13, అక్టోబర్ 2015, మంగళవారం

ప్రాంజలి ప్రభ -ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం -21

ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ రామ్   ఓం శ్రీ రామ్ 


     శుభోదయం.!
శ్ర్రీ నాధుని కాశి నగర సూర్యోదయం .
‘’ప్రధమ సంధ్యాంగానా ఫాల భాగమున
–జెలువారు సింధూర తిలక మనగ గైసేసి పురుహూతు గారాపు టిల్లాలు
-పట్టిన రత్న దర్పణ మనంగ నుదయాచాలలేంద్రంబు తుద బల్లవిం చిన
–మంజు కంకేళి నికుంజ మనగ శత మాన్యు శుద్ధాంత సౌధ కూటము మీద 
–గనువట్టు కాంచన కలశమనగ గాల మనియెడు సిద్ధుండు గమిచి మ్రింగి
 –కుతుక మొప్పగా నుమిసిన ఘటిక యనగ గగన మందిర దీపికా కళిక యనగ
–భానుడుదయించే దేదీప్య మాను డగుచు ‘’
.
భావం –
ప్రాతః కాల సంధ్య అనే స్త్రీ నుదుటి మీద సింధూరం బొట్టు లాగా,
బాగా అలంకరించుకొన్న ఇంద్రపత్ని శచీదేవి చేతిలో ఉన్న అద్దం లాగా ,
తూర్పు కొండ పై చిగిర్చిన అశోక వృక్షపు పొదరిల్లు లాగా ,
ఇంద్రుడి మేడపై ఉన్న బంగారు కలశం లాగా,
కాలం అనే సిద్ధుడు మింగి ఉమ్మేసిన మాత్ర లాగా , .
ఆకాశ మందిరం లో ప్రకాశించే దీప కాంతి లాగా సూర్యుడు ఉదయించాడు .
'గమిస్తూ..సంగమిస్తూ ..
గలగలలుగ పారుతూ జలజలలుగ జారుతూ ..అలనీలవేణి.. మా కృష్ణవేణి ..!!'
*ప్రాణులు ఆదుకుంటున్న మా **యమ్మ కృష్ణమ్మ*

గల గల పారెను సెలయేరు
జల జల జారెను మిట్టయేరు
తల తల మెరిసేను నదీనీరు
కల కల నవ్వుతూ సాగే నీరు

కొండ మిట్టలు కదులుతూ పారు
ఆగి ఆగి సాగి సాగి తీరు మారు
నీకు పూజ కొత్తవి కొకలిత్తురు
మధురమగ పుష్పాలతో పూజింతురు

నదిలో స్నానాలు చేయుదురు
అహంకారం తొలగించమని వేడుకొందురు
పసుపు కుంకుమ లు యిత్తురు
పిండి వంటలు నైవేద్యం పెట్టుదురు

భక్తి కరంబగు పాటలు పాడేదరు
శక్తి కొలది నాట్యాలు చేయుదురు
యుక్తి తో కలసి మెలసి ఉందురు
ముక్తి నోసంగమని వేడుకొందురు

అవనికి వచ్చింది మా యమ్మ కృష్ణమ్మ
ఆరాధ్యులకు ఆదిదేవత మా యమ్మ కృష్ణమ్మ
ఇలవేల్పుగా ఉన్నది మా యమ్మ కృష్ణమ్మ
ఈతి భాధలను తొలగించేదే మాయమ్మ కృష్ణమ్మ
 
శుభరాత్రి.!.
కాశీలో చంద్రుడు ఏం చేశాడో ఇప్పుడు వర్ణిస్తున్నాడు శ్రీనాధుడు .
‘’అభిషేక మొనరించు నమృత ధారా వృష్టి
–మదనాంతకుని ముక్తి మంటపికకు నలవోకగా విశాలాక్షీ మహాదేవి
 –నిద్దంపు జెక్కుల నీడ జూచు నేరియిం చు మిన్నేటి ఇసుక తిన్నెల మీద
 –జక్రవాకాం గనా సముదయంబు డుంఠి విఘ్నేషు నిష్టుర కంఠ వేదిపై
-గోదమ చుక్కల రాజు గుస్తరించు గాయు వెన్నెల యానంద కాననమున
–గాల భైరావు దంష్ట్ర లకు డాలుకొలుపు విధుడు 
వారాణసీ సోమ వీధి చక్కి
 –నాభ్ర ఘంటా పదంబు నరుగు నపుడు ‘’

భావం
–చంద్రుడు కాశీ నగరం లోని సోమ వీధి ప్రాంతముపై 
ఆకాశ వీధిలో సంచ రించే టప్పుడు
–విశ్వేశ్వరుని ముక్తి మంటపాన్ని వెన్నెల వర్షం తో అభిషేకిస్తాడు
.-విశాలాక్షీ దేవి స్వచ్చమైన చెక్కిళ్ళపై ప్రతి బిం బిస్తాడు.
-గంగానది ఇసుక తిన్నెలపై ఆడ చక్ర వాక లను బాధ పెడతాడు
-.డుంఠి వినాయకుని కంఠము దగ్గరున్న చంద్రుడిని లాలిస్తాడు
-కాశీ మీద వెన్నెల కురిపిస్తాడు
- క్షేత్ర రక్షకుడైన కాల భైరవుని కోరకు కాంతి నిస్తాడు.
-చంద్ర బింబం లోని మచ్చ ఎందుకు ఏర్పడింది అంటే రోహిణీ దేవి చంద్రుడిని కౌగిలిమ్చుకోవటం వలన
 -ఏర్పడిన కస్తూరి పూతవలన,
-రాహువు కోరతో కొత్తగా ఏర్పడ్డ చిల్లి లో కనబడే ఆశం ముక్క వలన,
-స్వచ్చం గా ఉండటం చేత కొరికి మింగిన చీకటి వలన,
-పుట్టినప్పుడు మందర పర్వతం రాసుకోవటం వల్ల
ఏర్పడిన కాయ వలన,
-విరహం తో తాపం చెందే ఆడ చక్ర వాకాల కడగంటి చూపు అనే నిప్పు వల్ల కలిగిన ఇంట్లోని ధూమం వలన  అని శ్రీనాధుడు ఉత్ప్రేక్షించాడు .
రాత్రి అంతా వెన్నెల స్నానం తో జనం పులకరించిపోయారు
.మళ్ళీ సూర్యోదయం అవ్వాలి .నిత్య కర్మానుస్టాలు ప్రారంభ మవ్వాలి

'పరాజయము..( నోరి వారి కవిత)

బింబ ఫలముల బోలు నీ పెదవులెపుడు
ఈ యధర మంటి వేడి ముద్దిచ్చెనపుడె
అంకితంబయ్యె నా హృదయంబు నీకు
నృపతి ముద్రాoకితంబైన లేఖ యట్లు !
సిగ్గు పొర దాటి పటు భుజాశ్లేష మందు
ఇప్పుడీ సఖి తనువు బంధించినావో
అర్పితంబయ్యె నపుడె నా యాత్మ నీకు
రణ పరా జితుడైన శాత్రవుడు వోలె'
పెదవుల రుచి ఎప్పుడు – అమృతాన్ని తలపించు
హృదయ శబ్దం ఎప్పుడు- తన్మయత్వాన్ని తలపించు
ముద్దు ఇవ్వాలన్నప్పుడు –అంకితభావం తలపించు
లేఖవ్రాయలను కున్నప్పుడు- స్మృతులు తలపించు

సిగ్గు పొరదాటి నప్పుడు – తనువు పులకరించు
తనువు అర్పితంబై నప్పుడు – సుఖాలు పలకరించు
మనసుకు లొంగి నప్పుడు – పరాజిత రాజులా అనిపించు
ప్రకృతి పరవశించి నప్పుడు – భాషలు పులకరించు
 



'||తెలుగు తల్లి || ప్రజాశక్తి 11.10.2013||
విభజన గీతం చెవిని సోకంగా,
సోదర కలహం కనుల తాకంగా..
మా తెలుగు తల్లికి ముళ్ల పూదండ
మా కన్న తల్లికి కడుపు కోత
కడుపులో కంగారు,
కనుచూపులో బెదురు
చిరునవ్వులే మరిచి
చిన్నబోయెను తల్లి
వలవలా గోదారి
కన్నీటి వరదగా మారి,
కళ తప్పి కృష్ణమ్మ కలత చెందే వేళ
బంగారు కలలన్ని భగమయ్యేను
భవితపై భ్రమలన్ని దొరలిపోయేను
అన్నదమ్ముల పోరు
అంతమయ్యే దాక,
ప్రాంత భేదము లేక తెలుగు తల్లి కలత 
ప్రగతి పొందేదాక,
ఏకమై ఆంధ్రులు ఖ్యాతి పొందేదాక...
తల్లి మనసున తాను తల్లడిల్లునురా!
తెలుగు జాతికి
గ్రహణ కాలమిది సోదరా
****
- డాక్టర్‌ డివిజి శంకరరావు,
మాజీ ఎంపి, పార్వతీపురం, విజయనగరంజిల్లా
__________
12.10.2013 ఉ.10.27'
తెలుగు జాతికి గ్రహణం కాదు సోదరా
తెలుగువారుతో ఆడిన రాజకీయమురా
ప్రాంతాలువేరైనా అందరమూ ఒకటేనురా
తెలుగుతల్లి తెలుగు వారిని కాపాడునురా

'నేతలోని నేత బాగుందికదూ!'

తెలుగుదేశం పార్టి విధాత
నేతను గుర్తు చేసిన చేనేత
మరువలేము శాంతి దూత
అందుకే ఇవ్వాలి చేయూత
Venkateswara Rao Goteti's photo.
పిన్ను తో పన్నుపన్నుమద్య ఉపయోగించకు
పిన్ను తో చెవిలో గుబులు తీయుటకు వాడకు
పిన్ను ఎప్పుడూ ఎక్కడపడితే అక్కడ పారేయకు
పిన్ను గుచ్చుకొని ప్రమాదము నకు గురికాకు
Venkateswara Rao Goteti's photo.
పిన్ను ను బొత్తాల బదులు వాడు
పిన్ను చీర కుచ్చుల్లకు వాడు
పిన్ను ను అవసరానికి వాడు
అందుకే పిన్నులు మూడు రకాలు వాడు
 

'చేరినదో // తెలుగు గజల్ // విరించి

కర్రలాంటి చెరుకులోన మధురిమెట్లు చేరినదో
సడిసేసెడి నీయెదలో ప్రేమయెట్లు చేరినదో

నీ బుగ్గల కెంపులెగసి తూ ర్పునింగి తామురిసె
తిరిగి నీదు బుగ్గలలో మంకెనెట్లు  చేరినదో 

నీ నుదుటన సింధూరమె అరుణుడిగా నవతరించె
భృకుటిమధ్య కాంతులతో సూర్యుడెట్లు చేరినదో

నీ పదమంజీరాలవి స్వరలహరై స్వాగతించె 
నీ కన్నల శుభముగోరు కాంక్షలెట్లు చేరినదో

నిన్నటి భానుడె గదమరి నేడు తూ ర్పునుదయించెను
నిన్నొచ్చిన అలకపోక నేడు యెట్లు చేరినదో

చీకటెనుక వెలుగు జేరు కష్టమెనుక సుఖముజేరు
కినుక వెనుక కినుకన నీ మదిని యెట్లు చేరినదో 

శుభోదయము సుప్రభాత సుందరినీ యందమునకు
వగలమారి కోపమింక వదలకెట్లు చేరినదో '
ప్రత్యూష కిరణాలవళ్ళయత్వైతానంద సౌఖ్యములు కలుగున్
సత్వర తేజస్సు వళ్ళ
నిత్య యవ్వన సుఖముల్ పొందేదరన్

శ్రీ కాంత్ వెలుగుల వళ్ళ
శ్రీ మంత్ లా సర్వ సుఖంబుల్ కలుగున్
శ్రీ శాంత్ ప్రశాంత్ వళ్ళ
శ్రీ శక్తి మనస్సు ప్రశాంతముగా ఉంచ్చున్
వగలమారి వయ్యారి - వలపుల సొగసరి
వరుసకు సయ్యా నారి - వలదనుకు మయ్యూరి
వయసును అడుగుట లేదుపోరి - వలపే చకోరి
వంకరమాట కాదు మనసు చోరి - వలిచాను బంగారి

'మిత్రబృందానికి శుభోదయం....

'' స్నానాలు చేసారా??

ఇదిగో సముద్రం..శనివారం..స్నానం ఇందులో చెయ్యండి... నేను వెళ్ళొస్తా...'''
కడలి కెరటం కలవార పెట్టక కనువిందు
తడబడక పుర జనులు స్నానాల విందు
నడ చేవారికి సూర్యుని వెలుగు పసందు
కడ వరకు అందరు స్నానానందం పొందు
'.          ఇందు వదన
.          ...... ......
.
సీ॥సంపంగి నాసిక।మొంపు నడుము సొంపు
        నింపు గళరవము।నిండు మోము
     హంసయాన దొనుకు।హంగుపొంగు లొలుకు
        కొంగు హోరంగు నీ।చెంగు లలర
     నింగి శశికిరణ।మంగి నేలనడిచె
        బంగారు గణ ఛాయ।భామ మేని
     అంగాంగ శోభిత।అందాల విలసిత
        మందార నెలవుల।మగువ తాను
ఆ॥దొండపండు పెదవి।దోరబండు సుదతి
     యింతి పూల బంతి।యిందు వదన
     నర్సపురని వాస।నటరాజ గణమోక్ష
     విశ్వ కర్మ రక్ష।వినుర దీక్ష
.
.
.              పద్య రచన
.         రాజేందర్ గణపురం
.         10/10/2015'
ఇందు వదన
అనుకువగా మౌనంగా నా ప్రేమ నికెలా చెప్పను
పెదాల పదాలు పొందాలని ఆశ ఉందని ఎలా చెప్పను
మనసే అనురాగంగా మార్చి ఆత్రుత గురించి ఎలా చెప్పను
అధరామృతము ఆస్వాదించాలని నీకెలా చెప్పను

ఈ హృదయ తపన చల్లారేదేలాగో చెప్పగలవా
నీ వంపు సొంపు వయ్యారం నే మరిచే మార్గ చెప్పవా
తిండి లేదు, నిద్రరాదు ఈ మంధత్వాన్ని పోగొట్టవా
ఈ గుండె వేడిని తగించ్చే చల్లదనం పంచవా

నవ నవలాడే మన్మధ అంటావు - దూరమ్ దూరం అంటావు
నవ రాజా నా తెరతీయ మంటావు - దగ్గరకొస్తే ఇప్పుడు కాదంటావు
రతిరాజ జత కలప మంటావు - మనసులేదు వద్దంటావు
శ్రీకారం చుట్టి ఆడుకుందామంటావు - ఇప్పుడు కాదంటావు

కళ్ళ తో చూచె అనుభూతి - కలవరం అంటావు
సుఘంద ఆస్వాద అనుభూతి - సుమధురం అంటావు
శృతి శబ్ద గ్రాహ్యత అనుభూతి - శృతి మధురం అంటావు
చర్మ సృసిమ్చే అనుభూతి - శృంగారం అంటావు
  

ఇంకా ఉన్నది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి