10, ఫిబ్రవరి 2016, బుధవారం

Internet Telugu Learn Magazine for the month of 2/2016-7

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  (చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (7) (date 15-2-2016 to 21-2-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................

దశకంఠ రావణ కృత శివ తాండవ స్తోత్రము.
( పంచ చామర వృత్తము)

జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరీ
విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ।
ధగధ్ధగధ్ధగ జ్జ్వలల్లలాట పట్టపావకే
కిశోర చంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ।।

అర్థ ములు:- జటకటాహ= జడలనెడి గోలెమున ( గోళాకారమున నున్నఆకాశమున)
సంభ్రమ భ్రమత్= భయంకరముగా సుళ్ళు తిరుగుచున్న, నిలింపనిర్ఝరీ= దేవనదియైన గంగయొక్క, విలోలవీచివల్లరీ= చంచలమైన యలలనెడి తీవలచే, విరాజమానమూర్ధని= ప్రకాశించుచున్న శిరస్సు గలిగి నట్టియు, ధగత్ ధగత్ ధగత్= ధగధగధగమని, జ్వలత్= మండుతున్న, లలాట పట్ట పావకే= విశాల ఫాల భాగమునందు త్రినేత్రాగ్నికలిగినట్టియు, కిశోర చంద్ర= బాలచంద్రుడు, శేఖరే= శిరోభూషణము గాగల శివునియందు, మమ= నాకు, ప్రతిక్షణమును, ( ఎడతెగకుండ)
రతిః= ఆసక్తి, అస్తు= వుండుగాక.

జడలనెడి గోలెమున భయంకరముగా సుళ్ళు తిరుగుచున్న, దేవనదియైన గంగయొక్క, చంచలమైన యలలనెడి తీవలచే,  ప్రకాశించుచున్న శిరస్సు గలిగి నట్టియు,  ధగధగధగమని,  మండుతున్న,  విశాల ఫాల భాగమునందు త్రినేత్రాగ్నికలిగినట్టియు,  బాలచంద్రుడు, శిరోభూషణము గాగల శివునియందు,  నాకు, ప్రతిక్షణమును, ( ఎడతెగకుండ)
 ఆసక్తి,  వుండుగాక.
2) ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర
స్ఫుర దృగంత సంతతి ప్రమోదమాన మానసే।
కృపాకటాక్ష ధోరణీ నిరుధ్ధ దుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని॥

అర్థములు:-- ధరాధరేంద్ర నందినీ= పర్వతరాజైన హిమవంతునికూతురగు పార్వతియొక్క, విలాసబంధు= సమస్త శృంగార విలాసములకు బంధువుగా, బంధుర= దట్టముగా(బంధించివేయు స్వభావము గలుగు నట్లుగా) , స్ఫురత్= చెక్కుమనిమెరయు, దృగంతసంతతి= కడగంటి చూపులసమూహముచే, ప్రమోదమానమానసే= సంతసించు చున్న మనస్సు కలిగినట్టియు, కృపాకటాక్ష = దయతోగూడిన కడగంటి చూపులయొక్క, ధోరణీ= వరుసలచే, నిరుధ్ధ్ధ= అరికట్టబడిన, దుర్ధరాపది = భరింపరాని యాపదలు గలిగినట్టియు, దిగంబరే= నగ్నమైన, క్వచిద్వస్తుని= ఒకానొక అనిర్వచనీయమైన వస్తువునందు( శివపరతత్వమునందు), మనః= సందిగ్ధస్వభావముతో చంచలమైన నా మనస్సు, వినోదం= సచ్చిదానందమును, ఏతు= నిశ్చలనిశ్చితమై పొందుగాక.
 
పర్వతరాజైన హిమవంతునికూతురగు పార్వతియొక్క,  సమస్త శృంగార విలాసములకు బంధువుగా,  దట్టముగా(బంధించివేయు స్వభావము గలుగు నట్లుగా) ,  చెక్కుమనిమెరయు,  కడగంటి చూపులసమూహముచే,  సంతసించు చున్న మనస్సు కలిగినట్టియు,  దయతోగూడిన కడగంటి చూపులయొక్క,  వరుసలచే,  అరికట్టబడిన,  భరింపరాని యాపదలు గలిగినట్టియు,  నగ్నమైన,  ఒకానొక అనిర్వచనీయమైన వస్తువునందు( శివపరతత్వమునందు),  సందిగ్ధస్వభావముతో చంచలమైన నా మనస్సు,  సచ్చిదానందమును,  నిశ్చలనిశ్చితమై పొందుగాక.
--((*))--


ప్రస్థానం(ప్రేమ)

నీ చిరునవ్వే నన్ను ఉడికించినది
నీ నడకే నన్ను కలవర  పెట్టింది
తిప్పలు పడి  నిన్ను చేరితే 
కనుల ముందున్నా కరగవా 

ఓ చెలియా నా హృదినే
దోచితివని చెప్పి నీ చెంత చేరి
నాచెలిమిని యాశించుచు
నాచెంతకు జేరినావు న్యాయమే కదా 

ఓ సఖియా నిన్ను నేను
మనసుతో ప్రేమిద్దామనుకున్నా
వయసు అడ్డువచ్చి నీతో
చెప్పలేక మౌన ముని నైనాను

వదలని పిచ్చి వయసునే పట్టి
నువ్వుకరిగితే తప్ప అది వెళ్ళదే
దొరవుగా వచ్చి చనువేదో ఇచ్చి
నా వలపు వెలుగు నీవే మరి

తొందర వద్దు రంగు బయట పడు
మనసు గోతిలో పడితే లేవలేవు
మెప్పిద్దామని తిప్పలు పడుతుంటే
తొందర పెట్టి నా మతినే పోగోడుతున్నావు       
--((*))--

ప్రస్థానం (ఓటు)


కత్తి వేటు - దుర్మార్గునకు చేటు
కలం తో పోటు -  రాజకీయునకు చేటు
పలకపై గీటు - విద్యకే చేటు
ముఖం పై గాటు - అనుమానానికి గీటు

రోడ్డు దాటు  - గ్రహించలేక చేటు
పప్పు రేటు  - తినేవారికి లోటు
పోపు ఘాటు - అజాగార్తకు చేటు
వార్తల ఘాటు - జాగార్తలకు చేటు

వీపు  పై వేటు - తొందర పాటుకు చేటు
పిప్పి పన్ను పోటు - క్రిములకు చోటు
పుస్తకముపై గీటు - చదవాల్సిన రూటు
చార్జీల రేటు  - ప్రభుత్వానికి రూటు

ఏలోటు లేకుండా సాగాలంటే - కర్తవ్య దీక్షపరులకే ఓటు

--((*))--


ప్రస్థానం (పిడికిలి )

బిగి యించిన పిడికిలిలో దాగిన దేమున్నదో
అధ్రుష్టపు రేఖలే,  బాటలనుకో వచ్చునా 

లేదా దురదృష్టపు రేఖలే, అనుకో వచ్చునా 
వాణీ పతి వాచస్పతి వ్రాతలను కోవచ్చునా   

సమాధర్మంతో నడుస్తానని అనవచ్చునా 
సమ దృష్టి తో జీవిన్చాగలనని అనవచ్చునా 

సమేక్యతతో ముందుకు సాగాలని అనవచ్చునా 
దుష్ట శక్తులను పిడికలి బిగించి హింసించ వచ్చును       

--((*))--

నీతులు చెప్పే వారు

రసజ్ఞుల ఆలోచనలే వేరు
అభిరుచులుపై, ఆభరణాలపై పోరు
సంస్కా ర ఔనత్యం అడ్డులేని జోరు
గుండెలోని తపన తీరు వేరు 

సూక్తులు ఆచరిన్చేవారెవరు
కుయుక్తుల వారే ఉన్నారు
మాయలో ఉంచి దోచేవారు
సిరితో తపనలు తగ్గించు కొనేవారు

వైద్యులున్నారని తిరిగేవారు
దుర్మార్గానికి అడ్డు లేదనే వారు
అడ్డు చెప్పేవారు లేదనే వారు
మొండి పట్టుతో బ్రతికేవారున్నారు

పక్కన ఉన్నవారిని పట్టించు కోరు
మంచి మనుషులతో స్నేహం చేయరు
విషం కక్కే వారిని చెరదీస్తారు
బ్రతుకుపై దెబ్బతగిలిన వారినే ఆదరిస్తారు 

పాపమని తెలిసినా చేస్తారు
జిహ్వ చాపల్యాన్ని వదలకోలేరు
అద్దంలో మోఖమే చూడరు
నీతులే పెద్దగా చెపుతారు వారు  
--((*))--ప్రస్థానం (ఇది నా పాట)

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది

చరణం -1

నకసక పర్యంతము దోచుకో మన్నది
చక చక నడిచి దరిచేరి సుఖపడ మన్నది
భువిలోని స్వర్గ సుఖాలు పొంద మన్నది
తనువు తపనలను  తగ్గించు కోమన్నది 

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -2

 వేడికి నవనీతంలా కరుగుతా నన్నది

 వేడికి కర్పూరం వెలుగు నందిస్తానన్నది
 తపనకు తరుణోపాయము చేపుతానన్నది
 వయసుకు తగ్గ సరి జోడై సై సై అంటున్నది  

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
చరణం -3

చల్లని మనసును పంచి సుఖపడ మన్నది
తల్ల డిల్లకు తరుణము ఇదే రా రమ్మన్నది
కళ్ళ బొల్లి మాటలకు నమ్మక రా రమ్మన్నది
కళ్ళు కళ్ళు కలిపి తన్మయం చెంద మన్నది

పున్నమి తళుకుల చిన్నది
వెన్నెల జిలుగుల్లో ఉన్నది
--((*))-

రామ చిలుక!
.
చిలుక చిలుక రామ చిలుక - పలక నంటుందీ
అత్త తెచ్చిన కొత్తకోక - కట్టనంటుంది
మామ తెచ్చిన సన్న బియ్యం - దంచ నంటుంది
అవ్వ తెచ్చిన ఆది రసం - తినా నంటుంది
మొగుడు తెచ్చిన మల్లెపూలు - ముడవ నంటుంది
కటారి కోకమీద - కన్ను వేసిందీ.
మామ కొడుకుమీద - మనసు ఉంచిందీ.

(ప్ఫాంజలి ప్రభకు పంపిన వింజమూరి అప్పరావుగారికి ధన్యవాదములు)
ప్రాంజలి ప్రభ - చిన్న కధ -(ప్రేమ భావ తరంగం )


యధాభరితమై, బాధాతప్తమై, భావాల భావమై,  ఎడారిగా మారిన, నా ఎదపై  పన్నీరువై, నా ఊహల పల్లకివై, నా మనసులో ప్రవేశించి, ప్రేమ పారవశ్యం తో ప్రవసింప చేసినావు.  వ్యధలను సమాధి చేసి, కరుణతో  వర్షంలా కనికరించి,
నిర్భాగ్యుడైన నన్ను భాగ్యవంతుడుగా మర్చి,  నాలో ఉన్న  ఎడారినే అనంత భావాల ప్రేమారస సాగరంగా మార్చావు.
ఘనీభవించి, నిశ్చలమైన భావపాషాణాన్ని నీ అమృత వాక్కులతో కరిగించి ద్రవీకరింప జేసావు.........

భావవాహినీ తరంగాలు ఎగసిపడుతున్న నా హృదయ సాగరంలో ప్రేమ సునామీనే సృష్టించావు, మరచి పోలేని స్వర్గ సీమగా మార్చావు, నా ఊహలలోనే కాదు, నా హృదయంలో స్త్రనివాసివై యున్నావు.....

ఎగసిపడే ఆ ప్రేమతరంగాలలో తడిసీ ముద్దయ్యాను, మరచి పోలేని ఆనందం అనుభవించాను. ఓ సఖీ!!

జీవచ్ఛవాన్ని స్పృషించి, పునరుజ్జీవితున్ని జేసి, కనపడకుండా, అందుకోలేని దూరనికి చేరి  పోయావు.

అనంత వాహినీ కెరటాల ఝరులకి తట్టుకోలేక, కొట్టుకు పోతున్న నేను, నీ ఆసరాకై చేయి జాపుతున్నా.......
నిర్దయగా చూస్తున్నావే తప్ప,  నాచేయి నందుకొని నన్ను కాపాడవెందుకు ఎప్పుడు కనబడతావు సఖి ....

కుల మత జాతీ వివక్షలే, నను నీ నుండి వేరుచేస్తే, ఈ అనంతాంతరాలున్న అనంత విశ్వాన్నే నేను బహిష్కరిస్తున్నా....
ఈ వివక్షలే లేని లోకాలకు పయనమౌతున్నా, ఉన్నదో లేదో తెలియని మరోజన్మలో నీకై వేచివుంటా

ఓ ప్రియతమా!
అందాల మందారమా ! చేతికందేలా కనిపిస్తావ్ కాని, చేరరాని సుదూర తీరాలలో ఉంది నన్ను మరిచావు 

కంటికందేంత దూరాన్నే వున్నా, అందుకోవటానికి సాధ్యం లో ఉన్నావు , అందానికి పర్యాయమందామా?
అందంలోనూ రెక్కలు విప్పి పరవసించి ముడుచుకు పోయావు

దయావర్షాన్ని కురిపిస్తున్నట్లు విచ్చుకుంటావు, మురిపిస్తావ్ మమ్మలని ఊరిస్తావు, మధ్య మధ్యలో అలకబూని, కవ్విస్తూ, ఊగుతూ కనబడతావు , ఆకుల మద్య అంతర్ధాన మవుతావ్ .....

భావజాల పరిపుష్ఠుల కవ్విస్తావ్ , కావ్య సృష్టికి ప్రేరణనిస్తావ్ .........., పసిపాపల మదినే దొచేస్తావ్, రోదనలోనూ నవ్విస్తావ్ అలరిస్తావ్-
ప్రాంజలి ప్రభ - చిన్న కధ -( నాయకుడు)

ఏమండి మీరు అలా కలవరిస్తున్నా రెంటి, అవునే "నా బతుకంతా కలవరింపులు జీవితముగా మారింది", నాకున్నదంతా ఎలాక్షాన్లో ఖర్చు చేయటం జరిగింది, కానీ ఫలితం రాలేదు. అవునండి మానాన్న గారు చెప్పేవారు, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకు అదే దొరుకుతుందని, అవునే అదినిజము. కాని నేను మోదటి సారి పోటి చేసినప్పుడు గుర్తుందా, ఎందుకు గుర్తు లేదు, అంతా గుర్తు ఉన్నది, ":కప్పు  సాసర్ గుర్తు' అందుకని చాలామందికి కప్పు సాసర్లు పంచావు, కాని ఎన్ని పంచావో అన్ని ఓట్లు కూడా రాలేదు

అవును మరోసారి మీ పవర్తన గుర్తుకొచ్చింది ఆరోజు మైకు పట్టుకొని " ఈ నగరంలో హడావిడి గమనించారా మీరు, మీ పనులు మీరు చేసుకుంటూ ఉండి నాలాంటి రాజకీయ నాయకునికి ఒక్క అవకాసం ఇవ్వండి నేను చేప్పే విషయాలు, సేను చసే పనులన్నీ మీకు విశదీకరిస్తాను అంటూ మైకును మేడలో పెట్టుకొని చెట్టు క్రింద కుక్కలా (విశ్వాస పాత్రుడుగా) అరుస్తూ ఎలక్షన్ కాన్వాస్ చేసావు, అందినవాడికి అందినంత త్రాగమని డబ్బు ఖర్చు చేసావు,  కాని ఫలితములేదు అప్పుడు   ఓడి పోయావు.

అవునే నేను ఇప్పుడు పోటి  చేస్తున్నాను మల్లా,  ఈ సారి నేను తప్పక గెలుస్తాను, అని ఎట్లా చెప్పా గలుగుతావు, ప్రజలు డబ్బులకు అమ్ముడు పోతారు, నిజాయితీని గుర్తించరు మీ ప్రయత్నం వెనకాల నేను ఎప్పుడు ఉంటాను, మీ ధైర్యానికి కారణాలు చెపుతారా, చెపుతా విను  మన వీధులకు సిమెంటు రోడ్లు కోసం తిరిగి తిరిగి వేయించాను, మన వీధుల్లో అన్నీ ట్యూబ్లైట్లు వేయించాను, కన్సల్టేషన్ ఏర్పాటు చేసి చిన్న చిన్న సమస్యలను తీర్చాను, అదే నా నమ్మకం. మంచిదండి  మీనమ్మకంతో  మీరు ప్రయత్నం చేయండి, గెలుపు మనదే. వెనకడుగు వేయకండి. ముందడుగు వేయండి.   .
                .
పోటి చేస్తూ, పతిఒక్కరి ఇంటికి పోయి, కలసి వచ్చి ఓటు వేయమని అర్ధించాడు చలపతిరావు.  
అప్పుడే స్నేహితునితో మాట్లాడాలని అకున్నాడు చలపతిరావు ,  ఫోన్ లో మాట్లాడుతూ  " హలో మీ డాడి కి ఫోన్ ఇవ్వు ", మా డాడి  ఇంట్లో లేరండి, ఎక్కడికి వెళ్ళారు "మహిళా కార్యకర్తల వెంబడి పోయారు, ఎ పార్టి తరుఫున తిరుగు
తున్నరో  చెప్పారా, మీరు నాయకులైతే మీ పేరు చెప్పండి, మీ రెంతిస్తారో చెప్పండి, అయితే మీ మమ్మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఫోన్ ఇవ్వు, మా మమ్మీ  కూడా లేరండి, ఎక్కడికి పోయారో చెప్పారా, ఆ చెప్పారు ఎక్కడికి, ఎవరితో చెప్పద్దన్నారండి ఆయినా మీతో చెపుతున్నా, చెప్పమ్మా త్వరాగా చెప్పు, అసలే ఫోన్ ఖర్చు పెరిగి పోతున్నది, అయితే నేను చెప్పను లేండి, మా డాడి వచ్చినప్పుడు రండి, ఆగాగు ఫోన్ కట్ చేయకు ఆ చెపుతున్ననండి ఆ చెప్పు " మా మమ్మీ  ఏదో పార్టి మీటింగ్ కు బిర్యాని ప్యాకెట్లు పంచటానికి వెళ్ళారు" మరి ఇంట్లో ఎవరున్నారు నేను మా చెల్లెలు ఉన్నారు,అట్లయితే మీ చెల్లెలుకు ఫోన్ ఇవ్వు అన్నాడు "ఉయ్యాలలోంచి లేపితే ఏడుస్తుంది ... ఇమ్మంటారా " ఆ  ఆఅ ఆఅ  ఆ .....

ఓట్లు వేసే రోజు వచ్చింది

చలపతిరావుకు  స్నేహితుడు ఫోన్ చేసి మాట్లాడాడు  " మాట్లాడక పోవటం మౌనం వహించడం ద్రోహం అది నీకు తెలుసా అని ఫోన్ లో అరుస్తున్నాడు, అది తెలుసండి నేను చెప్పేది వినండి  " రాజ్యాంగానికి సమాజానికి పొంతన లేదు, మనిషి  మనిషికి ఓర్చుకునే గుణం లేదు, మంచి చేయాలన్న రాజకీయమ్ బ్రతక నీయదు, శాసన సభలో కప్పల్లా అరిచే వారికి ఓట్లు వేసి గెలిపిస్తున్నారు, కన్నీళ్ళకు, కడుపు కోతలకు , నిరసనలకు, డబ్బు సంచీలకు, ప్రతిఒక్కరు లొంగుతారనుకోవటం పొరబాటు, నువ్వు నేను మనమందరం ఓట్లు వేయక తప్పదు, వెయ్యలేదనుకో లారీలమీద ప్రక్క జిల్లాలనుండి మను ష్యులను తెప్పిస్తారు, వారుమన ఓట్లు వేసేస్తారు, త్వరపడి  ఓట్లు వేయడానికి త్వరగా రండి "

చివరి ప్రయత్నంగా ఓట్లు వేసే రోజు, కౌంటింగ్ చేసే రోజు అందరికి బిర్యాని ప్యాకెట్లు పంచాడు. చివరికి ఒక్క ఓటు తేడాతో గిలిచాడు చలపతిరావు, "తిరుపతికి వెళ్లి దేవుని హుండిలో కానుకలు వేసి తిరిగి వచ్చాడు",
భార్య ప్రోద్బలంతో అధికార పార్టిలో చేరి మంత్రి పదవి సంపాదించి నిజాయితీ పరుడుగా, సొంత ఇల్లు లేని రాజకీయ నాయకుడుగా, అడిగిన పని వెంటనే చేసే నాయకుడుగా ప్రజలలో గుర్తింపు తెచ్చు కున్నాడు, సైకిల్ మీదవెల్లె మంత్రిగా పేర తెచ్చుకున్నాడు     .                       
--((*))--


ప్రాంజలి ప్రభ - ఆద్యాత్మిక ప్రభ - (సజ్జన సాంగత్యము)

ఓ బజారుకు చిలకల్ని అమ్మేవాడు వచ్చాడు. వాడి దగ్గర రెండు పంజరాలున్నాయి. ఒక్కొక్క పంజరంలో ఒక్కొక్క చిలక ఉంది.ఆ బోయవాడు ఓ చిలుక విలువ ఐదువందలరూపాయలు, మరో చిలుక విలువ ఐదు రూపాయలూ చెబుతున్నాడు. ఎవరైనా ఐదురూపాయల విలువ గల చిలుకను కోనదలిస్తే ముందుగా కొనుక్కోవచ్చు.కానీ ఎవరైనా ఐదువందల రూపాయల విలువ గల చిలుకను కొంటే మాత్రం ఐదురూపాయల విలువ గల చిలుకను కూడా కొనితీరాలి. 


అక్కడి రాజుగారు ఆనాడు బజారుకు వచ్చాడు. ఆ బోయవాని కేకలు విని ఆయన ఏనుగు దిగి అడిగాడు _ " ఈ రెండింటి విలువ లో ఇంత తేడా ఎందుకు ?.
బోయవాడు " వీటిని మీరు తీసుకువెడితే ఆ తేడా తమకే తెలుస్తుంది." అన్నాడు. 


రాజు గారు ఆ రెంటినీ కొనుక్కువెళ్ళారు. రాత్రి పరుండబోయే ముందు ఆయన సేవకులను పిలిచి ఐదు వందల రూపాయల విలువ గల చిలుకను తన పడక కి దగ్గరగా పంజరంలో ఉంచండన్నాడు.ప్రాతఁకాలంలో నాలుగు గంటల సమయమందు చిలుక పలకసాగింది. " రామ్ రామ్ సీతారామ్ " అంటూ చక్కగా సంకీర్తన చేసింది.మనోహరమైన శ్లోకాలను గానం చేసింది.రాజు మహానంద పరవశుడయ్యాడు.
మరునాడు ఆ మహారాజు రెండవచిలుక పంజరాన్ని తన శయ్య దగ్గర పెట్టించాడు.తూర్పు తెల్లవారక ముందే ఆ చిలుక దుర్భాశలు, కఠోరవచనాలు పలకసాగింది.మహారాజు కు మహాకోపం వచ్చింది.సేవకులను పిలిచి, " ఈ పక్షిని అంతం చెయ్యండి" అన్నాడు.
మొదటి చిలుక దగ్గరనే ఉంది.అది వినయంగా పలికింది, "రాజా దీనిని చంపకండి. ఇది నా సోదరుడు. మేమిద్దరం ఒక్కసారే వలలో చిక్కుకున్నాము. నన్ను ఓ సాధువు తీసుకున్నాడు.అతని దగ్గర నేను భగవన్నామం నేర్చుకున్నాను. దీనిని ఓ మ్లేచ్ఛుడు పెంచాడు. వాని దగ్గర ఇది దుర్భాషలు నేర్చుకుంది. ఇందులో దీని దోషమేదీ లేదు.ఇది దుస్సాంగత్య ఫలితం మాత్రమే ". ఆ చిలుక పలుకులు విని మహారాజు ఆ చిలుకను చంపలేదు కానీ విడిచిపెట్టేశాడు.

నా మెయిల్ పంపిన జా.  జి.  శర్మగారికి, ధన్య వాదములు

చెప్పటం తేలిక, ఆచరణే కష్టం,
 .
ప్రతివారు తమ తాహతుకు తగినవాటికి ఆశపడటం తప్పుకాదు.
పంట వేసిన రైతు ఫలసాయం కోసం, పెళ్ళయిన పడుచు బిడ్డ కోసం,
బాగా పరీక్షలు రాసిన విద్యార్ధి మంచి ఫలితం కోసం, పెళ్ళి చూపులలో చూసొచ్చిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలని పెళ్ళికొడుకు, ఆశపడటం తప్పుకాదు. 


అదేమిటి! అబ్బాయి కదా ఒప్పుకోవలసినది అనద్దు, ఆ రోజులు పోయాయి,
ఇప్పటి రోజుల్లో అమ్మాయి ఇష్టపడితేనే పెళ్ళి, లేకపోతే హళ్ళికి హళ్ళి సున్నకి సున్నా, అదీ నేటి పరిస్థితి. మొన్ననొక పెళ్ళి సంబంధం చూశాము, అమ్మాయి ఒక పట్నంలో పని చేస్తూఉంది, అబ్బాయి మరొక పెద్ద పట్నం లో పని చేస్తున్నాడు, అన్నీ నచ్చేయి కాని అమ్మాయి అంత దూరం వెళ్ళి కాపరం చెయ్యను, అని కచ్చితంగా చెప్పేసింది, మరి ఇప్పుడు డిమాండు అమ్మాయిలదా? అబ్బాయిలదా?. పెళ్ళి కొడుకులు అమ్మాయిల ముందు క్యూ కడుతున్నారు. రేపో నేడో, అమ్మాయిలు కన్యాశుల్కం అడిగినా అశ్చర్యపోనక్కర లేదు.ఈ పోకడలు వెర్రి తలలేస్తున్నాయి.
వరకట్నమెంత దురాచారమో కన్యాశుల్కం కూడా అంతే దురాచారం.
దారి తప్పేం. 


ఆశ పడిన ఫలితం దక్కనపుడు నిరాశ పడటం సర్వ సహజం. దురాశ, పేరాశలకి ఫలితం ఎప్పుడూ నిరాశే. ఆ ఫలితంగా వచ్చే నిరాశకి మందు లేదు. నైజ గుణానికి లొట్టకంటికి మందులేదని నానుడి కదా. ఇల్లా పేరాశ,దురాశలకి పోతే మిగిలేదెప్పుడూ నిరాశే. సహజమైన, ధర్మమైన కోరిక నెరవేరనపుడు కూడా నిరాశ జనిస్తుంది, సహజం. నిరాశ నుంచి దుఃఖం పుడుతుంది, నిరాశను, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే. జీవితంలో అన్నీ అనుభవించాలి, తప్పదు. సంతోషం, విచారం, కోపం, ఆశ, నిరాశ ఇలా అన్నీ అనుభవించక తప్పదు. ఐతే నిరాశ లో పడి కొట్టుకుపో కూడదు. కష్టము, సుఖమూ, ఏదీ నిలిచి ఉండిపోదు. ఎప్పుడూ సుఖమే ఉండదు, నిరాశలో కూరుకుపోరాదు. 


ఒక్కొకప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధి వైపరీత్యం అంటే. దానినేమీ చెయ్యలేము. అప్పుడనుకోవలసినది, ఈ వ్యతిరేక ఫలితం కూడా మన మంచికోసమే జరిగిఉండచ్చు, మనకి తెలియని ఆపద గడవబెట్టడానికి, భగవంతుడు చేసిన ఏర్పాటిది అనుకుంటే మానవుడు ముందుకు సాగగలడు. లేకపోతే నిరాశ, దుఃఖాలలో కూరుకుపోయి, మరి తేరుకోలేడు. కష్టం కలిగినపుడు నిర్వేదం కలుగుతుంది, ఈ నిర్వేదం నుంచి జీవితానుభవం కలిగిన పెద్దలు ముందు బయట పడి, పిన్నలకు ధైర్యం చెప్పాలి.మార్గదర్శనం చేయాలి. 
లంకలో ఉండగా తనను వెతుకుతూ వచ్చిన హనుమతో సీతమ్మ ఇలా అంటుంది,
 

ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే,
రజ్జ్యేవ పురుషం బద్ధా కృతాంతః పరికర్షతి……. రామాయణం. సుందరకాండ. ౩౭వ సర్గ…౩
అనగా సమృద్ధిగా ఐశ్వర్యము కలిగినపుడేగాని, దారుణమగు కష్టము కలిగిన సమయముననేగాని, పురుషుడెంత మాత్రము స్వతంత్రుడు కాడు. దైవము వానిని త్రాటితో కట్టినట్లు పట్టి ఈడ్చుకుపోవును. 


చెప్పటం తేలిక, ఆచరణే కష్టం, కష్టంలో ఉన్నపుడే, మనిషి గుణం తెలిసేది, ధైర్యం,నమ్మిక, ఆశ, కావాలి. చెప్పడం కాదు ఆచరించాలి,ఆచరించి చూపాలి, అప్పుడే పెద్దరికానికి విలువ, ఫలితం, కావలసినవారికి ధైర్యం చెప్పాలి, కష్టం గట్టెక్కాలి.