30, నవంబర్ 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ -- ప్రేమ పారవశ్యం

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - జ్ఞాన గుళికలు 
Gül Animasyon
సర్వేజనా సుఖినోభవంతు
kavitalu

ద్వంద్వాల మయం దేహం
భందాలను ఆకర్షించి వికర్శించేవి కళ్ళు
చందన తాంబూలాలు
మధుర రసాలు ఆస్వాదిమ్చేవి పెదాలు

కరములు కుడి ఎడములు
కర్మలు చేయుటకు, దానములిచ్చుటకు
సరుకులు మోయుటకు
సరస్వతి కృపతో విద్యనభ్యసించి వ్రాయుటకు

ఒక్క అడుగు వేసి
ఒక్కొక్క అడుగుతో ప్రపంచాన్ని చుట్టేవి కాళ్ళు  
చక్కని ప్రాంతాలకు
చుక్కలు కదిలినట్లు కదిలి సుఖం పొందేవి

వినికిడి శబ్దాన్ని గ్రహించి
విన్నవి ఆచరిన్చ మనేవి కర్ణాలు
అనుగ్రహం పొందుటకు
ఆణువణువూ పరమాత్మ శ్లోకాలు వినవచ్చు
--((*))--

  (మార్గం)

ఉద్యమాలు మనల్ని
విద్య లేని వాళ్ళుగా చేసి ఆడుకుంటాయి
పద్యాల అర్ధ భావాలు
పెద్దల మాటలు మనస్సుకు శాంతి నిస్తాయి

ఆకలి ఆలోచనలతో
సక్రమముగా మానవులను బ్రతుకనివ్వదు
ఓం కారం మసస్సును
ఒకే లక్ష్యంతో మానవులను బ్రతికి బ్రతిన్చుతుంది

స్వర్గాన్ని నరకంగా మార్చేది
మార్గాన్ని విషమంగా మార్చిది ఆవేస చర్య
దుర్గునాన్ని వదలి వేసి
ధర్మ రక్షణ, సమస్య పరిష్కారాలపై చర్చ

నువ్వొక నిస్సత్తువు
కొవ్వులా పెరిగి కదలని విద్య ఉన్న రోగివి
నవ్వుల మాటలు వినక
నువ్వు సాధించాలన్న కళలో పట్టు బిగించు

తలుపు నలుపు వివక్షతో
కలుపు కోలు తనాన్ని వదులుకొని జీవించకు
సులువైన మార్గం భక్తి
మలుపు తిప్పి మనస్సుకు ప్రశాంతత చేకూర్చు

--((*))--

 ( పృధ్వి)

ఆకాశ భవణాలు రక
రకాల ఎత్తుల్లో కట్టిన భరిస్తున్నావమ్మా
సకార తవ్వకాలు తవ్వి
నా, బోరింగిలు వేసిన నీరు అందిస్తున్నవమ్మా 

నిక్షిప్త ఖనిజాలను
సంక్షిప్తముగా అందుకొని జీవించమన్నా వమ్మా 
కక్ష సాధింపు చర్యలు
తక్షణం జరుగుతున్నా, ఆదు కుంటున్నావమ్మా 

నీపై ఉన్న సముద్రంలో
పైపై తవ్విన క్రుడాయిల్ అందిస్తున్నవమ్మా
తపోవనాలు, ఆశ్రమాలల్లో
తపస్సు చేసుకోనటకు సహకరిస్తున్నావమ్మా     
  
వయసుడికి, రోగ
మయమైన శరీరముతో మరణించిన ప్రాణులను
మోయకలుగు తున్నావమ్మా
మాయ మయ్యే శరీరఖననాన్ని భరిస్తున్నావమ్మా

పృథ్వి మాతా వందనాలు
సద్వివి యోగం చేయక దుర్వినయోగం చేసే ప్రజలను
సద్విమర్సిమ్చక దేహ
ద్వంద్వాలను రక్షిమ్చుతూ బరువును మోస్తున్నవమ్మా

కన్నవారిని ఆదుకుంటావమ్మా
ఉన్న వారు వేధించిన నోరేత్తక మూగ వైనావమ్మా
నిన్ను ఎన్ని హింసలు పెట్టిన
కన్నార్పక కాపాడే భూమాతవమ్మ మా వంద నాలమ్మా  

          --((*))--
 
 (నమ్మకం)

కొమ్మ  ఎంత  ఒంగినా
నమ్మకంతో కోసేవారు ఎందరెందఱో
కమ్ముకున్న ఆకలి తీర్చె చెట్టు
నమ్మి ఫల పువ్వులను కోయుటలో తృప్తి

దూరదర్సన్ అందుబాటులో
ధరణిపై ధర్మాధర్మ సంఘటనలు చూడచ్చో
చేరువ ఉండి చూసిన     
చరా చార జగత్తును చూచుట కష్టమగు

ఆశలు తీర్చని ప్రేమ
విశాల విశ్వమ్లో నిన్నే ప్రేమించా ననుట
ఆశయాలతో ఉన్న ప్రేమ
కుశల ప్రశ్నలతో మనసు ఉల్లాస పరచు

నమ్మి దేవుని కొల్చినా 
కమ్ముకున్న ఆశలు తీర్చమంటే తీర్చడు
అమ్మ చెప్పిన మాటను
నమ్మి దేవునికొలిస్తే మనస్సు ప్రశాంతముండు

నవంబర్ 30న గురుజాడ శత వర్ధంతి
మహా కవి గురుజాడకు ప్రాంజలి ఘటిస్తూ

సామాన్య కవిగా ఉండి అ
సామాన్య మాన్యుడుగా కవిశ్రేష్టుడైన
సమాజ ఉద్దరణకు కవి
సామ్రాట్ సంస్కార హృదయడే గురుజాడ

ఆంగ్ల పాండిత్యం ఉన్న
ఆంగ్ల వ్యామోహాన్ని నిరసనకారుడై
యుగ కర్త, దార్సినికు
డుగా స్త్రీల పక్షాన  కలం చిందుల గురుజాడ

ముత్యాల సారాలను
నిత్యం తెలుగును వ్రాసిన రచయతగా  
సత్యవాదిగా కవి పా
దిత్యాన్ని ప్రజలకు అందించిన వారు గురుజాడ

నిశ్శబ్దన్ని ఛేదించే రచన లందిమ్చావు
యుగ యుగాల్లో గుర్తించే  మహా కవివి
స్త్రీల ఉద్దరనకు కంకణం కట్టుకొన్న కవివి
కవు లందరూ కలసి శ్రందంజలి ఘటిస్తున్నాము
--((*))--

చెప్పఁగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, కుంకుమ పైపై
గుప్పిన క్రియ, విరి పొట్లము
విప్పిన గతి ఘుమ్మనన్ కవిత్వము సభలన్.
.
కవిత్వం చెబితే కర్పూరం కుప్పలుగా పోసినట్టు ఉండాలట. కుంకుమ మీద మీద
.కప్పినట్టుండాలట. పూల పొట్లం విప్పినట్టుండాలిట !
ఎంత గొప్ప కోరికో కదూ ?  ( రఘునాథ రాయలు . వాల్మీకి చరిత్ర.)   ఇంకా ఉన్నది
--((*))--
(మూగ ప్రేమ )


చిరునవ్వు మనసు

పరువు కోసం పక పక అని నవ్వక  

మురి పించుట తెలపక

సరి లేరు నీకెవ్వరు అనుట ఎందుకు



స్పృహలో ఉండి కుడా ని

స్పృహ మాటలతో నన్ను వేదిన్చావు

వ్యూహాలు ఎన్నో పన్నావు వ్య

వాహారం చివర కొచ్చాకా తప్పుకున్నావు



అడుగులో అడుగు వేసి

మడుగులో కూడ జతగా విహరిన్చావు

కడు తీపి వార్తలు చెప్పావు

చెడు వార్తలు విని నన్ను వదలి వెల్లావు



చూపుతో గుండె చెదిరి వ

లపు అందుకోవాలని ఆశ పెరిగి

మాపు రేపు అన్నా ఓర్పుతో

తపన తో ఉన్న తప్పుకొని వెళ్లావు



మనసు కైనా గాయం

వయసు పెరిగిన ప్రేమ పొందే ఖాయం

సొగసు తగ్గినా ప్రేమ

మనసు చుట్టూ పరిబ్రమించు మూగప్రేమ   

                       ఇంకా ఉన్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి