18, ఫిబ్రవరి 2016, గురువారం

Interent Telugu learn magazine for the month of 2/2016-8

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (8) (date 22-2-2016 to 29-2-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................

http://vocaroo.com/i/s0jYYAQ3esa9 (5. 34)

కవితను వ్రాద్దామనుకున్నాను వేంకటేశా
నా ప్రేరణ నీవేకదా, నీ రుచులు అభిరుచులు తెలుపవా
గాత్రం తో పాడుదామకున్నాను వెంకటేశా
నీ నిద్ర భంగం చేయలేను, అయిన ఏ రాగంలో పాడాలో తెలుపవా

విరహం నన్ను ఆవరిస్తున్నది వేంకటేశా  
కోరిక ఇదని చెప్పలేను, అయిన అనుభవశాలివి తెలుపవా
దాహంతో తపిస్తున్నాను వేంకటేశా
దాహం తీర్చుకోలేను, అయిన దాహం తీర్చే దారి తెలుపవా

దూరం నన్ను భయపెడుతున్నది వేంకటేశా
అది నీపై అలకని చెప్పలేను, అయిన దగ్గిర మార్గం తెలుపవా
నీ స్నేహం కోసం అర్ధిస్తున్నాను వేంకటేశా      
సరస్వం నీకే అర్పిస్తున్నాను, అయిన మనస్సుకు శాంతి తెలుపవా

ఆశలు నన్ను తరుముతున్నాయి వేంకటేశా
కావ్యాన్ని వ్రాయలనుకున్నాను,  అయిన ఎలా వ్రాయాలో తెలుపవా   
ద్యాస అంతా నీ దగ్గరే ఉంది వేంకటేశా  
ధ్యానం చేస్తున్నాను, అయిన నీపై ఏకాగ్ర దృష్టి ఎలాగో తెలుపవా 

శ్రావ్యంగా గానం చేయాలనుకున్నాను వేంకటేశా
లక్ష్యాలను అధికమిస్తున్నాను, అయిన లక్ష్యానికి దారి చూపలేవా  
దాన, ధర్మాలు చేస్తున్నాను వేంకటేశా
అనురాగభంధలో ఉన్నాను, అయిన భందాలకు విముక్తి తెలుపవా

చీకటిలో ఏమిచేయాలో తెలియకున్నాను వెంకటేశా
వెలుగు చూడలేకున్నాను అయిన నా మస్తకమునందు వెలుగు నింపలేవా
బంధానికి అతీతుడనై ఉండలేకున్నాను వేంకటేశా 
భక్తి  భావనలో ఉన్నాను,అయిన భాగ్యం కలిగించే మనస్సు అందించవా

జగత్తు కోసం ఏమిచేయాలో తెలపాలి వేంకటేశా
అభినయించ గలను, అయిన నటనా సూత్రధారివి కదా ఎలాగో తెలుపవా
భంగిమలా బ్రతకాలనుకున్నాను వెంకటేశా
నాట్యం చేయాలనుకున్నాను, అయిన వశీకరణం  ఎలాగో తెలుపవా 

ఉచ్వాస వద్దన్నా వెంబడిస్తున్నది వేంకటేశా
నిశ్వాస ఎలా చేయగలను, అయిన ప్రకృతిలో ఎలా బ్రతకాలో తెలుపవా
తనువంతా నీకే అర్పిస్తున్నాను వేంకటేశా
ప్రాణాలను నీదగ్గరే ఉంచుతున్నాను, అయిన నీలో ఇక్యమార్గం తెలుపవా   

ఓం శ్రీ రామ వేంకటేశా 
ఓం శ్రీ కృష్ణ వేంకటేశా 
ఓం కార వేంకటేశా       
నమో నమ: నమోనమ: నమోనమ: 

--((*))--

ప్రాంజలి ప్రభ - చిన్న కధ -  పుడమి తల్లి

బాబు నీవెక్కడున్నా  ఈ వృద్దురాలుగామారిన తల్లిని మరవకురా , నీ సుఖమే నేను కోరుకునేది, నా ఆరోగ్యము గురించి ఆలోచించకు, కాలే కట్టే ఎక్కడన్నా బాధ పడుతుందా, కదిలే యంత్రం ఎక్కడన్నా భాద పడుతుందా, రాలి పోయే ఆకు ఎక్కడన్నా భాదపడుతుందా, అట్లాగే నేను నీ కోసం భాదపడను,  ఎందుకంటే నీవు వర్ధమానుడవు, ప్రపంచానికి సహాయ పడాలి, నా లాంటి ఎందఱో తల్లులను తండ్రులను ఆదుకోవాలి, నేను కొడికట్టిన దీపాన్ని, గాలికి రెప రెప లాడుతున్నాను, కాస్త నూనె వేసి నన్ను రక్షించేవారు ఈ లోకంలో ఇంకా ఉన్నారు, వారికి నేను ఋణపడి ఉన్నాను, అది చాలు ఈజన్మకు నాకు .

ఎందుకురా నా మనసును వేదిస్తున్నావు, నా ఆశల పల్లకిలో, ఊహల్లా తేలి, గాలిలో ఎగిరి పక్షిలా ఎగిరి పోయావు, అవును లే రెక్కలొచ్చిన పక్షి ఎగరక ఎమిచేస్తుంది, దానిని అపాలన్న ఆగదు, ఏదో చూడాలని, ఏదో చేయాలని, తపనతో పొతున్నది, దారం తెగిన గాలిపటంలా, సముద్రంలో చిక్కిన నావలా, గాలికి ఎగిరి పోయే దూది పింజంలా, దారి తెన్నూ లేకుండా ప్రకృతిలో నన్ను వదలి నీవు వెళ్లి పోయావురా.
  
ఋతువులు మారుతున్నాయి, ప్రకృతి శాసిస్తున్నది, వసంతం  కురు స్తున్నది, అసాధ్యాన్ని సుసాద్యాన్ని చేసే శక్తి పెంచుతున్నది, కాని కాలాన్ని గుర్తించు కొనే వారె తగ్గి పోతున్నారు, క్షనికావేశాలకు లోనై ,  చిన్న మాటను పట్టుకొని ఏదో తెలిసినవాడులా, ఏంతో నష్టమైన వాడులా, ఏదో సాధించాలని వెల్లినాఉ, నేను మరచిన కలలన్ని మరలా గుర్తుకు  తెస్తున్నావు, ఎక్కడున్నావురా, ఎలావున్నావురా,

కడుపునిండా అన్నం తింటున్నావా లేదా, ఎందుకంటే ఈ తల్లి హృదయానికి  ఎప్పుడూ నీవు రామ కృష్ణుడివి రా, వెన్న ముద్దలు తినిపించాలని ఆశతో ఉండే ఈ యశోదను మరచి ఎలా జీవించ గలుగు  తున్నావురా , నా మనసు నీకు వినిపించటంలేదు రా, నీవు పాషానముగా మారలేదు కదా, లేదా ఎక్కడైనా చిక్కి చెప్పలేక నలిగి పోతున్నావా, ఈ తల్లి హృదయం భాదపడుతుందని, ఏమి చెప్పక అలాగే మొండిగా, బంగారంలా జీవిస్తున్నావని అనుకుంటున్నాను, ఎందుకంటే బంగారంలా అందరికి అందుబాటులో ఉంటావని, కోటి దీవెనలు నీకు పంపుతున్నాను, అవాస్తావాలనుండి వాస్తవంలోనికి వచ్చి  చూడు, నీ చుట్టూ ఉన్నవారు నీకు శత్రువలా లేదా మిత్రులా, అది గమనించు, ధనం కోసం వెంపర్లాడుతున్నావో, ఏమో, అది అది నిన్ను చేరినా నిన్ను స్థిమితంగా ఉండనియ్యదు, నీవు  దానికోసం వెళ్ళినా నిన్ను బ్రతకనివ్వదు, గుర్తు పెట్టుకో " ఎప్పుడూ మంట పైకి ఎగ బాకుతుంది. నీరు పల్లమునకు సాగుతుంది, గాలి సమస్తము వ్యాపించి ఉంటుంది, ఆకాశము అందుకోలేని దూరంలో ఉంటుంది, కేవలము నీకు అందుబాటులో ఉండేది ఈ అమ్మరా బాబు,

ఈ పుడమి తల్లి మరచావురా, ఈ మాతృ భూమిని మరిచావురా, ఆశలకు చిక్కి ఆశయాలు అంటూ, వయసులో చేరే భార్య కోసం, పుట్టే పిల్లలకోసం, తాపత్రయ పడుతున్నావని అనుకోవటం తప్ప, ఎమీ చేయలేని, ఏమి విన లేని, కనీసము కన్న ప్రేమకు సహాయము కూడా చేయలేని నిర్భాగ్యురాలను బాబు,  " బాబూ"  అని పిలుచుకోలేని పరిస్థితిలో ఉంచి నీవు ఎక్కడున్నావురా, నా కంట నీరు కారుతున్నదిరా, అది రక్తంగా మారకుండా నీ కోసము ఎదురు చూస్తూనే  ఉంటానురా బాబు.

నా హృదయము దడ దడ కొట్టు కుంటున్నది, దాని వేగము ఆగక జట్ విమానంలా దూసుకు పోతున్నది, నిరాకారమైన     ఆలోచనలు నన్ను గుండె వేగాముకన్న ఎక్కువై వేదిస్తున్నాయి, నా మనస్సును అల్ల కల్లోము చేస్తున్నాయి, నా ఉదరం లో ఉండే అగ్ని పర్వతము ఎప్పుడు కరుగుతుందో తెలియదు, నీ కోసం వేయికళ్ళతో వేచి ఉంటూ ఆనంద బాష్పాలతో ఈ ఉదరంలో ఉండే అగ్నిపర్వతాన్ని  చల్లర్చుకుంటూ ఉంటాను బాబు. నీ సుఖమే నేను కోరుకున్నది,. నన్ను విడిచి వెళ్ళినందుకు బాధలేదు నేను ఒక్కటే చెప్పేది "ఈ పుడమి తల్లి ఋణం తీర్చుకో " 


అమ్మా అమ్మా నేను వచ్చేసానమ్మ, నన్ను క్షమించమ్మా, నేను ఎన్నో తప్పులు చేసాను,  క్షమించమ్మ, నీ బిడ్డనమ్మా.....

ఎవరు బాబు నీవు, నాకు చూపు కానరావటము లేదు, నీ ముద్దుల రామ కృష్ణ నమ్మా,       'అవునా '  అవునమ్మా  , ఆందరూ నాబిడ్డలే

అయితే నీవు నా బిడ్డ వంటావు, నే చెప్పిన పని చేస్తావా, చేస్తానమ్మ, ఈ దేవాలయములోని కి గాలి రాకుండా కాపాలాకాయాలి, జాగర్త, గాలి జొరబడి ఆకులు రాలుస్తుంది, అసలే నా "తల్లి తండ్రులు" ఆదిగదిగో అక్కడ "పార్వతీ పరమేశ్వరులు"   ఉన్నారు, ముందు ఈ గుడి అంతా  ఊడ్చి, ముగ్గు వేసి, నా తల్లి తండ్రులకు సేవచేయాలి.

అమ్మ నేను ఊడుస్తాను, ఎవరు చేయాల్సిన పని  వారే చేయాలి, నేను చెప్పిన పని చేయు ముందు, అంటూ గుడిచుట్టూ ఊ డ్చి, కల్లాపు చల్లి,  ముగ్గు వేసి, మండపంలో కూర్చొని " ఓం శ్రీరాం, ఓం శ్రీ రాం, ఓం శ్రీ రాం" అంటూ తల్లి తండ్రుల పాదాల వద్ద నెలకు ఒరిగింది.

నాతల్లి ఋణం నేనే తీర్చుకుంటా, మీరు లైక్ చేస్తానని,  షేర్  చేస్తానని రాకండి, మీ కందరికీ ధన్యవాదములు తెలియపరుస్తున్నాను నాతల్లి ఋణం తీర్చుకొనేందుకు,  సహాయపడినందుకు

ఈ కధ వ్రాస్తున్నప్పుడు నాకళ్ళ వెంట నీరు కారింది, ఇది వాస్తవము.

తల్లి తండ్రులను క్షోబ పెట్టకండి అదే నేను కోరేది 

 
ఇట్లు మల్లాప్రగడ రామకృష్ణ 
--((*)--

 
ప్రస్థానం  (ప్రేమకు తోడు నీవేనోయి)

పున్నములు కాస్తున్నాయి..
- నళిని ఛాయలు మరుగున పడుతున్నాయి
పూలు పూస్తున్నాయి
 - మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి

మలయానిలాలు మరలి వస్తున్నాయి
 - మనో నిగ్రహ శక్తిని పెంచుతున్నాయి 
మల్లెలు సౌరభాలిస్తున్నాయి
 - మనసుల మేలికలయికకు సహకరిస్తాయి 

వసంతాలు  తరలి వచ్చాయి.
- ఉడుకు శరీరాన్ని చల్ల బరుస్తాయి 
శుక పికాలు శృతులు సవరించాయి
- సరిగమలు నేర్పుతాయి

తేటి పాటలు నదులవుతున్నాయి
-  తెనేరుచులతో ఆహ్లాదపరుస్తున్నాయి 
సెలయేటి రవళులు స్వాగతిస్తున్నాయి
-సకల ప్రాణుల దాహాన్ని తీరుస్తున్నాయి 

నీ రాక తెలుపుతూ నవ్వులొచ్చాయి
- నిఖిల జగమంతా వెళ్ళు విరిసాయి 
గుండె గుడిలోప్రేమ వెలిగింతు నోయీ.!
నాతోడు..ప్రేమ, ప్రేమకు తోడు నీవేనోయి
--((*))--

ప్రస్టానం (మనసు తెలుసు )మల్లెల యొక్క మనసు తెలుసు మగువకు
మగువ మనసు తెలుసు మకరందమునకు   
మకరందము మనసు తెలుసు తుమ్మెదకు
తుమ్మెదయొక్క మనసు తెలుసు ఆబ్రహ్మకు

ఆకాశము మనసు తెలుసు మేఘమునకు
మేఘము మనసు తెలుసు  జలమునకు
జలము మనసు తెలుసు  వాయువునకు
వాయువు మనసు తెలుసు ఆ బ్రహ్మకు

ప్రేమ మనసు తెలుసు హృదయానికి
హృదయం మనసు తెలుసు ప్రేముకునికి
ప్రేముకుని మనసు తెలుసు ప్రియురాలికి
ప్రియురాలి మనసు తెలుసు ఆ బ్రహ్మకు

పార్వతి మనసు తెలుసు శ్వేత ప్రకృతికి
పకృతి మనసు తెలుసు పరమేశ్వరునికి   
పరమేశ్వరుని మనసు తెలుసు విష్ణువికి
విష్ణువు మనసు ఎలుసు ఆ బ్రహ్మకు

భూమి మనసు తెలుసు కొమ్మలకి
కొమ్మల మనసు త్గేలుసు పువ్వులకి
పువ్వుల మనసు తెలుసు కాయలకి
కాయల మనసు తెలుసు ఆ బ్రహ్మకు

నెమలి మనసు తెలుసు చిరుజల్లుకి
చిరుజల్లు మనసు తెలుసు వసంతానికి
వసంతం మనసు తెలుసు కోయిలకి
కోయిల మనసు తెలుసు ఆ బ్రహ్మకి

వేణుగానం మనసు తెలుసు గోవులకి
గోవుల మనసు తెలుసు గోపాలునికి
గోపాలుని మనసు తెలుసు గోపికలకి
గోపికల మనసు తెలుసు ఆ బ్రహ్మకి     

 --((*))-- 

ప్రస్థానం (క్షణం) 

ఓ మనుష్యులారా కాలాన్ని
చేయకండి ఒక్క క్షణం కూడా వ్యర్ధం
ఆశల పల్లకీకి యవ్వనాన్ని
చేయకండి ఒక్కక్షణం కూడా త్యాగం
 
ప్రకృతి యవ్వన సుఖాన్ని
అర్పించకండి ఒక్కక్షణం కూడా స్వార్ధం
స్త్రీ సుఖం కోసం సర్వస్వాన్ని
ధారపోయకండి ఆక్షణం ఆదుకోదు స్నేహం      

డబ్బే తెప్పించు కోపాన్ని
డబ్బుతో స్వార్ధం పెరుగుతుంది ప్రతిక్షణం
డబ్బే తెప్పించు రోగాన్ని
డబ్బుతో తపనల అంటూ రోగంలా ప్రతిక్షణం
 
డబ్బుతో పొందలేవు  విజ్ఞానాన్ని
ఆర్పే నిగ్రహ శక్తిగా మారి ఆక్షణమే విజ్ఞానం
సత్యం, ధర్మం, న్యాయాన్ని
దేశం కోసం ఉపయోగించండి ప్రతిక్షణం
--((*))-- 

ప్రస్థానం (ఎందుకు -?)

ఆ శోకం ఎందుకు
ఆ శాకాంబరి తిన్నందుకు 
ఈ శ్లోకం ఎందుకు
ఈ శుక్లం పోయి నందుకు 

ఉస్సు అని నిట్టుర్పెందుకు
కస్సు మని నేను నిన్ను అరిచినందుకు 
బస్సు అనుట ఎందుకు
తుస్సు మని పాము పోయినందుకు

ఎర వేయుట ఇంతుకు
తర తరాలు ప్రేమతో  బ్రతికేందుకు 
ఎద పొంగు ఎందుకు
ఏలు కొను వాడు వచ్చి నందుకు 

ఓర చూపులు ఎందుకు
ఓపికతో ఉన్న వానిని వలలో వేసుకొనుటకు 
ఔనా అనుట ఎందుకు
ఔషదము రోగి వాడక మరణించి నందుకు

కల వచ్చుట ఎందుకు
కల్లోల మనస్సు ఆయి నందుకు 
వలవల విలపించుటేందుకు
వయస్సు బట్టి వడ్డాణాలు కొననందుకు

చక చక నడుచు టెందుకు
చెక్కర వ్యాది తగ్గే టందుకు 
టక టక ఘంట కేట్టే డెందుకు
తీసుకెల్లమని హెచ్చరికయినందుకు 

జడ ఉన్నది ఎందుకు
జవరాలి జాన తనం చూపెందుకు 
పక్క వేయుట ఎందుకు
పక్క పక్కన చేరి కులుకేందుకు

తల ఉన్నదేందుకు
జ్ఞానేంద్రియాలు పనిచేసేందుకు 
మనస్సు  ఉన్నదేందుకు
నమ్మిన వారిని మోసం చేసేందుకు

కవిత వ్రాయుట ఎందుకు
నగ్న సత్యాలు చూసి వ్రాసే టందుకు
దర్శిని ఎందుకు
ఉన్నవి లేనివి చూసి తల తిరిగేందుకు
--((*)--
ప్రస్థానం  (చెక్కీ) 

చెక్కీ కోసము వెక్కి వెక్కి  ఏడిస్తే
పార్కుకు తీసుకెల్లి  పక్క గా కూర్చొబెట్టి
చిక్కి పోయావు చిన్నారి కక్కి పోస్తావు
పక్కలో చేరి గుక్క తిప్పకుండా ఏడుస్తావు

చెక్కిలి నెమ్మదిగా నొక్కి
నక్కి నక్కి చూస్తుంది చూడు కుక్క
ముక్క చుట్టూ తిరుగు తుంది కక్కి
తిక్క పట్టినట్లు తిరుగు తుంది చూడు

పప్పు చెక్క కొట్టి పెట్టనా
పోక చెక్క కొట్టి ముక్కలు పెట్టన
అక్క వచ్చి జోల పాడగా అన్నం పెట్టనా
నవ్వుతూ చెక్కి కావలనిగుక్క పెట్టె

--((*))-- 

ప్రస్థానం (చాలదు) 

గాలొక్కటి చాలదు
ప్రాణులు జీవించేందుకు
జలమొక్కటి చాలదు
జలచరాలు బ్రతికేందుకు

అగ్ని ఒక్కటి చాలదు
మనుష్యుల ఆకలి తీర్చు కొనేందుకు
చినికొక్కటి చాలదు
చీకు చింత లేకుండెందుకు

మాటోక్కటి చాలదు
కాపురాలు నిలబడేందుకు
తావోక్కటి చాలదు
ధర్మాన్ని నిలబెట్టేందుకు

ఊసొక్కటి చాలదు
మనసు మనసు అర్ధం చేసుకోనెందుకు
వలపోక్కటి చాలదు
కాపురం క్రమలో పాడేందుకు

బ్రతుకొక్కటి చాలదు
గత చరిత్రలు తెలుసుకొనేందుకు
నమ్మకమొక్కటి చాలదు
గుణాన్ని అర్ధం చేసుకొనేందుకు

--((*))--

ప్రస్థానం ( సతీ - పతి)  విశ్వరూపం

స్త్రీ తత్వం లో ఉన్నది
నవరసాల వెల్లువ
నవశక్తుల వెల్లువ
నవభావాల వెల్లువ
నవ్వులతో నమ్మించే వెల్లువ

సృష్టికి ప్రతిసృష్టి కలియుగ యువతి
నవ జీవన శకానికి నాంది ప్రణతి
మమతాను రాగాలకు ప్రశాంతి
ధైర్యానికి, త్యాగానికి వైజయింతి
   
పురుషత్వం లో ఉన్నది
నవరసాల వెల్లువ
నవశక్తుల వెల్లువ
నవభావాల వెల్లువ
నవ్వులతో నమ్మించే వెల్లువ

దేవికి దైవస్వరూపుడైన భర్తగా 
పిల్లలకు ప్రేమ స్వరూపుడైన తండ్రిగా
జలకులకు పాద సేవకుడైన పుత్రుడుగా 
ప్రపంచానికి సేవా తత్పరుడైన భారతీయుడు 
 





 

ప్రస్థానం (ముక్తి )

అనకువకు ఉండు ఆశ్రయించు శక్తి
కార్య దక్షతకు ఉండు అధికారిపై భక్తి
విమర్శకులకు ఉండు ఫైళ్ళ రక్తి
కడుపునిండిన ఉండు తిండిపై విరక్తి

ఉడుకు చల్లర్చుకోనుటకు ఆలి చెంత యుక్తి
కోరిక సాఫల్యము వలన మనసుకు  ముక్తి
రాజకీయము లో నేర్చుకొనేదే కుయుక్తి
హృదయాన్ని దృడంగా ఉంచేది ధీరొక్తి        
--((*))--

ప్రస్థానం (నిన్ను చూశా),

చీకట్లో నిన్ను చూశా,
పుత్తడి బొమ్మనుకున్నా
వెలుగుల్లో నిన్ను చూశా,
నీలి మేఘం అనుకున్నా

మబ్బుల్లో నిన్ను చూశా,
మెరిసే తారవనుకున్నా
చంద్రుల్లో నిన్ను చూశా,
మచ్చలా మిగిలావనుకున్నా

కలువల్లో నిన్ను చూశా,
విచ్చుకొని ఉండలేవనుకున్నా
మంచులో నిన్ను చూశా,
మంచులా కరిగిపోతవనుకున్నా

ప్రేమలో నిన్ను ముంచేశా,
పరువాలు అందిస్తా వనుకున్నా
కలలో చూశా నీ ఆశా,
నీకు అందుకోలేని దూరంలో ఉన్నా
--((*))--

ప్రస్థానం - (చెప్పేస్తా )
 
తలపులు జీవితములో
తరుణుల వల్ల వస్తాయని చెప్పేస్తా
మలుపులు మనుష్యులో
వేదన గురిచేస్తాయని చెప్పేస్తా
 
స్థితి గతులు ప్రకృతిలో
సహజంగా మారుతాయని చెప్పేస్తా
మమకారాలు పిల్లల లో
ఎదిగిన వయసు బట్టి మారునని చెప్పేస్తా
 
అనురాగాలు పెద్దలలో
వయసు పెరిగినకొద్దీ పెరుగునని చెప్పేస్తా
కోరికల నడకల లో
ప్రేమికుల ప్రేమని బట్టి మారునని చెప్పేస్తా
 
తల్లి తండ్రుల మాటలలో
ఎటువంటి దోషము లేదని చెప్పేస్తా
భర్తే దైవమనే ఇల్లాలిలో
సాస్విత సుఖ శాంతులుంటాయని చెప్పేస్తా
 
ధైర్యంగా ఓర్పు వహించే భర్త లలో
భార్య సమస్యలను పరిష్కరిస్తూ సుఖం
శాంతి సౌభాగ్యాలను పెంచుతుందని చెప్పేస్తా 
--((*))--

ప్రస్థానం (పద కవిత )

పుడమి తల్లి కరుణ,
ప్రకృతి మాత ఆదరణ
స్వచ్చ విత్తణ వితరణ
మొక్క చెట్టుగా అవతరణ

కలిమి ఉన్న గౌరవం
బలిమి ఉన్న భయం
చెలిమి ఉన్న ప్రేమ మయం
కొలిమి ప్రక్క ఉన్న సంకటం

నీడ వెలుగును బట్టి ఉండు
కడ వరకు ఓపిక పట్టు చుండు
వడ పిండి వంటలో మెండు
జడ స్త్రీ శృంగారానికి ఉండు

పెరటి కూర బహు రుచి
అరటి ఊచ కూర ఇంకా రుచి
పక్కింటి కూర ఇంకా ఇంకా రుచి
ముక్కంటి ఆదరణ ఇంకా ఇంకా ఇంకా రుచి

మొక్క చిగురు లేత ఇగురు
ముక్క వగరు జిహ్వ జిగురు
తొక్క పొగరు కప్పే ఎగురు
ఉక్క  గనరు గాలి లంగరు

హరిత వనాన్ని పెంచు
భరత మాతను ప్రేమించు
నడత ధర్మమార్గం వహించు
వనిత ఆదరించి సుఖించు

చిత్రం భళారే విచిత్రం
ఆత్రం భళారే వినాశం
పత్రం భళారే ఆమోదం
సత్రం భళారే నివాసం

పూలుంటే  వనానికి కళ
వాలుంటే  జాలానికి కళ
గాలుంటే  ప్రాణానికి  కళ
ప్రేముంటే జీవితమే  కళ

పాప నవ్వు ఇంటికి అందం
కోప నవ్వు  ఇంటికి నష్టం
రెప్ప నవ్వు కంటికి  అందం
చిప్ప నవ్వు ముత్యంకి నష్టం

కాలుష్యానికి పెట్టాలి గొడ్డలి పెట్టు
మస్తిష్కానికి ఉంచాలి ఉడుం పట్టు
--((*))--
--((*))--
ప్రస్థానం (చిక్కి )
 
అందమనే ఉచ్చుకు చిక్కి
పున్నమి తళుకులు చిక్కి
వెన్నెల జిలుగులు చిక్కి
మలయ మారుతానికి చిక్కి

చల్లని మనసుకు చిక్కి
ఈ  దివిలో పకృతికి చిక్కి
 భువికి చేరాలని ఆశకు చిక్కి
నింగిన వున్న జాబిలమ్మకు చిక్కి

నేలపై ఉన్న స్త్రీ మనసుకు చిక్కి
స్వర్గం సుఖాలు ఏమిటో తెలుసుకో
--((*))--

ప్రస్థానం (వద్దు అంటావు )



వద్దు వద్దు అంటావు,
 వలువలు వదులు చేసి ఊరుకోవు
ముద్దు ముద్దు అంటావు,
 పెదాలపై ఇప్పుడు వద్దంటావు

మొద్దు మొద్దు అంటావు,
 ముద్దర తో గుద్దు తుంటావు
సద్దు సద్దు అంటావు,
 సద్ది చూపిన ఇంకా కావాలంటావు

హద్దు హద్దు అంటావు,
హద్దులు దాటి ఎగబడ తుంటావు
పద్దు పద్దు అంటావు,
 పద్దు చూపితే పలకలా ఉంటావు

రద్దు రద్దు అంటావు,
 రావాలి ఇంకా కావాలి అంటావు
బుద్దులు మార్చమంటావు,
బద్దుడువై ఉండాలంటావు

బద్ధకం లేదంటావు,
 పదాలతో సరిగమలు చూపమంటావు
అవునంటే కాదని, కాదంటే అవునన మంటావు
--((*))--
ప్రస్థానం (నీవు )

అర్ధానికి అర్ధం నీవు
- నా అయువికి పరమార్దానివి నీవు
ప్రయాణానికి ప్రాణం నీవు
- నా ప్రాణానికీ వాయువు నీవు

ప్రాణంలో సగమైనావు నీవు
- నా సగం కన్నా ఎక్కువే నీవు
ఆశయాల లోకం నీవు
- నా ఆశలు తీర్చె అర్దానివి నీవు

పదాల కవితావు నీవు
- నీ  పెదాల పారవశ్యం అందించావు
వనాల వైభవం నీవు
 - నీ కురుల పరిమళాలు అందించావు

కణాల కదలిక నీవు
 - నీ బుగ్గల మెరుపుతో నన్ను కదిపావు
క్షణాల సుఖానివి నీవు
 - నీ వక్షోజాల మెరుపుతో మెరిశావు

నాలో మమెక మైనావు
- నీవు సుఖంతో పరవశించావు
నాలో అనేక మైనావు
  - నీవు రుచులతో మైమరిచినావు

నాలో కదలి కైనావు
- నీవు కడలి తో కలిసి మురిసావు
నాతో కలసి ఉన్నావు
- నీవు కన్నులలో కన్నైఉన్నావు
       
--((*))--

ప్రయాణంలో పదనిసలు(జరిగిన కధ 13-02-2016)
అనుకొన్న విధముగా ఇంటికి చేరి, వెంటనే డ్రస్ మార్చుకొని, చేతి సంచి పట్టుకొని, గబా గబా నడచు కుంటూ  వీధి చివరదాకా వచ్చి, అందుబాటులో ఉన్న ఆటోను పిల్చి, రైల్వే స్టేషన్ దాకా పొమ్మని చెప్పినాను, అంతే గాలికన్న, మనసుకన్న, వేగముగా స్టేషన్ చేరాను, అప్పుడే " కాచిగూడ ఫాస్ట్ పాసింజరు " బయలు దేరుటకు సిద్ధముగా ఉన్నది అని రైల్వే వార్తవరులు తెలియపరుస్తున్నారు, మరోవైపు చూస్తే బొక్కింగ్ లో క్యూ పెద్దదిగా ఉన్నది, అక్కడనే పెట్టిన మిషన్ ద్వారా టిక్కెట్టు తీసుకొని, వేగముగా మెట్ల వంతెన ద్వారా ౩వ ప్లాట్ ఫారం  చేరాడు, రామ కృష్ణ
రైల్ బోగిలో అతికష్టం మీద సీటు దొరికింది, విపరీతమైన రష్ గా ఉన్నది, వస్తువులు పెట్టే బాల్కనీలొకూడ  ప్ర జలు కూర్చొని ఉన్నారు, ఇంత మంది జనంగా ఉన్న ఒక గృడ్డి మనిషి తప్పెట శబ్దం చేసుకుంటూ పాట  పాడుతున్నాడు (ఇది నా భావన మాత్రమే )

ఓ మనిషి తెలుసుకో జీవిత సత్యం –
 అలా అనుకరించు నిత్యం 

తరుణం రాలేదని వితరణ చెందకు
శరణు శరణు అని ప్రార్ధించుట మరువకు
కరుణ చూపుటమానకు, అతిగా నమ్మి మోసపోకు
అరుణ కిరణం లా వెలుగును పంచుట మరువకు

ఓ మనిషి తెలుసుకో జీవిత సత్యం –
 అలా అనుకరించు నిత్యం 

సహణమే ఆయుధమని మరువకు
 ఉచ్చరణ దోషం వచ్చేటట్లుగా ప్రవర్తించకు
ఉపకరణ కు మూలం విఘ్నాలని మరువకు
పురాణ ప్రవచనాలు వినుట  మానకు

ఓ మనిషి తెలుసుకో జీవిత సత్యం –
 అలా అనుకరించు నిత్యం 

బ్రమణ  జీవితమని ఎప్పుడు తలవకు
దారుణ హింసకు గురైన ధర్మాన్ని విడువకు
జీవణ గమనంలో ఆశలకు చిక్కకు
మనోధైర్యముతో అధర్మాన్ని ఎదిరించి బ్రతుకు    

ఓ మనిషి తెలుసుకో జీవిత సత్యం –
 అలా అనుకరించు నిత్యం

ఇలా పాట వినబడుతున్నది, ఉన్నవారు ఎవరికీ తోచినవిధముగా సహాయము చేసినారు, పైన కుఉర్చున్న పాప గబాలున దూకింది ( కారణం కామారెడ్డి రాబోతున్నదని దిగాలని ఆదుర్దాతో ), నేను ఊరుకోకుండా నిదానంగా దిగవచ్చు కదా అనీ అన్నాను,  నిజమే అంకుల్ అన్నది, ప్రక్కనే ఉన్న పిల్ల తల్లి, ముక్కుకు తాడేస్తే గాని దూకుడు దగ్గదు అన్నది, అప్పుడేనా అనబోయి ఊరుకున్నా, పిల్లకేమి అర్ధం కాలేదు, గల గల తోసుకుంటూ రైలు దిగింది.
యవ్వన సోయగాలు (అప్పుడే నా భావ కవితగా వ్రాసాను )


నీలి కురుల సోయగాలు, ఊహలకు తార్కాణాలు
గాలికి ఎగిరే వలువలు, మనసుకు తట్టే  ఊహాలు
కడలి అలల పొంగులు, కదలికలతో యదపొంగులు
విప్పారిన పురి కన్నులు, వర్ణించలేని శ్వేతవర్ణాలు
కురుల పూల అందాలు, పరిమలిస్తున్న జవ్వనాలు
కసి కందిన కోరిక నిట్టూర్పులు, సెలయేరు పరుగులు
ముడి వీడని పొంకాలు, కమ్మిన వేడి నిట్టుర్పు సెగలు
ఆకు చాటు పెరిగిన పిందెలు, మగువ సిగ్గు దొంతరలు    


నా ప్రక్కన ఒక మనిషి కూర్చొని ఉన్నాడు, నేను ఊరుకోక మీరు ఏమ్చేస్తారు అని అడిగాను, వారు నేను బార్బర్ నండి, ఆవృత్తే మా కుటుంబానికి ఆధారము అనిచెప్పాడు, నేను చదువు కున్నాను ఉద్యోగము రాలేదు, నా వృత్తితో నేను నాకుటుంబము ఎటువంటి భాద పడకుండా నెట్టు కోస్తున్నాను, సొంతగా  మీరా అనే పేరుతో హెయిర్ కటింగ్ షాప్ ను పెట్టాను, మాలో మాకే పోటి యున్నది, అయిన మేమందరమూ కలసి జీవిస్తాము  అన్న మాటలకు నేను కవిత వ్రాస్తే బాగుండునని భావించి ఈ కవిత వ్రాసాను.

తలవంచిన వారికి తరతమ భేదము లేకుండా
తలమీద ఉన్న శిరోజాలను పధ్ధతి ప్రకారముగా
తగ్గించిణ వారిముఖ వర్చస్సు పెంచే విధముగా
అందం వట్టి పడేవిధంగా క్రాఫ్ చేయగల వాళ్ళం

అందరి తలలను పట్టి శుభ్రం చేస్తా
నా తల పట్టే వారికోసం చిట్టా రాస్తా
శిరోజాల్లో ఉన్న కల్ముషం తొలగిస్తా
నీలి సిరోజాలు ఉచితంగా ఇచ్చేస్తా

వృత్తిని గౌరవప్రదంగా భావిస్తా
అలుపు సొలుపు లేకుండా చేస్తా
నున్చోని కేశ అలంకారాన్ని చేస్తా
నీలాదేవికి తప్పనిస్థితిలో భాద కలిగిస్తా

మీసాల ద్వారా పౌరుషాన్ని తెప్పిస్తా
గాటులు లేకుండా నున్నగా గడ్డం చేస్తా
తలపై తపల వాయించి మాడు పోటు తగ్గిస్తా
విత్తం కోసం కష్టపడి, కుటుంబాన్ని పోషిస్తా 
ఈ కవితను చదివి వినిపించాను, బావుందండి ప్రాంజలి ప్రభలో పెట్టండి మవాలు అందరూ చదువుతారు, అన్న మాటలు నాకు సంతోషము కలిగించింది. 
 
నా ప్రక్కన కూర్చున్న ఒకరు విరహ వేదన గూర్చి కవిత్వము వ్రాయమన్నారు అప్పుడే నాకు లేఖద్వారా వర్తమానం పంపాలని ఆలోచనే (భావ కవిత )
మీరాక కోసం వేచి ఉన్నది ఈ తనువు 
నన్ను మరుమతాదక మనువాదినావు
మన సెరిగి సేల్లు లో నైనా మాట్లాడవు
ఈ తనువంతా కళ్ళతో చూస్తున్నా రావు

యామినీ చూపు తో కళ్ళు ఎర్ర బడ్డాయి
కామినీ ప్రవేశించి స్తనాలు కలవరబబడ్డాయి 
 డ్దాకినీ ఢన్కారంతో గుండె ధమధమ అన్నాయి   
 నిసాచరిగా కళ్ళు రెప్పవాలకుండా ఉన్నాయి

వలపు తలపులు అందించక వెడెక్కాయి 
   కలవు పూవు వాడక ముందే వాసన చూడవాయి
మనువాడి మొదటి చూపుతొ హృదయం దొచావొయి 
తేట ఉట ఆరకముందే దాహం తీర్చుకొని పోవోయి 

తేరుకొని తలుపు తెరిచి ఉంచిన రావోయి
తరుణం మించక ముందే తపనలు తగ్గించు కోవోయి 
తరుణీ మణి చీకటిలో వెలుగుగా ఉన్నదోయి
నీకొసమ్ తపస్సు త్యాగం చేయుటకు వెనుకాడ దోయి   

విః వేదనతో చెలికి వ్రాసుకున్న భావం 
(లేఖద్వార తెలిపారు)
ఓ చెలి నిను చూస్తుంటే నాకు వచ్చు గిలి
ముద్దుమీద ముద్దుపెట్టాలని ఉంది నీచెక్కిలి
చల్లని వెన్నలతో విరాజిల్లి ఉంది నిండుజాబిలి
మల్లెల పాన్పు నీకోసం వేచి ఉంది ఓ  చెలి  
  
నిను ప్రేమించానని చుక్కలకే అక్కసు
పరిమళాలు వెదజల్లి పువ్వుల వత్తాసు
గగన జఘనాలు నీకోసం పంచె వర్ఛస్సు
నా ప్రేమను పొందితే నీకు పెరుగు వచస్సు 
   
నా పరిస్తితి ఊబిలొ చిక్కిన దీపపు సెమ్మే లా
వెలుగుని పంచలేని మిణుగురు పురుగులా 
మండు  టెండలో చల్ల పర్చలేని మంచులా
సముద్రతీరమ్ కోసం వెతుకుతున్న నావలా 

 ఆకాశంలో మెరిసేతారాలను లేక్కపెట్ట లేకపోవచ్చు
 గాలితోవచ్చే మంచుతుప్పరలను లెక్క పెట్టలేకపోవచ్చు
భూమి మీద ధూళి కణాలను లెక్క పెట్టలేకపోవచ్చు 
నీ ప్రేమను గుర్తించి వందలేక్కిన్చేలోపు వచ్చి ముద్దుచెల్లిస్తా 



అప్పుడే టికెటు కలెక్టర్ వచ్చాడు, అందరి వద్ద టికెట్టు చూసి పెన్నుతో టిక్ చెస్తూ ముందుకు వెళ్ళాడు, అప్పుడు నలుగురుకి  టిక్కేట్టులేనట్లుగామనించి వారిని ప్రక్కన ఉండమని బోగి అంతా చెక్ చేసిన తర్వాత వారిని ఫైన్  కట్టమని వత్తిడి చేసాడు, నా దగ్గర అంత డబ్బులేదు అనేవారు, నా టికెట్టుకోట్టేసారని అనేవారు, కొందరు విద్యార్ధులు వితండ వాదములు చేసారు, మొత్తం మీద, డబ్బు కట్టుకొని రసీదు ఇవ్వటం జరిగింది. అప్పుడే నా ఊ హల్లో మెదిలిన టికెట్టు కవితను ఇందు పొందు పరిచాను

టీ కొట్టి,  క్యూలో ఉండి సాధించు రైల్వే టికెట్టు
టిక్కెట్టు కొనకపోతే తప్పక  వచ్చును ఇక్కట్టు
కట్టు బొట్టుతో స్త్రీలు వరుసలొఉన్ది కొంటారుటిక్కేట్టు 
టిక్కెట్టు కొనకపోతే గుట్టు రట్టు కలుగు ఎబ్బెట్టు 

టిక్కెట్టు కోసం ఎప్పుడు పట్టకుసిగ పట్టు
టిక్కెట్టు పోయి ఒక్కోసారి ఇరుకున పెట్టు
 టిక్కెట్టు భవిషత్ ను మార్చి పెట్టు
శ్రీకృష్ణ జన్మస్థానం లో ఊచలులెక్క పెట్టు

టిక్కెట్టు కొని ప్రయాణం చేయటం ధర్మం అన్నట్టు 
టిక్కెట్టు పుట్టుకతో అందరికి ఖర్చు తెచ్చి  పెట్టు
టికెట్టు యమధర్మరాజు ఆయువు పట్టు 
టిక్కెట్టు మరణానికి మాత్రం పనికి రాదు  
 ప్రాంజలి ప్రభ ఆదరిస్తున్న వారికి ఈ క్రింది కవియా వ్రాసి నా ప్రయాణాన్ని ముగిస్తున్నాను ఎందుకంటే హైదరాబాద్ వచ్చేసింది కదా, పతిఒక్కరికి పేరు పేరు న ధన్యవాదములు ఎలియపరుస్తున్నాను 

భారతంలో శల్యుడిలా ప్రవర్తించకు
జీవితంలో శల్య పరీక్షకు బలిగాకు
భారతంలో బృహన్నల లాగా నాట్యమాడకు
అటూ ఇటూకాని వానిలా నటించి ఇరుక్కోకు 

విశ్వామిత్రలా పౌరుషంతో ప్రవర్తించకు 
గుణాల కతీతంగా చిక్కి భగ్నం కాకు
జీతంలో స్వర్గం చూడాలని అనుకోకు
ఉన్న దానిని వదులుకొని వేదన పడకు 

ఇంద్రియాలను జయించాలని ప్రయత్నించకు
క్రోదానికి చిక్కి కాలాన్ని వ్యర్ధం చేయకు
సవ్య సాచిలా ప్రవర్తించాలని అనుకోకు 
2నాలుకల పాముకి చిక్కి పతనం కాకు 

కళ్ళున్న లేని వాడిలా నటించకు 
కళ్ళల్లో కారం కొట్టే బ్రతుకు నేర్చుకోకు 
మనసును బట్టి ప్రవర్తించటం నేర్చుకో 
ఆరోపణలలో శాంతి అశాంతి ఏదో తెలుసుకో  
   సర్వేజనా సుఖినోభవంతు 
                          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి