9, సెప్టెంబర్ 2017, శనివారం


pranjali Prabha.com (రచయత మల్లప్రగడ రామకృష్ణ ) స్త్రీ - పురుషులు ఒక్కరే

స్త్రీ అంటే ప్రగతి, జగతి జాగృతి
పురుషుడంటే జ్యోతి, జగతికి దివ్య జ్యోతి
స్త్రీ అంటే మాతృ మూర్తి, మానవతా మూర్తి
పురుషుడంటే స్నేహసహకార ఆదర్శ మూర్తి

నిత్యమూ సవాళ్ళను ఎదుర్కోవడం మగతనం
బడబగ్నినైన చల్లబరిచే హృదయం ఆడతనం
మాటల్లో వికసించే పురుష హావాభావం
చిరునవ్వుల సొగసు స్త్రీ సహజ స్వభావం

నలిగిన వేల వివేకం చూపే స్త్రీ తత్త్వం
విజ్ఞతతో ఆదుకొనే సహజ పురుష తత్త్వం
బ్రతుకు తెరువు నిత్య పోరాటం స్త్రీ మయం
సంపాదన, మమకారపు ఆరాటం పురుషమయం

స్త్రీ పురుషులలో ఉండు మానవత్వం
స్త్రీలో చక్కని సౌందర్యం గల ఆకృతి
పురుషుల్లో చాతుర్యం గల ఆకృతి
కష్ట నష్టాలలో జీవనయానం సమానం
--((*))--



ప్రాంజలి prabha (జీవితం )
రచయత మల్లప్రగడ రామకృష్ణ

ఓ మనిషీ తెలుసుకో

గెలుపు జ్ఞాపకాల వరం
ఓటమి అనుభవాల పరం
గెలుపు ఓటమిలే అశాపాసం
సమయం వ్యర్ధం చేయక ఉండటమే జీవితం

ప్రకృతి అందించేది నవ వసంతం
సద్వినియోగం చేయుటలో ఉంది మీ సొంతం
మంచి-చెడులతో కదిలేది ప్రపంచం
నిత్యమూ సంత్యరించే ప్రయాణమే జీవితం

నిత్యమూ దీపారాధన చేస్తే చేరదు నిశీషధం
ధర్మ ప్రవర్తనకు దరి చేరదు నిత్య దరిద్రం
ప్రేమను పంచే హృదయానికి చేరదు ద్వేషం
ప్రేమను పంచి ప్రేమను పొందటమే జీవితం

మనిషి భవిషత్తు కు పునాది విశ్వాసం
మనిషికి ఉండాలి ధైర్యముతో నమ్మకం
భయపడకు నీ వెనుక ఉండు అభయం
మనిషి ధైర్యంతో ప్రకృతితో బ్రతికేదే జీవితం

పరిశ్రమలు పనిచేస్తేనే ప్రగతి పధం
అశాంతిని తొలగిస్తేనే ప్రశాంతి మయం
యవ్వన వికాసమే మనిషికి నూతన తేజం
దేశం, కుటుంబాన్ని బ్రతికించటమే సాఫల్య జీవితం
ఓ మనిషీ తెలుసుకో

కలికాలం 


చెప్పుడు మాటలు వింటారు 

విన్నమాటనే సమర్ధించుతారు 
చెప్పేమాట వినక పట్టు పడతారు 
కుందేలుకు మూడేకాళ్లని వాదిస్తారు

అనుకున్నది సాధించేదాకా ఒప్పుకోరు 

మేధావులు చెప్పింది వినమని బోధిస్తారు 
ఎమన్నా మీకున్న తెలివి మాకు లేదంటారు
మీతో సమానమని అంటూ మమ్ము వేధిస్తారు 

మీరు మగవాళ్ళు మాటలతో మాయ చేస్తారు 

మాకున్న బలహీనతతో  ఆడు కుంటారు 
చదువు తక్కువని చులకనగా మాట్లాడుతారు 
కోరిక తీర్చేదాకా ఒక పట్టాన నిద్ర పోనీయరు 

ముందు వెనుక చూడక ఎపుడూ కావాలంటారు

అనుకున్నప్పుడు అందివ్వక పొతే రెచ్చిపోతారు 
వయసొచ్చిన కోరికలకు అంతము లేదంటారు 
అప్పు చేసైనా హుందాగా బ్రతుకుదా మంటారు


మౌనము పలుకుటకంటే చాలా మేలైనదంటారు

కానీ పలుకులందున్నువిశేషము గ్రహించమంటారు

సత్యమైన వాక్కు, ప్రియమైన వాక్కును నమ్మమంటారు





మాకున్న ధర్మాలను బట్టి మేము మాట్లాడేది ధర్మమే అంటారు
   

     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి