27, ఫిబ్రవరి 2016, శనివారం

Internet weekly magazine "Pranjali Prabha" for the nmonbth 3/2016-9


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (9) (date 01-03-2016 to 07-03-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................ప్రేమ ముచ్చట్లు ఎన్నో? మరెన్నో ? అయిన అందులో కొన్ని నా భావకవితల రూపంలో ఇందు పొందుపరుస్తున్నాను
మీ అభిప్రాయాలే  నాకు కొండంత బలం చేకూరుస్తాయి,      
 
 పెళ్లి కుదిరింది, పెళ్లి కూతురి మనసు  ఊహల పందిరిలో అలల దొంతరలో, కలలో వచ్చిన కోరకలతో, కను మూసిన, తెరిచినా ఏదో తెలియని తమకమును ఆవహించి ఏదో పొందాలి, మరేదో పొందాలి, ఆ అనుభూతి మరువలేనిది, ఎవ్వరికి చెప్పలేనిది అదే ఏమిటో అర్ధం కావటం లేదు, అప్పటికే మదిలో మెదిలిన  అక్షరూపములో వ్రాయటం మొదలపెట్టిది, ప్రేమ అనుటకు అక్షరాలు  రెండే వర్ణనలు అనంతము అందులో నాకుతోచినవి ఇందు పొందు పరుస్తున్నాను
 
నా  గుండె భారంగా మారి వేగం పెంచుకుంటూ
ఇంకా వేగంగా ప్రయాణిస్తు దడపెంచేస్తుంది
ఈ గుండె భాద తగ్గేదెప్పుడు, తెలిక పడేదెప్పుడు
దానికి తోడూ మేఘాలు రాపిడి పెరుగుతున్నదిప్పుడు
రాపిడికి మెరుపు పుట్టి, నేనున్నానని
ఘర్జనల వేగం పెంచెసింది ఇప్పుడు          
మేఘం నుండి చినుకు చినుకు రాలుతున్నప్పుడు
తెలియని కన్నీళ్ళు ఆనంద భాస్పాలుగా మారాయప్పుడు
 --((*))--

చేతి వెళ్ళు కదిలించటం మొదలు పెట్టింది కలికి 
కలవరం పెరిగి, తనువు తపనలు పెరిగి, కలకలం పెరిగే  
అప్పుడు కవితా హృదయమై,  రసతరంగమై, రసమాదుర్యమై
రసరమ్యమై, కాకి కోకిలకు సామ్యం కుదర్చగా, అధరం
మధురం  అంటూ చీకు చింత లేదంటూ తన్మయత్వంతో
మునిగి రసహృదయలు రసాస్వాదము పొందే   
 
--((*))--

మనసు  మనసులో లేదు మనుషుల  అంతరాలు, ప్రేమ ముచ్చట్లు 
కమ్ముకున్న వసంతాలు, వద్దన్నా వెంబడించే పేదల ముచ్చట్లు
అదృశ్యంగా హృదయంలో కాముకుడు చేరి  చేసే ముచ్చట్లు 
 హద్దులు దాటకుండా పొందికగా పొందే  నవరసాల ముచ్చట్లు 
ఊహల వలయంలో చిక్కి మధురం ఏదో గరళం ఏదో తెలుసుకో అన్నట్లు
అనమానం వీడి ఆనంద పారవశ్యంలో తేలేవి ప్రేమ ముచ్చట్లు ,   
దేశాల కతీతంగా, భాషల కతీతంగా, తనువుల తపనలే ముచ్చట్లు  
--((*))--
 

ప్రేమకు చిక్కినవారు నిజాలను గ్రహించలేరు 
తాడును చూసి పాము అనుకొని కెవ్వు మంటారు
పిల్లి నీడను చూసి పులిగా బ్రమించి వణికిపోతారు
ప్రేమ అనే బ్రాంతి లో చిక్కి నిజం తెలుసుకోలేక భయపడతారు
నీడలు మారినట్లు ప్రేమలు  తారుమారవుతాయని గమనించ లేరు
మంచివారి ప్రేమ మద్యాన్నపు నీడలా మొదట కరుచుగా ఉన్న
క్రమంగా  సుధీర్ఘమ్గా మారుతుందని ఓ సుభాషితం లో తెలియపరిచారు
కష్టం సుఖం లో ఉన్న తేడా ప్రేమలో ఉన్నప్పుడు తెలుసుకోలేరు 
సంకుచిత భావం లేకుండా ప్రేమను పండించుకోవాలని తపన పడతారు 
నిర్భయంగా ఉండి  ప్రేమ జారిపోకుండా, పట్టు వీడకుండా
 తనవంతు ప్రేమను అందిస్తూ ఓర్పుతో ఉండటమే ప్రేమ అంటారు
--((*))--

దేహంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రేమ బ్రతుకు తుంది
సంకుచిత మనస్కులను ప్రేమ మారుస్తుంది 
ప్రేమ ఉన్న వారిలో ఎటువంటి స్పర్ధలు రావాట మనేది
ఉండదు, ప్రేమ శత సంవస్చరములు బ్రతికిస్తుంది 
 
ఎన్నో సానుకూల రసాయనాలు ఉత్పత్తికి కారణం , 
మనిషిని వివేక వంతుడుగా మార్చుటకు మూల కారణం 
వయసులో ఉన్న స్త్రీ - పురుషులలో పెరిగిన  ప్రేమ కామ్య గుణం
ఏక సహచర్యం, ధర్మ భందం,విశ్వసనీయత వంటి పరిణామం 

ప్రేమతత్వం ప్రబలుతుంటేనే ఏర్పడును బలమైన సమాజం 
సవ్య మైన పంధాలో సాగే జీవితమే దేశానికి శ్రేయస్కరం 
ప్రేమ అనుభూతి మాత్రం స్మ్రుతి పదంలో అల్పం 
దాని ప్రభావం ప్రజలపై పనిచేస్తూ ఉంటుంది అనల్పం
--((*))--

యవ్వనం వచ్చిందని హృదయానికి తెలిసింది
పువ్వులా వికసించి ఆకర్షించాలని ఉన్నది
మదిలో తెలియని ఆశలు రేకెత్తించటం జరిగింది
కోటి వీణలు మ్రోగినట్లు హృదయ శబ్దం పెరిగింది
  
కన్నుల్లో తొలి పలకరింపు నీవైతే
పెదవుల్లో చిరునగవు నీకోసమైతే
బుగ్గల్లో తొలిసిగ్గు మెగ్గలేస్తే
వయ్యారి అడుగులు తబడటం జరిగే

సింగారి మోము సిగ్గుపడింది
బంగారి మెనూ పులకరించింది
జలతారు వెన్నెలై అగుపించింది
కన్నులసైగతో తెలుసు కోవాలంది

--((*))--

తలపే వలపై రుచి చూడాలనిపిపించే 
పలుకే పరువమై పలుగా పలకరించే
మాలిన్యాలను మట్టు పెట్టాలని పించే
నీ తోడును కోరడమే జయం తలపించే

నిరాశల నిషా ఒదిలి, ఆవేశం ఆవరించే 
నీ సౌరును తాకడం వల్లా వెలుగు పెంచే
దిగులు లేదిప్పుడు కొత్త రూపు అంకురించే
వగపులు నుసిగారాలాయి నీ వలపునుంచే
--((*))--


పదహారు కళలకు ప్రాణమా - ఓ అరవింద రూపమా
అందాల సువర్ణ కమలమా - అరవిరిసిన నయణమా
ఊసు లాడు కుందామా - విచ్చిన పెదాల మకరందమా
మనసు తలపులు తీయుమా - తట్టి లేపుతాను సుమా

పదహరు ప్రాయాల జాణవా - శృంగార కల బిందువా
కన్నుల్లో వెన్నెల కురిపించావా  - వెన్నెల్లో దీపాలు వెలిగించావా
ముగ్ధ మోహనంగా ప్రకాశించావా - కనువిందు చేయవా
నీ ఒడుపును చూపించవా - లోకాన్ని ఎలుటకు సహకరించావా
--((*))--

భావానికి దివ్య వెలుగు - నా కవితకు మనసు కలుగు
ధ్వని మంచు కరుగు - కమ్మని గేయానికి వేదన తొలుగు
అక్షర రూపమే ముసుగు - భందానికి హృదయం నలుగు
ప్రణయాస్వాదము జరుగు- ప్రాణానికి  ప్రాణం మెరుగు 
--((*))--

చిలిపి కల చిలక
వలపు వల మొలక
వరదలా పొంగే తునక
సమీరం లా తిరిగే గిలక 

కొమ్మ చాటు కన్నెమల్లి
పువ్వులా విరిసింది వల్లి
అది గంధాల కొండ లిల్లి
గుండె గూటిలో ఉండే పల్లి 
 

కన్నె తనం ఎదుగుతున్న మొక్క
పకృతిలో మెక్క ఎదిగినట్లు కన్నెలో
ముఖవర్చస్సు కొంత మెరుగు
వెన్నెల తరుము చీకటిని
 
కన్నె యదపొంగులు చూపు
కెరటాలు ఎగిరిపడటం సహజం
వయసులొఉన్న కన్నెపిల్ల
ఎగెరెగిరి పడటం కుడా సహజం
 
మేఘాల రాపిడికి శబ్దం సహజం
వయసులో కోరికలు రావటం నిజం
రబ్బరుబంతి క్రిదపడిన పైకేగురుతుంది
యవ్వనవనితను చిన్న మాటన్న
చేష్టలు కోపంతో ఉండుట జరుగుతుంది
 
యదలోని అలజడులు రేకెత్తిన
కన్నె నడక గుట్టుగా ఉంటుంది
కన్నె పిల్ల కలలు కనడం సహజం
కలలు రుజువుకు ప్రేమలో పడటం
హృదయరాగా లాపన వినేవాడికోసం
ఉండి ప్రతిఫలం పొందటమే ప్రయోజనం 
--((*))--
వయసు తెలుపుతుంది వాన
గొడుగున్న తడుపుతుంది లోన
జోరుగాలికి ఎగురుతుంది పైపైన
ఉరుములు మెరుపులు ఉండిన
మనసు తడబడు చుండిన
చెలి తనువు తడవకుండిన
వానలోజాన తనం చూపకుండిన  
వయసు జోరు మారకుండునా   
  
ఎయ్ నీ సొగసు నన్ను లాగుతున్నది
నీవు బహుగడసరి వాణి వనితెలిసింది
మన యిద్దరి మద్య ఏదో రాజీ ఉన్నది
మొండి గా ఉన్న నిన్ను మర వద్దంది   

తెలివి నీలో కను మరుగౌ తున్నది
సొగసు ముసుగు కమ్ముకుంటున్నది
లజ్జ ఉన్నా వ్యక్తం చేయ లేకున్నది
ఐన చెలి  నా మనసు వెంటాడుతున్నది 
--((*))--  
   
 

కాదులే అదినీకు  కాదులే
అది నిజములే అదినిజములే

ఒక మాటా ఒక బాటా చెల్లు బాటు కాదులే
నీ మాట, నీ బాటా నాదని నిజములే 
కాలంతో నడవకున్న సర్దు బాటు కాదులే
కాలంతో ఎదు రీదలేము,  అది నిజములే

ఎంత సేపు దాగి వుండు, మబ్బు చాటు సూరీడు
అలక పాన్పుఎక్కినవాడు, దిగాడు నిజములే
తప్పు చేసి ఒప్పకున్న, దిద్దు బాటు కాదులే
తప్పు ఒప్పు గా, ఒప్పు తప్పుగా, ఉండుట నిజములే 

వేట గాని ఎరను జూచి, మృగము లన్ని పారినా
బ్రతుకు కొరకు, జీవితము సాగుట నిజములే
మాటు వేసి కాపు వుండి, గిట్టు బాటు కాదులే
దొంగ దెబ్బ తీయుట, కొందరికి అలవాటులే

నేత మాట నేతి బీర, మర్మ మెరిగి మసలితే
మర్మ మేరిగినా, మనసు తట్టేవి నిజాలే
చుక్క ముక్క నోట్ల మూట, సాగు బాటు కాదులే
చుక్క వళ్ళ వళ్ళు హూనమ్, అవునని తెలుసులే

మబ్బు కమ్మి గాలి విసరి చెల్లా చెదురయ్యిన
కోరికలు వెంబడిస్తే బ్రతుకు దుర్బరం అని తెలుసులే
వాన చినుకు కెదురు చూపు, కలుసు బాటు కాదులే
ఎన్ని సుఖాలు ఉన్న ఏదో కొంత లోటు ఉండు, నిజములే

నా తల్లి కలం కదిపి కవిత మనసు కదిపితే
కవిత మనసు కదిపిన, కొంతసేపు మాత్రములే 
పెల్లుబుకిన ఆవేశం కట్టు బాటు కాదులే
ఆవేశం ఉంటె మనిషి కాదులే, అది నిజములే 
--((*))--
సంజ
గగనమొక పుష్పం, కన్ను తాకి మెరిసే సోకు
విరిసిన చెంగల్వ పూవా, ఎరుపు చేక్కిల్లా
వన్నెల గగనం విరిసే, రంగు పరికిణీలా
యామిని చేరింది, చిరుచుక్క చేరే

సంద్య మందారం కడలి అంచులు చేరి  
సంధ్య పరికిణి చిరిగి ఎడెద లోతులు మెరిసే
జలచరాలు వింతగా చూసి కులికే
పక్షులు పరవశించి ముందుకు ఉరికే

వాలు నీడలుదరి వరదలై పాకి
చుక్క వెలుగు చిరునగవుకు సొగసై
నిదురతూలిక నడక గుదము పై కోర్కె
వచ్చు నిశిలో కరిగి శశి తో కలిసే

రంగు రంగు రుమాలులుగామారి
వెండితేర ప్రక్కకు తొలగించి
వ్రాలినది త్రావిగా, సోకినది 
సంజ వెన్నెల బాట ప్రాణులకు స్వర్ణ ధారా   
--((*))--
  
ఇంకా ఉన్నాయి  వచ్చేవారం 
చదవండి, చదవమని చెప్పండి 
సర్వేజనా సుఖినోభవంతు