23, ఆగస్టు 2015, ఆదివారం

ప్రాంజలి ప్రభ- bhaava kavitvam -4 (మనిషిగా బ్రతకనీయ్యని ఆధునికం అవసరమా ?)

ఓం శ్రీ రామ్    ఓం శ్రీ రామ్       ఓం శ్రీ రామ్ 
ప్రాంజలి ప్రభ - మనిషిగా బ్రతకనీయ్యని ఆధునికం అవసరమా ?

సర్వే జనా సుఖినోభవంతు 

చాలారోజులు తర్వాత నేను ఈనాడు పాపర్ చదివాను, వారు ప్రచరించిన "విధ్వంసక ఆవిష్కరణ" చాలా బావుంది ముందు వారికి  ధన్యవాదములు ఇందు మూలముగ తెలియ పరుస్తున్నాను.    
 నా ఆలోచనలతో భావ కవిత  "మనిషిగా బ్రతకనీయ్యని ఆధునికం అవసరమా ?"ఇందు వ్రాయుటకు ముందుకు వచ్చాను మీ అభిప్రాయాలు నాకు తెలుపగలరు 

భూమి మీద కొందరి ఆలోచనలు 
వారి మంచి అభి ప్రాయ బావాలు 
ఆధునిక చరిత్రకు ఇక పునాదులు
కొత్త మార్గం  ఆవిష్కరణ మార్గాలు

ఊహలకు హద్దు లేదు 
ఆలోచనకు పద్దు లేదు 
ఆచరణకు రద్దు లేదు 
నిష్క్రమణకు సద్దు లేదు 

కడలి విజ్రుంభించిట్లుగా
పర్వత ఊర్ద్వ లావా పొంగినట్లుగా 
దావాలనంగా కారుచిచ్చు రగిలనట్లుగా 
ఇంకా ఎక్కువగా కంప్యూటర్ విస్తరిస్తున్నదిగా 

మనిషి వికాసానికి తోడ్పడే అంశమిది
జాగారూకతో బ్రతకమని చెప్పుతున్నది
పోటీగ ప్రపంచ మంతా విస్తరించుతుంది
మనిషి మెదడు తో ఆడు  కుంటున్నది
 (ఇది అవసరమా )

మనం అనుభవిస్తున్న మహా మహా సౌఖ్యాలు 
మనం ఉపయోగిస్తున్న గొప్ప సాంకేతిక పరిజ్ఞానాలు
సాంకేతిక పరిజ్ఞానంతో పెరుగుతున్న వ్యాపారులు 
ప్రపంచ మంతా కావాలి అంటున్నారు కొత్త సౌఖ్యాలు 

పోటీ ఉంటేనే మనిష్యులో పట్టుదల పెరుగుతుంది 
పోటీ ఉంటేనే వ్యాపారంలో కొత్తదనం చోటు చేసుకుంటుంది 
అట్లాగే తపాల వ్యవస్థకు.. పోటీగా జి మైల్. వచ్చింది 
పలకపై దిద్దే పద్దతి పోయి .. లాబ్ టాబ్ లో దిద్దటం నేర్పుతుంది

వార్తలు పక్షులు ద్వారా, బంట్రోత్తు ద్వారా, కధలు ద్వారా
అందించేవారు తాళ పత్రముల ద్వారా, గాలిపటాల ద్వారా
 వార్తలు తెలిసేవి సెల్  ఫోన్ ద్వారా, సిడి లద్వారా డివిడి ద్వారా
పైవన్నీ అటకెక్కి కొత్తమార్గంలో 3G, 4G సెల్సు రావడం అవసరమా

చక్రంలోంచి యంత్ర శక్తి ప్రాణం పోస్తుంది
మంత్రం లోంచి మనిషికి బుద్ధి పెరుగుతుంది
తంత్రానికి మనిషి బానిసగా మారి బుద్ది చెడుతుంది
మనిషి బుద్ధి మారితే ప్రపంచమే విధ్వంస మౌతుంది
(ఆదునిక పరికరాలు మనకు అవసరమా )

అధిక దిగుబడి కోసం వంగడాలు వస్తాయని విన్నాను
 టెక్నికల్ బిజినెస్ స్కూల్ల్ వచ్చి కొత్త పాఠం చెపుతారని విన్నాను 
 మనిషికి ఉపాది కల్పించకుండా కంప్యూటర్ పాఠం చెప్పటం చూస్తున్నాను
మనిషి మెదస్సును  ఉపయోగించు కోవాలని హేచ్చరిస్తున్నాను   
  
ఎమీ లేని చోట ఆముద వృక్షమే మహావృక్షం
అన్ని ఉన్న చోట అది మాములు వృక్షం
ప్రజలు తక్కువ ఉన్న చోట అవసరం యంత్ర వృక్షం
మేధావులు ఎక్కువున్న చోట ఆ యంత్రమే విష వృక్షం
                                                                      
పారిశ్రామిక మొగ్గ తొడిగింది  
అది క్రమేపి విప్లవంగా మారింది 
అంతర్జాతీయంగా వ్యాపారం పెరిగింది
కంప్యూటర్ వచ్చి ఉద్యోగ వ్యవస్థకు దెబ్బ తగిలింది
(ఇద సమంజసం కాదా )

స్మార్టు ఫోన్ విజ్రుమ్భన హూహించ లేక పోయం 
సంకేతిక విప్లవం వళ్ళ ఆవహిస్తున్నది విరాట్ రూపం 
భౌతికమైన శ్రమ తగ్గినది, వెన్నుపోటు కల్పించే యంత్ర రూపం  
ఉప్పెనలా రాజ్యమేలుతున్నమనమీద  పర సంప్రదాయం  

 
ఆధునిక పారిశ్రామిక పద్దతికి కుటీరపరిశ్రమలు మూతపడక తప్పదు
             ప్రభుత్వ సంస్థలు పోటికి ఎదగలేక ఉద్యోలును తొలగిగిస్తున్నది 
సంస్థలు బండి నడిస్తే చాలు అనుకున్నా, వారి మనుగడ ప్రశ్నగా మారుతున్నది
ఎదగాలని తపన లేకపోతె ఎదుగే కాదు ఉనికే ఉండదు అది పతి ఒక్కరు గమనిమ్చాలి              
 
 నూట పాతికేళ్ళు గల కొడక్ కెమెరాలు పరిస్తితి ఎప్పుడు ఏమైనది
కార్పోరేట్  భవంతుల్లో కెరీర్ మరణాల రేటు మునుపటి  కంటే బాగా పెరిగింది
సినమారంగంలో గ్రూపులు ఏర్పడి కార్మీకులను నడి బజారులో పెడుతున్నది 
కాని డబ్బును చూసు కోకుండా సుఖప్రదేశంలో సుఖబడుదామని తాపత్రయం పెరుగు తున్నది
(దీనివల్ల) 

రువురి సంపాదన లేందే మనం బ్రతకలేం అనే దోరణకు రావటం జరుతున్నది 
చిన చేపను పెదచేప, పెదచేపను తిమింగలం తిన్నట్లు దోపిడీ వ్యవస్థ పెరుగుతున్నది 
నా కనవసరం 2లక్షలు పెట్టైనా పెద్ద స్కూల్లో చదివించాలి అనే తాపత్రయ పెరుగుతున్నది
దీనికి కారణం ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, భాషను ఆదరించక పోవడం

మట్టిని తీసె యంత్రాలు వచ్చాయి కూలీలు నడి బజారుకు వచ్చారు 
 పొలం దున్నే యంత్ర్రాలు వచ్చాయి రైతుకూలీలు వీధిన పడ్డారు 
కులవృత్తులు వదలి చదువు మీద పడ్డారు నిరుద్యోగులు పెరిగారు 
దొపిడీ దొంగలుగా దగాకోరులు రేపిష్టులుగామారుతున్నారు 
(ప్రభుత్వ అసమర్ధత వలన)

ధర్మ నీతి వెలుగుతో 

బ్రతుకు చీకటిలో మెరిసి
అంతులేని సంపదతో.. 


వెలుగులోకి వచ్చినప్పుడు, నలుగురికి సహకారం అందించినప్పు  డే 


నిజమైన మనిషి 


కోర్టులోకొన్ని వేల కేసులు పెండిగ్ ఉంచారు తీర్పు చెప్పే మేధావులు లేరా
విద్యా వ్యవస్తను కట్టడి చేసి ఉత్తమమైన విద్యనూ ఉచితముగా అందచలేదా 
ఆరోగ్యవ్యవస్థ చదవలంటే కార్పోరేటువారు కోటి కావాలంటున్నారు  
 దానికి కట్టడి లేదా 

ఎవ్వరు నిరుస్చాహ పడకండి టెక్నాలజీమనకు అందు బాటులోకి వచ్చింది 
ఇంటర్నెట్ ద్వారా మీ పరిజ్ఞానాన్ని పెంచుకుంటు తోటి కార్మికులకు సహకారం అందిస్తూ ముందుకు పోవాలి 
ఎన్ని వచ్చిన మనిషి ఆలోచనకు మించినది లేదు ప్రతిఒక్కరు మనుగడకు ప్రశ్నార్ధ కంగా మారకుండా నిరుద్యోగ వ్యవస్థను బతికించటానికి ప్రయత్నం చేయండి. మనలో ఉన్న మేధావిని గమనించండి వానిద్వార నలుగురు కలసి సహకరించుకొని భారత దేశ  ప్రగతి ప్రపంచ దేశాల్లో చాటటం తో పాటు మనకృషి మన ప్రజలు అందే విధముగా ప్రతిఒక్కరు సహకరిస్తే "ఆధునికమే నిత్యకళ్యాణం ఆనందదాయకమని భావించ గలుగుతాం " ఆధునికం ఎక్కడ నుండి పుట్టలేదు  మన, దేశ " తాతలు, అమ్మోమ్మలు, తండ్రులు, తల్లులు, ఒకరేమిటి పెద్దలందరి కృషి ఫలితమే మన ఎదుగుదలకు తార్కాణం 
కొత్తదనాన్ని ఆస్వాదించండి పాతలో ఉన్న గట్టితనం నాణ్యతను గమనించండి. 

ప్రమోదం తో పరిసీలించి అనుసరించు 
ప్రయతుడిగా మారి సహకారం అందించు
ప్రయత్నం లేనిదే స్వతంత్ర భావం రాదు
ప్రమత్తుడ్ని మార్చి ప్రయోక్త గా మారు    
image not displayed

    (మల్లీ ఇంకోసమస్యను పరిశీలించుదాం -  సహకారం అందించుకుంటూ జీవిద్దాం  )