ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ప్రాంజలి ప్రభ - ఇది కధ కాదు - ఆనంద పారవశ్యం -23
సర్వేజనా సుఖినోభవంతు
మిధునంలో భార్య భర్తల భవితవ్యం
అమె అతని చూపులకు తెర తత్త్వం
సహజీవనానికి నాందీగా సహజత్వం
ఇరువురి మనోభిష్టాన్ని అశీర్వతత్వం
నూరెళ్ళ జీవితాన్ని కలిపే మాంగల్య భంధం
ఒకరి తలపై ఒకరు చేతులుపెట్టి ప్రమాణ భంధం
అగ్నిసాక్షిగా 7 అడుగులు నడిచే బ్రహ్మముడి భంధం
అరుంధతి నక్షత్రం చూపిస్తు అభద్దాల కలియుగ భంధం
మంచి మాటలు-మనసుకు అంటవు
మల్లెల పరిమళం-కాగితపు పూలకు అంటవు
చల్లని మాటలు-వెచ్చని వానికి గిట్టవు
వెన్నెల చల్ల దనం-సూర్య రస్మి ఒప్పదు
పెద్దల మాటలు-పిల్లలకు వంట బట్టవు
సజ్జణుని సద్గుణం- దుర్జనునికి నప్పదు
ప్రాణుల నీడ నిలబడదు-కిరణం కదలక మానదు
దీపమ్ క్రింద నీడ మారదు-ఆలోచనలకు దారి లేదు
ప్రతిమొగ్గ పువ్వుగా మారదు-ప్రతి మాట ఆచరణకు రాదు
ఉరిమే మేఘం వర్షం కురవదు-అరిస్తే పని సక్రమముగా కాదు
ప్రతి క్షణం సుఖ ముండదు-కష్ట మనేది చెప్పి రాదు
తీగలో విద్యుత్తు కన బడదు-పట్టుకుంటే ప్రాణం పోక మానదు
దట్టమైన పొగ నిప్పుని కప్పేస్తుంది-
చేసినతప్పు కుటుంబాన్ని భాదపెడుతుంది
దుమ్ముధూలి అద్దాన్ని మూసెస్తుంది
కళ్ళు నెత్తిమీదకొస్తె అహం వెంబడిస్తుంది
అజ్ఞానం మనసును మాయచేస్తుంది
తప్పు దాచటం ఎవరి తరం కాదంటుంది
గాలివాటముగా పడవ ప్రయాణము చేస్తుంది
కుటుంబం ఆశ మొహాలచుట్టూ తిరుగుతుంది
--((*))--
అక్షరం నుడికారం జ్ఞానానికి శ్రీకారం
స్త్రీ వంపుల సుడికారం మచ్చిక హారం
అక్షరం భాషా జ్ఞానానికి పరిష్కారం
స్త్రీ వంపుల సోంపు పొందు మమకారం
విరహంతో కృశాంగి చేరే ఘన వేణి
సృష్టి ఆలంబన కోసం చేరే అలివేణి
అలివేణి ఘనవాని శ్రంగారాల శసివేణి
శృంగార సంభోగ చిరస్మరనీయ వాణి
దర్సన మాత్రంతో కామ దృశ్టే ఆదర్శం
కన్నులకైపు, కౌగలిమ్పులవైపే దర్పణం
యదమేనులొక్కటై సుఖాలవైపే మచ్చినం
మచ్చికతో నిగ్రహంగా వెన్నెలవైపే చుంబనం
యద పొంగును చూస్తే ఉరుకును వయస్సు
మద కొంగును విసిరితే కరుగును మనస్సు
సుద దొరికితే మధు మత్తులో ఊగు తమస్సు
" అఖిల కవిమాన్యమై యలరారు బూతు "
వలదు వలదు భామా నన్ను వదల వలదు
వలచి పిలిచా భామా మోము దాచ వలదు
వలపు తెలుపు భామా నన్నుమరువ వలదు
వయసు కొచ్చావు భామా కూడలి అణ వలదు
ఒంటరి రూపమ్ చెడు - మచ్చిక రూపమ్ మారు
ఒంటరి బలం తగ్గు - మచ్చిక బలం పెరుగు
ఒంటరి జ్ఞానం తక్కువ - మచ్చిక జ్ఞానం ఎక్కువ
ఒంటరి రోగం ఎక్కువ - మచ్చిక రోగం తక్కువ
అందాల సుందరి- పరువాల పందిరి
వయ్యారి సుకుమారి - వలపుపంచు ప్రతి సారి
తరుణీ మయూరి - తపనలు తగ్గించవా పోరి
కలికి చిలకల చేకోరి - మేను ఆకుల సవారి
మెరుపు లాంటి స్త్రీని పుర్షుడు చూసి
పురుషుడు, స్త్రీ నన్నే చూడాలని చేసి
స్త్రీ సౌందర్యాన్ని పురుషుడు మచ్చిక చేసి
ఇరువురు కలసి సంభోగాన్ని ఆహ్వాన్నిమ్చే
స్త్రీ ప్రక్కన చేరి జడపూల వాసన చూసి
స్త్రీ ముఖ పరిమళాల్ని ఆస్వాదించి
స్త్రీ మేను తపిమ్ప చేసి మెప్పించి
స్త్రీ పురుషుల సంగమం స్వర్గమనిపించే
తామరాకుల వంటి ప్రియురాలి హృదయమున చేరి
న ప్రియుడు సెద తీరితే ఇంద్ర భోగమును మించే
యవ్వన మదం తో ప్రియురాలిని ఆలింగనం చేసి
నాయ కా నాయకులు సుఖముగా అనుభవిమ్చే
అరటికాయ బజ్జి,. మినపప్పు సొజ్జి
కధలు, విధలు చెప్పుకుంటూ తిందాం
పాలు,పళ్ళ రసం త్రాగి పవళించుదాం
కలసి, మెలసి కలలు కంటూ నిదురిద్దాం
నీ చూపుల్లో కాంతి - ఉషోదయ కాంతితో సరికాదు
నీ దంతాల్లో కాంతి - మాణిక్య కాంతితో సరికాదు
నీ పలుకుల్లో కాంతి - వాక్భూషనాలతో సరికాదు
నీ అడుగుళ్ళో కాంతి - సప్తపదులతో సరిపోదు
నీ కదలికల్లో కాంతి - నెమలి పించాల కదలికతో సరికాదు
నీ ఆశయాలల్లో కాంతి - మబ్బులో మేరుపలతో సరికాదు
నీ వలువలల్లో కాంతి - చాందినీ గుడ్డలతో సరికాదు
నీ పిల్లల్లో కాంతి - మెరిసేటి హరివిల్లుతొ సరిపోదు
మనసులో ఊహలు గాలిలో తేలుతూ
కోడె వయసు వాన జల్లులో తడుస్తూ
వయ్యారాల వలపులు వెంబడి స్తూ
ఉల్లాసాల తనువు తపనలతో పిలుస్తూ
ఇంకా ఉన్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి