19, నవంబర్ 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - జ్ఞాన గుళికలు -ఆనంద పారవశ్యం -33

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - జ్ఞాన గుళికలు 
Gif..


సర్వేజనా సుఖోనోభవంతు

జ్ఞాణ గుళికలు  -1
 నది ప్రవహించి కడలిని చేరుట ధర్మం
స్త్రీ సహకరించి ఆనందం పొందుట పరమార్ధం
 గాలితో కలసి మేఘం వర్షం కురియుట ధర్మం 
నీటిని సద్వినియోగం చేసుకొనుట పరమార్ధం

 సూర్య చంద్రులు సంచరించుట ధర్మం 
వెలుతుర్ని, వెన్నలని ఉపయోగించుటే పరమార్ధం
పక్షులు,కీటకాలు పరసించి చేసే శబ్దాలు ధర్మం
శబ్ధ కాలుష్యాన్ని జయించి సంగీతమ్ వినుటే పరమార్ధం 

ప్రకృతి పరవశించి పులకించటం ధర్మం 
ప్రకృతిని అర్ధం చేసుకొని నవ్వుతూ బ్రతుకుటే పరమార్ధం 
మానవ హృదయం కృంగి ఉప్పొంగుట ధర్మం
హృదయానందం సహచరులు అందిమ్చుటే పరమార్ధం



మదిలో  భావాలు తెలుపుట కవి ధర్మం
భావాల్లో ఉన్న ధర్మాన్నే గ్రహించుట పరమార్ధం
ప్రతిఫలాపెక్షరహితుడుగా జీవించుటే ధర్మం 
ప్రసంసలకు లొంగక కవి ధర్మభోధ చేయుటే పరమార్ధం  

హాస్య -జ్ఞాణ గుళికలు-2
ఇంటికి వచ్చిన ఆడపడచులను ఆటపట్టిస్తూ

సరదాగా పిండివంటలు అన్దరూ కలసి చెస్తూ

పండుగ సరదాకబుర్లు చలాకీగా ముచ్చటిస్తూ  

దీపావలి వెలుగుల మద్య పండుక సంబరాళ్ళు



పు: మీ నవ్వులు  వెలిగే పువ్వులు మతాబులు  

స్త్రీ : మీ  నడకలు వెలుగే  తారా జువ్వలు

పు: మీ మాటలు చీమటపాకాయ టపటపలు  

స్త్రీ : మీ కులుకులు వెలుగే  కాకరపూవత్తులు



పు; మీ నయనాలు వెలుగే భూచెక్రాలు

స్త్రీ :  మీ శ్రవనాలు వెలుగే విష్ణు చక్రాలు

పు : మీ  వేణి అల్లికలు మెరిసే తీగలు

స్త్రీ : మీ మీసాల రంగులు మెరిసే వెన్న ముద్దలు



పు: మీ  బుగ్గల శబ్దాలు నేల టపాసులు

స్త్రీ : మీ  చేతివేళ్లు వెలిగే ప్రేమిదలు

పు : మీ  తేపులు శబ్దం చేసే బాంబులు

స్త్రీ : మీ నడకలు మెరిసే చిచిన్ద్రీలు



పు: మీ  జడకుప్పేలు తాటాకు టపాసులు

స్త్రీ : మీ  రాక మా యింటికీ వచ్చాయి వెలుగులు

పు :మీ  పిల్లల్తోవచ్చి తెచ్చారు మూయింట కాంతులు    

స్త్రీ : మీరు రావటమే మాకు కోటి దీపాల వెలుగులు

రస  గుళికలు -3
కావ్యానికి మూలం శృంగార పర్వం

శృంగారానికు మూలం తన్మయత్వం

తన్మయత్వానికి మూలం ప్రకృతి తత్త్వం

ప్రకృతి తత్వమే జత కలయక భంధం



తనువుల కలయకలో చురుకుతనం

తపనుల తడితో పొందే పారవశ్యం

వయసు కోరికలతో చెలి చెలగాటం

మనసు మబ్బులలో కరిగే ఉబలాటం  
--((*))--  
జ్ఞాణ గుళికలు// లీలావలోకనం // -4

నెమలి కన్నుల నెయ్యం.
మోహన మురళీగానం
బృందావన విహారం
యమునా తటి.విరహం..
రాస కేళీ వినోదం.
గో పీ మన.మోహనం
గోప జన పరివేష్టితం..
భక్త హృదయ రంజితం
గీతామృత వితరణం..
సూక్ష్మమోక్షతత్వబోధకం
గోవిందం.మాధవం..
సర్వార్ధక జగద్గురుం..
కృష్ణ లీలా,,విలాసం

రస కంద గుళికలు -5

చిరునగవు చిన్నది

మరువమాలతో మనసునే దోచేస్తున్నది

పరువములో ఉన్నది

కురులువిప్పి కులుకు దామా అన్నచిన్నది



తరుణి నీకు తగదు

తరతమ భేదాలు చూడ వెందుకు

కరములతో కవ్వించకు

నరములు లాగెట్టు మురిపాలెందుకు



చిరునవ్వెందుకు  నన్ను చూ

సీ రుసరుస లెందుకు రసిక రాజశ్రీ

వరూధిని నేను ప్రవరా

తరుణిని తపనలు తగ్గించుటకు రా రా



ప్రమతో ఇద్దరు కలసి

ప్రేమను బ్రతికించాలని ఆలోచనతో

శ్రమలేకుండా సుఖానికి

తమకంతో, మత్తుతో తన్మయత్వం పొందెన్


అంబరమున వెల్గు రాగా

సంబరముగా భందుమిత్రులతో ముచ్చటించేన్

అంబరమున సంధ్య పొగా

సంబరముగా రాత్రి సఖీ సుఖములు పొందెన్




అభ్యాసముతో సమస్త

సబ్యసంస్కారముల్, న్యాయధర్మం తెలియున్

లబ్యమైన దానితో తృప్తి

మబ్య పెట్టాక సతృప్తిగా సహకరించవలెన్




రస కంద  గుళికలు -6  (జలకన్య )
కలువ రేకుల కన్నులు
గల కాంతామణి కళ కళ లాడే సరోవ
రంలో విరబూసిన ల
తలలో విరహవేదనలో కనిపించే

నయనాల  కలవరం
శయనం కలువపూల జల నిలయం
వయసు పొంగుల వరం
వయ్యారంగా వలపు అందుకొనే సమయం

యర భాద తోలగా లంటే
కరముల కౌగిలింత లో పొందే చల్లని
సరాగాల కలయకే
వరమాలలా చుట్టుకొని పరవశించే

కామనాలు తో మరువక
సమయం వ్యర్ధంపర్చుకోలేక సరోవర
మమునందు శయనించి
తమకపు వేడితో జల సాంగత్యమాయె

దృడమైన ఊరువులు
వెడల్పైన నితంబాల విస్తరణ పరంగా
నడుము వయ్యారంగా
నడివయసులో నారి జలములో క్రీడిమ్చే

--((*))--
  జ్ఞాన గుళికలు - 7

స్పష్టత లేని ప్రేమ పలుకు
నిష్టగ చేయని ప్రార్ధనలు వ్యర్ధములగున్
ఇష్టముగా తినలేకున్నను 
కష్టము గద కవితలల్లగందము నందున్

దుష్టులు వేమ్బడించినన్
నిష్టగా వానిని ఎదుర్కోన లేకుండినన్
శిష్టులకు కష్టతరమున్
కష్టము కాదు ధైర్యముతో ఎదుర్కోనవలేన్ 

నీటికి పారే గుణం క
న్నీటికి లొంగే గుణం ధరిత్రి నందున్ ము
మ్మాటికి ప్రశ్నించే గుణం
కట్టి పడేసి నట్లుగా తర్కించుట తద్యం

దారులెన్నో చూపినావు
నరులకు ఆశలెన్నో కల్పించి చూడవాయే
మరులు కల్పి చూశావు
మరమనుషులకు ముక్తి నిడుము దేవా


తోడేది సుఖపాడేందుకు
కూడేది మనుష్యులతో కలసి తినేందుకు
గూడేది గుట్టు ఉండేందుకు
నీడేది దారులు లేని నా జీవితమునకు



యవ్వన ప్రేమ అనేది ఒక వ్యసనం - అది మనస్సుని తొలుస్తుంది
అది మనస్సుని చేయిస్తుంది బ్రమణం - కళ్ళు కానరాకుండా చేస్తుంది
అప్పుడు ఉడుకురక్తం మారు సుడిగుండం - మెదడు పనిచేయకుండా చేస్తుంది
గుండం చుట్టూ పరిగెడుతుంది ఆశా గుర్రం - అదృష్టం ఉంటె ప్రేమ దక్కుతుంది
                                      ఇంకా ఉన్నది
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి