29, నవంబర్ 2016, మంగళవారం

Internet Telugu magazine fo the month of 12/2016/45

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

సర్వేజనాసుఖినోభవంతు


1*ప్రేమ బంధం

కాలానికి కళ్లెం వేద్దాం
ప్రేమానికి గొళ్ళెం తీద్దాం
వసంత సమీరంలో విహరిద్దాం
హేమంత తుషారం ఆస్వాదిద్దాం

వలయములై చలించుదాం
విలయములై జ్వలించుదాం
చిగురించిన ఆకులవుదాం
వికసించిన పువ్వులవుదాం

జగతిని పరిశీలిద్దాం
ప్రకృతిని అనుకరించుదాం
భవిషత్తుకు పునాది వేద్దాం
ఒకరి కొకరం ఏకమవుదాం

నదిలా మనది అనురాగ బంధం
కడలికి సుమధుర సంభందం
నదిలా మన కలయిక ఆనందం
అంబర మొక్క అనుభందం

అను రాగపు అంచులు చూద్దాం
ఆనందం కొరకు లోతులు వెతుకుదాం
స్వర్గానికి నిచ్చెన వేద్దాం
ప్రణయానికి ప్రాణం పోద్దాం

మదిలో కోరికలు తీర్చుకుందాం
హృదయంలోని జ్వాలను చల్లబరుద్దాం  
జీవిత సమరంలో ఈదుదాం
కుటుంబాన్ని ధర్మమార్గాన్ని ఉంచుదాం

--((*))--

లీలావతీ - న/న/య/ర/ర/ర/గల IIII IIIU UUI - UUI UUI UUI
20 కృతి 599168
వెలుగుచు నిలబడేన్ నాదేవి  - ఆనంద మానంద మొచ్చేను
రసములు చిలికెనే రాగాల - రంజిల్లు రంగుల్ విరాజిల్లు
కుసుమముల మనసే నా సీత - నవ్వేను పల్కేను నమ్మెట్లు
రుస రుసలు లేనిదే నామల్లి -  సాహిత్య సంగీత లాస్యమ్ము     

--((*))--

*సత్య సూక్తి

ధనం ఖర్చు చేస్తే - శుభం ప్రతి ఇంట
ధనం దానం చేస్తే - నిత్య తృప్తి మయం
ధనం దాచి పెడ్తే - తస్కరుని పాలే
ధనం కోసం తృప్తి - ఉంటె మన: శాంతి

గుణం సర్వ వ్యాప్తం - అల్పబుద్ధికి అనుమానం
బుధ్ధి  వక్ర మార్గం  -  సర్వ కుటుంబ నాశనం
బుద్ధి సక్ర మార్గం -  సర్వం విశాల హృదయం
మన: శాంతి మార్గం - జగమంతా నా కుటుంబం
 
స్నేహ ద్రోహునికి - సర్వం దూరం
కృతఘ్నుని స్నేహానికి - సర్వం దూరం
విశ్వనాస ఘాతకునికి - సర్వం దూరం
సర్వం పిచ్చి కుక్కకి - దూరం దూరం

*15. గోపాల కృష్ణుడు 

  రారమ్మ రారయ్యా చూడాలి చిన్న గోప బాలుడు 
నిర్మల మైన వాడు, మన మువ్వ గో పాలుడు 
శ్రీ రమ్య మైన వ్రేపల్లెలో, కాంతులు పంచు వాడు
చేరి కొలుతుము, మనసు ప్రశాంత పరుచు వాడు

ఎప్పుడు పున్నమి, వెన్నెల, వెలుగు నందించే వాడు       
ఎప్పటి కప్పుడు, మదిలో ప్రశాంతత, కల్పించే వాడు 
తప్పులు చేసిన, మానవులను సరిదిద్ది కాపాడే వాడు
చెప్పుడు మాటలలో నిజము ఉండదని, చెప్పిన వాడు 

మరి మరీ, కని వినీ, ఎరగని కళ్ళతో ఆకర్షించే వాడు
మురిసే యశోదమ్మకు ముద్దుల అల్లరి పిల్ల వాడు 
కరితో ఆడుకొని పైకిఎక్కి, ఆనందం అనుభవించే వాడు 
సిరి కల్పించి, సంతోష  పంచిన చిన్మయ స్వ రూపుడు

అరుణో దయ, వెలుగు, అందరికి సమంగా పంచు వాడు 
కరుణ చూపి ప్రాదించుచున్న వారిని కాపాడిన వాడు 
వరములు కోరిన వారికి వెంటనే సహకరించిన వాడు 
పరుష వాక్కులకు 100 తప్పుల వరకు రక్షించిన వాడు    
--((*))--      

   
16 .* శ్రీకృష్ణ లీలలు

వినరమ్మా, చూడడండమ్మా, మన కృష్ణయ్య తీరు
పనిఁబూని మనం సేవించిన సిరులు కురిపించే తీరు
కన్నీరు తుడిచి మమకారం అందించే నవ్వుల తీరు
ఆన్న వారికి  సుఘంద పరిమళాలు అందించే తీరు

ఆల పాలకడలిలో ఊయల శేషశయ్యపై ఉన్న తీరు
కలలు సఫలీ కృతము చేసి శుభములందించే తీరు
పలుకులో ధర్మ మార్గమున ఉండి ఉండమన్న తీరు
అలుకలో కూడా ఆనందము ఉన్నదని చూపినతీరు

నీల మేఘ శ్యాముడైన కృష్ణ కళ్ళకు  కాటుక తీరు
వలదు వలదు అంటూ పింఛము పెట్టుకున్న తీరు
తలచుకున్న వెంటనే కృష్ణుఁడు ప్రత్యక్షమైన తీరు
పాలు త్రాగి యశోదకు నోటిలో లోకాలు చూపిన తీరు

పద్ధతులనుచూసి పక పక నవ్వి ఏడి పించిన తీరు
పడుకున్న వారి కొంగులు ముడివేసి  ఆడిన తీరు
తడబడుతూ నవ్వులు కురిపిస్తూ ఆదుకున్న తీరు
అడగకుండా తలచిన వెంటనే కోరిక తీర్చే తీరు   
         
 --((*))---
   * 17 శ్రీకృష్ణ లీలలు .

ఎనలేని సిరులను అందించు శ్రీకృష్ణ ప్రేమ
కనరాని కడు ఈతిభాదలను తొలగించే ప్రేమ
మునులు నిత్యమూ త్రివిక్రముని ఆరాదించే ప్రేమ
కనుల చూపులతో కలతలు తొలగించే కమ్మని ప్రేమ

నెల నెలా మూఢు వానలు కురిపించే ప్రేమ
కల కళలాడుతూ పైరును ఏపుగా పెంచే ప్రేమ
కలువల పూలతో పూజించే నిస్వార్ధ ప్రేమ
అలల తాకిడిలా సాగె జీవితంలో ఉండే ప్రేమ

కడిగి కూర్చుండి పొంకపు చన్నుల పాల ప్రేమ
ఒడిసి పట్టి పాలు త్రాగుతూ రక్కసిని చంపిన ప్రేమ
బండి రూపములో వచ్చిన రాక్షసుని చంపిన ప్రేమ
కడవలు ఆవుపాలను అందించి ఆరగించే ప్రేమ       
--((*))--


* 18 శ్రీకృష్ణ లీలలు .

నరులకు అకాలమున - దప్పికను  గనిరో 
కురియును సకాలమున - వర్షములు దయతో
పయనమున ఒంటరిగ - వేదనలు గొలుతున్
కలత తొలగించియును - హర్షమును దెలుపున్   

జలనిధిలో జొర బడిన సర్పమును సంహరించి
జలమును శుభ్రపరిచి త్రాగుటకు సహకరించి
తలలు మార్చే దుష్ట రాక్షసులను సంహరించి 
కలకాలం శ్రీకృష్ణ ప్రార్ధించిన వారిని కాపాడుచుండెన్

సుందర బాహువులతో పిల్లన గ్రోవిని ధరించి
పొందిన ఆనందము తో వేణుగానము చేసి
అందరిని ఆనందపారవశ్యములో ముంచి
వందనాలు స్వీకరించి మనస్సు ప్రశాంత పరిచే    
 --((*))---

19 . శ్రీ కృష్ణ లీలలు

చెప్పరే చెప్పరే శ్రీకృష్ణ నామమ్ములు
ఒప్పుల కుప్పగా ఉన్న ఓ వనితలారా 
తప్పక చూచును మన స్థితిగతులు
ఎప్పుడో చేసిన తప్పులను రక్షించును

కళ్యాణదీప్త మైన వాని కనికరములు
అల్లన మెల్లగా ధ్యానించి పొందు దామురా
తల్లి కడుపున చల్లగా వెలిగేటి వానిని
సల్లలిత సుమము లర్పించి వేడుకొందుమరా

హాయిగా యమునా నదిన విహరించువానిని
మాయను తొలగించే మధురాపురికి రేడైన వానిని
భయము వదలి పరమాత్మునిని ప్రార్ధించి
తీయని పువ్వులతో సేవించి ప్రార్ధించెదమురా                
 --((*))---
 
 20 శ్రీకృష్ణ లీలలు

తెలవారు తున్నది లేవే లేవవే
కల కల కూసే కోయిల పాటలు
అల కృష్ణని గుడి గంటలు మ్రోగెనే
పిలిచెనే సుప్రభాత సేవలకు

ఓలి విషపు చను బాలు త్రాగిన వానిని
లాలి పాడుతున్న మాయారక్కసి చంపిన వానిని
గాలిలో మాయా శకటములను కూల్చిన వానిని
నిల మేఘశ్యాముని దర్శించుదాము లేవవే

మేలుకొని ఋషులు,మునులు కొలిచేటి
మలుపు మాయానుండి మమ్ము రక్షించేటి
గెలుపు కోసం చేసిన ప్రార్థనలను చూసేటి
చలువ రాతిపై ఉన్న గోపాలా నీవే నాకు దిక్కు
--((*))--


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి