3, అక్టోబర్ 2015, శనివారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు -ఆనంద పారవశ్యం -17


ఓం శ్రీ రాం  ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 


సర్వేజనా సుఖోనోభవంతు

జవాబు  దొరకని ప్రశ్న  ఉండదు
అర్ధంకాని జీవితమనేది ఉండదు
బ్రమకు మించిన మాయ ఉండదు
కలలురాని జీవితమనేది ఉండదు  

మానవత్వాన్ని నేర్పేది గురువు
సహజత్వాని తెలిపేది గురువు
జ్ఞాసంపంనుడుగా అమర్చేది గురువు
అట్టి గురువు దైవంతో సమానం
 
నమ్మలేని జీవితcమెక్కడుంది
బ్రతకలేని దేశ మెక్కడ ఉన్నది
ప్రేమించ లేని స్త్రీ ఎక్కడఉన్నది
దేవునిచూడని ప్రాంత మేక్కడుంది  

రాలి, వాడిన పూలు
 

మళ్ళీ వికసించినట్లు,
 

కాలి, బూడిదైన ఆశలు
 

మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు, 

 
చీలి, ముక్కలైన కుటుంబం
 

మళ్ళీ ఉమ్మడిగా గుమ్మడి పువ్వై నవ్వినట్లు,
 

తేలి, సుదూరంగా పోయిన మబ్బులు
 

మళ్ళీ జాలి తలచి వచ్చి..వర్షమై కురిసినట్లు,
 

వాలి, చిరాకు పుట్టించే కోర్కెల పక్షులు
 

మళ్ళీ వాటంతట అవే నిశ్శబ్దంగా ఎగిరి వెళ్ళినట్లు,
 

కూలి, ముక్కలైన ఆశల శిఖరం
 

మళ్ళీ దానికదే అతుక్కుని..ఠీవిగా నిలబడినట్లు,
 

తూలి, క్రింద పడిన తాగుబోతు
 

మళ్ళీ తనంత తానే లేచి చక్కగా వెళ్ళినట్లు,
 

మాలిపై అలిగిన గులాబీ
 

మళ్ళీ మాట కలిపి..సంతోషం పెంచినట్లు,
 


సోలిపోయే కన్నులతో అలసిపోయినా..
 

మళ్ళీ నువ్వు స్వాగతం పలుకుతున్నట్లు,
 

పేలి ముక్కలైందనుకున్న మనసులో ఈ వింత ఆలోచనలు
 


మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నట్లు..??. 



నమ్ముకున్న భూతల్లిని అమ్ముకోలేక
 
ఆధారపడ్డ బతుకులనన్యాయం చేయలేక
 
పనికోసం పట్నమొచ్చిన రైతన్న..
 
పనేక్కడదొరుకుతుందో కూడా తెలియక
 

ఆకలిబాధకు అభిమానం వదిలి అడుక్కున్నా
 
దుక్కలావున్నావ్ పని చేసుకోరాదు...
 
అందరి ఈసడింపులే..,.. ఆకలి తీర్చండమ్మా
 
ఏపని చెప్పినా చేస్తానని బ్రతిమాలినా
 

దొంగ వో దొరవో పనిలేదు పో పో అంటూ
 
కసిరిన వారే పాపం.... 


ఆకాశం అక్షరాలు వరదలా  కురిపిస్తే
అవని తల్లి తన్మయత్వంలో వెళ్ళు విరిస్తే
గంగా ప్రవాహముతో పుడమి తల్లి పులరిస్తే
అక్షరజ్ఞానంతో కర్షక కృషి వలురు విస్తరిస్తారు

కర్షక జీవులు ధరణిని దున్ని విత్తనాలు చల్లితే
పృద్విపై  రైతు సంరక్షణతో మొక్కలు పెరిగితే
పంటనుకోసి బండ్లకెత్తి కొంత అమ్మి ధనం తెచ్చితే
ఇంటిల్లి పాటు సంతోషాలతో జీవితమ్ గడుపుతారు  

వేణుగాణ రస మాధుర్యంలో మునిగి
కృష్ణ  ప్రేమామృతం  కొరకు  తపించి
పారవశ్యంతో  మనస్సులో  కృష్ణుని చేరి
దారామ్రుతము  రాధా  గ్రోలి   తన్మయమొందిన్ 

ప్రాణాలతో  చెలగాటం  ఎందుకు
గగుర్పాటు  చెందే  ప్రయాణాలు  ఎందుకు
బ్రతికుంటే  తినవచ్చు  బలుసాకు
పటము గాంచినకలిగే భయము నాకు 

తనువులో ముళ్ళు,  మనసులో కుళ్ళు
ఎంగిలాకు బతుకుళ్ళు, ఉండేది కల్ముషలోగిళ్ళు
రోగాలతో వళ్ళు, మరణశయ్యపై చేరేవాళ్ళు 
ధనంకోసం రక్త దానమ్ము చేయట రాక్షసమ్ము  


నేను చేసే పనిలో నిజాయితీ ఉంది
నా కష్టానికి ఫలితం ఇక్కడున్నది 
మా కుటుంబానికి దారే ఇది 
అదృష్టం అడ్డం తిరిగితే అందలం ఎక్కే అవకాసం ఉన్నది 
ఇది కలియుగం 







నీకు ముఖ్య మంత్రి పదివి ఇప్పిస్తున్నాను
రెండు ముక్కల్లో ఒక ముక్కకు నాయకుణ్ణి చేస్తున్నాను
నీవు చెప్పిందే వేదం నీకు ఎదురు తిరినవాన్ని శిక్షించుతాను
కుటుంబంలో అందరికి పదవిలు కల్పిస్తున్నాను
కోట్లతో పనులు ప్రారంభించి అందరు సమాన కమీషన్లు తీసుకోవచ్చును
ప్రజలు ఎదురు తిరగకుండా పక్కనే ఉండి  గమనిస్తాను
మహాప్రభు రెండు నాలుకుల రాజకీయములొ నేను బ్రతకలేను
ఇది కలియుగం మల్లిరా అప్పుడడుగుతా వరం


 పెళ్లి శుభలేఖలు ద్తెచ్చినవారికి మాత్రమే ఇక్కడ భోజనం 
          బహుమతులు తెచ్చినవారు కూపన్లు తీసుకోండి భోజనానికి
        బహుమతులు తాని వారు మాత్రం దయయచేసి పిల్లలను దీవించి వెళ్ళండి
వచ్చినవారికి ఇంతే సంగతులు చిత్తగించవలెను

  





 

http://telugudarshini.com/wp-content/uploads/2015/07/unnamed-1.jpg

మీరడిగినవి అన్ని వప్పు కుంటున్న
 ఎ లోటు లేకుండా చేయాలను కుంటున్న
మా పార్టి కార్యకర్తలందరూ మీకు సహకరిస్తారు
ఉద్యోగాలను ఖస్చితముగా మాకే  ఇవ్వాలి
ఓ అట్లాగే
  



చూడటానికి చిన్నది - దూకితె గాని లోతు తెలియదు
అలవాటుగా మారుస్తున్నది - పనికిరానివి చూడక తప్పదు
అందరూ కలవాలని పించింది - చూసి భయాడక తప్పదు    
చూడొద్దనాలిని ఉన్నది - ప్రపంచ తెలుసుకోక తప్పదు



నీ బుద్ధి నాకు తెలుసు పుష్కరాలకు పోదాం పదా 
అది కాదె దాన్ని కూడా తీసుకెల్తె బాగుండును కదా
పిల్లిని చంకన పెట్టుకొని పోయి న ట్టుట్టుంది కదా  
నీకు చిక్కగా మరి అంత గుంజకు నేను అటు చూడటం లేదు కదా



నన్ను మరచి పోతె  ఎట్లాగా 
పోయిన పుష్కరాల డబ్బును అడగనులే 
ఇప్పుడు మనిద్దరం కలసి పుష్కర పూజ చేద్దాం 
చనిపోయిన వారికి పిండ ప్రదానం చెయ్యటమే కదా 
మనం మంత్రం తప్పులేకుండా చదువుదాం 
బ్రాహ్మణుల విలువ నిలబెడదాం


ఏమిటి ఈ కత్తెర రిబ్బను కూడా తెగుట లేదు

అయ్యో అది బంగారపు కదండీ తెగటం లేదు
అయితే మరేదన్న ఇవ్వండి ఇంకా కట్ చేయలేదు 
మీ నోటితో కట్ చేయండి అమ్మో ఇవి బంగారం
మరి ఎట్లా మీరందరూ కలసి నన్ను తోయండి 
ఒక్కో నాయకుడికి ఒక్కోపిచ్చి 
బంగారం నోక్కేసాడుగా అందుకే  అన్నది 




అవునండి నేను ఎట్లా చేసినా మీరు తింటారండి

తోక్కలేందుకు పారేయాలి అని చారు పెట్టా బాగుందా 
మీరు పొదుపు చేయమన్నారుగా  అందుకనే
ఇంకా వారం రోజులు సరిపడే డిప్పలు ఉన్నాయి 
ఎంచక్కా రోజు చారు పెట్టు కొని తిందాం 
నాకు చారు కారుతుంది, మందులుకు కర్చవతుంది
వద్దులే కూరలు తెస్తా, తిండిలో పొదుపు వద్దులే 



నేనైతే తట్టుకున్నా - ఆ పోస్టు బాక్సు తట్టుకోలేదే 
అది వంద సంవస్చారాల క్రితంది - దానిలో నీకాలు ఇరుకున్దనుకో 
ఆ బ్రహ్మదేవుడు వచ్చినా - నిన్ను ఆ పోస్ట్ డబ్బాను వేరు చేయలేరు
అదో నేనో తేలాలి మీరు ఆగండి - పిచుక మీద బ్రహ్మా ఆస్త్రం వేశారుట 
అది ఇదేనేమో - పార్సీలు చిరుగుతుంది కాలు ఇరుకుంటుంది 
దాని తిక్క కుదురుతుంది  




గోదావరి ఉరక లేసింది - మనసు పరుగు లేసింది
కొండ గాలి వీచింది  - గుండె జల్లు జల్లు మంటున్నది
గాలి సవ్వడికి పడవ కదిలింది - జండా రెపరెప లాడింది
సూర్య బింబం వికసించింది - పడవంతా వెలుగు నింపింది







ఎవరే ఈ వంట చేసింది ఇన్త కమ్మగా ఉంది
ఎమిటీ  మీరు తిడుతున్నారా నావంట గురించి
నలుడు భీముడు కూడా వంక పెట్టాడు  తెలుసా 
అందు కనే కదే కళ్ళ జోడు తీసి మరి తింటున్న 
అవునండి మరిచా నేను కళ్ళజోడు లేకుండా వంట  చేశా

అవి చీమలొ బియ్యమో తెలియక వండా నేమో 
లేవండి మీరు హోటల్ కు పోయి బిర్యానితెండి
ఎంచక్కా ఇద్దరం కలసి తిందా అంతేనా అంతే ..
                                                                                              ఇంకా ఉన్నది ....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి