13, మే 2016, శుక్రవారం

Internet Telugumagazine for the month of 5/2016/19

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు 
ceramic sculptures love hand


(చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (18) (date15-05-2016 to 21-05-2016)
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................

ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్నవారికి మరియు ప్రపంచ తెలుగు ప్రజలందరికి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 
(వారం వారం చదవండి స్వామివారి కృపకు పాత్రులుకండి)
హరి: ఓం
విశ్వo విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః:
భూతకృద్భూతబృద్భావో భూతాత్మా భూతభావన: !!1 !!

ఓం = అనునీయక్షరమే బ్రహ్మము: ఇది సర్వ శ్రేష్టము, స్మరనచేసినచో  దేనిని కోరిన  అదిసిద్ధించును    
విశ్వం = చరాచర జగత్తు నందు వ్యాపించు యున్నవాడు,
విష్ణుః = సర్వ వ్యాపకం గలవాడు,
వషట్కారః =వశము నందుంచుకున్నవాడు,
భూత భవ్య భవత్ప్రభుః = భూత భవిష్యద్వర్తమానాలకు తానే అధిపతిగాఉన్నవాడు
భూతకృత్ = సకల భూతాలను సృజించిన వాడు కర్త,
భూత భృత్ =. భూతాలను భరించేవాడు భర్త,
భావః=సమతా భావం కలిగినవాడు,
 భూతాత్మా= భూతాలన్నిటా ఆత్మయై ప్రకాశిస్తున్నవాడు,
భూత భావన= భూతాలకు శుభము కల్పించు వాడు.

భావము :" ఓం " అనునీ యక్షరమే బ్రహ్మము: ఇది సర్వ శ్రేష్టము, స్మరనచేసినచో  దేనిని కోరిన  అది సిద్ధించును    
చరాచర జగత్తు నందు వ్యాపించు యున్నవాడు, సర్వ వ్యాపకం గలవాడు, వశము నందుంచు కున్నవాడు,  భూత భవిష్యద్వర్తమానాలకు తానే అధిపతిగాఉన్నవాడు, సకల భూతాలను సృజించిన వాడు,  భూతాలను భరించేవాడు,
సమతా భావం కలిగినవాడు,  భూతాలన్నిటా ఆత్మయై ప్రకాశిస్తున్నవాడు,  భూతాలకు శుభము కల్పించు వాడు.
అగు పరమ్మత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాను

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాంగతి:

అవ్యయ: పురుష: సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవచ !!2!!

పూతాత్మ =పూత - పవిత్రమైన, ఆత్మా- స్వరూపముగలవాడు
పరమాత్మ = నిత్యశుద్ధబుద్ధ ముక్త స్వాభావుడు
ముక్తానాం పరమాంగతి:=ముక్తులగు వారికి సర్వోత్తముడు, పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు 
అవ్యయ:=వినాశము గాని వికారము గాని లేనివాడు
పురుష:=శరీరమనెడి పురమున శయనించువాడు, గొప్పవి యగు ఫలములను ఇచ్చువాడు 
సాక్షి =సాక్షాత్తుగా తనస్వరూపమేయైన జ్ఞానముచేత సమస్తమును చూయు వాడు 
క్షేత్రజ్న: = శరీరములను వీనికి బీజమైన శుభా శుభ కర్మలను తెలిసి కొను చున్నవాడు
అక్షర =తరుగులేనివాడు నక్షరతీతి అక్షరా: - గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు

భావము :  పవిత్రమైన, ఆత్మా- స్వరూపముగలవాడు,  నిత్యశుద్దబుద్దముక్త స్వాభావుడు, ముక్తులగువారికి సర్వోత్తముడు, పునర్జన్మ యనునది లేకుండా చేయువాడు, వినాశముగాని వికారముగాని లేనివాడు, శరీరమనెడి పురమున శయనించు వాడు, గొప్పవియగు ఫలములను ఇచ్చువాడు, సాక్షాత్తుగా తనస్వరూపమేయైన జ్ఞానముచేత సమస్తమును చూయు వాడు,  శరీరములను వీనికి బీజమైన శుభాశుభకర్మలను తెలిసికొను చున్నవాడు, తరుగులేనివాడు,  నక్షరతీతి అక్షరా: - గుణములు పై పైని అభివృద్ధి చెందునే కాని తరగని వాడు
 అగు పరమ్మత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాము 

యోగో యోగవిదాంనేతా ప్రధానపురుషేశ్వర:
నారసింహవపు: శ్రీమాన్ కేశవ: పురుషోత్తమ:!!3!!

యోగ:= ఉపాయమైన వాడు - (యజ్యతే అనేనా ఇతి యోగ:)
యోగవిదాంనేతా= జ్ఞానుల యోగాక్షేమాదులను వహించేడి వాడు -( ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్)
ప్రధానపురుషేశ్వర:= ప్రధానం అంటే పకృతి, పురుష: అంటే జీవుడు, ప్రకృతిని జీవుడ్ని నియమించే వాడు   
నారసింహవపు:= నరుని, సింహమును, రూపమును  బోలిన అవయవములు గల శరీరము గలవాడు
శ్రీమాన్ = అత్యంత మనోహరుడు, తన వక్షస్థలమున శ్రీదేవి సదా నివసించు చుండు నట్టి వాడు 
కేశవ: = మనోహరమైన కేశ (సిరోజ)ములు కలవాడు (ప్రశస్తా: కేశా: అస్య నమ్తీతి కేశవ:) 
పురుషోత్తమ:= పురుషులలో ఉత్తముడు. 

భావం : ఉపాయమైన వాడు - (యజ్యతే అనేనా ఇతి యోగ:), జ్ఞానుల యోగాక్షేమాదులను వహించేడి వాడు -( ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్) ,  ప్రధానం అంటే పకృతి, పురుష: అంటే జీవుడు, ప్రకృతిని జీవుడ్ని నియమించే వాడు,  నరుని బోలిన సింహమును బోలిన అవయవములు గల శరీరము గలవాడు,  అత్యంత మనోహరుడు, తన వక్షస్థలమున శ్రీదేవి సదా నివసించు చుండు నట్టి వాడు,  మనోహరమైన కేశ (సిరోజ)ములు కలవాడు (ప్రశస్తా: కేశా: అస్య నమ్తీతి కేశవ:) ,  పురుషులలో ఉత్తముడు., అగు పరమ్మత్మునికి ప్రణామాలు అర్పిస్తున్నాము  
  తరువాత శ్లోకాల భావం వచ్చేవారం
--((*))--

*. పస్థానం (నేస్తమా)

నేస్తం ఎలా వున్నావు?
ఏదో వెలితిగా ఉన్నది నీవు కానరాక
నీ ప్రేరణ నాకు ఊతంలా పనిచేసేది
ఆనందం కూడా  పట్టుకు పొతావనుకోలేదు
వేదన కన్నిళ్ళు చూపుదామనుకున్నా
నిరాశా నిస్పృహలు కలవద్దంటున్నాయి
ఆత్మా విశ్వాసంతో ఉందామనుకుంటే
చెప్పిరాని సంఘటనలు ఉక్కిరి బిక్కిరి చెస్తున్నాయి
అగ్నికి ఆజ్యం పోసేవారు ఎక్కువయ్యారు
నిరాశగా ఉంటె చేత కాని వాడి క్రింద లెక్కకడుతున్నారు
మౌనపు చూపులతో  చీత్కారాలను చూడలేకున్నా
స్వార్ధపు మనుష్యులమద్య ఉండలేకున్నా
గర్వంతో మెరిసిపడే వారిని చూడలేకున్నా    
ముందు చెప్పలేను, వెనకతిట్టేవారిని ఎమీఅనలేను
ముందుకు పొతే నూతి వెనకకు పొతే గోతి
మనసును నిగ్రహించుకొని బ్రతుకుతున్నాను నేస్తమా   
--((*))--


*. ప్రస్థానం (భావిస్తున్నా) 

పదిలమైన పరవశాన్ని
పరమా వదిగా భావిస్తున్నా
ప్రమాద మైన పరిహాసాన్ని
ప్రశాంత మైనదిగా భావిస్తున్నా

దారముతో పువ్వుల్ని
దండ కట్టి దేవునికియ్యాలనుకున్నా
ముళ్ళు గుచ్చే వేదిమ్పుల్ని
ఓర్పుతో తప్పవని భావిస్తున్నా

చీకటిలో పొందే సుఖాల్ని
కంటిలోని వేలుగుల్లా కాపాడుతున్నా 
మచ్చగా మారిన గాయాల్ని
జ్ఞాపకాల చిహ్నాలుగా భావిస్తున్నా

మౌనంతో తాకే పరిమాళాల్ని
వదలకుండా ఉండాలని భావిస్తున్నా 
ఆశలకు చిక్కిన జీవితాలన్ని
ఆకాశంలో మేఘాలని భావిస్తున్నా 

తీరని ఆశయాలన్ని
రాలిన పారిజాతాలని భావిస్తున్నా 
విషపు నవ్వులన్ని
గంధపు సువాసనలుగా భావిస్తున్నా

కరిగిన కళల కాలాన్ని
నిశ్శబ్ద సౌందర్యాలుగా భావిస్తున్నా
కలలో కనుగొన్న సౌందర్యాన్ని
నా కవిత్వ తత్వాలుగా భావిస్తున్నా   

--((*)0--




*. ప్రస్థానం ( నేత ) 

చీరను చూసి మురిసి పోతావు 
నేసిన నేతను గుర్తుంచుకోవు
రాత్రనక  పగలనక  నేస్తావు 
పోగు పోగు సరిచేసి వన్నెతెస్తావు

దలారిని నమ్మి మోసపోయావా
కార్మికుని నమ్మి చెడి పోయావా
శ్రామికుని కష్టాన్ని గమనించలేవా
ప్రేమ తో నేసిన చీరని పంచావు

గాదిక్రింద పంది కుక్కలు
గోతులుతవ్వే గుంట నక్కలు
రాయితీలుదోచే గుడ్ల గూబలు
నేతవిలువ తగ్గించిన దళారులు

చేనేత విలువ తగ్గదు
కష్టానికి ఫలితం రాక మానదు
మంచికాలం ముందు రాక మానదు
వన్నె తెచ్చే నేతకారిని మెచ్చక మానాడు

అగ్గిపెట్టెలో నేసిన చీర మరువకు
అమ్మవారికి నేసిన పుత్తడి చీర మరువకు
ఆకులు చుట్టుకొనే కాలంలో నేత నేసి
మర్మాంగానికి అడ్డంగా నేతను పంచావు

శతకోటి వందనాలు పుట్టుకతో గుడ్డను పంచావు
వయసు ఉడికి పోయిన వారికి గుడ్డను కప్పావు
హుందా తనానికి, రాజకీయానికి సహకరించావు
నిన్ను గుర్తింఛి ఆకలి తీర్చెవారు తగ్గారు తల్లి
--((*))--
image not displayed 

ధర్మక్షేత్రం
జన్మ భూమి నీదిరా
ధర్మ భూమిగా మార్చురా
మర్మ మెరిగి బ్రతకాలిరా
కర్మ భూమి నేలుకోవాలిరా

విజ్నులుగా మారాలిరా
ప్రాజ్నులై బ్రతికించాలిరా
కష్టే ఫలితమని తెలుసుకోరా
ప్రగతి కొరకు దేశానికి సహకరించారా

బేషజాలు మరవాలిరా
అందరు సమానులని తెలుసుకోరా
దేశ సేవకు కులమాతాలుండవురా
గుణమే మనిషిని బ్రతికించునురా

పనికి రాని వారు ఉండరురా
కళలు నెరవేర్చే దారిచూపరా
శ్రమ ఒక్కటే ఆయుధం రా
మనిషికి ఓర్పే ఇంధనం రా

రక్తం దానం చేసి బ్రతకాలిరా
నీ ప్రాంతం పరిసుబ్రంగా మార్చాలిరా
పుడమితల్లిని కష్టపెట్టకురా
క్షేత్రం ధర్మక్షేత్రంగా మార్చుకోరా
 --((*))--

*. ప్రస్థానం (ఎలా )

అడవిని కమ్మిన వెన్నెలకు విలువేలా  
స్వేస్చా జీవికి కష్టంతో పనియేలా  
పంజరంలోపక్షిలా బంధాలకు చిక్కనేలా
బందీకాని జీవి ఎవరో గమనించుట ఏలా

మమకారంతో వేట జరుపుట ఎలా
ఆహారం కోసం వేట చేయుట ఎలా
రక్తం లేని జీవి బ్రతికి ఉండుట ఎలా 
పానీయం కూడా త్రాగని మౌనిని గుర్తించేదెలా

మూలిక విలువ ఇంతా అంతా అని చెప్పుటేలా
ఔషధంతో అహంకారాన్ని తొలగించుట ఎలా 
ధన్వంతరీ ఆయుర్వేద వైద్యం సాగరుని లీలా  
మృత సంజీవని విద్య ఇప్పుడు సాధించుట ఎలా

వానలు లేకపోతె పుడమిన జీవించుట ఎలా
పంట పండించక పొతే బ్రతుకు సాగించె దేలా
ఏ ఎండకు ఆ గొడుగును పట్టుట తెలిసే దేలా
ఎండలో తంటాలు పడ్డ దప్పిక తీర్చుకోనేదేలా

కష్టపడ్డ ఫలితం లేక, కనికరం లేక బ్రతికేదెలా
కర్షకునికష్టం గుర్తించని ప్రభుత్వాలు ఉండుటేలా
ఫలితంచూపని మందులు అమ్మమని చెప్పుటేలా
అప్పు పుట్టని,కూలీ దొరకనిప్రాంతంలో బ్రతుకుటఎలా
  
      --((*))--

image not displayed 

 దంపతుల మద్య చిరు హాస్య  సంభాషణల నీతి శ్లోకం (1)

ఏమండోయి అంటూ పిలుస్తున్నది భార్య భర్త ను, ఏమిటే నన్నే పిలుస్తున్నావ, ఎబ్బే లేదండి పక్కింటాయన్ని, ఎందుకే నేను నుండగా, సిగ్గులేక పొతే సరి, పిలిచి నప్పుడు పలకరు, పిలవ నప్పుడు నన్ను పిలిచావా అంటూ మరీ వస్తారు. అటక మీద పచ్చడి జాడి ఉంది  తీయండి, అదెంత సేపు ఇపుడే తీస్తాను అంటూ నిచ్చెన వాటంగా వేసాడు భర్తః,

ఇదేమి బ్రహ్మవిద్యా అంటూ ఎక్కబోయాడు, నిచ్చెన జారి క్రింద పడ్డాడు, కుయ్యో మొర్రో అని అరిచాడు,  ఏమిటండి నన్ను పిలిస్తే నేను వచ్చి నిచ్చేనను పట్టుకొనే దానిని కదా,అంతా తొందర మీకు, లేడికి లేచిందే ప్రయాణంలా ఉంటారు మీరు,   అందుకే అన్నారు పెద్దలు, నేను చేయ గలనని తొందరపడితే ఏపని  కాదని తెలుసు కోవాలి, అట్లాగే ఎత్తైన పర్వతము మీదకు బండరాయిని పెట్టడం ఒకరి వల్ల కాదు, ఎందఱో సహాయం తీసుకుంటాం, కాని క్రిందకు త్రోయటం ఒకరి వళ్ళ అవుతుంది.
నన్ను పైకి ఎక్కించి క్రింద పడేద్దామనుకున్నావా, ఏమిటండి ఆమాటలు, అందుకే ఈ మగాళ్ళను నమ్మరాదు, ఎం చెప్పినా ఈచెవితో విని ఆచేవితో వదిలేస్తారు, తనకే అన్ని తెలుసననీ మొండిగా ప్రవరిస్తారు.

అసలే నేను నడుం విరిగి భాదగా ఉంటె ఎం మాటలే అవి, అసలు మీకు ఈ మగవారిమీద జాలి దయ ఉండదు, రండు చెవులతో వింటారు, నోటితో నలుగురికి చెప్పేస్తారు.
అవునండి ఏపని చెప్పిన సఖ్యతగా చేయరు, అన్ని తప్పులు ఆడవారివే అంటారు.
అందరి చేత ఉత్తములని అనిపించుకోవాలి, ఉత్తమగుణాలతో సామాజిక న్యాయం పాటించకుండా, మంచివాడు అనిపించు కోవటానికి కొండనేక్కించే రాయిలాగా కష్టపడతారు, తప్పులు చేస్తూ నలుగురిచేత చివాట్లు తిని పర్వతము మీదనుండి  రాయిలా జారి, చెడ్డ పేరు తెచ్చుకుంటారు. ఎందు కండి ఈ చేతకాని పనిలో దూరటం, ఇరువురం బాధ పడటం అవసరమా అందుకే మనకు ఋషులు చెప్పిన శ్లోకం వినండి అంటూ భర్తకు హిత భోధ చేసింది భార్య              
            
అరోప్యాతే శిలా శైలే
యత్నేన మహాతాయధా
నిపాత్యతే క్షణేనాథ:
                 తదాత్మా గుణదోషయో:      .       

పెద్ద రాతిని పర్వతం మీదికి ఎక్కించుటకు గోప్పప్రయత్నం చేయవలసి ఉంటుంది. దానినే క్రిందకి తోయాలంటే క్షణకాలం పట్టదు. అలాగే మంచి పేరు సంపాదించుకోవటం ఎంతో కష్టం, చెడ్డ పేరు సంపాదించు కోవటం ఏంతో తేలికైన పని ఇదే ఈ శ్లోకం యోక్క భావం. 

వచ్చేవారం మరోశ్లోకం ద్వారా నవ్వుకుంటూ సూక్తులు నేర్చుకుందాం
--(())-- 


*. ప్రస్థానం (నీరు)

చుక్క నీరు దొరుకుట లేదు
మక్కువతో దాహార్తి తీర్చేవారు లేరు
ఎక్కడి కెల్దామన్న దారి కనబడుట లేదు
చుక్కలంటుతున్న నీరు తోడి పిండినా త్రాగలేరు

కావడి కుండలతో నీరు తెచ్చినా తుప్తి లేదు
 బలగర్వం ఉన్నవారు నీటిని వ్యర్ధపరిచారు
నవమాసాలు మోసిన తల్లి ఋణం తీర్చేదారి లేదు
ఎవరికీ వారు నీటికోసం,ఇల్లు వదలి బయలు దేరారు

కంట నీరు రాదు, త్రాగుటకు నీరే దొరుకుట లేదు
వంట లేదు, స్నానం లేదు,సహాయం చేసే వారే లేరు
అంట రానివారని నీటివద్ద హెచ్చరింపులు మానలేదు
చుక్క నీరుకోసం కోట్లుకర్చు చూపుతారు ప్రభుత్వంవారు

అమ్మలారా అయ్యలారా చలి వేంద్రాలు ఏర్పరచండి
దానాలలో కెల్లా జలదానం ముఖ్యమని తెలుసుకోండి
ప్రభుత్వం వారు ట్యాంకులు పంపి నీటిని అందించండి
పుట్టిన వారికి నీరు, పోయినవారికి నీరు సహకరించండి  
  --((*))--

*కళ్ళార కర్మ భూమిని
చూద్దామని బయలుదేరా
వీధి వీధి తిరిగాను – ఎందు చూసిన
ప్రాణుల ఆక్రందనలను – ధర్మదేవత కన్నీరును

చూసాను ఈగలుకమ్మిన అంగడి సరుకును
చూసాను పిల్లుల కుక్కల స్నేహ భాన్ధవ్యమును
చూసాను చేత్తకుప్పలపై ఏరుకొనే మూగజీవులను
చూసాను పసిగుడ్డును చెత్తకుప్పలో విసిరిన స్త్రీలను

చూసాను మద మెక్కిన మనుష్యులను
చూసాను మత్తు లో ఉన్న పడతులను
చూసాను హింసించే కిరాయి గూoడాలను
చూసాను ఓట్లడిగే ఖద్దరు మనుష్యులను

చూసాను బిచ్చ మడిగే బిచ్చగాళ్ళను
చూసాను రచ్చ బండ రాజకీయాలను
చూసాను మంచినీరు పంపుపోట్లాటలను
చూసాను వర్షానికే మురికిగా ఉన్నవీధులను

చూసాను నిరసన ముష్కర మూకలను
చూసాను స్త్రీల అంగడి ఆకలి బ్రతుకులను
చూసాను అదుపు తప్పిన వాహన వేగాలను
చూసాను మత్తుతో నడిపే వాహక మనుష్యులను

చూసాను అనచుకోలేని ఉద్రేకాలను
చూసాను పోలీసు లాటి వేదిమ్పులను
చూసాను నాయకుల వాగ్దాన మాటలను
చూసాను ధనికులు చీదరించిన దరిద్రులను

చూసాను కులాల మధ్యవచ్చే సెగలపొగలను
చూసాను దేవునికే నామ పెట్టె దగాకారులను
చూసాను అంగడిలో అమ్మకానికివచ్చే స్త్రీలను
చూసాను పసిపిల్లలచే పనిచేయించే మేస్త్రీలను

చూసాను నమ్మించి మోసం చేసే మనుష్యులను
చూసాను నడమంత్రపు సిరితో ఉన్న మూర్ఖులను
చూసాను మదమెక్కి తిరుగుతున్న యువకులను
చూసాను ధర్మాన్ని వక్రీకరించిన న్యాయవాదులను

చూసాను ఎదగలేక చితికి పోయిన బ్రతుకులను
చూసాను సంసారామే చేయక కుత్రిమ గర్భాలను
చూసాను సీలాన్ని నడిబజారులో నెట్టిన వారును
చూసాను కాముకలకు చిక్కి బ్రతకని ప్రాణులను

ఎంత చూసినా ఏమి చేయలేని నిస్సత్తు సాధకుడను
మనుషుల్లో ఓర్పు,మార్పు ఎప్పుడు వచ్చి మారును
అందాకవేచి ఉండుటే కలియుగ మహిమనుకుంటాను
దేశమాత, పుడమితల్లి, కన్న తల్లి,క్షోభ ఎప్పుడు తీరును
--((*))--



(సుఖం )

వలపు తలుపుల వయసుంది 
మల్లెల అల్లికల చిక్కుంది
కళల మాలికల మత్తుంది
నరాల నడకలు మార్చావా

వణికే వలపుల చలి ఉంది
కులుకు కలువల కసి ఉంది
పలుకు పెదవుల రుచి ఉంది
వరాల తపనలు తీర్చవా

ఆకలి ఆరాటాల ఆశ ఉంది
రోకలి పోరాటాల మత్తు ఉంది
వెకిలి చేష్టల గమ్మతు ఉంది
గారాల హృదయం మార్చవా 

కురుల కదలిక పిలుపు ఉంది
ఫలాలు చెదరక వత్తిడి ఉంది
పెదాలు తడవక తపన ఉంది
స్వరాల రాగాలు గుర్తించావా

చెరకు తినీయల తీపి ఉంది
పడచు పరువాల పక్క ఉంది
వయసు మురిపాల సిరి ఉంది
కలల కోరికలు స్వయంగా తీర్చవా
--((*))--


(సుఖం ) గమత్తు కోరిక తీర్చుకోవాలిని ఉన్నది
నిన్ను ఎత్తుకొని హాత్తు కోవాలని ఉన్నది
హత్తు కొని వళ్ళంతా చిత్తు చేయాలని ఉంది
నాకు పైకముంది, నిన్ను పోషించే శక్తి ఉంది

ఎత్తుకొని వత్తు కుంటే జిల్ గా ఉంటుంది 
మనసు మెప్పించి హత్తు కుంటే జిల్ జిల్ గా ఉంటుంది 
నిస్సత్తు వదిలించి, శక్తి నింపితే మజాగా ఉంటుంది 
కొత్త కొత్త ఆశలను తీరుస్తే, తనువూ పులకిస్తుంది 

వలపందించి వయసు మలుపులు చూపిస్తా
మనసిచ్చి మనసు కోరికలు తీరుస్తా
సహాయ సహాకారంతో నిన్ను మెప్పిస్తా
జతకూడిన తర్వాత భావాలు ఇంకా చెప్తా

ఇంతటితో ముగిస్తున్నాను,

 నా పాత ప్రేమికురాలగురించి చెపుతున్నాను   
ఇంకా ఉన్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి