31, ఆగస్టు 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ - ఆనంద పారవశ్యం పొందాలని చిన్న తాపత్రయం -1

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం
శ్రీ మాత్రే నమ:
 ప్రాంజలి ప్రభ
Animated gifs : Animated wallpapers for cellphones
ఆనంద పారవశ్యం పొందాలని చిన్న తాపత్రయం 


నీ లాలి ధునిలోన ధ్వనియించగా
కదలి రావమ్మా రావే! కధలమ్మా రావే!
పలుకుల్లో పదునిచ్చి పలికించగా
తల్లీ చదువమ్మా రావే! శ్రీవాణీ రావే! ~ నీ లాలి ~

మేఘాలబాల రాగాలనేలే
మారాణి వీవే!
చిగురాకునూచే తెమ్మెరలలోన
విరిరాగ ఝరులెన్నో పొంగించినావే!

నీ దీవెనలే భావనలై విరబూసిన
గీతమాలికలోన స్వరజ్ఞానమీవే! ~ నీ లాలి ~

ఈ భువనమందు రవళించినావే
స్వరజతులనెన్నో!
ప్రతి తావు జూడ సిరిభావమేదో
పురుడించెనమ్మా నా మదిలో నిత్యం

కోవిదుల యెదలాంటి కోవెళ్ళలో
కొలువు చేసింది తల్లి విజ్ఞానఖనిగా! ~ నీ లాలి ~ 




Democracy needs a measure of tolerance of other people's views and ways -
ప్రజాస్వామ్య జీవనములో సాటి మనిషి ఆలొచనలనూ, వారు అనుసరించే మార్గాలనూ సామరస్యంతో సహించడం కనీసధర్మం       

విశాల హృదయ్యంతో స్త్రీ ని ఆదరించుదాం, స్వేచ్చను కల్పించుదాం,  జీవితంలో తప్పు త్రోవ త్రొక్క కుండా సుఖసంతోషాలతో కలసి మెలసి జీవించుదాం 


ఇందఱికి అభయాలని ఇచ్చే చేయి. : అన్నమాచార్యుఁడు,
.
అర్థాలు:
కందువ - నేర్పు। చిలుకుగుబ్బలి - మంథరపర్వతం (చిలుకు - మథించు, గుబ్బలి - కొండ)। కలికి - చక్కటి స్త్రీ। వలను - నేర్పు। తనివోవు - తనివి పోవు (తనివి - సంతుష్టి)। ఒనరు - కలుగు। మొనయు - యుద్ధానికి పూనుకొను (మొనగాడు అంటే యుద్ధం చేయడానికి సిద్ధమైనవాడు)। అమ్ము - బాణం। మొన - కొస। ఎనయు - సరిపడు। నాఁగేలు - నాగలి। పొల్ల - పొల్లు (వ్యర్థం)। తురగము - గుఱ్ఱం। పరపు - తోలు। దొడ్డ - గొప్ప। తెరువు - దారి।

తాత్పర్యం:
ఇందఱికీ అభయాలను ఇచ్చే చేయి. అలా అభయాన్ని ఇవ్వడంలో బాగా నేర్పు కలిగిన గొప్ప బంగారుచేయి (బంగారుతల్లి అన్నప్పుడు బంగారు ఎలా విశేషణంగా వాడుతామో అలాగ).

వెలకట్టడానికి సాధ్యం కాని వేదాలని మత్స్యావతారమూర్తియై వెదికి తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చినది ఈ హస్తమే. కూర్మమూర్తియై మంథరపర్వతం క్రింద చేరి తన చేతితో వహించే చేయి. చక్కటి భూకాంతను వరాహమూర్తియై సముద్రంనుండి ఉద్ధరించి కౌగిలించిన చేయి. హిరణ్యకశిపుణ్ణి చంపగల నేర్పు కలిగిన కొనగోళ్లు కలిగిన నరసింహావతారుని చేయి.
తను సాక్షాత్తూ లక్ష్మీదేవికే భర్త ఐనా అంతటితో తృప్తి పడక ఇంద్రుడి కోసమై బలి చేతినుండి దానం పుచ్చుకున్న వామనుని చేయి. పరశురాముడై సమస్త భూమండలాన్ని జయించి, అంత భూమినీ కలిగియున్నప్పుడు, యాగం చేసి ఆ ఋత్విక్కులకు సమస్తభూమినీ దానంగా ఇచ్చిన చేయి. రామావతారంలో సముద్రముపై యుద్ధానికి బయలుదేరి తన బాణాన్ని కొసకు తెచ్చిన చేయి. చక్కగా సరిపడేలా నాగలిని ధరించే బలరాముని చేయి.
గొల్లకాంతలందఱికీ వారి మానము తనే అనే అవగాహన కల్పించడానికై వారి మానములను అపహరించిన కృష్ణుని చేయి. గుఱ్ఱాన్ని తోలుతూ ధరావలయమునందు ధర్మస్థాపన చేసే కల్కిమూర్తి యొక్క గొప్ప చేయి. అలాగే, శ్రీవేంకటాచలానికి అధిపతియై తన పాదములే మోక్షపు మార్గము అని తెలిపే చేయి.


వినమ్రతతో విన్నవించుకుంటున్న విన్నపము, నేను స్టేట్ గజ్ టెడ్ రాంకు పొందినప్పటి నుండి వయసులో ఉన్నవారికి, వయసుడి కినవారికి ఆనందం కలగించే విధముగా ఎంచేయాలని ఆలోచించిన  సమయయంలో నాకు ఆ వేంకటేశ్వరుణి కృపతో, నేను ఆంజనేయ్యుని మనోధైర్యముతో చిత్తు కాగితాలమీద కవితలు వ్రాసాను. ఇది 2012 నాటి నా పోస్టు అండి. ఇప్ప్డుడు విశ్రాంతి జీవిగా ఉన్నాను .  

 శ్రావణమాసంలో 2012 న ప్రారంభిమ్చాను అంతర్జాలంలో అక్షర రూపంలో 03-11- 2012 ఒక బ్లాగ్ గా గుర్తించు కొని ఓనామాలు దిద్దటానికి ప్రాంభించాను, ఇప్పటికి రెండో మెట్టు దాటి మూడో మెట్టు కూడా దాటటానికి మీ ఆశిర్వాద బలము కావాలని అజ్ఞాతములో ఉన్న నా భావ కధా ప్రభను ప్రాంజలి ప్రభగా మీముందు ఉంచినాను. 

 నేను వ్రాసినవి మీకు నచ్చ వచ్చు, నచ్చక పోవచ్చు కవి కున్న స్వేచ్చను ఆదరిస్తారాని, నా అనుభవాలను కేంద్రీకరించి నేను చదివిన పుస్తకాలను అనుసరించి, ఆ సరస్వతీ దేవిని అర్ధించి కవితలు వ్రాసాను. 

 నాకన్నా పెద్ద వారికి పాదాభి వందనములు సమర్పిస్తున్నాను, చిన్న వారికి నా ఆశిస్సులు అందిస్తున్నను
ప్రకృతి సౌదర్యము, స్త్రీ సౌందర్యము, ప్రపంచ సౌందర్యము వర్ణించటం అనాదిగా వస్తున్నది మెట్టు నుండి త్గడబడి క్రింద బడిన పసి పిల్లవాడి  లాటి మనసున్న వాడిని నేను. నేను వ్రాసిన వాటిని లైక్ చేసి, షేర్  చేసి, మీ అమూల్య అభిప్రాయాలు తెలుపగలరని ఆనంద పారవస్యంతో  తెలియపరుస్తున్నాను, తప్పులు దొర్లినా సరిదిద్దు కోగలను, నేను ఆదరించే దేవుని తర్వాత ప్రాంజలి ప్రభను ఆదరించివారు అందరూ నాకు దేవుళ్ళతో సమానము. నా మేల్ పంపిన కధలు, కవితలు.చిత్రములు  
పంపినవారికి నాకు సహరిస్తున్న గూగుల్ వారి సౌజన్యం, ఫేస్ బుక్, యు ట్యూబ్ యాజమాన్య్యం వారికీ నా కవితలలో కొన్ని వాడుకున్నందుకు, సహకరించిన ప్రతిఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాను 

గమనిక నేను వ్రాసినవి నచ్చితే చదవమని చెప్పండి, నచ్చక పొతే చదవద్దని చెప్పండి ఈ ఒక్క సహాయము చేసి పుణ్యం కట్టు కొండి ఆ వేంకటేశ్వరుని ఆశిస్సులు పొంది ఆనందంగా ఉండండి   
ప్రభుత్వ లెక్క ప్రకారం  15-06-2020 నా పుట్టిన రోజు , శుభాకాంక్షలు పంపదలచిననారు అడ్రస్ మరియు ఫోన్ నెంబరు తెలుపగలరు . 
సర్వేజనా సుఖినోభవంతు
ఇక చదవండి, ఆనంద పారవశ్యానికి మార్గాలు - నాకు తెలిసినవి ఇందు పొందు పరుస్తున్నాను
ఇందులో మంచిని గ్రహించండి - భోదించండి - తన్మయత్వం పొందండి 

                                   ఇంకా ఉంది ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి