30, ఏప్రిల్ 2016, శనివారం

Internet Telugu magazine for the month of 5/2016-17


ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు 
image not displayed


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (17) (date 1-05-2016 to 07-05-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................


1. ప్రమితి (లొంగి పోయే ప్రేమ) 

కన్న తల్లి ఉగ్గు పాలతో
రంగరించి పంచుతుంది ప్రేమ
ఎన్నెన్నో మాటలతో పాటలతో
జోలపాడి నిద్రపుచ్చేది ప్రేమ

ఉన్నత స్వేస్చా భావాలతో
ధర్మ మార్గాన నడిపించేది ప్రేమ
చన్ను పాలు లేక ఆవు పాలతో
బిడ్డ ఆకలి తీర్చేది ప్రేమ

కన్నులో కారం పడిన భాదతో
ఉన్నా బిడ్డ రోదన తగ్గించేది ప్రేమ
తన్నులు కనిపించక మూలుగుతో
తనయుని తపనను తగ్గించేదే ప్రేమ

పన్ను పోటు తెప్పించే మాటలతో
సతాయించే వారున్న బిడ్డపై ఉండు ప్రేమ
అన్నల, అత్తల,  అక్కలు పలుకలతో
కన్న బిడ్డపై తరుణికి పెరిగేది ప్రేమ

అందుకే బంధం  తెగనిది      
సుఖమున్నా భాద్యతలు తరగనివి
పెగుభంధం కష్టాలు ఒర్చుకోమంటుంది
కాల చక్రానికి లొంగిపోతున్నది ప్రేమ 
--((*))--

2. ప్రమితి  (మూగజీవి ఆలాపన )

నామీద  ప్రేమ ఎంతో చూపినావు -
నేనొక మూగ జంతువునై ఉన్నాను కదా
నన్ను మృదువుగా నిమిరావు
నీలో నా తల్లిని ఈరోజు చూసాను కదా

పుట్టిన నాటినుండి పెంచినావు
ఏంతో విశ్వాసము ఉంచినావు కదా
పురిటి మకిలినంతా పూర్తిగా తుడిచావు
నా తల్లి కంటే ఎక్కువ శ్రమపడ్డావు కదా

నన్ను దగ్గర తీసుకొని ముద్దాడినావు
తడబడే అడుగులను సరిచేసి పరుగెత్తావుకదా
పౌష్టి కరమైన ఆహారమును పెట్టావు
అజీర్తి రోగం వచ్చిన మందు ఇచ్చావు కదా

కన్న బిడ్డలా ప్రేమ చూపి పెంచావు
నమ్మకం కల్పించి బ్రతుకును మార్చావుకదా 
మానవుడిగా ఉండి నన్ను పెంచావు
ఈ రోజు నేను నీలో దానవుడ్ని చూసాను కదా

నా విశ్వాసాన్ని నీవు కొల్లగొట్టావు
దయాదాక్షిణ్యం లేకుండా కత్తితో నరికవు కదా
పెంచిన ప్రేమ లేక క్రూరుడిగా మారావు
ఒక్క రోజు తిండికోసం నన్ను బలిచేసావుకదా

ఇన్నాల్లు చూపిన ప్రేమ నాటకంగా మార్చావు
నాపై కూర్మిచూపి ఒక్కరోజుకూరగా మార్చావుకదా
దేవుడా బ్రతికే హక్కు మాకు ఎందుకు లేదందువు
మౌనం వహించావా దేవా మా బాధ గమనించావా

--((*))--


3. ప్రమితి (పకృతి విలయతాండవం)

పకృతి అందం వికృతి రూపం దాల్చింది
భగ భగ మండే సెగలు కమ్ముకుంటున్నాయి 
తరువులు తపన చెంది ఎండుట జరిగింది
సకల ప్రాణులకు భయాలు కమ్ముకుంటున్నాయి

పుడమి తల్లి పురిటిలో భగ్గు మంటున్నది
నీరు ఆవిరిగా మారి సెగలు కమ్ముకుంటున్నాయి     
ప్రజా గుండె ఘోష చెప్పలేక బాధ పడింది
ధరణి భారం పెరిగి తుఫాన్లు కమ్ముకుంటున్నాయి

మమకారం కనుమరుగై వికటాట్ట హసమైనది 
అందరికి భరించరాని కష్టాలు కమ్ముకుంటున్నాయి
వనాలు నీరులేక వడలి పోవటం జరుగుతున్నది
అనురాగం అసలులేక చీకట్లు కమ్ముకుంటున్నాయి

ప్రపంచమంతా కలుషితముతో నిండి పోయింది
పచ్చదనం లేక వెచ్చదనం కమ్ముకుంటున్నాయి
భోగాలకోసం, చల్లదనం కోసం, పోవటమవుతుంది
విద్యుత్ పరికరాలు ఎన్ని ఉన్న వేడి కమ్ముకుంటుంది

--((*))--

4. ప్రమితి (భార్య అలాపన) 

తెరలు చాటు వెలుతురు నాది
కనురెప్పల కదలిక సంబాషణ నాది
వలలో చిక్కిన పావురం మనసునాది
మొండి భర్తకు స్వేస్చ లేని భార్యనై నందుకా

హద్దులు దాటవద్దని నిఖా పెట్టె
ముఖ కవలికలు చూపవద్దని షరతు పెట్టె   
మౌన సంభాషణలే అని నోటికి తాళం పెట్టె
మొండి భర్తకు స్వేస్చ లేని భార్యనై నందుకా

ప్రక్కన చేరి పలకరింపు చూపు చూసిన తప్పే
అనేకత్వంలో పోక ఎకత్వములో  ఉన్నా తప్పే
ఓం శ్రీ రామ్, ఓం శ్రీ రామ్ అనుట కూడా తప్పే
ఎవరిని పిలుస్తున్నావని చీదరించె భర్త భార్తేనా    

పత్రిక చదివితే పరుష వాక్యాలు నేర్చు ఉంటావ్ 
టి .వి.అందని వన్నె తెచ్చేవి కావలిని కోరుకుంటావ్
సినమా చూస్తె నామేదే తిరగబడి యుద్ధం చేస్తావ్
నిబంధణలు పెట్టె భర్తకు భార్యగా ఉండుత సమంజసమా

ఆణువణువూ అనుమానంతో వేదిస్తావ్
మంచిగా మాట్లాడిన తప్పు  పడతావ్     
సాంప్రదాయానికి బద్ధులై ఉండాలంటావ్
గౌరవించలేని భర్తతో ఉండుట నిజమేనా
 
మంగళ సూత్రమ్ విలువ తెలియని వాడిటో
మృగానికి మనిషికి తేడా తెలియని వాడితో  
నడమంత్రపు సిరికోసం భార్యనే పొమ్మనేవాడితో
అది కాపురమా, దిక్కులేనివాడికి దేముడే దిక్కి
వస్తా వెళ్ళొస్తా ఇకరాను, నీవు కుక్కల చింపిన
బతుకుతావ్ , నీఖర్మా ఇక వస్తా, వెళ్లి రాను     
--((*))-- 

 
 
5. ఫోటో బట్టి వానరుల ముద్దుల పై నా కవిత

సభ్యత లేని సమాజంలో ఒక అసభ్యమా
కళ్ళువళ్ళు కంపించి నాట్యమాడడటం కన్నానా
సమయ సందర్బాలలో ఒక అసౌఖ్యమా
వళ్ళు వనికిన్చేవిదంగాఉండే శృంగారం కన్నానా

దిగజారి పోతున్నా ఒక సాంప్రదాయమా
బహిరంగ ప్రదేశాల్లో సిగ్గులేని ముద్దులు కన్నానా
మనుష్యులలో జంతువుల ప్రయత్నమా
సిరి కోసం సీఘ్రంగా శరీరం పంచె  అద్దేకన్నానా

అడవులు నరకటం వళ్ళ దాహానికి వస్తున్నామా
మానవుల బహిరంగ బుద్దులు కమ్ముకుంటున్నాయా
ఏది ఏమైనా మనుష్యుల వ్యసనాలు మనకోస్తున్నాయా
మనజాతి వీరుని ఆరాధించి విధముగా ఉండాలి కదా
 --((*))--

6. పస్థానం (మాట్లాడు )

వేదాలు ఉపయోగాన్ని బట్టి
గ్రంధాలు చదవ టాన్ని బట్టి
పదాలు వ్రాయ టాన్ని  బట్టి
మాటలు పొందికగా మాట్లాడు

కళల సౌరభాన్ని బట్టి
కలల సారాంశాన్ని బట్టి
తలల తారతమ్యాన్ని బట్టి
తరతమ బేధం చూసి మాట్లాడు  

వ్యాధులు వివరాన్ని బట్టి
స్వామీల విశేషాన్ని బట్టి
హమీల తలపుల్ని బట్టి
మనసు నొప్పించక మాట్లాడు

కార్యాల అవసరాన్ని బట్టి
చర్యల చేష్టల ను బట్టి
సిరుల వినయాన్ని బట్టి
సరిగమ అర్ధంతో మాట్లాడు

స్త్రీ పురుషుల వాక్కు బట్టి
పురుష, స్రీల వాక్కు బట్టి         
సమయాసమయాలను బట్టి
సమస్యలు రాని మాటమాట్లాడు

ప్రక్రుతి వికృతి గమనాన్ని బట్టి
అకృతి అణాకృతి ఆహ్లాదాన్ని బట్టి
స్వీకృతి పరాకృతి భావాల్ని బట్టి
మనస్సు అమస్సు కాకుండా మాట్లాడు
--((*))--

7. ప్రమితి  (ఆంక్షలు )

మలుపు లుంటే తలపు లుండవు
తలపు లుంటే అలక లుండవు
అలక లుంటే  తగువు లుండవు
తగువు లుంటే కత మలుపే ఉండు

కోర్కలు ఉంటే ఆశయాలు ఉండవు
ఆశయాలు ఉంటే పశ్నలు ఉండవు
ప్రశ్నలు ఉంటే జవాబులే ఉండవు
జవాబులే ఉంటే కత ఆశలే ఉండు

నడక లుంటే నవ్వు లుండవు
నవ్వులు ఉంటే కారణా లుండవు
కారణాలు ఉంటే ఇష్టా  లుండవు
ఇష్టాలు ఉంటే  కత నడకే ఉండు

ఎల్లలు ఉంటే  ద్వారాలు ఉండవు            
ద్వారాలు ఉంటే భయాలు ఉండవు
భయాలు ఉంటే భావాలు ఉండవు
భావాలు ఉంటే కధకు ఆంక్ష ఉండు

--((*))--

8. కంద  గుళిక

ఒక్క  నిముషం ఆలస్యం
ఎక్కాలనుకున్న విమానం ఉండదు
ముక్క సుబ్రత నిర్లక్షం
ఎక్కసం వచ్చి కక్కు రాక మానదు

వక్క పలుకు లక్ష్యం
తోక్కు తిన్నది అరుగుటే ముఖ్యం
అక్క పలుకు ధ్యేయం
చక్కని సంసారం ఇంటికి మణిదీపం

ఎక్కాలను కున్న ఎక్క లేవు
అక్కరకు రాని చట్టం అడ్డు పడితే
కక్కాలను కున్నా కక్కవు
చక్కని మాటకు మనసు చల్ల బడితే

చెక్కిన శిల్పాలు ఎన్ని ఉన్నా     
చక్కని రూపంతో ఆకర్షించుట మిన్నా
నొక్కులు పుత్తడికి ఎన్ని ఉన్నా
చుక్కలాంటి అందాన్ని పెంచుటే మిన్నా    

వక్కాణించి చెపుతున్నా
నక్క బుద్ధులు కట్టి బెట్టి మాట్లాడు
ఒక్క మాట చెపుతున్నా
చుక్క మాని సుఖపెట్టి సుఖపడు

 --((*))--

     9. ప్రమితి (ఎన్నాళ్ళు) 

కన్నిటికి వీడ్కోలు లేదా
విరహంతో ఉండాలి ఎన్నాళ్ళు
కోర్క తీర దారి లేదా
కలలో స్వరాలు ఇంకా ఎన్నాళ్ళు

కాగడా వెలుగు సరిపోలేదా
పరువాల వాసనలు ఇంకా ఎన్నాళ్ళు  
హరివిల్లు రంగులు చూడలేదా
ముద్దుల మురిపాలు ఇంకా ఎన్నాళ్ళు

కంటి పాప అలుక చూడలేదా
నవ్వుల ముచ్చట్లు ఇంకా ఎన్నాళ్ళు
తాపానికి తగు ఒదార్పు లేదా   
ఓర్పుతో ప్రార్ధనలు ఇంకా ఎన్నాళ్ళు

మాధవా రాధ ప్రార్ధణ వినలేదా
ఉడికించి వేడుక చూచుట ఇంకా ఎన్నాళ్ళు
రాధగానామృతానికి విందు లేదా
ఉంది ఓర్పుతో మాధవునిపే ప్రేమ ఉన్ననాళ్ళు

--((*))--


*10. ప్రమితి  (పువ్వులు )

పువ్వుకు మాలి అవసరం
పువ్వులు దేవుని పాదాలు చేరుట వరం
పువ్వులు సిగలో చేరి నలుగుట మరోవరం
పువ్వులు మకరందాన్ని పంచుటే దేవుని వరం

పువ్వుల సుఘందాన్ని గ్రోలే మాలి
పువ్వులను డేగ కళ్ళతో చేసే మాలి
పువ్వును పరీక్షకు పంపే మరో మాలి
పువ్వును నలిపి అగ్నికి ఆహుతి చేసే మాలి

పువ్వులు మృగ తృష్ణ కు బలి
పువ్వులు శీల పరీక్షకు నలిగి 
పువ్వులు సుఖభరితాలకు నాంది 
పువ్వులు తుమ్మెదలకు సిరి

పువ్వులకు స్వతంత్రం చాలు
పువ్వులు గాలికి  బానిసలు
పువ్వులు అన్ని దశలు సుఘందాలు 
పువ్వులకు ఉంటాయి మౌన రోదనలు

పువ్వులను రక్షించే తోటమాలి కోసం
పువ్వులు ఆశలకు నలగ కుండుట కోసం 
పువ్వులు నిత్యం నవ్వినవ్వించటం  కోసం
పువ్వులు సుఖపడి సుఖపెట్టడం కోసమే కదా 
  --((*))--

11. ప్రమితి (ఎలా చెపుతాం) 

చిరునవ్వు అందం ఇంతని ఎలా చెపుతాం
నవ్వు అందుకే అది మనస్సు ఉల్లాసపరిచే ఆయుధం
నవ్వితే నవరత్నాలు రాలునని ఎలచెపుతాం
నవ్వుల్లో అందుకే  కనిపించు నవ్య భావాల వసంతం

నవ్వలేనిది జంతువు మాత్రమని ఎలా చెపుతాం
నవ్వు కళ్ళతో గుండె హత్తు కొనే జంతు ముఖారవిందం
నవ్వులు మనస్సుకే వెలుగులని ఎలా చెపుతాం
హితకరమైన గుండెకు పెదవుల నవ్వే హాస్య భరితం

లేత చిరునవ్వు జీవకళ అని ఎలా ఎలా చెపుతాం
ముగ్దమొహనరూప మోనాలిసా నవ్వుచూపె చిత్రసౌరాభం
ప్రేమాతో ద:ఖాన్ని పోగొట్టేవినవ్వులే అని ఎలాచెపుతాం
పువ్వులవలె ప్రేమ రసమాధుర్యం చూపెది స్త్రీ హృదయం

నవ్వు కళ్ళ కదలికల్లో కనిపిస్తుందని ఎలా చెపుతాం
ఆరోగ్యకరమైన చూపు ఆహ్లాదాన్ని పంచుతుందని ఆంతర్యం
నవ్వితే మానసిక రుగ్మతులు పోతాయని ఎలా చెపుతాం
మనస్సంతా దర హాసంతో ఉండి మందు ఇస్తే అదే అమృతం

చిరునవ్వు చిద్విలాసం మంత్రం అని ఎలా చెపుతాం
నిస్సహాయతలో ఆనదాన్నిపంచే నవ్వే దేవుడిచ్చిన వరం
మనిషికి నవ్వు నాలువిదాల చేటు అని ఎలా చెపుతాం      
మాటకన్నా మందహాసంతో నవ్విస్తే తొలగు హృదయతాపం

--((*))--