31, మే 2016, మంగళవారం

Internet elugu Magazine for the month of 6/2016/21


                     ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు (చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (21) జూన్  నెల 1వ వారం 
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................

 విష్ణు సహస్త్రనామ స్తోత్ర భాష్యం (7వ శ్లోకం నుండి 10వ శ్లోకం )
 శ్లో. అగ్రాహ్య:  శాశ్వతః  కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూత స్త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరమ్.!!7!!

అగ్రాహ్య: = కర్మేన్ద్రియములచేత గ్రహింప బడనివాడు,
శాశ్వతః = సర్వ కాలముల యందు యుండు వాడు,
కృష్ణ : = నీలి వర్ణము శరీరము గలవాడు,
లోహితాక్షః= ఎర్రని నేత్రములుకలవాడు,
ప్రతర్దనః =ప్రళయమున భూతముల హింసించువాడు,
ప్రభూత:= జ్ఞానైస్వర్యాది గుణ సంపన్నుడు,
త్రికకుబ్ధామ= అధో మద్య భేదము చేత  మూడు దిశలకును స్థానముగా  నున్నవాడు,
పవిత్రం= సమస్త హేయ గుణములకు ఎదురు కోటి అయిన వాడు కనుక పరిశుద్దుడు,
మంగళం పరమ్.= స్వయం ప్రకాశక ఆనందరూపి అయి, కళ్యాణ రూపిగా నుండేవాడు,

భావము : కర్మేన్ద్రియములచేత గ్రహింప బడనివాడు,  సర్వకాలముల యందు యుండు వాడు,  నీలి వర్ణము శరీరము గలవాడు, ఎర్రని 
నేత్రములు కలవాడు, ప్రళయమున భూతముల హింసించువాడు,  జ్ఞానైస్వర్యాది గుణ సంపన్నుడు,  అధో మద్య భేదము చేత  మూడు దిశలకును స్థానముగా  నున్నవాడు, సమస్త హేయ గుణములకు ఎదురు కోటి అయిన వాడు కనుక పరిశుద్దుడు,  స్వయం ప్రకాశక ఆనందరూపి అయి, కళ్యాణ రూపిగా నుండేవాడు,  అగు పరమాత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాము . 
 


శ్లో. ఈశాన ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః
హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధు సూదనః!!8!!


ఈశాన: =  భూతములను శాసించే వాడు,
ప్రాణదః = ప్రాణదానము చేయువాడు,
ప్రాణ: = ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు,
జ్యేష్ఠ:= అత్యంత వృద్ధుడు,
 శ్రేష్ఠ: = అత్యంత ప్రశంసా పాత్రుడు
ప్రజాపతిః = సమస్త ప్రజలకు అధిపతియై  ఉన్నవాడు 
హిరణ్య గర్భ: = హిరణ్మయమైన అండము లోపల నుండు వాడు

భూగర్భ: = భూదేవికి సర్వదా తన అనుభవము నిచ్చి గర్భము వలే కాపాడేవాడు
మాధవ := మా అనగా శ్రీదేవి, ధవుడు అనగా భర్త , శ్రీదేవికి భరత యైన వాడు 
మధు సూదనః = మధువనేడి అసురుని సంహరించినవాడు 

భావము :  భూతములను శాసించే వాడు, ప్రాణదానము చేయువాడు,
ఉచ్చ్వాస నిశ్స్వాసలు సలుపు జీవుడు, అత్యంత వృద్ధుడు, అత్యంత ప్రశంసా పాత్రుడు  సమస్త ప్రజలకు అధిపతియై  ఉన్నవాడు,  హిరణ్మ యమైన అండము లోపల నుండు వాడు, భూదేవికి సర్వదా తన అనుభవము నిచ్చి గర్భము వలే కాపాడేవాడు, మా అనగా శ్రీదేవి, ధవుడు అనగా భర్త , శ్రీదేవికి భరత యైన వాడు, మధువనేడి అసురుని సంహరించినవాడు   అగు పరమాత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాము 


శ్లో. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమః
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్!!9!!


ఈశ్వర:= సర్వ శక్తి సంపన్నుడు,
విక్రమీ: = శౌర్యము గలవాడు,
ధన్వీ: = ధనుస్సు ధరించినవాడు,
మేధావీ: = మేధబహుగ్రంధదారణ సామర్ద్యము గలవాడు,
విక్రమ:= జగత్తుని దాటి పోయినవాడు,
క్రమః= గమనము సేయు వాడు,
అనుత్తమ: = తనకంటే ఉత్తముడులేనట్టివాడు,

దురాధర్షః = ఎవరి చేతను చలింప జాలని వాడు  
కృతజ్ఞః = ప్రాణులు చేసిన పుణ్య పాప రూపమైన కర్మను తెలిసి కొను వాడు,
కృతి: = పురుష  ప్రయత్నము నకు, సర్వాత్మకుడగుట వలన ఇట్టి కృ తికి ఆధారముగా నుండి కృతి శబ్దముచేత లక్షితుడగుచున్నవాడు,
ఆత్మవాన్ : = తన మహిమ యందే ప్రతిష్టితుడై ఉండు వాడు


భావము :సర్వ శక్తి సంపన్నుడు, శౌర్యము గలవాడు, ధనుస్సు ధరించినవాడు, మేధబహుగ్రంధదారణ సామర్ద్యము గలవాడు, జగత్తుని దాటి పోయినవాడు, గమనము సేయు వాడు, తనకంటే ఉత్తముడు లేనట్టివాడు, ఎవరి చేతను చలింప జాలని వాడు ప్రాణులు చేసిన పుణ్య పాప రూపమైన కర్మను తెలిసి కొను వాడు,  పురుష  ప్రయత్నము నకు, సర్వాత్మకుడగుట వలన ఇట్టి కృ తికి ఆధారముగా నుండి కృతి శబ్దముచేత లక్షితుడగుచున్నవాడు,  తన మహిమ యందే ప్రతిష్టితుడై ఉండు వాడు,   అగు పరమాత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాము . 

 
శ్లో. సురేశః శరణం శర్మ విస్వరేతా ప్రజాభవః
అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః!!10!!


సురేశః = బ్రహ్మాదులకు కోరిన ఫలములు ఇచ్చువాడు,
శరణం = సమస్త ప్రాణులకును నిరుపాధికమగు ఉపాయమైన వాడు ,
శర్మ: = పరమ సుఖరూపుడు, 
విస్వరేతా: = విశ్వమునకు కారణమైనవాడు,
ప్రజాభవః అహః= సమాస ప్రజలు తన నుండి కలుగునట్టివాడు,
సంవత్సర:= కాలస్వరూపముతో నున్నట్టివాడు గావున యితడు సంవత్సర: అనబడినవాడు,    
వ్యాళః =అభయము నిచ్చి వారలను అణా ఆధీనము గావించు కొనువాడు,
ప్రత్యయః = వారాలకు తన యందు విశ్వాసము కలిగించు వాడు,
సర్వదర్శనః= అంతట కన్నులు గలవాడు, అంతటను ఇంద్రియములు గలవాడు, తన మహిమలన్నీ చూపు వాడు,

భావము : బ్రహ్మాదులకు కోరిన ఫలములు ఇచ్చువాడు,  సమస్త ప్రాణులకును నిరుపాధికమగు ఉపాయమైన వాడు ,  పరమ సుఖరూపుడు,   విశ్వమునకు కారణమైనవాడు,  సమాస ప్రజలు తన నుండి కలుగునట్టివాడు,  కాలస్వరూపముతో నున్నట్టివాడు గావున యితడు సంవత్సర: అనబడినవాడు, అభయము నిచ్చి వారలను అణా ఆధీనము గావించు కొనువాడు, వారాలకు తన యందు విశ్వాసము కలిగించు వాడు, అంతట కన్నులు గలవాడు, అంతటను ఇంద్రి  యములు  గలవాడు, తన మహిమలన్నీ చూపు వాడు, అగు పరమాత్మునికి  ప్రణామాలు అర్పిస్తున్నాము .  
                                                                                               ఇంకా ఉన్నది

* స సూక్తులు
వ్యసనములకు కాకు బానిస
పసలేని వానికి చేయకు బాస
అసలు-నకిలీ తెలుసుకో మనసా
నస పెంచితే లోకువవుతావు తెలుసా    

పసివాని భావాలు అర్ధం చేసుకో
వసీకరణ మంత్రాల జోలికి పోకు
కసితో ఇతరులను కష్ట పెట్టకు
మసి బారిన ముఖాన్ని మార్చుకో

వాసం వదలి చేయకు ఉపవాసం
విస్వాసంలేక పోతే ఉండలేవు నివాసం
శాస్వతం అనేది తెలుసుకోవటం దుర్లబం
ఈస్వరుని కృపే అందరికి అత్యవసరం

మాసం ఏదైతేనేమి ద్యానించుటకు
హాసం ఎదైతే నేమి బ్రతికించుటకు
ప్రాస ఏదైతే నేమి అర్ధం చెప్పు టకు
వ్యసన మేదైతేనేమి ఆరోగ్యం చెడుటకు

అసంధర్బపు పలుకులు పలుకకు
అసముతో అసలకు మోసం చేయకు        
ఆసత్తి  మీద ఆసక్తి చూపు టెందుకు
ఆసరా చూపి ఆపెక్ష పడి ఆశించకు  
--((*))--

*జత కలుపుతా 

నీ ప్రాణానికి స్వాస నేనవుతా
నీ పలుకికి అక్షరం నేనవుతా
నీ సిగ్గుకి స్వప్నం  నేనవుతా 
నీ పసిడికి మెరుగు నేనవుతా 

నీ అందానికి నే కనులవుతా
నీ మనసుకు మమతనవుతా
నీ తనువుకు వలపు నవుతా
నీ సొగసుకు పరిమళమవుతా

నీ ప్రేమకు నా ప్రేమ జత కలుపుతా
నీ మాటా నా మాట జత కలుపుతా
నీ స్నేహం నా స్నేహం జత కలుపుతా
నీ శక్తి నా శక్తి ఒకటిగా జత కలుపుతా

నీ క్షీరమ్ నా ఉదకం  జత కలుపుతా   
నీ మార్గానికి నా మా ర్గం జత కలుపతా
నీ వయసు నా వయసు జత కలుపుతా
నీ పెదాలుకు నా పెదాలు జత కలుపుతా  
--((*))__


image not displayed * (వెన్నెల)

వెన్నెలలో మన అనుభూతి వేరు
మనసే వెన్నెల అన్నారు ఒక కవిగారు
వెన్నెల హ్రుదయాన్నిచల్లపరిచేది వేరు 
వెన్నెల మౌనంగా వచ్చి దుప్పట్లో చేరు

చల్లని గాలిలో వెన్నల కసిగా చేరే తీరు
ఊసులు వినే తోడు వారికి వెన్నెల జోరు
ఒంటరి వానికి వెన్నెల తపన పెంచేది ఏ తీరు
వెన్నెల రోజూ కొత్త మోజుతో వస్తుంది చూసారా మీరు

నీ జ్ఞాపకాలు వెన్నెల్లో పంచిన తీరు
పరవశించి మమేకమైన వెన్నెల తీరు
మదిలో ఉర్రూత ఊగించి జతకలిపినతీరు
నీ హ్రుదయమలోకి కిటికీ ద్వార వెన్నెల చేరు 

--((*)0-- 

ఆట కాదు వేట రా శివా

ఆలూమగల మాట 
అన్నాదమ్ముల మాట
అక్కా చెల్లెల్ల  మాట
మాట కాదు ఆట కదరా శివా

జణనాలు నీ దృష్టిలో ఒక ఆట 
మరణాలు నీ సృష్టిలో ఒక ఆట
ప్రయాణాలు నీ మజిలిలో మాట  
కారణాలు అట కాదురా శివా

సొంతంగా చేసేది కలి వేట
పంతంగా మాట్లాడేది కలి మాట 
అంతంగా పంచేది కలి మూట
ఇంత అంత ఆట కాదురా శివా

తెలుపే మది తొలిచే ఆట
నలుపే మది తలచే ఆట
వలపే మది కొలిచే ఆట
నలుపు తెలుపు ఆటేరా శివా

మన్నుతో కన్ను కాన రాని ఆట
మిన్నుతో కన్ను చూడలేని ఆట 
కన్ను మిన్ను కానరాని కలి వేట
మిధ్య అని ఆడించే అటేరా శివా

--((*))-- 
నా కవితలో "దోశ "

దోశ పలుదేశాల ఆకలి ఆశ
ఆశ కాదు దాని రుచే పేరాశ
మినప, పెసర పలు రకాల దోశ
అది తింటే మారు మన దిశ

ఉల్లి, అల్లం, మిర్చి, ఒకరకం దోశ
అలూకూర్మ, కార, మరోరకం దోశ      
ఉప్మా నేయీ కారపొడి రకం దోశ
ఏది తిన్నా మనకు తృప్తి నిచ్చే ఆశ

అవని యందు ఆకలికి శ్వాశే దోశ
కలిమి, లేమి, కలసి తినేదే దోశ
మయసు మనసు మరిపించే దోశ
అతిదే కాదు, ఆత్మకు తృప్తి నిచ్చేది దోశ 
  
ఎన్ని దోశలు తిన్నా ఇంకా తినాలని పించేది
యాత్రికులు, దేశ భక్తులు తినాలని పించేది
వీరు వారనేది కాదు కలియుగ ప్రజలు తినేది
శక్తిని, మనశాంతిని, పెంచేది ఆంద్రులు తినే దోశ    
--((*)0-- 


* (యవ్వనం)

శరీరంలో  కొంత మార్పు
మనసులో తెలియని నేర్పు
వయసుతో కోర్కలు పెరుగు 
అదే మధురమైన యవ్వనం

కోర్కలు ఆవిరిగా మారుతూ
కొత్త పువ్వులా వికసిస్తూ
చిరుజల్లు గాలిలా తపిస్తూ
అదే రమణీయమైన యవ్వనం

పెదాలు రుచులు కోరుతూ
పూల తేనలా జారుతూ
కళ్ళ చూపులు కదిలిస్తూ
అదే రసభరితమైన యవ్వనం

వయసు సొగసులు చూపుతూ
చిలక పలుకులు పలుకుతూ
కురులు కదలికలు  చూపుతూ 
అదే మరఛిపోలేని  యవ్వనం

యద సొగసులు చూపుతూ
చేతి వేళ్ళ కదలికలు కదిలిస్తూ .
గుండె నిండా ప్రమనుచూపుతూ
అదే ప్రణయ భావ యవ్వనం

మనసు మనసును ఉత్తేజ పరిచే
హృదయం లోని అగ్నిని చల్లపరిచే
అధరామృతములు ఆస్వాదించే
అదే మత్తుగా జోలపాడే యవ్వనం  

--((*))--  


*ప్రేమ అతిశయం

ఎక్కడకి బోయానని అనుకోకు
ఇక్కడికి రాలేదని అన మాకు  
అక్కడికి పోయివచ్చా ఇక్కడకు
మక్కువతో నిన్ను మరువ లేక

కట్టి వేతువా నీ పైట కొంగుతో
ఇట్టి వాన్ని చేర్చవా పడకింటిలో   
వట్టిగా పెట్టకు ఇబ్బందిమాటలతో
కట్టి నట్లు ఉంటా నిన్ను మరువలేక

విడిచితినా స్వామీ నిన్ను ఎప్పుడైనా
మడిమడి అని వేదించానా తప్పుకైనా
తడిపొడి మాటలతో ఇబ్బంది పెట్టినానా
విడిఛి నిన్ను ఉన్నానా ఒక్క ఘడియైన

తడబాటు నీకు దేనికి నా దగ్గర దొంగలా
ఎడబాటుకొరకు వేయకు ఎత్తులునక్కలా
కడవరకు నిన్ను వదలను చకోర పక్షిలా
అడ మొగ అన్న తర్వాత ఉండాలి హద్దులా       

--((*))--


* (కరుణించునా)

నిప్పులు కురిపించేది శశిడైతే
వెన్నెల కురిపించేది  సూర్యు డైతే
పృథ్వి మీద మెరిసేవి అన్ని తారలైతే
దేవతా ధర్మం మరిచితే ప్రకృతి కరుణించునా

నదులపై ఆధార పడకుండా జీవించ గలిగితే      
వృక్షాలపై ఆధార పడకుండా బ్రతక కలిగితే
స్త్రీ పురుషులు ఒకరిపై ఒకరు ఆధారపడక పోతే   
మానవ ధర్మంమరిచితే ప్రకృతి కరుణించునా

ప్రకృతి వనరులు ఉపయోగించ కోక పోతే
ఎట్టి ఔషధములు వాడక బ్రతక గలిగితే
ఎట్టి విషయాలు తెలుసుకోక ఉండగలిగితే
మానవ ధర్మంమరిచితే ప్రకృతి కరుణించునా

రాత్రి లో ఉండే మహత్తును తెలుసు కోకగిలిగితే       
పగటిలో ఉండే విద్యుత్తు తాకి తెలుసుకో గలిగితే
మానవులందరి మనసును అర్ధం చేసుకో గలిగితే  
మానవ ధర్మంమరిచితే ప్రకృతి కరుణించునా
--((*))--
 *"కృష్ణమ్మ"

అలా  అలా  గాలిలో తేలిపోదామని
గల గల లాడుతూ పారే సెలయేరు యొక్క 
లలిత లావణ్య సాహిత్య స్వరాలని
వినాలని లంగరు లేని నావలా చేరాను

కలలు మనసును కల్లోల పరచవని
కళ కళ లాడుతూ థళ థళ మెరుపు యొక్క
కృష్ణమ్మవడిలో హాయిగా నిదురించాలని
మలయ మారుతాలు నన్ను పిలిచెను

మల్లి మల్లి కన్నతల్లి ఒడిలో ఉన్నటుందని      
కళ్ళలో కాంతులు 'కల కావు' వాటి యొక్క
కోటి వెలుగులు నా మనసుకు చేరాయని
ప్రశాంతతకు మారు పేరని కృష్ణమ్మ పిలిచెను

అవి కిల కిల రావములు ఉన్న కోయిల కూతలని
గ్రీష్మంలో వసంతాన్నిచూపిస్తూ మనసు యొక్క
భావాలను తేలిక పరుస్తా, నా వడి చేరమని
కృష్ణమ్మ పిలవగా తన్మయత్వంతో చేరాను నేను
--((*))-
-ప్రేమ పలుకులు

ఊహల ప్రపంచం లో
వసంత మాలికలలో
స్వప్నాల కోరికలలో
ఆనంద పరవశాలు

నచ్చిన మూగ భాషలలో 
పెనవేసుకున్న లతలలో
క్షణం క్షణం  నిరీక్షనలలో
మౌన మాట మధురిమలు

మంచుని మించిన చల్ల గాలులలో
కంచిని మించిన శబ్ద వాటికలలో
తుంచని పువ్వుల పరిమళాలో
మంచిని మించిన మధురవాక్కులు 

విశ్వమ్ వెలుగు రేఖలలో
చల్లదనాన్ని పంచె వెన్నెలలో
చిక్కటి చీకటి రాత్రులలో
హృదయంతో ప్రేమ పలుకులు


--((*))--మనం మనం

మనం  మనం  ఒక్కటే   
మన  భావాలు  ఒక్కటే
మన ఆశయాలు ఒక్కటే
గుణాన్ని బట్టి నడుచుకుందాం 

ఆధునికంలో మారాలి మనం
అంతర భాష  నేర్చాలి   మనం
సులాభ మార్గమ్ చూడాలి మనం 
శ్రమే మన ఆయుధం అని బ్రతుకుదాం

మారుతున్న కాలంతో మారుదాం
మనసు మనసు కలిపి తిరుగుదాం
మనమంతా ఒక్కటేనని చెప్పుదాం
ఎవరు ఎమన్నా స్నేహం మార్చం

వచ్చేది రోబోర్డు ల యుగం
తెబోతుంది మెమరీ కి గాయం
కళ్ళే కమ్పూటర్ అయ్యే వయనం
కాలం బట్టి చేసేది మన ప్రయాణం 

--((*))--

* (మల్లెపువ్వు) 

మరు మళ్లి మల్లిక వైతే
మనసంతా మమేకం చేయవా
తిరునాళ్ళు విహంగ మైతే
తనువంత సందడి చేయవా

పరవళ్ళు పరవశ మైతే
పరువాన్ని పదిలం చేయవా
చిరుజల్లు జవ్వని వైతే
చుక్కలా యవ్వారం చేయవా  

కల్పవళ్లి కరుణ వైతే
కలకాలం నాతో ఉండి పోవా
సిరి తళ్లి జాగృతి వైతే
సిరులతో తృప్తిని అందించవా

కళా వళ్లి మనసు వైతే
కళ నుద్దరించటానికి సహరించావా
ప్రేమ పెళ్ళికి  తరుణ మైతే   
ప్రేమతో సుఖాన్ని పంచవా 

కొంచం తెలుసుకోండి
--((*))--
          --((*))--
 
చుక్కల్లోచంద్రుడు

అందానికి అందం  గగనానికి  నీవు   
మచ్చలున్నా మనసును దోచేస్తున్నావు
చిమ్మ చీకట్లో చల్లగా చూసె చెంద్రుడైనావు
వెన్నెలను కురిపించి వేదన తీర్చుకోమన్నావు

నిన్ను తనివితీర చూడగా తాపన్ని పెంచావు
చెలి నుదుటి తిలకం లా వెలిగి పోతున్నావు
తారల మద్య చంద్రుడివై నలిగి పోతున్నావు
సముద్రాన్ని ఎగసి పడునట్లు చేసేస్తున్నావు

నిద్ర పోతున్న పద్మాన్నినిద్ర లేపుతున్నావు
నీనా అనేది లేకుండా తన్మయత్వ పరుస్తున్నావు       
సరళ సమాన సమత్వం కల్పించే శశి రేఖవైనావు
మామనసును సంతృప్తి పరచి చూస్తునే ఉన్నావు  

--((*))--


image not displayed 
*స్వేచ్చ
 స్వేచ్చ ఇవ్వండి
- రెక్కలు కదల్చ టానికి
ఇచ్చ తీర్చనీయండి
 - మనసు బరువు తగ్గించటానికి
స్వచ్చముగా ఉండనీయండి
- కల్ముషాన్ని తొలగించటానికి        
వర్ఛస్సు చూపనీయండి
- వెలుగుని పంచ టానికి

ధర్మమార్గం నడవనీయండి
  - మనిషిని మనిషని చెప్పటానికి
మర్మం ఏదో తెలుసుసుకోనీయండి
 - పశువుని పశువుగా చెప్పాటానికి
ఖర్మ ఏదో తెలుసుకొనీయండి
 - పగలు రాత్రి కష్టపడటానికి
నిర్మలంగా ఉండ నీయండి
- అందరి మనసు పరిమలింప చేయటానికి

అహం తలకేక్కకుండా నడవనీయండి
 - గాలిలా సహకరించటానికి
మొహం మనసుకు రానీయకండి
 - సుఖం ఇదికాదని తెలుసుకోవటానికి
స్నేహాన్ని ఆదరించనీయండి
- మనసు మనసు తెలుసుకోవటానికి
ఇహం పరం తెలుసుకోనీయండి
 - మనసెరిగి బ్రతకటానికి 

--((*))--