25, సెప్టెంబర్ 2015, శుక్రవారం

పాంజలి ప్రభ - ఇది కధ కాదు - అందంద పారవశ్యం -13ఓం శ్రీరాం ఓం శ్రీరాం  ఓం శ్రీ రాం
పాంజలి ప్రభ - ఇది కధ కాదు - అందంద పారవశ్యం -13

,
 సర్వేజనా సుఖోనోభవంతు 

మానవులకు ఇరువురు కలయుట ఎంత ముఖ్యమో, హ్రుదయాలు వేదనదగ్గేందుకు, ఆనందం పొందేందుకు   నవ్వుతూ నవ్విస్తూ సాగే జీవితమే  నిజమైన ఆనంద పారవశ్యం
నేను వ్రాసిన భావ కవిత్వాన్ని చదిని ఆనంద పారవశ్యంలో 
మునిగి తేలుతారని నా చిన్ని ఆశ 

మబ్బులు మారినట్లు మనసును మార్చుకోలేను 
మనసును వేధించే చేతకానిదానిలో వేలు పెట్టలేను 
 జిహ్వాచాపల్యానికి,  ప్రశాంతతకు ప్రయత్నం చేస్తున్నాను 
హనుమంతుడు మనోధైర్యాన్నిస్తున్నాడు నేను వ్రాస్తున్నాను 

మనిషికి నవ్వే ఆరోప్రాణం 
నవ్వు లేని జీవితం శూణ్యం
నవ్వులుపాలు అవటం సహజం 
నవ్వి నవ్వించి బ్రతకటమే మార్గం

నువ్వు నవ్వు - నవ్వే నువ్వు
 నవ్వు ఇవ్వు  - పువ్వు ఇవ్వు
నవ్వే  పువ్వు  - పువ్వే నవ్వు
నీనా నవ్వు     -  నా నీనవ్వు

వయసు రువ్వు  -  ప్రేమ రువ్వు
జిలిబిలి  నవ్వు  - గజిబిజి నవ్వు
చిదిమిన నవ్వు - పొదిగిన నవ్వు
అనుభూతి నవ్వు - కొపభీతి నవ్వు

నవ్వు నరజాతికి వరం - నవ్వు మనిషికి సంబరం
ప్రాణికి భోజనం అవసరం - నవ్వితే ఇంకా అవసరం
శరీరానికి నవ్వు అవసరం - ఆరోగ్యానికి నవ్వే అవసరం
ప్రమసాఫల్యానని నవ్వే వరం - సమతుల్యానికి నవ్వే ఆయుధం

నవ్వుతూ భోజనం చేయలేము - భోజనం చేసాక నవ్వ లేము
నవ్వే జీర్ణమయ్యే సాత్వికాహారము - నవ్వే మనసుకు ప్రసన్న వదము
నవ్వు పై  ఉండు గుణాల ప్రభావము - సాత్విక నవ్వు ఆనందమయము
తమోగుణ నవ్వు దానవత్వము -  రజోగుణ నవ్వు లోభి తనము 

బాల్యదశ నవ్వు - ఆనందాల హరివిల్లు
యవ్వన దశ నవ్వు - ప్రేమరాగాల విల్లు
కౌమార దశ నవ్వు  - సంసారినవ్వుల విల్లు
వార్ధక్య దశ నవ్వు  - ఆద్యాత్మిక సాన విల్లు        

శృతి మించిన హాస్యం, శృతి మించిన భోజనం అనర్ధం
శృ తి మించిన నిద్ర, శృతి మించిన మేలుకవ నిషేధం
శృతి మించని ఆచారం, శ్రుతి మించకుండా సృష్టికి ఆధారం  
శృతి మించని ఆదాత్మికం, శృతి మించని ప్రేమ అవసరం

శరీర అవసరాలకు నవ్వు - మనసు కోరికలకు నవ్వు
అద్దములపై మోము నవ్వు - సరసములకు చిరు నవ్వు
మగువ మరిపించే నవ్వు  - మగనిని మేరిపింపచేసే నవ్వు
పోరి గెలిచిన వాడి నవ్వు - కండ్ల మెరుపులు చూపే నవ్వు

హృదయ తలపులకు పూచే ఆహ్లాదపు నవ్వు 
కడుపులోవున్న దు:క్కాన్ని తొలగించే నవ్వు
ప్రేమతో మనస్సంతాపమును తొలగించే నవ్వు
లక్ష్య సాదనానికి శ్రమశక్తి తెలియకుండా నవ్వు

యమబటులు వచ్చినప్పుడు ఒకవ్యక్తి నవ్వులు

పచ్చి గయ్యాళి పతిని నేను - నరక హింసలు నన్నేమి నవ్వించ లేవు
పచ్చి వ్యభిచారి పతిని నేను - సూటిపోటి మాటలు నన్నేమి నవ్వించ లేవు
భార్య దరిచేరని పతిని నేను - కష్టాలు నన్నేమి నవ్వించ లేవు
గుండె నిబ్బరమున్న వ్యక్తిని నేను - నా ఆత్మను పట్టికెల్లి నవ్వించలేరు మీరు

నవ్వలు కానరావు జంతువుల్ - వెకిలి వేషాలతో నరుడి  నవ్వులు 
ఎక్కిరిమ్పే తెలియని జంతువుల్ - ఎక్కిరిమ్పుతో నరుడి నవ్వులు
ధర్మము  తెలియని జంతువుల్ - ధర్మము తెలిసిన నరుడి నవ్వులు
చికిత్స తెలియని జంతువుల్ -  చికిత్స తెలిసిన నరుడి నవ్వులు  

కొమ్మ రెమ్మ కలుసు కుంటే నవ్వే 
కోడి దూడలు ఎగురు తుంటే నవ్వే
ఊరి కాలవలో జలకాలు ఆడుతుంటే నవ్వే 
ఊరి చావడి వద్ద మాట్లాడు తుంటే నవ్వే 

పులకరించే పుడమి తల్లికి నవ్వే
పురిటి నెప్పులు భరిస్తూ వున్నానవ్వే 
పుర ప్రముఖుల కోర్కె తీర్చు తున్న నవ్వే 
పున్నమి వెన్నెల లాంటి నిన్ను చూస్తె నవ్వే


అందుకే  నవ్వుతూ నవ్విస్తూ బ్రతుకు

నవ్వే నవయవ్వన యుక్తం 
నవ్వే నిత్య యవ్వని యుక్తం 
నవ్వే నిర్మలత్వానికి చిహ్నం 
నవ్వే బుద్ది జీవికి మార్గం

నవ్వేతే దొరికేది ప్రశాంత చిత్తం 
నవ్విస్తే దొరికేది స్నేహ హస్తం
 నవ్వుతూ పలకరిస్తే ప్రేమ తత్త్వం
నవ్వుతూ బ్రతకటం జీవికి మార్గం 

నవ్వునాలుగు విధాల చేటు అంటుంది భూగోళం 
నవ్వ లేని వారు బ్రతుకు వ్యర్ధం అంటుంది భూగోళం
నవ్వుతూ పలకరిస్తే అపార్ధం అంటుంది భూగోళం
నవ్వుతూ భాష్పాలు రాలితే ఏడుపు అంటుంది భూగోళం

నవ్వే నడమంత్రపు సిరికి ఆధారం 
నవ్వే నవ నవ రోగాలకు తార్కాణం 
నవ్వే కుటుంబ కలహాల కురుక్షేత్రం
నవ్వులే కుటుంబ సుఖాలకు మార్గం 

నవ్వుతూ నవిస్తూ బ్రతకడం 
నవ్వుతూ మానవత్వాన్ని బ్రతికించడం 
నవ్వుతూ నలుగురిని ఆనంద పరచడం 
నవ్వుతూ మహామనుష్యులుగా జీవిద్దాం

 నవ్వులపాలు-కాకుండా-జీవించు - నవ్వుతూ-నవ్వించి-బ్రతుకు-సాగించు

                                        

మందు అనే షుగర్ తగ్గించు -  వ్యాధికి దూరంగా ఉండు 

అక్కరకు వచ్చే సంపద ఎంత ఉన్న
వర్తమానానికి వర్తించే వైభవమున్న
పంచభక్ష పరమాన్నాలు అందుబాటులో ఉన్న 
షుగర్ వ్యాధి ఉన్నవాడు కడుపునిండా తెనలేడన్న

అనురాగపు కబురు కొందరికి తీపి
చేదు కబురు షుగర్ ఉన్నవారికి తీపి
చేదు కాకర రసం షుగర్ ఉన్న వారికీ  తీపి
వారసత్వముగా వచ్చే షుగర్ వ్యాధీ చాలా తీపి

డాక్టర్లు చెపుతారు తీపి ఎక్కువ తినవద్దని
వారసత్వపు అంపశయ్య అవుతుందని
శరీరమ్లొ చేరి నెమ్మదిగా విస్పోటనం అవుతుందని
క్రమంగా తగ్గుతున్న కంటి చూపె దానకి సాక్షి అని

గడియారము ముళ్ళు తిరిగినట్లు, 
జీవిత కాలము మందులు వాడుతూ ఉండు
అద్దంలో చూస్తె మచ్చలు కనబడినట్లు,  
షుగర్ తిన్న చిన్నరోగం తగ్గ కుండు
సూర్యుడు నీడ  కదులు చున్నట్లు, 
 రక్తంలో షుగర్ కలసి త్రిప్పుచు  ఉండు

నడక,వ్యయామము, షుగర్ కు 
నిశ్శబ్ద వైద్యమని రుషులు  చెప్పి ఉండు
షుగర్ ఉన్న వారికి జిహ్ఫచాపల్యం 
ఎక్కువ దాని నుండి జాగర్త  పడు
భోజనములో, మధురలో తీపి లేకుండగా
 ఎప్పుడు జాగర్త పడుతూ ఉండు
షుగర్ చేరితే చిన్న పుండు తగ్గక అంగ వికులుడుగా
 కాకుండా జాగర్త  పడు
షుగర్ మందు వాడకపోతే అనారోగ్యుడై
 మనసు విరిగి చివరి దశ చూడాల్సి ఉండు
ఇంకా ఉంది   .........