14, సెప్టెంబర్ 2015, సోమవారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు-ఆనంద పారవశ్యం-6

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు ఆనంద పారవశ్యం-6
సర్వేజనా సుఖినోభవంతు
పరువానికి వచ్చిన పల్లె పడుచు మనసులోకోర్కలను తెలుపుకొనుటకు ఆనంద పారవశ్యముతో తనే ప్రకృతి గా భావిస్తూ పాడుతున్న నా భావ పాట 

                  
ప్రక్రుతిని రా  అను ప్రకృతిని 
నిరపరాధను రా నే ప్రకృతిని 
యమునా తటికి ఆనందంతో వచ్చితిని 
మనసు మూట కట్టి నీకోసం తెచ్చితిని 
 
కదలక నిలచిన నగముల గాంచితిని   
నింగిన కదిలెడు మబ్బులు జూచితిని  
గగనా నెగిరే పక్షుల జూచితిని 
జంట జంటలుగ పక్షులు వెళ్ళుట చూచితిని 
 ఎదలో ఏదో తీయని గుబులు గా ఉంది 
తెలియని వెలితి నాలో చేఋ తుంది  
మదుర గాణానికి తనువు ఊగుతుంది   
  పరవశించె ప్రకృతిని నేను నాకు మనసుంది 
 
నాట్య మాడు మయూరిని నేను  
కడలిని వీడని అలలే నేను  
తీయగ కూసే కోయిల నేను  
  నీలో కదిలే వూపిరిని నేను 

       
ప్రకృతి పరవ సించి ఉన్నది 
తనువూ తహతహ లాడుతుంది
తాపత్రయం తీరెదెప్పుడా అని ఉంది 
ఆనందపారవశ్యాన్ని పొందాలిని ఉంది 


ప్రక్రుతి నీవెందుకు తొందర పడతావు లోకమంతా ప్రశాంతముగా ఉందని భావించకు  పైకి కనబడే దంతా కంటి  నీళ్ళ తుడుపే,  ఎవరు చేసే పని వారు చేస్తారు,  లోకాన్ని అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు

యువతీ యువకులకు ఒక వయసు వచ్చిన తర్వాత విపరీతమైన కొర్కలు వెంబడిస్తాయి. వాటిని తట్టుకొని మనసుని నిలకడగా పెట్టుకొని విద్యనభ్యసించి ఏదైనా సాధించాలి.
ఒక తల్లి తనకూతురితో వయసుకు వచ్చి ఎగిరెగిరి పడుతుంటే నెమ్మదిగా నచ్చ చెప్పటానికి తల్లి పడే ఆవేదనను, ఆమె కూతురుకు పెళ్లి చేయాలని తపనతో పొందే ఆవేదనతో కూతుర్ని ఓదార్చే విధముగా ఒక తల్లి పాట  ఇందు పొందు పరుస్తున్నాను (వయసుకొచ్చిన పిల్లతో తల్లి లాలి పాట )

ఊగిసలాడకే కూతురా   .. నువ్వు ఉబలాట పడకే  కూతురా   
ఊగిసలాడకే కూతురా   .. నువ్వు ఉబలాట పడకే కూతురా   
వయసా  ఊసుపోలేదనో., .ఓ.. ఆశగా ఉందనో.,. ఓ.ఆత్రుతా ఎందుకె కూతురా  .
వయసా  ఊసుపోలేదనో., .ఓ.. ఆశగా ఉందనో.,. ఓ.ఆత్రుతా ఎందుకె కూతురా   .

 ఉర్రూతలూగకే కూతురా   .  .ఆ..ఆ.. ఊగిసలాడకే  కూతురా  .

నువ్వు ఉబలాట పడకే కూతురా  ..  నువ్వు ఉబలాట పడకే కూతురా   
వయసు ఉడికిన తర్వాత విలువైన పువ్వులాగా వికసించ లేవు కూతురా  
వయసుకు మించిన కోర్కల  వైపు పోవద్దు కూతురా  
 పొరపాటు చేశావో దిగజారిపోతావు.. నగుబాటు తప్పదు కూతురా  
 పెడదారి మురిపాలు.. మొదటికే మోసాలు.. చాలు నీ వేషాలు కూతురా    చాలు.. నీ వేషాలు నన్ను చేసే మోసాలు కూతురా

ఊగిసలాడకే కూతురా  .. నువ్వు ఉబలాట పడకే కూతురా  ..

 వయసు తుమ్మెదలు చెలరేగి.. తోటలో ముసిరేను.. ఎవ్వరినీ  నమ్మకే కూతురా  
 ఎవ్వరినీ నమ్మకే కూతురా .....

 చపల చిత్తం విపరీతమౌతుంది.. చలియించకే వెర్రి కూతురా 
 కపటాలు సరదాలు.. కవ్వించు సరసాలు.. కాలు జారేనేమో కూతురా 
 కాలు.. జారేనేమో కూతురా 
ఊగిసలాడకే కూతురా  .. నువ్వు ఉబలాటపడకే కూతురా 
ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ.. ఉర్రూతలూగకే కూతురా
.ఆ..ఆ.. ఊగిసలాడకే  వయసా .. నువ్వు ఉబలాటపడకే కూతురా 
అమ్మ నీ మాట ఎప్పుడైనా దాటానా, నా పట్టు దళ ఎలాంటిదో నీకు తెలియదా నేను ఎవ్వరిని భాద పెట్టనమ్మ నీవు చెప్పినట్లే వింటానమ్మ 
అని చెప్పి కూతురు బాయ్ ఫ్రెండ్ వచ్చాడమ్మ వేల్లోస్తాను అని చెప్పి మరీ వెళ్ళింది. 
అ తల్లి చుట్టప్రక్కవారికి తనకు తెలిసిన కధలు చెప్పుకుంటూ కాలక్షేపము చేస్తున్నది  

చూపులు చురకత్తులు - మనసు  దూది  పింజాలు 
మమతలు మల్లెపూవులు - ఊహలు ఉషోదయాలు
మాటలు మౌన దీపాలు  - చేతలు నల్లెరులు
జ్ఞానం జీవితానికి మార్గ0  - ఊపిరి బ్రతకటానికి మార్గ0 

ఆశలజీవితమ్ సాగదు - నడుము ఇరిగిన కాపురం నిలబడదు 
మయూరి తలపులతో పురివిప్పే - తోలరి జల్లుకు మయూరి పరవశించే
సంకల్పంలో రూపం కనబడదు - భయంలో రూపం తరుముతుంది  
వియోగానికి గుండె బరువు - సంతోషానికి గుండె తేలిక 

కాలచక్రాన్ని ఎవ్వరు ఆపలేరు 

 నిగ్రహశక్తి ఉంటె మృత్యువును ఆపగలరు

జనన మరణాలు మనచేతిలో లేవు 

 ధర్మాన్ని నడిచి సుఖంగా ఉండ లేవు  
 

కాలానికి వ్యతరేకంగా సుఖం పొందలేవు 

మృత్యవు వచ్చిన నీవు ఆపలేవు

దుష్టబుద్ధికి దారి చెరసాల 

 ధర్మ బుద్ధికి దారి ప్రేమ  మాల  


మన బలహీనతే కల - కలనిజమవటం కల్లా
 
జోలతో నిద్రకు శాంతి - అదే కావాలి ప్రతిఒక్కరికి
 
ప్రకృతికి పరవసించేది మనస్సు - మనస్సును ప్రశాంత పరిచేది కల్పన
 
నోరువిప్పితే అబద్దాల పుట్ట - అయిన కోర్టు వారికి అదే కావాలి 



                                                                                                         ఇంకా ఉంది ----

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి