15, సెప్టెంబర్ 2015, మంగళవారం

ప్రాంజలి ప్రభ-ఇది కధ కాదు- ఆనందపారవశ్యం -7


ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 
ప్రాంజలి ప్రభ- ఇది కధ కాదు -ఆనంద పారవశ్యం -7


                                          సర్వేజనా సుఖోనోభావంతు

నీవెవరవు నాకు ఈ విషయాలుచేపుతున్నావు, నేను నీ అంతరాత్మను, ఆనంద పారవశ్యంతో  మునుగుతున్నావు అది ఎంతో కాలుము ఉండదు, నీవు బ్రతుకుతున్నది భూలోకమ్ అదియు కలియుగం అని అర్ధం  చేసుకొనిప్రవర్తించు, ఈ చెవులో విన్న మాటను ఆ చెవినుండి వదిలేయాలని నీకు తెలియదా, ఇక్కడ మటలు అక్కడ  చేర్చటం అక్కడ మాటలు ఇక్కడకు మార్చటం మీ ఆడవాల్లకు సహజం కదా, 
అయినా ధర్మ రాజు శాపం కూడా  ఉన్నది 

"ఆడువారి నోట ఎ మాటా దాగి యుండు గాక "అన్నారు 
 
తెలియదా, మనసులోని మాటను బయటకు చెప్పందే నిద్ర పట్టదు,  వేరొకరిని నిద్రపొనీయదు కరంటు పోయినప్పుడు దోమ అరిచి నట్లు చెవుల  ప్రక్కన చేరి గుసగుసలు చెప్పందే నిద్ర పట్టదు దీనికి కారణం ఎడమ చెవి యందు తుష్టి అను గ్రంది యుండును,  ఇది ప్రతి వక్కరిని మనస్సుని ఆనందపారవస్యమైన మాటలను మంగళ కరమైణ విషయాలను ఎప్పటికప్పుడు శరీరానికి అందిస్తూ  ఉల్లాసముగా ఉస్చాహముగ మార్చుటకు పయత్నం చెస్తూ ఉంటుంది, అందుకే ఆ కర్ణాలకు కుండలాలు అందంగా పెట్టు కుంటున్నారు ఆడువారు, పురుషులో చెవులో పూలు పెట్టుకొని అమాయకులుగా 
కనిపిస్తున్నారుఅది ఒక ఆనందం,  శుభ సూచకమును సేకరించి హృదయమునకు అందచేసి హృదయ తాపమును తగ్గిస్తున్నది. 
             
ఇక కుడి చెవి యందు వరద అనే గ్రంధి ఉంటుంది దీనిలొ యోగము అనే శక్తి జా గృతమై యుంటుంది, మనసుకు ప్రశాంతి కలిగించే మాటలు సేకరిస్తుంది మనిషిని మౌనముగా సంచరించుటకు దొహదకర మొతుంది ఇది  వయసును బట్టి మనసునకు హెచ్చరించే విషయాలు సేకరించి అందచేస్తుంది దాని ప్రకారముగా  నడుచుకో అని హెచ్చరించు తుంది, తుమ్మెదల సమూహము వస్తున్నది, మకరందాన్ని  దోచు కు నేందుకు, కమలాన్ని తలపించే నీ కళ్ళను ఆకర్షించేదుకు, నీ వత్తైన కేశములకు, 
కేశములకు నీ వ్రాసు కున్న మధుర తైలమును ఆస్వాదిన్చేదుకు, చందమామ లాంటి నీ మోము చూసారు,  చెందమామలో ఉన్న మచ్చను మరచి వెన్నెలను ఆస్వాదించినట్లు, నీ రూపనికన్న విస్తర్తించిన మోము చూసి వెన్నెలను, చల్లదనాన్ని దోచుకునేందుకు, 
ఎక్కడ నుండి వస్తున్నదా అని నీ చుట్టూ తిరుగుతూ దగ్గరకు వచ్చి ముక్కు నుండి వస్తున్న సంపెంగ వాసనకు మతి చెలించి వెమ్బడి స్తున్నాయి, శంఖం లో నుంచి  తీసు కుంటే  గాని తీర్ధమ్ కానట్లు ఆ అందమైన మెడ అది శంఖా కారముగా కనబడుతూ, 
స్వర్ణాభరణాలతో వన్నెతెచ్చి తుమ్మెదల మనసును ఆకర్షించి మద మత్తులాగా మార్చే ఆ మెడను తాకేందుకు, ఇక ఓంపైన నడుము తో నడుస్తుంటే చలించని వాడు ఎవ్వరు ఉండరు, యోగ మాయను జయించ గలిగిన వారేవరుండరు అందుకే మాయను కమ్మిన  నడకను వదిలి వేయి, తల్లి తండ్రులు గురువు చెప్పిన నడకను అనుకరించి 
ప్రవరించు అని యోగము మనుష్యులను శక్తి వంతము చేస్తుంది                               
      
మానవులకు మనసు ఉల్లాసపరచడానికి గాని మనోవేదన చేడటానికి గాని మన శరీరమ్లొ ఉన్న గ్రంధులు మూలకారణం. కంఠం నందు భార్గ , గోమతి అను గ్రoదులు పనిచేస్తూ ఉంటాయి  ఈ గ్రంధుల ప్రబావము వాళ్ళ శరీరమునకు రక్షణ ఒక హెచ్చిస్తూ బుద్ధిని వక్రమార్గమున పడకుండా తెలియ పరుస్తుంది, మానవులను జాగృతి  చేయ గలుగు తుంది  అనగా ముందుగా హెచ్చరించు విషయాలు ఎప్పటి  కప్పు డు తెలియపరుస్తూ మేధస్సును పెంచటానికి తోడ్పడుతుంది, మనిషిలో ఉన్న అంతరాత్మ ఆవేదన చెడకుండా ఆరోగ్యముగా ఉండుటకు బుద్ధి ద్వారా కొనశక్తిని సహకరించి రక్షణకు మార్గాలు తెలియ పరుస్తుంది , మనవ శరీరములో  కంఠం కుడా ఒక ప్రత్యేకమైనది . ఈ కంఠం సరిగా ఉన్నప్పుడు మనకు స్వరాలు చక్కగా పలుకుతాయి.

మిక్కిలి శాంతుడైన వానికి పాపం అంటదు. సుఖాలల్లో విరక్తి గలగనికి భయ మనేది లేదు. గురుసేవలో ఆసక్తుడైన వానికి కోపం రాదు.  సత్యస్వరూపమ్ తెలిసి సుజ్ఞానికి ఎట్టి దోషాలు అంటావు, పుట్టింది మెదలు బ్రహ్మచర్యం పాటించు సుద్దాత్ముని బుద్ధి  పెడత్రోవ పట్టదు.  ఆశను తుదముట్టించిన వానికి ఎ విధమైన శ్రమ ఉండదు.  పరిపూర్ణుడైన  సుజ్ఞానికి ద:ఖం లేదు.  దృడంగా మౌనాన్ని పాటించే మునికి ఎప్పుడూ  ఎవరితోనూ కలహ లేదు. సీతోష్ణాలు సుఖదు:ఖాలు జయాపజాలు మున్నగు వాటిలో సముచిత్తత  కలవానికి మనస్చాంచల్యము ఉండదు. నిర్మలమైన ఆచారం పాటించువారికి ఎట్టి  లోపమును లేదు.  శ్రీ వెంకటేశ్వర నిను అన్వేషించి నీకు దాసులై నిన్ను సేవించి సంసార బ్రాంతికి లోను కాని  వారికీ అంతా  సుఖమయమే గాని భారము గొల్పునది ఏదీ  లేదు.

ఈ ధర్మ సూక్ష్మ0లొ ఉన్న ముఖ్య సమస్య సంసార భ్రాంతి లోను కాని వారికి అని అన్నమాచార్యులు తెలియపరిచారు
సంసారమే కలయక, కలయకే సృష్టి, సృశ్టే  సంసారం అని నేనంటున్నాను. ఇందులో  ఏది లేక పైన ప్రపంచం లేదు సౌందర్యం లేదు ఆనంద పారవశ్యం పొందే అవకాశము లేదు,  జంతువులకు మనకు తేడానే లేదు. మనం కుడా జంతువలకిందే వస్తాము , మనం జ్ఞానం ఉన్న జంతువులము  ఇది చేయవచ్చు ఇది చెయకూదదు, అని ఇంకితజ్ఞానం ఉన్నవాళ్ళం మనబుద్ధి వక్రమార్గం గుండా ప్రయానించ కుండా సక్రమ మార్గమున ప్రయాణించుటకు దోష రహిత బుద్దిని కలిగించుటకు ప్రతివక్కరు మనోధైర్యానికి మనసు నిగ్రహించు కోవటానికి  ఆ శివాన్స సంభవుడైన హనుమంతుడ్ని వేడుకుంటే  శక్తి పెరుగు తుంది సంకల్పం ఫలిన్చుతుంది, ముల్లోకాలకు రక్షణ చేస్తున్న ఆ శ్రీ వేంకటేశ్వరుని  ప్రార్ధించితే బుద్ధి  శక్తి జాగ్రుతమౌతుంది.   


JaiShreeKrish❣️❣️❣️❣️❣️❣️❣️❣️

చిన్నప్పుడు నేను విన్న ఒక కధ  గుర్తుకొస్తున్నది అది ఇందు పొందు పరచాలనిపిస్తున్నది ఎందుకంటే దృడవిశ్వాస ము వలన  ఏదైనా సాధించవచ్చు      
ఒక దేవతార్చన బ్రాహ్మణు డొకరింట నిత్యమూ దేవతార్చ చెయు చుండు వాడు. ఆ పనిని తన చిన్న కుమారుణ కప్పగించి యోకప్పు డతడు గ్రామంతరము పోయెను. నిత్యనైవేద్యము దేవుని ముందు పెట్టి, దేవుడు దాని నార గించునట్లు చూడమని యాతడు బాలునకు చెప్పి యుండెను. తండ్రి ఆజ్ఞ అనుసరించి పిల్లవాడు నైవేద్యమును విగ్రహము ముందు బెట్టి మౌనముగా వేచి యుండెను, కానియా విగ్రహము తినను దినదయ్యెను, మటాడును
మాటాడ దయ్యేను,  పిల్లవాడు చాలసేపటులనే వేచి ఉండెను. దేవుడు  పీఠం నుంచి దిగివచ్చి నైవెద్యము పెట్టిన పల్లెరములకడ గూర్చుండి  తినునని పిల్లవాని ద్రుడ విశ్వాసము అంత నాతడు, " ఓ దేవుడా రమ్ము, ఆరగిమ్పుము ఆలసిమ్పకుము, నేనింక గనిపెట్టు కొని యుండలేను" అని వేడు కోన సాగెను

ఓదేవా నేను పెట్టిన నైవేద్యమును తినుమా ....  తినుమా
నిన్ను నేను వదలి పోను, నీవు తినే దాక ఊరుకోను .. ఊరుకోనూ
నాకు మంత్రము రాదు, తంత్రము తెలియదు తినుమా ..  దైవమా
పసిపిల్లవాన్ని అనుకోకు, పట్టుదలఉన్న వాణ్ని ... దైవమా

పట పట నా తలను నీ పాదాల ముందు కొట్టు  కొను చున్నాను
తట తట నా తల రక్త దారలును నీకు అర్పిస్తున్నాను
జిత చిత వచ్చి నై వేద్యమును తిన మంటున్నాను
తటుక్కున తిని గబుక్కున వెళ్ళవచ్చు ఓ దైవమా

మా నాన్న పెట్టి నప్పుడు నైవేద్యము నారగింతువు గదా
నేను పెట్టినప్పుడు తినవా  దేవా (అని అరుస్తూ ఏడ్వ సాగెను)
 నైవేద్యమును తినుమా ....  తినుమా  ఓ దేవా ఓదేవా
ఓ దేవుడా రమ్ము, ఆరగిమ్పుము ఆలసిమ్పకుము

అని విలపించి విలపించి ఆ పిల్లవాడు ఎడుస్తూ ఉండగా, దేవుడు నరరూపమున వచ్చి నివేదితపదార్ధములను తిను చుండుట  కాననయ్యేను అటులదేవతార్చనమును ముగించి బాలుడు వేలుపలికిరాగా, ఆ ఇంటివారు "దేవతార్చన పూర్తియన యెడల ప్రసాదమును తీసికొనిరమ్ము  అనిరి, "ఔను, దేవతార్చన అయినది, దేవుడంతా తినివేసినాడు అని ఆ  బాలుడు సమాధానము చెప్పినాడు, వారందరూ నేవ్వేరపడి, నాయనా ఏమనుచున్నావు? దేవుడే యంతయు దినివేసినాడా? అనిరి.  శుద్ద అభద్దము, దేవుని ప్రసాదము అంతా  ఆరగించినాడు అని పలికెను, నిందించెను, దేవుడే తిన్నాడు అని గట్టిగా వాదించెను అప్పడు " దేవుడు మాటలు వినబడి నాయి ప్రసాదము పెట్టావు చేతి కడుగు కొనుటకు నీరు పోయలేదు " అని చెయ్ చాపారు అది చూసి అక్కడకు వచ్చినవారు అందరు మూర్చ పోయారు. నిజమైన ఆనంద పారవశ్యము  తల్లి తండ్రుల  చెప్పిన మాటను తూచా తప్పకుండా ఆచరించటం కూడా

......................ఇంకా ఉంది ... 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి