27, నవంబర్ 2015, శుక్రవారం

ప్రాంజలి ప్రభ -జ్ఞాణ గుళికలు - ప్రేమ పారవశ్యం -36

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - జ్ఞాన గుళికలు 
సర్వేజనా సుఖినోభవంతు
 kavitalu
 దానము వళ్ళ పుణ్యం
దానము వళ్ళ రాగ, ద్వేష విముక్తి కలుగు
దానము వళ్ళ వంశాభివృద్ధి,  ని
దానము వళ్ళ మన స్సాంతి, మనోనిగ్రహ శక్తి    
  

 జ్ఞాన తృష్ణ కలిగి అ
జ్ఞాన తృష్ణ తొలగి, సత్యాన్వేషణలో మునిగి వి
జ్ఞాన తృష్ణ తో విద్య, సాత్విక
జ్ఞాన తృష్ణతో మనోధైర్యం కల్పించు మానవాళికి
 

 చక్కగా నేర్చిన విద్య
చుక్కలు నింగనెన్నో అంతమందికి చేయాలి భోధ
మక్కువతో చేయు పని
ఎక్కువ మంది పరిపూర్ణత చెంది కలుగు సంతృప్తి

భేద దృష్టి వదలి సమ
భాద దృష్టితో దరిచేరి సంతృప్తి పరచు
ఖేదము వదలి నిజం గ్రహించి
ముదముతో చెలిమికి సుఖం పంచుటే తృప్తి


అక్షర సత్యం లోని అర్ధం
తక్షణం నలుగురికి భోధింస్తే సంతృప్తి 
కక్ష సాధించుత సాగిస్తే 
కుక్షింబరిలా ఏకాకిగా జీవించక తప్పదు 

అంక విద్య ఆచరించి 
అంకురము గా పెరిగి సహకరించు
మంకు గా ప్రవర్తిస్తే
వంకర బుద్ది ఏర్పడి మనసు హింసించు 

https://scontent.fmaa1-2.fna.fbcdn.net/hphotos-xfa1/v/t1.0-9/s720x720/12274642_1275381652487231_1937537072075105635_n.jpg?oh=7311308c739d96f3c36177c4f4fb38df&oe=56F7EB31

 జ్ఞాన కంద గుళికలు 

కోమలి కోయిలకు చేరి
కొమ్మ కొమ్మకు రెమ్మ రేమ్మకు పువ్వులకు
కమ్మలను కదిలిస్తూ
కమ్మనీరు పంచే మాధవడొస్తాడని పలికే 



వెన్నెల   వెలుగులలో 
కన్నెల  సొగసులు వికసించే పువ్వులై
తిన్నెల యద పొంగులతో
వెన్నలా కరిగి మగని చేరి చెలిమిపంచే 

హహ ఎంత తీపి మధురం 
ఓహో ఓహో అంటూ జుర్రు జుర్రు అని త్రాగే
మహా మత్తు నిచ్చే మధురం
తహ తహ లాడుతూ ఆధరాల మదురం పొందే 


 

జవ్వని నాతొ సరి జోడా
నవ్వ కుండా నాతొ నాట్యమాడు చూసెదా
కవ్వంలా తిరుగటంకాదు
కవ్వించి నన్ను మెప్పించి నాజోడు అందుకో  


'''అశాంతి ని అరాచకాన్నీ 
అన్ని దిశల వ్యాపింపజేసే
ఆవిష హృదయాలపై 
దాడి చేయండి గళాలతో,
ఆ విష హృదయాలను
దండించండి కలాలతో....''.

తిమిరతకు ఏది ఆలవాలం?
మనిషి మనసులోని త్రుష్ణాజాలం....

దాశరధి గారి'' తిమిరం తొ సమరం'' లోని పంక్తులు..'
తిమిరం తో సమరం
సమీరం లో విహరించు టే పరవశం
కామిత తోడుంటే
సమిత్తు లులేకుండా సంసారి జీవితమ్
'అదేమిటీ ... వీరు లేరా అనుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది -
.
అంతలా మన జీవితాలతో పెనవేసుకుపోయింది ఈయన జీవితం/నటన/రూపం. 
.
వెళ్లిపోతారనుకున్నామా అసలు ఈయన? అన్నగారిని కూడా ఈయనలో చూసుకుంటూ 
.
సాంత్వన పొందామే?! అలాంటిది ... ఇప్పటి వారికేమో గానీ ...
.
ఎన్టోడు, నాగ్గాడు లేని తెలుగు చిత్ర సీమ - కళ తప్పింది.
.
ఆ లోటు ఎన్ని మెగాలు, పవర్ లు, మెట్రోలు వచ్చినా తీర్చలేనిది. అంతే ... ఆ..!'
నన్ను దోచు కుందువటే
వన్నెల దొరసాని అన్నారు జమునతో ఎన్.టి. ఆర్
నన్ను నన్నుగా బ్రతకనివ్వు
నన్ను మరిచావు అన్నారు సావిత్రితో ఎ .ఎన్. ఆర్ .

'అనగనగా ఒక కాలంలో......
ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉండేవాడు. అతను ఒక పెంటియమ్ కంప్యూటర్ పెట్టుకొని ఒక నది ఒడ్డున చెట్టు కింద కూర్చుని కొత్తకొత్త ప్రోగ్రామ్‌లు తయారు చేసేవాడు. వాటిని దగ్గరున్న సంతలో అమ్మి బియ్యం నూనె పప్పులూ కొనుక్కుని జీవనం సాగించేవాడు.
ఒకరోజు కంప్యూటర్ మీద పని చేసుకుంటుండగా అది జారి నదిలో పడిపోయింది. అక్కడ నది చాలా లోతు. దిగి తీయడం అసాధ్యం.
ఏం చేయాలా అని దిగులుపడుతుంటే చిన్నప్పుడు చదువుకున్న మూడు గొడ్డళ్ళ కథ గుర్తొచ్చింది అతనికి. వెంటనే నదీ మాతను ప్రార్థించసాగాడు. కాసేపటికి ఆమె ప్రత్యక్షమై ఆ ఇంజనీర్ కొచ్చిన కష్టం గురించి తెలుసుకుని కట్టెల కొట్టేవాడ్ని పరీక్షించినట్టుగానే ఇతని నిజాయితీని కూడా పరీక్షించాలనుకుంది.
ఒక అగ్గిపెట్టె చూపించి "ఇదా నీ కంప్యూటర్" అని అడిగింది.
ఇదేంటి...దేవతకు కంప్యూటరంటే ఏమిటో కూడా తెలియదా అని మనసులో ఆశ్చర్యపోతూ "కాదు" అన్నాడు.
ఈ సారి ఆమె జేబులో పట్టే చిన్న క్యాలిక్యులేటర్ చూపించి "ఇదా" అనడిగింది.
"అబ్బే కాదు" అన్నాడతను.
మూడోసారి ఇంజనీర్ వాడుతున్న కంప్యూటర్‌నే నీళ్ళలో నుంచి బయటికి తీసి "నీ వస్తువు ఇదేనా" అనడిగింది.
"అవును" అన్నాడతను నిట్టూరుస్తూ. 
.
ఆ నిట్టూర్పును గమనించకుండా అతని నిజాయితీకి మెచ్చి నదీ దేవత అతనికి ఆ మూడు వస్తువులూ ఇవ్వబోయింది. ఇంతలో ఇంజనీర్ ఉండబట్టలేక "నా అసలు వస్తువును తీసివ్వడానికి ముందు ఇంకా మేలైన కంప్యూటర్లను కదా నువ్వు నాకు చూపించాల్సింది" అని అడిగాడు. గొడ్డళ్ళ కథలో అలా జరిగిందనే కదా అతను అసలు ఆమెను ప్రార్థించడం మొదలు పెట్టింది!
నదీ దేవతకు కోపమొచ్చింది. "గాడిదా ఆ విషయం నాకు తెలుసురా. నీకు మొదట చూపించిన రెండూ ట్రిలెనియం, బిలెనియం కంప్యూటర్లురా. ఐ.బి.ఎం వారి లేటెస్ట్ కంప్యూటర్లు రా అవి........" అని తిట్టి అంతర్థానమైపోయింది.
నీతి: టెక్నాలజీలో వస్తున్న మార్పుల గురించి సంపూర్ణ అవగాహన లేకపోతే నోరు తెరిచి నీ తెలివితక్కువ తనాన్ని బయటపెట్టుకోవడం కంటే నోరు మూసుకుని నువ్వు జీనియస్‌వనే అభిప్రాయాన్నే ఇతరులకు కలిగించడం మంచిది.
*** *** ***
ఒక్క టెక్నాలజీ అనే ఏముంది....ఏ విషయంలో అయినా అదే మంచిది. తెలియనప్పుడు నోరు తెరిచి అభాసుపలయ్యేకంటే మూసుకుని ఆత్మగౌరవాన్ని ఉంచుకోవడమే ఉత్తమం.
(నేను కూడా మా నెట్టుసీనుది ఒక కంప్యూటర్ పట్టుకెళ్ళి చెఱువులో పడేసి, ఆ నదీమాతను వేడుకోనా?)
*** *** *** ***'

నరుడా ఏమి కోరిక
నరులు మెచ్చే అంతర్జాల విద్య వళ్ళ
అరవక అలిసితిమి
నరములు, నయనాలు భాద తగ్గించు తల్లి
--((*))--

కన్ను కానక  కొందరు
మన్నును మభ్యపెట్టి, నందిని ఏదో అన్నట్టు
తను ఉన్న స్థితి బాగోక
ఎన్నో మాటలకు ఓర్పు వహించుటే ధర్మం         


__((*))--
జ్ఞాన  గుళికలు



మదన పడు టెందుకు

మది తలపులు దోచిన చిలకా చెప్పు

సదా నీ తలపు మరువ

లేదు నాప్రేమను తిరస్కరిచుటేమి చిలక



సద్దు చేయక తెలుపు

మొద్దుగా భావించి నన్ను మరువటెందుకు  

పద్దు ఉంది మన జతకు

రద్దు చేయకు మన పెళ్లి వేడుకల తలుపు



ఆఖరి దాక ఉంటాను, వి

ముఖత చూపి మనసును వేదించకు స

ముఖము గా ఉండలేవా

నఖ పర్యంతం నిన్ను ప్రేమగా చూస్తాను



బిడియంతో నీకు చెప్పలేదు   

వడి వడి మాటలతో వేదించి భాద పెట్టకు

తడి చూడు కంటి తడి చూడు     

కాడిలా మోస్తున్న కుటుంబ బారం ప్రేమతో

__((*))--

జ్ఞాన కంద గుళికలు (తత్వం)

 భూమికి వాసన తత్వం

యామినికి చల్లని వెన్నెల చీకటి తత్వం

కామినికి ఆకర్ష తత్వం

యమునికి ప్రాణాన్ని హరించే దైవ తత్వం



నీటిది రుచి తత్వం

ఇంటిది విద్యా సంకల్ప సృష్టి తత్వం

కాటిది వైరాగ్య తత్వం

కుటిలత్వం, ప్రేమ మనుష్యుల తత్వం



అగ్నిది దృష్టి తత్వం

లగ్నం స్త్రీ పురుషుల భంద తత్వం

యజ్ఞం బ్రహ్మ తత్వం

నగ్నం శృంగార శిల్పాకర్షణ తత్వం



వాయువుది స్పర్స తత్వం

ఆయువుది జిహ్వా చాపల్య తత్వం

కరువుది కర్మ తత్వం

అరువుది జీవసాఫల్య తత్వం 



ఆకాశానికి శబ్ద తత్వం

వికాశానికి విద్యా పరిమళ తత్వం

వినాశానికి మూర్ఖ తత్వం

ఆశా పాశానికి మనస్సే ప్రదాన తత్వం    




                                                                                                                     ఇంకా ఉన్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి