ఓం శ్రీ రాం ఓం శ్రీ రామ్ ఓం శ్రీ రామ్
ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం
సర్వేజనా సుఖినోభవంతు
జవాబు దొరకని ప్రశ్న ఉండదు
అర్ధంకాని జీవితమనేది ఉండదు
బ్రమకు మించిన మాయ ఉండదు
కలలురాని జీవితమనేది ఉండదు
మానవత్వాన్ని నేర్పేది గురువు
సహజత్వాని తెలిపేది గురువు
జ్ఞాసంపంనుడుగా అమర్చేది గురువు
అట్టి గురువు దైవంతో సమానం
నమ్మలేని జీవితcమెక్కడుంది
బ్రతకలేని దేశ మెక్కడ ఉన్నది
ప్రేమించ లేని స్త్రీ ఎక్కడఉన్నది
దేవునిచూడని ప్రాంత మేక్కడుంది
రాలి, వాడిన పూలు
మళ్ళీ వికసించినట్లు,
కాలి, బూడిదైన ఆశలు
మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు,
చీలి, ముక్కలైన కుటుంబం
మళ్ళీ ఉమ్మడిగా గుమ్మడి పువ్వై నవ్వినట్లు,
తేలి, సుదూరంగా పోయిన మబ్బులు
మళ్ళీ జాలి తలచి వచ్చి..వర్షమై కురిసినట్లు,
మళ్ళీ ఉమ్మడిగా గుమ్మడి పువ్వై నవ్వినట్లు,
తేలి, సుదూరంగా పోయిన మబ్బులు
మళ్ళీ జాలి తలచి వచ్చి..వర్షమై కురిసినట్లు,
వాలి, చిరాకు పుట్టించే కోర్కెల పక్షులు
మళ్ళీ వాటంతట అవే నిశ్శబ్దంగా ఎగిరి వెళ్ళినట్లు,
కూలి, ముక్కలైన ఆశల శిఖరం
మళ్ళీ దానికదే అతుక్కుని..ఠీవిగా నిలబడినట్లు,
తూలి, క్రింద పడిన తాగుబోతు
మళ్ళీ తనంత తానే లేచి చక్కగా వెళ్ళినట్లు,
మాలిపై అలిగిన గులాబీ
మళ్ళీ మాట కలిపి..సంతోషం పెంచినట్లు,
సోలిపోయే కన్నులతో అలసిపోయినా..
మళ్ళీ నువ్వు స్వాగతం పలుకుతున్నట్లు,
పేలి ముక్కలైందనుకున్న మనసులో ఈ వింత ఆలోచనలు
మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నట్లు..??.
కరువు కాటేసింది
ముసురుతున్న ఈగల్ని సైతం
విసురుకోలేని ఓ అనాధ శవం
రోడ్డు ప్రక్కన నరికి విసిరేసిన
ఎండిపోయిన మ్రానులా పడివుంది.
అందరు చూసుకుంటూ వెళుతున్నారు
చేతిరుమాళ్ళని ముక్కులకానిస్తూ.......
ఎక్కడలేని అసయ్యాన్నంతా కళ్ళల్లో
నింపుకుని....నింపాదిగా...తమకిక
చావే రాదన్నంత ధీమాగా...చనిపోవడ
మనేదదో పేద్ద నేరంలా భావిస్తూ.....
ఎవరికీ ఎలాంటి జాలిలేదా శవంపై
శవం బతికున్నపుడు సైతం .......
దాచుకోవడానికేమీ తనవద్ద లేదని
తెలపడానికేమో..చిరిగి చెదరిన బట్టలు
శవ దారిద్రాన్ని తెలుపుతూ నే వున్నాయ్
వారంరోజులుగా చూస్తూనే వున్నాను
ఆకలీ ఆకలంటూ అడుక్కోడం కూడా
చేతగాని అర్భకుడి శవాన్ని చూసి
నాకళ్ళు చెమర్చాయి...నివాళిగా
కరువు వికట్టాట్ట హాసం చేస్తే రేపుందనే
ఆశ అప్పులకోసం ఆరాటపెడితే....తనకున్న
ఆరెకరాల్లో ..పసిడిపండించుకోవచ్చన్న
ఆశ అడియాసై అప్పనే సర్పం బుసకొడితే
కరువనే కాలరాక్షసి కాటేసిన అన్నదాత...
నమ్ముకున్న భూతల్లిని అమ్ముకోలేక
ఆధారపడ్డ బతుకులనన్యాయం చేయలేక
పనికోసం పట్నమొచ్చిన రైతన్న..
పనేక్కడదొరుకుతుందో కూడా తెలియక
ఆకలిబాధకు అభిమానం వదిలి అడుక్కున్నా
దుక్కలావున్నావ్ పని చేసుకోరాదు...
అందరి ఈసడింపులే..,.. ఆకలి తీర్చండమ్మా
ఏపని చెప్పినా చేస్తానని బ్రతిమాలినా
దొంగ వో దొరవో పనిలేదు పో పో అంటూ
కసిరిన వారే పాపం....
ఆకాశం అక్షరాలు వరదలా కురిపిస్తే
అవని తల్లి తన్మయత్వంలో వెళ్ళు విరిస్తే
గంగా ప్రవాహముతో పుడమి తల్లి పులరిస్తే
అక్షరజ్ఞానంతో కర్షక కృషి వలురు విస్తరిస్తారు
కర్షక జీవులు ధరణిని దున్ని విత్తనాలు చల్లితే
పృద్విపై రైతు సంరక్షణతో మొక్కలు పెరిగితే
పంటనుకోసి బండ్లకెత్తి కొంత అమ్మి ధనం తెచ్చితే
ఇంటిల్లి పాటు సంతోషాలతో జీవితమ్ గడుపుతారు
వేణుగాణ రస మాధుర్యంలో మునిగి
కృష్ణ ప్రేమామృతం కొరకు తపించి
పారవశ్యంతో మనస్సులో కృష్ణుని చేరి
దారామ్రుతము రాధా గ్రోలి తన్మయమొందిన్
ప్రాణాలతో చెలగాటం ఎందుకు
గగుర్పాటు చెందే ప్రయాణాలు ఎందుకు
బ్రతికుంటే తినవచ్చు బలుసాకు
పటము గాంచినకలిగే భయము నాకు
తనువులో ముళ్ళు, మనసులో కుళ్ళు
ఎంగిలాకు బతుకుళ్ళు, ఉండేది కల్ముషలోగిళ్ళు
రోగాలతో వళ్ళు, మరణశయ్యపై చేరేవాళ్ళు
ధనంకోసం రక్త దానమ్ము చేయట రాక్షసమ్ము
గతం అంతా మంచే జరిగింది
వర్తమానం కూడా మంచే జరుగుతోంది
భవిష్యత్ కూడా మంచే జరుగుతుంది
నువ్వు ఏమి పోగొట్టు కున్నావని అంతలా దుఃఖిస్తున్నావు ?
నువ్వు పోగొట్టు కున్నదాన్ని నువ్వు సృష్టించలేదు
నువ్వు పోగొట్టు కున్నదాన్ని నువ్వు సృష్టించలేదు
నువ్వు అనుభవిస్తున్న దంతా నువ్వు సృష్టించలేదు
నువ్వు అనుభవిస్తున్న దంతా ఇహలోక సంపదే
నువ్వు అనుభవించే ఈ భోగ భాగ్యాలు వేరొకరి సొత్తు
నేడు నీదిగా అయ్యింది .
రేపు వేరొకరికి స్వంతం అవుతుంది .
మార్పు అన్నది ప్రకృతి సహజ ధర్మం
నువ్వు అనుభవిస్తున్న దంతా ఇహలోక సంపదే
నువ్వు అనుభవించే ఈ భోగ భాగ్యాలు వేరొకరి సొత్తు
నేడు నీదిగా అయ్యింది .
రేపు వేరొకరికి స్వంతం అవుతుంది .
మార్పు అన్నది ప్రకృతి సహజ ధర్మం
--((*))--
పద్యరూపంలో..ఆ.వె
తనకు తాను తనను తానొక బొమ్మగా
మలచి తన్వయత్వమదినివొంది
పూలదండతోడ పూబోణి వరుడికై
వేచి చూచె తాను బేల యబల.
నీ అందానికి నామనసు భావం
కుంతీ దేవి మంత్రం ప్రభావం పరీక్షించే
సూర్య ప్రభావం వళ్ళ బిడ్డను కనే
సంతోషము భయము తో బిడ్డను వదిలే
భర్త రహిత సంతు బడసి మురిసి వదిలే
కనురెప్పల చూపులు, పెదాల కదలికలు
వాలు జడతో కలువ వలవుల అందాలు
పూల దండతో ప్రవల్లికా పూబొని కదలికలు
దర్పణ నిజరూప చిత్ర మయూరి సౌరభం
v
2+2 = 4 వేళ్ళు
2+2 = 4 జోళ్ళు
2+2 = 4 కళ్ళు
2+2 = 4 లోగిళ్ళు
స్నెహానికి స్నేహం - ప్రాణానికి ప్రాణ0
1 + 1 = 1 + 1 = M + రివర్స్ M
i.e. M is 4 strokes and W is four Strokes 2+2 = 4 జోళ్ళు
2+2 = 4 కళ్ళు
2+2 = 4 లోగిళ్ళు
స్నెహానికి స్నేహం - ప్రాణానికి ప్రాణ0
1 + 1 = 1 + 1 = M + రివర్స్ M
కన్న కొడుకు త్రాగుడుకు,
కన్న కూతురు తిరుగుడుకు
కన్న తండ్రి దేశాటన వళ్ళ
కన్న తల్లి కంట నీరు
నేల తల్లి ఎండుట చూసి
పిల్ల తల్లి రోగాన్ని చూసి
తెల్లావు తల్లి భాద చూసి
తల్లుల తల్లి కంట నీరు
మంచి మార్కులు రాలేదని
వంచిచిన వారిని ఎదిరించలేనని
వంచనకు గురిఅయిన బిడ్డని
చీసిన తల్లికి కంట నీరు
ప్రేమ విఫలమైనదని
ప్రేమను పొందలేకున్నాని
ప్రేమను గుర్తించుట లేదని
ప్రేమను పొందలేని తల్లి కంట నీరు
నిరుద్యోగం అనకు - నీలొ ఉన్న విద్యను పంచు
వైఫల్యం అనకు - దృడ సంకల్పం తో సాధించు
సమస్యలు అని అనకు - శక్తితో సమస్యను ఎదిరించు
నేలతల్లి కంట నీరు, కన్న తల్లి కంట నీరు తెప్పించక జీవించు
--((*))--
అజ్నానులను విజ్ఞానులుగా మారుద్దాం
క్షణిక వత్తిళ్ళు ఉన్నాతెలుగును నేర్పిద్దాం
అసంతృప్తి లేకుండా సంతృప్తి అందిద్దాం
మార్గాదర్సకులమై తెలుగు జాతి ఘనత చాటిద్దాం - ..
సజ్జన సాగాత్యం పోగొట్టును బుద్దిమాద్యం
సత్య మార్గమే గుణానికి నిజ ప్రమా ణం
ధర్మ మార్గం నడుస్తుంటే గౌరవం తద్యం
పాపపనిలో సుఖమున్న ఎప్పటికైనా హానికరం
సత్పురుషుల మాటలు వింటే మనస్సుకు శాంతులు
మనస్సు నిర్మలంగా ఉంచుకుంటే కీర్తి దశదిశలు
ధైర్యముగా ఉన్నప్పుడే వచ్చును మంచి ఆలోచనలు
తల్లితండ్రుల గౌరవిస్తూ ఓర్పు వహిస్తే అన్ని జయాలు
--((*))--
మంచి మాటలు
మనసుకు అంటవు
మల్లెల పరిమళం
కాగితపు పూలకు అంటవు
చల్లని మాటలు
వెచ్చని వానికి గిట్టవు
వెన్నెల చల్ల దనం
సూర్య రస్మి ఒప్పదు
పెద్దల మాటలు
పిల్లలకు వంట బట్టవు
సజ్జణుని సద్గుణం
దుర్జనునికి నప్పదు
ప్రాణుల నీడ నిలబడదు
కిరణం కదలక మానదు
దీపమ్ క్రింద నీడ మారదు
ఆలోచనలకు దారి లేదు
ప్రతిమొగ్గ పువ్వుగా మారదు
ప్రతి మాట ఆచరణకు రాదు
ఉరిమే మేఘం వర్షం కురవదు
అరిస్తే పని సక్రమముగా కాదు
ప్రతి క్షణం సుఖ ముండదు
కష్ట మనేది చెప్పి రాదు
తీగలో విద్యుత్తు కన బడదు
పట్టుకుంటే ప్రాణం పోక మానదు
దట్టమైన పొగ నిప్పుని కప్పేస్తుంది
చేసినతప్పు కుటుంబాన్ని భాదపెడుతుంది
దుమ్ముధూలి అద్దాన్ని మూసెస్తుంది
కళ్ళు నెత్తిమీదకొస్తె అహం వెంబడిస్తుంది
అజ్ఞానం మనసును మాయచేస్తుంది
తప్పు దాచటం ఎవరి తరం కాదంటుంది
గాలివాటముగా పడవ ప్రయాణము చేస్తుంది
కుటుంబం ఆశ మొహాలచుట్టూ తిరుగుతుంది
--((*))--
రంగ పాండురంగ రంగ రంగ వైభవంగా
రవ్వల తొడుగు చేసి నీకు తొడగంగా
రాధతో రాసకెళీ వినోదంలో మునగంగా
నన్ను నేను మరచి వెడుకుంటున్నాను రంగా
వంటి కాలి వన మయూరి - ఒళ్ళంతా వయ్యారం
వడిసి పట్టు వలసుల పోరి - ఓర్పు లో సింగారం
అందంతో అద్దం లోనే అదిరి - ఓనామాల శృంగారం
అయ్యారే అద్బుత సుందరి - ఓర్వలేకున్న మరి
--((*))--
స్పర్శ-రాపిడి
గుండె సవ్వడి - కొమ్మ రెమ్మ మద్య స్పర్శ
తలుపు కదలిక - గాలి వేలుతురు మద్య స్పర్శ
మొగ్గ పువ్వైతే - మకరంద పరిమళాల స్పర్శ
నీరు, ఎరువు పోస్తే - పృద్విలో విత్తనాల మద్య స్పర్శ
మేఘంలో మెరుపు - ఆకాశంలో పక్షుల మద్య స్పర్శ
స్త్రీతో పురుషుడు - ఇరువురి ప్రేమల మద్య వెలిగే స్పర్శ
ఏకాంతంలో కాంత - సుఖ సంతోషాల మద్య స్పర్శ
మాణంలో ప్రాణం - అభిమానాలు అపోహల మద్య స్పర్శ
ప్రేమ లో కామం- వయసు వాంచల మద్య స్పర్శ
దూరం లో దగ్గర - ఆకాశం భూమిల మద్య స్పర్శ
బీజం లో యోగం- హృదయ సంస్కారాల మద్య స్పర్శ
న్యాయం లో అన్యాయం - ధర్మానికి నాయకులకు మద్య స్పర్శ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి