28, జనవరి 2016, గురువారం

Internet Telugu Magazine for the month of 2/2016-5

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  

(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (5) (date 1-2-2016 to 7-2-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................



: శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:

అనంతంలో  ఆణువణువూ  ఆవరించి
అరుణోదయంతో, జాబిల్లితో  సంచరించి
అందరి అంతరాత్మలను ఉత్తేజ పరిచి
అంతర్దానంగా అందరిని ఆదుకుంటున్నా 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
  


మాయ మంత్ర, తంత్రాలు, మదిలోకి చేరకుండా  
మనసులోని ఆలోచనలు వక్రమార్గం పోకుండా 
మదిలో తలపులు మమేకంగ ఉండి అనేకం కాకుండా 
మాయాలోకంలో మనస్సు మారకుండా ఏకాగ్రతతో ఉంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
   


పక్రియ ప్రకంపనలకు తట్టు కొనేవిధముగ 
ప్రకృతిని అనుసరించి బ్రతికే విధంగ 
కోప ప్రకోపాల మద్య నలిగి పోకుండగ
ప్రపంచాన్ని అర్ధం చేసుకొని బ్రతకాలంటున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


జ్ఞానము, అజ్ఞానము, ఇదేనని తెలియపరుస్తున్న 
శూణ్య అనంతాలను ఆవరించిన గాలి నందిస్తున్న
క్షణం క్షణం ప్రవర్తనను మార్చుకోక ఉంచుతున్న
నిరీక్షనను తొలగించి వీక్షన శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


లౌకిక వెలుగును  లౌక్యం గా తెలుపుతున్న 
లాలి, లోలక, లోకం తలపులను వివరిస్తున్న 
లయకార లాలనలో, లాస్యం అర్ధం తెలుపుతున్న 
లంగరులా, నిలిచి లాంతరులా, శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


సర్వజీవులు, ఆద్యాత్మిక విస్పులింగాలు గాను
గర్వాన్ని అనగ త్రొక్కే  దివ్య  ప్రభోదాలు గాను
నిర్విర్యులను ఉత్తేజులుగా మార్చుటకు  గాను
మాకు ప్రార్ధించు శక్తి, ఆరాధించే శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


విద్యను భోదించే విధంలో మంచి చెడు తెలుపుతు 
నిత్య సత్యాలు ఎప్పటికప్పుడు తెలియపరుస్తు 
ధర్మాన్ని రక్షించే తేజోవంతులను సృష్టిస్తు 
సర్వం తెలిపి,  నీధామాన్ని చేరే శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


మొహానికి, శోకానికి, లొంగి కష్టాలు అనుభవించమని 
ఆశా పాశాలకు చిక్కక అతీతులుగా ఉండాలని 
అర్ధాంగి, అర్ధం, అర్ధం  చేసుకొని జీవించాలని 
లోకంలో ఆద్యాత్మిక శక్తిని పెంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


కలల కళ్ళకు కమ్ముకున్న చికట్ల తొలగిస్తు 
వయసు ప్రేమలను, ఇక్కట్లను అనుభవించాలంటు  
గుణాలకు చిక్కి అను భందాలను పంచుకోవాలంటు 
అన్నీ సమస్యల తరుణోపాయము చెప్పుతున్న   
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


సర్వ సమగ్రం ఉదాత్తమైన విజ్ఞానాన్ని విస్తరిస్తు

విశ్వవ్యాపిత స్వీయ పరిసీలన జ్ఞానాన్ని పంచుతు

వేదాలు పురాణాలు ఇతిహాసల  ధర్మాల్ని తెలుపుతు 
చర్మచక్షువులైన ప్రతిఒక్కరికి దృడ శక్తి పంచుతున్న 
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:


శ్రీలక్ష్మి శ్రీ శ్రీనివాసా  శ్రీ కర శుభకరంగా
శ్రీ సుబ్రభాత, ప్రార్ధనా, అర్చనల పరంగా
శ్రీ పాద పుష్పాల పూజల,సేవా పరంగా
          శ్రీ పరందామా, మా మనస్సుతో ప్రార్ధించు తున్నాము           
శ్రీ దేవి, భూదేవి సమేత  శ్రీ శ్రీనివాస నమో నమ:
--((*))--

ప్రస్థానం (సంతృప్తి)

చక్కగా నేర్చిన విద్య
చుక్కలెన్నో అంతమందికి చేయాలి భోధ
మక్కువతో చేయు పని
ఎక్కువ పరిపూర్ణత చెంది కలుగు సంతృప్తి

భేద దృష్టి వదలి సమ
బాధ దృష్టితో దరిచేరి సంతృప్తి పరచు
ఖేదము వదలి నిజం గ్రహించి
ముదముతో చెలిమికి సుఖం పంచుటే తృప్తి


కొందరి మనసు నిండా ఉన్న కాలుష్యాన్ని 
మరికొందరి దురాశా తలుపుల్ని 
ఇంకొందరి స్వార్ధపు ఆలోచల్ని 
తరిమే మనిషి నిజమైన దేవుడు
--((*))--

ప్రస్థానం (ప్రయాణం)

ఆట పాటల జీవితం
బాల్య దశ  ప్రయాణం
విద్యా, ప్రేమల జీవితం
యవ్వన దశ ప్రయాణం

గాను గెద్దుల జీవితం
ఉద్యోగ ప్రయత్న ప్రయాణం
శ్రమతో కూడిన జీవితం
ఫలితాల కోసం ప్రయాణం

ప్రేమ ఫలిత జీవితం
సుఖ శాంతుల ప్రయాణం  
సంసారం సుఖ జీవితం
అడుగులో అడుగు ప్రయాణం

అరమరికలు లేని జీవితం
అలుపెరగని ప్రయాణం
ఆటు పోట్ల  జీవితం
ఆనందం లేని ప్రయాణం

అవస్థలు లేని జీవితం
అనురాగపు ప్రయాణం
అందరూ కొరిఉకొనె జీవితం
మనసు ప్రశాంత ప్రయాణం

పిల్లల ఉండే జీవితం
మౌన సలహాతో ప్రయాణం
ఉప్పు కారం లేని జీవితం
యోగుల జీవితం

ఒంటరి బ్రతుకు జీవితం
ఎండమావుల ప్రయాణం
పండుటాకుల జీవితం
దేవదేవుని కోసం ప్రయాణం

అనారోగ్యంగా ఉన్న జీతం
గమ్యం లేని ప్రయాణం
ఆశ, నిరాశలతో ఉన్న జీవితం
తుఫాన్ లో పడవ ప్రయాణం

శాంతి, సుఖ నిద్ర జీవితం
ప్రశాంతత లో ఉన్న ప్రయాణం
గాఢ నిద్ర జీవితం
శివసానిత్యానికి ప్రయాణం

--((*))--

ప్రస్థానం -(రాజీ )

హృదయ వేదన గమనించ లేరు
స్పర్శ మధురనుభూతి తెలుపలేరు
కళ్ళవెంట వచ్చే కన్నీరు ఆపలేరు
వయసుని బట్టి బుద్ధిని మార్చుకోలేరు

జాబిల్లిలోని మచ్చను మార్చ లేరు
నింగిలో తారాలు రాకుండా ఆపలేరు
మేఘాల కదలికలు గుర్తించ లేరు
ఏ పుట్టలో ఏ పాముందో చెప్పలేరు
 
నేల నుండి నింగిని వెతుకుట మానరు
చావుని బ్రతికించే పయత్నం మానరు
భూమిలోని ఖనిజాలను తీయక మానరు
 కాంక్షరగిలి స్త్రీని చేరినవారు నిలువలేరు

ఎడారి తుఫాన్ ఆపలేరు
ఏరువాక పొంగును ఆపలేరు
పున్నమి వెన్నెలను ఆపలేరు
అమావాస్య చీకటిని మార్చలేరు

కళ్ళకు రక్ష కను రెప్పలు
పళ్లకు రక్ష పెదాలు
కాళ్ళకు రక్ష పాదాలు
వళ్ళుకు రక్ష సిగ్గులు 

దేహ చికిచ్చ కు ఉంది మందు
మోహ చికిచ్చకు స్త్రీ యే మందు
స్నేహ చికిచ్చకు ప్రేమే మందు
స్వాహ చికిచ్చకు రాజీ మందు
 
 
Jatoli Temple, Solan, Himachal Pradesh, India


ప్రస్థానం - వసంతమా

 ఓహో ఓహో వసంతమా
ఆహా వనసౌరభాన్ని విస్తరింప చేసినావా
మహా ఋషులు మౌనమూ
మహిలో విస్తరించే మహోన్నత వసంతమా

నీ స్మృతి విహంగమై
మా మతి మధురాతి మదురమై
మా ప్రతి కదలిక స్వప్నమై
మా ఊహల పరవసానికి మార్గామైన వసంతమా
 
లేలేత చిగురుల మాధుర్యం
మనసు మమేకమైన వన వసంతమా
స్త్రీ పరవశించి తన్మయత్వంతో
పతి సానిద్యం చేరి శృంగార భావం పెంచే వసంతమా
ప్రస్థానం- (మలుపులు)

జీవితంలో ఉంటాయి మలుపులు
స్థిరంగా ఉండవు స్థితిగతులు
చేయి పట్టి పెంచిన అనురాగాలు
వయసు పెరిగిన కొద్ది తగ్గు మమకారాలు

తండ్రి కూతురు ప్రక్క ప్రక్క నడకలు
చూసి ఓర్వలేని కందిరీగల శబ్దాలు
తల్లి పిల్లలను పెంచిన, కొన్ని నయనాలు
ఆశలు చూపి, పిల్లలకు నేర్పే వక్రబుద్ధులు

నిక్కరు నుండి ప్యాంటుకు మారిణ యువకులు
కొత్త ఆలోచనలతో  పెరిగే విద్యా ప్రమాణాలు
గౌను నుండి చీర చేరిన యువతులు
కొత్త ఆలోచనలతో చేసే ప్రేమ కలాపాలు
--((*))--

 ప్రస్థానం - స్త్రీల హృదయం

స్త్రీలు  సుకుమార కుసుమాలు, ప్రతి పలకరింపు లోను పులకరింప చేసి  పరిమళాలను వెదజల్లే పారిజాతాలు, చెప్పలేనంత అనుభూతులను, ఆకర్షనలను, చీకటిని తరిమి వెన్నలను పంచి , మనస్సును ఉల్లాసపరిచే ప్రేమ సౌహార్దాల చిలకరింత లతో,  మృదు మధుర భాష్యాలతో, కిల కిల నవ్వించి, తళ తళ  మెరుపునుచూపి, మిస మిస లాడుతూ, గుస గుస లాడుతూ, భందాలను, అనుభందాలను అనేకం హృదయంలో దాచుకొని, ఓర్పుతో ఓదార్పు కల్పించి, మనస్సులోని వేడిని చల్ల పరిచి ప్రశాంతత కల్పించేది "స్త్రీ  హృదయం ".

స్త్రీ మాటలు ఇలా ఉంటా యి

ఆప్యాయతల తెనె లోలికే అప్తవాక్యం
           అనురాగాల ఆనందం పంచె వాక్యం             
ప్రేమ వరాలకు  పరవసం పొందే వాక్యం
పరిమళాల ఆకర్షణ తో చెప్పే వాక్యం

తలపుల చూపే పిలుపు
మంద హాస్య పలుకే వలపు
కను సైగతోనే  పలకరింపు
ఆలింగనంతో మై మరుపు

మనసుకు నచ్చిన మణి
ఎంత గానో చక్కని  పాణి 
ఎంత గానో  చల్లని  వాణి
మరువ లేకున్నా  రాణి

బతుకంతా పులకించి పోయే  రస రమ్య శ్రవంతి
వయసంతా సింగారంతో శ్రుంగారాల ముద్ద చామంతి
నిర్మలత్వం, జారుతనం, కలబోసిన కావ్య  కళావతి
సరళ సొగసులతో దివినుంచి భువికి వచ్చిన శాంతి


కనుల కన్నిటిలో కలువవు
కనుల వెలుగుల్లో మెరుపువు
రెప్పల పందిరిలో ప్రమిదవు
రెప్పల మాటున ఒదిగి ఉంటావు

అడుగులో అడుగేసి అనుకరిస్తావు
అడుగుల్లో చుట్టుకొనే గాలి ఔతావు
అడుగడుగునా  ప్రేమను పంచావు
తడబడ కుండా నాలో ఓదిగిపోయావు

కరముల కౌగిల్లో చిక్కావు
కరతాలముకే కరిగి పోయావు
మరువలేని భంధంగా మారావు
మరవకుండా నాలో ఒదిగి పోయావు


రాధా కృష్ణుల పలకరింపు తీరే వేరు 

యమునా తీరాన రాధ మదిలోని స్పందన
గోపాల కృష్ణుడు కొలువై పులకరించి పల్కెన
ప్రణయణీ హృదయమున పరవసించి ఉండెన
చల్లచల్ల గా రసగీతాలలో కరిగి ఉండే రాధా మోహన 

రాధిక మధుర గీతలను, మనసు పరవిసించే మమేకంతో, అమృతంపంచే అదారాలతో, ఆలపించి అనురాగాల పంచుట కొరకు, తలలో ఉన్న అపూవ్వులు పొట్టలు విచ్చి పరిమళాలు వెదజల్లుతూ తన్మయత్వంలో మునిగే  

ప్రతి రేయి కలలు కంటా
ప్రతి క్షణం నీ కోసం విరహవేదనతో
ప్రతి రాత్రి వెన్నెల వర్షం
ప్రతి నిదుర లేని రాత్రిలో తలుస్తున్నా

నాకళ్ళు కనే ప్రతి కల
నావాళ్ళు తలచే ప్రతి నిముషము
లోగిళ్ళు అంతా సంబరమ్
నావళ్ళు సిరి వెంట పోక ఉండే నీకోసం

నీకు సాటి ఎవరులేరు
నాకు నచ్చావు నన్ను వదలి పోలేవు
ఏకులా ఉండి మేకైనా ననకు
సుకుమారి నా మనసుకి నచ్చావు       

ప్రాంజలి ప్రభ -చిన్న కధ -(బాల్యంలో ప్రేమ )
ఇది ఒకనాటి సాయంకాల సమయం, చిరుజల్లు వానగా మారి, తుఫాన్ గా మారి, కుండపోత వర్షం ఏకధాటిగా కురుస్తున్నది, వీధులన్ని నిర్మానుషంగా ఉన్నాయి, కాలవులన్నీ నిండి పొంగు తున్నాయి, రోడ్లపై నీరు ప్రవహిస్తున్నది, లోతట్టుప్రాంతాలు మునిగి పోయినాయి, అక్కడక్కడ ఆగిన స్కూటర్లు, కార్లు ఉన్నాయి. ఉద్యోగం నిమిత్తం, వ్యాపార నిమిత్తం, స్కూళ్లు, కళాశాలకు వెళ్ళిన వారు వేగంగా తిరిగి వస్తున్నారు, వాల్లకోసం ఇల్లయందు  ఉన్నవారు ఎదురుచూస్తున్నరు. కొంచము వర్షము తగ్గినది.

మంగమ్మగారి మానవుడు, గారాల బాలుడు అగు “ అశోక్ “ భయంగా తడిసిన బట్టలతో ఇంటికి చేరిన వాడ్ని చూసి,  బామ్మ హృదయం భయంతో నిండి, మనస్సు, చివుక్కు మన్నది. ఎందుకురా బాబు ఇలా తడిసి వచ్చావు. మన ఇంటి ప్రక్కన ఉన్న గుడిసెలు మునిగినాయి, అక్కడ మునిగిన వారిని ఈది పడవలోకి చేర్చాను బామ్మ, వాల్ల బాధ చూస్తే నా కళ్ళు తిరిగినాయి, రెండు రోజులనుంచి తిండి లేక మిద్దెలపై ఉన్నారు, కొందరి కన్నా సహాయం చేద్దామని నాదగ్గరున్న పైకముతో రొట్టెలు కొని పంచాను బామ్మ, మరయు బాలుర మందరము కలసి వారి సహాయార్ధం పాత దుస్తులు సేకరించి వారికి పంచాము, నేను తిరిగి వస్తుంటే కరెంటు వైరుతేగి క్రిందపడి ఉన్నది, దాని త్రొక్క కుండా ఉండేందుకు అక్కడే ఉండి నా సేల్లునుండి  పోన్ చేసి వాళ్ళు వచ్చాక, నేను వచ్చాను అందుకే ఆలస్యమైనది.      రామునికి ఉడత సహాయము చేసినట్లు నేను చేసాను అంతే,   మానవసేవే మాధవ సేవ అని నీవే కదా చెప్పావు. నేను తడిస్తేనే తళ్ళ డిల్లి పోతున్నావు నీవు, వాళ్ళను  చూసి నేను సహాయము చేయుట తప్పు కాదుకదా బామ్మా.
గొప్ప వాళ్ళంటే డబ్బు సంపా దించటం కాదు కదా బామ్మ, తోటివారికి సహాయం చేయటం కదా బామ్మ. ఎంత ఎదిగి పోయావురా మనవడా అంటూ కళ్ళంబడి నీళ్లు కార్చింది బామ్మ.   అప్పుడే T .V లో వరదలో మునిగిన వారిని అశోక్ అనే విద్యార్ధి రక్షించినందుకు బాలురకు ఇచ్చే ప్రత్యేక అవార్డు ఇస్తున్నట్లు అప్పుడే తెలిపారు, బామ్మ కళ్ళంబడి నీల్లు కారుస్తూ రారా మనవాడా అని హత్తుకున్నది                        



                                         --((*))--


"ప్రేమను బ్రతికించండి పెద్దలారా"
 
కోర్టు ఆవరణ లోపల కూర్చున్నవారు మాట్లాడకుండా ఉన్నారు,  బయట ఉన్నవారు కోలాహలముగా మాట్లాడుతున్నారు. లాయర్లు హడావిడిగా లోపల కూర్చున్నారు, పొలీసులు నేరస్తులను కోర్టులో హాజరు పరుస్తున్నారు, వాది తరుఫున లాయర్ విశ్వనాద్, ప్రతివాది తరుఫున లాయర్ భారతి వాద ప్రతివాదనలు జరుపుటకు వేచి యున్నారు.

అప్పుడే రాజకీయ నాయకుడు దుర్యోధన రావు (శ్రేయోభిలాషి) ఒకరిని హత్య చేసినట్లు అభియోగం, వారు  నేరము చేసారా లేదా నిర్ధారణకు కోర్టులో హాజరు పరిచారు రక్షక భటులు. ఖచ్చితమైన సమయానికి జడ్జిగారు వచ్చిన తర్వాత కోర్టులో ఉన్న వారందరూ నుంచోవటం జరిగింది, జడ్జి గారు ఆసనమునందు కూర్చున్నాక. తరువాత అందరు కూర్చున్నారు.    కోర్టులో ఉండే గుమాస్తా ఆరోజు వివరించే కేసు వివరాలు తెలియ పరిచాడు.
దుర్యోధన రావు గారు,   దుర్యోధన రావు గారు  దుర్యోధన రావు గారు అని ఆఫీస్ గుమాస్తా పిలిచాడు.
 పొలీసులద్వారా తేబడిన ,   దుర్యోధన రావు గారు  కోర్టులో ఉన్న బోనులా ఉన్న బల్లపైకి వచ్చి నుంచోవటం జరిగింది.   అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
లాయర్ భారతి భగవత్ గీత తీసుకోనివచ్చి, దానిపై దుర్యోధనరావు చేత చేతిని పెట్టించి,  భగవత్ గీత సాక్షి గా అంతా నిజమే చెపుతాను అబద్దము చెప్పను అని పలికించెను.
భారతి : మీకు, సుబ్బారావుగారికి లోగడ తగాదాలు జరిగినట్లుగా రోజువారి పత్రికలన్నీ తెలియపరిచాయి, అది నిజమే గదా. 
విశ్వనాధ్ : లాయర్ గారు అవసరం కాని ప్రశ్నలు వేస్తున్నారు, వెయ్యకూడదని ఆజ్ఞలు ఇవ్వగలరు.
భారతి : సుబ్బారావుగారి కుమారుడే చనిపోవటం జరిగింది, అందులో దుర్యోధనరావుగారి ఇంట్లోనే  జరిగింది.
జడ్జి : మీ అభ్యంతరం తొలగించటం జరిగింది
భారతి : ఆర్ధిక వ్యవహారాలలో మా యిద్దరిమద్య తగాదాలు వచ్చిన మాట వాస్తవము కదా,  రాజకీయములో  వ్యతరేకులు అవునా కాదా.
దుర్యోధన్ రావు: మాఐద్దరిమద్య తగాదాఉన్న మాట నిజము, రజకీయములో వ్యతరేకులము. 
భారతి : ఐతే మీరు పాత కక్షలు పెట్టుకొని వారి కొడుకుని హాత్యచేసారు, నిజమా కాదా చెప్పండి
దుర్యోధన్ రావు: హత్య మాయింట్లో జరుగటం మా దురదృష్టం, నేను హత్య చేసానని అభివాదము మాత్రమే, ఈ హత్యకు నాకు ఎటు వంటి సంభందము లేదు.
భారతి : నిజం చెప్పండి, మా దగ్గర ఆధారులున్నాయి మీరే హత్య చేసినట్లు
విశ్వనాద్ : మా క్లైన్టును ఆధారాలు లేకుండా వత్తిడి చేస్తున్నారు.
భారతి : అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇవిగో జడ్జి గారికి సమర్పిస్తున్నాను, (వేలిముద్రలు రిపోర్ట్ ఇచ్చిన సర్టిఫికేట్, హత్యకు ఉపయోగించిన పరికరము ) .
జడ్జి : మీరు చెప్పుకోవలసిన విషయమేమైనా ఉన్నదా
దుర్యోధన్ రావు: మేము హత్య చేయలేదు, అది మాత్రం నిజం, హత్య చేయుటకు కారకు లెవరో నిర్దారించి శిక్ష వేయగలరు.
భారతి : మీరు ఇచ్చిన డ్రింక్ త్రాగుట వల్ల చనిపోయినారాని మాదగ్గర ఉన్నా ఆధారాలు తెలుపుతున్నాయి. ఇంతకీ మీరు రఘురాం కు డ్రింక్ ఇచ్చారా లేదా
దుర్యోధన్ రావు: డ్రింక్ ఇంచ్చింది నేనే, నేను ఇచ్చిన తర్వాత గుండె నెప్పి వచ్చిందనగా మేమే హాస్పటల్లో చేర్పించాము, ఆ తర్వాత చనిపోయారు. నేను మాత్రము తప్పు చేయలేదు.
భారతి : నేరాన్ని వప్పుకున్నారు కనుక శిక్ష విధించగలరు.
విశ్వనాధ్ ; మా క్లైంటు ను ప్రశ్నిమ్చుటకు అనుమతి కోరుచున్నాను
జడ్జి : అనుమతి మంజూరుచేయుట మైనది. 
విశ్వనాధ్ : దుర్యోధన రావు గారు మీరు స్వయముగా డ్రింక్ త్రాగమని ఇచ్చారా అవి ఎక్కడనుండి తీసి ఇచ్చారు. 
దుర్యోధన రావు :  ఎప్పుడుకలిపి ప్రిజులో పెట్టుకుంటూ ఉంటాము, అది అంతా నా శ్రీమతి చేస్తుంది. లేదా వంట మనిషి చేస్తున్నది. 
విశ్వనాధ్ : :వాళ్ళు ఏమైనా విషం కల్పి ఉండవచ్చు కదా, మరి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి, వారిని కూడా కోర్టులో ప్రస్నిమ్చుటకు అనుమతి కోరుచున్నాను. 
 జడ్జి : అనుమతి మంజూరు చేయుట మైనది.
దుర్యోధన రావుగారి భార్య భాగ్యం : ముందుగా తయారు చేసినది ఇచ్చాము మరిమీరు త్రాగారా 
తర్వాత మేము త్రాగము మాకు ఏమికాలేదు, కేవలము రఘునాద్ త్రాగిన గ్లాసులో మాత్రమె పాయిజన్ కల్పినట్లు  గుర్తించారు. కదా, మీరు కల్పి ఉండొచ్చు కదా. 
మా యింటికి అనేకమంది వస్తున్నారు , మేము అందరికి అట్లాగే ఇస్తాము, ఎప్పుడు ఈ విధముగా జరగలేదు. 
మరి ఇప్పుడు జరిగింది కదా మీ సమాధానము
నేను చెప్పేది ఒక్కటే ఈ మరణానికి మాకు ఎట్టి సంబందము లేదు, పూర్తి వివరాలు పొలీసువారు సేకరించి మేము నిరపరాదులమని గుర్తించగలరు అని మేము జడ్జి గారిని కోరుచున్నాము. 
పనిమనిషి కూడా ఇదేవిధముగా చెప్పటము వలన చావుకు కారణము త్రాగుట వలన మాత్రమే  అని తెలుసున్నది. ఎందుకు ఇచ్చారో మాత్రం తెలియుట లేదు కనుక
విశ్వనాద్ : మా క్లైంట్ కు మీరు జామిన్ ఇచ్చి, పూర్తి వివారాలు సేకరించుటకు తగిన సమయము ఇవ్వవలెనని కోరుచున్నాను. మరియు పొలీస్ అధికారిని ప్రశ్నలు అడుగుటకు అనుమతి కోరుచున్నాను.

పోలీస్ అధికారి:మీరు ధుర్యోదన రావు గారిని అరెష్టు చేయుటకు కారణాలు చూపారా అని అడిగాడు విశ్వనాద్. 
సమాచారము అందగానే మేము హాస్పెటల్ కు పోయాము అక్కడ రఘురామ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.  నేను డ్రింకు త్రాగుటవల్ల నా ఆరోగ్యము చెడినది అని చెప్పి మరీ చనిపోయాడు కనుక  మేము అరెష్టు చేసి కోర్టులో ప్రేవేశ పెట్టితిమి, డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఇందు పొందుపరిచాము. 
విశ్వనాధ్ : జడ్జి గారు తమరు ఈకేసు నిమిత్తము  పూర్తి సమాచారము అందలేదు, కనుక పూర్తి సమాచారము  అంద  చేయ మని పోలిసువారిని కోరవలెనని విజ్ఞప్తి చేయుచున్నాను. ఈకేసు వాయిదా వేయవలెను కోరుచున్నాను 
జడ్జి : ఈకెసు పూర్తి వివరాలు పొలీసువారు పరిసీలించి తదుపరి వాయిదా వచ్చేనెల ఒకటవతారీఖునకు మార్చటమైనది. కోర్టు సమయమైనది అని జడ్జి గారు లేచారు , అందరూ లేచారు. 

పోలీస్ ఆఫీసర్ దుర్యోధన ఇంటికి చేరి అంట పరిసీలించుట మొదలు పెట్టారు, అక్కడ ఉన్న ప్రతి వస్తువును కదిలించి, ఏదైనా ఆధారము దొరుకుతుందేమోనని వెతికారు, గోడలన్నీ తెల్లగా రంగు వేసి ఉన్నాయి, ఇల్లు చాలా పరిశుబ్రముగా ఉన్నది, అక్కడ ఒక కుక్క కూడా ఉన్నది, అది పోలీసులను చూసి తోక ఆడిస్తూ వెనక వచ్చింది, అందరి సెల్లులు తీసుకున్నారు. డ్రాయర్ సొరుగులో కొన్ని పనికిరాని సెల్లులుకూడా చూసారు వారు, వాటినికూడా తీసుకొని వెళ్ళారు . 
పనికిరాని సెల్లులను తసి ఓపెన్ చేయగా, ఒక సెల్లులో రఘురాం చనిపోకముందు రండు రోజులు క్రింద, ఒక మెడికల్ షాపుకు ఫోన్ చేసినట్లు గమనించారు. వెంటనే మెడికల్ షాప్ గుర్తించి గట్టిగా అడుగగా, ఒక స్త్రీకి పాయాజన్ అమ్మినట్లు తెలిపారు వారు . ఆస్త్రీ  ఎవరో గుర్తుపడతార అని అడగగా, గుర్తు పట్టలేమని చెప్పారు. మరల వచ్చి దుర్యోదన్ రావు గారి ఇంట్లో కొత్తవారు ఎవరోచ్చారని విచారించగా దుర్యోదన్ రావు గారి కూతురు స్నేహితురాలు  వచ్చినట్లు గమనించారు. ఆమె అడ్రస్ తీసుకొని వివరాలు వేతకగా ఆమె చనిపోయిన రఘురామ్  కాలేజీలొ బీటెక్ చదువు తున్నట్లు గమనించారు, వెంటనే కాలేజికి వెళ్ళగా, ఆమె కలెజీకి రావటము లేదని గ్రహించారు. ఆమె బెంగళూర్ వెళ్లినట్లు గుర్తించారు. బెంగళూర్ వెల్లి  తెలుసుకొనగ తండ్రికి సిరియన్ గా ఉండుటవల్ల అక్కడే ఉన్నట్లుగా గమనించారు. 

పోలీస్ లు అడిగిన ప్రశ్నలకు ముక్తిసరిగా సమాధానము చెప్పగా ఎమీ ఫలితము లేదని గ్రహించి పోలీసులు వెనక్కి తిరిగి వచ్చారు. 
పోలీసులు చివరాగా చనిపోయిన రఘురాం ఇంటికి వెళ్లి సుబ్బారావు గారిని వివరాలు అడిగారు. రఘురాంకు పెళ్లి నిశ్చయమై, నిశ్చయ తాంబూలములు కూడా తీసుకునట్లు తెలిపారు. 
పోలీసుల అన్నివివరాలు గ్రహించి కోర్టులో వాయిదా సమయానికి వారు తెలుసుకున్న వివరాలు కోర్టులో హాజరు పరిచారు. 

కోర్టులో దుర్యోధన రావుగారు హత్య చేసినట్లు పెద్ద ప్రకటన పాపర్లో ప్రకటించారు, ఈ రోజే శిక్షి పడుతుందని వ్రాసి ఉన్నది. 
కోర్టులో జడ్జిగారు కూర్చొన్నారు. 
జడ్జిగారు తీర్పు చదువుతున్నారు. అందిన ఆధారాలు ప్రకారముగా నేరము చేసినవారు అంటున్నప్పుడు, అప్పుడే ఒక లెటర్ జడ్జి గారికి అందినది అది రాష్ట్ర గవర్నర్ నుండి వచ్చినది. 

ఈ హత్య కేసులో ముఖ్య సాక్షి ఈలెటర్ తెచ్చినవారు వారి అభిప్రాయలు తెలుసుకొని తీర్పు చెప్పగలరు అని వ్రాసిఉన్నది. 
ఈఉత్తరము తెచ్చినవారు ఎవరు అని తెలుసుకొని, సాక్షిగా పిలిచారు. 
అప్పుదే భారతి లాయర్ లేచి వచ్చిన వ్యక్తి మీకు తెలిసిన వివరాలు  చెప్పమని కోరారు. 
" నేను భగవత్ గీత మీద ప్రమాణము చేసి అంతా నిజమే చెపుతాను,. అబద్ధము చేప్పను". నాపేరు జానకి అందరూ జానీ అని పిలుస్తారు, ముఖ్యముగా నేను చెప్పునది, నేను రఘురాం ప్రేమించుకున్నాం, మేమిద్దరం రిజిష్టర్  మ్యారేజ్ చేసుకుందాంమనుకున్నాం దానికి కారాణం రఘురాం తండ్రిగారు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, మా నాన్న కూడా ఒప్పుకోకుండా వారికి ఆస్తి బాగా ఉంది, మనం మద్యతరగతి వాళ్ళం మనకి వాళ్లకు తగదమ్మా అని హెచ్చరించారు, మా అమ్మగారు పోయినప్పటి నుండి మానాన్నగారు చాలా చితికి పోయారు, ఒకరోజు నేను మానాన్నను వెంట పెట్టుకొని సుబ్బారావుగారి ఇంటికి వెళ్ళగా, ఆయన మా అబ్బాయికి వేరే పెళ్లి  చేస్తున్నాము మీరు గొడవ పెట్టకండి అని గట్టిగా అని మమ్ము ఇంట్లోనుండి బయటకు పనివానితో నెట్టించాడు. దానితో మానాన్నగారు మనస్తా పానికి గురియ్యారు, ఆ పరిస్తితిలో ఏం చేయాలో తోచక రఘురాం కలిసాను, అప్పుడే నన్ను మర్చిపో, నీ దారినీవు చూసుకో అని గట్టిగా చెప్పాడు. వెంటనే నేను మానాన్నను ఇంటిదాకాదించి, (నా స్నేహితురాలు జయశ్రీ దుర్యోధన రావుగారి కూతురు) వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడూ వెల్తూ ఉంటాను.  ఆరోజు అనగా రఘురాం చనిపోయే ముందు రోజు, సుబ్బారావు గారి ఇంటి నుండి ఫోన్ చేసినా రఘురాం అన్న మాటలకు (నా వ్యక్తిత్వాన్నే అనుమానించాడు) మగవాళ్ళందరూ ఇలాంటి వారేనని  భరించలేక నేను ప్రాణాలు తీసుకోదలచి విషం తెచ్చి గ్లాసులో కలిపి త్రాగుదామని అనుకునప్పుడే మా నాన్నకు సీరియస్ గా ఉన్నది ఫోన్ వచ్చింది, ఆ గ్లాసును అక్కడ ఫ్రిజులో పెట్టి వెళ్ళాను, మరలా వచ్చి త్రాగుదామని. మానాన్న గారి పరిస్థితి బాగుగా లేనందువల్ల రాలేక పోయాను, ఆ గ్లాసునే తెలియక దుర్యోధన రావుగారు నేను ప్రేమించిన రఘురాంకు ఇవ్వటం జరిగింది, నేను చావాలనుకున్న ఆతను చనిపోయాడు

మనం దేవుడు ఆడిస్తున్నట్లు ఆడటమేతప్ప మనమందరం నిమిత్త మాత్రులం.                       
లాయర్ : విషం కలిపింది ఎవరో నిర్దారణ అయినది ఈ పాయింటు నొట్ చేసుకోండి, కాబట్టి దుర్యోధన రావుగారికి ఎటువంటి సంభందము లేదని నిర్ధారణ అయినది. 
జడ్జి : మీరు చావాలనుకోటానికి కారణం ప్రేమ అని అనుకోవచ్చా, మరిఎదైన కారణమా అన్న మాటలకు
జానకి నా ప్రేమ నలుగురు వేలెత్తి చూపకముందే నేను బ్రతక దలుచుకోలేదు అంటూ, ప్రేమను బ్రతికించండి పెద్దలారా అని ఒక్కసారి బోనులో వరిగి పోయింది, అందరూ నుంచొని చూస్తున్నారు జానకి ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి.
ప్రేమ పక్షులు నేలకోరిగినాయి నేరస్తులు ఎవరు ?
 అతి ప్రేమ, ఆవేశం ప్రాణానికి చేటు – ఆలోచించి అందరూ సహకారం అందిస్తే చావు దగ్గర పడ్డ వాన్నికూడా బ్రతికించవచ్చు             
--((*))--
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి