21, జనవరి 2016, గురువారం

Telugu Internet Magazine- forthe month of 1/2016-4

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (4) (date 22-1-2016 to 31-1-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, మరియు నా భావాలు  
...........................................................................................................ప్రియసి ప్రియుల మద్య ఛలోక్తులు
దేహి అంటూ అర్ధించాను నీ మనస్సు
నీ కోసం ఎక్కు పెడుతా శివ ధనుస్సు
నీకు అందిస్తా చీకటితొలగించే ఉషస్సు
నీకుఅందిస్తా ఇంద్రదనస్సులా తేజస్సు     


కళ్ళు తిరిగి తిరిగి అలసినాను, కీళ్ళ నెప్పులు బాగా పెరిగినాయి నీ కలలో ప్రేవేసించి నందుకు అన్నది ఒక ప్రేయసి
నీవు మందులో ప్రేవేసించి త్రాగు త్రాగు అని చెప్పి నా మెదడుని తొలిచావు కదా  ప్రియసి అన్నాడు ప్రియుడు

నా హృయంలో పన్నీరు జల్లి,  నా మనసుని కల్లోల పరిచి, నా అంతరంగాన్ని కదిలించావు అన్నది  ప్రియాసి
నా వయసులో మెరుపు కల్పించి, తలపులు పెంచి, చుంబనాలు అందించావు కదా ప్రియాసి అన్నాడు ప్రియుడు  
--((*))--

మెరుపుని చూడాలంటే నింగిలో ఒక్క క్షణం
పువ్వు పరిమళాలు పీల్చాలంటే ఒక్క క్షణం
కొవ్వును కరిగించాలంటే ఇప్పుడు ఒక్క క్షణం
అమ్మాయి ప్రేమ పొందాలంటే ఎంతో కష్ట తరం   
 

ప్రస్థానం –5
మనసుని దోచి, మురిపించే కృష్ణ
నీ కై తపిస్తూ వేచియున్నది ఈ రాధా
నీ ప్రేమను మరువలేకున్నాను కృష్ణ
విరహాగ్నిలో ఉంచి నవ్వుతవా కృష్ణ

నా హృదయ సామ్రాజ్యాని ఏలే కృష్ణ
సర్వం నీకు అర్పించాలని ఉండి కృష్ణ
నా తపనను అర్ధం చేసుకోవా కృష్ణ
నా తపస్సు ఫలంగా దక్కవు కృష్ణ
 

తమకంతో ఫలింప చేయవా కృష్ణ
జాగుచేయక రావా మోహణ కృష్ణ
ప్రతిరేయి నీకోసం వేచిఉన్నా కృష్ణ
నీ ఆరాధనే నాకు సర్వ రక్ష కృష్ణ
 


--((*))--ప్రాంజలి ప్రభ - చిన్న కధ

-చెప్పటం తేలిక, ఆచరణే కష్టం,
 . 
ప్రతిఒక్కరు తమ తాహతుకు తగినవాటికి ఆశపడటం తప్పుకాదు. పంట వేసిన రైతు ఫలసాయం కోసం, పెళ్ళయిన పడుచు బిడ్డ కోసం,బాగా పరీక్షలు రాసిన విద్యార్ధి మంచి ఫలితం కోసం, పెళ్ళి చూపులలో చూసొచ్చిన అమ్మాయి పెళ్ళికి ఒప్పుకోవాలని పెళ్ళికొడుకు, ఆశపడటం తప్పుకాదు. 

అదేమిటి! అబ్బాయి కదా ఒప్పుకోవలసినది అనద్దు, ఆ రోజులు పోయాయి, ఇప్పటి రోజుల్లో అమ్మాయి ఇష్టపడితేనే పెళ్ళి, లేకపోతే హళ్ళికి హళ్ళి, సున్నాకి సున్నా, అదీ నేటి పరిస్థితి. మొన్ననొక పెళ్ళి సంబంధం చూశాము, అమ్మాయి ఒక పట్నంలో పని చేస్తూఉంది, అబ్బాయి మరొక పెద్ద పట్నం లో పని చేస్తున్నాడు, అన్నీ నచ్చేయి కాని అమ్మాయి అంత దూరం వెళ్ళి కాపరం చెయ్యను, అని కచ్చితంగా చెప్పేసింది, మరి ఇప్పుడు డిమాండు అమ్మాయిలదా? అబ్బాయిలదా?. పెళ్ళి కొడుకులు అమ్మాయిల ముందు" క్యూ "కడుతున్నారు. రేపో నేడో, అమ్మాయిలు కన్యాశుల్కం అడిగినా అశ్చర్య పోనక్కర లేదు. ఈ పోకడలు వెర్రి తలలేస్తున్నాయి. 
వరకట్న మెంత దురాచారమో కన్యాశుల్కం కూడా అంతే దురాచారం. 
దారి తప్పేం. 

ఆశ పడిన ఫలితం దక్కనపుడు నిరాశ పడటం సర్వ సహజం. దురాశ, పేరాశలకి ఫలితం ఎప్పుడూ నిరాశే. ఆ ఫలితంగా వచ్చే నిరాశకి మందు లేదు. నైజ గుణానికి లొట్టకంటికి మందులేదని నానుడి కదా. ఇల్లా పేరాశ, దురాశలకి పోతే మిగిలేదెప్పుడూ నిరాశే. సహజమైన, ధర్మమైన కోరిక నెరవేరనపుడు కూడా నిరాశ జనిస్తుంది, సహజం. నిరాశ నుంచి దుఃఖం పుడుతుంది, నిరాశను, దుఃఖాన్ని కూడా అనుభవించాల్సిందే. జీవితంలో అన్నీ అనుభవించాలి, తప్పదు. సంతోషం, విచారం, కోపం, ఆశ, నిరాశ ఇలా అన్నీ అనుభవించక తప్పదు. ఐతే నిరాశ లో పడి కొట్టుకుపో కూడదు. కష్టము, సుఖమూ, ఏదీ నిలిచి ఉండిపోదు. ఎప్పుడూ సుఖమే ఉండదు, నిరాశలో కూరుకుపోరాదు. 

ఒక్కొకప్పుడు అన్నీ సవ్యంగా ఉన్నా ఫలితం వ్యతిరేకంగా ఉంటుంది. అదే విధి వైపరీత్యం అంటే. దానినేమీ చెయ్యలేము. అప్పుడను కోవలసినది,  ఈ వ్యతిరేక ఫలితం  కూడా మన మంచికోసమే జరిగి ఉండచ్చు, మనకి తెలియని ఆపద భగవంతుడు చేసిన ఏర్పాటిది అనుకుంటే మానవుడు ముందుకు సాగగలడు. లేకపోతే నిరాశ, దుఃఖాలలో కూరుకు పోయి, మరి తేరుకోలేడు. కష్టం కలిగినపుడు నిర్వేదం కలుగుతుంది, ఈ నిర్వేదం నుంచి జీవితానుభవం కలిగిన పెద్దలు ముందు బయట పడి, పిన్నలకు ధైర్యం చెప్పాలి.మార్గదర్శనం చేయాలి. 

లంకలో ఉండగా తనను వెతుకుతూ వచ్చిన హనుమతో సీతమ్మ ఇలా అంటుంది, 
 ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే, 
రజ్జ్యేవ పురుషం బద్ధా కృతాంతః పరికర్షతి……. రామాయణం. సుందరకాండ. ౩౭వ సర్గ…౩ 
అనగా సమృద్ధిగా ఐశ్వర్యము కలిగినపుడేగాని, దారుణమగు కష్టము కలిగిన సమయముననేగాని, పురుషుడెంత మాత్రము స్వతంత్రుడు కాడు. దైవము వానిని త్రాటితో కట్టినట్లు పట్టి ఈడ్చుకుపోవును. 

చెప్పటం తేలిక, ఆచరణే కష్టం, కష్టంలో ఉన్నపుడే, మనిషి గుణం తెలిసేది, ధైర్యం,నమ్మిక, ఆశ, కావాలి. చెప్పడం కాదు ఆచరించాలి,ఆచరించి చూపాలి, అప్పుడే పెద్దరికానికి విలువ, ఫలితం, కావలసినవారికి ధైర్యం చెప్పాలి, కష్టం గట్టెక్కాలి.

--((*))--
 
ప్రాంజలి ప్రభ - చిన్న కధ -నాయకుడిగా మారాలి ఎలా ?
నాన్న గారు నేను మన నగర, మన ప్రాంత, వార్డ్ కార్పోరేటర్ గా నన్ను అందరూ పోటి చేయమంటున్నారు. నేను ముందుగా నిన్ను అడిగి నీ అనుమతితో నేను పోటి చేయాలను కున్నాను. నీ పురోభివృద్ధికి నేను అడ్డు పడను, కాని నేను కొన్ని విషయాలు చెప్పగలను “చెప్పిన మాట చెప్పకుండా చెప్పాలి, ముసలి కన్నీరు కార్చాలి, ఏదడిగినా అన్ని నేను గెలిచిన తర్వాత చేస్తానని చెప్పాలి, మనకులాల వారితో పాటు, అన్నికులాల వారిని మంచిగా పలకరించి వారి సమస్యలకు న్యాయం చేయాలి, ఎట్టి పరిస్తితిలో న్యాయంగా సంపాదించిన డబ్బు ఖర్చు చేయాలి, అవసరమైతే ఇంట్లో ఉన్నవి అన్నీ తాకట్టు పెట్టి మరియు పుస్తెలు కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడ కుండా ఉండాలి, దేవుడ్ని నమ్మినా నమ్మక పోయినా ప్రజలకు నమ్మకముగా పలకరిస్తూ ఎ ఎండకు ఆగోడుగులా, ప్రతి మనిషికి వెంటాడే నిడలా, ఉండేవాడే నాయకుడు, అట్టివాడే పోటి చేయాలి.


నీకు నిద్ర ఉండదు, సమయానికి తిండి ఉండదు, అవసరమైనప్పుడు మందు త్రాగాలి, మాలు చెప్పి బ్రతకాలి, వాటాలు పంచుకోవటానికి అలవాటు పడాలి, నల్ల డబ్బు, నీవు ఆడగ కుండా, నీ వెంట పడుతుందని గమనించాలి. కనీసము అధికార పార్టిగాని, ప్రతిపక్ష పార్టి గాని తోడుగా ఉండాలి. ఎ పార్టిలేక పోయిన నీ తల్లి తండ్రుల ఆస్తి గాని, తాతల ఆస్తి గాని ఉండి తీరాలి, దానిని ఖర్చు చేసే దమ్ము ఉండాలి. 


అటువంటివి నీ దగ్గర లేవు, నీవు కష్టపడ్డ అందరికి తిండి పెట్టలేక పోతున్నావు. మరి నీవు అన్నిటిని భరించి నేను పోటి చేస్తాను అంటే నాకు ఏమి అభ్యంతరం లేదు. ఇంతకన్నా నేను చేపవలసినది ఎమీలేదు, మరిచాను ముఖ్యముగా నీ భార్య అనుమతి నీ పిల్లల,  అనుమతి తీసుకొని పోటి చేయి అన్నాడు తండ్రి.


నాన్న నీమాటలు నేను అన్ని విన్నా ఈ రోజు నుండి నేను మన తోటివారికి సహాయము చేస్తూ జీవిస్తాను,ఇప్పుడు మాత్రం నేను పోటి  చేయను, నేను ఎండా కాలములో చలివెంద్రాలు ఏర్పాటు చేస్తాను, స్కూల్ పిల్లలకు పుస్తకాలు పంచుతాను,  మనకాలనీకి బస్సు సౌకర్యం కొరకు, మనవీధిలైట్లు ఏర్పాటుకు, మంచి నీరు లేని చోట త్నాక్ తెప్పించి నీరుఅందిస్తాను, ప్రతిఒక్కరితొ స్నెహ పూర్వకముగా పలకరిస్తూ వారి సమస్యలు పరిష్కారాని నా వంతు సహాయము చేస్తాను, భవిషత్తులో నాయకుడుగా ఎదగటానికి పునాది ఏర్పరుచ కుంటాను. నా కళ్ళు తెరిపించినందుకు నీకు పాదాభి వందనములు అంటూ నమస్కరించి, కొడుకు తను రోజు అమ్మే కూరకాయల  దుకాణములో కూర్చున్నాడు. వ్రేలాడుతున్న  త్రాసు వంక అదేపనిగా చూస్తున్నాడు. ధర్మాన్ని నిలబెట్టాలి అని ఆలోచిస్తున్నాడు                         --((*))--    
         
   నేటి కధ 
ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

విద్యార్దులార మనోధైర్యముతో జీవించాలి


విద్యార్ధి దశ మానసిక వత్తిడులు లేని, విద్యాభి వృద్ధి కొరకు  నిరంతరం పట్టుదలతో, మనోధైర్యంతో దేశప్రగతి కోసం మన వంతు సహాయం చేయాలని, కుటుంబ వృద్ధి కొరకు చేయూత నివ్వాలని, నిజాయితీగ ఉద్యోగము సంపాదించాలని  మనస్సుతో ఉంటుంది.   కాని కొందరు విద్యార్ధి దశలో ఆశయాలతో, ఆశలతొ చదువుతారు, కాని వారిని గుర్తించటం జరుగక మనస్సు వత్తిడికి గురికావటం జరుగుతుంది. 

విద్యార్ధులను రాజకీయ నాయకులు ప్రలోభాలకు, తాత్కాలిక అవసరాలకు పావులుగా మారి విద్యను నాశనం చేసుకుంటున్నారు. కులాల ప్రాతిపతికగా, విద్యా ప్రాతిపదితగా, ధన ప్రాతిపదికగా సంఘాలు ఏర్పాటుకు కొందరు నాయకులు సహకరిస్తిన్నారు ఆ సంఘాలలో విధ్యార్ధులు చేరి అమూల్యమైన జీవితమును నాశనం చేసుకుంటున్నారు .యూనివర్సిటీ లో కూడా కొందరి విద్యారుల కోర్కల కోసం నిరాహారదీక్షలు చేస్తున్నారు వాటిని  పరిష్కరించకుండా బహిష్కరించటం జరిగింది,  కొన్ని నిషేధాజ్ఞలు విధించటం జరిగింది . (స్నేహితులతో కలవకూడదు, హాస్టల్లో భోజనం చెయకూడదు, బయట తిరగకూడదు, ఇంకా మరికొన్ని విధించారు ఇవి ఎ చట్టంలో ఉన్నాయో ఎవరికీ తెలియదు ). ప్రభుత్వం వారు ఎటువంటి పరిష్కారం చేయకుండా ఉన్నారు, విద్యార్దులు నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించు కోలేదు, అటు వంటి పరిస్థితిలో ఒక విద్యార్ధి తనకు న్యాయం చేయమని స్థానిక మంత్రిగారికి ఉత్తరం వ్రాస్తే అది రాజకీయం చేసి యూనివర్సిటీ అధికారి వత్తిడికి కారణం గా మారినది, కోర్టుకు వెళ్లితే పరిష్కారము చేయక వాయిదామీద వాయిదా వెస్తూ కాలయాపనచేసారు. విద్యార్ధులు మనస్తాపం చెందారు, అందులో ఒక విద్యార్ధి మానసిక వత్తిడికి లోనై మరల (నా చావుకు ఎవ్వరు కారకులు కారు అని) ఒక ఉత్తరం వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు, దీనికి భాద్యులు ఎవ్వరు ?1 పరిష్కారము చూపని ప్రభుత్వమా,.2.  తీర్పు చెప్పని న్యాయస్థానమా, 3. యూనివర్సిటీ అధికారులా, 4.. లేక పెంచిన తల్లి తండ్రులా మరి ఎవరో మీరె చెప్పండి .


ఇప్పటికైన కళ్ళు తెరవండి విద్యర్దులారా, కొందరికి పావులుగా మారకండి, తల్లి తండ్రులు  చదివిస్తున్నారు వారి కల లను వమ్ము చేసి ఆత్మ హత్య చేసుకోకండి, ఎటువంటి కష్టము వచ్చిన దానికి పరిష్కారము ఉంటుంది, ఆవేసాని కి పోయి ప్రాణాలు తీసుకోకండి,   బ్రతి కుంటే బలుసాకు తిని బ్రతకవచ్చు అనే సామెత ఉండనే ఉన్నది. విద్యార్దులారా నేను చెప్పేది ఒక్కటే  విద్యవల్ల దేశ పురోగతికి, కుటుంబాన్ని ఉన్నతిస్తితిలో ఉంచుటకు పనికొస్తుంది , క్షనికావేసానికి లోనయై మరణాలు తీసుకోకండి .  
--((*))--
  

"ఈ జీవన తరంగాలలో...!!"
తండ్రి "శ్రీ రామ్ " తో కొడుకు "బ్రహ్మానందం " ....
"నాన్నా !! స్కూల్ లో బోర్డు మీద రాస్తు చెపుతున్నవి వినబడుట లేదు....
సెల్ కొని ఇవ్వు నేను రికార్డు చేసుకొని వింటాను "
"శ్రీ రామ్"..
"ఆ మాత్రం దానికి సెల్లు  ఎన్దుకూ..టీచర్నే రికార్డు చేసి ఇమ్మంటా "
భార్య "దేవి "...
"ఏమండీ !! పిల్లలతో మాట్లాడాలి సెల్ కొని ఇవ్వండి  ,
"శ్రీ రామ్ "..
"ఆ మాత్రం దానికి సెల్ ఎందుకు 1రూ . పెట్టి పబ్లిక్ ఫోన్ మాట్లాడవచ్చు కదా ...
...సరేనా!!
అత్తగారు "సూర్యా కాంతం "
"అల్లుడూ...దూరానివి వినబడుట  లేదు ....కాస్త, ఒక వినే మిషన్  కొనిపెట్టు బాబూ...నీకు పుణ్యం వుంటుంది!!"
"శ్రీ రామ్ "
"హబ్బా!! అలాగేం!!.... అందరి  మాటలు వినేటట్లు  అమిషణ్ నీకు కొని తెస్తా, కాని ఒక షరతు మీరు మాటలు మాట్లాడ కూడదు వినవచ్చు
అట్లాగైతేనే - సరే అదే చెయ్ ఇప్పుడు మాత్రం ఎవరితో మాట్లాడుతున్నాను పోట్లాడుతున్నాను తప్పా    

కాలచక్రం 20 సం.లు గిర్రున తిరిగాయి!!!!
"ఒరేయ్ !! "బ్రహ్మా నందం "......
100 రూ.ల నోటుకి...500 రూ.ల నోటుకి బొత్తిగా తేడా కనిపించడం లేదు...ఈ మధ్య!!
ఓ సారి డాక్టర్ వద్దకు వెళ్లి కళ్ల జోడు తీసుకుందామా ??
కొడుకు ""బ్రహ్మా నందం  ".....
ఇప్పుడు నీకు కనిపించక పొతే వచ్చే నష్టం ఏమీ లేదు లే...
ఆ డబ్బు ఇలా ఇయ్యి...నేను లెక్కపెట్టి ఇస్తాను....
ఆ మాత్రం దానికి కళ్ల జొడెన్దుకూ!!"

--((*))--

TS Eamcet 2016 Web Options Dates Telangana|AP,TS/Telangana  Deecet Web Counselling,Web Options,SSC,Inter Exam Time Table 2016