22, నవంబర్ 2015, ఆదివారం

ప్రాంజలి ప్రభ -జ్ఞాణ గుళికలు - ప్రేమ పారవశ్యం -34

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్      ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ 
2zxda-2uwzb-1
  సర్వేజనా సుఖోనోభావంతు 
జ్ఞాన కంద గుళికలు (ఊహ)
సద్గుణములు పంచు
దుర్గుణములను త్రుంచు శక్తి ఏది  దు
ర్మార్గమును అరికట్టి స
న్మార్గామును చూపె భగవత్గీత చదివేదెవరు

సంప్రదాయం ఏది
సంప్రదింపులు లేక పెరిగే స్వతంత్ర భావం
సప్రకృతి కానరాక
విప్రయోగము పెరిగి విభవ కొరకు విడిపోయే

కలల కౌగిట్లో చిక్కి
కల్పనలతో కరిగి వావి వరుస మరచి
కలువలా విలపించి
కల్లలైన కళ్ళ కలయక విడి పోవుచుండె

ఊహల సౌధంలో మునిగి
సహకారంలేక సమస్యలవలకు చక్కి
సహాయమందుకోలేక
అహం అడ్డు వచ్చి పెద్దలకు చెప్పక కృంగె

మనది మనది కానిది
మనసు మనుగడ చెప్పలేని నిజం
 తనది తనది కానిది
తనువు తపనల సిగ్గు విషయం

తిమిరంలో తడబడుతూ
సమీరంలో భాష్యాన్ని చెప్పుట చేతకాక
సమీపంలోని భయంతో
బిడ్డ సొమ్మసిల్లి తల్లితండ్రులవద్దకు చేరే
 





జ్ఞాన కంద గుళికలు (పొద్దు)  

పొద్దు వాలగానే లోకాన్ని
చీకటిలో వదిలి వెళ్ళేవాడు " రవి"
తాను చీకటిలో ఉన్నా
లోకానికి జ్ఞానాన్ని పంచేవాడు " కవి"

పొద్దు వాలగానే మత్తు
సద్దు చేయక సాగు చక చక సూర్యుడు
వద్దన్నా కమ్ము యామిని
మద్దత గా నేనున్నాను వెన్నల జాబిల్లి

దీప వెలుగులు కమ్ము
గొప్పలు చెప్పుట మాని గూటికి చేరు శ్రీ వారు
తప్పులు చేయుట మానే
ఇప్పటి పిల్లల సుఖం కోసం కలిసే శ్రీమతి

కన్ను తెరిస్తే చూడలేనిది
మన్ను ను కమ్ము కొని నీడలా మారే చీకటి
వెన్ను తట్టి వచ్చు వెలుగు
నన్ను నా తోటి వారును ఆదుకొను లక్ష్మి  

--((*))--



జ్ఞాన కంద గుళికలు (ప్రేమ )

కర్తవ్య  దీక్ష కనికరం
భర్తని నమ్మిన ప్రేమ సతికి మోక్షం
వార్తలు తెలిసిన గోప్యం
కర్తయైన భర్త భార్యకు పంచాలి ప్రేమ    

ఆకర్షణ ప్రేమగా మారు
సంఘర్షణ లేకుండా జరగాలి పయణం
వికర్షణ జరుగకుండా
ప్రకర్షితమైన ప్రణయం భంధం గా మారు

ఐశ్వర్యాన్ని ప్రేమించిన
విశ్వశ్రేయస్సు కొరకు ప్రేమ భంధం గా మారి
విశ్వాసం వదలకుండ
       ప్రశాంత వదనంతో పేదప్రజలను ఆదుకో               

ప్రతిభను చూసి ప్రేమిస్తే
ప్రతి విషయంలో మేదస్సుతో ఎదుర్కోవాలి
శృతి కలిపి జీవిస్తే 
మతి పరిసుబ్రముగా ప్రశాంతంగా ఉండు  

--((*))--

జ్ఞాన కంద గుళికలు (
పూల మొక్క)
నేనొక పూల మొక్కను
నేను చంద్రుని వెన్నెలకు పరవశింఛి
తనువంతా తహ తహ
తెనీయను గ్రోలే తుమ్మేద పరవశించి

మానస చోరులకు
మనస్సు ఊరట కల్గించేందుకు పరవశించి   
ఎన్నో నాయగారాలతో
మనోవేదనలను తగ్గించి ఆనందం పొందెన్  
--((*))--
రస  కంద గుళికలు -1 (తార)

గారాల వారాల తార
సరాగాల సరిగమల నవ సితార
తీరాల అంచుల చూపి
తరంగాల వెల్లువలా ఆకాశాన్ని తాకే

తారాడే నాదాల తలపే
పోరాడే వయసులో చేరిన తొలి వలపే
నరాల బిగించే తలపే
తారల తెగింపు ఎవరికి తెలియకుండదు

మజిలి మజిలి కి వేడి
తేజంతో సిగ్గు దొంతరలు వలపుల వాడి
సంజీవనిలా పనికొచ్చే
సజీవ శిల్పసుందరి కాదు వలపుల తార 

వలపుల తలపుల సొంతం
గిలి గింతల స్వరాలతొ ఆడే నృత్య తార
వలకు చిక్కి వలపు ఇస్తూ
వెల లేని ధనమును సేకరించిన సితార 

జోజో ముద్దుల తార
జో జో వలపు ఇచ్చుచుండే శృంగారపు తార
జో జో బంగారు తార
జో జో వెలకట్టలేని స్వర్గాన్ని చూపేసితార  
__((*))__

జ్ఞాన కంద గుళికలు-2 (నేటి యువత)

కలల కౌగిట్లో చిక్కి
కల్పనకు కరిగి పెద్దలను దిక్కరిమ్చే
కళల సాధన లేక
కల్లలైన ఆశకు భీతి చెందక నిగ్రహించ్చే

ఊహల సౌధంలో మునిగి
సహకారంలేక సమస్యల వలకు చిక్కి
సహాయను పొంద లేక
అహం అడ్డు వచ్చిన పెద్దలకు చెప్పి కృంగె         

రెప్పల కదలికల్లాగా
ఇప్పటి ఆశయాల సాధనలో మునిగి తేలి
గొప్పలకు పోయి చెప్పలేక
చిప్పలు పట్టలేక ఉద్యోగం కోసం వేటాడే

మనస్సు కేంద్రీ కరించి
యశస్సు కోసం విద్య నభ్యసించి, బ్రమించి
తేజస్సుతో గణీభవించి
ఉషస్సుతో విజయం సాధించాలి నేటియువత   
--((*))--
     

    ఇంకా ఉన్నది 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి