ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
సర్వే జనా సుఖినోభవంతు
దీపావళి ముచ్చట్లు(కథ)
హలో
సుబ్బారావుగారు ఈ రోజు దీపావళి పండుగ కదా ఏమేమి కొంటున్నారు టపాసులు, మీ
అల్లుళ్ళు కూతుర్లు వచ్చారా అని అడుగు తుంటే ఏమి మాట్లాడరు ఎందుకు అని
అడిగాడు స్నేహితుడు రాయారావుగారు.
అందరూ రమ్మన్నారు ఎవరిదగ్గరకు పోకుండా మే మిద్దరమే ఉన్నాము, రమ్మంటే కుదర దన్నారు మరి తప్పదుగా రామారావు.
నిజమే
సుబ్బారావు మా అమ్మాయిని రమ్మన్నాను, ముందు మా ఆయనకు కారు కొంటే పండుగకు
వస్తానంది, ఇప్పుడు ఏంచేయాలో తోచక నీ దగ్గరకు వచ్చాను, కారుకొనే శక్తి
నాకులేదు, మరి ఇప్పుడేం చేయాలో అర్ధం కావటము లేదు.
నేను
ఒకటే చెపుతాను పిల్లల పుట్టుటకు తల్లితండ్రులు కారణం మవుతూరు, వారి
బుద్దులకు మాత్రము కారకులుకారు. పిల్లలకు పెళ్లి చేసి పంపటమే మనచేతుల్లో
ఉన్నది.
అదే
కూతురికి పెళ్లి చేసినప్పుడు అల్లుడే నీసొంతము అని చెపుతావు, అత్తమామలకు
సేవలు చేయాలని చెపుతావు, అప్పటికే తన సొత్తు ఇదని, తన కుటుంబమని
అవగాహనకొస్తుంది కూతురు, పిల్లలు పుట్టారనుకో వారి చదువులు, ఆలనా పాలనా
కోసం ఒక సముద్రాన్ని ఈదుతూ తన కుటుంబాన్ని వడ్డున వేయుటకు విశ్వ ప్రయత్నం
చేస్తుంది.
కొడుకనుకో
ఇంట్లో నే ఉండి కోడలు చేసే సపర్యలు నచ్చినా నచ్చక పోయినా నోరు మూసుకొని
కాలం గడపటం తప్ప ఏమి చేయలేవు, మనవళ్లను స్కూలు దాకా దింపండి మావఁగారంటే
నోరుమూసుకుని దింపే విధముగా మారి పోతాము.
అవును మరిచా నీకెంత మంది పిల్లలు ముగ్గురు అందరికి పెళ్లిళ్లు చేసాను,
సరే దీపావళి టపాస్సులు కొన్నావా, కొనలేదు ఈ రోజు గుడికి వెళ్లాలనుంది, నీవు కూడా వస్తావా
పోదాం పదా, అక్కడ అక్కడ దీపావళికి సంభందించిన మన పాతకధలు చెపుతారు, మన మనవళ్లకు చెప్పుకోవటానికి వీలు ఉంటుంది.
అవునూ అదీ నిజమే కాస్త కాలక్షేపముగా కూడా ఉంటుంది.
అక్కడే రామకృష్ణ పంతులుగారు దీపావళి గురించి చెపుతున్నారు ఈ విధముగా
దీపావళి పర్వదినం (పండుగ) విశేషాలు.
హిందువుల (భారతీయుల) పండుగులలో ముఖ్యమైనది దీపావళి పండుగ. వయోభేదం లేకుండా, కులమతాలకతీతంగా యావత్భారతదేశం అంతా ఐకమత్యంగా జరుపుకునే ఏకైక పండుగ ఈ దీపావళి పండుగ.
నరకాసురుడు అనే రాక్షసుని సంహారంతో, ప్రజలు ఈతిబాధల నుండి విముక్తి పొందటంవల్ల, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండుగే ఈ దీపావళి పండుగ. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి రావటంతో, సీతమ్మ ఒక దీపాన్ని వెలిగించటంతో, ఆ రాజ్యంలోని ప్రతీ ఇంటిలోనూ దీపాలు వెలిగించి అందరు ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ చేసుకున్నారు అని ఒక కథనం. జగతిలోని చీకటిని పారద్రోలి, దీపాలతో అంతటా వెలుగును నింపే పండుగ కనుక ఈ పండుగను దీపావళి పండుగ అని అంటారు. ఈ పండుగను ప్రతీ సంవత్సరము ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకుంటారు. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.దీనినే నరక చతుర్థశి అంటారు.
దీప + ఆవళి = దీపాల సమూహం అని అర్థం.
ఈ దీపాలని పెట్టడంలో రెండు అర్థాలు దాగి ఉన్నాయి. చీకటితో నిండి ఉండేది నరకం కాబట్టి, చీకటి నిండియున్న ఈ అమావాస్యలో పితృదేవతలందరికీ త్రోవని చూపించేందుకు దీపాలని పెడతారు అని ఒక విశేషం. ఇక రెండోది -- లక్ష్మీదేవికి దీపాలంటే చాలా ప్రీతి. ఇంటినిండుగా దీపాలున్న గృహమంటే ఆమెకు ఎంతో ఇష్టం.
పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతోషపడి, ఒక విలువైన హారాన్ని ప్రసాదించాడు.ఇంద్రుడు దానిని అహంభావముతో తన దగ్గర ఉన్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కినుజ్జు నుజ్జు చేసింది. అది చూసిన దుర్వాసమహర్షి ఆగ్రహముతో దేవేంద్రుని శపిస్తాడు. శాప ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని ఏం చెయ్యాలో పాలుపోక మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. విషయం గ్రహించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సలహా ఇస్తాడు.ఇంద్రుడు విష్ణువు చెప్పినట్లే చేయగా, లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. నిన్ను ఏ విధంగా పూజిస్తే నీ కృపకు పాత్రులమవుతాము?? అంతట మహాలక్ష్మి " త్రిలోకాథిపతీ.!. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి కోర్కెలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, సంతానాన్ని కోరే వారికి సంతానలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలునిఅవుతాను" అని సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ముఖ్యముగా దీపావళికి టపాసులు కాల్చేటప్పుడు నూలువస్త్రములు, కాళ్లకు చెప్పులు, దగ్గరలో నీరు నింపిన కుండలు ఏర్పాటు చేసుకోవాలి, ఏదన్న టపాసు పేలలేదనుకోండి దానిని వదిలెయ్యాలి, అంతేకాని తగ్గరికి పోయి చూడటం కదిలించటం చేయటం ప్రమాదం అలాచేయకండి. చేతులతో బాంబులు కాల్చకండి, పూర్వము చాటలతో శబ్దాలు చేసేవారు, దివిటీలు తిప్పేవారు, మతాబులు చిచ్చుబుడ్లు, తారా జువ్వలు ఇంట్లో తయారు చేసేవారు, వారు కుడా ఊరు చివర వెళ్లి కాల్చేవారు.
ఆధునిక పద్ధతులు వచ్చాయి, టపాసులలో కూడా కొత్తవి తయారు చేస్తున్నారు .
నూనె దీపాలు వెలిగించండి. లక్ష్మీ దేవిని కొలవండి అందరూ కలసి ఆనందంగా తీపి పదార్థాలు పంచుకొని ఆనందంగా దీపావళి జరుపుకోండి అంటూ ముగించారు.
అక్కడ ప్రసాదంగా పెట్టిన పులిహార తిని బయటకు నడిచారు రామారావుగారు, సుబ్బారావుగారు.
సరే ఇంత దూరము వచ్చాముకదా అలా ప్రభుత్వము వారు ఏర్పాటుచేసిన స్టాల్సులో టపాసులు కొందాము.
సరే నీమాటను కాదన్నాను ఎప్పుడైనా,
మరే దీపావళి ముచ్చట్లు బాగా జరిగాయి, ఇలా కలుసుకుంటూ ఒకరి ముచ్చట్లు ఒకరు చెప్పుకుంటే మనసు తేలిక పడుతుంది కాదా
అవునూ అక్షరాలా నిజం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి