8, అక్టోబర్ 2015, గురువారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం -19

ఓం శ్రీ రాం         ఓం శ్రీ రాం      ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఇది కధ  కాదు - ఆనంద పారవశ్యం -19
సర్వేజనా సుఖోనోభవంతు

ప్రకృతిలో పురుషులు స్త్రీలు అనే రెండు రకాలుగా జీవిస్తారు, ఎవరి మనస్తత్వం వారి కుంటుంది,  అభిప్రాయాలు వేరుగా ఉంటాయి ఆలోచనలు భావాలు వేరుగా ఉంటాయి.  ఏది ఎలా ఉన్న స్త్రీ పురుషులు కలిసినప్పుడు కొత్త జీవి పుడుతుంది అచ్చు వారి రువురి ముఖకవలికలతో జీవమ్ పోసుకొని పుడతారు. దీన్నె సృష్టి అంటారు.  అలా పుట్టిన జీవులు మరలా కొత్త జీవుల్ని పుట్టించాలంటే వారు పెద్ద వారు కావాలి, అందుకు పోషణ జరగాలి, జీవ పరిణామం జరుగుతూ ఉండాలి అప్పుడు ప్రపంచము లో మేధావులు పెరుగుతారు, ము సలివారు అవుతారు, వారు చనిపోతారు ఇది ఒక వృత్తాకార వంశ వృక్షం, ఇది బీద ధనికులు, అనెభేధము లేకుండా వృద్ది అవుతూ ఉంటుంది.
సృష్టికి మూలకారకులు త్రిమూర్తులు  బ్రహ్మ భార్య  సరస్వతి ముఖంలోనే కాపురముంటుంది, విష్ణువు భార్య లక్ష్మి విష్ణువు యదపై ఉంటుంది, శివుని భార్య పార్వతి సగం అంతా  ఉంటుంది. త్రిమూర్తులు వారి భార్యలను విడువ కుండా కాపురము చేస్తున్నారు.

శృంగారానికి మూలకారకుడు మన్మధుడు, అందుకే భర్తృహరి మన్మధునికి నమస్కారం చేసి శృంగార శతకం వ్రాసాడు. నేను ఆ మన్మదునకు, భర్త్రుహరికి పాదాభి వందనము చేస్తూ శృంగార భావకవిత్వం వ్రాస్తున్నాను. ప్రతిఒక్కరు  ఆనంద పారవశ్యం పొందటానికి ముఖ్యమైనది శృంగారం, భర్తృహరి శృంగార శతకం ఆధారముగా నాభావకవిత్వం వ్రాస్తున్నాను తప్పులుంటే తెలియపరుచ గలరు. పండితులందరికి ఒక్కసారి ప్రణామములు తెలియ పరుస్తున్నాను.

శృంగార రసానికి ఆలంబన స్త్రీ, సృష్టికి స్త్రీ ఆలంబన, స్త్రీ లేకుండా సృష్టి జరుగదు, స్త్రీలు పురుషులు ఏకమై సంసార భందముగా మారటమే జీవితమ్. 



      మల్లెల కుంటుంది ఉబలాట - మనసు కుంటుంది తపనల ఆట
మల్లెలు తెల్లని పువ్వుల బాట - మనసు కోర్కలతో ప్రతి పూట
మల్లెలు మగువులకు ఇష్టంట - మనసు మగువు చుట్టూ ఉండునట
నవ్వుల మల్లెల పూదోట - మనసుతో భవ భందాలతో ఆడే ఆట

మగువే లేకపోతె మల్లెలతో మగనికి పనేమున్నది
మగని దూరమైతె మల్లె వాసన తో  పని ఏముంది
మల్లెల వాసన మగువకు కోరిక  రెచ్చ కొడుతుంది
మల్లెలు మనసులు ఒకటవటానికి సహకరిస్తుంది

ఎడబాటు నిన్ను భాధించ కుండా -
 మెదటి రాత్రి మల్లెపువ్వులు గుర్తు తెచ్చుకో
తొలి ప్రేమ గుర్తు కొచ్చి కూడా - 

మనసును ఊరాడించే మల్లెపువ్వులు  పెట్టుకో   
మదనుడి భాణం వేసినా కూడా -

 పున్నమి వెన్నెల మల్లెపూల మాల పెట్టుకో
ముస్తాబై చిన్న బోకుండా - 

మల్లె పూల వర్షాన్ని కురిపించమని హరితవనాన్ని కోరుకో     

గుప్పెడు మల్లెపూలు - మనసుకు గుర్తుకు కొస్తాయి మనోభావాలు
మల్లెపూల అల్లికలు  - మనసులో రేపే మంచి ఊహ గాణాలు
మల్లెతోట పరిమళాలు -  మదిలో రేపును ప్రేమ గుర్తులు
మగువ కొప్పులో మల్లెపూలు -
మగువకె విరహం రెట్టింపులు    

గొడుగునందు చోటు కొంచమై యుండు
మేను తడవకుండ మేలుజేయు చుండు
ఆదరించు వారు యారీతిగా నుండు
వినుడు స్వామి పలుకు, విషయముండు..

-- ((*))-- 

వాసన లేని పువ్వు, బుధ వర్గము లేని పురంబు,
భక్తి విస్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడున్,
సదాభ్యాసము లేని విద్య, పరిహాసము లేని వాచ్య ప్రసంగముల్,
గ్రాసము లేని కొలువు, కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

గారెలు లేని విందు , సహకారము లేని వనంబు ,
తొలుత ఓంకారము లేని మంత్రము , అధికారము లేని ప్రతిజ్ఞ ,
వాక్చమత్కారము లేని తెల్వి, గుణకారము లేనటువంటి లెక్క,
వాసము లేని ఇల్లు , కొఱగానివి పెమ్మయ సింగ ధీమణీ.

మచ్జిక లేని చోట అనుమానం వచ్చిన చోట
మెండుగా కుత్యిలున్న చోట రాజు కరునించని చోట
వివేకు లున్నచో అచ్చట మోసమండ్రు
కరుణాకర పెమ్మయ సింగ ధీమణీ.

-- జక్కన చెప్పిన 'పెమ్మయ సింగధీమణి' శతకము నుంచి





వయసుకొచ్చిన  స్త్రీలు పురుషులను ఆకర్షించుటకు వేసే కొన్ని ఎత్తులు 
వయసు కొచ్చి - మదమెక్కి 
సిగ్గు మొగ్గ విచ్చి - వలపెక్కి 
లజ్జ చూపు గుచ్చి - కైపెక్కి 
హావ భావాలతో స్త్రీ పురుషున్నాకర్షిమ్చే 
       
కామం సిగ్గు భయం సమపాళ్ళతో 
నవ్వే నడక చూపు మురిపాళ్ళతో
అలుక సొగసు కవింపు పాళ్ళ తో 
బెదురు చూపుల స్త్రీ పురుషున్నాకర్షిమ్చే 

నల్ల కలువ పూల కళ్ళతో - కనురెప్పల కదలికలతో 
 నితంబాల కదలికతో - వయ్యారపు తడబడే నడకతో 
ఓరకంట చూపుతో -చిరునగవు చూపె పెదాల కదలికలతో
జడ త్రిప్పుతూ, నవ్వుతూ స్త్రీ పురుషున్నాకర్షిమ్చే

స్త్రీ  పుట్టుకతో వచ్చే శరీరాకృతి 

స్త్రీ ప్రకృతి తో వచ్చే ఆహార్యం కృతి 

స్త్రీ సహజ రూప లావన్యాకృతి 

స్త్రీ సకలాభరణాలతో పురుషున్నాకర్షిమ్చే


స్త్రీ అంటే మనసుకు కలవర పాటు ఎందుకు 

స్త్రీ మనసును అర్ధం చేసుకొని బ్రతుకు 

చేసిన తపస్సు, దానం, వళ్ళ స్త్రీ దొరుకు

సహకరించే స్త్రీని ఎప్పటికి కష్ట పెట్టకు 


నితంబాలు మనసుకు మనోహరం 

గుబ్బలు గుబులును తీర్చె మణిహారం 

తరుణీ తపనల తప్పెట అమోఘం 

తన్మయత్వంతో సంభోగమే ధర్మం 


మనస్సు కరుగు సంభోగ స్త్రీ యత్తు 

ప్రేమ పెల్లుబి శృంగార రసం మత్తు 

మన్మద  భావం ఉద్దీపనం హత్తు   

కామకులు ఏకమై సర్వస్వం చిత్తు 


తలపించే తన్మయత్వపు తపనలకు
తలచిన తలంపుగా తనువుతో తొలకరి కౌగిలి
కొత్తదనపు కోరికల కోలాటాల కులుకులకు
కొలువుతీరి కరిగిపోవుటకు కొసరి కొసరి కౌగిలి

రగిలే వయసులకు రంజిల్లె రసికులకు
రసరమ్య అంగాంగ రమ్యమైన రతీమన్మద కౌగిలి
భవ్య భవరంజికముగా భగినీకులుకులకు 
భంగిమలతో భరణం వహించే బిగి కౌగిలి   

కుచకుమ్బ చుంబణాల రుచి తలపులకు
తగు బిగువుల మేనితో ఉడుకు వయసు కౌగిలి
పడుచుదనాల పరువంలో ఉన్నతళుకుళకు
ప్రియ సఖీ ప్రేమ పరంగా సంగమ తాపన కౌగిలి

ప్రియసఖికి ప్రియం చెకూర్చె ప్రియుని తపనలకు
పరవళ్ళు  త్రొక్కుతూ పరవసిమ్చే ప్రేమ కౌగిలి
ముగ్ద మొహనరూపానికి ముద్దుల సిగ్గులకు
అద్దుఅదుపు లేకుండా ఆనందం పొందే పూర్ణకౌగిలి        
సుందరాంగి చన్నుల యందు గురుత్వం 

ముఖము నందు వెన్నెల సుందర తత్వం 

నడక యందు నాజూకైన శనేశ్వరత్వం 

స్త్రీ శరీరమ్ పురుషునకు అందించే బ్రహ్మ తత్త్వం


కొందరు స్త్రీలు గర్వంతో తెచ్చు కుంటారు కష్టం 

అందమైన సన్నులు ఊపిపడతారు ప్రేమ కూపం 

పెదవుల అస్వాదంతో పొందు ప్రాణయ సామ్రాజ్యం

కన్నులతో ఆకర్షించి కౌగిళిలో చిక్కి తగ్గు తాపం 


సుందరీ మణుల కేశములు ఇంద్ర నీల మణులు 

చేతులు తామరతూడులవలే పద్మ రాగమణులు

వయసొచ్చిన వారి మొఖం చెంద్ర కాంత మణులు 

ఉశ్చ్వాస నిశ్వాసాలు ఆనంద పారవశ్య మణులు





స్త్రీల ఆయుధాలు యవ్వన బాణాలు

లక్ష్యాన్ని చేరుటకు విసిరే వలలు 
పురుషున్ని లొంగదీసె ముఖ కవలికలు
పురుషున్ని చేరే స్త్రీ నవ్వులే అమృత జల్లులు 

అనుకూలవతికి పురుషుడు సూర్య ప్రభ 
స్త్రీ చల్లని వెన్నెలను అందించే చంద్ర పభ 
స్త్రీ అర్ధాన్ని అందించే సమంతకమణి ప్రభ
స్త్రీకి పురుషుడు ఎప్పుడు ప్రాంజలి ప్రభ
ఇంకా ఉంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి