ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం -14
సర్వేజనాసుఖినోభవంతు
నాలో ఆలోచన రూపం దాల్చకమునుపే,
నా మదిని చదవడం ఎలా తెలుసు నీకూ?
నా గుండెలోని అలజడిలో,
కలలు తేలుతూ ఉండగానే,
ఆ కలలు చదివేస్తావెలా నువ్వు?
విచ్చుకున్న చిరునవ్వుల మాటున దాగున్న బాధను
పసిగట్తేస్తావెలా నువ్వు ?
మౌనంలో దొర్లిన క్షణాలలో
నా మాటలన్నీ ఎలా వింటావు ?
నీ గుండెపై తల వాల్చగానే
అమ్మని ఎలా మరిపిస్తావు నువ్వు?
బెట్టు చేసే అల్లరి నన్ను చూసి
నన్నలా ఎలా మురుస్తావో...
మూడుముళ్ల తో నన్ను ముడేసి,
జన్మజన్మల బంధాన్ని ఏడడుగులంత దగ్గిర చేసి ,
నీ ఆత్మలో నన్ను కలిపేసి,
నాతిచరామి అని నీ నా పాదాలను నీ పాదాలపై మోసి ,
నడక నీవై నన్ను నడిపిస్తావా ?
అన్నీ నీవై అంతా నీవై నేనే నీవై
ఈ జీవితమంతా నీ గుండెగూటిలో నిశ్చింతగా గడీపేస్తా
నా చల్లదనం నీ వెచ్చదనం ఒకటవ్వాలి
నా వెన్నెలలో నీ వేడి సెగలు కలవాలి
నా చల్లని చీకటిలొ నీ వెలుగు కిరణం వాలాలి
నా అస్తమయమే నీ ఉషోదయం,
నీ అస్తమయమే నా ఉషోదయం అవ్వాలి
ఇదే ఆనంద పారవశ్యం ఒకరికొకరు
నా భావనలో దేవుని మాటలు
భందానికి అనురక్తివై
ప్రభందానికి ప్రవక్తవై
ధర్మానికి మర్గానివై
మనోధైర్యానికి మూర్తివై
శాంతికి మూలకారకుడవై
విశేషిత యుక్తి పరుడవై
మాతా పిత్రు ఋణ భద్దుడవై
కాల ప్రకృతికి అతీతుడవై
మంచు తుమ్మెరులు పడగానే
కలువ సిగ్గుతో కులికి నట్లు
వెన్నలమ్మ చేరగానే
మనసు పులకరించినట్లు
పాప నవ్వు చూడగానే
హృదయం ద్రవించి నట్లు
అమాయకులను చూడగానే
పసిమి వయసు గుర్తుకొచ్చినట్లు
పడచు గాలి సోకగానే
పవిత్ర హృదయం ద్రవించినట్లు
నేనున్నానని మన్సుకు తాకగానే
పవిత్రుడుగా మారినట్లు
పరుష పదాలు పెదవి దాటించకు
మంచి మాటలు మనసులో ఉంచుకోకు
మంచి చెడుల మద్య నలుగకు
నలుగురికి ససహాయం చేసి బ్రతుకు
పూలగుత్తిలొ నీవొక గుత్తివి
కాని ముళ్ళ పొదకు ఎలా చిక్కితివి
పైన ముళ్ళు తీయగలను,
లోన ముళ్ళు తీయుట ఎట్లు
బ్రతుకు తెరువు కోసం నటన
బానిసగా బ్రతకటం ఇష్టం లేక నటన
కన్న బిడ్డలను చదివిన్చుకోవటానికి నటన
అందుకే నా నటనే కొందరికి దీపమ్
మనసు నలిగింది - వయసు చిందింది
కాలం కళ్ళు మూసుకుంది - ప్రాణానికి దారైంది
మూర్ఖముగా నమ్మవు - జీవించు తప్పేమైంది
కన్నీళ్ళు కార్చట స్త్రీ కి ఆయధం
కన్నీళ్ళు పెట్టించట స్త్రీ కి మరో ఆయుధం
ఏదైనా స్త్రీల కన్నీరుకు కరగని వారుండరని తధ్యం
నింగిలో మెరిసే తార - నటనతో మురిపించే తార
గాలిలో తార - మేఘం రా
మేఘం లో తార - మెరుపు రా
పృధ్వి లో తార - సువర్ణం రా
నింగిలో తార - హరివిల్లు రా
పూలలో తార - తావి రా
చెట్లలో తార - మానురా
పక్షులలో తార - గ్రద్ద రా
మట్టి పైన తార - నీడ రా
మహాత్ముల తార - సూక్తి రా
సన్మార్గుల తార -శక్తి రా
దుర్మారుగుల తార - చట్టం రా
ప్రసరించు తార - క్రాన్తి రా
బ్రతుకుకు తార - గుణం రా
స్నేహానికి తార - ప్రాణం రా
యవ్వనానికి తార - పెళ్లి రా
పెళ్లి కి తార - శోభనం రా
శాంతానికి తార - తల్లిరా
ధైర్యానికి తార - తండ్రి రా
సంఘానికి తార - గురువు రా
ప్రపంచానికి తార - భాష రా
అర్ధానికి తర - రామ రా
అనర్ధానికి తార - యమ రా
అపార్దానికి తార - అనుమానం రా
ఆరోగ్యానికి తార - మందు రా
పదాలతో పరిచయం పెంచుకుంటున్నా...
అర్ధాలు తెలుసుకోవాలంటే
పదాలు గుర్తుకు రావటం లేదు
అయినా పదాల పదనిసలతో నలిగి పోతున్నా ..
నిన్ను ఓదార్చడం తేలికే...
నీ ప్రేమను సఫలం చేసేందుకు
నా జీవితమ్ సరిపోతుంది
లేదో అనుమానంగా ఉన్నది
పర్యావరణమంటే...
మనసుకు ఆహ్లదపరిచేది
ప్రేమతో మనసును దోచేది
మృగాలకు రక్షణగా ఉండేది
ఆనందాల ఊయలలూగుతునే ఉన్నా...
మనసు కల్లోలమై వికసిన్చ లేకున్నా ...
నాకుతెలుసు నా భవిషత్తు నిండుసున్నా ....
ఎదిఎమైన పపంచాన్ని జయించాలని ఆశతో ఉన్నా ...
ఇష్టంగానే ఆరగిస్తున్నా
కష్టం గానే పనిచేస్తున్నా
శాంతంగానే జీవిన్చాలనుకున్నా
ఎవరేమనుకున్నా నా దారి మర్చుకోలేకున్నా
నిరంతర చదువరిని . .. కాని ఏమి గుర్తుకు రావు
నిరంతరం మాటకారిని ... కాని అడిగినవి చెప్పటం రాదు
నిరంతరం ఉపకారిని .... ఏమి ఆశించకుండా జీవించటం రాదు
నిరంతరం అవకాస వాదిని ... బ్రతికి బ్రతికించు కోక తప్పదు
చిగురాకల్లే ఒణుకుతున్నా.. .వాన ఎప్పుడు తగ్గుతుందా అని
వత్తిడికి నలిగి పోతున్నా ... వత్తిడి లేని ప్రేదేశం లేదని
హృదయం అర్పిస్తున్నా ..... ఎవరున్న బుద్ధి మారదని
కాలాన్ని బట్టి బ్రతుకుతున్నా .... ఎదురుతిరిగి బ్రతకలేనని
అనుభూతులపర్వమే నా జీవితం.. ...
ఆశయాల నిలయమే మా సంసారం....
ఆనందంగా జీవించటమే మా లక్ష్యం...
అందరినీ ఆడుకోవటమే మా ధ్యేయం ...
శివమెత్తి పోతావనుకున్నా ...
నేను చేసిన దుర్మార్గానికి ...
సుతిమెత్తగా పలకరిస్తున్నా వేమన్నా . ..
కాలంతో మరావని అనుకుంటున్నా ....
కాగితమే నీ నుదురు ....
మానసికమే నీ పొగరు ..
కనిపిస్తావు ఎప్పుడు కంగారు ....
అందుకే నీకు పెరుగుతుంది షుగరు ...
జీవించా లంతే - ప్రాణాన్ని గుప్పెట పట్టి
భరించా లంతే - మూర్ఖత్వాన్ని ప్రక్కకు నెట్టి
కరుణించా లంతే - మానవులగూ పుట్టాము కాబట్టి
ఎదురించ లేమంతే - వనితలు అందరికి లోకువ కాబట్టి
మౌనం పిలిచింది - ఎట్లాగా అని ఆలోచిస్తున్నావా
ప్రకృతి పలికింది - ఏవిదముగా అని ఆలోచిస్తున్నావా
ప్రేమ పిలిచింది - ప్రేమ ఎక్కడుందా అని వెతుకుతున్నవా
కాలం రమ్మంది - మృత్యువుకోసం ధైర్యంగా ఉన్నావా
*మేఘాల కుండను ధారగా పోసి *
*పుడమి తల్లి పులకరింప చేసి *
*మేఘగర్జనతో నేనున్నాని గుర్తు చేసి*
*మెరుపులా మేరిసి మాకు కనిపించావు*
*కడుపుచల్ల కదలనీక కాచి బ్రోచు*
*అగ్నితేజముతో ప్రజ్వలించి మము బ్రోచు *
*అనంత వాయువుల మద్య మమ్ము రక్షించు *
*అకాశమా భారత క్షేత్రాలను కరుణించు *
ఉషోదయ వేళ, గొట్టము నీరు వచ్చు వేళ
బడుగు జీవులు స్నాన మాడు వేళ
వాయసమా ఎందుకు మాపై ఎగురుతున్నావు ఈవెళ
మాకే నీరు లేవు రాళ్ళు తెచ్చి ఇందులోవేయకు
వాయసమా తీర్చలేము నీ దాహం ఆకలి
ఆనాడు సీతమ్మ స్తనం గాయ పరిచావు వనస్థలి
బ్రహ్మా స్త్రమునుండి తప్పించుకొనుటకు కన్నేబలి
పితృదేవతలకు పిండ ప్రదానాలు తగ్గినా లోగిలి
నిర్మానుషంగా ఉన్న ఇది ఒక చెత్త కూపం
దొంగలకు జూదగాల్లకు ఇది నివాసం
కాలుష్యంతో మగ్గుతున్న ఇది సరోవరం
ఎప్పటికి మారును ఆకలి దప్పుల ఆవేశం
నాది నాదనేది లదు కాని భయం
నా గమ్యం ఎటో తెలీదు కాని భయం
నా భర్త దగ్గరికి పోవాలంటేనే భయం
అందుకే మనోధైర్యాన్ని సాయమడిగా..
ఇంకా ఉంది ......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి