6, మే 2016, శుక్రవారం

Internet Telugu Magazine for the month of 5/2016-18


ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు 
2 hearts ❤:


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (18) (date 8-05-2016 to 14-05-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................


మాతృదినోత్సవం 
http://vocaroo.com/i/s0VXKPji03eg
*అమ్మా అమ్మా .....

ఎన్ని తప్పులు  చేసినా...  
కరునించే  కల్పవల్లివమ్మా ...
రాతిగుండెను, నవ నీతముగా... 
మార్చావు కదమ్మా.....  
కర్కశ హ్రుదయాన్నీ, కమ్మని
మాటలతో...  మరిపించావు కదమ్మా ..
అనుక్షణము ఆత్మీయతను చూపి
ఆరాధనా మూర్తి వైనావమ్మా ....  
అమ్మ  అమ్మా, అమ్మ  అమ్మా

దేవుడు ఎమీ ఇవ్వందే
కని కరించడమ్మా...........
కాని ఏమీ ఇవ్వ కుండానే
తనకు తానుగా  జీవితాన్ని
ఫనంగాపెట్టి  కావలసిన వన్నీ ...
సమ కూర్చే..ది  అమ్మా, అమ్మా... 
నాన్నని వప్పింఛి, నన్ను మన్నింపమని
చెప్పేది అమ్మా , అమ్మా..

నిస్సత్తువగా ఉన్నా, బిడ్డ మాట విన్నా
ఓర్పుతో, వోదా ర్చేది అమ్మా ...
అమ్మా .   అమ్మా ...  అమ్మా ...
 
అమ్మే అవనికి ఆధారము
అమ్మే నా జీవితానికి మూలం
అమ్మే నా స్వాసా, అమ్మే నా జ్యాసా
అమ్మే నా ప్రాణం, అమ్మే నా హృదయం
అమ్మ   అమ్మా ... అమ్మ  అమ్మా ...
.. 
ఎన్ని తప్పులు చేసినా 
కరునించే  కల్పవల్లివమ్మా ...
కరునించే  కల్పవల్లివమ్మా ...
అమ్మా అమ్మా ... అమ్మా అమ్మా
--((*))---
* (మాతృశ్రీ)
 
అమ్మ అమృత పలుకు
మది ఉల్లాస పరచు
చల్లని సేద తీర్చు
అమ్మ ఓర్పే మాకు శ్రీ రామ రక్ష

మా అమ్మ ఆశీర్వాదం
మాకు శిరోదార్యం 
మా అమ్మ ప్రేమ
మాకు దైవ పుష్పం

అమ్మ పలుకు మంత్రం 
అమ్మ పలుకు ఆనందం
అమ్మపలుకు ఆరాధన
అమ్మ పలుకు ఆత్మీయత

మమకారం పంచేది అమ్మ
ఆష్టకష్టాలు తీర్చేది  అమ్మ
ఐస్వర్యాన్ని పెంచేది అమ్మ
ఓర్పుతో అన్నం పెట్టేది అమ్మ  

మాబాల్యంలో భాధబరించింది అమ్మ
విద్యా బుద్దులు నేర్పించింది అమ్మ 

అణకువ బ్రతుకు అందించింది అమ్మ 
అన్నీ దశలలో మమ్ము ఆదుకున్నది అమ్మ 

వేకువనే లేచి మమ్ము లేపి చదివించేది అమ్మ 

భారత,రామాయణ కధలు బోధించింది అమ్మ 
జ్ఞాన-విజ్ఞాన తత్వాలు విశదీకరించింది అమ్మ 
మా మదిలోని మకిలాన్ని తొలగించింది అమ్మ

నాశ్వాస, నాద్యాసా నీకోసమేనమ్మ 
నీ ఋణం తీర్చుకొనే శక్తి చాలదమ్మా 
        అమ్మలుగన్న మూలపుటమ్మవు నీవేనమ్మా
--((*))--

*చెప్పాలని ఉంది
అసలు కధ ముడి విప్పాలని ఉంది

సాధు జంతువుకు కడుపు నిండా
తిండి పెట్టి కబెలాకు అమ్మే మూర్ఖులు మారేదేపుడు
స్వేస్చా జీవులుగా బతికే పక్షులును
వేటాడి చంపే మూర్ఖ ప్రాణులు మారేదెప్పుడు

వనములన్నీ నరికి వన్య ప్రాణులను
వీధి వీధి పాలు చేసిన మూర్ఖులు మారేదెప్పుడు
చేతిని అడ్డుపెట్టి ఆపలేరు కిరణాలను
అధర్మ పరులు, మూర్కులు మారేదెప్పుడు

మాయ చేసి మహిలో ఆపలేరు మరణాలను
హింసించేవారు,మూర్కులు మారేదెప్పుడు
భూమి, గాలి,. నీరుకు ఆంక్షలు పెరిగినను
వెతలు చెందే కర్షక జీవితాలు మారేదెప్పుడు

దేహమున్నా ప్రాణములేని జీవిగా మారుతున్నను
ప్రాణాలు పోసే వైద్యుడు కాంక్ష మారేదెప్పుడు
స్వియరక్షనకోసం రక్షకులను ఆశ్రయించినను
భక్షకులుగా మారి సర్వం దోచుకోనేది మారేదెప్పుడు
  --((*))--

*చెప్పాలని  ఉంది 
అసలు  ముడి   విప్పాలని ఉంది

ధనమున్నవారు ఎన్ని లోన్లు అయినా తీసుకొవచ్చు
ఎగగొట్టి పారిపొతే పట్టించుకొనే వారు ఏరి
బీదవాడు పొలం కోసం లోను తీసుకుంటే ఒక్క నెల
కట్టకపోతే తిన్నాడా తినలేదా పట్టించుకొనే వారు ఏరి

నాయకులు ఎంత జీతమైన తీసుకోవచ్చు
టాక్సు కట్టమని పట్టించుకొనే వారు ఏరి
మధ్యతరగతి వాణికి జీతము ఇవ్వకపోయినా
కోర్టుకు పోయినా పట్టించుకొనే వారు ఏరి

విద్య కొనుక్కొనే పరిస్తితి కళ్ళ వెంబడ కనబడుతున్న   
తగు చర్య తీసుకొని పట్టించు కొనే వారు ఏరి
ఉపాద్యాయులు లేకున్నా, భోజనము పెడుతున్నా
తల్లి తండ్రులు పిల్లను చేర్చకపోతే  పట్టించు కొనే వారు ఏరి

చెప్పెనదేమిటి చేసినదేమిటి, ప్రత్యేక హోదా గురించి 
లేదన్న అడిగేవారేరి, పట్టించుకొనేవారేరి
సరియైన విధానాలు లేకుండా ముక్కలు చేయవచ్చు 
న్యాయం కోసం కోసం పోరాడిన పట్టించు కొనే వారు ఏరి
--((*))-- 

*చెప్పాలని ఉంది 
శ్రామికుడి కధ ముడి విప్పాలని ఉంది

మేలుకొని ఐక్యతోతో ముందడుగు వేస్తే  
స్వార్ధపూరిత రాజకీయాలు వెనకడుగు వేయు
కార్మికుడి చెమట బిందువు పృద్విపై రాలితే
శ్రమను దోచుకొనే వారు వెనకడుగు వేయు   

కార్మికుడి స్వేదంతో వృద్ధి చెందిన సంపద
కార్పోరేట్ల ఖజానా నింపును శ్రమకు ఫలితంలేదు  
సర మిస్తున్నవారికి  కనీస  సౌకర్యం  కరువైనది
బలిసిన వారి ఆస్తులను పెంచు వ్యవస్థ మారేదెప్పుడు  

అందుకే మేలుకొని ఆలోచించు శ్రామిక
కొందరిస్వార్ధంకోసం సాగుతున్న విధానాలు ప్రశ్ని0చు
ధనికులకు ఒకరకం, పేదలకు మరోరకం
వైరుద్యం ఎందుకు, విధాన లోపాన్ని సరిచేయమని ప్రశ్ని0చు

అత్య‌ధికులైన బీదవారికి  ఎందుకీ శాపం
కార్మికులు క‌ష్ట‌ప‌డ్డా ద‌క్క‌ని ప్ర‌తిఫ‌లం
ధర్మం కోసం నువ్వు క‌దిల‌డ‌మే బ‌లం
అందరుకలిసి ప్రశ్నిస్తే అప్పుడే ద‌క్కును ఫ‌లం
--((*))--

*చెప్పాలని ఉంది
అన్యాయం కధ ముడి విప్పాలని ఉంది

నిజాలు చెప్పిన పాటించే వారెవరు
అధర్మం తాండవిస్తున్నా అడిగే వారు లేరు
చదువుతో ప్రేమపాఠాలు చెపుతున్నారు
అగ్నిలో ఆజ్యం పోసినట్లు విద్యమార్చే వారెవరు

వాన చినుకు కోసం ప్రార్ధించే వేరెందరో
చినుకును సద్వినియోగం చేసే వారెందరో
కాలుష్యం ఉన్న పట్టించుకోని వారెందరో
నాదేశం అనుకోక కాలుష్యం చూసి నీల్గుతారెందరో 

వివాహ వేడుక ఖర్చు ఎందుకు చేస్తారో
ప్రభుత్వం వారు ఎందుకు సహకరిస్తున్నారో
వ్యర్దపరిచిన ధనం తిరిగి రాదనీ తెలుసుకోరు
కడుబీదవానికి సహాయం చేయాలని అనుకొనేవారెవరో 

ఇక్కడ చదివి అక్కడ కొలువు చేసే వారెందరో
మాతృభూమి ఋణం తీర్చుకోవాలని అనుకోనేవారెందరో
ప్రాణాల్ని తీస్తున్న వేగాన్ని నిరోధించాలని అనేవారెవరో
ధనం ఉన్నా పోయిన ప్రాణం రాదు, ప్రాణాన్ని కాపాడేవారెవరో

--((*))--
      
*చెప్పాలని ఉంది 
కధ ముడి విప్పాలని ఉంది

భగ భగ లాడే ఎండలో
చెట్టు క్రింద చేరితే వెంబడించింది వడగాలి
ఓపికతో నడిచాను వడగాలిలో
ఏ ఇంటి తలుపు తట్టిన వచ్చే చీదరించే గాలి



వెల్లి అక్కడ ఉన్న కిల్లి కొట్టు దగ్గరలో
అర్ధించా గుక్కెడు మజ్జిగను  చూపారు కొంతజాలి
పైకము లేందే సాగదు  ఈ లోకంలో
పైన తపన లోన వేదన తప్పదా ఈ బీద బలి

చేరా ఓ ఇంటి కిటికీ దగ్గరలో
విన్నా అమ్మా మామిడి పళ్ళ రసం త్రాగాలి
అమ్మా బాదం పాలుతో జ్యుసు వేసి త్రాగాలి
అమ్మా తాటి ముంజలు తిని రసం త్రాగాలి
తలుపు తట్టి గుక్కెడు మంచినీరు కావాలన్నా
ముంజ చేతిలో పెట్టి మంచి నీరు అడక్కు అని తెలుపేసి

బీదవారంటే అందరికి లోకువే
అంటూ ప్రభుత్వకుళాయి వద్ద చేరా
నీరు రాక శబ్దాలతో బొట్టు బొట్టు రాలే
నోరు తెరిచినా ఆబొట్టును గాలి తరిమే

మంచి నీరు దొరకని లోకంలో బ్రతకాలా
అంటూ కళ్ళు తిరిగి పడిపోయా
అప్పుడే రిక్షాలో పోతున్నా పాప తాతా
మంచి నీరు త్రాగు అంటూ తను తెచ్చినవి పట్టింది

అప్పుడనుకున్నా
ఆదుకునే వారున్నారని ఈలోకంలో
--((*)0--

*కధ చెప్పాలని ఉంది
పుస్తక కధ ముడి విప్పాలని ఉంది

పుస్తకం హస్త భూషణం అన్నారు
కాస్త ఓపిక చేసి చదివేవారు లేరు
దస్తాల పాపర్లు చదివేవారు తగ్గారు
పుస్తకం ఇస్తానన్నా ఎందుకో చూడరు 

గొరుచుట్టు మీద రోకటి పోటులా
కంప్యూటర్సు వచ్చాయి 
పుస్తకషాపులు మూతబడి,
సెల్ ఫోన్ షాప్లు పెరిగాయి
ప్రపంచ విజ్ఞానాన్ని సెల్ ఫోన్సు
 అరచేతిలో చూపిస్తున్నాయి
మస్తకంలో నిలిచే చదువు తగ్గి
కళ్ళభాదను పెంచేస్తున్నాయి

అందుకే మంచి పుస్తకం రోజూ చదవండి
గ్రంధాలలోని జ్ఞానాన్ని చదవమని చెప్పండి  
ద్వందార్ధాల  అర్ధనగ్న చిత్రాలు చూడ కండి
జ్ఞానాన్ని పెంచే శ్రీ మత్ భగవత్ గీత చదవండి 

దేశం నాకేమిచ్చిందని అనకండి
నీవు దేశానికి ఏమిచేసావో గమనించండి
పుస్తకమువల్ల ఉపయోగం లేదనకండి
రోజూ చదివితే దానికి మించిన మనస్సాంతి
వేరొకటి లేదని తెలుసుకోండి 
--((*))--


*కధ చెప్పాలని ఉంది
నేటి నిజం ముడి విప్పాలని ఉంది

పది నెలలు బిడ్డను మోసిన తల్లి
కాన్పుకు సర్కార్ దవాఖానాకు చేరిన తల్లి
అతికష్టమీద బిడ్డను కన్నది తల్లి
చీమలు కుట్టి బిడ్డ ప్రాణాలు తీసిన వైనం

ఇది  వైద్యుల నిర్లక్షమా
సర్కారువారి  వైద్యశాల  అపరిసుబ్రతా 
కళ్ళు  తెరవండి, అజాగర్త  చేయకండి
ప్రాణాలు పోసేవాడేవైద్యుడు 
..........................................
9000 కోట్లు ఎగగొట్టిన విజయ మాల్యా
ఇతర దేశంలో ఉన్న విజయ మాల్యా
రాజ్యసభకు రాజీనామా పంపిన మాల్యా
ప్రజాధనం తిరిగి ఇవ్వని విజయ మాల్యా

సర్కారువారు గట్టి చర్యలే తక్షణ కర్తవ్యమ్
బ్యాంకులో సొమ్ము రాబట్టుట సర్కారిదే
బీదవాడికోన్యాయమా, ధనికుడుకోన్యాయమా
ఈ ప్రజావ్యవస్త ధర్మాన్ని బ్రతికిన్చే దెప్పుడు   

--((*))-- 


కధ చెప్పాలని ఉంది(8)
స్త్రీలకు ధైర్యం కల్పించాలని ఉంది

మేము భారతమాత ముద్దు బిడ్డలం
భవ్య చరితమును తెలిపే ఆడ బిడ్డలం
స్వేస్చ కోసం ప్రతిద్వనిస్తున్న బిడ్డలం
ప్రకృతిలో నిర్భందంలో ఉన్న బిడ్డలం

మగధీరుల్ని బ్రతికిస్తున్న బిడ్డలం
ఇనుపసంకెళ్ళకు చిక్కని  బిడ్డలం 
మనోధైర్యంతో బ్రతకాలనుకున్న బిడ్డలం
ఓర్పు దయా దాక్షన్యము చూపు బిడ్డలం

మానవ మృగాలను వేటాడే బిడ్డలం
పైశాచికత్వం చూపెవారిని అరికట్టే బిడ్డలం
అర్ధరాత్రి అరాచకత్వం అనిచే ఆడ బిడ్డలం
పిల్లలని అదుపులో ధర్మబుద్ధి నేర్పే బిడ్డలం

బానిసబతుకుకు, వెట్టి చాకిరీకి స్వస్తిచేప్పే బిడ్డలం
స్త్రీ హృదయం లో భయం తరిమే నిర్భయ బిడ్డలం
పెద్దలకు, భర్తకు, పిల్లలకు సహకారమందిమ్చే బిడ్డలం
స్పందనకు, ప్రతిస్పందనకి ఓర్పే ఆయుధం గల బిడ్డలం 
 --((*))--  

*కధ చెప్పాలని ఉంది
కంప్యూటర్ కధ ముడి విప్పాలని ఉంది

నీవు రాకతో మా మది
ఆలోచనకు మార్గంగామారెనే 
నిన్ను ప్రారంభించగా గూగుల్
విజ్ఞాన పువ్వు విరిసినే

నిన్ను చూచుటకు మా కళ్ళు
ఉపాది విజ్ఞానంలో మునిగెనే 
నీలో ఉన్న చత్ర దర్సనముకు
మేను మురిసెనే, మనసు చేదిరేనే
   
నీలో ఉన్న బ్రహ్మతత్వమునకు
మంచులా కరిగి పోతినే
నీ అంతర్జాల మాయా శక్తికి
మా మనసు విహంగముగా మారెనే 

నిన్ను చూస్తేనే జ్ఞానము సూన్యమాయె
నీ ప్రేమ కదలికకు దాసుడుగా మారినే
నీ కాల మహాజ్ఞానమునకు లొంగి
నిన్ను విడిచి ఉండలేకున్నానే

నిన్ను ఉపయోగించుట మానివేసితినా
నాలో తెలియరాని భయము ఆవహించునే
నీవు రాకతో వృత్తి విద్య పెరిగి
ఉద్యోగ, వ్యాపారాల, సంపాదన పెరిగెనే

నీవొక అజ్ఞాత  శక్తివై , అనంత కోటికి
ఆసరాగా, పని వేగమునకు సహకరించినే
ఇందు కల డందు లేదనుటకు ఎందుకు
సర్వాంతరమున మేధా శక్తివై మమ్మాదు
కుంటున్నదుకు వందననములు
శత సహస్త్ర కోటి వందనములు కనుగొన్న మేధావులకు    
--((*))--

Mallapragada Ramakrishna
*కధ చెప్పాలని ఉంది
జీవిత శిల్పి ముడి విప్పాలని ఉంది

గోప్పలకోసం వేమ్పర్లాడకు
నీవు చేసే మంచి పనే గొప్పగా మార్చు
స్నేహంకోసం తాపత్రయ పడకు
ఆర్ధిక సహాయమ చేసి స్నేహాన్ని చేర్చు

ఉన్నత లక్షణం బీదరికమునకు
ధర్మమార్గమున చేసేపనికి ఉండదు చర్చ
విధి విచిత్రమని ఎప్పుడు అనుకోకు
మనసున్న వానికి అవకాశాలు తప్పకవచ్చు

నీవు ఒక తెరిచిన పుస్తకమని మరువకు
పామరునికి విద్యనేర్పి ఉన్నతునిగా మార్చు
ఓర్పు,స్వేస్చ కరుణ ఉండాలి ఉన్నతునకు
అనుభవ జ్ఞాపకాలతో భయపెట్టక ఇవ్వుస్వేస్చ

కొందరి బ్రతుకులను ఆదరించి బ్రతుకు
నువ్వా నేనా అనుకోక నవ్వి నవ్వించి సేదతీర్చు
జీవి జీవితంలో నేర్చుకొనే గుణ పాఠాలకు
దేశానికి, కుటుంబానికి శాంతి చేకూర్చు
     --((*))--


ప్రాంజలి ప్రభ వారపత్రికను ఆదరిస్తున్నవారికి, మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి మాతృ దినోస్చావం సందర్బముగా అందర్ఫికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 
ఆతల్లి దీవెనే నా ఫలం 
ఆతల్లి దీవెనే నాకు పుణ్యం 
ఆ తల్లి దీవెనే నాకు శరణ్యం
 మాతృదేవోభవ నమోనమో నమ: 

ఈరోజే కొత్తగా సీరియల్ వ్రాద్దామని ఆశించాను, దానికి మూలం ఎందఱో మహానుభావులు వ్రాసిన శ్లోకాలా భావం వారి ఆశిస్సులు కూడా కలగాలని, అందరిని ప్రార్ధించుతున్నాను
ఎందఱో మహానుభావులు అందరికీ వందనములు 
 మరియు గూగుల్, ట్విట్టర్, పేస్ బుక్ అండ్ యు ట్యూబ్ వారికి ధన్యవాదములు తెలియపరుస్తున్నాను. మీ బ్లాగుల్లో అజ్ఞాతంగా  గాని, కావ్యాలు గాని,   వారపత్రికలోమీ పేరుతో  పొందు పరుచుటకు ముందుకు వస్తున్నాను, వయసు రీత్య సహాయము అర్ధిస్తూ, యువశక్తిని, మేధావులను  ప్రోస్చహించాలని తపిస్తున్నాను.  
నేను వ్రాసేవి నచ్చితే చదవమని చెప్పండి, నచ్చకపోతే నాకు తెలపండి తప్పులను సరిదిద్దుకుంటా 
దంపతుల మద్య చిరు హాస్య  సంభాషణల నీతి శ్లోకం (1)









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి