11, జనవరి 2016, సోమవారం

సంక్రాంతి స్పెషల్ for the month of january 2016-3


ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (3 ) (date 15-1-2016 to 2 1-1-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
H.No 6-18-13,.సుబాష్ నగర్, నిజామాబాదు, తెలంగాణ, ఇండియా   .........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు,
నా మైల్ కు  వచ్చే కధలు, మరియు నా భావాలు  
...........................................................................................................

సంక్రాంతి స్పెషల్
శివ శివ అనరా
శివ శివ శివ అనరా
శివమెత్తి ఆడరా, మధాన్ధులపై పరమ
శివ తలచి నడవరా
శివుడే శ్రావ లోక రక్షకుడని గ్రహించారా

హర హర హర అనరా
హరిహరాదులను ఆదుకొనుటే రక్షరా
వరి అన్నము మేలురా
సరియైన మార్గలో నడక సాగించురా

భవతీ బిక్షం దేహి అని
భవ్యమైన చరితను అర్ధించాలిరా
భవ భందాలు వదులురా
భవానీని ఆశ్రయించి ముక్తి పొందాలిరా

రుద్రావతారుడు అందరి
నిద్ర మత్తు వదిలించి ధైర్యవంతులుగా,
ప్రదాతగా ఉండి శక్తి పంచె 
విధాతే కలియుగాన అభయాంజనేయుడురా   
--((*))--


 చిన్న కద :నీ సంతోషమే అందరి సంతో షము
ఏమిటక్కా అంత దిగులుగా ఉన్నావు, " కూతురికి రంగ రంగ వైభవంగా పెళ్లి చేసాము " కాని కాపురము చేయించ లేక పోయినాము. ఇటు వైపు మీ బావగారు, అటు వైపు మా అమ్మాయి అత్తగారు పంతంతో ఉన్నారు. కారణం చిన్నది, తెగ తెమ్పుల దాకా లాగుతున్నారు. ఏంచేయాలో తోచుటలేదు.

అసలు ఎం జరిగిందో చెప్పు అక్క
పెళ్ళిలో చిన్న సంఘటన జరిగింది, పెళ్లి చివరిలో అందరూ భోజనం చేసేటప్పుడు అమ్మాయిని అత్తగారు, అన్ని తినాలి అని అందరి మందు గట్టిగా అరిచింది, అంతటితో ఊరుకోకుండా “చాతకాని దద్దమ్మ అని కొడుకుని తిట్టింది” మా అబ్బాయి తినమన్నా తినవేమి అన్నది, అత్తగారి మాటలుకు అప్పుడే ఎమీ తినకుండా లేచింది.
అప్పుడే అల్లుడు శిరీషను బ్రతిమాలాడాడు, మీ అమ్మ సారి చెప్పితే నేను వచ్చి ఏదైనా తింటాను అన్నం తప్పా.
మా అమ్మ సారి చెప్పనంటున్నది నేనేం చేసేది, ఇప్పటిదాక మీ అమ్మ చెప్పినట్లు ఆడావు, నేనోచ్చాక కూడా తలాడిస్తావెందుకు, ఎందుకె నీ కంత పొగరు అంటూ చేయి చేసుకున్నాడు కోపంతో భర్త, పెళ్లి నాటి రాత్రి.

జరిగిన సంఘటనకు మీ బావగారు రెచ్చి పోయి, నీపు తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పేదాకా కాపురం చేయనని చెప్పి బ్యాగ్ సర్దుకొని బయలు దేరమ్మ అని ప్రోస్చహించాడు, నేనేమన్నా అడగాలన్న అడగ నీకుండా బయటకు వచ్చాసారు తండ్రి కూతురు.
ఇరువైపులా పంతాలు పెరిగాయి ఇక్కడ మీబావ గారు మల్లి పెళ్లి చేస్తున్నానన్నారు వారు పంపించిన విడాకుల నోటీసును చూసి ఏంచేయాలో చెప్పురా తమ్ముడు.
ఒక్కసారి శిరీష అభిప్రాయము కనుగొన్న తరువాత నేను సమాధానము చెపుతాను, నీవు ధైర్యముగా ఉండు. అంటూ శిరీషను కలిసాడు బావ ఆనంద్.
శిరీష నీవు లెక్చరర్ చేస్తున్నావు, తప్పు ఎవరిదో తెలుసుకోలేక పోయావా, తల్లిని ఎవరు ఎమన్నా సహజంగా కొడుకుకి కోపం వచ్చి కొట్టాడు, నీ భర్తను కలిసాను, అందరి ప్రోద్బలంతో నోటిసు పంపించాడుట, మీరు వస్తే అమ్మతో క్షమాపన చెప్పిస్తాడుట. “తెగేదాక తాడు లాగకూడదు – కొందరి బలహీనత మాటలు పట్టుకొని రెచ్చ కొట్టకూడదు".
ఇదిగో మీ వారి నుంచి ఫోన్ మాట్లాడు “ మా అమ్మ మన హనిమూన్ టిక్కెట్లు కొని మరి ఇచ్చి పొమ్మన్నది”
మన కలయిక కోసం క్షమాపణ చెపుతానన్నది, నా తొందరపాటే, నావేదన గురిచేసింది వస్తున్నావుగా “ వస్తాను
బావ “మరి నాన్న ఒప్పుకుంటాడ కాపురానికి పోవటానికి “ అందరిని నేను ఒప్పిస్తాను నీ సంతోషమే అందరి సంతో షము, ఆమాటలు అన్ని తల్లి విని అన్ని సర్దాను ఇక నీవు బయలు దేరుటే, వర్జం వస్తుంది బయలుదేరు.
పంతాలకు పోకుండా కాపురాలు నిలబెట్టండి - నూరేళ్ళ జీవితమ్ నాశనమ్ చేయకండి


కంద గుళిక (ప్రణయ భావం)

కడలి కెరటంలా నీకోసం
వడ్డు దాకా వచ్చి నీ స్మృతులు తలుస్తూ
ఉండ లేక వెనక్కు వెళ్ళి
కొండ దాటి నదిలా నన్ను కలుస్తావనుకున్నా     

ఆకాశంలో మేఘంలా
ప్రకాశిస్తున్న నాదగ్గరికి గాలిలా
పక్షి లా నన్ను కలుస్తూ
శకలాలు లాగ కరుగుతూ నీకోసం 

వసంతున్నై వస్తున్నా
పసందైన కోయిల పాట వినిపించవా
రసమాదుర్యం అందిమ్చవా
కసిగా ఉన్నది నాకు వస్తున్నా నీకోసం 

కొండ గాలి సోకింది
మండే గుండె చల్లబరుస్తావని వున్నా
గుండె చిక్క బట్టి కలా
కండ తినిపిస్తావని  ఉన్నా నీకోసం

ప్రణయ భావం పెరిగి
తృణ భావంలా విపత్తులో  నిల్చున్నా
రణము నీతో చేయను
వణికే చలిలో నైనా ఉంటాను నీకోసం 

సత్యం పలుకుతున్నా
ముత్యాల దండను పట్టుకొని ఉన్నా
సత్య వదూతగా ఉన్నా
సత్వరం నీ ప్రేమ కోసం వేచి ఉన్నా


కన్నులో కలిసే చూపు
నన్ను ఆ చూపు నీ సేవకా అన్నట్లు
చన్నుల పొంగు చూపి  
మన్ను తిన్న పాములా ఉండమన్నట్లుయిన్ని నాళ్ళు నీకొరకై

మన్నీళ్లుగా వేచియున్న  పిపాసినినీ    
కన్నీరు నీకు తెప్పించక
పన్నీరు చల్లి చిరునవ్వు తెప్పిస్తా సుహాసిని

ముళ్ళు గుచ్చుకోకండా
వళ్ళు కదలకుండా, చిరునవ్వును తెప్పిస్తా
కళ్ళు చెదర కుండా
గుళ్ళు తిరిగి ప్రేమను పుట్టించి బ్రతికేస్తా

పలుకుల మాల కడ్తా
తలుపులు తెరిచి, నీకోసం వేచి ఉంటా
కులుకులతో, రంజిల్లే
వలపులు అందించి, ప్రేమను పంచేస్తా   
--((*))--


చిన్న కధ :కాకుల్లారా జాగర్త – మనుష్యులు తెలివి మీరారు
కాకుల్లారా దూర దూరంగా ఉన్నా రెందుకు, మొన్నటిదాకా కలసి ఉన్నాము కదా, మాలో కలతలు పెట్టి విడ దీసింది మరోకాకి, ఆశలు చూపి, అడియాసలు చేసింది. ఎప్పుడు పాత పాటేనా, కొత్త పాట పాడరాదా, మాకు కా కా అనటం తప్ప కొత్త పాటరాదు, సరేలే మన " ఏకాకి" వస్తున్నాడు అంతా, తన గొప్పేనని “ కా కా “ అంటున్నాడు, మాట్లాడకుండా ఉందాము. ఏమిటి అలా కూర్చున్నారు కలుసుకోండి, క కా అంటూ కలిసారు అందరు.

నేను ఏకాకిని కాదు, పలు కాకులకు నాయక కాకిని, నా దారికి అడ్డులేదు, నన్ను గుర్తించే కాకులు లేకున్నా, నా ప్రయత్నాలు నేను చెస్తూనే ఉన్నా, నాకు వద్దన్నా నడమంత్రపు ఆకలి ఆవహిస్తున్నది, పంచలేక, దాచుకోలేక, మనసు లేని వాడిలా, మమతలను పంచని వాడిలా, మౌన ముణిలా, తనకు పట్టిన కుందేలుకు మూడు కాల్లన్నట్లుగా, నన్ను పెంచిన, నన్ను నమ్మిన కాకులను ఆదుకొనే నాయక కాకిని నేను.

నాయక కాకిని ఒక కాకి ఇలా ప్రశ్నిమ్చిన్ది, పెద్ద పెద్ద భావణాలుకడ తారుటా మనం పైపైకి ఎగరాలేమో ?
దీనికా మీరు భయపడేది కొంత తిని కొంత కడతారు, ఆ కొంత పూర్తి చేసేటప్పటికల్ల పదవి పోయి మూల కూర్చోవటం కాని,గెలిచాక కొత్తపధకాలకు ఖర్చు చేసి ఈ భవణాలకు ఖర్చు తగ్గించవచ్చు, సగం పనులు ఎప్పుడు పూర్తయినవి కాబట్టి అవే మన ఇల్లు గా మారుతాయి.     

అవును నీ ప్రక్క కూర్చోనే కాకి కనబడుట లేదు, ఎక్కడున్నది. ఇతర దేశాల్లో సంచర్తిస్తున్నది, త్వరలో ఇక్కడకు వస్తుంది. మరో కాకి ఏదన్న ఫలితము ఉన్నదా అని అడిగింది. ఎందుకు లేదు అక్కడవిక్కడకు, ఇక్కడవి అక్కడకు మార్చు కొనుట నేర్పుతున్నది, పలువురిలో మన జాతి ప్రగతి తెలియ పరుస్తున్నది. ఇచ్చి పుచ్చుకోవటము తెలుసు కోవటమే ఇందులో పరమార్ధం.

మనం బ్రతకటానికి స్వచ్చత అని, చెత్త లేకుండా చేస్తున్నారు కదా, ఇది చిన్న దేశమా, పెద్ద దేశము మనం బ్రతకటానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఒక చోట చెట్లు నరికినా మరోచోట చెట్లు పెచుతున్నారు చల్లదనం కొరకు.

మన పని మనం చేసు కుంటూ పోదాము, ప్రతి పని చేద్దామని చెపుదాం, మనుష్యులకు నమ్మకం కలిగించి మనజాతిని బ్రతికిద్దాం, నేను చివరగా చెప్పేది ఇదే
కాకుల్లారా జాగర్త – మనుష్యులు తెలివి మీరారు


15 నుండి 8 వరకు మధ్య చుక్క ముగ్గు
              

అనుభందం 

దేవాలయములో ఉపన్యాసం వినటానికి రోజు పరందామయ్య్యగారు
భార్యతో వచ్చి వినేవారు అదేరోజు స్త్రీ పురుషులు గురించి చెపుతున్నారు

ఆదిపరాశక్తి దృష్టిలొ స్త్రీ పురుషులు సమానమే
స్త్రీ పురుషుల వివక్షత సృష్టించినది కలియుగమే
ఆశయాలకోసం ఇరువురు శ్రమపడటం సహజమే
ఆధిపత్యం కోసం ఇరువురి మద్యపోరాటం సహజమే

కృత్రిమ సృష్టి అనేది కుల మత, జాతి, మాత్రమే  
లైంగిక హింసలు స్త్రీ పురుషుల మద్య ఉండటమే
స్త్రీ పురుషుల హక్కుల కోసం నిరంతరం పోరాటమే
స్త్రీ పురుషులు ప్రేమను పంచుకుంటే జీవితం సుఖమే


మహావిష్ణు నాభినుండి బ్రహ్మ పుట్టడం పురాణం
నేను సగం, నీవు సగం, అనటం అర్ధనారీశ్వర తత్త్వం
దాపత్యం అంటేఇష్ట పూర్వకంగా స్త్రీ పురుషులు సంగమం 
పిల్లలు పుట్టడం, పెంచడం భార్య భర్తల కనీస  ధర్మం

భారతీయ ఓవ్నత్యాన్ని గుర్తిస్తూ కలసి మెలసి జీవించడమె
సమభావాన్ని గ్రహించి గొప్పలకు పోక సర్దుకొని జీవిమ్చడమె
సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఒకరి నొకరు సహకరించడమె
ప్రక్రుతి నను సరించి హెచ్చు తగ్గులు లేకుండా బ్రతకటమె

పురాణం ఒకవైపు స్నేహితులు మాటలు మరోవైపు

పంతులుగారు బాగున్నారా, నన్ను గుర్తు పట్టారా
మీతోబాటు చదువుకున్న ఐ.యమ్.పి.సత్యం ను
జ్ఞాపక శక్తి తగ్గింది గుంటూరులో సత్యానివి కదూ  
హమ్మయ్య ఇప్పుడు గుర్తు పట్టారు చాలా సంతోషం

నా భాదలు ఎవరికి చెప్పిన ఫలితము లేదు   
నేనున్న పరిస్తితి ఎవరికి చెప్పిన అర్ధం కాదు
ఓదార్చే స్నేహితులు నాకు గుర్తింపు  లేదు
అందరికి దూరంగా ఇక్కడ జీవితం గడుపుతున్న

ఎం చెప్పేది నేను చేసిన కమ్పెనీ దివాళా తీసింది
చాలా మందికి డబ్బు ఎగ్గొట్టి కమ్పెనీ బోర్డు తిప్పేసింది 
దాచుకున్న పైకము రాక చివరకు బాధ మిగిలింది
ఆప్పులు తీర్చుటకు ఉన్న కొంత అమ్మటం జరిగింది

ఏదో కొంత డబ్బుతో అద్దె కొంపలో ఉంటున్నా
కూరలు పెంచి బజారులో అమ్మి బ్రతుకుచున్నా
వృద్ధులకు మూగజీవులకు ఆశ్రమం కల్పిస్తున్నా
ప్రక్రుతి ప్రశాంత వాతావరణములో బ్రతుకుతున్న

నా విషయం అట్లా ఉంచు మీ  విషయం తెలియపరుచు
పిల్లలెందరు  వారి వివరాలు వివరముగా తెలియ పరుచు
నీ భార్య ఆరోగ్యం, నీపిల్లల విద్యాభివృద్ధి గురించి వివరించు 
కుటుంబ గౌరవ సంపాదన ఉన్నత స్తితి గురించి వివరించు

నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు  
వారు చదివిన చదువుకు వచ్చే  ఉద్యోగాలు
వారందరికి పెద్దలమై చేసాను వివాహ వేడుకలు
పిల్లలకు ఊడిగమ్ చెయ్యుటకు పనికొస్తారు పెద్దలు

ఏదయినా అడిగితె నాకు ఏమి చేసావు నాన్న
పైచదువు చదివిమ్చమంటే చదివిమ్చలేదు నాన్న 
ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాము కాబట్టి ఇల్లు జరుగును నాన్న
ఒకరివద్ద ఉండమంటే ఉండరెందుకు సలహాలు ఇవ్వాలని చూస్తారు

మనమిక్కడ కలవడం ఆదేవుడు కల్పించాడు
వొకరిభాదఒకరు చెప్పుకోవటానికి వీలు కల్పించాడు 
వయస్సుకు తగ్గ ముచ్చట్లుకు అవకాశ మిచ్చాడు
జీవిత మజలీలు ఇంకా ఎన్ని ఎదురుచూస్తూ బ్రతకాలి  

కృ ష్ణా ష్టకం చదువుతూ ఉపన్యాసం ముగించారు
 వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం!
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం!!(1)

అతపీపుష్పసంకాశం, హారమాపురశోభితం!
రత్నకక్కణకేయూరం, కృష్ణం వందే జగద్గురం!!(2)

కుటిలాలకసమ్యుక్తం, పూర్ణ్చంద్రనిభాననం!
విలసత్ కుండలధరం, కృష్ణం వందే జగద్గురం!!(3)

మందారగంధసమ్యుక్తం, చారుహాసం చతుర్భుజం!
బర్హి పించానచూడాక్గం, కృష్ణం వందే జగద్గురం!!(4)

ఉత్పల్ల పద్మపత్రాక్షం, నీలజీమీతపన్నిభం!
యాదవానాం శిరోరత్నం, కృష్ణం వందే జగద్గురం!!(5)

రుక్మిణీ కేళిసమ్యుక్తం, పీతాంబరసుశోభితం!
అవాస్తతు తులసీగంధం, కృష్ణం  వందే జగద్గురం!!(6)

గోపీకానాం కుచద్వంద్వకుంకుమాంకితఫక్షసం!
శ్రీనికేతం మహేష్వాసం, కృష్ణం వందే జగద్గురం!!(7)

శ్రీ ఫత్సాంకం మహోరస్కం వనమాలావిరాజితం!
శంఖ చక్రధరం దేవం, కృష్ణం వందే జగద్గురం!!(8)

కృ ష్ణా షటక మిదం పుణ్యం ప్రాతరుత్ధాయ య: పఠేత్!
కోటీజన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి!!.(9)
 


శ్రీ కృష్ణ భగావాన్ని ధ్యానం చేయందే మేము నిద్రపో0
గీతా సారాంశాన్ని అర్ధం చేసుకొని బ్రతుకు సాగిస్తాం   
మూగజీవులను, పెద్దలను గురువులను ఆరాధిస్తాం
మమ్మల్ని నడిపించేది ఆదెవదెవుడని మేము భావిస్తాం

మా ఇంటిదాకా పోదాం పదా ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి
నా భార్య పూజ పునస్కారాలమ్టూ పిల్లలకు సేవ చేస్తుంది
పిల్లలు పుట్టరని తెలుసుకొని భాద లేకుండా ప్రవర్తిస్తుంది
చిలుకలను, కుక్కలను, కుమ్దేల్లును పెమ్చుతుమ్టుమ్ది

ఇంట్లో అడుగుపెట్టగానే నమస్తే అంటుంది చిలుక
తోకాడిస్తూ మనష్యుల చుట్టూ తిరుగుతుంది శునకం
గంతులు వెస్తూ సందడి చేస్తుంది కుందేలు
కిలకిల శబ్దాలతో సందడి చేస్తాయి చెట్లపై పక్షులు

ఇంతకీ నీవిషయమ్ చెప్పు మద్యలో ఆప్పావు
ఇదిగో ఈ కాఫీ త్రాగుతూ చెప్పు నెవెక్కడ ఉంటావో చెప్పుము 
ఒక్కసారి మేమిద్దరం మీపిల్లలను వచ్చి చూస్తాము
చిరునామా తెలియపరిస్తే వీలు చూసుకొని వస్తాము  

పిల్లలు ఉన్న సుఖం అనేది లేకుండా నేను బ్రతుకుతున్నాను
నేను చేసిన పెద్ద పొరపాటు మొగపిల్లలని ఎక్కువచదివిమ్చాను  
తక్కువ చదువులతో కూతుర్లకు వివాహము చేసాను
ఈ వయసులో చేతిలో డబ్బుల్లేక భాద వ్యక్త పరుస్తున్నాను 


ఎందుకులే నీకు శ్రమ నేను మావిడ కలసి వస్తాం
మీరమ్తగా చూడాలని పిస్తే పిల్లలను కూడా తెస్తాం
మా ఫామ్లికి సంభందించిన ఫోటోలు కూడా తెస్తాం
కానీ మీరు రావద్దు, మరీ మరీ కోరుకొనే మీ నేస్తం 

చిన్న  పిల్లలంటే నాకెంతో ఇష్టం అని నీకు తెలుసు కదా
మనవళ్ళతో సరదాగా ఆదుకోవాలని మాకు ఉంది కదా
ఇక్కడ పిల్లలను చూసి సరదా మీరు  పడవచ్చు కదా
నీ పిల్లలపై స్వతంత్రం ఉంటుంది పరాయి పిల్లలపై ఉంటుందా

మా అడ్రస్సు మీకు చెప్పి మిమమల్ని భాధపెట్టలేము
సందుల్లో విశాలమైన మైదానములో  ఉన్న భవనము
దానిని పెద్దలకు బంగారు భవిషత్ చూపె వృద్ధా శ్రమము
దేవుని కృపవల్ల కొడుకులు కూతుర్లు ఉన్నా ఇక్కడే ఉన్నాము

కొన్నాళ్ళు నేను మాఆవిడ కొడుకులు ఇళ్ళల్లో ఉన్నాము
మరి కోన్నాళ్ళు కూతుర్ల వద్ద కాలం వెల్ల బుచ్చాము  
పనిచేసి నంతకాలం ఎవరూ వేలెత్తి చూపలేదు మమ్ము
వయస్సు పెరగడం వళ్ళ కొంత వచ్చింది అనారోగ్యము

మేము స్వేచ్చగా జీవిమ్చాలని తలంచి బయటకొచ్చాము
మాకున్న దానిలో మేము కొడుకులకు కూతుర్లకు పంచాము
ధనం ఉంటే వృద్ధాశ్రమములొ కట్టి దీవున్ని వెడుకుమ్టున్నాము
నా భాధలు నా కొడుకులకు కూతుర్లకు రాకూడదని అంటున్నా

నోరున్న జీవులైన నాకు ఆత్మీయులు కారు
ఎ విషయములో సహాయము చేయుటకు రారు  
మేము వద్దంటే మీరు చేరారు అమ్దరూ అన్నారు
వేలకు తిండి కంటి నిండా నిద్ర దొరుకుతుంది ఆశ్రమలొ

నేనొకటి నీకు చెప్పదలచు కున్నా
నేను అనాదనే నా అన్నవారు ఉన్నా
నా దగ్గరకు రావద్దని వేడు కుంటున్నా
ఒకరి భాధను పంచుకొనే శక్తి నాకు లేదన్న   

నోరులేని మూగజీవులె నీకు అనుభంధాలు
ప్రక్రుతి వచ్చే  చల్ల గాలులే మీ సోమ్తాలు
ఫలించు పుష్పాలు కాయగూరలు మీనెస్తాలు
సహాయ పడటమే మీకున్న ధైర్యాలు 


సత్యం చెప్పిన కధ విని కల్లవెమ్బడి నీఋ వచ్చింది ఆడంపతులకు
అన్నయ్యగారు మీ భార్యను తీసుకొని ఎప్పుడైనా రావచ్చు ఇది మీ
పుట్టిల్లు అనుకొండి మాకు ఎవరూ తోడూ లేరు మీరు ఎప్పుడైనా రావచ్చు  
ఆ శ్రీ కృష్ణ భగవానుణ్ణి ఆరాధిస్తూ మాధవసేవే మానవసేవే అని జీవిద్దామ్
                                                    


జ్ఞాన కంద గుళికలు

విజ్ఞానాన్ని దాచకుండా
విజ్ఞతను ప్రదర్శించి, వినయంతో
అజ్ఞానాన్ని తొలగిం
చే జ్ఞానాన్ని భోదిన్చుటే గురు ధర్మం

భయం చెందక ని
ర్భయం గా గురుసేవ చేసి, విద్యే అ
భయం గా మారాలంటే
స్వయంగా విద్య నేర్చుకోవడం శిష్య ధర్మం

మాత, పితలకు దూరంగా
శతృవులు దేశంలో చొరబడ కుండా
పతాకమును,ఆయుధమును
చేత పట్టి మాతృ దేశరక్షణే సైనిక ధర్మం

వృద్ధ తల్లి తండ్రులను
శ్రద్ధ గా ఆదరించటం, పోషించడం, అ
శ్రద్ధ చూపక మందు లిచ్చి
యుద్ధ ప్రాతిపతికగా రక్షించుటే పుత్ర ధర్మం

బిడ్డలకు మంచి చెప్పి
బిడ్డల విద్యాభివృద్దికి సహకరించి
అడ్డగోలుగా తిరుగ కుండా
బిడ్డలకు అండగా ఉండుటే తండ్రి ధర్మం

భర్త సంపాదన, ఖర్చుకు
కర్తగా ఉండి, సమర్దవంతంగా, సత్ ప్ర
వర్తనగా, పిల్లల కండగా
భర్తని గౌరవిస్తూ కష్టపడుటే ఇల్లాలి ధర్మం

సోమరి తనం లేకుండా
విమర్సించక ధర్మాన్ని తెలుసుకొని
మమకారం, మనోధైర్యం
సమపాల్లలో నడుచుటే పురుష ధర్మం

నమ్ముకున్న మితృనికి
కమ్ముకున్న చీకట్లును తొలగించి,
సొమ్ములతో, ఆదరించి,
వమ్ము కాకుండా నిలిపేదే మిత్ర ధర్మం

ధర్మ సాక్షిగా పెళ్ళాడి
కర్మల విధిగా, సంసారం నిర్వహించి,
మర్మము తెలిసిన భర్త
కూర్మం లా భార్యకు రక్షే వివాహ ధర్మం

--((*))--
సంక్రాంతి ముగ్గు2 1 నుండి 1 వరకు  ప్రక్క చుక్క  ముగ్గు 


సంక్రాంతి పండుగ..!

సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో
దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతి
 

పండుగ పుష్య మాసంలో వస్తుంది.ఇది మూడు రోజుల పండుగ. మార్గశిర మాసం, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. చలి
గజ గజా వణికిస్తూ వుంటుంది. మొదటి రోజు "భోగి" ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "స్వర్గ వాకిళ్లు" అనే ముగ్గును వేస్తారు. ముగ్గుమధ్యలో
"గొబ్బెమ్మలు" పెడతారు. వీధులలో "భోగి మంటలు" వేస్తారు. 


కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి
"సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని
"కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు.
 

బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి,
పేరంటం చేస్తారు. రెండవ రోజు "సంక్రాంతి" ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో
దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. 


ఈ రోజున
స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. బెల్లం, గుమ్మడి కాయలు "దానమి"స్తారు. పితృదేవతలకు "తర్పణాలు"
వదులుతారు. ఈ రోజున కూడ ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. "రథం" ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈరోజు కూడ "గొబ్బెమ్మలు"
పెడతారు. మూడవ రోజు "కనుమ పండగ" ఈ రోజును "పశువుల పండుగ" అని కూడ అంటారు.
 

వ్యవసాయదారులు పశువులను నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తారు. పసుపు కుంకుమలతో, పూలతో అలంకరిస్తారు. పశువులను పూజిస్తారు.
 

పశువుల కొట్టంలో "పొంగలి" వండి అందులో పసుపు, కుంకుమ కలిపి
పొలాలలో చల్లుతారు. చీడ-పీడలు సోకకుండా కాపాడమని
దేవతలను ప్రార్ధిస్తారు. గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు.పూల దండలు గుచ్చి
పశువుల మెడలో వేస్తారు. దూడల మెడలకు,
కాళ్ళకు చిరుగంటలు కడతారు. ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమలు,
రంగులతో తీర్చి దిద్దుతారు. గంగిరెద్దులను అలంకరిస్తారు. 


కొన్నిప్రాంతాలలో పశువుల ఊరేగింపు,
కోడి పందెములు, గొర్రె పొట్టేళ్ళ పందెములు కనుమ నాటి
సాయంత్రము జరుపుతారు. "కనుమ" రోజు "మినుము" తినాలని "గారెలు" చేసుకొని తింటారు.
 

పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ
కనుమ రోజు తిరుగు ప్రయాణమవ్వరు!!!


 సంక్రాంతి గుళిక

వచ్చే వచ్చే సంక్రాంతి
తెచ్చే తెచ్చే జీవితలో నవకాంతి
ముచ్చట్లతో ప్రకృతి
స్వచ్చమైన క్రాంతితెచ్చే కన్నప్రీతి సంక్రాంతి

ధన్య రాశులింట తెచ్చి
కన్యలు, తరుణీలు వేసే ముగ్గులు
మన్య మంత సుబ్రపరిచి
జనుల కళ్ళు కొత్తజవము తొనికిసల సంక్రాంతి  

భోగి మంటల్లో పాతవి వేసి
భగ భగ మండే మంటల్లో నీరు కాచి
భోగం వచ్చిందని భావించి
కాగు నీరు తలారా పోసుకొని కొత్తబట్టలు సంక్రాంతి      

గంగి రెద్దుల ఆట, ఇంటి
ముంగిట్లో, గాలిపటాలు పిల్లల ఆట
రంగవల్లి మద్య గొబ్బిళ్ళు
రంగు బలుబుల వెలుగు తోరణాలు సంక్రాంతి

హరిదసు కీర్తనలు
సిరుల పంట ఇటికి తెచ్చి, ఆప్యాయతతో
గౌరవస్వాగతం పలికి
సర్వము కలసి పిండి వంటలు చేసే సంక్రాంతి

అల్లుళ్ళు కూతుర్లు చేరి
వళ్ళు వంచి తల్లి తండ్రులను కూర్చోబెట్టి    
పిల్లలకి భోగిపండ్లు పోసి 
బొమ్మల పరెంటాలాతో సాగే సంబర సంక్రాంతి 


21 నుండి 1 వరకు  ప్రక్క చుక్క ముగ్గు
చిన్న కధ:  ప్రతినిముషం

అబ్బా ఏమండి అప్పుడే నిద్ర లేపారు, ఇప్పుడు చలి ఎంత ఉన్నదో తెలుసా -1 డిగ్రీలు ఉండొచ్చు, అది సరే ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా 8 గంటలు దాటింది, ఎనీముషాన్నయిన సూర్యుడు  తొంగిసూస్తాడు లేవవే. అబ్బా ఉండండి నే చెప్పేది వినండి ఎప్పుడో సూర్యు డొస్తాడని, చల్ల దనాన్ని  అనుభవించ కుండా ఉండ లేమండి. ఏమిటే వయసులో ఉన్న కుర్ర కారులా మా ట్లాడుతావు, మన కెంత వయసైందని, మాట్లాడ కోవచ్చు లేండి. ఈ చలి ప్రేమ మనో పరిపాకం, సృష్టికి ఉపకారం, మెలిక గుణాల ఆనంద దాయకం, ఇంకా చెప్పాలంటే ప్రణయ చర్యలకు ఉషోదయం.

అవునే ప్రతి నిముషం నష్టపోకుండా,  బ్రతుకుని సార్ధకం చేసుకోవటంలో ఉన్నది సంతోషం, ప్రకృతికి పరవసించని వారు లేరు ఈ లోకమలో, సుఖ సంతోషాలను పంచుకొని ఒకరి కొకరు తోడుగా ఉండాలి, మన తోడూ నలుగురికి ఉపయోగ పడాలి, నిముష  నిముషానికి మన ఆలోచనలు మారకుండా స్థిర చిత్తముగా  ఉండుట  మంచిది కదే.

అవునండి ప్రతి నిముషము వ్యర్ధం చేయక సద్వినియోగం చేస్తూనే ఉన్నాను గదండి, మీరు చెప్పే మాటలను ఎప్పుడు ధిక్కరించ లేదు, ఎ నిముషము వ్యర్ధము చేయక ప్రతినిముషము మీ సేవకే నా జీవితము దారపోసాను కదండీ,నన్ను ప్రేమగా చూసుకుంటూ, నామాటలను గౌరవిస్తూ నాకు తోడుగా ఉండుట  మంచిదే కందండి.

ఈ కాలంలో, ఈ సమయంలో ఆశయాల కలలను పండించు కోవటమే కదా, నా కాలయాపనను వెలెత్తి చూపక ఉన్నదానిలో తృప్తిగా సంత్రుప్తి పరిచావు, నాకు కన్నీరు తెప్పించక, నీవు కన్నీరు కార్చక, నా మనసును నొప్పించక, ప్రతినిముషము వేచి ఉండి,అడుగక ముందే ఆశలు తీర్చావు.

 మీరు ప్రత్యేకముగా సర్టిఫికేట్ ఇవ్వ వద్దండి ఒకరికొకరు కలసి, మాట మాట కలసి ఉండుటమే నిజమైన దాంపత్య ధర్మం. మనం ఒంటరిగా ఉంటూ మూడు నెలల కొకసారి ఒక్కొక్క కూతురి వద్ద మూడు రోజులుండి, మనకు చేతనైన సహాయము చెస్తూ ఈ కాలాల్ని వర్ధం చేయక  దేశ సేవ చేస్తూ జీవించుదాం, నీమాటకు నేనెప్పుడు కాదనను. నేను ఒక్కటే అంటాను ప్రతినిముషం వ్యర్ధ పరచక జీవించా లంటాను                     --((*))--   

             
8 చుక్కలు 8 వరుసలు 8 వరకు

చిన్న కధ:  ఉండలేననుకున్న పెద్దమనిషి
మావయ్య గారు మీరు ఎక్కడకెల్లారు, అసలేభాషరాని ప్రాంతం ఇది, మేరేమన్నఇల్లు గుర్తు పట్టక వెతుకుతున్నారేమోనని అనుకున్నాము,  నేను మీ అబ్బాయి చాలా సేపు చూసి,చుట్టు ప్రక్కల వెతికాము, మీరు కనబడక, ఇప్పుడు మీ అబ్బాయి అర్జంటు పని ఉందని ఆఫీసుకు వెళ్ళాడు.
 

కాస్త మంచి నీరు ఇస్తావా, నీవు అడిగిన దానికి కాస్త స్థిమితముగా ఉండి తెలియపరుస్తాను.
కాస్తకూర్చోండి, ఇప్పుడే నీల్లు తెస్తాను. ఎందుకో ఎంత త్రాగిన దప్పిక తీరుట లేదు,అవునూ వాతావరణము మారింది, కృష్ణ నీరు త్రాగేవారు మీరు, ఇప్పుడు గంగ నీరు త్రాగుతున్నారు అంతే మావగారు,మీకోసంతెలుగు దిన, వార, పక్ష, మాస పత్రికలు తెప్పించాము, మరియు తెలుగు చానల్ వచ్చేవిధముగా టి. వి . ఏర్పాటు చేసాము, మీరు బయటకు వెళ్లి టెన్షన్ తెప్పించకండి, అసలే సమస్యలలో ఉన్నాము, మరొక సమస్య తేకండి, అన్నందుకు కోపం తెచ్చు కోకండి.(మనసులో అనుకున్నది – పిల్లలకుమాకు జ్వరాల వస్తున్నాయి – అవిఎంతకీ తగ్గుటలేదు – మిమ్మల్ని ఉండి పొమ్మనటానికి శక్తి చాలుట లేదు)
ఈ ప్రాంజలి ప్రభ కవిత చదివాక ఇంటికి వెళ్దామనుకుంటున్నాను, ఏది ఆ కవిత ఇదిగో చదువు  ఇంటి వచ్చినవాన్ని పొమ్మనక అన్న పదాలు
ఇంటి పెద్ద చెప్పిన మాటలు :
తప్పు చేస్తున్నా వనుకోకమ్ము
మాపు నిలువుము, రేపు పొమ్ము
కాపు కాసి, కలత వదలి పొమ్ము
ముప్పు రాదు, జాగర్తగా పొమ్ము

వచ్చిన అతిధి మాటలు:
కళ్ళ బొల్లి మాటలు నమ్మి పొమ్మనకు
మాటల వళ్ళ కలతలోస్తాయని అనకు
ఎప్పుడూ రక్షగాఉన్న వాణ్ని, పొమ్మనకు
కారణము లేకుండా, వట్టిగా పొమ్మనకు

ఇంటి పెద్ద  మాటలు :
బరువు మీద బరువుగా, ఉండ కూడదని
నలుగురిలో పరుపు పోకుండా, ఉండాలని
ఏరి కోరి కష్టాలు తెచ్చుకోవటం, ఎందుకని
మనుష్యుల మద్య  స్పర్దలు,  రాకూడదని

వచ్చిన అతిది మాటలు:
నిజం తెలుసు కోక, పోమ్మంటున్నావు
స్నేహాన్ని వదిలే విధంగా, మాట్లాడవు
పోమ్మాన్నావు, తర్వాత బాధపడతావు
నిజం తెలుసుకున్నాక, నన్ను కలువలేవు     
 
పోమ్మన్నావు వెళ్ళొస్తా - రమ్మన్నా మల్లీ వస్తా
పరిస్థితి అర్ధం చేసుకున్నదుకు ధన్యవాదములు 

చదివాకమీరునాకు అతిధి కాదండి, స్వయాన మావగారు, నేనుపొమ్మన లేనండి, అంతా మీ ఇష్టం.
నేను మాఊరికి వెల్లుతున్నా, చెప్ప లేదనకు, అబ్బాయికి ఫోన్ చేసి ఇవ్వమ్మా, ఒక్కసారి మాట్లాడి వేల్తానమ్మా
"బాబు" నీవు వచ్చేటప్పుడు మన ఊరికి ట్రైన్లో టిక్కేట్లుకొని తీసుకురా, నీవు ఎన్ని మాటలన్నా, ఇక్కడ ఉండ దలుచు కోలేదు, కారణము ఎమీ లేదు, నీవు, కోడలు, పిల్లలు,  అందరూ చక్కగాచూసుకుంటున్నారు, పోదా మనుకున్నాఅంతే. సరేనాన్న, నేను వచ్చి నిన్ను రైలు ఎక్కించి పంపిస్తా, సరే నీకోసం వేచి ఉంటా ......
మనసుకు తృప్తి లేకపోతె – ఎన్నిఉన్నా అన్నీ అసంతృప్తిగా నే ఉంటాయి
అక్కరకువచ్చేచుట్టంగాఉండాలి ఎవరైనా – ఉండి పోదామనుకుంటే సబబేనా

--((*))--


నాన్నకు ప్రేమతో సినిమా స్టిల్స్ జూ. ఎన్ టి అర్
ఈక్దహ్ మీరు చూసి మీ అభిప్రాయాలు తెలుపగలరుమరియు ఆన్లైన్ గూగుల్ న్యూస్ చూడ గలరు 

NTR Jr on 'Nannaku Prematho' director Sukumar

"Sukumar is the kind of director you don't want to criticize even if his film fails, because there's so much genuine effort in his work. I've never seen a director with so much of dedication and commitment. He pushes you to give your best," NTR Jr
ఈ క్రింద  లింకు ను టిక్ చేయండి 
సాహితి కిరణాలు -3 (ఫ్రo  పేస్ బుక్ )
 హాస్య గుళికలు
1.అసెంబ్లీ:
నాయకులందరూ అసెంబ్లీలో  సమావేశమై, డబ్బు వృధా కాకుండా
ఏంచేయాలో చర్చకు వచ్చింది.
అధ్యక్షా అసెంబ్లీ పని దినాలను తగ్గించితే మంచిది అన్నారు ఒకరు,
అధ్యక్షా ఐదు రోజులు అఫీసులు నడిపించుదాం అన్నారు మరొకరు,
అధ్యక్షా శని, దివారములు అన్ని షాపులు మరియు, బ్రాందిషాపులు
మూసివేయాలన్నారొకరు, మరి మన కమిషన్ ఎట్లా ...........

2.అనుమానిస్తున్నారు:
మనం గోడవపెట్టుకోకపోతే అందరూ  అనుమానిస్తున్నారు
మనం గొడవ పెట్టుకుందాం
భార్యా భర్తలు అనుకుంటారు ............


3.అనాధఆశ్రమం                                                                                                                        అత్తమామలను అనాధ ఆశ్రమంకు పంపకండి అన్నది భార్య.
నేనే వారికి సేవలు చేసి తరిస్తాను, ఈ "బుద్ధి  ఎక్కడి  నుంచి  వచ్చిందే నీకు." వారికి వచ్చే పించన్ మనకు కూడా  పనికొస్తుంది కదండి. ......... 

4. అమెరికా
మన ఇద్దరికీ వీసా వచ్చింది హాయిగా అమెరికాకు వెళ్లి
పెళ్లి చేసుకుందాము  అన్నాడు శిరీషతో శ్రీను,
మా ఆయన వప్పుకుంటే నాకు అభ్యమ్తరం లేదు ..........
--((*))--

సీతారామ కల్యాణం (వాల్మీకి విరచి రామాయణం) - తేలిక పదాలతో వ్రాసినది - Part-(1)
        (మల్లా ప్రగడ రామకృష్ణ అంత్య ప్రాస భావ సీతారామ కల్యాణం)
   
    1    దేవతలు ఋషులు రావణ చేష్టలకు అనుభవించారు నరకం
    విష్ణుమూర్తి వద్దకు వెళ్లి దేవతలు,ఋషులు కోరారు పరిష్కారం
    రావణునకు పుణ్యం తగ్గి పాపం పెరిగేదాక ఉండాలి సహనం
    అందరూ రామాయణం చదవడం మనశ్శామ్తికి శ్రేయస్కరం
   
    2    నారదుడు సంచారము చేస్తూ వాల్మీకిని కలిసాడు అరణ్యం
    వాల్మీకి నారదుడిని కోరే తెలపండి శ్రేష్టుడి కధా వివరం
    లోకంలో ధర్మజ్నుడు, క్రుతజ్ఞుడు గురించి తెలిపెద సత్యం
    నారద మహాముని వాల్మీకికి తెలిపే రామాయణ మహత్యం

