21, మే 2016, శనివారం

Internet Telugumagazine for the month of 5/2016/20


                             ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం 
సర్వేజనా సుఖినోభవంతు (చదవండి -వినండి - మనస్సును ప్రశాంత పరుచుకొండి) 
హేతుయుక్తము - అర్ధయుక్తము - స్నేహయుక్తము - 
                                           మా లక్ష్యము 
సంచిక  (20) మే నెల 4వ వారం 
సంపాదకులు: మల్లాప్రగడ రామకృష్ణ, మేనేజర్ :  మల్లాప్రగడ శ్రీ దేవి
..........................................................................................................................................................
సహాయకులు : గూగల్, పేస్ బుక్, యుట్యూబ్, వివిధ పత్రికలు, నా మైల్ కు కధలు, నా భావ కవితలు,కధలు మరియు అనేకం
...........................................................................................................

విష్ణు సహస్త్రనామం (4 నుండి 6 శ్లోకాల భావం)
సర్వశ్శర్వ: శ్శివ స్థానుర్భూతాదిర్నిధిరవ్యయ:
సంభవో భావనో భర్తా ప్రభవ: ప్రభురీశ్వర: !!4!!

....................
*. ప్రస్థానం (త్రాగుడు మానండి )  

త్రాగాలని లేదు, కాని త్రాగక తప్పలేదు
నేను బీరు, సారాత్రాగాక తప్పుట లేదు

అమ్మ వడి లేదు, ఆదుకునే భార్య లేదు
ఆశ చావ లేదు, భాధకు బరువే లేదు
నవ్వే చెలిమి లేదు, మౌనం తప్ప లేదు
మనసుకు నొప్పి లేదు, చింతే లేదు కాని

త్రాగాలని లేదు, కాని త్రాగక తప్పలేదు
నేను బీరు, సారా త్రాగాక తప్పుట లేదు

కాలం కరగుట లేదు, మనసు తడి తగ్గ లేదు
గుండెకు గాయం లేదు, మచ్చ మార లేదు
కన్నీరు అసలు రాదు, బ్రతుకు మార లేదు
అసలు జ్ఞాపకమే లేదు, గుర్తించేవారు లేరు కాని            

త్రాగాలని లేదు, కాని త్రాగక తప్పలేదు
నేను బీరు, సారా త్రాగక తప్పుట లేదు

ఆత్మీయత లేదు, ఊపిరిచ్చే ఉదయం లేదు
నేడు, రేపు లేదు, క్షణ నిరాశ  మార లేదు    
ప్రాణం పోవుట లేదు, చీకటి మారుట లేదు
మమ కారం లేదు,  ఊతం ఇచ్చే దారిలేదు  

త్రాగాలని లేదు, కాని త్రాగక తప్పలేదు
నేను బీరు, సారా త్రాగక తప్పుట లేదు

ఆ దారిన పోయేవాడు ఈ పాట విని ఇలా పాడాడు

త్రాగ వద్దు బాబూ, ఎందుకు త్రాగు తావు బాబూ  .
గుండె చెడు బాబూ, మనసు మూర్ఖంగా మారుబాబూ 
కలహాలు కలుగు బాబూ, ఆరోగ్యము చెడు బాబూ 
ఆశకు పోయావు బాబూ, ఓర్పు వహించి ఉండాలిబాబూ   
.
అంటూ పాడుతూ వెళ్లి పొయాడు,
చేత్తకుప్పలో త్రాగినవాడు పడి ఉన్నాడు ఇదేనా లోకం
   --((*))--*అనామిక
చిరునవ్వును చూపలెను
చీకటిలో వెలుగు చూపలెకున్నాను

కనురెప్పలు తెరవలేకున్నాను
వెన్నెలను కూడా ఆస్వాదించలేకున్నాను

మిణుగురు పురుగులా బ్రతుకుతున్నాను
చీకటిలో కూడా నా విలువ తెలుపలేకున్నాను   

హాసాల అందాలు హాత్తు కోలేను
అనుభూతి కాలాలు ఎవ్వరికీ చెప్పుకోలేను

కళ్ళ కన్నీరు ఆవిరిగా మారెను
స్వప్నాలు గాలిలో నీటి బుడగలుగా మారెను
 
ఎలుగెత్తి   నావాణి వినిపించలేను  
దిపాలల్లో ఆఖరి దీపమ్ వెలుగులా మారాను

నా గమ్యం ఎటో తెలియకున్నను
నా మనసును చూసే వాడికోసం ఉన్నాను
--((*))--

image not displayed 

*నా కవితలో గూగుల్

అంతర్జాలంలో మాయాజాలం
మాయను చేదించే గూగుల్ మంత్రజాలం
మంత్రం కాదు అది మనో నేత్రజాలం
నయనాలకు కనిపించే అద్భుత ద్రుశ్య జాలం

చేరాను గూగల్ జి మెయిల్
చూసాను నిరంతరం కొత్త స్టైల్
స్టైల్ కాదది మేధ పెంచే స్కల్
స్కల్ అయిన మోస్ట్ యూజ్ఫుల్

మౌస్ చూపిస్తుంది  క్లాస్
క్లాస్ లోకి చేరాక మారుతుంది ఫేస్
ఫేస్ తో పాటు హార్ట్ బీట్ రేస్
రేస్ తో గూగల్ చూసి అవుతా రిలాక్సు

గూగుల్లో తెలుసుకుంటాను ఎపిక్
మనసుతో పాటు మెదడులో  మెక్
ఇది ఒక మనుష్యులను మార్చే రివోక్
అందుకే ఇది ప్రపంచానికి  ఒక ఆప్టిక్        
--((*))--

*అర్పించిన హృదయం

దేహాన్ని పందిరిగా మార్చా
తీగమల్లికి అవకాసం ఇచ్ఛా
నన్నలుకుపోగా కలలు తీర్చా
వాడివ కుసుమంగా మార్చావు

నా గతాన్ని మరిపించావు
నీవు వర్ధమానుడిగా మారావు
నీభవిషత్ నీవు చూసుకున్నావు
ఈ పందిరి నైన నన్ను మరిచావు

వికసించే పువ్వును మకులితం చేసావు
ఉదయించి మరిపించి మరుగున పడ్డావు
ఆశ అడియాశలుగా మార్చి వెళ్లి నావు
చీకటిలో దారి కనబడక రాలేకున్నావు

నా దేహాన్ని సముద్రముగా మార్చావు
రేపన్నది నాకు ప్రశ్నగా మిగిల్చావు
చివరి క్షణం వరకు ఓపిక పట్టమన్నావు
నాఊపిరి తీసి ఊపిరి పీల్చుకొనిరాకున్నావు

బ్రతికుండగానే దేహాన్ని సమాది చేసావు
ప్రాణాన్ని దీపంగా వెలుగు చూపమన్నవు
బయట ప్రపంచంతో పనిలేకుండా చెసావు
నీ ఊసులు నా కళ్ళలో దాచాను ఎపుdoస్తావు
--((*))--

*నేటి నాకవిత "ద్రవం"

రూపం మనకు దేవుడిచ్చిన వరం
వయస్సులో ఉన్నప్పుడు ఓ రకం
వయసు ముదిరితే కొత్త రూపం
జత కుదిరితే ఎప్పుడూ వికసించిన కమలం

గంభీరం మనుష్యులకు ఆరోప్రాణం
వయస్సులో కనిపించు ఉడుకు రక్తం
వయసు ముదిరితే వాక్ చాతుర్యం
గంభీరంగా ఉంటేనే జీవిత సాఫల్యం

హృదయం నిత్యమూ చలిస్తున్న కాలం
కవాటాల శబ్దంతో మనుష్యుల్లో ఉత్తేజం
హృదయ స్పందనలే ప్రేమలకు మార్గం
హృదయాలు కలిస్తే కొత్త సృష్టికి మూలం

ఉడికి ఉడికి ఉప్పొంగేది ద్రవం
వ్యక్తిత్వాన్ని హెచ్చరించినప్పుడు వచ్చేది కోపం
ఓర్పు ఓపిక లేనప్పుడువచ్చేది ఉక్రోషం
మాట మాట పెరిగినప్పుడు వచ్చేది ఉపద్రవం
--((*))--

* స్త్రీకి స్థిరమేది ?

స్థిరంగా ఉన్న నన్ను అస్థిరమని
సఖ్యoగా ఉన్నప్పుడు అసౌఖ్యమని
చేతనా వస్థలో ఉంటే ఆచేతనమని
హేళన చేయటమేనా నీ భావనా
 
నీ కబంధ హస్తాలలో చిక్కినను   
ఉక్కిరిబికిరి చేసిన అరవకున్నను
సహయం లేక విలవిలలాదినను
నా నిస్సహాయతను చూసి హేళనా
  
నేను కోల్పోయిన అస్తిత్వాన్ని చెప్పలేను
నా శ్వాస నన్ను ఉడికించి వేదిన్చినను 
స్థిరత్వం పోకుండా వెలుగుకై  ఉన్నాను
మబ్బు చాటున దాగిన తారలా ఉన్నాను

ఎడారి జీవతాన్ని నేను ఆశించను
ప్రయాణంలో ఎదురేగి నడుస్తాను  
హృదయకుహరంలో స్పందనలను
నిశ్శబ్ద మేఘంలా కదులుతుంటాను

నేను నాలోని ప్రపంచాన్ని వెలికి తీస్తాను
ఊపిరి ఉన్నంత వరకు దేహాన్నిగమ్య చేరుస్తాను
మానవ మృగాలను తరిమి తరిమి కొడతాను
స్త్రీ శక్తి ఏమిటో ధర్మంగా నిరూపిస్తాను        
--((*))--

* ఓ కలువ

ఓ  కలువ నీ  కుంది  విలువ
పగలు వికసిస్తేనే మాకు మక్కువ
మనసు పరిమ లింళింప చేస్తావు ఎక్కువ
ఆధారము లేని దాని నని ఎందు కంటావు

అచ్చుతిని కోసం ఆరాటపడతావు వేకువ
పువ్వు విప్పారగ తుమ్మేదను రమ్మనవా   
జలములో జలకాలాటలకు  పిలువవా
కలసే పలుకులకు ఎందుకు భయపడతావు

కదలిక చెప్పక పోతే పని కాదంటావా
నయనాలు విస్తరించి మరీ పిలుస్తున్నావా
మకరంద మాధుర్యాన్ని దోచుకోమంటావా
మక్కువతో రాగ  ముఖం  తిప్పుతావు
      
అచ్చుతుడు అస్తమిస్తున్నాడని బాధపడతావు
కదిలే జలతుమ్పరుల గాలికి  తరించి పోతావు
ఈనాటి తృప్తి ఇక చాలు అని సంతోషిస్తావు
శశిధరుడొచ్చాడని భీష్మించి ముడుచుకు పోయావు    
--((*))--

*ఓ నేస్తమా ఇది నిజమా

కళ్ళకు  కన్నీరు   నేస్తం 
చేవులకు గుబిలి  నేస్తం
పెదాలకు జలం నేస్తం
చర్మానికి చమట నేస్తం

కళ్ళకు కల్లజోడు నేస్తం
కాళ్ళకు చెప్పులు నేస్తం
వంటికి వస్తాలు నేస్తం
పంటికి పాచి నేస్తం

తలకు తలగడ నేస్తం
చేతులకు ఉంగరాలు నేస్తం
నడుం కి వడ్డానం (మొలతాడు)  నేస్తం   
మెడకి మంగళ సూత్రమ్ నేస్తం

కంప్యూటర్ కి మౌస్ నేస్తం
టి వి .కి రిమోట్ నేస్తం
వేహికల్సుకు పెట్రోల్ నేస్తం
నాకు లేరు ఏ నేస్తం
--((*))--

*.మౌనం 

మౌనం మగువకు అందం
మొన రాగాలే మనోహరునికి అందం
మౌనంలో ముగ్దులవటం ఇద్దరికీ అందం
మూగ బాష పెదాల కదలిక మరీ అందం   

మౌనానికి ఉంటుంది కోపం
మౌన భాష్యం వ్రాయం ఓ రకం
చూపుల్లో చూపటమ్ మరో రకం
మూగ మనసులు హావభావాల హాస్యం     
 
మౌనం నీడగా ఉండి నటింప చేస్తావు
నిశ్శబ్దం లో నిశ్శబ్ద గాలివైతావు 
గాలిలా చుట్టుకొని కోరికతీరుస్తావు
వెన్నల విషాన్ని ఆనందంగా తాగేస్తావు
 
మౌనం ఎదలోని స్వాతిశయాన్ని
మౌనం ఆకర్షణలోని అతిశయాన్ని
మౌనం నడకలోని వన్నె తనాన్ని
మౌనం పరిమళంగా ఇచ్చు సుఖాన్ని
 
ఒంటరితనాన్నిమమేకం చేసేది మౌనం
అనురక్తిని, ఆహ్లాదాన్నికలిగించేది మౌనం
అర్ధం, అర్ధాంగి,  అంగీకరమే మనసుకు మౌనం
మగువకు ఆధరాన్ని అందించుటకు అలకే మౌనం
--((*))--ప్రాంజలి ప్రభ - శ్లోక భావామృత ప్రభ 

సర్వేజనా సుఖోనోభవంతు


దంపతుల మద్య చిరు హాస్య  సంభాషణల నీతి శ్లోకం (*)

తల్లి తండ్రులారా మీరు నడక ప్రారంభించు తున్నారా, ఈరోజు మీ మనవుడు వస్తున్నాడు, త్వరగా వచ్చేయండి, ఈ రోజు చాలా శుభదినం అని కొడుకు సుబ్రహ్మణ్యం తల్లితండ్రులకు తెలియపరిచాడు, లోపలనుంచి భార్య ఏమిటండి ఈరోజు ప్రత్యేకత తొందర పడతా వెందుకు నీవు చూస్తావుకదా, అవును లేండి మీకు  పరాయిదాన్ని, ఏవిషయం నాకు చెప్పరు, అడిగితే ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతారు,  అయినా నా కెందుకు అంటూ లోపలకువేల్లింది  భార్య 
కొడుకు రావడం, నాలుగు కుర్చీలు వేయడం, పళ్ళెం చెంబు తెమ్మనడం క్షణాల్లో జరిగింది. నాన్నా , తాతగారు అమ్మొమ్మ వచ్చారు, వారిని ఈ కుర్చీలొ కూర్చో బెట్టండి, అమ్మ నీవుకూడా ఇటురా ఈరోజు మాతృ దినోశ్చవం 
    మీ అమ్మగారు, నాన్నగారు వచ్చినట్టున్నారు వాళ్ళ నుకూడా  పిలిచి ఇక్కడ కూర్చో బెట్టు అన్నాడు కొడుకు
సుబ్రహ్మణ్యం రాజశ్రీ కలసి మొదటగా  సుబ్రహమణ్యం అల్లితండ్రులకు పాదపూజచేసారు, వారికి మనవుడు తెచ్చిన కొత్తబట్టలు అందించారు, అట్లాగే రాజశ్రీ తల్లి తండ్రులకు పాదపూజ చేసారుకొత్త బట్టలు అందించారు. ,    
తాతగారు అమృతవాక్యాలు చెప్పండి, సరే మనవడా, సంస్క్రు త శ్లోకాలు మన ఋషులు తెలిపినవే తెలియపరుస్తాను విను

మాత్రా సమం నాస్తి శరీరపోషణం
 
విద్యాసమం నాస్తి శరీర భూషణం
 
భార్యాసమం నాస్తి శరీరతోషణం
 
చింతాసమం నాస్తి శరీరశోషణం


తల్లివలె శరీరాన్ని పోషించేది మరేదీ లేదు. విద్యతో సమానమైన శరీర 

అలంకారం లేదు. భార్య వలే శరీరానికి సౌఖ్యం కలిగించేది మరొకటి 

లేదు. చింత వలే శరీరాన్ని ఎండపెట్టేదీ లేదు.

 తాతగారు మీరు చప్పండి తప్పదా మనవడా  

భూప్రదక్షిణ షట్కేన

కాశీయాత్రా యుతేన చ

సేతుస్నాన సతై ర్యశ్చ 

తత్ఫలం మాతృ వందనే 

"ఆరుసార్లు  భూప్రదక్షిన చేసిన ఫలం, వేయిసార్లు కాశీయాత్ర చేసిన 

పుణ్యం, నూరుసార్లు సేతుస్నానం చేసిన ఫలం తల్లికి ఒక్కసారి 

నమస్కారం చేయడం వల్లనే లభిస్తుంది ". 

పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆసీర్వాదమ్ అక్షతలతో 

పొందారు. 

మనవడా మీ తల్లితండ్రులవద్ద ఆసీర్వాదమ్ తీసుకో అన్నారు. 

అందరి అసీర్వాదములతో  ఆ గృహము నిత్యకళ్యాణం పచ్చతోరణంగా 

మారింది

తల్లి కి నమస్కారం పుణ్యఫలం
  
వచ్చేవారం మరోశ్లోకం ద్వారా నవ్వుకుంటూ సూక్తులు నేర్చుకుందాం
--(())--

------------


image not displayed 
                                                                   ఇంకా ఉన్నది