24, సెప్టెంబర్ 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - ఇది కధకాదు - ఆనంద పారవశ్యం -12

ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ - ఇది కధకాదు - ఆనంద పారవశ్యం -12

సర్వేజనా సుఖినోభవంతు


యో దేవేభ్య ఆతపతి | యో దేవానాం పురోహితః |
పూర్వో యో దేవేభ్యో జాతః | నమో రుచాయ బ్రాహ్మయే | "
.
భగవంతుడు ప్రపంచంలో క్రియాశీలుడై వెలుగు తున్నాడు.
జన్మలేని వాడుగా ఉంటూనే ఆయన అనేక రూపాలలో ఉద్భవిస్తున్నాడు. ఆయన నిజ స్వరూపాన్ని మహాత్ములు చక్కగా ఎరుగుదురు
. బ్రహ్మ వంటి వారు సైతం మరీచి మొదలైన మహాత్ముల పదవిని ఆకాంక్షిస్తున్నారు.
ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, దేవతల గురువుగా భాసిస్తున్నాడో, దేవతల కంటే పూర్వమే ఉద్భవించాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.

శ్రీరామ శ్రీరామ అనరా భద్రాచలము పోదాం పదరా
గోదావరిని పూజించి భద్రాచలము వేగంగా పోదామురా
కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, రుణభాదలు తోలగునురా   
చూద్దామురా సీతారామ కళ్యాణం చూసి వద్దామురా

రంగరంగ వైభవముగా మండపాలు, అలంకారాలు ఉండునురా
ప్రభుత్వం వారు వజ్ర, వైడూర్య,రత్నాలు తలంబ్రాలుగా తెస్తారుటారా
అమ్మవారి తాళి బొట్లు మూడు చూడ ముచ్చటగా ఉండునురా
అశేష ప్రజా సమక్షంలో రాముడే సీతమ్మ మేడలో తాళి కడతాడుటారా ..... శ్రీ రామ
 

మనం కట్టిన పన్నుచే గోపన్నసీతా రాములవారికి దేవాలయము కట్టేనురా 
భద్రగిరిపై కట్టిన భాద్రాచలమే దక్షిణ అయోద్య పుర మంటారురా
కష్టాలుఒర్చి, కన్నీరుతో కట్టిన జగధబి సీతా రాములు ఆలయమురా
భద్రగిరిపై సీతా రాములు కలసిఉన్న రూపమ్ చూడ ముచ్చటరా       ..... శ్రీ రామ

రామ నామం జపం చెస్తూ ఉంటె హనుమంతుడు 

మనకు తోడు ఉండునురా
శ్రీరామదాసు చేయించిన నగలు అమ్మవారికి 

అయ్యవారికి అలంకరిస్తారుటరా
వేదమంత్రాలు చెవులారావిని, 

అమ్మవారి కల్యాణం కనులారచూసి వద్దమురా
తీర్ధప్రసాదాలు తీసుకొని, కళ్యాణ అక్షంతులు

 తలపై వేసుకుంటే పాపాలు తోలగునురా   
శ్రీమంతమైన అయోధ్యను పాలించినవాడా 
- చేతియందు ధనస్సును ధరించినవాడా 
- సీతసమెతముగా- హనుమంతునితో-ఉండువాడా
-సంసార  సముద్రాన్ని దాటించే నౌక అయినవాడా
- మాకు చేయూత నిచ్చి కాపాడుముశ్రీరామ



చంచల
ఉరుకు పరుగుల మాలక్ష్మికుచ్చువేసి,
ఉన్నచోటనె యుంచగానుచితమగునె?
ఉన్నతినియిచ్చు మాతల్లి యుర్విజనుల,
ఉండి లేదను వారింటనుండ లేదు..

తలచినప్పుడె తగుసేయ దానమగును,
దాచియుంచిన ఫలమేమి వేచియుండ,
వెంటరాదది చెదపట్టు వెగటు పుట్టు,
రెండు చేతులతోనిమ్ము మెండు నేడు..

వెలతగ్గును, వెతలనిడును,
ఇలలో తవిపాతరేయ, ఇరుకున మూల్గున్,
చలనములేనట్టిధనము,
నిలచిననీరొక్కతీరు నిక్కము గదరా..

తరతరాలకు ధనరాశి తరగదనుచు,
కూడు గుడ్డల కీయక కూడబెట్టి,
వయసు పైబడు వేళకున్ వాంఛముదిరి,
పంచకుండనెపోవుగా పండుముసలి..

చాటుగా దాచు తంటాలు నేటిచింత,
రేపటికినికాపాడమరింత చింత,
చిల్లిగవ్వైన లేకున్న చింతెలేదు,
చింతలేగద ధనలక్ష్మి చెంతజేర..

అడగనక్కరలేదు,
యాత్రుతే పడవద్దు,
ఇస్తాడు యిస్తాడు, ఇచ్చిచూడు..
ఇస్తేనె యిస్తాడు, ఇంతకింతిస్తాడు,

ఇస్తాడు ఒకసారి, ఇచ్చి చూడు..
ఇక్కడే యిస్తాడు, ఇప్పుడే యిస్తాడు,
ఇస్తాడు యిసుమంత, ఇచ్చి చూడు..
ఇలలోనె యిస్తాడు, ఇంటికొచ్చిస్తాడు,

ఇస్తాడు యికనైన, ఇచ్చి చూడు..
ఈయగలిగియు ఈయని ఇల్లు యనగ,
ఇందు సోదరికిలలోన బందిఖాన,
దోసిలేరీతినిండును మూసి యుంచ?

దాసులౌనేల? డబ్బుకు దారివిడుడు..
కోరకుమా యాదేవుని,
కోరిన ధనమిచ్చినంత, కోరికహెచ్చున్,
కోరుము కోర్కెల లేమికి,

కోరకనే యిచ్చుదొరను, కోరగ నేలా?
చంచలంబగు లక్ష్మిని పంచుకొనుచు,
చేర రానిచ్చి, పోనిచ్చి, చేయి విడచి,
స్వేచ్ఛ నందుము, దానంబు సేయుమదియె,
ముందు తరముల గాచును, ముక్తినిడును....
(శ్రీ.. రామ్ డొక్కా.... గారి పద్యసౌరభం..)
వారికి హృదయపూర్వక కృతజ్ఞతలతో........
ప్రాంజలి

మేముచేసిన త్యాగాలు ఎప్పుడు తడుము కొనక
చేసిన దాన ధర్మాలు ఎప్పుడు ఎవ్వరికి  చెప్పక
కర్మయోగినై కాలాను గుణముగా సాగే  ఈ నౌక
దేశ సేవ కొరకు  ప్రాంజలి ఘటిస్తు న్నాము ఇక

ఫలములో నా భాగము ఏంతో  అని అడుగక
గొప్ప వ్యక్తిత్వమునకు నేను తాపత్రయపడక
ప్రభుత కల్పించు రాయితీలు, అప్పు తీసుకొక
దేశసేవ కొరకు  ప్రాంజలి ఘటిస్తు న్నాము ఇక

కులము మతము ప్రజా సేవకు  అడ్డుగోడలు అనక
ఒకేజాతి మతం కులం గల పుడమితల్లి బిడ్డలమే ఇక
సమస్యలను పరిష్కారిస్తూ ప్రజాసేవాయే మా కిక         
దేశసేవ కొరకు  ప్రాంజలి ఘటిస్తు న్నాము ఇక

మెరుపులు పిడుగులకు భయ పడక
కార్యసాదన కొరకు నిద్రఅనేది చూడక
ఉడుకురక్తాన్ని ఉత్తేజ పరుస్తాము ఇక  
దేశసేవ కొరకు  ప్రాంజలి ఘటిస్తు న్నామిక

పేదవాడైన నేను ఆశను దరిదాపు లోనికి రానీయక
కష్టాలు కన్నిరుని దిగమ్రింగి సేవా భేరి కదులు తుందిక  
సర్వస్వం ధారపోస్తున్నాను నాతోరండి మీరందరూ ఇక 
మేము దేశసేవ కొరకు  ప్రాంజలి ఘటిస్తు న్నాము ఇక
   ఇంకా ఉంది ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి