23, మార్చి 2013, శనివారం

13.Kanakadhaaraa Sthavamu (Stotram)



  
www.mallapragadaramakrishna.blogspot.in.              
                శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన
                                                  కనకధారాస్తవము
ఆంధ్రపద్యానువాదకర్త: కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారు 
                        (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )

                    నా స్నేహితుడు కీర్తిశేషులు శ్రీ అక్కిరాజు వేంకటేశ్వరశర్మగారి     కుమారుడు "శ్రీధర్ " అందచేసిన శ్రీ జగద్గురు  శంకర భాగవత్పాదులచే రచితమైన కనకధారాస్తవము (ఆంధ్ర పద్య తాత్పర్య సహితము )
ఆన్ లైన్ లో ప్రతివక్కరు చదువుకొనుటకు, ముద్రణద్వార నలుగురు ఒక చోట కూర్చొని భక్తితో లక్ష్మీ దేవి కరుణా కటాక్షము, సమస్త శుభములు కలగాలని ఇందు పొందు పరుస్తున్నాను.
                         సర్వేజనా స్సుఖినోభవంతు                                                                                                విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ 
                            పరిచయము                                          శ్రీ శంకర భగవత్పాదులు  బ్రహ్మ చర్యాశ్రమమునవలంబించి  మధుకర వృత్తితో జీవించుచు వేద వేదాంగాది విద్యల నభ్య్యసించు  చున్నకాలమది. ఆయన ఒకనాడు మధుకరమునకై  ఒక గృహము వాకిట నిలిచి "భవతి! భిక్షాందేహి" యని అనెను.  ఆ ఇల్లాలు నిరుపేద . మహాసాద్వి  తమ  పేదరికమునకు వగచుచు ఒక్క ఉసిరిక పండును భిక్షగా పెట్టి కన్నీరు కార్చేను.  శ్రీ శంకర దేశి కేంద్రుడు ఆశువుగా ఇరువదినాలుగు శ్లోకములతో శ్రీ మహాలక్ష్మిని స్తుతించెను.  ఆ దేవి ప్రత్యక్షమై శ్రీ శంకరులు కోరిన విధముగా బంగారు ఉసిరిక  పండ్లను  ఆ నిరుపెదరాలి  గృహమున వర్షముగా  కురిపించెను.    శ్రీ శంకర భగవత్పాదులు  ఆ లక్ష్మీదేవినిస్తుతించిన ఇరువదినాలుగు శ్లోకములకే  కనకధారాస్తవము (స్త్రోత్రము) అని పేరు .  దీనిని అనుదినము చదివిన వారికి సకల సంపదలు చేకూరును.  అనాదిగా అనుదినము అనేకమంది దీనిని చదువుతున్నారు,  భారతదేశము మరియు  ఇతర దేశాలలో ఉన్న తెలుగువారు  మరియు   ప్రతిఒక్కరు చదివి ఆ లక్ష్మిదేవి కృపకు పాత్రులగుదురు.  


                                    

1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 
           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్.
 

2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ 
            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం
            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా
            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     
 

3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:
            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని
            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   
           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:
 

4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష
            మానందహేతు రధికం మురవిద్విషో పి
            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం
             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   
 

5.శ్లో.     అమీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం
             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం
             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:
 

6.శ్లో.      కాలాంబుదాళి  లలితితోరసి కైటభారే:
              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ
              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:
               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 


7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 
               హారావళీవ   హరినీలమఈ 
వినిభాతి
               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా
               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా: 

8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్
                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన
                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం
                మందాలసంచ  మకరాలయ కన్యకాయా:

9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా
                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే
                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  
               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే
               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:

11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి
              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి
              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  
              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:

12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై
              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై: 


13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై
                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై
                 నమోస్తు సోమామృత సోదరాయై
                  నమోస్తు నారాయణ వల్లభాయై

14.   శ్లో :   నమోస్తు హే
మాంబుజ పీటికాయై
                నమోస్తు భూమండల నాయి కా యై
                 నమోస్తు దేవాది సుపుజితాయై
                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :

15: శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై
                నమోస్తు విష్ణో రురసి స్థితాయై
                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై
                  నమోస్తు దామోదర  వల్లభాయై :

16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై
                నమోస్తు
భూత్యై భువన ప్రసూ త్యై
                 నమోస్తు దేవాదిభి రర్చితాయై
                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :

17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని
                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని
                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  

18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:
                 సేవకస్య  సకలార్ద  సంపద:
                 సంతనోతి వచనాం గ  మానసై
                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే
                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే
                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే
                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం

20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట
                     స్రగ్వా హినీ  విమల
చారు జల ప్లు తాంగీం
                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష
                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం

21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం
                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :
                     అవలోకయ
చారు మా  మకించ నానాం
                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

22.
శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే
                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం
                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం
                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం

23.
శ్లో :       కమలాసన పాణినా లలాటే 
                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:
                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే
                   ధనిక 
ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 


24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;
              వక్షస్థలం భర్త్రు గృహం మురారే
              కారుణ్యత: కల్పయా పద్మవాసే !
              లీలా  గృహం మే హ్రుదయార విందం

25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్
               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం
               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో
               భవంతి తే భువి బుధ భావితాశయా;      


.................................................................................................................................................................

1) శ్లో.  వందే వందారు మందార మిందిరా  నందకందలమ్ 
           ఆమందానంద  సందోహ భంధురం సింధురాననమ్
 

ప:          ఇందిరా నంద కందలు నేకదంతు
              అఖిల పందారు మందారు నభయవరదు
              ప్రవిమలానంద సందో హ భందురుని ప్ర
              నటుల్ నర్పింతు భక్తి  విఘ్నంబు  తొలగ  

 ............................................................................................................
2) శ్లో.   అంగం హరే: పులక భూషణ మాశ్రయంతి
            భ్రుంగాంగ నేవ ముకులాభరణం తమాలం
            అంగీ కృతాఖిల విభూతి రపాంగ లీలా
            మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయా:     
 

ప:   రంగాగుమోగ్గలంబరగు రమ్యత మాలముపైకినేగు సా
       రంగి యనంగ వెన్నుని యురమ్మున నుండిన సారసాక్షి ఆ
       మంగళమూర్తి  నాపయి సమంచిత ముగ్ధ  కృపావలోకనా
       పొంగ  కటాక్ష లీలలను బర్వేడుగాక నిరంతరంబుగా

 
తా:    మొగ్గలే  నగలు గాగల తమాల వృక్షమును ఆడు తుమ్మెద ఆశ్ర  

          యించినట్లు, పులకలతో  నిండిన శ్రీ హరిపైకి ప్రసరించు నదియు  
          భక్తులకు సర్వసంపద లొసంగు  జాలు నట్టి మంగళ  
           దేవతయైన  లక్ష్మీదేవి కరుణ తోడి కడగంటి చూపు నాకుమంగళ 
           ముల నోసంగునుగాక .         
.............................................................................................................
3)శ్లో.    ముగ్ధా ముహర్విదధతీ వదనే మురారే:
            ప్రేమ త్రపా ప్రణిహితాని గతా గతాని
            మాలా దృశో  ర్మ్దుదుకరీవ మహోత్పలే యా   
           సామే శ్రియం దిశతు సాగర సంభవాయా:
 

ప:    చూచుచు  ప్రేమతోడ హరి సుందరరూపము,  శౌరి ప్రేమతో
        జూచినయంత సిగ్గుమెయి చూపుమరల్చుచు నుత్పలంబులో
        నేచు మరందముంగొనగ నేగెడి  భ్రుంగి విలాసలీలలన్
        దోచేడు భాగ్యలక్ష్మి కృపతోడుత  నన్నును జూచుగావుతన్   

 
తా:      మకరమ్దముకై నల్లగలువపైకి రాకపోకలు సాగించు ఆడు   

             తుమ్మేద వలె శ్రీ మహావిష్ణువు మొగముపైకి ప్రేమతో సిగ్గుతో 
             మనోహరములగు చూపులను పరపుచు అయన 
             చూచినంతనే  మాటికి సిగ్గుతో మరల్చునట్టి లక్ష్మీదేవి  
             చూపుల పరంపర నాకు సిరిసంపద లోసగునుగాక.
........................................................................................................
 
4.శ్లో.    విశ్వా మరేంద్రపద విభ్రమ దాన దక్ష
            మానందహేతు రధికం మురవిద్విషో పి
            ఈ షన్నిషీదతు మయి  క్షణ మీ క్షణార్ధం
             ఇందీ వరోదర సహోదర మిందిరాయా:   


 ప:     ఈ యగుజాలునట్టి దమరేం ద్రుని రాజ్యమునైనగని, నా
          రాయనమూర్తికెంతయు ముదావహమైనది, తమ్మిదుద్దుమే
          ల్చాయకు సాటివచ్చునది సారసవాసినిఐన లక్ష్మి  అ
          త్యాయత లోచనాంచల కటాక్షము నాపైబర్వుగావుతన్
 
తా:     దేవేంద్రుని రాజ్యమునైన ఈయగలదియును శ్రీ మహా  

           విష్ణువునకు ఆనందము  కలిగించునది    యును, తామర  
           దుద్దు పసిమి మిసిమి గలిగిన మేనిఛాయగల లక్ష్మీ దేవి
           కరుణా కటాక్షము  నాపై సదా ప్రసరించు  గాక      

 .....................................................................................................
5.శ్లో.     అమిలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
             ఆనంద కంద మనిమేష  మనంగతంత్రం
             ఆకేకరస్థిత కానీనిక పద్మనేత్రం
             భూత్యై భవే న్మమ భుజంగ  శయాంగనాయా:
 

ప:     అరమర లేని ప్రేమను ననంగుని మోహము మోడ్పుకన్నులన్
        గురియగుదన్నుజూచెడి ముకుందుని మోహమును గాంచి సిగ్గుచే
        మురిపెముగా మురారి నరమోడ్పు కనంగతోడ జూచు ఆ
        సిరి కరుణా కటాక్షములు శ్రీల నొసంగుత నాకు నెప్పుడున్

తా:   మన్మధుని ప్రేరణచేత అమందానందముతో, అరమోడ్పు      

        కన్నులతో రెప్ప వాల్చక తనవైపు చూచుచున్న మహావిష్ణువును 
       గాంచి సిగ్గుతో కమలములవంటి అరమోడ్పు  కన్నులతో  కంటి
        పాప నోరగా జేసి పతివైపు చూచుచున్న పాలకడలి పట్టి లక్ష్మీ దేవి 

        కటాక్షము నాకు సమస్తైశ్వరములు నోసగుగాక.  
............................................................................................................
6.శ్లో.      కాలంబుదాళి  లలితితోరసి కైటభారే:
              ధారాధరే స్పురతి  యా తటి  దంగనేవ
              మా తుస్సమస్త జగతాం  మహానీయమూర్తి:
               భద్రాణి మేదిశతు భార్గవ నందనాయా: 



ప :            నీలపయౌ ధరంబునను నిగ్గులుదేరు తటిల్లతాంగానం
                 బోలిమురారి వక్షమున మొదముతోడ వసించి కుర్మిమై
                 హేలగ సర్వలోకముల నేలుచు నుండెడి  కన్న  తల్లి  ప
                 ద్మాలయ  నాకోసంగుతను మంగళముల్ సతతం  

                 బుదారతన్

తా:           నల్లని మబ్బులో మెర యు చున్న మెరుపు తీగవలె  శ్రీ 

               మహావిష్ణు హ్రుదయమున వసించుచు, సమస్త లోకములను 
                చల్లగా పాలించు కన్న తల్లి భ్రుగు నందనయగు  లక్ష్మీ  
                దేవి నాకు సమస్త శుభములు నొసంగును గాక             

........................................................................................................... 
7. శ్లో :     బాహ్వాంతారే మురజిత: శ్రితకౌస్తుభే యా 
               హారావళీవ   హరినీలమఈ  నిభాతి
               కామప్రదా భాగవతోపి  కటాక్షమాలా
               కళ్యాణ మావహాతు మే కమలాలయాయా: 
 


ప:  అతులిత కౌస్తుభం బురమునందున దాల్చిన విష్ణు  వక్షమం
      దతి  రుచిరంబు నీల మణిహారము వోలె వెలుంగు నిందిరా
      సతి సవిలాస ముగ్ధ వికసన్నవకైరవ  లోచనాంచలా
      తత కమనీయదృక్కులు సతంబు శుభంబు లోసంగు గావుతన్

తా:  కౌస్తుభ రత్నాలంకృతమైన శ్రీ మహావిష్ణువు వక్షమునందు  

       వసించేడి  లక్ష్మీ దేవి యో క్క ఇంద్ర నీల మణిహారము వలే 
       విరాజిల్లు కరుణా తరంగితములైన కడగంటి చూపులు సదా నాపై  
       ప్రసరించు నుగాక.  

 .......................................................................................................
8. శ్లో :      ప్రాప్తం పదం ప్రధమత: ఖలు యత్ప్రభావాత్
                మాంగల్య  భాజి  మధుమాధిని మన్మధేన
                మయ్యా పతే  త్తదిహ మంధర మీక్షణార్ధం
                మందాలసంచ  మకరాలయ కన్యకాయా:
 

ప:  ఏయమప్రేమపూర్ణములు దృక్కులు విశ్వ ము నేల్లగావ, నా    
      యణమూర్తి కాదినిననంతముశక్తినొసంగేనట్టి                                
      త్యాయత పద్మనేత్ర మకరాలయపుత్రి కటాక్షవీక్షణల్
      చేయుత  మంగళంబుల సశేషముగాను నిరంతరంబుగా

తా:  సంపూర్ణప్రేమ భరితములైన ఏ చూపులు సృష్ట్యా దిని శ్రీ 

       మహావిష్ణువునకు విశ్వసంరక్షనకై అనంత శక్తి నొసంగెనో అట్టి  
       క్షీరసాగరతనయయగు లక్ష్మి దేవి కటాక్షవీక్షణములు నాపై 
       ప్రసరించును గాక.
...........................................................................................................  

9. శ్లో :      దద్యా ద్దయ్యానుపవనో ద్రవిణాంబుధారా
                మస్మి న్నకించన విహంగశిశౌ  విషణ్ణే
                దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
                నారాయణ ప్రాణయినీ  నయనాంబువాహ:

ప:  కరుణా మారుత చోదితంబులతులే కల్యాణి దృక్పధముల్
      చిర కాలార్జిత పాపపుంజము వలె న్వేదంబు పోకార్చునో
      పరితప్తాకుల చాతకంబునగు నాపై నార్తి చల్లారగా
      కురియుమ్గాక దరిద్రతా జడిమ లేకుండా న్నిరుల్ సంపదల్

తా:  శ్రీ మహావిష్ణువు ప్రియసతియైన శ్రీ మహాలక్ష్మి కటాక్షవిక్షణ మనేడి  

      మేఘము దయయను మారుతముచేత ప్రేరితమై చిరకాలార్జిత పాప 
      రూపమగు చెమటను పోగొట్టి పేద చాతక  పక్షికూననగు నాపై కనక 
       వర్షమును తనివితీరా కురియునుగాక .  
..........................................................................................................
10.శ్లో       ఇష్టా వశిష్ట మతయోపి యయా దయార్ద్ర  
               దృష్టా స్త్రివిష్ట మపదం  సులభం భజన్తే
               ద్రష్టి: ప్రహృష్ట కమలోదరదీప్తి రిష్టాం
               పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా:
 

ప:  అనయం బెవ్వడు పుణ్యకార్యముల జేయన్లేదో యవ్వానికిన్
      అనంఘంబైన మహేం ద్ర రాజ్యమును నీయంజాలునో  సత్క్రుషణ్
     కనకాభ్జోదర సోదరంబాగు తటిత్కామ్తి స్త్రకాసిమ్చు ఆ
     కనదబ్జాసన  లక్ష్మి  నాకిడు సనర్ఘంబైన భాగ్యంబులన్

తా:  ఎన్నడును ఎట్టి పుణ్యమును కుడ  చేసి యుమ్దరో అట్టి వారికి  

       సైతము దయతో దేవేంద్ర పదవినైన ఈయగల్గినదియును 
       పద్మములోని పసిడి కాంతులుగల మేనిచాయ గల లక్ష్మీ దేవి
       కటాక్ష వీక్షణము నాకు అనంత సంపదల నొసగును గాక.  
 ........................................................................................................

 11.శ్లో      గిర్దేవతేతి  గరుడధ్వజ సుందరీతి
              శాకంభరీతి శశి  శేఖర వల్లభేతి
              సృష్టి  స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై  
              తస్యై  నమ స్త్రిభువనైకగురో స్తరు ణ్యై:


ప:  వనజభవునకు సృష్టిలో వాణి  యనగా
      రక్షణము నందు శౌరికి రమ యనంగ
      ప్రళయవేళను శివునకు పార్వతి యన
      సాయపడు నిందిరకును సాస్టాంగ నతులు

తా:  లోకములను సృజించువేళ  బ్రహ్మాకు సరస్వతిగాను, లోక రక్షణ    

        మందు నారాయణునకు లక్ష్మిగాను ప్రళయ కాలమున 
        శంకరునకు  శాకంభరియనబడు  పార్వతిగాను 
        సర్వవిధముల  సహకరించు ఆ పరాశక్తికి నమస్కారములు.    

...............................................................................................................................................................
12. శ్లో     శృ త్యై  నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
               రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 
              శక్యై నమోస్తు శతపత్ర  నికేతనాయై
              పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ ఫల్లభాయై:


ప:  శుభ ఫలప్రద  యగునట్టి శ్రుతికి సతులు
      రమ్య గుణరత్న నిధిఐన రతికి సతులు
      స్వ ఛ శత పాత్ర  వాసినీ  శక్తి  సతులు
      పూజ్య పురుషోత్తముని పత్ని పుష్టి సతులు

తా:  యజ్ఞాది పుణ్యకార్యములకు కారణ భూతఇన వెదరూపిణికి  

       శ్రీలక్ష్మికి నమస్కారములు,  సద్గుణములకు సాగారమైన రతి 
       స్వరూపిణికి నమస్కారములు, నూరు రేకుల పద్మ మందు  
       వసించు శక్తి  స్వరూపిణికి నమస్కారములు.  పురుషోత్తముడగు 

       విష్ణు దేవునకు పత్నిఐన  పుష్టి  స్వరూపిణికి నమస్కారములు.
...............................................................................................................................................

13.  శ్లో :    నమోస్తు నాళీ క నిభానానయై
                 నమోస్తు దుగ్దోదధి  జన్మభూమ్యై
                 నమోస్తు సోమామృత సోదరాయై
                  నమోస్తు నారాయణ వల్లభాయై


ప:  సరసిజాత  సమాస్యయౌ సతికి నతులు
      క్షీరసాగారభవయైన సరికి నతులు
      తత సుధాకర సుధల సోదరికి నతులు
      సరసిజోదర పత్నికి సతము నతులు

తా:  కమలమువంటి మొగముగల లక్ష్మికి నమస్కారములు.  పాల 

       కడలి గారాబుపట్టియగు సిరికి నమస్కారములు.  చంద్రునకు  
       అమృతమునకు తోబుట్టువగు  లక్ష్మికి నమస్కారములు.  శ్రీ 
       మహావిష్ణువునకు ప్రియసతి ఐన  లక్ష్మీదేవికి నమస్కారములు. 

 ...........................................................................................................
14.   శ్లో :   నమోస్తు హేమామ్భుజ పీటికాయై
                నమోస్తు భూమండల నాయి కా యై
                 నమోస్తు దేవాది సుపుజితాయై
                  నమోస్తు శార్జాయుద వల్లభాయై :


ప:  కనక పద్మ నివాసినీ  కమల నతులు
      రమ్య భుమండలంబెలు రాజ్ఞి నతులు
      వానవాదుల కరుణించు పద్మ నతులు
      శార్జ  పాణిప్రియా సరోజాన్య  నతులు  

తా:  స్వర్ణ పద్మ వాసినియగు లక్ష్మీదేవికి నమస్కారములు.  సమస్త 

       భుమండలమును పాలించు మహారాజ్నికి నమస్కారములు.  
       ఇంద్రాదేవతలను కరుణతో కాపాడు కన్నతల్లికి నమస్కారములు.  
       సార్జమను విల్లు గల శ్రీ మహావిష్ణువునకు ప్రియసతిఐన శ్రీ 
       మహాలక్ష్మికి నమస్కారములు.
.........................................................................................................
15: 15. శ్లో :     నమోస్తు దేవ్యై  భ్రుగునందనాయై
                నమోస్తు విష్ణో రురసి స్థితాయై
                 నమోస్తు లక్ష్మ్యే కమలాలయాయై
                  నమోస్తు దామోదర  వల్లభాయై :
 

ప:  భ్రుగుతనూభవ అలికులవేణి నతులు
      విష్ణువక్షోనివాసినీ వేలనతులు
      కమలవాసిని శ్రీ దేవి కమల నతులు
      నతిననాభుని వల్లభా నతులు నీకు

తా:  భ్రుగు మహర్షిపుత్రిఐన శ్రీదేవికి నమస్కారములు.  శ్రీ విష్ణు వక్షస్థల 

       నివాసినికి లక్ష్మికి నమస్కారములు.  కమలవాసినిఐనకమలకు 
        నమస్కారములు.  నందసుతుడైన శ్రీ  కృష్ణునకు   రుక్మిణి 
        నామముతో పత్నిఐన శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు.      
........................................................................................................
 16.:శ్లో :    నమోస్తు కాన్యై కమలేక్షణాయై
                నమోస్తు
భూత్యై భువన ప్రసూ త్యై
                 నమోస్తు దేవాదిభి రర్చితాయై
                  నమోస్తు నందాత్మజ  వల్లభాయై :


 ప:  కాంతి రూపిణి  ఐన ఒకమల  నతులు
      అఖిల సంపత్ప్ర దాయి నీ  అంబ నతులు
      దేవముని గణపూజితా దేవి  నతులు
      నందన సుత వల్లభా పద్మన  న నతులు

తా:  పద్మములవంటి  కన్నులుగల కాంతరూపిణికి   

      నమస్కారములు.   లోకజననికి, ఐస్వర  రూపిణికి  
      నమస్కారములు,  ఇంద్రాది దేవతలు చేత పుజింప బడు
      శ్రీదేవికి నమస్కారములు. నందసుతుడగు శ్రీ కృష్ణునకు
    రుక్మిణి నామముతో సతిఐన లక్ష్మీదేవికి నమస్కారములు .     ...........................................................................................................
17: శ్లో :      సంపత్కరాణి  సకలేంద్రియ నందనాని
                  సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
                  త్వద్వందనాని దురితాహరణోద్యతాని
                  మామేవ మాత రనిశం కలయంతు మాన్యే  


            ప:  సకల సంపత్క రంబులు  సారసాక్షి
                  విందు లఖిలేంద్రి  యమల ఆనందములకు
                  పాపహరములు సామ్రాజ  అ  భాగ్యదములు
                  పద్మ జనయిత్రి నీకిడు వందనములు

తా:  పద్మ పత్ర విశాలలోచనా మాతా నీకు చేయు    

       వందనములు , సకల  సంపద్ర్పదములు
       సకలెంద్రియములకు ఆమమ్దా అమందా నంద ముల
       విందు చేయును .  సర్వ పాపములను తొలగిమ్చును. 
       సామ్రాజ  వైభవమును  సైతము యీయ గలవు. తల్లి
       నీకు సదా వందన మొనర్చు భాగ్యము  నాకే 
       కలుగునుగాక  
............................................................................................................
18. శ్లో :       యత్కటాక్ష సము పాసనా  విధి:
                 సేవకస్య  సకలార్ద  సంపద:
                 సంతనోతి వచనాం గ  మానసై
                 త్వాం  మురారి హ్రుదయేశ్వరీం  భజే.  


ప:  సకల సంపద్ర దంబులు  జనని నీదు
      సాంద్ర  కరుణా కటాక్ష వీక్షణములమ్మ
      భక్తితో గొల్తు నీ పాద పద్మములను
      స్తుతి యో నార్చెద త్రికరణ  శుద్ధిగాను

తా:  ఎవరి కరుణా కటాక్ష వీక్షణము  భక్తితో సేవించు వారికి సమస్త 

        సంపదలోసంగునో అట్టి మహాలక్ష్మీ  శ్రీ హరి హృదయేశ్వరి  నిన్ను 
       త్రికరణ శుద్ధిగా ఆరాధించెదను 
.........................................................................................................................................................................
 ..........................................................................................................................................................................
19. శ్లో :        సరసిజ నయనే సరోజ హస్తే
                    ధవళ తరాం శుక  గంధ మాల్య శోభే
                    భగవతి హరివల్లభే మనోజ్జ్నే
                    త్రిభువన భూతికరి ప్రసీద మహ్య్యాం 


ప :  కమలలోచన  జనయిత్రి  కమలహస్త
       ధవళతర గంధ  మాల్య  వస్త్రా మానోజ్న
       భగవతీ  హరివల్లభా భాగ్యదాత్రి
       కరుణతో  బ్రోవుమా మమ్ము కన్నతల్లి.

తా : కమలముల  కన్నులు గల తల్లీ,  కమలము కరమునందు  గల 

        జననీ,  తెల్లని పట్టు వస్త్రములను ధరించి, తెల్లని గంధమును 
        పూసికొని, తెల్లని పూలమాలలతో శో భిమ్చు లక్ష్మీ దేవి,  
        నారాయణ ప్రియసతీ, నన్ను అనుగ్రహింపుము.    
         ............................................................................................................
20. శ్లో :         దిఘస్తిబి: కనకకుంభ ముఖావ సృష్ట
                     స్రగ్వా హినీ  విమల
చారు జల ప్లు తాంగీం
                     ప్రాతర్నమామి జగతాం  జననీ మశేష
                     లోకాధినాథ గృహిణీ   మమృతాబ్ది పుత్రీం 


ప:  కనక కలశాల  నాకాశ  గంగ దెచ్చి
      తీ ర్ధ మాడింపగా నిన్ను దిగ్గజములు
      స్నాతవై  యోప్ప త్రైలోక్య జననీ  క్షీర
      వారాశి  పుత్రికా వందనములు

తా:  బంగారు కలశములతో నిర్మలమైన ఆకాశ గంగా నది 

       జలములను  తొండముతో దిగ్గజములు తెచ్చి స్నానము 
       చేయింపగా  నిర్మల  శరీరముతొ ప్రకాశించుచున్న తల్లీ, సమస్త 
       లోకములకు  ప్రభువైన నారాయాణుని ప్రియ పత్నీ  
       నమస్కారములు      .............................................................................................................
21. శ్లో           కమలే కమలాక్ష వల్లభే త్వం
                     కరుణాఫూ ర తరంగితై  రపాంగై :
                     అవలోకయ
చారు మా  మకించ నానాం
                     ప్రధమం పాత్ర మకృ త్రిమం దయాయా:

             
ప: కమల కమలాక్షవల్ల్లభా కమలనయన
     కనుము కరుణా కటాక్ష వీక్షణముతోడ
     వరమ దారిద్ర్య  వంతులం బ్రథముడనగు

        నన్ను బ్రోవుము! దినునిగన్న తల్లీ !
                
                   పద్మదళములవంటి కన్నులు గల తల్లీ !  పద్మాక్షుడగు  నారాయణుని  ప్రేయసి!   నేను పరమ దరిద్రులలో ప్రథముడను, నీ  దయకు పాత్రుడ నగు నన్ను కరుణా వీక్షణములతో కనుగొనుము  
.............................................................................................................
22.
శ్లో :        బిల్వాట వీమధ్య లసత్సరోజే
                    సహస్రపత్రే సుఖ సన్ని విష్టాం
                    అష్టాపదాంభోరుహ పాణి పద్మాం
                    సువర్ణా వర్ణాం  ప్రణమామి నిత్యం 


ప::అమ్మ మారేడు వనములో  నలరు నరసి
     వేయి రేకుల తమ్మిలో వెలయు  దీవు
     కనక కమలము కరమున గలిగి పసిడి
     చాయ నొప్పెడి సిరి నమస్కారమమ్మ

            మారేడు వనములో గల తామర కొలనులో  వేయి  రేకుల పద్మ మందు సుఖముగా కూర్చుండి, పసిడి తామర పువ్వు కరమునందు దాలిచి మిసిమి గల మేని చాయతో నొప్పారు లక్ష్మీదేవీ  ! అమ్మ! నమస్కారము.         ...............................................................................................................,,,
23.
శ్లో :       కమలాసన పాణినా లలాటే 
                   లిఖితా మక్షర పంక్తిమస్య జంతో:
                   పరిమార్జయ మాత  రంఘ్రిణా  తే
                   ధనిక 
ద్వార నివాస దు:ఖ దోగ్ద్రీం 

ప: నాదు  నుదుటను వ్రాసెను నలువ యిట్లు
     వరమ దారిద్ర్య  దు:ఖంబు పడయు మంచు
     కలిమి గలవారి వాకిట నిలువు మంచు
     బ్రహ్మ వ్రాతను తుడువు నీపదముతోడ

                    పరమ దరిద్రులలో ప్రథముడవై కలవారి వాకిళ్ళ ముందు నిల్చి బిచ్చమెత్తుకొనుమని బ్రహ్మదేవుడు  నా నుదుటిపై వ్రాసెను.  తల్లి నీవు ఆ బ్రహ్మవ్రాతను నీ  పాద పద్మముతో తుడిచి వేయుము 

.....................................................................................................................................................................
24. శ్లో :  అంభోరుహం జన్మగృహం భవత్యా;
              వక్షస్థలం భర్త్రు గృహం మురారే
              కారుణ్యత: కల్పయా పద్మవాసే !
              లీలా  గృహం మే హ్రుదయార విందం


ప: ముద్దు గొల్పెడి తమ్మి  నీ పుట్టినిల్లు
     ఆ మహావిష్ణు హృదయమే అత్తయిల్లు
     కమలవాసిని! కొలు వుండు  కరుణతోడ
     ఎల్లవేళల నాదగు హ్రదయ పీట్టి 
 
                    తల్లీ శ్రీ మహాలక్ష్మి పద్మము నీకు పుట్టినిల్లు, శ్రీ మన్నరాయణుని హృదయమే నీకు మెట్టినిల్లు, ఓ పద్మాలయా కరుణతో నా హృదయారవిమ్దమును నీ  విలాస మందిరముగా చెసికొనుము. 

..............................................................................................................................................................
25. శ్లో :   స్తువంతి యే  స్తుతి భి రమూ భి రన్వహమ్
               త్ర ఈ మ ఈమ్ త్రిభువన మాతరం రమాం
               గుణాధికా  గురుతర భాగ్య  భాజినో
               భవంతి తే భువి బుధ భావితాశయా;      

ప:   ఎవరు స్తుతియింతురో వారలి స్తవమున
       మాన్య వేదాత్మ త్రిభువన మాత  రమను
       అతుల సంపద గల్గి గుణాధికులయి
       పండితుల మెప్పు గాంతురు వసుధయందు

                 ప్రతిదినము ఎవరు ఈ స్తుతులతో ముల్లోకములకు తల్లి ఐయిన లక్ష్మీదేవిని స్తుతిమ్తురో వారు గుణములచే నధికులగుచు అధిక ధనవంతులై  పండితుల మెప్పు గాంతురు









.................................................................................................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి