6, ఆగస్టు 2015, గురువారం

Pranjali Prabha - 4 (కృష్ణ నీ చరణమ్ములే నాకు దిక్కు)

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ- 4
సర్వేజనా సుఖినోభవంతు

 
కృష్ణ నీ చరణమ్ములే  నాకు దిక్కు

1. మల్లె పువ్వును నేను, మంచిగంధ వాసనదిస్తాను
గులాబి పువ్వును నేను కస్తూరి  వాసన లందిస్తాను
పారిజాతాన్ని నేను నీ పాదాలకు సెవగా ఉంటాను
నామాటలు వినవా కృష్ణ నీ చరణమ్ములవద్ద రాలిపోతాను

ఉపవాస వ్రతములు నీకోసం చేయలేను
ఒక్క దీపారాధనమైన   నీకోసం చేయలేను 
స్నాన సంద్యా నియతి జరుపలేను
నామాటలు వినవా కృష్ణ నీ చరణమ్ములవద్ద రాలిపోతాను

నిజ్ఞానులను  గనుగొని మ్రోక్కలేను
దాసుల గనుగొని వేడలేను
కృష్ణ నీ సన్నిధికి నే చేరలేను
కృష్ణ నీ చరణమ్ములవద్ద రాలిపోతాను

జన్మము  లెత్తి ఎత్తి విసికినాను
ఈ జన్మతో సరిచేయవలెను
నే మరువనేప్పుడు నీనామ జపమున్
కృష్ణ నీ చరణమ్ములవద్ద రాలిపోతాను

దుర్మార్గులను దండన చేస్తావు నీవు 
సన్మార్గులకు మోక్షం ప్రాసాదిస్తావు నీవు 
రాధకోర్కను తీర్చి తృప్తి పరిచావు నీవు 
అందుకే నిన్ను వదలక నీ చరణమ్ముల వద్దే ఉన్నాను

" కమలనయన బ్రోవరా .....కరిరాజవరద
వర యాదవ పురవాస: కృష్ణ విను
కరమదుగా నా కన్నుల గాంచెద
కోరి కొలుతు నాదు కొర్కలుదీర్పగ
సారసాక్షి నీ సంనిదిజేరితి .........
కమలనయన బ్రోవరా .....కరిరాజవరద "
--((ఓం శ్రీ రాం))--

ఈ మధురగీతాన్ని ఆలకించండి

యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలొ
పిలువగనే తేనెల్లొ పూదారి ఎన్నెల్లొ గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
ప్రాప్తమనుకొ ఈ క్షణమె బ్రతుకులాగా
పండెననుకొ ఈ బ్రతుకె మనసు తీరా
శిధిలంగ విధినైన చేసేదె ప్రేమ
హృదయంల తననైన మరిచేదె ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధా
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధా
యమునా తీరం సంధ్యా రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిశిరంలొ చలిమంటై రగిలేదె ప్రేమ
చిగురించె ఋతువల్లె విరబూసె ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధా
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధా
యమునా తీరం సంధ్యా రాగం
mve : Anand
రచన: వేటూరి
సంగీతం: రాధక్రిష్ణన్
గాయకులు: హరిహరన్, చిత్ర

Watch Nuvvena Naa Nuvvena Song From Anand Movie. Anand is a Telugu movie, directed by Sekhar Kammula. Starring Raja, Kamalinee Mukherjee, Satya Krishnan, Ani...

 


ఆడపిల్ల కష్టం లేని రోజు ఏదని
 వంటకు కట్టెపోయి తప్పదెందు కని
దేశంఇంకా వెనుక పడుతుందేమోనని 
నాకళ్ళు చెమ్మగిల్లు చున్నవి 
ఏమిది నీదు లీల ఆకొన ఈ కోన కలిపినావు
వన్య మృగాలకు మార్గం చూపిన వాడవు
ప్రక్రుతి వనరులు పొందటానికి మార్గదర్సకుడవు
ఆనద పారవస్యాన్ని  తలపించే చిత్రం గీసావు   
మీరు గీసినచిత్రము బాగుంది 

వర్ధమానులను ప్రోస్చహించాలని ఇందు పొందు పరిచాను R.K.S. thoughts. వారు పంపినారు   
తులసీ మండపం ఉండే పద్ధతి
పవిత్రమైన తులసీ మండపాన్ని ఇంట్లో పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవి నివసించే తులసీ మండపం తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తీరాల్సిందేనని వారు అంటున్నారు. ఇంటి ముంగిట నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు గల తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో ఉండేలా చూసుకోవాలి.
మండపం మధ్యలో ముక్కోణపు ఆకారం వుండి తీరాలి. ఇందులో దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక మండపంలో నాగులు నివసించే పుట్ట మట్టితో లేదా ఏదైనా పవిత్రమైన ఆలయం నుంచి తెచ్చుకున్న మట్టితో నింపాలి. వెదురు బూడిద, ఎండిన పేడతో తయారైన భస్మాన్ని అందులో కలిపి తులసీ మొక్కను నాటుకోవాలి. తులసీ మండపానికి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసే విధంగా చూసుకోవాలి. కృష్ణ తులసీ అనే మొక్కను (రెండింటిని జంటగా) నాటుకోవడం మంచిది. పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిల్లో తులసీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.
తులసీ మండపం ఏర్పాటు చేయలేకపోతే.. 12 లేదా 16 ఇటుకలతో తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 12-16 ఇటుకలతో ఏర్పాటు చేసిన తులసీ మండపంలో తులసీ మొక్కను నాటి దీపమెలిగించి పూజలు చేయవచ్చు. 12-16 సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న తులసీ మండపానికి 12 సంఖ్యలో చందనం, 
కుంకుమ బొట్లు పెట్టాలి.
ప్రతిరోజూ స్నానమాచరించి తులసీ మొక్కకు పుష్పాలు వుంచి.. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణు, మధుసూదనా, వామనా. పద్మనాభా అంటూ స్మరించాలి. తమలపాకుపై విఘ్నేశ్వరుడిని చందనంతో పట్టిపెట్టి.. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు 
పటా పంచలవుతాయి.