2, సెప్టెంబర్ 2015, బుధవారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు -ఆనందపారవశ్యo -2

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ 
ఆనందపారవశ్యo
సర్వేజనా సుఖినోభవంతు

తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా 

తల్లి ఆనంద పారవశ్యం గురించి వర్ణించే శక్తి ఎవ్వరుకూలేదు, నీకు తప్ప అందుకే నేను నిన్ను ప్రార్దిమ్చుతున్నాను, నేను వ్రాసే ఈ చిన్న కవితా వాక్యములకు సహకరించు తల్లి, నన్ను అశీర్వదించు తల్లి  


మానవుల మనో భావాలు అనంతాలు, అనటానికి అర్ధం లేని విధముగా అంతరంగ రాగ సరిగమలు, పదనిసలు, సరసబావాలు, వెంట వెంటనే వెంబడిన్చుతూ తుమ్మెదలు  మకరందాన్ని అస్వాదిన్చుటకు వచ్చినట్లు నేను ఎందుకు  ఆస్వాదించ కూడదు అనే తపన మనిషిని వెంటాడుతుంది ఇది ప్రకృతి, మకరందాన్ని పంచి మదన కుహరమును మర్దనము చేసి తన్మయత్వం, ఇదని, ఇంతని, చెప్పుటకు ఎవ్వరి తరము కాదు, అది ఒక అద్భత సృష్టి, అది ఒక పరమాత్మకు మాత్రమే తెలుసు, అని అనుకో నవసరం లేదు,  ఆనంద పారవశ్యములో,  అరమరికలు లేకుండా,  పరవశించి తన్మయత్వంతో,  తపనతో, తరతమ భేదములు లేకుండా, తనువూ,  తనువూ, తప్పెట పై తప తప అని బాదిన వచ్చే శబ్ద సంతోష వాద్యము ఎంత  మధురముగా ఉంటుందో,  మనిష్యులను గుఱ్ఱము కన్నా వేగముగా  మనసును పరుగిట్టించి, మనసును  తపనలకు  తపింప చేసి తన్మయంతో తనువు హత్తుకొని, నీలి మేఘాల పచ్చని మేనుపై, పరవశించి ఆనంద పారవస్యముతో, పరిపక్వము చెంది, పువ్వు విప్పారి పరవశించి, పరిమళాలు విరాజిల్లి, విరహ వేదనతో విలవిల లాడి, ఓ మేఘమా శాశ్వతముగా నాపై కురువుమా, నా ఆనందమును పంచుకొని సుఖపడుమా         ............. (1)
The hug…

మనసు ఊహలతో తేలియాడుతూ, ఎంత విశాలముగా మారుతుందో, ఊహాలు పెరిగే కొద్ది, సీతాకొక చిలుకదాకా మారేదెప్పుడు,  అనంత మకరందాన్ని పొందే దెప్పుడు, ఆశ్వాదించె దెప్పుడు,  అని విశ్వసిస్తూ  విహరిస్తూ, రంగు రంగులుగా,  మారి రమనీయ మైన,  మాదుర్యాన్ని  ఆస్వాధిచుతూ, ఆనంద డోలికలో, మునిగి పోతుంది.  సీతా కోక చిలుక

శ్రావణ౦ !
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..
మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..
శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ.. 

వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..
: సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా..
నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల...
స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా..


ఎన్ని సముద్రాలు, ఎన్ని పర్వతాలు, ఎన్ని  నదులు, ఎన్ని లావాలు, తన కుహరంలో దాచుకుంటుంది  సముద్రాల ఉప్పును భరిస్తూ, పర్వతంలా బరువుని మోస్తూ, నదుల్లా పరవసిస్తూ,  నలుగిరి దాహాన్ని తీరుస్తూ, తనను అన్య క్రాంతను చేసిన వారిని లార్వాలా, పెల్లుబికి ముంచి వేస్తు , మనసులోని మాటను బయటకు చెప్పుకోలేక, గట్టుదాటలేని కడలివలే  భాదలు కష్టాలు సుఖాలు దుఖాలకు  హ్రుదయ మాదుర్య0  చెడకుండా  మందహాసాన్ని అందించే మకారందమా

బయటకు కనబడిన, అద్బుత లోకాలు, మనవద్దె ఉన్నాయి, కాని అవి ఆకాశములో  విహరించే మేఘాలు, దూది పింజాల్లా,  గాలికి కదిలి వేలతాయో అదే విధముగా,  ఆ మనసు అల్ల కల్లోలమునకు చిక్కి,  ఆశలు ఆశయాలు,  నీటి  మీద రాతల్లా తేలియాడుతూ,  ప్రేమ పాశంలో చిక్కి అనంత వాయువులను అస్వాదిస్తూ, అంతరంగ అనుభూతిని పొందుతూ, ఆలోచనలకు తావివివ్వక, ఆనందాన్ని పంచె, అద్బుత  లోకం ఎక్కడ లేదు, ఒకరి కొకరు కలసుకొని, అర్ధం చేసుకొని, జీవన మార్గమే ఆనంద నిలయం  
ఆనంద నిలయంలో అందరూ నవ్వుకుంటే ఇంకా బాగుంటుంది కదూ ఒక్కసారి చదవండి అన్దరూ నవ్వండి                                      

నలుగురు  వ్యక్తులు ఒకచోట కలిస్తారు. వారిలో  రోజు కొకరు ఒక సమస్య చెపుతారు. ఆ సమస్యకు మిగతా ముగ్గురుకి  నవ్వు వచ్చే విధముగా హాస్య విషయాలు తెలియపర్చాలి  నాల్గవాడికి నచ్చే విధముగా ఉండాలి. అవి ధర్మ భద్దముగా ఉండాలి 

సందర్భం ఏదైనా తీసుకొవచ్చు ఇందులో నిభందనలు ఏమి ఉండవు

1. అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి  
మొదటి వ్యక్తి : నేను స్కూల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )
                   : 
టీచర్ : అరవ  కండి నిశ్శబ్దం ఉండండి పిల్లలు 
పిల్లలు :  అరవ కుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి, అంటూ 
            తప్పుకోండి టీచర్  మేమంతా బయటకు వెళ్తాం,
               మీరు  నిశ్శబ్దంగా  నోటి మీద వేలేసుకొని కూర్చోండి    
            ఏమంటున్నారు అంటూ ఒక్కసారి టీ చర అరిచింది 

            నిశబ్దం అంటూ నోటి మీద  వేలు వేసుకొని బయటకు వెళ్లారు 
            నోరు తెరుచు కొని చూస్తున్నది  టీచర్  
               అందరు ఒక్కటే నవ్వులు .......... 

రెండవ వ్యక్తీ : నేను స్కూ ల్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా  (ఓ .కె )
  పిల్లలు :  అరవకుండా నిశ్శబ్దం  ఉండాలాంటె ఏంచేయాలి అని ఆడి గారు కదా టీచర్ 
  టీచర్ :          నోటి మీద వెలు చూపి మాట్లాడలేదు         
పిల్లవాడు :       అద్యక్షా అద్యక్షా అని అరిచాడు ఒక పిల్లవాడు  
   టీచర్ :         నోటి మీద వేలుచూపి మాట్లాడలేదు  
పక్కపిల్లవాడు : అరచిన వ్యక్తిని మరొకరు గట్టిగా నోరు మూసాడు 
మరోపిల్లవాడు : ఇప్పుడు నిశ్శబ్దం వహిస్తే వాడు చస్తాడు టీచర్
టీచర్ :             నోటి మీద చేయి తీయరా  అని గట్టిగా అరిచింది
పిల్లవాడు :        అయితే మాట్లాడ వచ్చా  టీచర్ 
                       నోరు తెరుచు కున్నది టీచర్  
                       అందరూ  ఒక్కటే నవ్వులు ............. 

మూడవ వ్యక్తి : నేను ఇంట్లో జరిగే సంఘటన గురించి తెలియపరుస్తా 
 శ్రీమతి  : ఏమిటండి  ఆ చెవులకు పెట్టుకున్నారు, 
నేచేప్పేది కాస్త వినండి    
 భర్త   :     నోరెత్త కుండా చెప్పినది చెప్పినట్లు చేయాలి కదా,  ఈ మైకులో మాట్లాడు ,నేను మాట్లాడుతా ఎవరికీ వినబడదు. 
 భార్య :    గట్టిగా మాట్లాడింది అంతే  

 భర్త   :    అప్పుడు నానోరు నిశ్శబ్దం, ఇప్పుడు నాచెవులు కుడా నిశ్శబ్దం వహించాయి 
 భార్య :        ఆ మరేం నష్టం లేదు ............  
                   ఆ అంటూ   నోరు తెరుచాడు భర్త ................ 
                       అందరూ  ఒక్కటే నవ్వులు ............... 
                                                                ఇంకా ఉంది                      .........................   (2)