6, సెప్టెంబర్ 2015, ఆదివారం

ప్రాంజలి ప్రభ -ఆనంద పారవశ్యం-4 (బాహుబలి)

ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - బాహుబలి -2
Baahubali
సర్వేజనా సుఖోనోభవంతు

ఇప్పుడు నేను బాహుబలి తెలుగువారు తీసిన చిత్రం గురించి వ్రాద్దా మను కున్నాను " నిన్న దేవగిరి సూపర్ ఫాష్ట్  ట్రైన్లో హైదరాబాద్ నుండి నిజాంబాద్ తిరిగి వచ్చేటప్పుడు కొన్ని సంఘటనలను నేను విన్నాను.  హిందీ లోనే బాహుబలి చిత్రం అశ్చాహై, బహుత్ అశ్చాహై, అన్న మాటలు విన్న ప్రక్కన ఉన్న వ్యక్తి  ఇది తెలుగు చిత్రం కేవలము మీరు చూసేది డబ్బింగ్ ఒరిజినల్ తెలుగు చూడండి ఇంకా బాగుంటుంది.  అన్నమాటలు ఒకవైపు నుంచి, మరోవైపునుంచి వేరోకతను ఆ సినమాలో ఏముంది ఏమీలేదు, పిచ్చి జనం ఒక గొర్రె ఎటు పొతే మిగతా గొర్రెలు ఆటే పోతాయి, జవాబు లేని ప్రశ్న పెట్టి వదిలాడు అది సినమానా?

అప్పుడే నాలో ఆలోచన వచ్చింది ఆనంద పారవశ్యం మానవులు పొందటానికి సినమా కూడ ఒక భాగము అని భావించి   నా అభిప్రాయమును కుడా తెలుపుట  తప్పులేదని భావింఛి నేను నిర్వహించే ప్రాంజలి ప్రభలో పొందు పరుస్తున్నాను, ఇది కేవలము నా అభిప్రాయము మాత్రమే బాహుబలి పార్ట్ -2 (పార్ట్ -2 కధను ఇందు పొందు పరచాలని బావిస్తున్నాను మొదటి పార్ట్ తీసినవారికి ప్రతిఒక్కరికి నా ధన్య వాదములు) ఇక చదవండి 

అది ఒక ప్రకృతి ఆశ్రమం అక్కడ మూగ జీవులకు రక్షణ కల్పిస్తూ మల్లాప్రగడ రామకృష్ణ గారు ప్రతిరోజూ  పారవశ్యం లో మునిగి వాటి రక్షణ లోనే అనందం పొందుతూ ఉన్నారు. అనుకోని విధముగా పుత్రికల  ప్రోద్బలము వలన బాహుబలి సినమా చూడు నాన్న  అన్నమాటలకు కట్టుబడి చాలారోజులు తర్వాత సినమా చూడటం జరిగింది. 
ఆశ్రమమునకు తిరిగి వచ్చిన తర్వాత పత్రికా విలేఖరులు నలుగురు వచ్చి బాహుబలి చిత్రము గురించి మీ అభిప్రాయము తెలుపమని కోరారు. 
ఒక్క పదినిముషాల్లో నేను తిరిగి వస్తా "మహాబలి, బాహుబలి రామ దూత అయిన హనుమంతున్నీ ప్రార్ధించి  మీ ప్రశ్నలకు సమాదానాలు నాకు తెలిసినవి తెలియపరుస్తాను,  మీరందరూ తేనీరు తీసుకోండి, కాస్త విశ్రాంతి తీసు కోండి -  ఆ ఇప్పుడు చెప్పండి 

1. బాహుబలి సినమా మీకు నచ్చిందా ?
   మీ ప్రశ్నకు నేను సమాధానము చెప్పే ముందు నేను మూడు చిత్రములు మీకు చుపుతాను ఆ చిత్రములను చూసి మీరు ముందు చెప్పండి, మీరు ప్రపంచాన్ని ప్రతిరోజూ చూస్తు ఉంటారు, ప్రపంచ వార్తలను సేకరిస్తున్నారు, దానిలో ఉన్న మంచిని వర్ణిస్తారు, చెడును వర్ణిస్తారు అది మీకే  సొంతం మీ అబిప్రాయాలు నిర్భయముగా చెప్పగలరు. 
1. ఈ బొమ్మలో మీకు ఏమి కనిపిస్తుంది ? 
1వ వాడు పిచ్చి గీతలు తప్ప  ఎమీలేదు ఇది చిత్రమా ?
2వ వాడు అర్ధం కావటం లేదు ఇది చిత్రమా ?
3వ వాడు ఈ చిత్రము అద్బుతముగా ఉన్నది ప్రజలకు ఎ సందేశము లేదు ఇది చిత్రమా ? 
4వ వాడు ఈ చిత్రము బాగుంది విమర్సిమ్చే శక్తి నాకు లేదు, వేరొకరిని చూడమనే  దమ్ము నాకు లేదు ఇది చిత్రమా ?

మీ నలుగురి అభిప్రాయాలను నేను ఎకీభవిస్తున్నాను, నా అభిప్రాయము చెపుతా వినండి ఆ పిచ్చి గీతలు వివిధ మతాలకు చెందిన ప్రజలు వారు ఒకరి కొకరు కలసి ఉంటారు, కలసి తిరుగుతారు నా మతము గొప్పదని వాదించు కుంటారు, మరల కలుసు కుంటారు, అనేక ఆర్ధిక సమస్యలతో సతమత మావుతూ ఉంటారు, అందరూ కుటుంబ సమేతముగా వచ్చి సినమ చూస్తారు ఇది వారి మద్య ఉన్న ఐక్యత.  ఆ మద్యలో ఉన్న చుక్కను  ఎవ్వరూ గమనించరు ఆ చుక్కను కూడా మీరు గమనించ లేదు, అ చుక్క లాంటిదే సినమా, నిత్యమూ వాదనలో కలసి మెలిసి తిరిగే వారికి మనసు ఉల్లాసము ఉస్చాహము కలిగించేది సినమా, ఇక మీ సినమా గురించి చెప్పమంటారా అని అడిగారు కదా ఎంతో కష్టపడి  కళాకారులందరూ కలసి 3 సంవస్చరాలు నిర్వి రామముగా తెలుగువారు  శ్రమించిన ఫలితమే పలు బాషలలో తర్జమా చేసి ధైర్యముగా ప్రజలకు ఆనందము కలిగిస్తున్నది ఏంతో సంతోషముగా ఉన్నది.  అదే న మొదటి ఉద్దేశ్యం.  

2వ చిత్రము చూపించారు దీనిపై మీ అభిప్రాయము చెప్పండి ?
మొదటి వాడు: అద్భుతముగా ఉన్నది ఆనందం పొందే  చిత్రం ? 
2వ వాడు:  ఇది ఒక వర్గము వారికి నచ్చేది మాత్రమే  నాకనిపించిన చిత్రం  3వ వాడు: పగలు చూస్తే రాత్రి కలలో వస్తుందంటారుట అలా ఉన్నది ఈ చిత్రము. 
4వ వాడు:  అందం కావాలనుకున్న వారికి మొదటి బాగము లా ఉన్నది. 

 నా భిప్రాయము చెపుతా వినండి : వికసించిన పువ్వును చూస్తే  తుమ్మెదకు చేరాలని పిస్తుంది,  మనసు వికారముగా ఉన్నవానికి రతీదేవి ప్రయత్నం ఫలించ లేనట్లున్నది.  ఏది చూసిన మనసులో ముందు ఒక భయము ఆవహిస్తుంది రాత్రి కలలో వచ్చినట్లు భావించటం జరుగు తుంది, కొందరు మొఖం చూసి పరవిసిస్తారు, మరికొందరు అభినయనాన్ని చూసి పరవసిస్తారు, మరికొందరు పరకాయ ప్రవేశం లా మారి ఆనందం  పొందుతారు. 
నేను చూపిన చిత్రము లో ఉన్న సుందర లావణ్యను గురించి పలు విధములుగా మీరె చెప్పితే నేను ఎట్లా చెప్పగలను అను కుంటున్నారా పట్టుదల దీక్ష ఉన్నవారి ప్రయత్నాలు ఎప్పుడు వమ్ము కావు, అవే ఈ చిత్రానికి విజయానికి మార్గాలు.  నా రెండవ ఉద్దేశ్యం 

మూడవ చిత్రాన్నిమీకు చూపుతున్నాను, మీ నలుగురు ఖచ్చితమైన  అభిప్రాయాలులు తెలుపండి. 
మెదతివాడు : చూడ లేనంత వెలుగు కనిపిస్తున్నది, ఇది చిత్రమని ఎవరంటారు ? 
2వ వాడు : దూరంగ ఉంటే ఏదైనా అందంగా కనిపిస్తుంది, దగ్గరనుండి చూస్తెగా దాని నిజస్వరూపమ్ తెలుస్తుంది ?
3వ వాడు : పైన చూపించేది ఒక్కటి లోన కనిపించేది వేరొకటి ఇది చిత్రమే కాదు ?
4వ వాడు : కష్టానికి తగ్గ ఫలితము గల చిత్రమని అనిపిస్తున్నది. 

ఇప్పటిదాకా మీ అభిప్రాయాలు చెప్పారు నా అభి ప్రాయం చెపుతున్నా ఆలకించండి. ఈ చిత్రంలో తెల్లగా కనిపించేది ఆకాశము, ఈ అకాశము ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది, అది "మన సినమాకు కధా, స్క్రిప్టు "  మేఘాల్లాంటి దర్శకులు ఇందులో మీకు కనిపించినది,  అందులో ఒక మేఘం దర్శకుడు, ఈ మేఘం వెనుక వెలుగును చూసారు కదా మీరు అది సూర్యుడు, అసూర్యుడే సినమా నిర్మాత, మేఘం లోనుంచి అమృత దారాలు సూర్యుని ప్రభావం తో భూమి పై పడుతాయి, భూమి అనేది సినమాలు చూసే ప్రజలు " వర్షపు నీరును ఉపయొగించు కునే విధానమును బట్టి దేశం బాగు పడినట్లుగా " దర్శకుని ప్రతిభను బట్టి బాక్సు ద్వారా ప్రజలకు ఆనంద పారవశ్యం  అందించటానికి భూమి పైకి వస్తుంది, దాన్ని అస్వాదిన్చేవారికి అదే అనందం. నచ్చనివారికి ఎందుకు వచ్చిందిరా బాబు, మా డబ్బు ఎందుకు డబ్బు పెట్టిన్దిరా బాబు అని గోనుకుంటూ వెళతారు కదా . 
గాలికి మేఘాలు పరుగెత్తినట్లు ఉపయోగంలేని మేఘం లా మారుతుంది. అప్పడు వెలుగు కాస్త గ్రహణం పట్టిన సూర్యుడుగా మారుతాడు ఒక్కోసారి, ఇప్పడు మాత్రం వెలుగును పంచే సూర్యుడుగా  మనం చూడటం, మన తెలుగు వారు చేసుకున్న ఇది ఒక అద్భుత విజయం, 
మూగ జీవులతో పోరాటం, ధైర్యసాహాసాలు చూపె ఆరాటం, పరవ శించె పూలు, జాలువారు ప్రవహించే నదుల ఆరాటం, హిమవత్  పర్వతం పెల్లుబుకి వచ్చే ఆరాటం, గగుర్పాటు కనిపించే, సైనిక విన్యాస పోరాటం, కన్న ప్రేమ ఆరాటం, నమ్మక ద్రోహాల, చదరంగాల పావులు కదిలనట్లుగా పోరాటం చివరిగా శృంగారం గురించి తెలిపి "నేను వ్రాద్దామను కున్న బాహుబలి చిత్రం పై నాఅభి ప్రాయమ్ ముగిస్తాను", రెండవ భాగము నిర్మాత అనుమతి లభించిన తర్వాత మీకు ప్రాంజలి ప్రభలో ఉంచుతాను. 
హేమంత ఋతువులో చలి అధికముగా ఉంటుంది, మంచు కొండల ప్రాంతములో చలి గురించి చెప్పనవసరములేదు, జాలువారు నదీ తుమ్పరులు ఉన్న ప్రాంతమైతే మనసు ఎలాఉంటుందో ఎవ్వరూ  చెప్పలేరు. పాలు, నేయి, పెరుగుతో కూడిన భోజనం, అంటి అంటని వస్త్రాలు ధరించి, కుంకుమపూవు కలిపిన గంధపుపూత అలుముకొని దృడమైన తొడలుగల యవ్వనవతుల బిగి కౌగిళ్ళలో, గాలి కుడా దూరని గదుల్లో పొందే ఆనందం ఎలా ఉంటుందో  అట్లా ఈ చిత్రం మెదటి భాగం ఆనంద పారవశ్యం లో మునిగి తేలవచ్చని నా అభిప్రాయం.పోరాటాలు బాగున్న నవ్వులులేక కొంత తలనెప్పి తెచ్చినది రెండవభాగం ఇది నా స్పందన మాత్రమే నా 3వ ఉద్దేశ్యం 

మరొక్కసారి మీరు టి తీసుకుంటారు, ఇప్పటిదాకా మీ మనసు తో  ఆడుకున్ననా నేను, మీ కాలాన్ని వ్యర్ధం చేసానా నేను, ఏమైనా తప్పు మాట్లాడితే నన్నుక్షమించండి, మీ సినమాకు సంభందించి నంతవరకు క్లుప్తముగా మాత్రమే తెలిపాను. ఇది ఆనంద పారవశ్యం లో ఒక బాగము మాత్రమే, ఇందులో పొందు పరిచినందుకు ఏమనుకోరని నేను అను కుంటున్నాను , మీకు నమస్కారములు తెలుపుతున్నాను. 
భాహుబలి ఆదరిస్తున్న ప్రజలందరికి, ఏంతో  శ్రమపడి తీసిన చిత్రానికి సంబందించిన ప్రతిఒక్కరి నా హృదయ పూర్వక అభినందనలు, 
                                                                     ఇంకా ఉంది ......              
        
                                                                                            ఇంకా ఉన్నది ......