9, అక్టోబర్ 2015, శుక్రవారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం -20

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం 


సర్వేజనా సుఖినోభవంతు

భర్తృహరి సుభాషితం !
.
"ఆపదలందు ధైర్య గుణ మంచిత సంపదలందు తాల్మియున్
భూపసభాంతరాళమున పుష్కల వాక్చతురత్వమాజి బా
హా పటుశక్తియున్ యశమునం దనురక్తియు విద్యయందు వాం
ఛా పరివృద్దియున్ బకృతి సిద్ధ గుణంబుల సజ్జానాళికిన్"

భావం:
ఆపదలు వచ్చినప్పుడు దైర్యము, ఐశ్వర్యము వచ్చినప్పుడు ఓర్పు,
సభ యందు వాక్చతుర్యము, యుద్దము నందు శౌర్యము చూపుట,
కీర్తి యందు ఆసక్తి, విద్యలను నేర్పుట యందు గొప్పకోరిక
అనునవి మాహాత్ములకు పుట్టుకతో వచ్చిన స్వభావగుణములు.


స్త్రీల వెంట్రుకల యందు సంయమనం 
స్తీల కళ్ళ యందు శృతి పరగత్వం 
స్త్రీల స్తణాల యందు జీవన్ముక్తం
స్త్రీలు రక్తి అనురక్తి ని పెంచే శాంతి తత్త్వం 

స్త్రీని ప్రేమించని ఇల్లు గబ్బిలాల ఇల్లు  
స్త్రీని గుర్తించని ఇల్లు ముళ్ళ పొదరిల్లు 
స్త్రీ లేని ఇల్లు ఎప్పుడూ చింతలతో ఉండే ఇల్లు 
 స్త్రీ ని హింసించే ఇల్లు పిశాచాల ఇల్లు 

 చెవులకు అందానిచ్చే కుండలాలు 
 కాళ్ళకు మట్టెలు, చేతులకు గాజులు
నడుముకు వడ్డానం, తలలో మల్లె పూలు 

స్త్రీ పురుషున్ని ఆకర్షించే వెలుగులు 


మెరుస్తున్న పెదాలు - విచ్చుకొన్న మల్లె మొగ్గలు

వయసుకొచ్చిన చన్నులు - ఉబికిన నితంబములు 

తరుణి మెరిసే కన్నులు - మోహ పారవశ్యాలు 

పిరుదుల మద్యజడ ఊపులు - మన్మధ బాణాలు 


image not displayed
స్త్రీ సౌందర్యానికి మన్మధుడు సేవకుడు 

స్త్రీ చూపుకు పురుషున్నే భందిస్తాడు

పురుషున్ని స్త్రీకి బానిసగా చేస్తాడు 

స్త్రీ పురుషుల మద్య కామాన్నిసృష్టిస్తాడు 


స్త్రీలు అబలలు కాదు ప్రబలలు 

స్త్రీలు అజ్ఞానులు కాదు విజ్ఞావంతులు 

స్త్రీలు నిందితులు కాదు ఆనందితులు 

స్త్రీలు బానిసలు కాదు ధర్మ తత్పరులు 


స్త్రీ శరీరానికి జవ్వాది, కస్తూరి, కుంకుమ లేపనాలు 

స్త్రీ జితెంద్రియులను ఆకర్షించే పాద నూపురాలు 

స్త్రీ చను గుబ్బాలపై కదిలాడే రత్న హారాలు 

స్త్రీ పురుషున్ని లోబరుచుకొనే వస్త్ర కదలికలు



రసికులైనవారు చూడ దగినది యవ్వనవతి ముఖమే 

పీల్చేగాలి పద్మినీజాతిస్త్రీల ముఖపద్మమునుండి వచ్చే గాలి మాత్రమే 

వినదగిన మాటలు శ్రేష్టమైన అందగత్తెల చిలుక పలుకులుమాత్రమే
రుచిచూడాల్సినది రమణి లేత క్రింది పెదవిలో ఉన్న అమృత తుల్యమే 

అనుకువగా అడుగనా - ఆనందముగా అడగనా
మౌనంగా అడుగనా - మాటలతో అడగనా 
ఎ ఎ ఏదైనా అడగనా - మనసుతో అడుగనా 
అభినయంతో అడగనా - అనురాగంతో అడగనా 


నెలరాజా ఇటు చూడవా - నా కోరిక తీర్చవా 
నవరోజా తెరతీయవా - నీ వలపు తీరుస్తా 
రతిరాజ జత చేరవా - నా ఉడుకు తగ్గించవా 
జవరాల జత చేయవే - నీ మనసు ఉడికిస్తా

హృదయతపన తగ్గించవా  - ఆనందాన్ని ఆస్వాదించవా 
గుండె చప్పుడు వింటున్నావా - అమృతాన్ని అందుకోవా
 వేడిని తగ్గించటానికి రావా - చల్లదనాన్ని అందించవా 
మృదువైన ధర్మాన్నితాకవా - మంధత్వాన్ని పోగొట్టవా 


నవ నవ లాడే నవ్వుల మొలక
ఊహలకు రెక్కలు వచ్చాయి కదులు దామిక
చక చక సాగే గువ్వల మొలక
ఊపిరాగే దాక ఊరేగు దామ్ ఇక 

చిరు చిరు నవ్వుల చిన్నారి అలక
ఊహల్లో విహరిద్దాం మిక
గర గర లాడే ఓ గువ్వల గిలక
ఊపిరున్నంత వరకు ఆనందంగా ఉందాము ఇక



మిక్కిలి ప్రకాసించు యవ్వన కాలం 
మన్మధుని తలపించే శృంగారం 
క్రొత్త క్రొత్త భావాల కారణ భూతం 
 అదే జత కూడి పొందే ఆనంద పారవశ్యం

కళ్ళతో చూచె అనుభూతి  - కలవరం 
సుగంధ అస్వాద అనుభూతి - సుమధురం 
శృతి, శబ్ద, గ్రాహ్యత, అనుభూతి - స్వర మధురం 
శరీరమ్ స్ప్రుశించి పొందే అనుభూతి - శృంగారం

తలచిన తలంపుగా పొందే ఆనందం
సృష్టి నిరంతరం జరిపే సుఖం 
సొబగైన సొగసైన ఆకర్షణే కారణం 
 సంతోషంతో పొందేదె ఆనంద పారవశ్యం 

ఎన్నాళ్ళీ నాఎదురు చూపులూ..
ఎపుడో..నీ ఆగమనపు జాడలు..
పట్టరాని మోదమేదో పరుగులూ ...

కట్టలుతెగి పరుగెత్తే ప్రవాహాలు....
దాచలేని మొహపు చూపులు....

 దరిచేరాలని సరిగమలు పదనిసలు ...
మదిలో తెలియని  వెన్నెలలు ...

 వెలుగు మోము మొహరింపులు ...

నీపలుకుల కమ్మదనం.వినే దె
ప్పుడు 
 నీ మాట అమృత మయ్యేదెప్పుడు
నీఊహలనెత్తావులలో చిక్కేదెప్పుడు 

 పరవశమే బంధించే దెప్పుడు
 

తొలివలపుల తియ్యదనం కావాలిప్పుడు
  కలయికకై త్వరపడాలిప్పుడు
వడివడినను చేరగ రావాలిప్పుడు 

  ఎడబాటిక తాళ లేక ఉన్ననిప్పుడు

వేడుక ఇక మన కలయిక కోసం

 వేచియుంటి వేయికనులు నీ కోసం
అనందం విరబూయునులే నీ కోసం

  సరాగాల.. సంబరమేలే ఇక నీ కోసం

స్త్రీ మాటలు ప్రణయ సమయంలో మనస్సులను కరిగిస్తాయి. ప్రేమను వెదజల్లుతాయి, శృంగార రసాన్ని పెల్లుబికేలగా చెస్తాయి,   సరసంగా ఉంటాయి,  ఆనందాన్ని కలుగ చేస్తాయి, మన్మధభావాన్ని ఉద్దీపనం 
చేస్తాయి, నర్మ గర్భంగా ఉంటాయి, కాముకుల సర్వస్వాన్ని హరించి వేస్తాయి. మన పూర్వ కవులు కాళిదాసు, భార్తుహరి, వాస్చాయనుడు చెప్పినదే నేను చెపుతున్నాను అనుకువగా జీవించి ఆనందాన్ని పొంది సృష్టికి సహకరించి, ప్రకృతిని అనుసరిమ్చి  దేశసేవ చేయట, తల్లి తండ్రులను పూజిమ్చుట, గురువులను గౌరవించుట అందులో పొందే అనందం నిజమైన   ఆనంద పారవశ్యం 
ఇంకా ఉన్నది .........

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి