21, సెప్టెంబర్ 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు -ఆనంద పారవశ్య0 -9

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ -ఇది కధ  కాదు- ఆనంద పారవశ్య0 -9


 సర్వేజనా సుఖినోభవంతు 

        
జ్వాలామాలా కులం భాతి విశ్వస్యాయతనం మహత్,.
 
సన్తతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం.
 
తస్యాన్తే సుషిరగం సూక్ష్మం తస్మిన్ త్సర్వం ప్రతిష్ఠతం,.
 
               తస్య మధ్యే మహా నగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః..

 

కంఠమునకు క్రింది భాగంలో, నాభికి పై భాగంలో 12 అంగుళముల 

ప్రమాణం కలిగి అధోముఖంగా, ముడుచుకున్న పద్మంలా హృదయం 

ఉన్నది. ఆ హృదయ కమలాన్ని ఆశ్రయించి, జ్వాలా సమూహంతో 

వెలుగుతూ జీవులకు ప్రధాన స్థానమై, అనేకనాడీ సమూహాలకు 

ఆలంబనయై చక్కగా విరిసిన పద్మాన్ని బోలిన హృదయాగ్రభాగంలో 

సూక్ష్మమైన కమలం ఒకటి ఉన్నది. దానిలో సర్వం ప్రతిష్ఠితమై 

ఉన్నాయి. దాని మధ్యలో అంతటా జ్వాలలతో అగ్నిదేవుడున్నాడు. అదే

జఠరాగ్ని.
 
దేవుడ్ని మనలోనే పెట్టుకుని, గుర్తించక ఎక్కడో ఉన్నాడని, ఎక్కడెక్కడో 

వెదుకుతున్నాం. చంకలో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంత వెదకటమంటే 

మరేం లేదు...ఇదే.


ఉదరానికి పై భాగాన చివరి ప్రక్కటెముకలు కలిసే స్థా నం న " సింహిని " అను గ్రంధి యందు నిబిడీ కృతమై యున్న "ధారణా " అనే శక్తి జాగృతమై యుంటుంది. మనం తినే సమస్త పదార్ధాలను ఒకే చోట చేర్చి దానిలో ఉన్న శక్తి ని శరీరమంతా అందించి మిగిలినది ప్లీహము ద్వారా బయటకు పమ్పుతుంది. ఇది  ఎలా జారుతుంది అనే సందేహము రావచ్చు ఒక్క సారి మన ఖాలీ కడుపున నీరు నింపి ఒక్క సారి నడుమును కదిలిస్తే ఉదరము లో ఉన్న వ న్నీ కూడా కుండలో నీల్లుకదిలి నట్లు గా కదులు తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యముగా గర్భినీ స్త్రీలకు గ్ఫర్భములొ ఏదో జీవి పెర్గుతున్నదని  ఖచ్చితంగా తెలుస్తుంది . దాన్ని హృదయంలో దేవుడు నివసిస్తాడు అని అంటారు . అది పది నెలలు నిండిన నెప్పులు కలిపించి సృష్టి జరిగి భూమి మీదకు కర్మాను సారము జీవించాలని జీవుడు  ఉద్భవిస్తాడు. ఆ బిడ్డను మన శక్తిని ధారపోసి వాని ఉన్నతునిగా మార్చుటకు పయత్నం చేస్తాము.  దీనికి కారణము ఉదరములో అందము పహ్లదీక్రుతమై బీజముగా మారుతున్నది అని మనకు తెలుస్తున్నది. ఇది  సంపర్కము అని అంటారు రెండు హృదయాలు పారవశ్యముతో పరవశించి అంగాన్ని యోనిలో ప్రవేసిమ్పచేసి మాతృత్వం కోసం ఒకరు మగతనం కోసం ఓకరు పోటీ పడి పరవశించి ఆకలి తీర్చుకొవటమే నని  ఎవ్వరు చెప్ప నవసరము లేదు.  దీనికి ప్రత్యేక విద్య నవసరము లేదు, శరీర దారుడ్య ము బట్టి , ప్రక్రుతిని బట్టి, జిహ్వాచాపల్యాన్ని బట్టి,  ఒక విధమైన భందం ఏర్పడుతుంది. దీనినే  ఇరువురు కలయిక అని అంటారు. జీవితాంతము  ఒకరి కష్టాలు ఒకరు పంచుకొని జీవించాలని ఎటువంటి అరమరికలు లేకుండా ధర్మాన్ని తప్పకుండా సీలాన్ని తాకట్టు పెట్టకుండా ఉండటమే  నిజమైన ఆనందం, దానిలో ఉన్న పారవశ్యాన్ని పొందటమే సంసారం.
 తేన లోని మాధుర్యం, చేరుకులోని మాద్రుర్యం, పంచదారలో ఉన్న మాద్రుర్యం, బెల్లంలో ఉన్న మాద్రుర్యం, తన్మయత్వపు ముద్దులో ఉన్న మాధుర్యం అంతా  ఒక్కటే అయినా వాటి రుచి వేరుగా కనబడు తున్నది. అట్లే ఆనాడు పారవశ్య కలయిక కూడా అనేక విధములు పద్దతులు ఉన్నాయని మన పూర్వికులు  తెలియ పరిచారు. ఏది ఏమైనా పెళ్ళికి ముందు భార్యను గురించి పురుషుడు మరియు స్త్రీ అనేక విధములుగా ఆలోచిచుతారు, నేను పనికివస్తానా లేనా, నాలో ఏదైనా లోపమున్నదా, నన్ను నా కుటుంబాన్ని ఆదరించేవారు ఎవరు వస్తారు, నా దేహ దాహానికి తగైనవారెవరు అని కలలుకంటారు, అను కోని విధముగ ఇద్దరు ఒకటవుతారు, ఒకరికొకరు ఆశలు ఆశయాలు నేరవేర్చు కోవటానికి తహ తహ లాడుతారు ఎన్ని నెరవెర్చుకూన్న ఇంకా లోటు ఏదో ఉన్నట్లుగా భావిస్తారు. పెళ్ళికి ముందు అనేక మాటలు చెప్పి లొంగ దీసుకున్న వారు పెళ్ళైన తర్వాత  కొంగు పట్టుకొని నోరెత్తకుండా జీవనము  గడిపేవారు కొందరు, పైకి డాంభికముగా ఉండి లోపల ఏదో భయముతో ఉండే వారు కొందరు, బయట దాహం తీర్చుకోలేక  ఇంట్లో దాహం పొందలేక సత మతమై పోయే వారు కొందరు దీనికి నా భావాలను గూర్చి చిన్న భావ కవిత వ్రాస్తున్నాను
ఒకరికొకరు ఎంత సుఖపడినా ఇంకా కొందరికి అసంతృప్తి  ఉంటుంది. ఇంకా ఏదో కావాలి అని మాత్రము తగ్గదు. కోపం రావటానికి ఇది కుడా ఒక మార్గం. జిహ్వ చాపల్యాన్ని  తీర్చుకోలేని వారు జీవనమ్ దుర్భరంగా  మారుతుంది.(కుక్కలు చింపిన ఇస్తరు అని అంటారు) ఎఇది ఏమైనా ఒక్కసారి ఇది చదవండి.

కడుపు నందాకలి లేదని కొన్నాళ్ళు
ఇప్పుడు నాకు దాహం అవటం లేదని కొన్నాళ్ళు
కొత్తనీరు త్రాగింది ఇప్పుడేగా ఆగండి అని కొన్నాళ్ళు
దూరంగా ఉండాల్సిన రోజులని కొన్నాళ్లు

మనసు మనసు లో లేదని కొన్నాళ్ళు
తెలియని వ్యాధులు కమ్మాయని కొన్నాళ్ళు
భందువులున్నారు ఇప్పడు వద్దని కొన్నాళ్ళు
చన్నీటి స్థానంతో  సరిపెట్టు కోమని కొన్నాళ్ళు

మందు లొ ఉన్నవని కొన్ని నాళ్ళు
కడుపులో పెరుగుతున్నారు ఇప్పుడొద్దని కొన్నాళ్ళు
   నీప్రక్కనె నేనున్నా నని  కవించే చేరే  కొన్నాళ్ళు
మనసు మనసు కలసి సంతృప్తి పడేది కొన్నాళ్ళు

ఎన్ని నాళ్ళు  వెచిఉన్న రుచి మారాదు, ఎన్ని సార్లు  పొందినా ఇంకా పొందాలి అనిపించేది ఇదే ఎప్పటికప్పుడు కొత్త నీరు చేరితే నది పరవ శించి నట్లు ఇంటి ఇల్లాలు పరవశిస్తూ ఉంటె యింటిలో ఎప్పుడు స్వర్గమే, వారికి వేరే స్వర్గము అవసరము లేదు దానినే ధారణ శక్తి అని అంటారు ఇది అందరిలో ఉంటుంది. ఒకరికొకరు ఆరాధించు క్కోవటంలో ఉంటుది అర్ధం చేసుకోవటంలో ఉంటుది. అర్ధం కోసం వెంపర్లాడిన  చోట అర్ధం దొరుకుతుంది  కాని సంతృప్తి ఉండదు, తృప్తి ఉన్న చోట అర్ధం లేకపోయిన సంతృప్తి ఉంటుంది దీనినే మానవుల మేలికలయక అంటారు

తాడుకు తీగ చుట్టు కున్నట్లుగా
పూలల్లొ దారం దాగి యున్నట్లుగా
స్వర్ణాభరణంలో ఆకర్షణ ఉన్నట్లుగా
ప్రకృతికి పరవశించి పూలు విచ్చుకున్నట్లుగా

కొండ జాలువారు జలాల జల్లులుగా
పరవశించి నింగిలో ఎగిరే పక్షులు లాగా
నది చేరినా కడలి పొంగు వడ్డుని దాటలేనిదిగా
గత్యంతరం లేక చీమల పుట్టల్లో పాముల్లాగా

బావిలో చిక్కిన కప్పు లాగా, నీటిలో బ్రతికే చేపల్లాగా
తల్లితండ్రుల నేర్పించిన విద్య నాధారంగా
తనయులు భాద చెంద కుండా గుట్టుగా
     తపనతో తన్మయత్వంతో పొందేది నిజమైన పారవశ్యం


                                                                                  ఇంకా ఉంది