17, సెప్టెంబర్ 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు -ఆనందపారవశ్యం -8



ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఆనందపారవశ్యం -8
Water Lily Dream by Selenada.deviantart.com on @deviantART:        
సర్వేజనా సుఖోనోభవంతు       
ఇది కధ కాదు
ఆనంద పారవశ్యం చెందటానికి మన శరీరంలో అతి ముఖ్య భాగము " ఛాతి " ఇది ఎంత సువిశాలంగా ఉంటె అంత  ఆనంద పారవశ్యంనకు ఆధారం. ఇద అతి ఎక్కువగా ఉన్న కష్టమే,  అతి తక్కువగా ఉన్నా కష్టమే ఇది సృష్టి ధర్మాన్నికాదన లేముగాని మనం మనోధైర్యంతో, వ్యాయమముతో, పుష్టికరమైన భోజనముతో, మన ఛాతిని పెంచుకొనుటకు అనేక మార్గాలు ప్రకృతిలో కనబడు తున్నాయి. వాటిని అనుకరించి ఆనందం పొందవచ్చును. ఎడమ వైపు ఛాతియోక్క అగ్రభాగం నందు "దేవిక" అను గ్రంధి నిబిడీకృతమై యున్నది. ఇది " దమనము " అనే శక్తి జాగ్రుత మొతుంది. దమనము అనగా పరిమళిమ్చు సువాసన" అందుకే హృదయ స్పందన లు పరిమళించు సువాసనలు వచ్చినట్లు మనసిచ్చిన వారికి, ఆరాదిన్చిన వారికి తెలుస్తుంది అంటారు .

కుడివైపు ఛాతీయొక్క అగ్రభాగము నందున్న  "వారాహి " అను గ్రంధి యందు నిబిడీ కృతమైయున్న నిష్ఠ అనే శక్తి జాగ్రుత మౌతుంది . ఇది చాలా ముఖ్యమైనది. ఏపని ఐన నిష్టగా చస్తే మంచిది. ఇష్టం లేకుండా  చేస్తే ఆపనికి అర్ధమే ఉండదు. మనసు చంచల మౌటానికి దమనము నిష్ఠ గా ఉన్నప్పుడు పకృతి వనరుల సహయముతో ఆనంద పారవస్యము పొందగలుగు తారు. ముఖ్యముగా స్త్రీల వక్షోజాల అందం వర్ణించటానికి నా మనసు అంగీకరించక పోయిన వర్ణించి ఇందు పొందు పరుస్తున్న అన్యదా భావించకుండా సహ్రుదయంతో ఆనంద పారవస్యానికి ఇది ఒక భాగమని భావించగలరు
Decent Image Scraps: Love Animation
వక్షోజాల వత్తిళ్ళు,
పూబంతుల గొబ్బిళ్ళు
సలపరించే పాలిళ్లు,
 కవిని మరిపించే ఎక్కిళ్ళు

ఇష్టాన్ని పెంచే ఇమ్ములై
వలిగాలికి కదిలే కొమ్ములై
పరవశించే పిట్ట సోమ్ములై
చక్కని కోమలి పువ్వులై

సింగారించు కొనే సిగ్గులై
పొదరిండ్ల ముగ్గులై
విరహ వసంత కెగ్గులై
పరవసిమ్పచేసే బుడగలై

తేట తెనీయ బావులై
తపన తావుల తావులై
బ్రమించే బ్రోవులై
కాగి పొంగుతున్న క్షీరమై

బిందువుల దోత్తలై
సంపద సంపత్తులై
పుప్పొళ్ళ తిత్తులై
దాగు పూవు గుత్తులై

అందుకే అంటున్నాను
ఆనంద పారావశ్యానికి మూలాలై        
మత్తును పెంచే మల్లె పూవులై
మకరందాన్ని అందించే పాలిళ్లు

ఇంతుల మమేను బంతి
లలితాక్షుస రాసనుదంతి
ముద్దు మందార బంతి
సోయగాల పడంతి
--((*))--

                                "అ 'క్షారా'" లన్ని అమ్మ పాలలో నుండి

                          "ఆ" అని తాగగా పిల్ల నోటిలో కెల్లి,
 

                      "ఇ" అనుచు రాగమై "ఈ'ల '" గా మారి,
 

                  "ఉ" అనుచు ఉల్లాసంగా "ఊ 'యల" లూగే !!



                                             ఎంత ఖఠినాత్ముని కైనా
                                 ఏ సమయము లో నైనా
                                    ఐశ్వరము లో నైనా
                              ఒకటిగా మారుటలో నైనా
                              ఓర్పు వహించుట లో నైనా
                                     ఔనత్యం లో నైనా
                            అమ్మ పాలు మరువగలనా
                         అ:హ అమ్మ  భాషను వదల గలనా  



ఒక జోకు వ్రాస్తే బాగుంటుందని భావించి ఇందు పొందు పరుస్తున్నాను ఆనంద పారవశ్యానికి నవ్వులు  కుడా ఒక భాగము కాబట్టి ఇది కూడా చదివి ఆనందించండి
ఒక ఊరిలొ ఒక సన్యాసి ఉన్నాడు,  ఆతను ఆనందం కోసం తపస్సు చేస్తున్నాడు, స్త్రీలను దగ్గరకు రానీయడు, కాని స్త్రీ ద్వేషి కాదు, తను ఒక విశ్వామిత్రునిగా ఊహించు కుంటాడు ఎ ఊర్వశి వచ్చి తన తపస్సుభంగం చేస్తుందని ఊహించుకుంటూ ఉండే వాడు. తన దగ్గర ఉన్న ఒక సన్యాసి ఎప్పుడో వెళ్ళిన వాడు ఇప్పుడు వచ్చి పండు ఫలాలు
 అందించాడు. ఆతనితో ఒక పిల్లవాడు కూడా  ఉన్నాడు.
వెంటనే ఈ పిల్లవాదిని చూసి ముద్దోస్తున్నాడు  నీ పిల్లవాడా ఆని సన్యాసి అడిగాడు,  అవును గురువుగారు, మా బాబు  చిచ్చార పిడుగు లాంటివాడు, అడిగిన ప్రశ్నకు టక టక మని సమాధానం చెప్పుతాడు మీరు అడిగి చూడండి, వాడి మాటలు విని మమ్ము  ఆశీర్వదించండి  అని కోరాడు

బాబు ఇటు రా నీవు టకా టకా చెప్పాలి తెలిసిందా , తెలిసిందండి అడగండి
నీవు  పెద్దయ్యాక ఎం చేస్తావ్?
"పెళ్లి చేసుకుంటా "
"అది కాదురా బాబు .. ఏమవుతావని అడిగా "
"పెళ్లికొడునవుతా "
నా ఉద్దేశ్యం పెద్దయ్యాక ఏమి సాధిస్తావని
పెళ్లి కూతుర్ని
 "నా ఉద్దేశ్యం పెద్దయ్యాక అమ్మ నన్నల కోసం ఎం తెస్తావని ?
"కోడల్ని "
 "కోపంతో నచ్చా వురా .. మీనాన్న నీ దగ్గరి నుండి ఏమి కోరు కుంటున్నాడు?
"మనవడ్ని "
ఓరి దేవుడా ... ఇన్తకీ నీ ఆశయం ఏమిట్రా?
"మేమిద్దర - మాకిద్దరు "
మౌనముని సన్యాసి ఒకటే నవ్వు అక్కడ కొచ్చినవారు ఒకటే నవ్వు
సన్యాసి అన్నాడు మీవాడు చిచ్చర పిడుగు కాదు పెద్ద మాటల ఆటంబాంబు
సన్యాసి కి నవ్వలేక కల్లంబడి నీల్లు తెచ్చుకొని కొలమారింది
అప్పుడే బాబు తులసి తీర్ధమ్ తచ్చి ఇచ్చాడు
అవి గొంతులో పోసుకొని పడి పొయ్యాడు ముని
మనచుట్టూ నవ్వించే వారు ఉంటె ఆనంద పారవశ్యంలో 
మునిగి పోతాం కదూ ....    

                                       ఇంకా ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి