారి శేష జీవితానికి మనవంతు సహకారం అన్దిస్తూ, వారిని        గౌరవించుతూ,   ప్రేమించాలి, ముఖ్యముగా మన గురించి ఆహార్నిసాలు ఆలోచిస్తూ, ప్రేమను అందిస్తూ, సుఖ శాంతులను కలుగ చేస్తు, ఆరోగ్యవంతుడిగా పౌష్టికాహారం అందిస్తూ, అనారోగ్యునిగా ఉన్నా మందులు ఇచ్చి సేవచేస్తూ, సమయానికి సలహాలు ఇస్తూ నమ్ముకొని పుటింటి వారిని వదులుకొని మనకు సర్వం అర్పిస్తున్న శ్రీమతిని ప్రేమించాలి.    
ప్రేమను పొందటానికి నిర్మలమైన మనస్సుతో కోరేది ప్రేమ !
అనుకున్నది సాధించుటకు మురిపములు అందిమ్చి పొందే కపట ప్రేమ !
ఇతర్లు తమధర్మం పాటించకపోతే, ధర్మమార్గంలో నడిపే ఆగ్రహిమ్చేప్రేమ !
కల్లబొల్లి మాటలనునమ్మక వాస్తవ దృష్టిని గ్రహించి పొందేది వాస్తవ ప్రేమ !
భార్యభర్తలమద్య ఉండేది, అన్దరూ బాగుండాలని చెప్పేది, సృష్టి కర్త  ప్రేమ !
ఆకర్షణకు లొంగి, విశ్వాసముతో ఏకంగా మారి పెద్దలను ఎదిరించే   ప్రేమ !
కన్నపిల్లలుతిట్టినా,కొట్టినా,చీదరించు
కొన్న,ప్పు పిల్లలది కాదని, నా దే నని తప్పూ అన్న కన్నా తల్లి ప్రేమ !

అందాలు వెదజల్లి, మనసును, ధనమును దోచి,  రోగమును పంచే కపట  ప్రేమ !      
84  లక్షల జీవరాసులలొ ప్రేమలేని ప్రాణి లేదు, అన్నింటిలో ఉంటుంది ప్రేమ !
కొండగాలి విచే చోట, పూల పరిమళాలు వెదజల్లే చోట ఉంటుంది ప్రేమ !
అలల తుంపర్లు వెదజల్లే చోట, చిరుజల్లుల్లో తడిసిన ఉంటుంది ప్రేమ !
కిరణాలు విస్తరిమ్చినచోట, ఇంటిని చక్కగ్గా అలంకరించిన చోట ఉంటుంది ప్రేమ !
మమతలుకలసి మనసైనచోట, పేగు భంధం కలసినచోట ఉంటుందిప్రేమ!
  
 
ప్రేమించటము కన్న ప్రేమించ బడటం అసలైన నిజమైన ప్రేమ


  శ్రీమతి  ఒక దివ్య మణి
 నయన మనోహర కలువల అపరంజి  మణి !
మనసును దోచే, నవ నవోన్మష రక్తి స్వరూపిణి !
కోరికలు తీర్చి, యశస్సును పెంచే, యశశ్విణి  !
మనోధైర్యం, తేజస్సును వృద్ధి పరిచే, తేజస్విణి  !
ధర్మశాస్త్రములు తెలి
పి, ఆదు కొనే అంతర్వా ణి  !
కొన్ని విషయాలు తెలిసుకోనుట
కు,  సహాయపడే అన్వేషిణి !
మనసును మెప్పించిన, వారి కోర్కెలు తీర్చిన, అభిలాషిణి !
అంతరాత్మను ప్రభోదించి, అవసరమునకు సలహాఇచ్చె, ఆత్మజ్ఞాణి !
ఆస్తిని, అదాయమును,పెంచి ఆహారమును అందించే, అన్నప్రదాయిణి ! 
పురాణములు, వేదములు అనర్గాలముగా వర్ణించి చెప్పే, అవృత్తిణి !  
ఇంటిని, సభను, పిల్లలను,  హుందాగా తీర్చి దిద్దన, అస్థాణి !
కామాందులకు, దుర్మార్గులకు, దుష్టులకు, చిక్కిన ఆహుతిణి !
పరిమళాలు వెదజల్లి, మనస్సును ఉల్లాసపరిచే, ఇష్ట ఘంధిణి !
రౌద్రరసమును చూపి, శత్రువుల గుండెలలో ఉండే, ఉగ్రరూపిణి !
మనో భిష్టమును నెరవేర్చి, ఉచ్చాహమును పెంచే, ఉజ్వల రాణి !           
తెలివితో తెలియనివి తెలియపరిచే ఉపన్యాసిణి !
ఉపవాసములు ఉండి ఉపాయములు తెలియపరిచే ఉపచారిణి !
భర్త దుర్వసనములు లోనైతే వ్యసనములను మాన్పిమ్చే ఉపాధ్యాయిణి !
ఉరొభాధను భరించి ఉష్ణమును పెంచి ఉన్మాదునికి ఊరట కలిగించే విలాసిణి !
బలము, ధెర్యము, మనోనిగ్రహ శక్తి పెంచే తేజస్సుగల ఓజస్వి ణి !
అనారోగ్య భర్తను ఆరోగ్య్యవంతునిగా మార్చుటకు శ్రమించే ఔషదణి !    
   నవనీత హృదయ వేణి , మంజుల మధుర వాణి ! "శ్రీమతి  ఒక దివ్యమణి - మాట మంజులమధుర వాణి"