18, నవంబర్ 2015, బుధవారం

ప్రాంజలి ప్రభ - జ్ఞాన గుళికలు -ప్రేమ పారవశ్యం -32

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 


సర్వేజనా సుఖోనోభవంతు


జ్ఞాన గుళికలు-1(ప్రేమామృతం)

పుట్టినింట వెలుగుగా
మెట్టినింట సిరిసంపదలు పంచె జ్యోతి
మట్టిని నమ్మి ఆకలి
తట్టుకొని బిడ్డల ఆకలి తీర్చేదమ్మ

కళ్ళ నిండా కరుణ రసం
వళ్ళంతా కళ్లుగా మార్చి మమ్ము  కాపాడేదమ్మ
కళ్ళ మాటలు పట్టించుకోక
గుళ్ళగా మారిన కన్న ప్రేమ మరువదమ్మ

జీవన దిక్సూచి అమ్మ
భవ భంధంతో భాద్యత వహించేదమ్మ
శ్రవణా నంద కరంగా
దివ్య సందేశం ఇచ్చి సంతృప్తి పడేదమ్మ


అమ్మే కృష్ణమ్మ తల్లి  క
న్నమ్మే నిబ్బరంగా మోసే సహన సీలి
మమ్మే ఓపిగ్గా కాపాడే
అమ్మ స్థితి విజ్ఞానం అందించే కల్పవల్లి        

హృదయంలో ప్రేమామృతం
ఆదరముతో పరవశించే హరితాంమృతం
సదా కుటుంబ రక్షణ, సం
పద వృద్ది, భర్తే దైవంగా జీవన ధారామృతం   
--((*))-- 
జ్ఞాన గుళికలు - 2(ఓ ఇల్లాలా)
 ఓ ఇల్లాలా నా మీద కోప మేళ
నీ మాటను జవ దాటను యే వేళ

నీ ఔచిత్యం, నీ ఔదార్యం, నీ నేర్పు,
నాగతి మార్పుకు, నా యుక్తి నేర్పుకు,
నా శక్తి తోట్పాటుకు, నీ ఓర్పు,  మూలమాయ లే

ఓ ఇల్లాలా నామీద కోప మేళ
నీ మాటను జవదాటను ఏ వేళ

కాలగతిని ఎదిరించి, కలలన్ని తీర్చి,
మనసుకు ఊరట కల్పించి,
కలువ పూవులా సత్యాన్ని విడమరచి,
నా నేర్పుకు, నీ తీర్పే వేదంగా మారింది ఓ ఇల్లాలా

రహస్యాన్ని విడమరిచి, చెప్పి, అమ్మ తలపునే
మరిపించి నాకు దేవతవైనావే, ఇల్లాలా
మనుషుల్లో దైవాన్ని చూపి
మార్గ దర్సకురాలువైనావే 
నా మనసును అర్ధం చేసుకున్న ఇల్లాలా

నీ హాస్య చతురోక్తులతో
మధుర రక్తిగా మార్చి
మనోధైర్యాన్ని చేకూర్చి
మనసే మందిరముగా మార్చావు ఇల్లాలా

 ఓ ఇల్లాలా నామీద కోపమేళ
నీ మాటను జవదాటను ఏవేళ
--((*))--
జ్ఞాన గుళికలు  -3(
ఓ మనిషీ)
ఓ మనిషి మనసు తెలిసి మసులుకో
ప్రకృతి ననుసరించి ధర్మ మార్గాన్ని ఎన్నుకో
మని కోసం, షి కోసం వెంపర్లాడకు
అశా జీవిగా జీవించి కాలం వ్యర్ధం చేయకు  
 సంయమనంతో, సహనంగా, వ్యవహరించటం నేర్చుకో

ఓ మనిషి ....   ఓ మనిషీ.....
 సీలాన్ని సంస్కరించుకో 
మనసును తేలిక పరుచుకో
ఓర్పు, దీక్ష, పట్టుదల, అలవరుచుకో
శ్వాసతో చెలిమి, చేయటం, నేర్చుకో

ఓమనిషి ........ ఓ మనిషీ...
ఇతరులను పోల్చుకోవటం నేర్చుకోకు
ఎదీ మితి మీరి, ఆశించి, భంగ పడకు
ప్రకృతితో నడుచుట అలవర్చుకో
నిగ్రహశక్తితో బ్రతికి, బ్రతికించటం నేర్చుకో

ఓమనిషి ........ ఓ మనిషీ...
కళలతో జీవితాసయం పండించుకో
కలలు లేని నిద్రను ఆహ్ఫానిమ్చుకో 
 దేశ సేవకొరకు శ్రమించటం నేర్చుకో
పరమాత్ముని లీలలు అర్ధం తెలుసుకో  

ఓ మనిషి మనసు తెలిసి మసులుకో
ప్రకృతి ననుసరించి ధర్మమార్గాన్ని ఎన్నుకో
  
                                                    జ్ఞాన గుళికలు -4(కాంతి)

చిటికలోని చీకటి
కరిగిపోక తప్పదు ఉదయకాంతికి
ఎలుతురంతా మేసి
ఏరు నేమరేయక తప్పదు వెన్నలకి
మనిషిలోని అజ్ఞాన చీకటిని
గురువు జ్ఞానజ్యోతితో తరుముట అనవాయితి
మంత్రార్ధ భాసుర కాంతి
మనస్సుకు ప్రశాంతత కలిగించే వెల్గుల నిధి
భగవంతుని ఆరాధ్య జ్యోతి
మనుష్యులను సంస్కారులుగా మార్చే దీపజ్యోతి
వయసులోని చిలిపి
తరిగిపోక తప్పదు తొలిచే సోగసుకి
మనిషిలోని వేడి
కరిగిపోక తప్పదు చెలి చలికి
మమతలోని తీపి
కరిగి పోక తప్పదు ప్రేమ భందానికి


జ్ఞాన రస గుళికలు-5(జల్లు)
పొడి పొడి జడి జడి వాన జల్లు
విడి పడి కల కల రాపిడి జల్లు
బొట్టు బొట్టు కలువపై పడే జల్లు
అంగాంగ తడిపి ఆశ తీర్చె జల్లె


కొలనులో కలువ పువ్వు విప్పారి
కిరణాలతో వెలిగే వలపుల వయ్యారి
వసంతుడే వచ్చి కాలువపై చేసే సవ్వారి
పరవశించి పరిపక్వ దశగా మారిరె


కురులు మాయ ముసుగులు తొలగించి
మర్మ మేదో తెలుసుకో అని విడమరచి
తడి పొడి తపనకు తరుణం కల్పించి
ఇవి ఊహలు కాదని ఆశలు తీర్చె


మేలి కలయక అధరా మృతపు జల్లు
తడి నెపముతో తపనలతో తెప్పరిల్లు
వేడిగాలి వచ్చి చేరి చలువ రాత్రిగిల్లు
సరస తామ్బూలముతో ఉన్న ఇల్లె


వలపుల తరంగాలు కౌగిల్లో చేరి
ఉరుములు మెరుపులు కలసి
గాలి కూడా చొరబడ కుండా బిగించి
తరునోదయముతో తహతహలు తగ్గె