    3    సరయూ నది సమీపమున ఉన్నది కోసలమను పెద్ద దేశం
    అందులో సమృద్ధి వనరులుగల అయోధ్యా పట్టణం
        మను మహారాజు దానిని స్వయముగా చేసే నిర్మాణం
    నారద మహాముని వివరించే అయోధ్యా పట్టన విషయం

    4    దశరధ మహారాజు అయోధ్యా నగరాధీశo
        సమస్త ఉపయోగకర వస్తువుల సంగ్రహం
        తేజోవంతమైన పాలన పురప్రముఖలకు ప్రియం
    దశరధ మహారాజు పరిపాలన ప్రజలు అంటారు అమోఘం
       
    5    నాస్తికుడనేవాడు కనిపించడు నగరమంతా భక్తి మయం
        కాముకులు, క్రూరులు, లేని ప్రాంతంగా ప్రజలు సుఖమయం
        దరిద్రుడు, విద్యలేనివాడు, కనిపించని పరిపాలనా మయం
        దశరధ మహారాజు పరిపాలన ప్రజలు అంటారు అమోఘం

    6    భ్రాహ్మాణులు పతిరోజు వేదాద్యయన పారాయణం
        క్షత్రియులు ధైర్యసాహసాలతో చేస్తారు వీరధర్మ0
        వైశ్శులు ధర్మమార్గమున చేస్తున్నారు ధనసంపాదనం
        శూద్రులు భ్రాహ్మాణ, వైశ్య, క్షేత్రియులకు సేవాతత్పరం
       
    7    అల్లుడుగా విచండ మహర్షి యొక్క కుమారం
        ఋష్య సృమ్గుడు వదిలెను బ్రహ్మ చర్యం
        స్త్రీలపై బ్రమలు పెట్టుకొని చేరే అయోద్యానగరం
        దశరధుడు కుమార్తె శాంతను ఇచ్చి చేసే వివాహం
       
    8    కామ, క్రోద, లోభ,మద,మాచ్చర్యములపై ఉండాలి నిగ్రహం
        ఆశ్రమధర్మమ్ భంగం కలుగనీయకుండ నెరవేర్చుకోవాలి అభీష్టం
        సత్కర్మల చేసినందు వల్ల అరిషడ్వర్గాలను జఇంచగలం
        సేవకులపై దురహంకారం చేసితే కలుగును అగౌరం
       
    9    రాజ్యంలో ప్రజలందరూ సుఖసామ్తుల మయం
        శివ భక్తులు వారి నిత్యపారాయణం పంత్యాక్షరి మంత్రం
        విష్ణు భక్తులు నిత్యపారాయణం నారాయణమంత్రం
        రాజవంశంలో అందరు పుత్రులు కొరకు చేస్తున్నారు యజ్ఞం
       
    10    పుత్రుల కొరకు దశరధ మహారాజు చేసే అశ్వమేధ యాగం
        సంవత్చర కాలంలో రాజ్యాలు తిరిగి వచ్చే యజ్ఞాశ్వ0
        సామంతరాజులు పండితులు చేరిరి యజ్ఞ శాలం
        దేవతలకు ఆవిర్భాహం కోసం చేసారు హోమగుండం
       
    11    దశరధ మహారాజు భార్యా (కౌసల్య) సమేతంగా చేసే యజ్ఞం
        జాగరణతో, నిష్టతో, మొదటిరోజు చేసే జంతు హోమం
        రెండవరోజు నుక్త్వమ, మూడవ రోజు ననిరాత్రి చేసే హోమం
        అశ్వమేధయాగమ్ ఋషులు పండితులు చేసే సమ్పూర్ణ0
       
    12    పుత్రులకొరకు దశరధుడు ప్రారంచిమ్చే పుత్రకామేష్టి యాగం
        యధర్వన మంత్రాలతో చేసే బ్రహ్మాండమైన హోమం
        దేవతలందరు వచ్చి గ్రహించారు హవిర్భాగం
        దేవతలు, ఋషులు, పుత్రసంతానం కలగాలని ఆశీర్వాద0
       
    13    రాక్షసులు చేసే ఘోరాలకు ప్రజలందరిలో కలిగే భయానకం
        దేవతలు, ఋషులు కోరే నారాయణుని పాహిమాం పాహిమాం
        శేష శయ్యపై చిరునవ్వుతో నారాయణుడు లక్ష్మీ సమేతం
        నారాయణ స్వరూపమ్ విశ్వమంతా ఆవిర్భావం
       
    14    సమస్త ప్రాణుల స్థితి జ్ఞాన వైరాగ్యమునకు హేతుం
        రూపద్వమ్దములు లేని సమస్తమునకు పరమేక0
        మీరమ్దరు ఆత్మజ్ఞాన హృదయంతో ప్రార్ధించుట భావ్యం
        సంయమనం పాటించండి నేను చేస్తాను రాక్ష సంహారం
       
    15    సమస్త సమస్య భందన ఛేదం
        హృదయాన మొహభందన నిరోధం
        సర్వ భంధ విముక్తితో కలిగే మోక్షం
        అదే లోకమంతా ఉన్న శివ నారాయణ తత్త్వం
       
    16    భావ అభావాలు లేని యోగామయం
        నిత్యమూ యోగులచే ధ్యానించే వందేరామం
        విశ్వమంతా వామ్చిచే భక్తితో ప్రార్ధణామయం
        శివ నారాయణలను ఆరాధించే అంతా భూలోకం
       
    17    హే భగవాన్, ఓ పరమాత్మా గుర్తిమ్చ వేమి మాకష్టం
        ఎమీఎరుగని స్త్రీలపై, అమాయకులపై రాక్షసుల అఘాఇత్య0
        రాక్షస చర్యలకు మేమందరం మూకమ్మడిగా ఆత్మత్యాగం
        ఈ ధరనిపై కష్టాలు మేము భరంచ లేమని ప్రజల ఆర్తనాదం
       
    18    పృధ్విపై పెరిగే వటవృక్షంలా నాటుకు పొఇనా రాక్షసుల క్రూరత్వ0
        దరహాసం అనేది ప్రజలు నోచుకోలేని భయానక జీవిత0
        రక్షసమాయతొ కామందులు, మూర్ఖులు విలయ తాండవం
        శ్రీమన్నారాయణుని ప్రార్ధిస్తూ మునులు దీక్షతొ చేస్తున్నారు యజ్ఞం
       
    19    శ్వేతాంబరదారి పాహిమాం పాహిమాం
        పీతామ్బరదారి రక్షమాం రక్షమాం
        దిగంబరదారి ప్రణామం ప్రణామం
        రాక్షసులచేతిలో చిక్కి అవుతున్న నిర్జీవ0
       
    20    ప్రార్ధనలతో చెప్పుకుంటున్నారు బ్రతకలేము ఈ దర్భార జీవితం
        పరమాత్మ వచ్చి రక్షిస్తాడని ప్రజలందరి ఆత్మా విశ్వాసం
        దేశం సర్వతోముఖముగా ఉండాలని ఋషులు చేస్తున్నారు హోమం
        మమ్ము సృష్టించిన పరమాత్మునిపై పెడుతున్నాము భారం
       
    21    సమస్త శాస్త్ర సమ్మిళితమైన వేదాంత మయం
        సకలప్రాణుల రక్షణకు విష్ణువు కోసల్యా గర్బం చేరే సంకల్పం
        సమస్త ప్రాణుల హ్రుదయానందం లో ఆనందమయం
        దేవతలు, ఋషులు, మునులు, అనుభవించారు ఆనందం
       
    22    యజ్ఞగుండం నుండి విశాల దేహుడు ఆవిర్భావం
        హస్తములందు తేజరిల్లు పూర్ణ కుంభ పాయసం
        భార్యలతో త్రాగిమ్చుము కలుగును పుత్ర సంతానం
        యజ్నపురుషుడు అందిచే దశరధునికి పూర్ణకుంభం
       
    23    పూర్ణకుంభం నుండి కౌసల్యకు పంచే పాయసం అర్ధ భాగం
        సుమిత్రకు ఒసమ్గె పాయసం అర్ధ భాగంలో అర్ధ భాగం
        మిగిలిన అర్ధభాగంలో కైకకు పంచే పాయసం అర్ధ భాగం
        మరల పంచే సుమిత్రకు మిగిలిన మొత్తం పాయసం
       
        24.దశరధుని వాంచా ఫలసిద్దికోరకు విష్ణువు ప్రవేసించే కౌసల్యా గర్భ0
        దేవతా స్త్రీల యందు దేవతల అంశలు ప్రవేసిమ్చుటకు సిద్దం
        కొందరు భల్లూకములుగా, మరికొందరు వానరులుగా జననం
        ఇంద్రుని అమ్శతొ వాలి, సూర్యుని అమ్శతొ సుగ్రీవుదు జననం

        25.కౌసల్యాదేవికి చైత్రశుద్ధ నవమి నాడు ఉండే పునర్వసు నక్షత్రం
        కర్కాటక లగ్నమునందు గ్రహములన్నియు ఉండే ఉచ్చస్తానం
        దివ్య మంగళ విగ్రహుడైన, సుందరుడైన కుమారుడు జననం
        కైకకు పుత్ర జననం మరియు సుమిత్రకు పుత్రులు జననం
       
        26.సర్వ దేవతలు కురిపించిరి పుష్ప వర్షం
        గందర్వులు చేసారు అద్భుత గానం
        అప్సరసలు చేస్సారు అద్భుత నృత్యం
        ఋషులు లేక్కకట్టారు కుమారుల జాతకం
       
        27.పుత్రులకు చేసే బ్రహ్మ ఋషులు నామకరణం
        కౌసల్యా సుతుడైన జేష్టునకు శ్రీ రామం
        కైకేయ గారాల సుతునకు భరతం
        సుమిత్రా పుత్రులకు లక్ష్మణం , శత్రుఘ్నం

       
        28.అంజనా గర్భమునందు వాయు తేజస్సుతో పుత్ర జననం
        వానర రాజు ముద్దుగా పిలుచుకొనేను ఆంజనేయం
        సూర్యుని పండు అని భావించి తినుటకు పయనించే గగనం
        ఇంద్రుని వజ్రాయుధం తగిలి భూమిపై పడే సజీవ శరీరం

        29.వాయుదేవుడు స్తంభిమ్చే పవనం
        ఋషులు దేవతలందరు ప్రత్యక్షం
        త్రిమూర్తులు బ్రతికించే వాయు నందనం
        అనేక వరాలతో ఇచ్చే అమ్దరూ ఆశీర్వాదం
       
        30.లోకరక్షకుడు శ్రీ మహా విష్ణువు స్రీ రాముడుగా అవతారం
        ధర్మభోధ శాస్త్రములలో రామాయణం కావ్యం అగ్రగణ్యం
        వేదములతొ సమానమైన రామాయణం ప్రజలకు మర్గదర్శ0
        నారదుని ఉపదేశానుసారం రామాయణం వాల్మీకి కృతం
       
        31.రాజకుమారులను అల్లారు ముద్దుగా పెంపకం
        శ్రీరాముడనగా ప్రతిఒక్కరికి అమిత ప్రేమ మయం
        అన్నదమ్ములు కలసి ఆడుకుంటే అందరికి ఆనందం
        దశరధ మహారాజుకు శ్రీ రాముడంటే ప్రాణానికి ప్రాణం

        32రాజకుమారులు ప్రతి దినం వేదముల యొక్క స్వాద్యనం
        తల్లి తండ్రులపై ప్రేమ, అందరి హృదయాలలో సుస్తిరస్థానం
        కుమారులు ప్రతిరోజూ విలువిద్య, సకల శాస్త్రముల అభ్యాసం
        పది సంవస్చరములలొ సకల విద్యలలో పొందే నైపుణ్యం
       
        33.అయోధ్యలో ప్రతిఒక్కరు పాటలుగా పాడుచున్నారు రామనామం
       
               ఉన్న నామములోకేల్ల ఉన్నత మైనది రామనామం
        వరుస ఎవ్వరు విన్న వాడి చెడని నామం రామనామం
        ఏజాతి వారికైనా ఎమ్గిలిలేని ఎదలో నిల్చిఉన్న నామం రామనామం
        కలియుగంలో కన్నవారికి కనువిందు చేసే కమనీయ నామం రామనామం
       
        వానకు తడవని, ఎండకు కరగని, చలికి చలించని నామం రామ నామం
        ఎపుట్ట చూసిన ఎగట్టు చూసిన చెదలు పట్టని నామం రామనామం
        ఇహము పరము సర్వ సుఖములు ఇచ్చు నామం రామనామం
        నమ్మినవారికి కొంగు బంగారమై ఉన్న నామం రామ నామం
       
        కోరినవారికి కోరికలు తీర్చి సంతోషము పంచే నామం రామనామం
        రామ భక్తులకు మోక్షము ప్రసాదించే జపనామం రామనామం
        గాలిలో తేలి గగనమునందు మారుమ్రోగే నామం రామనామం
        అక్షర జ్ఞానము లేని ఆది మానవులను ఆదుకొన్ననామం రామనామం
       
            చిందులు వేసే చిలకపలుకుల నామం రామనామం
        చింతలు తీర్చి చిరునవ్వులనవ్విమ్చే నామం రామనామం
        నిగ్రహశక్తి, ధైర్యమును ప్రజలకు కల్పించే నామం రామనామం
        రామభక్త హనుమంతుని నామం రామనామం
                                                      ఇంకా ఉన్నది వచ్చేవారం
--((*))--  .
వినరో భాగ్యము విష్ణు కధ !
.
వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణుకథ
.
ఆది నుండి సంధ్యాది విధులలో
వేదంబయినది విష్ణుకథ
.
నాదించీనిదె నారదాదులచే
వీథి వీథులనే విష్ణుకథ
.
వదలక వేదవ్యాసులు నుడివిన
విదిత పావనము విష్ణుకథ
.
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ
.
గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లి విరియాయె విష్ణుకథ
.
ఇల్లిదె శ్రీ వేంకటేశ్వరు నామము
వెల్లిగొలిపె నీ విష్ణుకథ
https://www.youtube.com/watch?v=3Rvx0sUKzvo
 సర్వేజనా సుఖినోభవంతు  -ఓం శాంతి:  శాంతి: శాంతి:మీ అమూల్య సలహాలే మాకు అక్షర సత్యాలు అందరకి సంక్రాంతి శుభాకాంక్షలు

--(