ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ -జ్ఞాణ గుళికలు
సర్వేజనా సుఖోనోభావంతు
జ్ఞాన కంద గుళికలు (భయం)
భయం ఎందుకు ని
ర్బయం గా ఓర్పు వహించి దృడ సంకల్పంతో
భయం జోలికి పోకు
భయంతో భీతిల్లి మనస్సును వేదించకు
గతం నిన్ను వెంటాడు
పంతంకు పోక వర్తమానాన్ని గమనించు
అంతం చేయు ఆలోచనను
సొంతంగా జ్ఞానాని గ్రహించి సహకరించు
నమ్మిక పలుకు పలుకు
వంమ్ము చేయక పలుకు అర్ధాన్ని తెలుపు
కమ్ము కున్న చీకట్లు
నెమ్మది నెమ్మదిగా తొలగి వెలుగు నింపు
పట్టిన పట్టు విడువు
కట్టిన చీర కట్టనని వేదించు టెందుకు
తట్టి పట్టి అరవకు
వట్టి మాటకే భయం నటించు టెందుకు
అంతరాత్మకు తెలుసు
అంతు చిక్కని ప్రశ్నకు సమాధానంలేదని
కొంత సమాధానమే ప్రకృతి
వంత పలికేవారు నమ్మితే దొరకు జవాబు
పోతన - శ్రీమద్భాగవతం.!
.
ఎవ్వడు సృజించు బ్రాణుల
నెవ్వడు రక్షించు ద్రుంచు నెవ్వడనంతుం
డెవ్వడు విభుడెవ్వడు వా
డివ్విధమున మనుచు బెనుచు హేలారతుడై!
భావం:---
ఈ లోకంలో సర్వప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవడు రక్షిస్తాడో,
.ఎవడు అంతం చేస్తాడో, ఎవడు అనంతుడో, ఎవడు సర్వవ్యాపకుడో...
.ఆ విభుడే ఈ విధ ంగా పోషించేవాడు, పెంచేవాడు (సర్వం చేసేవాడు) అని అర్థం.
.
చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు భవలతాలవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజనవన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్!
.
భావం:----
శ్రీమహావిష్ణువు చరిత్రలు కేవలం విచిత్రాలు మాత్రమే కావు. ముల్లోకాలను పవిత్రం
.చేసేటువంటివి. జీవరాసులకు మంచిమిత్రుల వంటివి. అడవులకు వసంత ఋతువు ఆనందం
.కలిగిస్తుంది. అదేవిధంగా ఈ చరిత్రలు మునులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇవి సంసార బంధం
.అనే లతలను అవలీలగా ఛేదించే లవిత్రాలు (కొడవలి వంటివి)...
.
బాలున్ హరిపదచింతా
శీలున్ సుగుణాలవాలు శ్రీమన్మేధా
జాలున్ సంతోషించక
యేలా శిక్షించె రాక్షసేంద్రుండనఘా!
.
భావం:----.
ఈ లోకంలో సర్వప్రాణులను ఎవడు సృష్టిస్తాడో, ఎవడు రక్షిస్తాడో, ఎవడు అంతం చేస్తాడో,
.ఎవడు అనంతుడో, ఎవడు సర్వవ్యాపకుడో... ఆ విభుడే ఈ విధ ంగా పోషించేవాడు,
.పెంచేవాడు (సర్వం చేసేవాడు) అని అర్థం.
.
పరమానంద ప్రాప్తి కొరకు
పరుల ఆకర్షించేందుకు చిరునగవుతో
పరువాల వయస్సుతో
పరిచే సౌందర్యంతో ఉన్న స్త్రీ నన్ను ఆకర్షించే
పరుల ఆకర్షించేందుకు చిరునగవుతో
పరువాల వయస్సుతో
పరిచే సౌందర్యంతో ఉన్న స్త్రీ నన్ను ఆకర్షించే
--((*))--
జ్ఞాన కంద గుళికలు (తల్ల డిల్లె)
తల్లడిల్లే వృత్తి లేక
పల్లె ఆదరంబు తగ్గే బస్తీ ఆదరనేలేదే
కళ్ళమాట లాడలేక
తల్లిని పెల్లాం పిల్లలను రక్షిమ్చేదెల
వృత్తి చేద్దమనుకుంటే
కత్తిసాములా బ్రతకాల్సిన పరిస్తితి
విత్తము దొరకక
చెత్త గాలికి ఎగిరినట్లు బ్రతుకు గాలిలో
కాలం తెలుపు ప్రకృతి
వేలంవల్ల మనిషి దిగజారే స్థితి
మేళం వళ్ళ శుభా-శుభం
సీలం తెలుపు మనిషి ఉన్నతి గుణం
చల్లబడ్డ డప్పు మొగదు
ఎల్లలు దాటిన పదును లేని ఈటె పనికి రాదు
వేల దప్పిన జాలి
ఎల్లప్పుడూ వెక్కిరింపుగా మారుచుండు
తప్పెట తప్పెట కొట్టు
తప్పుచేసిన వారిని ధరణిలో పట్టు
తప్పులను బయట పెట్టు
తప్పించు కోకుండా చేయాలి శిక్ష పడేటట్టు
అలలుగట్టు దాటలేక
వలలు మార్చటం చేతకాక చతికిల పడే
కలలు పండిమ్చిక
కల్లోల జీవితముతొ మనిషి తల్లడిల్లే
జ్ఞాన గుళికలు (మానవుడు )
ఆదుకొనేవాడు ఆరాధ్యుడు
కృషి వలుడు మధ్యముడు
స్వార్ధ పరుడు అధముడు
హింస పరుడు షండుడు
ప్రాణానికి ప్రాణం ఇచ్చువాడు
ఆపదలో ఆదు కొనేవాడు
కష్టసుఖాల్లో పంచుకొనేవాడు
మంచి మాటపంచెవాడు స్నేహితుడు
ఎవరు చెప్పిన వినని వాడు మూర్ఖుడు
లోకజ్ఞానం తెలియని వాడు అమాయకుడు
వివేకం చూపలేని వాడు అవివేకుడు
విచక్షణా హీనుడు దౌర్భాగ్యుడు
ప్రేమను గౌరవించేవాడు ప్రేమికుడు
భార్యను గౌరవించేవాడు తన్మయుడు
మాటను గౌరవించేవాడు శిష్యుడు
విద్యను భోధించేవాడు భోధకుడు
__((*))--
జ్ఞాన గుళికలు (నేనెవరు?)
నేను అందరికి అవసరం
నన్ను తలవని వారు లేరు ఈలోకం
నన్ను అమ్మ కన్నా ముందు పుట్టానంటారు
అమ్మని మరుస్తారేమోగాని నన్ను మరువలేరు
మనిషిని మూర్ఖునిగా మార్చేది నేనే
ప్రేమ కోసం నన్ను అడ్డు పెట్టి వేదిస్తారు
ఆ ప్రమకోసం నన్ను వాడుకుంటారు
నాకోసం మానవతా విలిలువలు వదులుతారు
నాకు ఈ లోకం దాసోహం చేస్తుంది
నేనంటే అందరికి వ్యామోహం కూడా
నేనొక తీరని దాహాన్ని, నన్ను మరువ లేరు
నాది నిరంతరం ప్రవాహం, మారుతుంటాను
నాకోసం రాజ్యాలే తల్లక్రిందలయ్యాయి
నాకోసం కొందరు స్త్రీలు సీలాన్నే అమ్ము కుంటున్నారు
నేనొక మహోత్తర శక్తి అను కున్నను
నేను లేందే మనిషి బ్రతకలేదనుకున్నాను
నన్ను మించినది ఒకటున్నది
భక్తి పారవశ్యంలో ఉన్నవారు నన్ను గమనించారు
దేవుని నేను దాసోంహం గా ఉంటాను
నన్ను దాన ద్మాలకు వాడుకొని
పుణ్యం సమ్పాదిస్తారు
నేనెవరో మీరు చెప్పగలరు
నన్ను ఆరాదించని వారు ఈ లోకంలో లేరు
ఇంతకూ నేనెవరో నీకు అర్ధమయ్యే ఉంటుంది
ఇట్లు
మీ లక్ష్మి
inkaa unnadi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి