1, అక్టోబర్ 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - ఇది కదా కాదు -నవ్వుల ఆనంద పారవశ్యం-16

ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 


సర్వే జనా సుఖినోభవంతు

కొన్ని పదాలతో నవ్వులు వ్రాసి -నవ్వుకోవటమే- ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం
  అవును
అవును మీ నాన్న గారు " మొన్న నల్లగా ఉన్నారెందుకు  " అని అడిగాడు రాము సోమును
సోము చెప్పాడు :మా నాన్న గారు అప్పుడు  'బొగ్గుగనిలో పనిచేసేవారు'
రాము :మరి ఇప్పడు "తెల్లగా ఉన్నారెందుకు " అని అడిగాడు
ఇప్పుడు   '' పిండి మరలో పనిచేస్తున్నారు  " అందుకే తెల్లా ఉన్నారు ....... అవునా ...

అవును మరి మీ నాన్న గారు " మొన్న పోలీసు డ్రస్సు లో ఉన్నా రెందుకు  " అని అడిగాడు  సోము రామును
రాము చెప్పాడు :మా నాన్న గారు అప్పుడు  'జైలరుగా పని చేసేవారు'
సోము :మరి ఇప్పడు "జైల్లో  ఉన్నారెందుకు " అని అడిగాడు
ఇప్పుడు   '' లెక్కలు సరిగా చూప లేదని అదే జైల్లో పెట్టారు "  .......
అవునా ......... అల్లం
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బాగుగా వేసి  పెసరట్టు చేసి  తెచ్చావు
ఇది తింటుంటే కళ్ళంబడి నీరు కారుతుందే  అన్నాడు పరంధామయ్య
పార్వతమ్మతొ, 
తిన్న దానికి కళ్ళంబడి నీరు కారాయిగదా, ఇక మాటలతో నా కళ్ళల్లో  నీళ్ళు  తెప్పించ కోయి. 
ఏమిటే నేను పెట్టిన కళ్ళంబడి నీల్లు కారుస్తున్నావు, మరీ రొప్పుతు  న్నావు, అల్లం పంచదార సరిపోలేదా
ఈ ప్యాకెట్టులో పంచదార వేసాను, అయ్యో  రామ అది ఉప్పు 
నేను తాగితే బాగానే ఉంది కదా అవును ఈ టి మీరు కదా చేసింది 
అవునే నాకు షుగర్ కదా పంచదార వేయకుండా త్రాగా, ఇది అల్లం టి నా ........    


అసెంబ్లీ:
నాయకులందరూ అసెంబ్లీలో  సమావేశమై డబ్బు వృధా కాకుండా
ఏంచేయాలో చర్చకు వచ్చింది.
అధ్యక్షా అసెంబ్లీ పని దినాలు తగ్గిమ్చితే మంచిది అన్నారు ఒకరు
అధ్యక్షా ఐదు రోజులు అఫీసులు నడిపిమ్చుదాం  అన్నారు మరొకరు
అధ్యక్షా శని, ఆదివారములు అన్ని షాపులు మరియు బ్రాందిషాపులు
మూసివేయాలన్నారొకరు, మరి మన కమిషన్ ఎట్లా ...........
అద్యక్షా మా ఏరియాలో దోమలేక్కువా, వాటి బారి నుండి ప్రజలను రక్షించాలి, అద్యక్షా గొలుసు దొంగలు ఉన్నారు వారిని  పట్టు కోవటానికి
 ప్రయత్నాలుచేయాలి మీరు చెప్పిన విషయాలు వచ్చే సమావేశాలలో చర్చించుదాం 

అనుమానిస్తున్నారు:
మనం గోడవపెట్టుకోకపోతే అందరూ  అనుమానిస్తున్నారు
మనం గొడవ పెట్టుకుందాం, నీకు మొగుడు లేదు నాకుభార్యలేదు 
భార్యా భర్తలు అనుకుంటారు ............

అనాధఆశ్రమం                                                                                                                        అత్తమామలను అనాధ ఆశ్రమంకు పంపకండి అన్నది భార్య.
నేనే వారికి సేవలు చేసి తరిస్తాను, ఈ "బుద్ధి  ఎక్కడి  నుంచి  వచ్చిందే నీకు." వారికి వచ్చే పించన్ మనకు కూడా  పనికొస్తుంది కదండి. .........

మన పిల్లలను స్కూలునుండి తేవటం, ఆలాగే కూరలు తేవటం చేస్తారు వారికి కాలక్షేపం గా ఉంటుంది ఏమంటారు ... నీ వన్నడి బాగానే ఉన్నది 
వారికి నీ మీద నమ్మకం నిరూపించుకొ అప్పుడు ఆలోచించుదాం అంతేనా ........    

అదేనా" ప్రాబ్లం"
జడ్జిగారు నాకు "  విడాకులు ఇప్పించండి " అని ఆడిగింది ఒక ఇల్లాలు
మీ " ఆయనకు  మీకు ఏమైనా గోడవులు " ఉన్నాయా, లేవు 
మరి దేనికమ్మ విడాకులు అందులో మీ " ఆయన బాక్సింగ్ చంపియన్ " అన్నావు అదేనా" ప్రాబ్లం"
రాత్రి పూట బెడ్ టైం రాగానే ఛాతిమీద  ఒకటే బాక్సింగ్, అంటే ప్రాక్టీసు అంటాడు.....   

అంతేఐతే
అప్పుడు బస్సులో మీదపడి చేతితో నొక్కావు, అడిగితె వెనుక తోసారన్నావు ఏదో  వయస్సులో వచ్చే మార్పు  అనుకున్నాను,
మరి ఇప్పుడు ఎకకంగా మీదకోచ్చి పడ్డావు, వళ్ళు ఎలావుంది
ఇప్పుడూ నాతప్పుకాదు " తొక్కమీద కాలేసి జారిపడ్డా " నీమీదకు అంతే
అంతే  ఐతే  "మనం పెళ్లి చేసుకుందామా " .............
ఏమన్నావ్ నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా ..........
   
ఆపరేషన్                                                                                             డాక్టర్ గారు నా భార్యకు మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి
మొన్ననే కదా నీభార్యకు చేసింది ఆపరేషన్ అన్నాడు డాక్టర్
ఇప్పుడు వచ్చింది నామూడో  భార్య నీకు పిల్లలెంత మంది అడిగాడు డాక్టర్  నాకు పిల్లలు పుట్టలేదు మరి ఈ ఆపరేషన్ ఎందుకు
నాలుగో పెళ్లి చేసుకొనేందుకు .............
నీవు ముందుకు బయటకు నడువు అన్నాడు డాక్టర్
 అనారోగ్యం
ఏమండి "నా ఆరోగ్యం " బాగోలేదు, మీరు "కష్ట పడుతుంటే " చూడలేకపోతున్నాను. మరి ఏంచేయాలి నీకు నేను, నాకు నీవు తప్ప మనకు ఎవరూ లేరుకదా.మన దగ్గర డబ్బు వుంది కదా, వి.ఆర్ .యస్  తీసుకోని ఇంట్లో ఉంటే నాకు సంతోషం నీ ఆరోగ్యం బాగుపడేదాక సెలవు పెట్టేస్తాను, నీ  ఆరోగ్యమే నా ఆరోగ్యం ని నవ్వులే నా నవ్వులు, నీ మాటే నాకు వేదవాక్కు  అంతోద్దు, ఈ నవ్వుమోఖం నేను రోజూ చూడాలి ...       ఎంకోదానిక్కోసం పోకుండా ఉంటె చాలు ... ఆ ఆ అట్లాగే
 

సమానం
ఒక అమ్మయితో  ఉండటం  ఆనందం
ఇద్దరమ్మాయిలతో  ఉండటం మహదానందం
ముగ్గురు రమ్మాయిలతో  ఉండటం పరమానందం
అనేకమందితో ఉండటం నిత్యానంద స్వాములతో సమానం

అత్యాశకు పోతే జైల్ ల్లో ఉండే దొంగలతో అవుతావు సమానం