28, అక్టోబర్ 2015, బుధవారం

ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం-27

ఓం శ్రీ రాం   ఓం శ్రీ రాం    ఓం శ్రీ రాం 
 ఆనంద పారవశ్యం


సర్వేజనా సుఖినోభవంతు

ఆప్యాయత

అనురాగపు ఆప్యాయతతో ఆనందాన్ని పంచి

అధరామృతమును ఆత్రుతగా అందించి

అంగాంగ స్పర్సతో అహో అహో అనిపించి

అలంకారములతో మనసును గెలిచావు రాధా



మృదు మంద హాసముతో మదిని తొలచి

మంద మతి నగు నన్ను మన్మదుడుగా మార్చి

మకరందము మాధుర్యం రుచిని మరిపించి

మధురవాక్కులతో మనస్సు గెలిచావు రాధా  



సుకుమారపు సుమధుర సురసుని పంచి

సరస సంభాషణలతో స్వరమాలికను సలిపి

సురలోకపు సుమాలను సుతరముగా తెచ్చి

సొగస్సు సొబగులతో మనస్సుని గెలిచావు రాధా   



లలిత లావణ్యమును లయకరముగా చూపి

లాస్య మాడక లోల్లి చేయక లౌక్యం చూపి

లతలల్లు కున్నట్లు లంగరు వేసినట్లు ఆపి

లోలత్వముతో మనస్సుని గెలిచావు రాధా   



 (శరళ భావాలు)

కలలు కల్లలు కావులే అవి వెన్నెల తలపులు

వాక్కులు యల్లలు కావులే అవి తీపి గుర్తులు

ప్రేమలు సల్లాపాలు కావులే అవి మధరస్మ్రుతులు

దు:ఖాలు గుల్లలు కావులే అవి నాంది సుఖాలు



ఊహాల గుసగుసలు అందుకోలేని తెమ్మెరలు

ఆశల రుసరుసలు అందుకోలేని తుమ్మేదలు

రవ్వల వెలుగెలుగులు పట్టుకోలేని బుడగులు

మువ్వల జిలుగులు కంది పోలేని స్వరాలు



మల్లెల పరిమళాలు తాకు నాసికా పుటలు

వేదాల ధర్మాలు తాకు కర్ణ  యుగలాలు

నయనాల చూపులు తాకు రస గుళికలు

పెదాల పెదాలు తాకు సత్య సుఖ రాత్రులు
--((*))--

ఈ పాటకు ట్యూ ను ఉన్నదా ?      


ఓ ఓ మావా ఇటు రావా

చల్ల గాలితో గబురంపితిని
తార తారనూ  అడిగితిని
మనసు దోచావని చెప్పితిని
వేచి ఉన్నాను రా మావా

మనసు గంతులు వేసే
దోసిట వలపులు పూసే
మల్లె పూల వాస వచ్చే
వస్తున్నా వస్తున్నా మరదలా

మేఘపు జల్లుకు తడిసితిని
నెమలి నాట్యంలా మారితిని
పారవశ్యంలో మునిగిపోయితిని
ఈ రేయి నీదే నోయి రా మావా

వలపు తలపులు పొంగే
వయసు ఉరకలు వేసే
మనసు పరుగులు పెట్టే
వస్తున్నా వస్తున్నా మరదలా

ఓ ఓ మావా ఇటు రావా
వస్తున్నా వస్తున్నా మరదలా
--((*))--


నిజాన్ని నిర్ధారించి శక్తి
అభద్ధాన్ని నిరూపించే శక్తి

వ్యర్ధాన్ని వ్యక్తపరిచే శక్తి

ఉన్నా మానవులకు నోరు రాదు



శాశ్వితo అనేది ఎవ్వరికీ లేదు

అశాశ్వితo గగనం అనక తప్పదు

విశ్వాసం అనేది కాన రాదు

అవిశ్వాసం అనేది నోరు రానిది



గమనం ఎడారిలో ప్రయాణం లాంటిది

గమ్యం నిరుద్యోగికి ఉద్యోగము లాంటిది

గమనం లో విశ్రాంతికి అవకాసము లేదు

గమ్యానికి దిశ నిర్దేస్య కాలం కలదు



మాసంలో ఉన్నది వ్యామోహం

వ్యామోహం నుండి వస్తుంది అబద్ధం

అబద్ధానికి ఎప్పుడు వ్యతరేకత జీవితమ్
కానీ అనిపిస్తున్నది ఇది కలి యుగధర్మం

--((*))--
Photo

కన్న కొడుకు త్రాగుడుకు,
కన్న కూతురు తిరుగుడుకు
కన్న తండ్రి దేశాటన వళ్ళ 
కన్న తల్లి కంట నీరు

నేల తల్లి ఎండుట చూసి
పిల్ల తల్లి  రోగాన్ని చూసి
తెల్లావు తల్లి భాద చూసి
తల్లుల తల్లి కంట నీరు

మంచి మార్కులు రాలేదని  
వంచిచిన వారిని ఎదిరించలేనని
వంచనకు గురిఅయిన బిడ్డని
చీసిన తల్లికి  కంట నీరు

ప్రేమ విఫలమైనదని    
ప్రేమను పొందలేకున్నాని
ప్రేమను గుర్తించుట లేదని
ప్రేమను పొందలేని తల్లి కంట నీరు 

నిరుద్యోగం అనకు - నీలొ ఉన్న విద్యను పంచు
వైఫల్యం  అనకు - దృడ సంకల్పం తో సాధించు
సమస్యలు అని అనకు - శక్తితో సమస్యను ఎదిరించు
నేలతల్లి కంట  నీరు, కన్న తల్లి కంట నీరు తెప్పించక జీవించు
--((*))--


అజ్నానులను విజ్ఞానులుగా మారుద్దాం
క్షణిక వత్తిళ్ళు ఉన్నాతెలుగును నేర్పిద్దాం
అసంతృప్తి లేకుండా సంతృప్తి  అందిద్దాం  
మార్గాదర్సకులమై తెలుగు జాతి ఘనత చాటిద్దాం - ..

సజ్జన సాగాత్యం పోగొట్టును బుద్దిమాద్యం
సత్య మార్గమే గుణానికి నిజ ప్రమా ణం
ధర్మ మార్గం నడుస్తుంటే గౌరవం తద్యం
పాపపనిలో సుఖమున్న ఎప్పటికైనా హానికరం       

సత్పురుషుల మాటలు వింటే మనస్సుకు శాంతులు 
మనస్సు నిర్మలంగా ఉంచుకుంటే కీర్తి దశదిశలు
ధైర్యముగా ఉన్నప్పుడే వచ్చును మంచి ఆలోచనలు
తల్లితండ్రుల గౌరవిస్తూ ఓర్పు వహిస్తే అన్ని జయాలు


                                              ఇంకాఉన్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి